LATEST NEWS
తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గురించి కూడా ప్ర‌స్తావిస్తుంటారు. టాలీవుడ్‌కు, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వీరు ఎన్నో సేవ‌లు అందించారు.   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అంటే అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ అక్కినేని నాగార్జున‌ సైతం అంతే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో ప‌లు విధాలుగా ఎంతో మందికి ఉపాధి క‌ల్పించిన.. క‌ల్పిస్తున్న వ్య‌క్తిగా నాగార్జున‌కు మంచి పేరుంది. రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా అన్ని పార్టీల నేత‌ల‌తో నాగార్జున స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న్ను నాగార్జున ప్ర‌త్యేకంగా క‌లిసి అభినంద‌న‌లు  తెలిపారు. అయితే, ఇటీవ‌ల కాలంలో రేవంత్ స‌ర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జున‌కు చెందిన‌ ఎన్ క‌న్వెన్ష‌న్ కొంత‌భాగం చెరువు భూమిని ఆక్ర‌మించి నిర్మించార‌ని గుర్తించి అధికారులు కూల్చివేశారు. ఈ విష‌యంపై ఆయ‌న కోర్టుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో బీఆర్ఎస్ నాగార్జున‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ముందుకు రాలేదు. కేటీఆర్, నాగార్జున‌కు మంచి సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నాగ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడితే.. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ ఎన్వెన్ష‌న్ కూల్చివేత విష‌యంలో నోరు మెద‌ప‌లేదు.  ఇటీవ‌ల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఓ ప్ర‌భుత్వ కార్యక్ర‌మంలో మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు పాల్గొన్నారు. అయితే, హ‌రీశ్ రావు, కేటీఆర్‌ డీపీతో ఉన్న బీఆర్ఎస్ మ‌ద్ద‌తుదారులు  సోష‌ల్ మీడియాలో సురేఖ‌, ర‌ఘునంద‌న్ రావుపై అస‌భ్య‌క‌ర పోస్టులు చేశారు. దీనిపై  హ‌రీశ్‌రావు స్పందించి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. కొండా సురేఖ ఈ అంశంపై తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు స్పందించ‌లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోవ‌టానికి కార‌ణం కేటీఆర్ అని, కేటీఆర్ కార‌ణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ కు అర్ధంతరంగా ఫుల్ స్గాప్ పెట్టేశారనీ అన్నారు. డ్ర‌గ్స్ విష‌యంలోసైతం కేటీఆర్‌పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మంత, నాగ‌చైత‌న్య విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డంతో హీరో నాగార్జున నాగచైత‌న్య‌, అమ‌ల‌తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌, నాని, వెంక‌టేశ్‌, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ వంటి టాలీవుడ్ ప్ర‌ముఖులు కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. స‌మంత సైతం మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. త‌మను మీ అవ‌స‌రాల‌కోసం రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినీ ఇండ‌స్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేత‌లు  కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు అల‌ర్ట్ కావ‌టంతో ఆమె దిగొచ్చి.. త‌న వ్యాఖ్య‌లను వెన‌క్కు తీసుకున్నారు. స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కానీ, కేటీఆర్ ను మాత్రం వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు. అయితే,  స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు.  హీరో నాగార్జున మాత్రం కొండా సురేఖ‌ను వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెల‌వులో ఉండ‌టంతో నాంప‌ల్లి కోర్టు విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీనికి తోడు సురేఖ‌పై 100కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని నాగార్జున చెప్పారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే, కొండా సురేఖ విష‌యంలో నాగార్జున అతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ వాద‌న కాంగ్రెస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారుతున్నారని, ఈ అంశంపై మంత్రి వెన‌క్కు త‌గ్గినా నాగార్జున అదే విష‌యాన్ని ప‌ట్టుకొని రాద్దాంతం చేయాల‌ని చూస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నాగార్జున తీరుపై టాలీవుడ్ లోని కొంద‌రు ప్ర‌ముఖుల‌ు సైతం విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు.  నాగార్జున‌కు కేటీఆర్‌, కేసీఆర్ ల‌తో మంచి సంబంధాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారి ప్రోద్భ‌లంతోనే నాగార్జున అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌న్న చర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్  రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం టాలీవుడ్ హీరోల‌ను వాడుకోవ‌టం కొత్తేమీ కాద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ఇదే స‌మ‌యంలో నాగార్జునపై కేసు న‌మోదైంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు నాగార్జున‌పై కేసు నమోదు చేశారు. కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉపసంహరించుకుని క్ష‌మాప‌ణ‌లు చెపపినా, నాగార్జున మాత్రం కేటీఆర్ సూచ‌న‌ల‌తో ముందుకెళ్తూ అన‌వ‌స‌రంగా చిక్కుల్లోపడుతున్నారని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బీఆర్ఎస్  ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌లో నాగార్జున పావుగా మారొద్ద‌ని వారు సూచిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నందున నాగార్జున ఇప్పటికైనా  ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయడం మంచిదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
