LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది.  చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రాతో పాటు నంద్యాల ఏఎస్పీగా మందా జావళి అల్ఫోన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్‌నాథ్‌ హెగ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన తరువాత కూడా పోలీసు శాఖ పనితీరు సరిగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కొందరు పోలీసు అధికారులు పాత పద్ధతులు మార్చుకోలేదనీ, వైసీపీకి కొమ్ము కాస్తున్నట్లుగానే వ్యవహరిస్తున్నారన్న అసహనం కూటమి ప్రభుత్వ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పారు.  తిరుమల తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరును సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు సైతం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.  తాజాగా మరోసారి ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా పోలీసు శాఖలో ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాటినట్లైంది.   
తిరుమ‌ల‌లో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు. ప్ర‌తీ రోజూ దాదాపు అర‌వై వేల‌కుపైగా భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. తిరుమల నిత్యం  స్వామినామ‌స్మ‌ర‌ణంతో మారుమోగిపోతుంది. అలాంటి తిరుమ‌ల‌లో గ‌డిచిన ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఎన్నో అప‌చారాలు జ‌రిగాయి. ల‌డ్డూ త‌యారీలో వాడే నెయ్యి విష‌యం ద‌గ్గ‌ర నుంచి.. తిరుమ‌ల‌లో టికెట్ల పంపిణీ.. ఉద్యోగుల నియామ‌కం ఇలా అన్నిఅంశాల్లోనూ వైసీపీ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయి. మొత్తంగా తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను దెబ్బ‌తీసే స్థాయికి గ‌త పాల‌కుల నిర్ణ‌యాలు వెళ్లారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికారులు తిరుమ‌ల ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం బిగించారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిచేసుకుంటూ వ‌స్తున్నారు. దీంతో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల తాకిడి క్ర‌మంగా మరింత పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా టోకెన్ల జారీ స‌మ‌యంలో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఆరుగురు మ‌ర‌ణించ‌గా.. ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్, వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. తిరుప‌తిలో టోకెన్ల పంపిణీ స‌మ‌యంలో ఆరుగురు మృతిచెంద‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారి. ఒక‌రిద్ద‌రు అధికారుల కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే, ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే టీడీపీ పాల‌క మండ‌లి అప్ర‌మ‌త్త‌మైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం వెంట‌నే స్పందించారు. ఘ‌ట‌న జ‌రిగిన కొన్నిగంట‌ల‌కే వారు తిరుప‌తికి వ‌చ్చి క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి.. ప్ర‌మాదం జ‌రిగిన తీరుపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారుల‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిలను సస్పెండ్ చేయ‌డంతోపాటు.. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌లను బ‌దిలీ చేశారు. గాయ‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారివ‌ద్ద‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. వారిని ప‌రామ‌ర్శించి ఘ‌ట‌న జ‌రిగిన తీరును తెలుసుకున్నారు. అంతేకాక మ‌రుస‌టిరోజే వారికి ప్ర‌త్యేక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం ఏర్పాటు చేయించారు. అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. క్ష‌త‌గాత్రుల ప‌రామ‌ర్శ పేరుతో ఆస్ప‌త్రికివ‌చ్చిన జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రిద్ద‌రే రావాల‌ని వైద్యులు వారించినా విన‌కుండా జ‌గ‌న్ స‌హా మ‌రో ప‌దిమంది వైసీపీ నేత‌లు లోప‌లికి వెళ్లారు. దీనికితోడు జ‌గ‌న్ వ‌చ్చే ముందే ప‌లువురికి ఓ వైసీపీ నేత‌ తెల్లక‌వ‌ర్లు పంచిపెట్ట‌డం సీసీ కెమెరాల్లో రికార్డు కావ‌టంతో వైసీపీ కుట్ర‌కోణం బ‌య‌ట‌కొచ్చింది. క‌వ‌ర్లో డ‌బ్బులిచ్చి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని చెప్పించే ప్ర‌య‌త్నం చేసింది వైసీపీ బ్యాచ్‌. చంద్ర‌బాబు స‌కాలంలో స్పందించ‌డంతో ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవాల‌న్న వైసీపీ ప్లాన్ బెడిసికొట్టింది.  అబ‌ద్ధాల‌ను ప‌దేప‌దే ప్ర‌చారం చేసి అవి నిజ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా చేయ‌డంలో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు దిట్ట‌. దీనికి తోడు జ‌గ‌న్ సొంత మీడియా, వైసీపీ సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. ఘ‌ట‌న జ‌రిగిన తొలి రెండు రోజులు చంద్రబాబు కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగిందంటూ వైసీపీ మీడియా ప్ర‌చారం చేసింది. వారి ప్లాన్ బెడిసికొట్ట‌డంతో ఈ ఘ‌ట‌న‌కు కార‌ణం చైర్మ‌న్‌, ఈవో అంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లు పెట్టింది వైసీపీ బ్యాచ్‌.  చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య సమన్వయ లోపం, విభేదాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని సొంత జగన్ మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేశాయి. చైర్మ‌న్‌, ఈవోకు వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే భ‌క్తిలేదని, తిరుమ‌ల‌లో రాజ‌కీయాలు చేస్తున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశాయి. తాజాగా వైసీపీ త‌ప్పుడు ప్ర‌చారాల‌పై టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మీడియా స‌మావేశం పెట్టి సీరియ‌స్ అయ్యారు. టీటీడీ పాలక మండలికి, అధికారులకు మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అందరూ సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆ సంఘటన మినహా మిగతా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారని స్ప‌ష్టం చేశారు. దీంతో వైసీపీ అస‌త్య ప్ర‌చారాల‌కు ఎండ్ కార్డు ప‌డిన‌ట్ల‌యింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. హైద్రాబాద్ పరేడ్  గ్రౌండ్ లో  7 వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్  సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఈ వేడుక నిర్వహిస్తోంది. దాదాపు 19 దేశాలకు చెందిన 47 మంది ప్రొఫెషనల్ కైట్ ప్లయ్యర్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే 14 రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లయ్యర్స్ భాగస్వాములయ్యారు. నెదర్లాండ్స్,  సౌత్ ఆఫ్రికా,  తైవాన్, ఇటలీ, మలేషియా, వియాత్నం, పిలిప్పీన్స్,కొరియా, థాయ్ లాండ్, స్కాట్లాండ్ , కంబోడియా, కెనెడా, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన 50 మంది కైట్ ప్లయ్యర్స్ హాజరయ్యారు. మూడురోజులపాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్ కు తెలుగురాష్ట్రాలకు చెందిన గాలి పటాక ప్రేమికులు  పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 
తిరుమల ఘట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లిన ఆరుగురు భక్తులు మృత్యువాత ఘటన మరువక ముందే సోమవారం(జనవరి 13) ఉదయం కొండపై శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇచ్చే కౌంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు.   ఈ ఘటన జరిగిన మరికొద్ది గంటల్లో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్డుపై ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంవల్ల ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ స్థంభించింది. తిరుమల కొండపై వరుస ఘటనలతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. 
