చాక్లెట్ సమోసా

 

 

కావలసిన పదార్ధాలు:

* మైదా - 1/4 కేజీ
* డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా
* ఉప్పు - చిటికెడు
* చాక్లెట్ బార్ - 6
* డ్రైఫ్రూట్స్ ముక్కలు - 1/4 కప్పు
* వెనిలా ఎసెన్స్ - 3 చుక్కలు
* నూనె - సరిపడ

తయారీ విధానం

* ముందుగ మైదాను జల్లించి దానిని ఒక పాత్రలో తీసుకొని దానిలో ఉప్పు, కరిగించిన డాల్డా, కొద్దిగా వాము వేసి బాగా కలపాలి. తరవాత అందులో సరిపడ నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి.

* ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

* ఆ తరువాత కలిపి ఉంచిన పిండి మిశ్రమం బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. తరువాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి.

* ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి అందులో ఒక స్పూన్ చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా లాగా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.