LATEST NEWS
  తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.  భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ  తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొన్నాది. గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల  జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని అధికారులు తెలిపారు. ఇక వడదెబ్బ కారణంగా ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు మరణించారు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భయపెట్టగా.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. మసాలా ఫుడ్స్ కాకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు పేర్కొన్నారు.  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు. ఈ విషయాలన్నీ పదేళ్ల పాటు ఆ పార్టీలో పని చేసిన బయటకు వచ్చిన ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టిసుభాష్ చెప్పారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉయ్యూరు మండలం గండిగుంటగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాసంశెట్టి సుభాష్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం ఓ నలుగురితో చీకటి గదిలో కూర్చుని రాష్ట్రాన్ని పాలించిన జగన్.. పార్టీలో తనకు భజన చేసే వారూ, సాష్టాంగ దండప్రమాణాలు చేసే వారినే చేరదీసి పదవులిచ్చారని సుభాష్ చెప్పారు. పదేళ్ల పాటు తాను వైసీపీలో పని చేశాననీ, తనకు ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ఆ పార్టీ నేతలు వాగ్దానం చేశారనీ చెప్పిన వాసంశెట్టి సుభాష్.. తానా పదవి వద్దన్నాననీ, తీసుకుని ఉంటే జనం తనను ఛీకొట్టి ఉండేవారనీ చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిన మిథున్ రెడ్డి జగన్ కు సాస్ఠింగ దండప్రమాణం చేస్తూ పని సులువుగా అవుతుందని సూచించినట్లు చెప్పారు. కానీ అందుకు తాను నిరాకరించానన్నారు. అసలు వైసీపీ హయాంలో  ఒక్క తెలుగుదేశం నేతలు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు కూడా వేధింపులకు గురయ్యారని వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పట్ల జగన్ కోపానికి ఆయన జగన్ ఎదుట కాలు మీద కాలేసుకుని కూర్చోవడమూ, సర్ అంటూ సంభోదించకపోవడమే కారణమని వాసంశెట్టి అన్నారు. అంతెందుకు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడిన సొంత చెల్లిని కూడా అధికారం దక్కిన తరువాత పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. జగన్ లక్షల కోట్లు సంపాదించారనీ, అయినా ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లారనీ పేర్కొన్నారు. 
    ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. షర్బత్​ జిహాద్​ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్‌పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.  రామ్​దేవ్​ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్​కు వ్యతిరేకంగా హమ్​దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.  పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు పెరుగుతుంది" అని అన్నారు. కాగా.. బాబా రాందేవ్ హమ్‌దర్ద్ పేరుని ప్రస్తావించనప్పటికీ దాన్ని ఉద్దేశించే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే హమ్ దర్డ్ కంపెనీ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. కాగా..రాందేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త‌క్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా నుంచి ఆ వీడియోను తొల‌గించేలా ఆదేశించాల‌ని తెలిపింది. హ‌మ్‌దర్ద్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్ప‌త్తిని అగౌర‌వ‌ప‌ర‌చ‌డం కంటే తీవ్ర‌మైంద‌ని, అవి ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కిందికే వ‌స్తాయ‌ని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు... "బాబా రామ్‌దేవ్ వ్యాఖ్య‌లు కోర్టు అంత‌రాత్మ‌ను షాక్‌కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం కరెక్ట్ కాదు అని పేర్కొన్నాది.
    దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. తెలుగు అభ్యర్థి సాయి శివాణికి 11వ ర్యాంక్ వచ్చింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష 42,560 మంది రాశారు. వారిలో సుమారు 500 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో నుంచి 100 మంది వరకు ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ అయ్యారు.
ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది.  ఈ కేసులో  త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ  నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది.  వైసీపీ మాజీ ఎంపీ,  విజయసాయి రెడ్డి  ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే  కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంంబంధించినంత వరకూ విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి అసలీ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు.  ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో నంబర్ 2గా.. ఒకానొక దశలో డిఫాక్టో సీఎంగా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో, వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయమంటూ ఉండే అవకాశం లేదు.  కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయటపెడతున్న, పెడతానంటున్న ప్రతి విషయమూ సంచలనాలను రేకెత్తిస్తుందనడంలో సందేహానికి తావు లేదు.  గత రెండు మూడు రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలూ చూస్తుంటే.. విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జగన్‌ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్టయ్యారు. గంటల వ్యవధిలోనే  ఈ ఇద్దరూ అరెస్టు కావడం కాకతాళీయమని భావించలేము. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే..ఒకరి వెంట ఒకరుగా   వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొం టున్న వారూ అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణను ఎదుర్కొనే అవకాశం ుందన్న అంశపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.    ఇంత జరిగినా, జరుగుతున్నా.. వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలూ అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావుడి చేయడం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్నే చూపుతున్నాయనీ, వైసీనీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయనీ పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీమీద గట్గిగానే పడిందనడానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమే తార్కానమంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
నితిన్(Nithiin)గత నెల మార్చి 28 న రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో నితిన్ కి భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల రాబిన్ హుడ్ కి  దర్శకుడు కావడం, అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  నిర్మించడంతో ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.  కానీ ఎవరు ఊహించని విధంగా బాక్స్ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.     దీంతో నితిన్ అప్ కమింగ్ మూవీ 'తమ్ముడు'(Thammudu)పైనే వాళ్ల ఆశలన్నీ ఉన్నాయి. ఇప్పటికే 'తమ్ముడు' టైటిల్ తో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)భారీ హిట్ ని అందుకొని ఉన్నాడు. 1999 జులై 15 న రిలీజైన ఈ మూవీ పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్ అయిన నితిన్  కూడా అదే టైటిల్ తో వస్తుండటంతో  తమ్ముడి పై అందరిలోను పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. దిల్ రాజు(Dil Raju)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కించి సక్సెస్ ని అందుకున్న వేణుశ్రీరామ్ (Venu Sriram)దర్శకుడు. నితిన్ సరసన సప్తమిగౌడ (Sapthami Gowda)హీరోయిన్ గా చేస్తుండగా సీనియర్ హీరోయిన్ లయ(Laya)కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ జులై 4 న థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.  క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్  ఆర్చరీ ఆటగాడిగా సందడి చేస్తుండగా అక్కా, తమ్ముడికి సంబంధించిన అనుబంధాల నేపథ్యంలో కథనాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే రిలీజైన నితిన్ లుక్ తో పాటు ప్రచార చిత్రం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాధ్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.    
ప్రస్తుతం తెలుగు సినిమా తీరు తెన్నులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. తెలుగు హీరోలు భారీ బడ్జెట్‌ సినిమాలు, భారీ యాక్షన్‌ సినిమాల వైపు పరుగులు పెడుతున్నారు. వారికి నచ్చే సినిమాలు తప్ప ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే టాప్‌ హీరోలంతా టాప్‌ డైరెక్టర్లనే నమ్ముకుంటున్నారు. అడపా దడపా కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. అయితే ఆ సినిమాలు కూడా యాక్షన్‌ ఓరియంటెడ్‌గానే ఉంటున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్ల దగ్గర ప్రేక్షకుల మనసుకు హత్తుకునే కథలు తప్పకుండా ఉంటాయి. అయితే మన హీరోలు వాటి జోలికి వెళ్ళకుండా.. తమను యాక్షన్‌ హీరోగా ఎలివేట్‌ చేసే కథలతోనే ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మన హీరోలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నది వాస్తవం. ఇదిలా ఉంటే.. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ టాలెంట్‌ ఏమిటో ప్రూవ్‌ చేసుకుంటున్న డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అలా వచ్చిన సినిమాల్లో ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘బలగం’ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలూ ఎవరూ ఊహించని కథలతో వచ్చి ఘన విజయాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించాయి.  ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రాన్ని రూపొందించిన వెంకటేష్‌ మహా.. దర్శకుడే కాదు, నటుడు, రచయిత, నిర్మాత కూడా. ఇప్పటికే కొన్ని వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ తర్వాత సత్యదేవ్‌ హీరోగా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఓ మలయాళ చిత్రానికి రీమేక్‌. కరోనా టైమ్‌లో ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌పై రిలీజ్‌ అయింది. ఈ సినిమా తర్వాత 2021లో డా.రాజశేఖర్‌తో ‘మర్మాణువు’ అనే సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ సినిమా డైరెక్ట్‌ చేస్తున్నారు వెంకటేష్‌ మహా. ఈ గ్యాప్‌లో మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌ అనే వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేశారు. అలాగే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే కొన్ని సినిమాల్లో నటించారు కూడా. తాజాగా ఇప్పుడు మరో విభిన్న కథాంశంతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఎనౌన్స్‌మెంట్లు, హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశారని సమాచారం. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 25 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్‌ మహా మీద ఉన్న నమ్మకంతోనే సత్యదేవ్‌పై నిర్మాతలు అంత పెట్టుబడి పెడుతున్నారట. ఈ విషయంలో నిర్మాతలు రిస్క్‌ చేస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ఇటీవల సత్యదేవ్‌ హీరోగా జీబ్రా అనే చిత్రం రిలీజ్‌ అయింది. అతని కెరీర్‌లో ఇదే ఎక్కువ బడ్జెట్‌తో తీసిన సినిమా. ఇప్పుడు వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్‌పరంగా జీబ్రాను మించిన సినిమా అవుతుంది. ఈ సినిమాకి ‘రావు బహద్దూర్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. టైటిల్‌ని బట్టి చూస్తే ఇది బ్రిటీష్‌ కాలం నాటి కథ అని అర్థమవుతుంది. వెంకటేష్‌ మహా గత చిత్రాలను బట్టి చూస్తే ఇది కూడా తప్పకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా అనిపిస్తుంది. షూటింగ్‌ అంతా సైలెంట్‌గా పూర్తి చేసి ఆ తర్వాత పబ్లిసిటీ గురించి ఆలోచించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కమర్షియల్‌ సినిమాలంటే వెంకటేష్‌ మహాకి ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు ఆమధ్య అతను చేసిన కామెంట్స్‌ వల్ల తెలిసింది. మరి మొదటిసారి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రావు బహద్దూర్‌’ చిత్రాన్ని ఎలాంటి కమర్షియల్‌ సినిమాగా తియ్యబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. 
Aamir Khan delivered a huge blockbuster with Dangal and it became biggest grosser ever in Indian Cinema. The movie performed huge at China but Baahubali 2, Pushpa 2 remain biggest grossers in Indian markets. He could not deliver blockbusters with his next films - Thugs of Hindostan and Lal Singh Chaddha.  But his next films have huge anticipation and the actor is working on Sitaare Zameen Par, an ideological sequel for Taare Zameen Par and remake of Spanish film, Champeons. In a recent interview, he revealed his plans to start Mahabharat series of films and he stated that the shoot will start this year.  He also stated that the films will be shot at a stretch like Lord of the Rings and how many films will be made will be announced with cast. He also stated that each part will have different directors and scripting, pre-viz works have been going on.  Baahubali director SS Rajamouli did announce that Mahabharat is his life-time dream and he will spend at least 10 years to make them as he cannot imagine making the entire story in one film. Well, Aamir Khan is ready to take the next step to make this film but Rajamouli needs to complete SSRMB, with Mahesh Babu, first.  Also, several reports suggest that he is looking to collaborate with Hollywood studios going forward. When will he start the pre-production works and when will he bring his vision to life, we can't say, in fact, maybe he cannot too. For now though, Aamir Khan has started the race to finishing line.  Well, Indian mythological epic Mahabharat based TV serials have been telecast on Indian Television on almost daily basis. So, will these films have the X-factor to draw audiences to the theatres even if they attach such big names. Let's wait and watch. 
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల(Gutta Jwala)ప్రముఖ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal)ఏప్రిల్ 22 ,2021 న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రీసెంట్ గా విష్ణు విశాల్ ఎక్స్  వేదికగా తాను తండ్రి అయినట్టుగా పోస్ట్ చేసాడు. మాకు ఆడపిల్ల పుట్టింది ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు ఆడపిల్ల పుట్టడం మరింత ఆనందంగా ఉంది. ఇది దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ ఆశీర్వాదం కావాలంటు ఒక  పిక్ ని కూడా షేర్ చేసాడు. దీంతో పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకి, పైగా అదే రోజు పాప పుట్టడం చాలా స్పెషల్ అంటు పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన విష్ణుకి 2010 లో తమిళ నటుడు నటరాజ్ కూతురు రజిని నటరాజ్ తో వివాహం జరిగింది. కానీ పరస్పర అభిప్రాయబేధాలు తలెత్తడంతో 2018 లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వాళ్లిదరికి ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు. ఇక గుత్తాజ్వాల, విష్ణు విశాల్ కి మాత్రం ఇదే మొదటి సంతానం.  
