మావా మాల్పోవ ....

 

 

ఇది రాజస్థానీ తీపివంట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మా అపార్ట్మెంట్స్ లో మార్వాడీలు ఇస్తే చాలాసార్లు తిన్నాను.

కావలసిన పదార్ధాలు...

* మైదా                 -  ఒక కప్పు

* కోవా                  -  ఒకకప్పు

* పంచదార            -  ఒకటిన్నర కప్పు

* పాలు                 -  రెండు కప్పులు

* జీడిపప్పు             -  తగినన్ని

* బాదాం               -   తగినన్ని

* పిస్తా                  -   తగినన్ని

* యాలకుల పొడి   -   కొద్దిగా

తయారీ విధానం..

* ముందు మైదాలో పాలుపోసిఉండలు కట్టకుండా బాగా కలపాలి

* తరువాత కోవా చేత్తో పొడి చేసి అది వేసి మల్లి బాగా కలిసి పోయేవరకు దోసేలపిండిలా ఉండేలా కలపాలి.

* ఇప్పుడు పంచదారలోఒక కప్పునీళ్ళు పోసి తీగపాకం చేసిపెట్టాలి. ఇందులో యాలకుల పొడి.. కాస్త కుంకుమపువ్వు పాలల్లో నానపెట్టి వేస్తే మంచి రంగు వస్తుంది.

* మూకుడులో నునె మీడియం హీట్ అయ్యాక గరిటతో పిండి నూనెలో ఒక్కక్కటి మన గారెల సైజు లో ఒకదానికి ఒకటి. అంటుకోకుండా దూరంగా వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేలా.. రెండువైపుల వేగాక తీసి పాకంలో వేసి రెందోవాయ వేగే లోగ తీసి ప్లేటులో విడివిడిగా పెట్టాలి.

* అన్నీఅయ్యాక తరిగిన డ్రై ఫూట్స్ తో అలంకరించాలి.

 

..Kameswari