• Prev
  • Next
  • మై డియర్ రోమియో - 58

    Listen Audio File :

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 58

    స్వప్న కంఠంనేని

     

    కొంత దురం అలా పరిగెత్తాక రోడ్ మధ్యకు వచ్చారు.
    దూరంగా ఒక బస్ వస్తూ కనిపించింది..దారికడ్డంగా నిలబడి చేతులుపుతూ బస్ ఆపారు.అందులో ఎక్కి కూర్చున్నారు..

    " ఇప్పుడెక్కడికి ?" హనిత ఇప్పుడెక్కడికి అని అడిగింది. ఆమెకిది చాలా థ్రిల్లింగ్ గాను... అడ్వంచరస్ గాను ఉంది.

    " నిజామాబాద్ బస్స్టాప్ దగ్గరలో మా గీతక్క వాళ్ళుంటారు. అక్కడికి వెళదాము " చెప్పాడు వైభవ్.

    " ఆయామ్ రెడీ " అంది హనిత.

    బస్ ఎప్పటిలాగా బస్స్టాప్ ని గుద్దుకుని బస్ ఆగిపోయింది. అట్లాతప్ప ఆర్టిసి డ్రైవర్లకు  బసుల్ని ఆపడం చేతకాదు..

    " బ్రతికాం రా దేవుడా అనుకుంటూ హనిత, వైభవ్ లు బస్ దిగారు. అక్కడొక సన్మానం జరుగుతుంది.

    " హనిత కెవ్వుమంది.
    " అదిగో! అతను చూడు మనకి ఆక్సిడెంట్ చేసిన డ్రైవర్! అతనికే సన్మానం చేస్తున్నారు"
    " హనిత, వైభవ్ లు వెళ్లి సన్మానాన్ని తిలకించారు.
    డ్రైవర్ మొహం ఎందుకో చిరాగ్గా ఉంది.

    ఎర్ర శాలువా కప్పి పూలదండలతో సత్కరిస్తున్నరతనిని ఆర్టిసీ వాళ్ళు.

    మహాజనులారా..! సత్కరాం చేస్తున్న వ్యక్తీ ప్రసంగిస్తున్నాడు.. 
    " మనం ఈ డ్రైవర్ వెంకట రాముణ్ణి సత్కరించడం నాకెంతో సంతోషంగా ఉంది.
     ఈ రోజు మనమందరం గర్వించదగ్గ రోజు. ఎందుకంటే మన వెంకట రాముడు నేటికి చేసిన ఈ ఆక్సిడెంటు మూడువందల ఇరవై అయిదవది చాలా యాక్టివ్ డ్రైవర్"

    అతనలా మాట్లాడుతుండగానే వెంకటరాముడనబడే ఆ డ్రైవరు " ఆగండహే " అంటూ అతని చేతిలోంచి మైకు లాక్కుని మాట్లాడాసాగాడు....

    " నీయవ్వ... నాకీ సన్మానం వద్దురా అంటే ఇంటలేదు. నాకైతే ఇయాళా సన్మానం ఇష్టమే లేదు.. అసలు నేనేం సాధించిన్నని నాకీ  మర్యాద  చేస్తుండ్రు. అర్రె! మూడు వందల ఇరవై అయిదు యాక్సిడెంట్లకే సన్మానం చేస్తే ఆర్టీసి కదర్ ఏమవ్వాలి ? ధూ!  ఇజ్జత్ పోతుంది. మొత్తం అయిదు వందలయినాకా చేయండిరా అంటే ఇనకపాయే."
    హనిత, వైభవ్ లు మొహాలు చూసుకున్నాను.
    వైభవ్ తల  బాదుకున్నాడు.
    వెనక్కు తిరిగి చేతులు పట్టుకుని నడవసాగారు.
    గీత ఇంటికి వెళ్లారు.
    వైభవ్ తలుపు తట్టాడు.
    ఒకావిడ తలుపు తీసింది.
    " వైభవ్! నువ్వుంట్రా?" ఆశ్చర్యంగా అందావిడ.
    హనితని కూడా నవ్వుతూ పలకరించిందావిడ.
    " మా  గీతక్క "
    " అక్కా ! ఈమె హనితల కథ విన్న ఆవిడ భర్త రేవంత్ వాళ్ళకు కొన్నాళ్ళపాటు షెల్టర్ ఇచ్చి తామే దగ్గరుండి పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు. వైభవ్, హనితలకి రోజులు ఆనందంగా గడుస్తున్నాయి.