స్టార్ హీరో అమీర్ ఖాన్(aamir Khan)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మహాభారతాన్ని(Mahabharatam)నిర్మించాలనేది నా కల. భారతీయులుగా మన రక్తంలోనే ఈ కథ ఉంది. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో తెరకెక్కించాలి ఈ ప్రాజెక్ట్ తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే.   రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమీర్ మరోసారి 'మహాభారతం' మూవీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతు మహాభారతాన్ని నేటి తరానికి అందించాలనేది నా లక్ష్యం. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నాను. రైటింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం కాబట్టి సిరీస్ లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో మంది దర్శకులు వర్క్ చేస్తున్నారు. స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత, క్యారెక్టర్స్ కి ఎవరు సరిపోతారో వాళ్ళని ఎంపిక చేస్తాం. నేను ఇందులో  నటిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు.  భారతీయ చిత్ర పరిశ్రమతో అమీర్ ఖాన్ కి నాలుగున్నర  దశాబ్దాలపైనే అనుబంధం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా సత్తా చాటిన అమీర్, ఉత్తమాభిరుచి గల సినిమాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు సుమారు 70 చిత్రాల దాకా చేసాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయవంతమైన చిత్రాలే. ఇండియన్ చిత్ర సీమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ కూడా అమీర్ నటించిన దంగల్(Dangal)నే. భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక అవార్డ్స్ పద్మశ్రీ(Padma shri)పద్మభూషణ్(Padma bhushan)కూడా అమీర్ అందుకోవడం జరిగింది.    
స్టార్ హీరోయిన్ 'సాయిపల్లవి'(Sai Pallavi)గత ఫిబ్రవరిలో 'తండేల్'(Thandel)తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో హిందీలో 'రామాయణ' మూవీ చేస్తుంది. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించే సాయిపల్లవి 'రామాయణ'(Ramayana)లో సీతమ్మ తల్లిగా కనపడుతుండటంతో ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్(Ranbir Kapoor)రాముడిగా కనిపిస్తున్నాడు. సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు అవార్డులు కన్నా ప్రేక్షకుల ప్రేమని గెలుచుకోవడమే ముఖ్యం. ఒక క్యారక్టర్ ని ఎంచుకునేటప్పుడు అందులోని లోతెంత, బలమైన భావోద్వేగం ఉందా లేదా, చూసుకుంటాను. సదరు క్యారక్టర్  ద్వారా నిజాయితితో కూడిన కథని ప్రేక్షకులకి అందేలా చెయ్యాలని తపన పడుతుంటాను. ఆ విధంగా నేను అనుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే అదే గొప్ప విజయంగా భావిస్తాను. ఆ తర్వాత అవార్డులు అనేవి బోనస్. అందుకే అవార్డులకన్నా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి తొలి ప్రాధాన్యమిస్తుంటాను. ప్రస్తుతం బీకీ పింగ్ (తేనెటీగల) పెంపకం పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఈ కొత్త హాబీ ద్వారా   ప్రకృతితో మరింత కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. 2015 లో 'ప్రేమమ్' అనే మలయాళ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి పల్లవి ఇప్పటి వరకు తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో కలిపి సుమారు 17 చిత్రాలదాకా చేసింది. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్(Film Fare Awards)తో పాటు పలు  అవార్డ్స్ గెలుచుకుంది.  
  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సుదీర్ఘ కాలం నుంచి పలు రకాల యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సాయి సూర్య, సురానా డెవలపర్స్ వంటి పలు సంస్థలకి ప్రమోటర్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండిటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసింది.    ఈ రెండు సంస్థల నుంచి యాడ్స్ కోసం మహేష్ రూ.3.4 కోట్లు పారితోషికం తీసుకున్నట్టుగా ఈడీ తమ నోటీసుల్లో పేర్కొంది. పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.    మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీతో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.  
