• Prev
  • Next
  • మై డియర్ రోమియో - 60

    Listen Audio File :

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 60

     

    స్వప్న కంఠంనేని

    బస్ భోదన్ బస్టాండ్ లో ఆగింది.
    బస్ దిగారు హనిత,వైభవ్
    చిన్న టౌన్ అది.
    మనిషికి నెసెసిటి తో పాటు , కంఫర్ట్ నెస్ ని కూడా అమర్చగల అన్ని హంగులూ ఉన్న చిన్న సిటీ.

    "వైభవ్!" పిలిచింది హనిత.
    ఆమెకేసి చుశాడతను.
    చిటికెన వేలు చూపించింది.
    " సరే! నువ్వెళ్ళు,నేను ఈలోగా మనకి తినటానికి ఏదైనా పట్టుకొస్తాను" అన్నాడు వైభవ్.

    హనిత టాయిలెట్ కేసి, వైభవ్ ఫ్రూట్ స్టాల్ వైపు కదిలారు.
    టాయిలెట్ లోకి వెళ్ళిన హనిత కెవ్వున కేకపెట్టి  పెట్టి పరుగీట్టుకొచ్చింది.

     అంత అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాన్ని ఆమె జీవితలో చూడలేదు. బయటకి వచ్చి బిక్క మొహం వేసుకుని నిలబడింది.

    ఈలోగా వైభవ్ ఆమె వద్దకు వచ్చాడు.
    ఆమె మొహం చూడగానే అతనికి విషయం అర్ధమైంది. బస్ స్టాప్ లో ఉండే బాత్ రూమ్స్ ఎలా ఉంటాయో అతనికి బాగా తెలుసు.

    భాదగా అనిపించిందతనికి.
    తనవల్లె హనిత కష్టాలు పడుతుందనిపించింది.
    డీలా పడిపోయాడు.

    ఒక గమ్యం అంటూ లేని ప్రయాణం తామెందుకు చేస్తున్నారో ఒక క్షణ కాలం అర్ధం కాలేదు.
    అంతా అయోమయంగా అనిపించింది.
    ఫ్యూచర్ గురించి సీరియస్ గా ఆలోచించదలచుకున్నాడు.
    సరిగా అప్పుడే బస్ స్టాప్ ఆవరణలో అడుగు పెడుతున్న విక్రమ్ ని చూసింది హనిత.
    వైభవ్ చేయి పట్టుకుని లక్కేళ్తున్నట్టుగా పరుగెత్తుతూ వెళ్లి ఎదురుగా కనిపించిన బస్ లో ఎక్కేసింది హనిత.

    అదృష్టవశాత్తు విక్రమ్ వాళ్ళని చూడక ముందే బస్ కదిలింది.
    ఏం జరుగుతుందో వైభవ్ కి అర్ధమయ్యేలోపే బస్ లక్ష్మాపూర్  వెళ్ళే బస్ లో ఉన్నారు వాళ్ళు.
    వైభవ్కి ముడాఫ్ అవటం గమనించింది హనిత.

    అతన్నిచీరఫ్ చెయ్యాలనుకుంది. అతన్నెలా  నవ్వించాలా అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది.

    పక్కసీట్లో కూర్చున్న చుట్ట కాలుస్తున్న పల్లెటూరి ఆసామి ఆమె దృష్టిని ఆకర్షించాడు.
    ఆనందంగా అతన్ని పలకరించిది హనిత.
    " ఆ కూరగాయల బుట్ట నీదేనా ? " అడిగింది.
    " నాదే!" అన్నాడతను.
    " ఇవి అమ్మితే నీకెంత లాభాలోస్తాయి ?" అడిగింది హనిత.
    " రెండొందల దాకా రావచ్చు " చెప్పాడతను.
     " అమ్మో! రెండొందలే! చాలా లాభాలు గడిస్తున్నవన్న మాట" అంది

    సిగ్గుపది మెలికలు తిరగాబోయాడు. దాంతో అతని  నోట్లో చుట్టూ పంచె మీదకి  జారి  ఒళ్ళు చుర్రుమనిపించింది.
    వైభవ్ నిశబ్దంగా వీళ్ళనే గమనించసాగాడు  .

    " డబ్బు! సంపాదించటం పెద్ద కష్టమేమి కాదు తెల్సా ?" అన్నాడా వ్యక్తి బడాయిగా.

    పట్నం నుంచి వచ్చిన వాళ్ళలా ఉన్న వాళ్ళు  తననడిగి కొత్త విషయాలు నేర్చుకోవాలనుకోవటం చూసి రెచ్చిపోయాడతను.

    " అసలు పచ్చళ్ళమ్ముకుని కోటీశ్వరులైపోవచ్చు తెల్సా" అన్నాడతను.
    " అదెలా అమాయకంగా మొహం పెట్టి అడిగించి హనిత.