వికారాబాదు జిల్లా పూడూరు  మండలం శంకర్ పల్లి గ్రామంలో చెల్లా చెదురుగా పడి ఉన్న దాదాపు 55 చారిత్రాత్మక శిల్పాలు ఆలనా లేక  రక్షణ కోసం ఎదురు చూస్తున్నాయని పురావస్తు పరిశోధకుడు,  ప్లీచ్ ఇండియా పరిశోధకుడు డా ఈమని శివనాగిరెడ్డి  చెప్పారు. స్థానిక వారసత్వ  ప్రేమికులు చాకలి సంపత్ కుమార్, సింహాద్రి వెంకటరామిరెడ్డిల సహకారంతో కంకల్ గ్రామంలోని గణేశాలయం , శివాలయం ఊరి మధ్యలోనూ , శివారులోనూ నిర్లక్యానికి గురైన బాదామీ చాళక్య కాలపు ( క్రీశ 8వ శతాబ్ది) నిలువెత్తు గణేశ, నంది శిల్పాలు , రాష్ట్ర కూటుల కాలపు ( క్రీ. శ 9 వ శతాబ్ది) జైన పార్శ్యనాథ మహవీర, యక్ష, యక్షణీ శిల్పాలు , కళ్యాణీ చాళుక్యుల  కాలపు ( క్రీ. శ 11వ శతాబ్ది) నాగదేవతలు,  కాకతీయుల కాలపు సప్త మాతృక, శత్రు సంహారంలో ప్రాణాలొదిన వీరుల శిల్పాలు , రెండు శాసనాలు, ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయన్నారు.  మసీదు వెనుక వైపు ఉన్న పార్శ్వనాథుడు , యక్ష, యక్షిణి శిల్పాలు, గ్రామం మధ్యలోనూ , చివరి చింత చెట్టు క్రింద ఉన్న వర్దమాన మహవీరుని, తల ,మొండెం భిన్నమైన శిల్పాలు  వీర భధ్రాయలం పక్కనున్న నాగులకట్టపై నున్న సింహం బొమ్మలతో చెక్కిన అతి పెద్ద వర్దమాన  (మహవీరుని శిల్పం జాడ దొరకలేదు. ) రాష్ట్ర కూటుల శిల్పి శైలికి అద్దం పడుతున్నాయన్నారు.  రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు , వికారాబాద్ జిల్లాలోని ఎల్లంకొండతో పాటు కంకల్ కూడ వెయ్యేళ్ల నాటి దిగంబర జైన క్షేత్రమని ఈ శిల్పాలు  రుజువు చేస్తున్నాయని ఆయన చెప్పారు.  ఆ శిల్పాల చారిత్రక  ప్రాధాన్యత పట్ల స్థానికులకు ఆయన అవగాహన కల్పించారు.  జైన, శైవ, శాస్త్ర మతాలకు చెందిన ఇన్ని శిల్పాలున్న కంకల్ గ్రామాన్నివారసత్వ గ్రామం ( హెరిటేజ్ విలేజ్ ) గా ప్రకటించి, ఆ శిల్పాలన్నింటినీ  వీర భధ్రాలయ ప్రాంగణానికి , పీఠాలపై ఎత్తించి , చారిత్రక వివరాల పేరు పలకలను పెట్టించి, పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి  కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రామానికి చెందిన గట్టుపల్లి మల్లేష్, నీరటి రాములు, చిన్ని కృష్ణ, శివాలయ పూజారీ పాల్గొన్నారని  ఆయన చెప్పారు. 
ALSO ON TELUGUONE N E W S
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అప్ కమింగ్ మూవీ ఓజీ(OG)కి ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో అయితే ఓజి మీద అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఎంతలా అంటే పవన్ ఏ మీటింగ్ కి వెళ్లినా సరే ఓజీ అని అరిచేంతలా. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి  థమన్(THaman) సంగీత దర్శకుడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా థమన్ ఓజీ గురించి మాట్లాడుతు మీసం తిప్పి మరీ చెప్తున్నాను ఓజీ సినిమా అన్నిటికీ సమాధానం ఇస్తుందని అన్నాడని, తమిళ సినిమా నుంచి లియో, బీస్ట్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు ఎలాగో, వాటన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఓజీ ఉంటుంది. వాళ్ళ సినిమాలు కోసం మనం ఎలా మాట్లాడుకున్నామో ఓజీ కోసం మిగతా వాళ్ళు మాట్లాడుకునే రేంజ్ లో కూడా ఉంటుందనే వ్యాఖ్యలు థమన్ చేసాడనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ లో అయితే ఈ వార్త సరికొత్త జోష్ ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.      పవన్ అప్ కమింగ్ జాబితాలో ఉన్న సినిమాల్లో ముందుగా 'ఓజీ' నే విడుదలవ్వుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో హరిహరవీరమల్లు వచ్చి చేరింది. ప్రస్తుతం రెగ్యలర్ గా షూటింగ్ ని జరుపుకుంటున్న వీరమల్లు మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ఓజీ ని ఆర్ఆర్ఆర్ దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.  
  ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అపజయమెరుగకుండా వరుస విజయాలతో దూసుకుపోయే దర్శకులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సక్సెస్ ఫుల్ దర్శకుడే అనిల్ రావిపూడి. నిజానికి ఆయనను సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తుంటారు. క్రింజ్ కామెడీ అని విమర్శిస్తుంటారు. అయితే, మీ ట్రోల్స్ మీరు చేసుకోండి.. నేను మాత్రం వరుసగా హిట్స్ కొట్టుకుంటూ పోతాను అన్నట్టుగా అనిల్ రావిపూడి ప్రయాణం సాగుతోంది. (Anil Ravipudi)   కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. మొదటి సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న రావిపూడి.. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్-3', 'భగవంత్ కేసరి' సినిమాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 'ఎఫ్-3' కొన్ని ఏరియాలలో మైనర్ లాస్ లు చూసినప్పటికీ, ఓవరాల్ గా సెమి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎనిమిదవ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ వస్తోంది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే, మంచిగా నవ్వుకోవచ్చని సినిమా చూసిన వారంతా అభిప్రాయపడుతున్నారు. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. మేజర్ సిటీలలో దాదాపు అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. ప్రస్తుతం జోరు చూస్తుంటే.. హీరో వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నట్లే. (Sankranthiki Vasthunam)   తన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ అని అనిల్ రావిపూడి చెబుతుంటాడు. అందుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసి వరుస హిట్స్ కొడుతున్నాడు. కానీ కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా క్రింజ్ కామెడీ అంటూ రావిపూడిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరెన్ని కామెంట్స్ చేసినా, ఆఫ్ లైన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అనిల్ రావిపూడి సినిమాలకు ఓటేస్తూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. అందరూ భారీ బడ్జెట్ తో కూడిన యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. వీటి నడుమ ఓ మంచి ఎంటర్టైనర్ వస్తే చూడాలి అనుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి రావిపూడి సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక దర్శకుడు ఎనిమిది సినిమాలు చేసి, ఒక్క ఫ్లాప్ కూడా చూడకపోవడం అనేది అభినందించదగ్గ విషయం.  