Ram Pothineni is one of the most eligible bachelors of Telugu Cinema. He did not consider marriage till date and he never talked about his personal life out in public too. Currently, the rumors about his romantic relationship with Bhagyashri Borse are going around.  BhagyashrI Borse did post a photo that looks like she is at Ram's house. At least in the eyes of netizens, it is true. Some inside sources state that Borse took pics when their new movie team shot at his house. On the other hand, some are strongly stating that the couple are more than co-stars and they have fallen in love.  Borse did comment about her ring and clarified that she bought it and not engaged. But there are rumors still going on that Ram did find Bhagyashri highly attractive and very indepedent, which made him fall for her. On the other hand, there are suggestions that this could be a publicity tactic for their film.  As off now, nothing is really believable among the rumors and sources reports. Everything is speculative and nothing has been confirmed by any person who really knows them closely. So, it would be ideal to wait and watch for an official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
హీరోగానే కాకుండా నటుడుగాను ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ ని పోషించి,తన కంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు రానా.(Rana) బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 , రానా నాయుడు లాంటి వెబ్ సిరీస్ తో అయితే ఇండియా వైడ్ గా పేరు సంపాదించాడు. మరో పక్క  షోస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా రానా డబ్ల్యు డబ్ల్యుఈ (వరల్డ్ రెజిలింగ్ ఎంటర్ టైన్ మెంట్)  ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ లో నిర్వహించే 'రెజిల్ మేనియా' వేడుకకు హాజరయ్యాడు.  41 వ రెజిల్ మేనియా(wrestlemania)ఈ నెల 19 ,20 వ తేదీల్లో లాస్ వేగాస్ లో జరగగా, ఈ ఈవెంట్ కి  ఆహ్వానం అందుకొని సందడి చేసిన తొలి బారతీయ నటుడుగా రానా నిలిచాడు. ఈ విషయంపై రానా స్పందిస్తు ఈవెంట్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక ఆ వేడుకని తొలిసారిగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంతో పాటుగా 1993 తర్వాత లాస్ వేగాస్ వేదికగా ఆ ఈవెంట్  జరిగింది.  
Shine Tom Chacko got arrested for Drug abuse and peddling allegations by Kerala Police. The actor got bail and he did confess about using drugs before. Police have stated that they took samples from his blood and necessary tests will be conducted in coming days.  In the inquiry, he did state few people used to come to movie sets and provide them with drugs. He also stated that he did not take drugs once he got caught. He explained that he got into an altercation with a producer and hence, ran away after watching police but he did not take drugs.  Later, he even talked about actress Vincy Aloshious allegations and stated that he did not misbehave with her. Now, several news articles from Kerala are talking about Shine Tom Chacko being banned from work due to his misconduct. Vincy has already filed a complaint against him with actors' association, MAA.  Currently, the association has taken her complaint and have been closely observing his case progress. So, they will take a decision after sitting for next meeting, it seems. For now, they have asked producers who cast Shine to complete his portions faster, unofficially, it seems. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  విజయం అంత సులువుగా ఎవరినీ వరించదు. జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సొంతంగా ఎదిగి లక్షాధికారులు,  కోటిశ్వరులు అయిన వారి జీవితాలను పరిశీలిస్తే వారు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ పర్సన్స్ ను ఇతరుల కంటే భిన్నంగా ఉంచేది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణమే..  ఇంతకీ సక్సెస్ ఫుల్ పర్సన్స్ ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారంటే.. సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమకు లభించే ఖాళీ సమయాన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం ఎంచుకుంటారు.  స్నేహితులు,  కుటుంబ సభ్యులు,  ఆత్మీయులతో మాట్లాడటం చర్చలు చేయడం,  ఆలోచనాత్మకంగా మాట్లాడటం ద్వారా సక్సెస్ ఫుల్ పర్సన్స్ కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీని వల్ల వారు ఎదుగుతూనే ఉంటారు. పుస్తకాలు చదవడం,  కొత్త విషయాల గురించి అణ్వేషించడం, అధ్యయనం చేయడం,  తమకు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించడం,  గొప్ప వ్యక్తుల మాటలు, ఇంటర్వ్యూలు చదవడం, చూడటం మొదలైనవి చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిని అవసరమైన మెరకు తమ జీవితంలో వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే సక్సెస్ ఫుల్ పర్సన్స్ మాత్రం పెయింటింగ్,  సంగీతం,  గార్డెనింగ్, వంట వంటి వాటిని ఇష్టమైన అభిరుచులుగా మార్చుకుంటారు. వీటిలో సమయం గడుపుతారు.  ఇలా వారు గడిపే సమయంలో వారికి కొత్త ఆలోచనలు పుడతాయట.  మెరుగైన ప్రణాళికలకు బీజం పడుతుందట. ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్లినా దాన్ని అస్వాదించగలగరు. అందుకే యోగ,  జాగింగ్.  స్విమ్మింగ్ వంటి కార్యాచరణలతో పాటు జిమ్ చేయడం ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి తమ రోజులో బాగం చేసుకుంటారు. కళల పట్ల ఆసక్తి ఉన్నవారు,  ఏదైనా కళలో ప్రవేశం ఉన్నవారి ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి.  వీరి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది. సామాజిక విషయాల పట్ల ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.  సామాజిక కార్యకలాపాలలో భాగస్వాములు అవుతుంటారు. వ్యక్తి వేగంగా విజయం వైపు నడవడానికి ఇవి చాలా సహాయపడతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలామంది అలవాటు.   ఇది చాలా మందికి కొత్త ఆలోచనలను,  కొత్త అనుభవాలను ఇస్తుంది.  ఈ అనుభవాల నుండి కొన్ని కార్యాచరణలు రూపుదిద్దుకుంటాయి.                                                   *రూపశ్రీ.