    " ఇప్పుడు కిలో పచ్చడి 60 రూపాయలనుకోండి, దాని రేటు యాబై రూపాయలకి తగ్గించి కారం తక్కువేసి పచ్చడి పట్టామనుకోండి. కారం చాలక ఎక్కువెక్కువ పచ్చడి వేసుకుని తింటారు జనం దాంతో డబ్బులే డబ్బులు. సంబరంగా చెప్పాడతను.

    " ఇంకా అడిగింది హనిత.
    " మా ఊళ్ళో ఓడరేవు బిసినెస్ పెట్టాలి " చెప్పాడతను.
    మీ ఊళ్ళో సముద్రం ఉందా ?" అడిగింది హనిత.
    లేదు జవాబిచ్చాడతను.

    " మరి ఓడరేవెందుకు ? అశ్యర్యంగా అడిగింది హనిత.

    " అదే మరి. సముద్రం ఉన్న ఊళ్ళలో ఎలానో ఓడరేవులుంటాయి కదా ! లేని ఊళ్ళో పెడితేనే కదా గిరాకి తగులుద్ది. ఇంత చిన్న విష్యం కూడా  గవర్నమెంటోడికి తెలవదు.  నాకందుకే రాజకీయాలంటే సిరాకు" అన్నాడతను.

    వైభవ్ కుడా ఆసక్తిగా వినసాగాడతని మాటల్ని.

    " అసలిదంతా అమెరికా వాడె చేసాడు. చంద్రుడి మీద స్థలాలు మనుష్యులకి అమ్మటానికి ఆడెవడు చెప్పండి. అసలా స్థలం నాదే" అన్నాడతను.
    " నీదా ? ఆశ్యర్యపోయింది హనిత.

    " చందమామ మీద నీ పేరు రాసుందా ? అడిగింది హనిత" ఎగతాళిగా అడిగింది.
    " ఆమ్రికావొడి పేరు మాత్రం రాసుందేంటి ? " అమాయకంగా అన్నాడతను. తలపట్టుకుంది హనిత.

    " ముర్ఖులతో వాదించటం కష్టం " వైభవ్తో అంది హనిత.

    " ఇంకా ఎన్నిరకాలుగా డబ్బు సంపాదించవచ్చో  చెప్పు బాబు! అడిగింది అతణ్ణి

    " ఆకాశంలో విమానాలు విమానాలు వెళ్ళేటప్పుడు కిలోమీటర్ కొకసారి దార్లో ఆపి టికెట్లు తీసుకున్నారో లేదో చూసి, డబ్బులు కట్టించుకోవాలి. టికెట్లు కొనని వాళ్ళ మూలంగా గవర్నమెంట్ కి ఎంత నష్టమో తెల్సా? అన్నాడతను.

    " సర్సరే నీకిన్ని విషయాలు తెల్సు కదా అయితే కంప్యూటర్ అంటే కూడా తెల్సా? కుతూహలంగా  అడిగింది హనిత.

    " నాకు తెలవకడుగుతాను అందరు కంపూటర్, కంపూటర్ కంపూటర్ అంటారేంటి ? ఏం? కంపూటరంటే ఏమన్నా దేవుడా ? దాన్నయినా మనిషి నడపల్సిందే కదా .!

    అన్నాడతను.

    ఇక  అతనితో మాట్లాడం తన వల్ల కాదని అనుకుంది హనిత. మాట్లాడకుండా కూర్చుంది.

    అప్పుడడిగాడతను
    " ఏం బాబు నీకింకా పెళ్లి కలేనట్టు ఉంది మా ఊళ్ళో మంచిపిల్లని చూడమంటావా ?

    పల్లెటూరి వాళ్ళు మనిషి కన్పించగానే వాళ్ళ పెళ్లి బాధ్యతలు తమ చేతుల్లోకి తీసుకుంటారు. పెళ్ళే జీవితానికి  పరమావధి  అని భావిస్తుంటారు.

    ముందు వైభవ్ ని అడుగుతడనుకుంది హనిత.

    కానీ అతను హనితను చేత్తో కుదుపుతూ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. హనిత బిత్తరపోయింది.

    తనని  అంత వరకు అబ్బాయి అనుకుంటున్నాడనే సరికి ఒళ్ళు మండిదామెకు.

    వైభవ్ కి హనిత మొహం చూసి తెరలు,తెరలుగా నవ్వొచింది పలగబడి నవ్వసాగాడు.

    ఆ పల్లెటూరి వ్యక్తి  వాళ్ళకేమైందో  అర్ధం కాకతనలో తనే సనుక్కుని ఊరుకున్నాడు.




     


     











  • Prev
  • Next