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం 'డాకు మహారాజ్' గా థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న  బాలకృష్ణ కెరిరీలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవ్వగా బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.సంక్రాంతి హీరో బాలయ్యనే అనే అభిప్రాయాన్ని కూడా వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఈ మూవీ రెండు రోజులకి 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.సినిమా మంచి విజయం సాధించిందనటానికి ఈ కలెక్షన్స్ నే ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.మొదటి రోజు  56 కోట్ల గ్రాస్ ని రాబట్టిన విషయం తెలిసిందే.ఇక రాబోయే రోజుల్లో డాకు మహారాజ్ అనేక రికార్డులు నెలకొల్పుతుందని,సినిమాకి హిట్ టాక్ ఉన్న దృష్ట్యా   మరికొన్ని రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారంటీ అని కూడా సినీ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.  ఇంజినీర్ గా,డాకు మహారాజ్ గా,నానాజీ గా మూడు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు.బాలకృష్ణ భార్యగా చేసిన ప్రగ్య జైస్వాల్, కలెక్టర్ గా శ్రద్ద శ్రీనాద్,విలన్ గా  బాబీ డియోల్ తో పాటు డాకు మహారాజ్ లో చేసిన అందరు కూడా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.సితార ఎంటర్  టైన్మేంట్, ఫార్చ్యూన్ ఫోర్ లు కలిసి నిర్మించిన డాకు మహారాజ్ కి బాబీ దర్శకత్వం వహించగా థమన్ సంగీతాన్ని అందించాడు.  
Cast: Venkatesh, Meenakshi Chowdary, Aishwarya Rajesh, Upendra Limaye, Sai Kumar, Naresh, VT Ganesh, Muralidhar Goud, Pammi Sai, Sai Srinivas, Anand Raj, Chaitanya Jonnalagadda, Mahesh Balaraj, Pradeep Kabra, Chitti, Revanth  Crew:  Cinematography by Sameer Reddy Editing by Tammiraju Music Director: Bheems Ceciroleo  Producer: Shirish  Director: Anil Ravipudi  Anil Ravipudi and Venkatesh have delivered two big blockbusters with F2 and F3. Now, they have planned to release their next for Sankranti and deliver a huge hat-trick blockbuster. With huge buzz and anticipation, the  movie Sankrantiki Vasthunnam released on 14th January. Let's discuss about the movie in detail.  Plot:  YD Raju(Venkatesh), an ex-cop who has been suspended, is commissioned by CM to help his ex-lover Meenakshi(Meenakshi Chaudhary) in saving a world renowned Telugu CEO Akella(Avasarala Srinivas). But YD Raju's wife Bhagyam( Aishwarya Rajesh) decides to join him in the mission. What happens during the mission? Can this ex-cop really save the day for the CM? Watch the movie to know more.  Analysis:  Venkatesh, once again, proves his mettle as a performer in a comic role. He is able to blend his action prowess with ultimate comic timing and energy. The comedy works majorly because of his performance. Aishwarya Rajesh is great as Bhagyam but she is underwritten and limited. Meenakshi Chaudhary has a good role and scope for action scenes. She did well but her looks could have been much better.  Among others, Master Revanth as Bulli Raju, impresses us with his performance. But making a young kid speak such bad words as comedy is questionable. Still, as a performer he did his best. Upendra Limaye and Sai Kumar comedy track irritates after a point.  Music by Bheems Ceciroleo is good but the background score needed to be much better. Production values are not as great as we anticipate from a big production house. Still, the visuals are good enough for a family entertainer.  Writer and director Anil Ravipudi carved a niche for himself with his comic entertainers with weird yet sensible characters. But in this film, he went too much into weird characters without much care for sensibilities. He should have been able to create a perfect balance between emotional content and comedy.  But he succeeded in creating some funny one-liners and did not let too much of drag seep in to the film. While there are loads of misfires among comedy scenes, he did give a passable entertainer that works for the festival time.  In Conclusion:  Comedy works to an extent but the movie could have been much better.  Rating: 2.75/5
  సినిమా పేరు:సంక్రాంతికి వస్తున్నాం నటీనటులు:వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి,నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ,మురళి గౌడ్ తదితరులు రచన,దర్శకత్వం: అనిల్ రావిపూడి సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు సంగీతం: భీమ్స్ సిసిరిలియో నిర్మాత: దిల్ రాజు బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ డేట్: 14 -01 - 2025    మూడున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న విక్టరీ వెంకటేష్ సంక్రాంతి కానుకగా ఈ రోజు తన కొత్త  మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. వెంకటేష్ తోనే ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్లీ దిల్ రాజునే ఈ చిత్రాన్ని నిర్మించడంతో వెంకటేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీ పట్ల ఆసక్తి ఏర్పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో యాదగిరి దామోదర రాజు (వెంకటేష్) తన భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్) తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటుంటాడు. రాజుకి భాగ్యం, భాగ్యంకి రాజు అన్నా ప్రాణం కంటే ఎక్కువ. అంత అన్యోన్య దాంపత్యంతో ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ ఐటి దిగ్గజం సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్)ని కొంత మంది రౌడీలు కిడ్నాప్ చేసి ఒక కండిషన్ పెడతారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేశవ(నరేష్), రాజుని సంప్రదిస్తాడు. ఇంకో పక్క రాజు మాజీ ప్రేయసి మీనాక్షి(మీనాక్షి చౌదరి), రాజు దగ్గరకి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. చాలా ఏళ్ళకి రాజు దగ్గరకి  మీనాక్షి ఎందుకు వచ్చింది? సత్య ఆకెళ్ళని ఎవరు కిడ్నాప్ చేసారు? వాళ్ళు పెట్టిన కండిషన్ కి రాజుకి సంబంధం ఏంటి? అసలు ముఖ్యమంత్రి రాజు నే ఎందుకు ఎంచుకున్నాడు? అసలు రాజు ఎవరు? అతను ఏం చేసాడు? పూర్తి పేరు యాదగిరి దామోదర రాజు వెనుక ఏమైనా కథ ఉందా? అనేదే ఈ చిత్ర కథ.    