  ఒక వ్యక్తి సానుకూలంగా ఉంటే, కష్టాలను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు డబ్బు గురించి తన అభిప్రాయాలను వివరంగా తన నీతి శాస్త్రంలో చెప్పాడు. నిజాయితీగా పనిచేసే వారికి తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని, తమ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన చెబుతారు. సంపద ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, దానిని లాక్కుంటోంది. జీవితం ఎంత కష్టంగా అనిపించినా, సంపదకు మించిన ఒక ముఖ్యమైన  విషయాన్ని చాణక్యుడు  చెబుతాడు.  ఆ ముఖ్యమైన విషయం మనిషి జీవితంలో చాలా గొప్పదని,  మనిషి ఆ ఒక్క ఆయుధంతో జీవితంలో కావలసినది సాధించుకోగలడని చెబుతాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుంటే.. జ్ఞానం కామధేనువు వంటిది.. చాణక్యుడి ప్రకారం జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడూ వెనుకాడని వ్యక్తిని దుఃఖ మేఘాలు  తాకలేవు. జ్ఞాన శక్తితో వ్యక్తి విజయ శిఖరాన్ని చేరుకోగలడు. చాణక్యుడు ధనవంతుల కంటే జ్ఞానం, మేధావిగా ఉన్నవారిని గొప్పవారిగా నిర్వచించాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. జ్ఞానాన్ని సంపాదించడం అనేది కామధేనువు ఆవు లాంటిదని, అది మానవులకు అన్ని కాలాల్లోనూ అమృతాన్ని అందిస్తుందని, అందుకే జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సంపాదించాలని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం ఎప్పుడూ వృధా కాదని అన్నాడు. అనుభవంతో పాటు జ్ఞానం ఉంటే విజయం సిద్ధిస్తుంది.. జ్ఞానం,  అనుభవం ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటుంది కానీ అతను ఆ పరిస్థితిలో జీవించినప్పుడే అతనికి అనుభవం లభిస్తుంది. ఒక వ్యక్తి తాను నేర్చుకున్న విషయాలను ఆచరించడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఒక వ్యక్తి మంచి,  చెడుల మధ్య తేడాను బాగా గుర్తించగలడు. మానవ జీవితంలో జ్ఞానం ఎంత ముఖ్యమో అనుభవం కూడా అంతే ముఖ్యం. చాణక్యుడి ప్రకారం  ఒక వ్యక్తి అతిపెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించగల గుణం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే  జ్ఞానం గురించి ఎప్పుడూ గర్వపడకూడదు. పంచుకున్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది.  దీనితో వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందుతాడు.                                      *రూపశ్రీ.