కాంగ్రెస్ పార్టీలో క‌ట్ట‌ప్ప‌ల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడ‌నే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌మ‌నే ట్యాగ్ త‌గిలించుకొని ఇత‌ర పార్టీల‌కు స‌హాయ‌ స‌హ‌ కారాలు అందించ‌డం వారికి అల‌వాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం త‌రువాత కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు కేసీఆర్ తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో ద‌శాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎన‌లేని సేవ‌లు అందించామ‌ని చెప్పుకుంటూ పెత్త‌నం చెలాయించేవారు. అధికారంలోలేని ప‌దేళ్ల కాలంలో వీరి ఆట‌లు సాగాయి. కానీ, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత తెర‌ వెనుక పార్టీకి ద్రోహం చేస్తున్న‌వారికి చెక్‌పెడుతూ వ‌స్తున్నారు. బీఆర్ఎస్ ప‌దేళ్ల‌ హయాంలో కొంద‌రు పార్టీ సీనియ‌ర్లు కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉండ‌టంతో పాటు.. త‌మ స‌న్నిహితుల‌కు ప్ర‌భుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకొని ల‌బ్ధిపొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును ర‌ట్టు చేస్తుండ‌టంతో ల‌బోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన త‌రువాత సీనియ‌ర్‌, జూనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోతూ పార్టీ బ‌లోపేతంతోపాటు..ప్ర‌భుత్వంలోనూ వారి సేవ‌ల‌ను వినియోగించుకుం టున్నారు. కానీ, కొంద‌రి తీరులో మాత్రం మార్పురావ‌డం లేద‌ని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువులు, నాళాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారిపై కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినీ న‌టుడు నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత జరిగింది. పార్టీల‌ కు అతీతంగా, ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారు అని చూడ‌కుండా చెరువు, నాళాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. దీనికితోడు చెరువుల‌ను ఆక్ర‌మించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్‌ల‌ను కూడా కూల్చేస్తామ‌ని రేవంత్ ప‌లుసార్లు ప్ర‌స్తావించారు. మ‌రోవైపు.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీట‌ర్ల‌ పరిధిలో 40 వేల ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్‌ఘాట్‌ మూసీ పరీవాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కిం గ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేత‌లు చేప‌ట్టారు. అయితే, కొంద‌రు స్థానికులు మూసి ప‌రివాహ‌క ప్రాంతంలోని త‌మ ఇళ్ల‌ను కూల్చివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని బాధితుల‌కు అండ‌గా నిల‌వ‌డంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్నది.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ఇళ్ల‌ను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమ‌ని, ఇళ్ల‌ను కూల్చాలంటే ముందుగా బుల్డోజ‌ర్లు త‌మ‌పై నుంచి పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లోని నేత‌లు స‌వాళ్లు చేశారు. దీంతో మూసి ప్రాంతంలో కూల్చివేత‌ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా పెద్ద‌ ర‌చ్చ‌కు దారితీసింది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుంద‌రీక‌ర‌ణ పనుల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో వెనుక‌డుగు వేసేది లేద‌ని తేల్చి చెప్పారు. ఇళ్లు న‌ష్ట‌పో యిన వారికి డ‌బుల్ ఇళ్లు ప్ర‌భుత్వం క‌ట్టించి ఇస్తుంద‌ని, ప‌రిహారం కూడా అందించేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తామ‌ని, అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో అనేకమంది పెద్దలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని చెబుతూ  వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్‌ఎస్‌ నేతలతో పాటు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రాంచందర్‌రావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు.   కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ పేరు నే రేవంత్‌ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియ‌ర్ లీడ‌ర్ని అని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. పార్టీకి చెడ్డ పేరు వస్తే, తన కాంగ్రెస్ రక్తం సహించదు అని పేర్కొన్న కేవీపీ,  తన ఫామ్ హౌస్‌కు అధికారులను పంపించండి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి,  సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చివేయిస్తా అని  ఆ లేఖలో స్పష్టం చేశారు.  అయితే, కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ లీడ‌ర్‌ నైన నా ఫామ్ హౌస్ నే కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని  కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ రేవంత్ కేవీపీ పేరును ప్ర‌స్తావించ‌డం వెనుక పెద్ద‌కార‌ణ‌మే ఉంద‌న్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిం దన్న ఆరోపణలున్నాయి. వాటిని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు కేవీపీ అన్ని విధాలుగా సహకారం అందించారనీ, ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉండటంతోనే   రేవంత్ కేవీపీ పేరు ప్రస్తావిస్తూ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరించారనీ పరిశీలకులు భావిస్తున్నారు.   గతంలో కూడా రేవంత్‌ కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు.   కేవీపీ, కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేవీపీ కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.   