ఉప్పుడు పిండి
కావలసిన పదార్ధాలు:-
బియ్యం రవ్వ - 1 గ్లాసు
పెసరపప్పు - 2 చెంచాలు
మినపప్పు - 1/2 చెంచా
ఆవాలు - 1/2 చెంచా
జీలకర్ర - 1/2 చెంచా
పచ్చిమిరపకాయ - నిలువుగా తగిన ముక్కలు
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు - 10 ఆకులు
ఉప్పు - సరిపడినంత
నూనె - పోపుకొరకు
ఎండుమిరప - 1 లేక 2
కొబ్బరి - అరచెక్క
తయరివిధానం:-
ముందుగా దళసరి గిన్నెలో నూనె వేసి అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరప, కరివేపాకు, ఎండుమిరప, ఇంగువ ఒకొక్కటిగా వేసి వేయించుకుంటూ. అదే పోపులో కొబ్బరి తురుము వేసి కమ్మని వాసన రాగానే గ్లాసుకి గ్లాసున్నర నీరు కొలతగా ఎసరుకు నీరు పోసుకోవాలి.
అందులో పెసరపప్పు వేసుకుని ఈ ఎసరు మరుగుతుంటే మంట బాగా తగ్గించి, కొద్ది నూనె ( ఒక చెంచా ) వేసి.. ఉప్పు వేసి బియ్యం రవ్వ వేస్తూ కలిపి మూతపెట్టుకోవాలి. సన్న సెగపై ఇది ఉడికి కమ్మని వాసన వస్తూ పొడిపొడిగా వస్తుంది. మూతపెట్టి పొయ్యి మించి పలుకు లేకుండా చూసి దింపి కాసేపు అలా ఉంచి తరువాత తినాలి. దీనిని పులుసు పచ్చళ్ళతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
బియ్యం రవ్వ తయారీ:- బియ్యం కడిగి బట్టపై ఆరబెట్టి ఆరాక మిక్సీ పట్టాలి. బరకగా రవ్వగా ఆడుకోవాలి. దీనిని జల్లించి మెత్తని పిండి తీసేసి రవ్వని ఇలా ఉప్పుడు పిండిలా తయారు చేసుకోవచ్చు.