• Prev
  • Next
  • మై డియర్ రోమియో - 52

    Listen Audio File :

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 52

    స్వప్న కంఠంనేని


    బస్ చివరి సీట్లో కూర్చున్న ఆమ్మాయి లేచింది.


    విక్రమ్ నీ చూస్తూ "డాడీ! నుమ్మిక్కడున్నావా? ఎందుకు డాడీ నన్నొదిలిపెట్టి వేల్లిపోయావ్?'' అంటూ అతని దగ్గరికి రాసాగింది.
    "వామ్మో! ఈ పిల్ల ఇక్కడుందా ? ఒరేయ్ పరిగెత్తండ్రా!'' అరిచి బస్ లోంచి దూకేసి వెళ్ళి జీప్ లో కూర్చున్నాడు. జీప్ స్టార్ట్ అయి రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సంఘటనలన్నీ ఫాస్ట్ ఫార్వార్డ్ చేసినంత స్పీడ్ గా జరిగాయి.
    బస్ లో ప్రయాణీకులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
    అప్పుడు వైభవ్, హనితల సీట్లో కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళి తమ సీట్లో కూర్చున్నారు. వైభవ్, హనిత సీట్ కింద నుంచి లేచి బయటకొచ్చారు.
    "వళ్ళంతా పట్టేసింది ఎక్కడికక్కడ'' మొత్తుకుంది హనిత.
    "మరి పారిపోవడమంటే మాటలనుకున్నావా?'' పక్క సీట్ లో అతను మందలిస్తున్నట్టుగా అన్నాడు.
    వైభవ్ అతనితో "థాంక్సండీ మీరే ఇవాళ మమ్మల్ని రక్షించారు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా?''
    "వీర వెంటక నాగాసత్య శివసాయి వరప్రసాద్'' చెప్పాడతను.
    "మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు అడగలేదండీ మేము'' అమాయకంగా అంది హనిత.
    "అది నా ఒక్కడి పేరే' చిద్విలాసంగా చెప్పాడతను.
    "అయితే మేము మిమ్మల్ని ప్రసాద్ అని పిలవొచ్చా?'' అడిగింది హనిత.
    "పిలవకూడదు. మొత్తం పేరు పెట్టి పిలవాల్సిందే. అది మా పేరెంట్స్ పెట్టిన పేరు. కుదిస్తే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టవుతుంది'' ఖచ్చితంగా చెప్పాడతను.
    "నాకంత పేరు గుర్తుండదే. అంత మెమరీ పవర్ నాకుంటే క్లాస్ ఫస్టే వచ్చేదాన్ని. మరి ఎలా?'' మొహం ప్రశ్నార్థకంగా పెట్టింది.
    "ఆల్ రైట్. కావాలంటే వెంకట సత్య వరప్రసాద్ అని పిలవండి. అయినా నీకు నా పేరు పెట్టి పిలవాల్సినంత అవసరం ఏముంటుంది?'' తీక్షణంగా అడిగాడతను.
    "ఊరకే' ' ఏం మాట్లాడాలో తెలీక నీళ్ళు నమిలింది హనిత.
    "మీరిద్దరూ పారిపోయి వచ్చారు కదూ?'' అడిగాడు ప్రసాద్ వైభవ్ ని.
    "మీకెలా తెలుసు?'' అడిగాడు వైభవ్.
    అతని పక్కన కూర్చున్న అమ్మాయిని చూసి సడెన్ గా హనిత బుర్రలో ఫ్లాష్ వెలిగింది.
    "మీరు కూడా మాలాగే పారిపోయి వచ్చారా?'' సంతోషంగా అడిగింది హనిత వైభవ్ కాలిమీద గట్టిగా తొక్కి వారిస్తున్నా వినకుండా.
    "తోబా! తోబా'' ఆమె మా చుట్టాలమ్మాయి'' చెప్పాడు ప్రసాద్.
    అతని ప్రక్కనమ్మాయి అతన్ని మోచేత్తో పొడిచి చెప్పింది.
    "అతను నా వుడ్ బి. కానీ అతను చెప్పడు. తెగ సిగ్గుపడిపోతాడు. మేమిద్దరమూ వాళ్ళింటికె వెళ్తున్నాము''
    తర్వాత కోపంగా అతన్ని అడిగింది "కనీసం మన పెళ్ళయ్యాకయినా చెప్తారా?''
    వైభవ్, హనిత వచ్చి తమ సీట్ లో కూర్చున్నారు.
    కాసేపయ్యాక ప్రసాద్ అడిగాడు.
    "ఏం చేస్తుంటారు?''
    "బిఎస్సీ చదువుతున్నాము'' చెప్పాడు వైభవ్.
    "బిఎస్సీ చదువుతున్నారా? ఇంకా చదువే పూర్తికాలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఎలా చేసుకుంటారు? పెళ్ళి చేసుకోవాలంటే ముందు ఇండివిడ్యుయాలిటీ వుండాలి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వుంటే వస్తుంది. ఇవన్నీ వుండాలంటే మీకు జాబ్ ఉండాలి. చదువే పూర్తి కాకపొతే జాబ్ ఎలా వస్తుంది?'' అడిగాడతను.
    వైభవ్ దోషిలా తల వంచుకున్నాడు.
    "అనవసరంగా ఈ బస్ ఎక్కామేమో'' నెమ్మదిగా వైభవ్ చెవిలో అంది హనిత.
    "మరదే. ఈయన ఎక్కుతాడని మనకేం తెలుసు?'' బాధగా అన్నాడు వైభవ్.
    "పాపం మనం'' మరింత బాధగా అంది హనిత.
    బస్ డిచ్ పల్లి దాటి ధర్మారంలోకి ప్రవేశించింది.
    ఇంతలో డ్రైవర్ తను డ్రైవ్ చేయాలనే విషయాన్ని మర్చిపోయి నిద్రలోకి జారుకున్నాడు. బస్ శబ్దాలు చేస్తూ రోడ్డుపక్క నుంచి పొలాల్లోకి ప్రవేశించి అక్కడొక చ్ట్టుకు గుద్దుకుని ఆగిపోయింది.
    ప్రయాణీకులంతా గోలగోలగా కిందకి దిగారు.

  • Prev
  • Next