ఇప్ప‌టికే కేవీపీ వ్య‌వ‌హారాన్ని రేవంత్ అధిష్ఠానం దృష్టికి తీసు కెళ్లార‌ని.. బీఆర్ ఎస్ హయాంలో కేవీపీ కేసీఆర్ కు ఏ విధంగా అండ‌గా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారో వివ రించారని  కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  హైకమాండ్ అనుమతితోనే రేవంత్  అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో కేవీపీ కూడా ఉన్నారని వెల్లడించారని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో సీనియ‌ర్లుగా చ‌లామ‌ణి అవుతూ ప‌దేళ్ల‌ పాటు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారికంగా స‌హ‌కారం అందించిన కొంద‌రు సీనియర్ల ను రేవంత్ టార్గెట్ చేశారనీ, వారిలో  కేవీపీ కూడా ఒక‌ర‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతుంది. మొత్తానికి కేవీపీ ఎపిసోడ్ తో  కాంగ్రెస్ పార్టీ లోని క‌ట్ట‌ప్ప‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తోడు దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఉండటంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆదివారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 76 వేల 552 మంది దర్శించుకున్నారు. వారిలో 35వేల 885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా ఆదాయం 2 కోట్ల 54లక్షల రూపాయలు వచ్చింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది. తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి మీద అత్యాచారం జరిపాడన్న ఆరోపణ మీద జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో, ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా వచ్చిన నేషనల్ అవార్డును అవార్డుల కమిటీ రద్దు చేసిసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ ఎంపిక అయ్యారు. తిరుచిట్రంబళం అనే తమిళ సినిమాలోని ‘మేఘం కరుకాథ’ అంటూ సాగే పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయన్ని ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేశారు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డు ఫంక్షన్ కోసం జానీ మధ్యంతర బెయిల్ పొందారు. ఈ నెల 8న ఆయన అవార్డు అందుకోవలసి వుంది. నేషనల్ అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్‌కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ అవార్డు రద్దు చేయడంతో బెయిల్ రద్దుపై సందిగ్ధం ఏర్పడింది. అవార్డు అందుకోవడం కోసం జానీ మాస్టర్‌కి బెయిల్ ఇచ్చినందుకు ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యాచారం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డుల కార్యక్రమంలో కనిపించడానికి సిగ్గు వుండాలి లాంటి ఘాటు విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దయింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు. ప్రజల సంస్థ. ప్రజలపై భారం వేయకుండా రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని  పెంచుకుంటాం.  ఆర్టీసీలో కార్గో రవాణాను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కొనకళ్ల నారాయణకు సినీ నటుడు సుమన్, మంత్రులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు  
ALSO ON TELUGUONE N E W S
నటీనటులు: సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు   ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె)  సంగీతం : బాలాజీ నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్ నిర్మాత : అశోక్ షిండే రచన, దర్శకత్వం : ఓషో తులసీరామ్ సాయి ధన్సిక కథనాయికగా రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించిన సినిమా 'దక్షిణ'. డైరెక్టర్ ఓషో తులసిరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ : ఏసీపీ దక్షిణ(సాయి ధన్సిక) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆమె వర్క్ చేస్తున్న సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకర్ని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిలను అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు ఓ సైకో. ఈ క్రమంలో దక్షిణ జీవితంలో కూడా ఓ దారుణం జరుగుతుంది. అసలు ఆ సైకో ఎవరు? ఎందుకు అతను అతి దారుణంగా అమ్మాయిలను చంపుతున్నాడు? దక్షిణ జీవితంలో జరిగిన దారుణం ఏంటి? ఆ దారుణం చేసిన సైకోపై దక్షిణ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? ఈ క్రమంలో దక్షిణ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగిలిన కథ. విశ్లేషణ: మొదటి సన్నివేశంతోనే సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాడు దర్శకుడు ఓషో తులసీరామ్.  అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం బాగుంది. ముఖ్యంగా సాయి ధన్సిక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మెప్పించింది. ఏసీపీపై ఒక సైకో కిల్లర్ తేలిగ్గా అఘాయిత్యం ఎలా చేయగలడు? సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టే తిరిగింది. ప్రేక్షకులు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఆత్రుతతో సినిమాను చూస్తారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి. ఇక సెకండాఫ్ ని ఎమోషనల్ గా నడిపించిన విధానం బాగుంది. అయితే సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని కీలక సన్నివేశాలు మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది అనిపించింది. కొన్ని అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ప్రధాన పాత్రలో నటించిన సాయి ధన్సిక తన బాడీ లాంగ్వేజ్ తో, నటనతో మెప్పించింది. ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ స్ లో బాగా నటించింది. మరో ప్రధాన పాత్రలో నటించిన రిషవ్ బసు కూడా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటన బాగుంది. సుభాష్, ఆనంద భారతి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. అమ్మాయిల వరుస హత్యల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన దక్షిణ మూవీ మెప్పించింది. రేటింగ్: 2.5/5  
