• Next
  • మై డియర్ రోమియో - 62

    Listen Audio File :

    Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

     

    మై డియర్ రోమియో - 62

     

    స్వప్న కంఠంనేని

     

    అతిధి మర్యాదలు చేయటంలో పల్లెటూరి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే హనిత, వైభవ్ తమకు కేటాయించియన గదుల్లోకి వెళ్ళారు. కాసేపవగానే శారద అనే ఆవిడా ప్లేట్ లో టిఫిన్ తీసుకొచ్చింది. ప్లేట్స్  లో ఉన్న ఇడ్లీలు చూసి వైభవ్ కి హనిత గొంతు నులమాలనిపించింది.
                      
                                                                             ***

    ఒక రోజులోనే ఆ ఊళ్ళో యామిని,రాధిక, చిన్న పాప హనిత కి ఫ్రెండ్స్ అయ్యారు. గోరింటాకు, చిట్టి చేమంతులు,కలువ, రేగిపళ్ళ చెట్టు,ఈత పళ్ళ చెట్టు, ఉసిరికాయలు హనితకు బాగా నచ్చాయి.
    వీటన్నిటిని మించి యామిని, రాధిక, చిన్న పాపలతో స్నేహం, శారద ఆప్యాయత ఆమెకు మరీ మరీ నచ్చాయి. హనితకు ఎందుకో మీనా గుర్తొచింది.

                                                            *****

    మరుసటి రోజు సాయంత్రం హనిత,వైభవ్ షికారుకు బయలు దేరారు.
    " హనీ! ఎన్నాళ్ళు మనం పారిపోయి అక్కడా,ఇక్కడా తల దాచుకోవటం ? ఎక్కడైనా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నేను ఏదైనా ఉద్యోగం

    వెతుకుంటాను.త్వరగా హాయిగా ఉండొచ్చు. అన్నాడు వైభవ్.

    "వద్దు వైభవ్! మనవాళ్ళేవరులేకుండా  మనం పెళ్లి చేసుకోవటం ఏంటి ? నాన్సెన్స్!!! ఇప్పుడు మాత్రం ఏమైంది?  నువ్వు జాబ్ చేయి, మనమిద్దరం కలిసి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అందులో హాయిగా ఉందాం" స్థిరంగా అంది హనిత.

    ఇద్దరు కలిసి ఆదిలాబాద్ వెళ్ళి సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

    మర్నాడు ఇద్దరూ ఊరి వాళ్ళందరి వద్దా వీడ్కోలు తీసుకుని బస్ ఎక్కారు.ఆదిలాబాద్ కి టికెట్స్ తీసుకున్నాడు వైభవ్.
    చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ రోజు.
    ఇక పై ఎవరి ఇళ్ళలోనూ ఉండనక్కర్లేదు.
    ఎవర్ని ఆశ్రయం అడగనక్కర్లేదు.
    మాటిమాటికి బస్సులెక్కటం పరుగెడుతూ ఊళ్లు తిరగానక్కర్లేదు.
    తమ పెద్ద వాళ్ళ సమక్షంలో తమ పెళ్లి.
    అలా ఆలోచిస్తూ కళలు కంటున్నారు.
    బస్ కిటికిలోంచి రోడ్ల పక్కన పొద్దు  తిరుగుడుపూలు,చెరకు పండిన పొలాలు వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.

    అప్పుడు వెనక సీట్లోంచి లేచాడు విక్రం అనుచరులలో ఒకడైన ధనుంజయ.
    వెనుక నుంచు హనిత భుజం మీద చేయి వేసాడతను. 
    హనిత ఉల్లిక్కిపడి వెనక్కి తిరిగింది.
    అతన్ని చూసి కెవ్వుమంది.
    అప్పటివరకు తాము ప్రశాంతంగా గడపబోయే జీవితాన్ని గురించి ఆలోచిస్తూన్న వైభవ్, హనిత కెకెతో ఈ లోకం లోకి వచ్చాడు.
    వెనక్కి చూసాడు.
    ధనుంజయ కనిపించగానే వైభవ్ కి విపరీతమైన కోపం వచ్చింది.
    అసలు వీళ్ళేవరు తమ వెంబడి కాపలా  కాయటానికి!
    వైభవ్ పిడికిలి బిగుసుకుంది.
    ఒక్క ఉదుటనలేచి ధనుంజయ్ గడ్డం కింద పంచ్ చేసాడు.
    అనుకోని పరిణామానికి ఉలిక్కిపడ్డాడు ధనుంజయ్.
    వైభవ్ కొట్టిన దెబ్బకి పైకి ఎగిరిన  ధనుంజయ అప్పుడే బస్ ని పక్కకి మలుపు తిప్పటంతో కిటికోలోంచి కింద పడిపోయాడు.
    బస్ లో ప్రయాణికులంతా వైభవ్ ని సంభ్రమంగా చూడసాగారు.
    వైభవ్ మల్లి ఎప్పటిలాగే కూల్ గా చూడసాగారు.

    హనిత అతన్నే వింతగా చూస్తూ మనసులో అనుకుంది. " ఐ లవ్  యూ! "

    బస్టాండ్ లో బస్ ఆగింది
    అందరూ ఆ బస్టాండ్ కేసి అశ్యర్యంగా చూసారు.
    అప్పుడు డ్రైవర్ నాలుక కర్చుకుని అన్నాడు.
    " హర్రె ! మర్చిపోయి మళ్ళీ నిజామాబాద్ కి తీసుకొచ్చినా! దారి యాది మార్చినా! "

    తిట్టుకుంటూ అంతా బస్ దిగారు.
    వైభవ్ లో సహనం నశించింది.

    " ఇక ఎవరూ మననేమి చేయలేరు హనీ ! మనం నిజామాబాద్ లోనే ఉందాం" హనిత తో అన్నాడు వైభవ్

    "నీ ఇష్టం " ప్రేమగా వైభవ్ ని చూస్తూ అంది హనిత.

    ప్రేమ అనేది మధురానుభూతి.
    ప్రేమించుకునే వాళ్ళకి మాత్రమే ప్రేమలోని తీయదనం అర్దమైతుంది.
    నువ్వుంటే చాలు ఈ ప్రపంచం అంతా లేకపోయినా పర్వాలేదు అనిపించడం ప్రేమ
    మన మధ్య దూరం తొలగిపోయి మనం దగ్గరవ్వాలంటే భూమి కుచించుకు పోవాలి. జనం చస్తారంటావా? చావనీ పర్వాలేదు. మన ప్రేమ ముందు వాళ్ళెంత! పిపిలికలు అనుకోవడం ప్రేమ.


    అదివరకు వందసార్లు విన్న జోక్ అయినా ప్రేమించిన వ్యక్తీ చెప్తే పగలబడి నవ్వడం ప్రేమ

    హనిత, వైభవ్ లకు ప్రపంచమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది.


     



     














     


     







     

  • Next