ఎనాలసిస్: 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి కథతో కూడిన సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లే తో, కామెడీ పంచులతో సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగింది. ఎందుకంటే దర్శకుడు సినిమా స్టార్టింగ్ లోనే నా సినిమా కథ ఇది అని చెప్పేస్తాడు. కాబట్టి కథనం ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సాగాలి. ఈ మూవీలో అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ లో వెంకీ, ఐశ్వర్య ల మధ్య సీన్స్, వెంకీ కి అతని కొడుకు, మామకి మధ్య వచ్చే సీన్స్ గాని థియేటర్ లో నవ్వులు పూయించాయి. కాకపోతే పిల్లాడి చేత అలా బూతులు చెప్పించడం ఏంటనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ సీక్వెన్స్ జంధ్యాల సినిమా నుంచి తీసుకున్నదే. ఇక చాలా సినిమాల్లో వచ్చిన సీన్స్ అయినా కూడా డైలాగులు, పాత్రల చిత్రీకరణ వల్ల ఫ్రెష్ గా అనిపించాయి. సినిమా చూసే ప్రేక్షకుడు బోర్ కొట్టకుండా ఉండటానికి మీనాక్షిని ఎంట్రీ చేసిన ప్లేస్ మెంట్ బాగుంది. అలాగే ఐశ్వర్య, మీనాక్షి ల క్యారెక్టర్ ల డిజైన్ సగటు ఆడవాళ్ళ లాగే ఉంది. ఎక్కడా కూడా సినిమాటిక్ ని ఫాలో అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ లో కిడ్నాపర్ల  కోసం వెంకటేష్, భాగ్యం, మీనాక్షి లతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం కొత్తగా ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్ లో వచ్చే సీన్స్ అన్ని రొటీన్ తరహాలోనే సాగాయి. అయితే డైలాగుల వల్ల ఆ లోటు కనిపించదు. పోలీస్ ఆఫీసర్ ఆంథోనీ క్యారక్టర్ చేసిన కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక చివర్లో వెంకటేష్ యొక్క లక్ష్యం  సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. చాలా మందిని ఆ పాయింట్ ఆలోచింపచేస్తుంది కూడా.   నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు: వెంకటేష్ నటన గురించి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఎన్నో సినిమాలని తన వన్ మాన్ షో తో నడిపించినట్టే, ఈ 'సంక్రాంతికి వస్తున్నాం'ని కూడా తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడు. యాదగిరి దామోదర రాజుగా భార్య అంటే ఎంత ప్రేమో, అదే సమయంలో మాజీ ప్రేయసితో, భార్య ముందు ఇబ్బంది పడుతూ ట్రావెల్ చేసే  భర్తగా, ఆ ఇద్దరి పోరు పడలేక ఆవేశాన్ని దిగమింగుకుంటూ రౌడీలతో ఫైట్ చేసే క్యారెక్టర్ లో వెంకీ సూపర్ గా చేసాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ గా కూడా వెంకీ ని చూస్తే ఆయన గత చిత్రం ఘర్షణ గుర్తుకొచ్చింది. ఇక భాగ్యం క్యారెక్టర్ లో ఐశ్వర్య ఒదిగిపోయిందని చెప్పవచ్చు. విలేజ్ లో ఉండే ఆడవాళ్లు భర్త అంటే ఎంత ప్రేమని చూపిస్తారో తన క్యారక్టర్ ద్వారా తెలియచేసింది. భాగ్యం క్యారెక్టర్ ఆమె కెరిరీలో వన్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఇక మీనాక్షి చౌదరి కి కూడా ఇదే వర్తిస్తుంది. ఐపీఎస్ మీనాక్షి గా అద్భుతంగా నటించి తనలో ఎంత మంచి నటి ఉందో నిరూపించింది. ఇక మిగతా పాత్రల్లో చేసిన నరేష్, మురళి గౌడ్, శ్రీనివాస రెడ్డి, వీటీ గణేష్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ లు తమ పాత్ర పరిధి వరకు చక్కగా  నటించారు. ముఖ్యంగా వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ లో చేసిన బాబు ఐతే తన పర్ఫామెన్స్ ద్వారా థియేటర్స్ లో నవ్వులు పూయించాడు.  ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే రచయితగా,దర్శకుడుగా  కామెడీ ని అందించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. భీమ్స్ సిసిరిలియో సంగీతంలోని పాటలు బాగున్నాయి. కాకపోతే  ఆర్ ఆర్ విషయంలో ఇంకొంచం బాగుండాలని అనిపించింది. ఇక ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమా తగట్టుగా లేవని అనిపిస్తుంది.   ఫైనల్ గా చెప్పాలంటే..  లాజిక్ లేకుండా కామెడీని ఎంజాయ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మూవీ నచ్చవచ్చు. కాకపోతే లాజిక్ లు వెతికే వాళ్లకి నచ్చకపోవచ్చు. సంక్రాంతి ని దృష్టిలో పెట్టుకొనే  తెరకెక్కించిన ఈ మూవీని టైం పాస్ కోసమైతే చూసేయచ్చు.     రేటింగ్: 2.75/5  - అరుణాచలం
  ఈ సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడ్డాయి. జనవరి 10న 'గేమ్ ఛేంజర్', జనవరి 12న 'డాకు మహారాజ్', జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు థియేటర్లలో పెట్టాయి. ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరనే ఆసక్తి కొద్దిరోజులుగా ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రావడంతో.. సంక్రాంతి విన్నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. (sankranthi 2025)   రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ, శంకర్ శైలికి భిన్నంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా తెరకెక్కింది. చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందిన ఫస్ట్ ఫిల్మ్ స్థాయిలో లేదనే టాక్ ని మొదటి షో నుంచే సొంతం చేసుకుంది. పేలవమైన కథాకథనాలతో ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా సినిమా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. రోజురోజుకి కలెక్షన్లు పడిపోతున్నాయి. పెట్టిన బడ్జెట్ కి, వస్తున్న కలెక్షన్స్ ని పోల్చి చూస్తే.. ఈ సినిమా సంక్రాంతి విన్నర్ రేస్ లో 'గేమ్ ఛేంజర్' పూర్తిగా వెనకపడిపోయిందని చెప్పాలి. (Game Changer)   హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎమోషనల్ టచ్ తో స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా 'డాకు మహారాజ్' తెరకెక్కింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ దానిని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజువల్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులకు ఇది థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తోంది. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబడుతూ 'డాకు మహారాజ్' చిత్రం దూసుకుపోతోంది. (Daaku Maharaaj)   'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం, పరవాలేదు అనే టాక్ ని సొంతం చేసుకుంది. కథాకథనాలు రొటీన్ గా ఉన్నప్పటికీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే, కాసేపు నవ్వుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా, ఆ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. (Sankranthiki Vasthunam)   మొత్తానికి ఈ సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల టాక్ ని బట్టి చూస్తే.. బాలయ్య సంక్రాంతి విన్నర్ కాగా, వెంకీ మామ సంక్రాంతి రన్నర్ అని చెప్పవచ్చు.  
  సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.   'డాకు మహారాజ్' సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.22.31 కోట్ల షేర్ ని రాబట్టగా, వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇక రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. నైజాంలో రూ.2.44 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1.72 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.4.35 కోట్ల షేర్ తో.. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.51 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.30.82 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసే అవకాశముంది. అదే జరిగితే బాలకృష్ణ కెరీర్ లో రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా 'డాకు మహారాజ్' నిలవనుంది.  
ఒక స్టార్‌ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని వందల మంది కృషి చెయ్యాల్సి ఉంటుంది. అందరి కంటే ఎక్కువగా హీరో శ్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దర్శకుడు తనకు సంతృప్తికరంగా ఔట్‌పుట్‌ రావడం కోసం కష్టపడతారు. అన్నింటినీ మించి నిర్మాత కొన్ని వందల కోట్ల రూపాయలను సినిమా కోసం వెచ్చించి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అలా విడుదలైన సినిమా మొదటిరోజు మార్నింగ్‌ షో సమయానికే ఇంటర్నెట్‌లో దర్శనమిస్తే ఆ సినిమా యూనిట్‌ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్‌ ఛేంజర్‌’ పరిస్థితి అదేనని తెలుస్తోంది. స్టార్‌ హీరోల సినిమాలు విడుదలైన రోజు సాయంత్రం లేదా రాత్రికి నెట్‌లో దర్శనమివ్వడం ఇప్పటివరకు చూశాం. కానీ, గేమ్‌ ఛేంజర్‌ మాత్రం మార్నింగ్‌ షో వేసే సమయానికే నెట్‌లో హిందీ వెర్షన్‌ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా లాంగ్వేజెస్‌ ప్రింట్లు కూడా అందుబాటులోకి వచ్చాయట.  ‘గేమ్‌ ఛేంజర్‌’ పైరసీ ప్రింట్‌ లీక్‌ వెనుక 45 సభ్యుల ముఠా ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాతలతోపాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను సోషల్‌ మీడియా ద్వారా, వాట్సాప్‌ ద్వారా ఆ ముఠా సభ్యులు బెదిరించారని తెలుస్తోంది. వారు డిమాండ్‌ చేసిన అమౌంట్‌ ఇవ్వకపోతే పైరసీ ప్రింట్‌ లీక్‌ చేస్తామని చెప్పినట్టు సమాచారం. ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలోని కీలక ట్విస్టులను సోషల్‌ మీడియా అకౌంట్‌లలో షేర్‌ చేశారు. ఇక విడుదలైన తర్వాత హోచ్‌డి ప్రింట్‌ లీక్‌ చేయడమే కాదు... టెలిగ్రామ్‌, సోషల్‌ మీడియాలో ఆడియన్స్‌ అందరికీ షేర్‌ చేశారు.  చిత్ర యూనిట్‌ని బెదిరించి, పైరసీ ప్రింట్‌ లీక్‌ చేసిన 45 మంది మీద ఆధారాలతో సహా సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆ ముఠా సభ్యులు సినిమాపై నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని, ప్రింట్‌ లీక్‌ చేశారని చిత్ర యూనిట్‌ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే సందేహాన్ని చిత్ర యూనిట్‌ వెలిబుచ్చుతోందని సమాచారం. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 
‘డాకు మహారాజ్‌’ విడుదలైన మొదటి రోజు నుంచే తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండడమే ఈ ఘనవిజయానికి కారణం అంటున్నారు అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణతో ఈ సంక్రాంతి బాలయ్యదే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాబి కోల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘డాకు మహారాజ్‌’తో బాలకృష్ణ నట విశ్వరూపం మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా విదేశాల్లోనూ తన స్టామినా ఏమిటో ప్రూవ్‌ చేస్తోంది. ముఖ్యంగా యు.ఎస్‌. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది.  ఈ సినిమాకి యు.ఎస్‌.లో చేసిన ప్రమోషన్స్‌ కలెక్షన్లు భారీగా రావడానికి ఉపయోగపడ్డాయి. ప్రీమియర్స్‌ బుకింగ్స్‌తోనే మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఇటీవలికాలంలో బాలయ్యకు యు.ఎస్‌.లో మంచి మార్కెట్‌ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు డాకు మహారాజ్‌ దాన్ని కన్‌ఫర్మ్‌ చేసింది. ఇప్పటికే 1 మిలియన్‌ గ్రాస్‌ను క్రాస్‌ చేసింది. సినిమాలోని మాస్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పిస్తున్నాయి. యు.ఎస్‌.లో బాక్సాఫీస్‌ ఇప్పుడు మరింత స్ట్రాంగ్‌ మారిందని తెలుస్తోంది. కలెక్షన్లపరంగా డాకు మహారాజ్‌ యు.ఎస్‌. నంబర్స్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మాస్‌, యూత్‌ ఆడియన్సే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా థియేటర్స్‌కి తరలి వస్తుండడంతో కలెక్షన్‌ రేంజ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.  డాకు మహారాజ్‌ కథ, కథనం, డైరెక్టర్‌ బాబీ టేకింగ్‌, డిఫరెంట్‌ లొకేషన్స్‌ ప్రేక్షకుల్ని బాగా థ్రిల్‌ చేస్తున్నాయి. దానికితోడు థమన్‌ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న టాక్‌ చూస్తుంటే ఈ సంక్రాంతి విన్నర్‌ బాలకృష్ణే అనిపిస్తోంది. మరి మిగతా సినిమాల ధాటిని కూడా తట్టుకొని బాలయ్య నిలబడగలడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనే విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో సాధించిన కలెక్షన్స్‌ చూస్తుంటే బాలకృష్ణ మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ & సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం:1లో వేణుబాబు నిర్మాతగా ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తూ దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేస్తూ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ అండగా త్వరలోనే ఇతర సినిమా అప్డేట్లతో ప్రేక్షకుల ముందుకు  రానుంది.  