వెబ్ సిరీస్ : మాన్వత్ మర్డర్స్ నటీనటులు: అశుతోష్ గోవారికర్, సాయి తమన్కర్, మకరంద్ అనస్పురె, సోనాలి కులకర్ణి తదితరులు ఎడిటింగ్: ఫైజల్ సినిమాటోగ్రఫీ: సత్యజిత్ శోభ, శ్రీరామ్ మ్యూజిక్: సాకేత్ కనిత్కర్ నిర్మాతలు : మహేశ్ కొఠారె, అద్దినాథ్ దర్శకత్వం: ఆశిష్ అవినాష్ ఓటీటీ: సోని లివ్ కథ:  మహారాష్ట్రలోని 'మాన్వత్' గ్రామం. అక్కడ ఎనిమది నెలల్లో ఏడు హత్యలు జరుగుతాయి. చనిపోయిన వాళ్లంతా ఆడపిల్లలు, మహిళలు. ఎవరు, ఎందుకు చంపుతున్నారనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో సాయంత్రం అయితే బయటికి వెళ్లడానికి మహిళలు భయపడిపోతుంటారు. దాంతో ఆ ఊరి సమీపంలోని పోలీసులు.. నకిలీ హంతకులను తీసుకొచ్చి కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు‌. ఇక ఇది అనేక విమర్శలకు దారితీస్తుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్ గా ఆ ఊరికి రమాకాంత్ కులకర్ణి (అశుతోష్ గోవారికర్) వస్తాడు. అదే ఊళ్ళో బాగా డబ్బున్న వాళ్ళుగా ఉత్తమ్ రావు - శ్రీరంగం ఉంటారు. ఇక ఈ వరుస హత్యల వెనక 'కాజూ' అనే క్షుద్ర మాంత్రికుడి పేరు తెరపైకి వస్తుంది. దాంతో అతణ్ణి పట్టుకోవడానికి కులకర్ణి టీమ్ వెళ్తుంది. ఇక అదే సమయంలో గణపతి పేరు బయటకి వస్తుంది. కులకర్ణి టీమ్ ఏం చేసింది? ఆ ఏడు హత్యలు ఎవరు ఎందుకు చేస్తారు? అనేది మిగతా కథ. విశ్లేషణ: మాన్వత్ గ్రామంలో జరిగిన వరుస హత్యలు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. దానిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇండియన్ షెర్ లాక్ హోమ్ అని పిలవబడే రామాకాంత్ కలకర్ణిని రంగంలోకి దింపింది గవర్నమెంట్. 1970లలో మహారాష్ట్రలో జరిగిన హత్యల ఆధారంగా రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, సూపర్ ట్విస్ట్ లతో పరుగెత్తే ఈ సిరీస్ ఆడియన్స్ చివరి వరకు కూర్చునేలా చేస్తుంది. ఇందులోని ప్రతీ పాత్రకి ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్కో పాత్ర గురించి దర్శకుడు పకడ్బందీగా రాసుకున్నాడు. అయితే ఒక్క రొమాంటిక్ సీన్, రక్తపాతం కాస్త ఎక్కువగా చూపించాడుమ కానీ అది ఈ సిరీస్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. ప్రతీ ఎపిసోడ్ నెక్స్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేస్తాయి. అయితే ఆరు, ఏడు ఎపిసోడ్ లో కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు ‌ కానీ అది ఇన్వెస్టిగేషన్ లో కీలకంగా మారింది. సిరీస్ చివరి వరకు విలన్ ఎవరో అర్థం కాదు.. ఎందుకంటే కథ వెనుక కథ అన్నట్టుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. చివరి ఎపిసోడ్ లో రివీల్ చేసే ట్విస్ట్ లకి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికి.. దర్శకుడు ఈ సిరీస్ ను సస్పెన్స్ తో ముందుకు తీసుకుని వెళ్తూ డ్రామాను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. సత్యజిత్ శోభ - శ్రీరామ్ ఫొటోగ్రఫీ, సాకేత్ కనిత్కర్ నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. ఫైజల్ ఎడిటింగ్ బాగుంది. ఆ సమయంలో కాస్త ఓపిక పడితే, క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లని ఇష్టపడే వారి వాచ్ లిస్ట్ లో ఈ మాన్వత్ మర్డర్స్ (Manvat Murders) చేరుతుంది. నటీనటుల పనితీరు: రమాకాంత్ కులకర్ణిగా అశుతోష్ గోవారికర్ సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచాడు. సోనాలి కులకర్ణి, సాయి తమన్కర్, మకరంద్ అనస్సురె తమ పాత్రల్లో ఒదిగిపోయారు‌. మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా...  డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే.. మస్ట్ వాచెబుల్  రేటింగ్: 3/5 ✍️. దాసరి  మల్లేశ్
Legendary filmmaker Mani Ratnam is back to directing big budget flicks post Ponniyin Selvan. He took a huge life risk to make his dream project and the two part movie became a blockbuster. Ponniyin Selvan-I has become an all-time blockbuster by grossing over Rs.200 crores for the first time ever in Tamil Nadu state.  Even in Worldwide gross numbers, it ended up in second position below 2.0 during its original theatrical run. After such a huge box office hit, he had decided to work with Kamal Haasan for Thug Life film. He converted it into another multi-starrer as Simbu is also playing another leading role in it.  It is reported the director finished the shooting at rapid pace and Kamal Haasan saw the rough cut as well. The multi-faceted actor expressed satisfaction with the cut and output. According to reports, he even expressed his desire to continue working with Mani Ratnam for few more films.  On other hand, new reports suggest that Rajinikanth has also approached the director for a film. In fact, the Superstar even expressed a desire to the director to think about a multi-starrer project with him and Kamal Haasan, as well. While the later part is hard to believe, we can anticipate a movie of Rajinikanth in the direction of Mani Ratnam, say reports.  If the reports are true, Rajinikanth after 33 years will be collobarating for a film with Mani Ratnam. Their only film till date, Thalapathy, has attained cult classic status among fans and movie-lovers. The movie did become a success but it was not a Basha level or Annamalai range success at the box office during its run.  While the reports are suggesting for a possible great collaboration, Rajinikanth at Vettaiyan audio release event, stated that he told director T.J. Gnanavel that Thalapathy kind of films are great but they won't become huge blockbusters at the box office. He needs mix of both but not just one kind of a genre.  So, will there be a collaboration between Thalapathy combination? It is hard to confirm but if it does materialise and confirmation does arrive on December 12th, Rajinikanth's birthday, it would be dream come true for many. 
