• Prev
  • Next
  • మై డియర్ రోమియో - 50

     

    మై డియర్ రోమియో - 49

    Listen Audio File :

     

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 50

     

    స్వప్న కంఠంనేని

     

    ఆరోజు రాత్రి వైభవ్ ఇంట్లో వాళ్ళు నిలదీశారు.
    "వైభవ్! కాలేజీలో పిచ్చివేషాలు వేస్తున్నావట. హనిత అన్నయ్యలు ఫోన్ చేసి చెప్పరు. నిన్ను కాలేజీకి పంపించేది చదువుకోవడానికి కానీ ఎఫైర్స్ నడపడానికి కాదు. అర్థమైందా? వాళ్లేమో అక్కడికి నువ్వేదో వాళ్ళమ్మాయిని వల్లోకి లాగావన్నట్టుగా మాట్లాడారు. పైగా నువ్వు హనితని వదిలిపెట్టకపోతే మనందర్నీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు'' అన్నాడు వైభవ్ పెద్దన్నయ్య మహేష్.
    వైభవ్ ఏమీ మాడ్లాదకుండా మౌనంగా నిలబడ్డాడు.
    "ఏంట్రా! అన్నయ్య చెప్పేదానికి నీ సంజాయిషీ ఏమీలేదా? ఇకనుంచి అలా చేయనని చెప్పు'' కోపంగా అన్నాడు తండ్రి.
    ఎన్నడూ లేని విధంగా వైభవ్ వాళ్ళను ఎదిరించాడు.
    "ఎలా చెప్పమంటారు? నాకు తనంటే ఇష్టం. హనీ లేకుండా నేను బ్రతకలేను'' ఖచ్చితంగా చెప్పాడు.
    "మేము చెప్పినా వినవా? అయినా ఆ పిల్లతో నీకెందుకురా? వాళ్ళకీ మనకీ మొదటి నుంచీ పడదుకదా'' వైభవ్ చిన్నన్నయ్య కల్పించుకున్నాడు.
    "హనీకి నాకు చిన్నప్పటి నుంచీ పడదు. అయిన మేమిప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడం లేదా? మీరూ అలాగే ఇకనుంచి పాత పగలూ, కక్షలూ మానేయండి'' నచ్చచెప్పబోయాడు వైభవ్.
    "అసలు పెద్దవాళ్ళ మధ్య గొడవలు మొదలైందే మీ ఇద్దరి మూలంగాననే విషయం మర్చిపోకు వైభవ్'' కోపంగా అంది తల్లి.
    "అయి వుండవచ్చుమ్మా! అందుకే మళ్ళీ మా ద్వారానే మన రెండు కుటుంబాలూ కలవాలని కోరుకుంటున్నాము'' పెంకిగా చెప్పాడు వైభవ్.
    "నీ ఖర్మ'' అని లేచి వెళ్ళిపోయాడు మహేష్.
    అందరూ అతన్ని అనుసరించారు.
    వైభవ్ కూడా  తన రూమ్ కెళ్ళి పడుకున్నాడు.
    మర్నాడు వైభవ్ నిద్రలేచేసరికి ఇంట్లో అంతా గోలగోలగా వుంది.
    ఆదుర్దాగా బయటికి వెళ్ళాడు వైభవ్.
    వైభవ్ చిన్ననయ్య రక్తసిక్తమైన శరీరంతో కనిపించాడు/ అందరూ అతని చుట్టూ చేరి సపర్యలు చేస్తున్నారు.
    "ఏమయిందన్నయ్యా?'' ఆందోళనగా అడిగాడు వైభవ్.
    "ఇంకా ఏమవ్వాలి? నువ్వేమో మా మాట వినవు. పొద్దునే పాలు తేవడానికి మిల్క్ బూత్ కి వెళ్తే ఆ పిల్ల అన్నలు కాపు కాసి కొట్టారంట'' ఏడుస్తూ చెప్పింది తల్లి.\
    "దేవుడా! ఏమిటిదంతా?'' బాధగా అనుకున్నాడు వైభవ్.
    ఇంట్లో లోపల గదిలో ఫోన్ మోగింది.
    అనాలోచితంగా లిఫ్ట్ చేశాడు వైభవ్. అవతల్నుంచి హనిత.
    రొప్పుతున్నట్టుగా ఉందామె కంఠం.
