• Prev
  • Next
  • Prema Pandem part 34

    ఆమె చెప్పినవాడు వెనకాల కుర్చుని ఉన్నాడు దుబ్బు జుట్టుతో, నీలం రంగు గళ్ళ చొక్కాతో. వీళ్ళిద్దరి వంకే చూస్తున్నాడు రాంబాబు చూడగానే చూపులు ప్రక్కకి తిప్పేసుకున్నాడు. “చూశారు కదా! వాడే... నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అవుతున్నాడు నాకు భయం వేసింది.. మీ ప్రక్కన కుర్చుని పరిచయం వున్నవారిలా మాట్లాడుతుంటే వాడు వెళ్ళిపోతాడని...” చెప్పిందామె. “అవును... అవును...” అన్నాడు రాంబాబు ఏమనాలో తెలీక్. కొన్ని క్షణాలు మౌనం నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అంది. “ఏమైనా మాట్లాడండి” “ఏం మాట్లాడను... నాకేం తోచడం లేదు” అన్నాడు రాంబాబు. “ఏదో ఒకటి మాట్లాడాలి పోనీ ఒకరిని ఒకరం పరిచయం చేసుకుందాం. నా ఎప్రు సరోజ మీ పేరు?” “రాంబాబు” “నేను డిగ్రీ పాసై ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను మీరు?” “నేను డిగ్రీ పాసై ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్నాను” సరోజ నవ్వింది. “నేనేలా మాట్లాడితే అలా మాట్లాడాలా?” సిగ్గుపడ్డాడు రాంబాబు. “ఇంతకీ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు?”

     

    “చౌదరీ అండ్ బ్రదర్స్...! ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేస్తారు” చెప్పాడు రాంబాబు. బస్సు స్టాపులో ఆగిందిసరోజ వెనక్కి తిరిగి చూసింది. డుబ్బు జుట్టువాడు బస్సు దిగిపోవడం కనిపించిన్దామెకు. “వద్దు బస్సు దిగి వెళ్ళిపోయాడు” చెప్పింది సరోజ. “హమ్మయ్య” అన్నాడు రాంబాబు వెనక్కి తిరిగి చూస్తూ. వాడేదో తన వెనకాలే పడినట్టు. బస్సు మళ్ళీ ముందుకు పరుగుదీసింది కిటికీలోంచి చూసిఅన సరోజకు కింద నిలబడి కనిపించాడు వాడు. ఆమెను చూడగానే పోల్లికిలిస్తూ టాటా చెప్పాడు. “వెధవ! పనికిమాలిన వెధవ” కసిగా తిట్టుకుందామే. “అలా టాటా చెప్పినందుకు వాడి చెయ్యి విరిచేయ్యాలి కదండీ?” అన్నాడు రాంబాబు సీరియస్ గా అతను తన కోపాన్ని ఎక్స్ ప్రెస్ చేసిన పద్దతి చూస్తె ఆమెకు నవ్వొచ్చింది. “భలేవారే! ఇందాక నా వెనక ఫాలో అయ్యాడుగా... కాళ్లు కూడా విడగ్గోట్టేయాల్సిండీ...” మళ్ళీ నవ్వింది. “

    ఈమె నవ్వుతుంటే ఎంత అందంగా వుందో?! మనసుకు హాయిగా అనిపిస్తుంది” అనుకున్నాడు రాంబాబు. “మీ ఇంట్లో ఎంతమంది వుంటారు?” అడిగింది సరోజ. “నేను ఒక్కడినే వుంటున్నాను ఇక్కడ మా అమ్మా నాన్న భీమవరంలో ఉంటారు... ఉద్యోగ రీత్యా నేనిక్కడికి వచ్చాను... మరి మీ ఇంట్లో?” “నేనూ, మా నాన్నగారూ. అంతే.... ఇంకా పనివాదోఒ, తోటమాలీ, వంటమనిశియా కూడా ఉంటారు” చెప్పింది ఆమె. ఇద్దరి కోసం ముగ్గురు పనివాళ్ళు...! అంతే డబ్బున్నవాళ్ళేనన్న మాట! అనుకున్నాడు రాంబాబు. “టిక్కెట్ ప్లీజ్!” కండక్టర్ దగ్గర కొచ్చి అడిగాడు. “మీరు ఎక్కడికి వెళ్ళాలి?” జేబులోంచి డబ్బు తీస్తూ అడిగాడు రాంబాబు” నేను వచ్చే స్టాపులో దిగిపోతాను అక్కడి నుండి ఆటోలో వెళ్ళిపోతాను. వాడిని తప్పించుకోవడం కోసం ఎదురుగా కనిపించిన బస్సు ఎక్కేశాను” అంది ఆమె.

  • Prev
  • Next