మాజీ బిగ్ బాస్ నటి  మీద లైంగిక దాడి జరపడంతో పాటు డబ్బుల్ని కాజేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయి(harsha sai)మీద కొన్ని రోజుల క్రితం పోలీసు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.కానీ ఇంతవరకు హర్ష సాయి  ఆచూకీ మాత్రం ఎవరకి తెలియలేదు.దీంతో హర్ష సాయి విదేశాలకీ పారిపోయాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత యువతీ ఈ విషయాన్నీ పోలీసులకి తెలియచేసింది. దీంతో హర్షసాయి విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసారు.రెండు వారాలుగా పోలీసులకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న హర్షసాయి కి ఇప్పుడు ఈ నిర్ణయం షాక్ ని కలిగించడం గ్యారంటీ. ఇదిలా ఉండగా ఇప్పటికే హర్షసాయి తండ్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.దీని మీద కూడా తీర్పు రావాల్సి ఉంది.   ఇక  హర్షసాయి వ్యవహారంపై బాధిత యువతీ లాయర్ పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. హర్ష  సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తు యువతి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొనగా మరోవైపు హర్షసాయి  మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.  
  ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)కుమార్తె శ్రీమతి గాయత్రి(gayatri)హఠాన్మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.చిరంజీవి,వెంకటేష్‌, అల్లు అర్జున్,త్రివిక్రమ్‌,  నాగ్‌ అశ్విన్‌ అనిల్‌ రావిపూడి, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, రేలంగి నరసింహారావు, నాగ్‌ అశ్విన్‌, రఘుబాబు, సాయికుమార్‌, శివాజీ రాజా వంటి ప్రముఖులు  గాయత్రీ భౌతిక దేహాన్ని సందర్శించి రాజేంద్ర ప్రసాద్ కి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.పవన్‌కళ్యాణ్‌, మహేష్‌ బాబు, నాగార్జున,ఎన్టీఆర్‌లతోపాటు మరికొందరు  సోషల్‌ మీడియాద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.  ఇక గాయత్రి మరణంపై రాజేంద్రప్రసాద్ దగ్గర ముప్పై సంవత్సరాలుగా పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న నాగరాజు పలు విషయాలని వెల్లడి చేసాడు. మూడు రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ గా ఉందని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్ లో చూపించాం. దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. కానీ మళ్ళీ ఎక్కువగా రావడంతో నొప్పిని భరించడం నా వాళ్ళ కాదని గాయత్రి చెప్పడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం.డాక్టర్స్ చెక్ చేసి గ్యాస్ ట్రబుల్ తో పాటు కార్డియార్డిక్ అటాక్ అయ్యిందని, మల్టిపుల్ ఆర్గానిక్స్ ప్రాబ్లమ్ కూడా వచ్చిందని చెప్పారు. దాదాపుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట దాకా ట్రీట్ మెంట్ చేసారు. కానీ  పరిస్థితి చేయిదాటిపోవడంతో చనిపోయింది. గాయత్రికి ఫస్ట్ నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఒంటి మీద చిన్న సర్గరీ కూడా లేదు.ఎవరు ఊహించని విధంగా సడన్ గా చనిపోయింది.బంధువులందరికి విషయం చెప్తుంటే వాళ్ళు కూడా మొదట నమ్మలేదు.గాయత్రి న్యూట్రిషియన్ డైటీషియన్  చేసిందని చుట్టు పక్కల వారికి అందుకు సంబంధించిన సలహాలు కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు.       