ఈ సందర్భంగా చిత్ర నటి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ... "నేను ఈ నిర్మాణ సంస్థలో పనిచేయడం మొదటిసారి. జీవి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడైన జీవి గారు మొదటిసారి దర్శకత్వం చేస్తున్నారు. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది. అందుకుగాను ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున్న తోటి నటీనటులతో, ఈ చిత్ర బృందంతో పనిచేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.  నటి ఆదర్శ్ పందిరి మాట్లాడుతూ... "మేము కొత్త కామెడీతో ముఖ్యంగా లింగ బేధాల పై మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాము. ఈ సినిమాలో టెక్నాలజీ అనేది కీలకపాత్ర పోషించబోతుంది. త్వరలోనే థియేటర్లో కలుసుకుందాం" అన్నారు.  నటుడు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ... "మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నాము. ఈ చిత్ర కథని నమ్మి సినిమా చేస్తున్నాము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. త్వరలోనే ఈ సినిమా ద్వారా థియేటర్లలో కలుద్దాము" అన్నారు.  నటి పూజిత పుందిర్ మాట్లాడుతూ... "జెండర్ సమానత్వంపై కామెడీ రూపంలో వస్తున్న ఈ చిత్రం మంచి కామెడీతో ఉండబోతుంది. జీవి గారి దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు.  చిత్ర దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ... "స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్ పై మేము తొలి సినిమా చేస్తున్నాము. అశ్రిత్, ఆదర్శ్, ప్రియాంక సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా 15 రోజులపాటు షూటింగ్ చేస్తూ నేటికి సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నాము. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వం పై ఉండబోతున్న ఈ చిత్రం 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ నచ్చుతుందని, అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను" అన్నారు. సినిమాటోగ్రాఫర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ... "స్ప్లాష్ కలర్ మీడియా బ్యానర్ పై నేను తొలిసారిగా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాను. చిత్ర బంధం అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను" అన్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
విద్యార్థులు ఆటలు, పాటలు, విహారయాత్రలకు స్వస్తి చెప్పి చదువుల తల్లి చెంతకు చేరే సమయం ఆసన్నమైంది. పాఠశాల చదువులు ముగించి కళాశాలకు పోయే విద్యార్థులు కొందరైతే, కళాశాల చదువులు పూర్తిచేసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేవారు మరికొందరు. అలాగే విశ్వవిద్యాలయాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకెగసే విద్యార్థులు మరెందరో! గదులు మారి తరగతులు పెరిగినా,  గతులు వేరై ఘనకార్యాలు  సాధించినా… మేధావులు సృష్టించిన నేటి మన విద్యావిధానం మహాత్ముల్ని సృజించడంలో  విఫలమవుతుంది. వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా వివేకపథంలో వెనుకంజ వేస్తుంది. నేటి సమాజంలో సత్యధర్మాలు, సేవా త్యాగాల్లాంటి... విలువలు మానవతా గగనకుసుమా లయ్యాయి. సంఖ్యలకే ప్రాధాన్యతనిచ్చే విద్యతోపాటు నడవడికలో నాణ్యతను పెంచే విద్య చాలా అవసరం. అక్షరజ్ఞానంతో పాటు విజ్ఞానం తోడైనప్పుడే మానవతా విలువలు భాసిల్లుతాయి. చదువుతో పాటు సంస్కారాన్ని పెంచే విద్యే నిజమైన విద్య. బుద్ధిని వృద్ధిచేసే విద్యే నేటి సమాజంలోని అన్ని రుగ్మతలకు సరైన ఔషధం. విద్యకు భూషణం వినయం... విద్యార్థి గురువు వద్ద ఎలా అణకువతో ప్రవర్తించాలో శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో బోధించాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః ॥  శిష్యుడు గురువు సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో గురువుకు సపర్యలు చేస్తూ తన సందేహ నివృత్తి చేసుకోవాలి. శిష్యుని వినయ విధేయతలకు గురువు ప్రీతి చెంది శిష్యునికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. పెద్దలయందు, గురువులయందు గౌరవమర్యాదలు లేనివాడు ఎన్నటికీ జీవితంలో ఉన్నతి పొందలేడు. అహంకారి అయిన దుర్యోధనునితో 'నువ్వు గురువులకు, పెద్దలకు వినయంతో సేవ చేయడం నేర్చుకో దాని వల్ల నీలో సత్ప్రవర్తన వృద్ధి చెందుతుంది' అని శ్రీకృష్ణుడు అంటాడు. విద్యార్థి గ్రంథాల ద్వారా నేర్చుకొనే దాని కన్నా గురువు సాంగత్యంలో నేర్చుకొనే విద్య ఎక్కువ ప్రయోజనాన్నిస్తుంది. ఆచరించేవాడే ఆచార్యుడు...  ఆచార్య అంటే సంగ్రహించే వాడు. శాస్త్ర సారాన్ని సంగ్రహించి, విద్యార్థులకు బోధించేవాడు ఆచార్యుడు అని అర్థం. తాను సంగ్రహించిన వేదసారాన్ని శిష్యులకు ఆచరణలో చూపించిన వాడే ‘ఆచార్యుడు' అని మరో అర్థం. ఆచరణాత్మక బోధ నలతో ఆదర్శజీవితాన్ని గడిపి, శిష్యుల్లో మానవతా విలువల్ని పెంపొందించే వాడే నిజమైన ఆచార్యుడు. విలువల్ని పెంచే విద్య...  నేడు మనకు కావలసిన విద్య ఎలా ఉండాలో స్వామి వివేకానంద మాటల్లో…  We want that education by which character is formed, strength of mind is increased, the intellect is expanded... శీలనిర్మాణం, మనోబలం, విశాలబుద్ధి ఈ మూడు సుగుణాల్ని పెంపొందించే విద్య నేడు మనకు అవసరం. స్వామి వివేకానంద నిర్వచించిన విద్యలో ఉన్న మూడు లక్షణాలను విద్యార్థి అలవరచుకోవాలంటే తైత్తిరీయో పనిషత్తులో గురువు శిష్యులకిచ్చిన సూచనల్ని ఆచరణాత్మకం చెయ్యాలి.                                          ◆నిశ్శబ్ద.
