TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Listen Audio File :
మై డియర్ రోమియో - 57
స్వప్న కంఠంనేని
వరుసగా నాలుగు గదులున్న పూరిల్లు అది. ఇంటి ముందు పడక కుర్చీలో ఒకాయన కూర్చుని వున్నాడు. క్లింట్ ఈస్ట్ వుడ్ కి తెలుగువేషం వేస్తే ఎలా ఉంటాడో అలా వున్నాడయన.
ఆయన సుబ్బమ్మకి భర్త అని కాసేపట్లో హనిత,వైభవ్ లకు అర్ధమైంది.
" వీళ్ళెవరు? " అడిగాడయన.
" వీళ్ళని ఇప్పుడే నేను మన ఊరి వాళ్ళ బారి నుంచి రక్షించి తీసుకొచ్చాను."
చెప్పిందావిడ.
" ఎవరికోసమో మన ఊరివాళ్ల తగాదా పెట్టుకుంటావా? "
" తమ్ముడు మన వాడైనా ధర్మం చెప్పడమే ఈ సుబ్బమ్మకి అలవాటు " మొండిగా చెప్పింది ఆ ముసలావిడ.
"ఊరివాళ్ళు మాత్రం పెద్ద తప్పేం చేసారు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసారు అందులో తప్పేంటో? అయినా వీళ్ళద్దరు ఈ ఊరెందుకు వచ్చారో కనుక్కో" అన్నాడు విసుగ్గా....
" అవునూ" పెళ్లి కూడా అయినట్లు లేదు. మీరిద్దరూ కలిసి ఈ ఊరెందుకు వచ్చారు." అడిగిందావిడా అనుమానంగా...
హనిత చెప్పబోతుండగా మళ్ళీ ఆవిడ భర్త కల్పించుకున్నాడు.
"
వాళ్ళ పెళ్లి సంగతి నీకెందుకు? వాళ్ళు నీ పెళ్లి సంగతి అడిగారా? "
" మీరేగా అడగమన్నారు."
" అంటే నేనేం అడగమంటే అది అడుగుతావా ? నేను గడ్డి తినమంటే తింటావా ?"
" ఏంటసలు ఇందాకట్నుంచి చూస్తున్నాను కొత్త వాళ్ళముందు కూడా ఏవిటి తగాదాలు?" అరిచిందావిడా...
అప్పుడు గానీ ఊరుకోలేదాయన.
హనిత. వైభవ్ లకి ఒక రూమ్ చూపించి అన్ని సదుపాయాలు కల్పించింది.
ఈ ఊరు మాత్రం భలే తమాషాగా ఉంది అంది హనిత...
రాత్రి తొమ్మిది అయింది.
ఆ రోజు హనిత తొందరగా నిద్రపోతుంది.
వైభవ్, హనిత పడుకున్న నులక మంచం పక్కనే స్టూల్ మీద కూర్చుని ఆమెనే తదేకంగా చూస్తున్నాడు.
బయట అలికిడి వినిపించింది
కిటికీ తలుపుకు
ఉన్న కన్నంలోంచి బయటకు చూసాడు..
విక్రం అతని గ్యాంగ్ ఎంక్యయిరీ చేయడం కనిపించింది.
హనితని నిద్రలేపాడు వైభవ్.
" ఏం.. వైభవ్" అడిగింది...
" పారిపోవడానికి వేరే దారి కూడా లేదు... ఎలా...? ఆందోళనగా అంది హనిత.
వైభవ్ చుట్టూ చూశాడు. వెనుకవైపు ఒక చిన్న కిటికీ కనిపించింది.ఆ కిటికీ ఉన్న ఊచల్ని లాగాడు... మట్టి గోడలతో కట్టిన ఇల్లు కావడంతో కిటికీ మొత్తం ఊడొచ్చింది.
కిటికీ కన్నం లోంచి బయటకు వస్తున్న హనితకు విక్రమ్ వాళ్ళు తామున్న రూమ్ వైపే రావడం కనిపించింది...
హనిత ముందు దూకేసి తొందరపెట్టింది. వైభవ్ కిటికిలో పట్టలేదు.
హనిత హడావుడికి మొత్తం బలం అంతా ఉపయోగించి కిటికిలోంచి దూకబోయాడు..
గోడ మొత్తం ఊడి వైభవ్ కొండపడ్డాడు...
సరిగ్గా అప్పుడే విక్రమ్ అండ్ గ్యాంగ్ తలుపు తెరచి లోపలకు రాబోయారు..
గోడ ఊడడంతో పైకప్పు మొత్తం కిందపడి విక్రమ్ వాళ్ళు వాటి కిందపడి గిలగిలా కొట్టుకోసాగారు...
ఈలోగా హనిత, వైభవ్ లేచి చెట్లు చేమల వెంటబడి పరుగెత్తసాగారు...