తెలుగు చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న విషాద ఘటనపై సినీ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి అకాల మరణం అందర్నీ కలచివేసింది. 38 సంవత్సరాల అతి చిన్న వయసులో మృత్యువు ఒడిలోకి చేరడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయిన రాజేంద్రప్రసాద్‌.. కూతురు పుట్టిన తర్వాత ఆమెలోనే తన తల్లిని చూసుకుంటున్నారు. ప్రాణానికి ప్రాణంగా భావించే కన్నకూతురు కళ్ళముందే కడతేరి పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారా తండ్రి. అందరూ శ్రేయోభిలాషిగా భావించే రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో జరిగిన విషాదాన్ని చూసి పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు స్వయంగా రాజేందప్రసాద్‌ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శిస్తున్నారు.  చిరంజీవి, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, రేలంగి నరసింహారావు, నాగ్‌ అశ్విన్‌, రఘుబాబు, సాయికుమార్‌, శివాజీ రాజా వంటి ప్రముఖులు రాజేంద్రప్రసాద్‌ నివాసానికి వెళ్ళి ఆయన్ను పరామర్శించారు. పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, నాగార్జున, ఎన్టీఆర్‌లతోపాటు మరికొందరు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 
రచయితగా తన కెరీర్ ని ప్రారంభించి నటుడిగా,దర్శకుడిగా,నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి పోసాని కృష్ణ మురళి(posani krishna murali)తెలుగు చిత్రసీమకి చెందిన అందరి అగ్ర హీరోలతోనూ సినిమాలు చేసిన పోసాని పొలిటికల్ గా కూడా ప్రజలకి సేవ చేయడం కోసం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పట్నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu naidu)ని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ని వ్యక్తిగతంగా నానా బూతులు తిట్టాడు.అప్పట్లో ఆ వ్యాఖ్యలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ లో డిబేట్ ఒకటి జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక దళిత నాయకుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని తిట్టినట్టు పోసాని కనుక మా వాళ్ళల్లో ఎవరినైనా తిట్టి ఉంటే పోసానిని చంపేసి ఉండేవాళ్ళం అని చెప్పుకొచ్చాడు ఈ విషయంపై పోసాని  తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో వెక్కివెక్కి ఏడుస్తూనే సదరు దళిత నాయకుడు చేసిన వ్యాఖ్యలని టెలికాస్ట్ చేసిన ఛానెల్ అధినేత, చర్చలో పాల్గొన్న యాంకర్ ని తన పాత స్టైల్లోనే అనరాని మాటలు అన్నాడు. దీంతో కూటమి ప్రభుత్వం పోసాని మీద చర్యలు తీసుకుంటే పోసాని పరిస్థితి ఎలా ఉంటుందో అని పలువురు  కామెంట్స్ చేస్తున్నారు.  
Mega Prince Varun Tej has been waiting to give a solid comeback at the box office. His upcoming gangster drama, Matka, has all the ingredients of a solid potboiler and Varun Tej is dynamic and highly inflammable in the film. His younger looks to middle-aged looks are so aptly designed that he exudes confidence and dynamism.  Varun Tej seems to be in great form in this film after a movie like Gaddalakonda Ganesh. His screen presence is magnifying in each frame. Complimenting his screen presence, the production values are apt to the different time periods as well.   Dancing Queen Nora Fatehi and beautiful actress Meenakshi Chaudhary also make a lasting impression in the teaser. Ravi Shankar's opening lines and GV Prakash Kumar background score are major highlights of the teaser. Director Karuna Kumar is back with a highly engaging film post his Palasa 1978.  Vyra Entertainments and SRT Entertainments are producing the movie on a lavish scale. With this teaser, the movie has increased anticipation to watch it in theatres. Matka is scheduled for release on 14th November in Telugu, Tamil, Malayalam, Hindi and Kannada languages. 
రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇప్పుడు బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల విడుదలైన ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్‌ గత వారం సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ దసరాకి విడుదల కాబోతోంది. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. మచ్చా మచ్చా సాంగ్‌ రీల్స్‌ నెట్లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. మొదటి నుంచీ గేమ్‌ ఛేంజర్‌ చిత్రంపై నెగిటివిటీని స్ప్రెడ్‌ చెయ్యాలని యాంటీ మెగా ఫ్యాన్స్‌ రకరకాలుగా ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాపై వస్తున్న రీల్స్‌ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగింది? రామ్‌చరణ్‌ సినిమాపై ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్‌ అవుతోంది. ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ని రీల్స్‌ చెయ్యాలనీ, అలా చేస్తే చిత్ర యూనిట్‌ డబ్బులు ఇస్తోందనే ప్రచారం ఊపందుకుంది. దీన్ని కన్‌ఫర్మ్‌ చేస్తూ వచ్చిన ఓ స్క్రీన్‌ షాట్‌ వైరల్‌గా మారింది. ‘అందులో ‘రీల్‌ చేయడానికి అందరికీ 10 వేలు ఇస్తున్నారట.. నువ్వు కూడా తీసుకున్నావు అంటున్నారు. నిజమేనా?’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు మెహబూబ్‌ ‘అవును’ అని సమాధానం చెబుతూ ‘80 వేలు పంపారు. ట్యాగ్స్‌ వాళ్ళే ఇచ్చి రీల్‌ చేయమని చెప్పారు’ అని చాటింగ్‌లో ఉంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌ మెహబూబ్‌ని చాటింగ్‌ని చూపిస్తూ ఇది మీదేనా అని అడిగాడు. దానికి మెహబూబ్‌ ‘బాగా ఎడిట్‌ చేశారు. చాలా టాలెంట్‌ ఉంది. ఈ చాటింగ్‌ చేసిన అవతలి వ్యక్తి పేరు కూడా ఉంటే బాగుండేది’ అన్నాడు. ఇవన్నీ చూస్తుంటే గేమ్‌ ఛేంజర్‌ సినిమాని యాంటీ మెగా ఫ్యాన్స్‌ ఎలా ఆడుకుంటున్నారో అర్థమవుతుంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయనుందో మరి. 