  ప్రపంచం మొత్తంలో యువకులు ఎక్కువమంది ఉన్న దేశం గురించి ప్రస్తావన వస్తే అందులో  మన భారతదేశమే  మొదటిగా నిలుస్తుంది. ఏ దేశ అభివృద్ధికైనా అనుభవం ఉన్న పెద్దవాళ్లతో పాటూ, పనిచేసే యువశక్తి  ఎంతో  అవసరం అని చెప్పాల్సిన అవసరంలేదు. దేశ  యువతంతా క్రమశిక్షణగా ఉండి వారి శక్తి సామర్ధ్యాలు సరిగా వినియోగిస్తే  ఆ దేశం   ప్రపంచ చరిత్రలోనే గొప్పదిగా నిలవగలుగుతుంది. ఈ విషయాన్ని వందేళ్ల కిందటే అర్థం చేసుకుని యువతకు తన మాటలతో దేశ భక్తి నింపడానికి, యువతే నా దేశ భవిష్యత్తు అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వివేకానందుడు. స్వామి వివేకానందగా పేరు పొందిన నరేంద్రుడు.. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశాడు.  ప్రపంచాన్ని తన మాటలతో,  తన దేశ భక్తితో.. ముఖ్యంగా హిందుత్వం, ఆధ్యాత్మిక భావనతో ప్రభావితం చేసి ప్రపంచం మొత్తం భారతదేశం వేపు తల తిప్పి చూసేలా చేశాడు. ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం వందేళ్ళ తర్వాత కూడా ఆచరించదగినవి.  మంచి వక్త, తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన స్వామి వివేకానంద  పుట్టినరోజును ప్రతీ సంవత్సరం  జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద.. స్వామి వివేకానందుడు 1863 జనవరి 12న కోల్‌కతలో జన్మించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్రను యువతకు గుర్తుచేయడానికి ,  యువత శక్తిని గుర్తుచేయడానికి ఆయన పిలుపు ఇచ్చిన విధానం ఆయనను ప్రసిద్ధుడిగా మార్చింది.  ఈయన రామకృష్ణ పరమహంస బోధనలకు ప్రభావితమై.. సన్మానం స్వీకరించారు.  ధార్మిక బోధకుడిగా, తత్వవేత్తగా,  వేదాలను ఉపనిషత్తులను అవపోషణ పట్టిన వ్యక్తిగా, యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా.. ఇలా చాలా రకాలుగా ప్రసిద్ధి చెందాడు.   1893లో చికాగోలో నిర్వహించిన  ప్రపంచ సర్వమత మహాసభలలో  ఆయన ఇచ్చిన  ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రసంగంలో ఆయన యువశక్తి, విశ్వ సోదర భావం, ఆత్మాన్వేషణలు అనేవి సామాజిక మార్పుకు  ప్రాథమిక సూత్రాలుగా చెప్పారు. స్వామి వివేకానందుడు జాతీయవాదంపై ధృడ విశ్వాసం కలిగి, దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉందని నమ్మారు. ఎటువంటి నీచస్థితిలో ఉన్నవారికైనా గొప్ప ఆలోచనలను కలిగేలా చేయగలమనే ఆయన  నమ్మారు.   "శక్తి నీలోనే  ఉందనే నమ్మకంతో ముందుకు సాగితే, నువ్వు అద్భుతాలను సృష్టించగలవు.", "నువ్వు మేల్కొని , ఉప్పొంగు, కానీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకు",  "యువతే దేశ అభివృద్ధికి పునాదులు." అనే మాటలతో..  తన ప్రసంగాలతో దేశ యువతని, ప్రజలని  నిరంతరం ప్రోత్సహించేవారు. 1984వ సంవత్సరంలో స్వామి వివేకానందుడి ఆలోచనలను, విలువలను వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వం జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది.   1985 నుంచి  దేశవ్యాప్తంగా  జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వామి వివేకానందుడి తత్వచింతనలు, ఆదర్శాలు భారత యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని ప్రభుత్వం భావించింది. యువజన దినోత్సవం- యువతకి పిలుపు.... స్వామి వివేకానందుడి బోధనలు యువతకు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగా,  సమష్టిగా అభివృద్ధి చెందడానికి విద్య అనేది ముఖ్యమైన సాధనమని ఆయన విశ్వసించారు. యువతలో ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక  చింతన అభివృద్ధి చేయటం, అందరూ  దేశభక్తి కలిగి ఉండి, మన సంస్కృతి పట్ల గర్వపడాలనే సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావటంలో  యువత పాత్ర  అవసరమని, ఆ దిశగా యువత తమ నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు ఉపయోగించాలనే పిలుపునిస్తుంది.                                  *రూపశ్రీ.
  మనతో పాటూ ఉన్న మనుషులు   ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి  అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి,  అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి  ఒక అవకాశం ఇస్తుంది. మానవ అక్రమ రవాణా అంటే..... మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో  చేసి తర్వాత వారిని బలవంతంగా  వ్యభిచారం చేయించటానికో, బలవంతపు  వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా  ఉపయోగించుకుంటారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా  సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది.. మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి,  ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన  ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత  ఈ సమస్య ప్రభావం  ప్రపంచమంతటా ఉందని   గుర్తించిన  దేశాలన్నీ  దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి. భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు.. భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని  మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు.   పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట  పురుషులు, అబ్బాయిలను  రవాణా చేసి  కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు.  వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా  గురవుతుంటారు.   ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు.   అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం  ఉపయోగించుకుంటారు.  భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్,  యూరప్ దేశాలకు పనివారిగా,  తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు  కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు  కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో  అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.   ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా  ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా  కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది. మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...   నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి?  అనే వాటి గురించి అందరికీ తెలిసేలా  వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు.   ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి,  దానికి సంబంధించిన  పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ  అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి,  ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి. రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి.  అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల  మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.                                        *రూపశ్రీ.