                                              * * * * *


    హనిత వున్నటుండి మీనాతో  మాట్లాడాలనిపించింది.
    వైభవ్ చెప్పింది.
    ఇద్దరు కలిసి ఫోన్ చేయడానికి బయలుదేరారు.
    లోకల్,ఎస్టిడి.ఐఎస్ డీ ఏ నెంబర్ కలవపోవడమే నిజామాబాద్ ఫోన్ల ప్రత్యేకత.
    దాదాపు గంటసేపు ట్రై చేసాక నంబర్ కలిసింది.
    హనిత సంబరపడిపోయింది మీనా గొంతు వినగానే...
    మీనా కూడా సంతోషించింది. కానీ ఆమె స్వరంలో ఆందోళన ధ్వనిస్తుంది.
    " ఎలా వున్నారు మీరు? బాగున్నారా?" అడిగిందామె.

    " మేము బాగానే వున్నాము. అక్కడ పరిస్థితులు ఏమన్నా బాగుపడ్డాయా ?" అడిగింది హనిత.
    " ఇంకా అధ్వానంగా తయ్యరయ్యాయి మీరు మాత్రం ఎప్పుడు ఇక్కడికి రావద్దు. మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ రోజూ ఎక్కడికి వచ్చి మీరెక్కడున్నారో చెప్పమని నా ప్రాణం తీస్తున్నారు" అంది మీనా.
    " నా మూలంగా నువ్వు కష్టపడుతున్నావ్ కాదు" అంది బాధగా హనిత..

    " నో..నో... డియర్! ఏమంటున్నాడు మా ఆయన" అడిగింది మీనా.

    "మీ ఆయన ఎవరే ? " అయోమయంగా అంది హనిత.
    " అదేనే..నీ రోమియో వైభవ్ " చెప్పిందామె...

    హనిత తల పక్కకి తిప్పి వైభవ్ మొహంలోకి చూసి పగలబడి నవ్వసాగింది. మీనతో నవ్వుతూనే అంది.

    " ఏమైనా అను కాని ఆ మాట మాత్రం అనకు చంపేస్తాను నిన్ను. ఫ్రెండ్ అన్న జాలి కూడా చూపించాను.
    " హనీ చెప్పడం మర్చిపోయాను విక్రం వాళ్ళ ద్వారా మీ వాళ్ళకి వైభవ్  వాళ్ళ పెద్దవాళ్ళకి మీరు నిజామాబాద్ లో ఉన్న విషయం తెలిసిపోయింది.ఏ క్షణమైనా వాళ్ళంతా అక్కడికి చేరుకోవచ్చు. జాగ్రత్తగా వుండండి. ఒకసారి ఫోన్ వైభవ్ కి ఇస్తావా? " అంది మీనా.
    ఫోన్ వైభవ్ అందుకున్నాడు.
    " ఏమండోయ్ శ్రీవారూ! నన్నొదిలి మీరట్లా వేరే పిల్లతో లేచిపోతే ఎట్లా ? మీనా మాటలు వినిపించాయి..
    ఉడుక్కుంటూ ఫోన్ పెట్టసాడు వైభవ్.
    హనిత,వైభవ్తో మీనా చెప్పిన విషయాన్నీ చెప్పింది.
    " మైగాడ్! ఎలాగైనా మా వాళ్ళు వస్తే గీతక్క వాళ్ళింట్లోనే దిగుతారు. మనం ఇటునుంచి ఇటే ఎటైనా వెళ్ళిపోదాము" అన్నాడతను.

    ఫోన్ బూత్ బయటకు వచ్చి నడవసాగారు హనిత, వైభవ్.
    అప్పటివరకు ఫోన్ బూత్ ని అనుకుని వీళ్ళనే గమనిస్తున్నాడు ధనుంజయ.....
     

  • Prev
  • Next