శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సలాడ్స్

 

 

శివరాత్రి శుభాకాంక్షలు

శివరాత్రి అనగానే ఉపవాసాలు ఒకవైపు జాగరణలు మరోవైపు గుర్తొస్తాయి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తే ఎంత నీరసంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేద్దు. కటిక ఉపవాసం ఉండకూడదని శాస్త్రాలు కూడా చెపుతున్నాయి. అందుకే నీరసం రాకుండా ఉండాలంటే ఏదో ఒక పండు తింటాం. అదే పళ్ళతో సలాడ్ చేసి తింటే ఇంకొంత బలం వస్తుంది.

పుచ్చకాయ సలాడ్:

 

 

కావాల్సిన పదార్థాలు:

పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు
తర్బూజ ముక్కలు - 1/2 కప్పు
పుదీనా - రెండు రెమ్మలు
 పెరుగు - 1 స్పూన్
ఉప్పు - చిటికెడు


తయారి విధానం :

ఈ సలాడ్ చేసుకోటం చాల సులువు. పుచ్చకాయ ముక్కల్ని,తర్బూజా ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మధ్యస్తంగా తరిగి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఈ రెండు పళ్ళ ముక్కల్ని వేసి అందులో పుదీనా ఆకులు,పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. మాములుగా అయితే చాలా మంది ఈ పళ్ళలో ఉన్న గింజలు తినటానికి ఇష్టపడరు,కాని నిజం చెప్పాలంటే వాటిలోనే ఎక్కువ మోతాదులో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందుకే తయారయిన సలాడ్ గింజలతో సహా తింటే ఆరోగ్యానికి మంచిది.


మిక్సేడ్ ఫ్రూట్ సలాడ్

 

 

కావాల్సిన పదార్థాలు:

ఆపిల్ ముక్కలు - 1/2 కప్పు
దానిమ్మ గింజలు - 1/2 కప్పు
అరటిపండు ముక్కలు - 1/2 కప్పు
పుచ్చకాయ ముక్కలు - 1/4 కప్పు
చెర్రి పళ్ళు - 4
తేనే - 2 స్పూన్స్


తయారి విధానం:

ఆపిల్, అరటిపండు, పుచ్చకాయ వీటిని చిన్న ముక్కలుగా తరుగుకుని ఉంచుకోవాలి. వాటిని ఒక బౌల్ లో వేయాలి. ఆ పళ్ళ ముక్కల్లో దానిమ్మ గింజలు కూడా వేసి తేనే కలిపి సర్వ్ చేసే ముందు దాని మీద చెర్రి పండు అలంకరిస్తే చాలు ఆరోగ్యకరమైన మిక్సేడ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది.

- కళ్యాణి