మాఘ శుద్ద సప్తమినే రథ సప్తమి అంటారు. అంటే, సూర్య భగవానుడి పుట్టినరోజన్న మాట. సూర్యుడు ఏడు ఆశ్వాలతో కూడిన రథం ఎక్కి వస్తాడన్నది మనకు తెలిసిందే. మన్వంతర ప్రారంభంలో మాఘ శుద్ధ సప్తమినాడు, సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట. అందుకే రథ సప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. కోణార్క్ లోని సూర్య దేవాలయంలో రథ సప్తమిని పురస్కరించుకుని మహా ఉత్సవమే జరుగుతుంది. రథ సప్తమినాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. |