నాలుగున్నర దశాబ్డల పై నుంచి తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.దీంతో  సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు రాజేంద్రప్రసాద్ కి తమ ప్రగాఢ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు. ప్రముఖ అగ్ర హీరో అల్లు అర్జున్(allu arjun)కొద్దీ సేపటి క్రితమే రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లి గాయత్రి పార్దిక దేహానికి నివాళులు అర్పించాడు.అనంతరం రాజేంద్ర ప్రసాద్ ద్వారా గాయత్రి మరణానికి గల కారణాలని అడిగి తెలుసుకున్నాడు.రాజేంద్ర ప్రసాద్,అల్లు అర్జున్ మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది.అల్లు అర్జున్ హిట్ చిత్రాలైన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాల్లో రాజేంద్రప్రసాద్ ప్రాముఖ్యత గల పాత్రలని పోషించాడు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా,  విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు.  సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు.  దీని గురించి తెలుసుకుంటే.. 'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం'              దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః । ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని,  మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే.. యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ । విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం . చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం..  ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో,  ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట. తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః । తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః । చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో,  సంతోషంతో ఉంటుందట. నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః. బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం.  అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి.  వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి.  అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.                         *రూపశ్రీ.  
సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం.  ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు,  సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది.  అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట.  ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. మెడ నొప్పి.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది.  ఇది కాస్తా వెన్నునొప్పికి,  మెడ నొప్పికి దారితీస్తుంది. భుజాలు.. చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు.  సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ  ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది. ఊబకాయం.. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి.  ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి  బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది. టెన్షన్.. ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది.  ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది.  ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో  టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం. పరిష్కారాలు.. సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు  తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది.  చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి.  బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి.  నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.                                                        *రూపశ్రీ.
    ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.
  నవరాత్రులు హిందువులకు పెద్ద పండుగ. నవరాత్రి పర్వదినాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. రోజూ నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఉపవాసం ఉండి పూజలు చేయడం సంప్రదాయం. మీరు కూడా నవరాత్రి పండుగ సమయంలో ఉపవాసం ఉంటే, మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. వారానికోసారి ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రతిరోజూ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సాధారణంగా ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రిటిస్ విషయంలో తక్షణ ఉపశమనం పొందడానికి ఏమి తినాలో తెలుసుకుందాం. అరటి పండు: అరటిపండు ఒక అద్భుతమైన సహజమైన ఆహారం. గ్యాస్టిక్ సమస్యను దూరం చేయడంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండి ఎసిడిటీ లక్షణాలను దూరం చేస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం కంటెంట్ కడుపు,  శరీరం యొక్క pH స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎసిడిటీని పూర్తిగా దూరం చేస్తుంది. ఈ సందర్భంగా వీలైనంత వరకు పండిన అరటిపండ్లను తినండి. చల్లని పాలు: మీ గ్యాస్ట్రిక్ సమస్య చాలా త్వరగా తగ్గాలంటే, వెంటనే ఒక గ్లాసు చల్లని పాలు తాగండి. ఇది మీ పొట్టలో ఎసిడిటీని నివారిస్తుంది. చల్లని పాలు మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే చాలా ఆమ్ల పదార్థాలను గ్రహిస్తాయి. ఇది ఉబ్బరం,  గుండెల్లో మంట నుండి మిమ్మల్ని నివారిస్తుంది. అయితే పాలలో చక్కెరను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదు. పెరుగు లేదా మజ్జిగ: మజ్జిగ, పెరుగు కూడా మీ గ్యాస్ట్రిక్ సమస్యను వదిలించుకునేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది అపానవాయువు, గుండెల్లో మంటలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది.  కడుపులో చికాకు,  అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీ శరీరానికి అనేక రకాల మంచి పోషకాలను అందజేస్తుంది.  మీ జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. వేడినీరు తాగడం: అనేక ఆరోగ్య సమస్యలకు వేడినీరు దివ్యౌషధం. అదేవిధంగా, కడుపులోని ఆమ్లత్వం, గుండెల్లో మంట సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు నవరాత్రి ఉపవాస సమయంలో అసిడిటీని అనుభవిస్తున్నట్లయితే, వెంటనే వేడి నీటిని తాగడం వలన ఉపశమనం లభిస్తుంది. మీ శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. వేడి నీళ్ళు మీ పొట్టలోని ఎసిడిటీని చాలా వరకు తగ్గిస్తాయి. పుచ్చకాయ పండు: పుచ్చకాయ పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన వారికి, గ్యాస్ట్రిక్ విషయంలో దీనిని తీసుకోవడం కొత్త విషయం కాదు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్ట్  అంటున్నారు.
  ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.  ఇవి శ్వాస వ్యవస్థకు మూలం.  మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి,  కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర.  సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి.  ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా.  ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి.  అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే  కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి. తులసి నీరు.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.  రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ.. అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనా టీ.. పుదీనాలో మెంథాల్ ఉంటుంది.  ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో,  శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.  పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాము నీరు.. వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది.                                                  *రూపశ్రీ.
శరీరానికి అవసరమైన మూడు స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి,  కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణ కోసం మనకు అవసరమైన విధంగా సరిగ్గా పనిచేయడానికి మన శరీరానికి పెద్ద పరిమాణంలో ప్రోటీన్ అవసరమవుతుంది.  ప్రొటీన్లు వ్యాధులతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి, ఇవి లేకపోతే మన శరీరం నిరంతరం అరిగిపోతుంది.   ప్రోటీన్ల యొక్క ప్రయోజనాల జాబితా అంతులేనిది, ఈ మాక్రోన్యూట్రియెంట్‌ను మన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పర్ఫెక్ట్  గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ సమయం ఏదంటే  అల్పాహార సమయమే..  తద్వారా మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ప్రోటీన్ అందిందే కొన్ని ఆహార పదార్థాలు ఇవే.. నట్స్ - నట్స్ రుచికరమైన, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం అని చెప్పవచ్చు.  మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మోతాదును అందిస్తాయి. అంతే కాదు ఇవి బెస్ట్ రికమెండషన్ కూడా.  తినడానికి కూడా సులభమైనవి.  ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజల్లో బాదం, వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వేరుశెనగ ఉన్నాయి.  నట్స్ తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ప్రొటీన్‌ను పొందడంలో మీకు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు మరియు ఎముకలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందేలా చేస్తుంది. పచ్చి బఠానీలు - ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి అవసరమైన రెండు పోషకాలు, ఇవి బఠానీలలో పుష్కలంగా ఉంటాయి.  బఠానీలు ఆకలిని నియంత్రించగలుగుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  ఒక కప్పు బఠానీ తీసుకుంటే అందులో విటమిన్ సిలో సగానికి పైగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రోజువారీ అల్పాహారంలో బఠానీలను చేర్చడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లను అందించవచ్చు.  క్వినోవా - క్వినోవా ఉత్తమ అల్పాహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్వినోవాను కంప్లీట్ ప్రోటీన్‌గా సూచిస్తారు.  శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి క్వినోవా కలిగి ఉండటం దీనికి కారణం.  ఇది చాలా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది, అలాగే ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. సోయా మిల్క్ - సోయా మిల్క్‌లో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.  సోయా పాలు ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది బలమైన కండరాలు అవయవాలను నిర్వహించగలదు.  మీ శరీరం స్వంతంగా ఉత్పత్తి చేయలేని "మంచి" కొవ్వులు అయిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో పుష్కలంగా ఉన్నాయి.   ఓట్స్ - ఓట్స్ తక్కువ-ధర, పోషకాలు ఎక్కువగా ఉండే ప్రోటీన్‌ల మూలం.   ఓట్స్ లో 11-15% అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి.  పీనట్ బటర్, చియా గింజలు, అవిసె గింజలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ లను ఓట్స్ కు జోడించవచ్చు.  సమర్థవంతమైన ప్రోటీన్ ఫుడ్ కు వోట్స్ సరైన మార్గం.  చియా విత్తనాలు - చియా గింజలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అధిక-నాణ్యత గల ప్రోటీన్. అలాగే అవసరమైన ఖనిజాలు యాంటీఆక్సిడెంట్‌లలో సమృద్ధిగా ఉంటాయి.  ఈ విత్తనాలను  సలాడ్లతో తీసుకోవచ్చు. లేదంటే  పెరుగుతోనూ తీసుకోవచ్చు. చాలా రకాల పుడ్డింగ్‌ లలో వీటిని వాడతారు.   ఇలా సాధారణ వ్యక్తులు కూడా తమ అల్పాహారంలో జోడించుకోగల ప్రోటీన్ ను తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.