సంక్రాంతి భారతీయులు జురుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ప్రముఖంగా రైతుల పండుగ.  క్రాంతి అంటే  స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. సంక్రాంతి అంటే.. కొత్త క్రాంతి.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో వెలుగులీనుతాడు.  క్రమంగా తన వెలుగును పెంచుకుంటూ వెళతారు. సూర్యుడిలానే ప్రజలు కూడా కొత్త కాంతితో తమ జీవితాలలో ముందుకు సాగాలన్నదే సంక్రాంతి సందేశం.  సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.  సూర్యుడి కాంతి ద్వారా భూమి వెలుగులో సంచరిస్తుంది.  ఉత్తరాయణం ప్రారంభం అయితే సూర్యుడి గమనం వేగం అవుతుంది. సూర్యుడి గమనం వల్లనే  ఈ ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడి గమనం లేకపోతే ఈ ప్రపంచం అంధకారం అవుతుంది.  అందుకే సూర్యుడి విలువను, సూర్య కాంతి విలువను అర్థం చేసుకోవాలి. సంక్రాంతి అంటే 'పరివర్తనం' అని అర్థం. మకర సంక్రాంతి రోజున  'మహా-స్నాన-యోగం' జరుగుతుందట. నదులు,  సరస్సులలో ముఖ్యంగా పవిత్ర నదుల సంగమం వద్ద స్నానం చేయడం చాలా మంచిది. మకర సంక్రాంతి పంటల పండుగ కూడా. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నువ్వులతో చేసిన సాంప్రదాయ స్వీట్లు సంక్రాంతి ప్రత్యేకం.  పొంగలి కూడా సంక్రాంతి ప్రత్యేక వంటకం. దీని పేరు మీదనే ఈ పండుగకు పొంగల్ అనే పేరు కూడా వచ్చింది. సంక్రాంతి పండుగ పంటల పండుగ.  పంటలు పండాలంటే ఆ సూర్య రశ్మి చాలా అవసరం.  ఈ కారణంగానే రైతులతో పాటు దేశం యావత్తూ సూర్యుజిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరాధిస్తుంది.  ఉత్తరాయం ప్రారంభానికి సూచనగా, సూర్యుడి గమనానికి ప్రాధాన్యత ఇస్తూ రథం ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.  అది కూడా నీరు పారే ప్రాంతాలు, నదులలో అర్ఘ్యం సమర్పించడం మంచిది.   ఏ నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తారో.. ఆ నదీ దేవతకు ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి పండుగ రోజున సన్యాసులు, పేదలకు దానం చేయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజు వండే వంటల్లో ఉల్లి వెల్లుల్లిపాయలను అస్సలు తినకూడదు.                               *రూపశ్రీ.  
  చలికాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. చలిగాలులు, మంచు కారణంగా తొందరగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఇక ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారు చలికాలం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడతారు. కొందరికి చలి కారణంగా ఛాతీ పట్టేయడం,  ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. చలి గాలులు చెవిలోకి వెళ్లి తలనొప్పి కూడా వచ్చేలా చేస్తుంది.   ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా,   ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు పాలు.. పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ సమస్యల  నివారణకు ఉపయోగిస్తున్నారు.  పసుపులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొద్దిగా పసుపును పాలలో వేసి మరిగించాలి.  ఇందులో రుచి కోసం అల్లం, మిరియాలు కూడా వేసుకోవచ్చు.  ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జలుబు కారణంగా ఏర్పడిన ముక్కుల రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హనీ, జింజర్ టీ.. అల్లం, తేనె రెండూ ఆయుర్వేదంలో మంచి ఔషధాలు.  రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, తేనె పని చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించాలి.  మరిగిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుకు మంచి  ఉపశమనం ఇస్తాయి. అల్లం శ్వాస కోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పట్టడం చాలా మంచి టిప్.  జలుబు, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, తల నొప్పి, తల భారం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించాలి.  బాగా వేడెక్కిన నీటిలో కొన్ని చుక్కల నీలగిరి తైలం వేసుకుని నీటి ఆవిరి పట్టాలి. ఇది తల భారం తగ్గిస్తుంది,  ముక్కల రద్దీని తగ్గిస్తుంది. శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. పుక్కిలించడం.. గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం కూడా మంచి మార్గం.  గోరు వెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేయాలి.  ఈ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు గొంతును క్లీన్ చేసేలా పుక్కిలించాలి.  ఇది నోట్లో, గొంతులో ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. నాసల్ డ్రాప్స్.. ఆయుర్వేదంలో నాసల్ డ్రాప్స్ ఉన్నాయి.   దీన్ని అను తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకోవడం వల్ల ముక్కుల రద్దీ తగ్గుతుంది.  సాధారణంగా ఏ టిప్ వాడినా ముక్కులు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యి తరువాత మళ్లీ రద్దీ అవుతాయి. కానీ ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. హెర్బల్ టీ..   నల్ల మిరియాలు, అతి మధురం,  తులసి వంటి ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీని తయారు చేసుకుని ఈ చలికాలంలో తీసుకుంటే భలే పనిచేస్తుంది.  ఇది దగ్గు, జలుబు,  రద్దీగా ఉన్న ముక్కులను తెరవడం, దగ్గు, కఫం సమస్యను తగ్గించడం చేస్తుంది.                                                   *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో విటమిన్-సి ముఖ్యమైనది.  విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.  జబ్బు పడినప్పుడు విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు తీసుకుంటే చాలా తొందరగా కోలుకుంటారు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  సాధారణంగా విటమిన్-సి లోపం రావడం అరుదే అయినప్పటికీ..  ఈ లోపం ఏమాత్రం ఉన్నా ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. విటమిన్-సి లోపం తొలగాలన్నా,  రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ కింది సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి. బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్-సి మోతాదు ఎక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం,  ఫైబర్, పొటాషియం, విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి.. ఉసిరికాయలు విటమిన్-సి కి చాలా మంచి మూలం.  నిమ్మకాయలో ఉండే విటమిన్-సి కంటే 10 రెట్లు విటమిన్-సి  ఉసిరికాయలలో ఉంటుంది.  ఉసిరికాయను పొడి రూపంలో తీసుకున్నా,  జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అందుబాటులో ఉన్నప్పుడు నేరుగా రోజూ ఒక కాయను పచ్చిగానే తిన్నా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.   రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చర్మం మెరిచేలా చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తొలగిస్తుంది. నారింజ.. నారింజ సిట్రస్ పండ్లలో ప్రముఖమైనది. నారింజను తినడం వల్ల  రోగనిరోధక శక్తి అద్బుతంగా పెరుగుతుంది.  ప్రతిరోజూ ఒక నారింజ పండు తింటుంటే వృద్దాప్యం త్వరగా రాదట.  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందట.  తెల్ల జుట్టు సమస్య అస్సలే ఉండదని ఆహార నిపుణులు అంటున్నారు.  నారింజలో పైబర్,  విటమిన్-ఎ, పొటాషియం, విటమిన్-సి ఉంటాయి.    ఇన్పెక్షన్ ప్రమాదాలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం.. క్యాప్సికంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ఇందులో విటమిన్-సి,  విటమిన్-ఎ,  బీటా కెరోటిన్ ఉంటాయి.  దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్-సి లోపం తొలగిపోతుంది.  దీన్ని సలాడ్ లలోనూ,  వెజిటబుల్ జ్యూస్ లోనూ జోడించుకోవచ్చు. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ఇధి మాత్రమే కాకుండా ఇది శరీరం డిటాక్స్ కావడంలో సహాయపడుతుంది. అంటే.. శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలు, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.                                      *రూపశ్రీ