TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
Listen Audio File :
మై డియర్ రోమియో - 61
స్వప్న కంఠంనేని
" భవానీఫేట్! దిగే వాళ్ళు బస్సు దిగండి." కండక్టర్ అరిచాడు.హనిత వైభవ అక్కడే దిగదల్చుకున్నారు.
" పెల్లెటూళ్ళు ఇంత బ్యూటీ ఫుల్ గా ఉంటాయనుకోలేదు. " అంది హనిత బస్ దిగుతూనే ఉద్వేగంగా అంది హనిత వైభవ్ తో.
చిరునవ్వు నవ్వాడు వైభవ్.
" నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ , హాయిగా ఉండాలి. విభూ" అంది. హనిత అతని మీద మరీ ముద్దోచ్చినప్పుడలా పిలుస్తుందామే.
హనిత నడుం చుట్టూ చేయివేసాడు వైభవ్.
అతని భుజం మీద తల ఆనించింది హనిత.
" లవ్ యూ సో మచ్ ఇడ్లీ ! అంది హనిత.
సడన్ గా ఆమెకతన్ని కవ్వించాలనిపించింది.
" అదుగో! ఇడ్లీ అని మాత్రం అనోద్దన్నానా?" కోపంగా అన్నాడు వైభవ్.
అలా పోట్లాడుకుంటూ,నవ్వుకుంటూ ఊళ్ళో కి ప్రవేశించారు వాళ్ళు.
ఆడవాళ్ళంతా ఇళ్ళముందు గుంపులు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకుంటూ వామన గుంటలు,అష్టచమ్మా ఆడుకుంటూ కనిపించారు.
పొద్దున్నే లేచి పనులు పూర్తి చేసుకుని భర్తలు పొలాలకు వెళ్లిపోయాకా అలా కాలక్షేపం చేయడం వాళ్ళకి అలవాటు.
" హనిత వైభవ్ వెళ్లి ఒక ఇంటి ముందు ఆగారు.
అక్కడ జోరుగా అష్టచమ్మా సాగుతుంది.
ఆంటీ! ఆంటీ వాళ్ళలోఒకరిని పిలిచింది హనిత
ఏకాగ్రతతో అడుతుతున్న వాళ్ళకు హనిత పిలుపు వినిపించలేదు.
" కార్పోవ్,కాస్పరోవ్ కుడా అంత దీక్షగా చెస్ ఆడరు. " వైభవ్ తో అంది హనిత.
" ఆంటీ ఈ సారి వైభవ్ పిలిచాడు.
వైభవ్ గొంతు వినగానే వాళ్ళలో కలకలం వినిపించిది. హాహాకారాలు చేస్తూ బిల బిల అటు ఇటు పరుగెత్తారు.కొంగు తల చుట్టూ ముసుగులా కప్పుకుని గోడల చాటున ఇళ్ళ
స్తంబాల చాటున నక్కి నక్కి చూడసాగారు.
వైభవ్ కూడా బెదురుకున్నాడు. వాళ్ళల ఎందుకు దాక్కుంటూన్నారో అర్ధం కాలేదు . హనిత కి అక్కడి పరిస్థితి అర్ధమైంది.
మగవాళ్ళకి ఎదురు పడడానికి ఇష్టపడని సాదారణమైన పల్లెటూరి స్త్రీలు వాళ్ళు. తనే ఇప్పుడు వాళ్ళకి సర్ది చెప్పాలి. ఎదురుగా స్తంబం చాటున నక్కిన ఆవిడ దగ్గరకెళ్ళి
అంది.
" ఆంటీ! నా పేరు హనిత, ఇతను వైభవ్. మీ వయసెంత? " నెమ్మదిగా చెప్పిందావిడ..
"ముప్పైతొమ్మిది "
" చూసారా మరి మా వైభవ్ కి ఇంకా ఇరవైయేల్లె! మీ కంటే చాలా చిన్నవాడు ఇడ్లీలు తిని అలా లావయ్యాడు. మీకేం భయం లేదు మీరు ఇవతలకి రండి"
బెరుగ్గా చూస్తూ బయటకొచ్చిందావిడా.
"ఈ ఊళ్ళో హోటల్స్ ఉన్నాయా ఆంటీ ? అడిగింది హనిత . లేవమ్మ ఎందుకు ? అడిగిందావిడా .
మేం ఈ ఊళ్ళో రెండ్రోజులు ఉండాలనుకుంటూన్నాం ఆంటీ. ! చెప్పింది హనిత
" నువ్వయితే మా ఇంట్లో ఉండొచ్చు" హనితతో అందావిడ.
" మరి ఇతను ఆంటీ! ఇతను చాలా మంచివాడాంటీ! ఏదో ఇడ్లీలు తిని అలా లవయ్యడంతే!" బ్రతిమలుతున్నట్లుగా అంది హనిత.
హనిత మాటిమాటికి ఇడ్లీల సంగతి ఎత్తేసరికి వైభవ్ కి అరికాలి మంట నెత్తికెక్కింది. పళ్ళు నురాడు.
ఆవిడ కాసేపు ఆలోచించి ఇద్దరూ తనింట్లోనే ఉండడానికి ఒప్పుకుంది.
"థాంక్యూ ఆంటీ! థాంక్యూ వెరిమచ్. బైదిబై మీ పేరేంటి? అడిగింది హనిత.
"శారద" సిగ్గుపడుతూ చెప్పిందావిడ.
తర్వాత ఇంకా దాక్కునే ఉన్నఊరి వాళ్ళని కోప్పడుతూ అందావిడ. " ఇక చాల్లేవే! బయటకి రండి. అతన్ని చూసి కూడా దాక్కుంటారే ?
చిన్న కుర్రవాడే! పాపం ఇడ్లీలు తిని అలా లవయ్యడంతే"
" ఆ..! " బాధగా అరిచి జుట్టు పిక్కున్నాడు వైభవ్.
హనిత నవ్వాపుకుంది.