    "వైభవ్! మన మూలంగా మనవాళ్ళు కొట్టుకుంటున్నారు. మనం ఇలాగే ఇక్కడే వుంటే మనకోసం వీళ్ళిలాగే కొట్టుకుంటారు. మనమే ఎక్కడికైనా పారిపోదాము. కొన్నాళ్ళ తరువాత తిరిగొస్తే అప్పటికి పరిస్థితులన్నీ మళ్ళీ బాగుపడతాయి''
    "అవును. అదే మంచిదని నాకూ అనిపిస్తోంది. మనం నిజంగానే ఎక్కడికైనా వెళ్ళిపోదాము'' చెప్పాడు వైభవ్.
    కాసేపాలోచించి మళ్ళీ తనే అన్నాడు.
    "హనీ! సరిగా ఈరోజు ఈవినింగ్ ఫైవ్ కి నువ్వు జూబ్లీ బస్టాండ్ కి రా. మొదట ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోదాము''
    "సరే'' అంది హనిత.
    టైం సరిగ్గా అయిదు నిముషాలు తక్కువ అయిదయింది.
    వైభవ్ జూబ్లీ బస్టాండ్ బయట నిలబడ్డాడు.
    దూరంగా హనిత వస్తూ కనిపించింది.
    ఆనందంగా చేయి ఊపాడు. పరుగెత్తుకొచ్చి అతని చేయి పట్టుకుందామె.
    ఇద్దరూ చేతులు పట్టుకుని బస్టాండ్ లోపలికి పరుగు తీసారు.
    ఎదురుగా నిజామాబాద్ బస్ అప్పుడే స్టార్ట్ అవబోతూ కనిపించింది.
    వాళ్ళు ముందు అనుకున్నట్టుగా మొదట కనిపించిన బస్ అదే కాబట్టి బస్ ఎక్కబోయారు.
    ఉన్నట్టుండి బస్టాండ్ కంపించసాగింది. పెద్ద పెద్ద రాళ్ళు దొర్లుతున్న శబ్దాలు వినిపించాయి. భూమి కంపిస్తున్నట్టుగా వస్తున్నా ఆ చప్పుడికి జనమంతా భయభ్రాంతులయ్యారు. డ్రైవర్ స్టీరింగ్ వదిలేసి తన సీట్ కింద దాక్కున్నాడు.
    వెనక్కి తిరిగి చూసిన హనిత, వైభవ్ లకు మీనా తమవేపే పరుగెత్తుకురావడం కనిపించింది.
    ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
    "కొంపదీసి మన వెంట వస్తాననదు కద?'' అనుమానంగా అంది హనిత.
    "నువ్వు రమ్మనలేదు కదా'' సాలోచనగా అన్నాడు వైభవ్.
    మీనా వాళ్ళను సమీపించింది.
    ఆయాసపడుతూ వాళ్లకి తన చేతిలో వున్న ఫ్లవర్ బొకేని, స్వీట్ బాక్స్ నీ ఇచ్చి చెప్పింది.
    "వన్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ లవ్. దట్ ఈజ్ ద రీజన్ వన్ షుడ్ నాట్ మారీ అన్న ఆస్కార్ వైల్డ్ సూక్తిని మర్చిపోకుండా హాపెగా వుండండి. గుడ్ లక్''
    "థాంక్యూ డియర్'' మీనా చుబుకం పట్టుకుని మురిపెంగా అంది హనిత.
    అప్పుడు జేబులోంచి వైభవ్ పెన్నూ కాగితం తీసి గబగబా ఏవో గిలికి మీనా చేతికి అందించాడు.
    "ఇంటికి వెళ్ళి చదువుకో'' అన్నాడు.
    బుద్దిగా మీనా దాన్ని పర్సులో దాచుకుంది.
    ఈలోగా తేరుకున్న డ్రైవర్ బస్ స్టార్ట్ చేసాడు.
    హనిత, వైభవ్ లకు బస్ కదులుతున్న కొద్దీ మీనా దూరం కాసాగింది.
    బస్ వేగాన్ని పుంజుకుంది.
    ఆ రాత్రి ఇంటివద్ద మీనా వైభవ్ రాసిచ్చిన కాగితాన్ని తీసి చూసింది.
    అందులో ఇలా వుంది.
    "నువ్వు ఏడిస్తే జల ప్రళయం
    నువ్వు నవ్వితే శబ్ద కాలుష్యం
    నువ్వు నడిస్తే భూకంపం
    నువ్వు ఒక ప్రకృతి భీభత్సం
    థాంక్యూ మైడియర్ ఫెండ్ ఇండీడ్!''

  • Prev
  • Next