ప్రతి మనిషీ తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే  తను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో ఉన్న  స్థితి ఇంతకు క్రితం  జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదౌతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా వుంటే స్వభావం చెడ్డదౌతుంది.  ఒకవ్యక్తి ఎప్పుడూ చెడుమాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులు చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, చేతలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పని చేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి బలీయ ప్రేరకమవుతున్నది.  ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతడు చేసిన  మహత్కార్యాలను పరికించకూడదు. ప్రతి మూర్ఖుడూ ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు కావచ్చు. మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి. గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పదనం సంతరించుకొనేలా చేస్తాయి. కాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణసంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు.  మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి  భావనల విషయంలో శ్రద్ధ వహించాలి. మాటలు అప్రధానం. భావనలు సజీవాలు, అవి సుదూరాలకు పయనిస్తాయి. మన ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది.. మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. మనం చేసే ప్రతి కార్యం  సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. ఇదంతా అభ్యాసమే.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటం లేదా వదలిపెట్టటం మన చేతులలోనే ఉంది. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు.  ఒకవ్యక్తి ఎంత చెడ్డవాడైనాసరే, 'అతనిక మంచివాడు కాలేడు' అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం. అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.  మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.
చూయింగ్ గమ్ చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది.  ఏ సమయంలో అయినా సరే చూయింగ్ గమ్ ను అలా నములుతూ ఉంటారు.  దీని వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుందని,  ముఖానికి కూడా వ్యాయామం లభిస్తుందని అంటుంటారు.  క్రీడాకారులు,  ఆటగాళ్లు, డాన్స్ చేసేవారు.. ఇలా చాలామంది చూయింగ్ గమ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుని ఉంటారు. అయితే చూయింగ్ గమ్ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా అని పరిశోధనలు చేస్తే  చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చూయింగ్ గమ్ గురించి, చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే హాని  గురించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతిని కలిగించే  విషయాలు వెల్లడించారు.  వీటి గురించి తెలుసుకుంటే.. చూయింగ్ గమ్ పరిశోధనలో  సగటున ఒక గ్రాము చూయింగ్ గమ్‌కు వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని పరిశోధనలలో  కనుగొనబడింది.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సింథటిక్,  సహజ చూయింగ్ గమ్‌లలో ఒకే మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయట. అలాగే ఒకే రకమైన పాలిమర్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు చూయింగ్ గమ్ ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్‌లతో సంబంధంలో  ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ పరిశోధనలలో మైక్రోప్లాస్టిక్ బయటపడటం తెలుస్తూనే ఉంది.  వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా,  పర్యావరణంలోకి ప్రవహించే పెయింట్ ముక్కలతో ఇవి సంభవిస్తున్నాయి.  ఇవి ఆరోగ్యం పై అనేక ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. శ్వాసకోశ, హృదయనాళ ప్రభావాలు.. వాతావరణంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉండటం వల్ల  శ్వాస ద్వారా మైక్రోప్లాస్టిక్‌లను సంపర్కం చేసుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. గాలిలో తక్కువ సాంద్రత కలిగిన మైక్రోప్లాస్టిక్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల వ్యక్తి యొక్క సున్నితత్వం,  కణ లక్షణాలను బట్టి శ్వాసకోశ,  హృదయ సంబంధ వ్యాధులు వస్తాయట. జీర్ణక్రియ,  రోగనిరోధక శక్తి.. మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోని జీర్ణ,  రోగనిరోధక వ్యవస్థలతో సహా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయట. మైక్రోప్లాస్టిక్‌లు పేగు మైక్రోబయోమ్‌లో మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా ప్రయోజనకరమైన,  హానికరమైన బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం,  ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి వివిధ రకాల జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. పునరుత్పత్తి.. మైక్రోప్లాస్టిక్స్  పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది అనేక పునరుత్పత్తి లోపాలు, వంధ్యత్వం, గర్భస్రావం,  పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణమవుతుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు.  ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్,  మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే.  పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి.  ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  ప్రిజర్వేటివ్‌లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్‌లను  బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట,  గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట. బ్రెడ్ వల్ల  సమస్య ఎందుకు? బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్,  అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు. ఎవరు తినకూడదు.. డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా  'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది. బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే.. రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ  లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి,  రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయవం.  ఇది కలుషితమైతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది.  ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవన శైలి సరిగా లేకపోవడం,  ఆహారం తీసుకునే విధానం సరిగా లేకపోవడం.  ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోవడం వంటివి లివర్ పాడవడానికి కారణం అవుతాయి.  ఎక్కువ కొవ్వు పదార్థాలు,  బేకరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలేయం దెబ్బ తింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  వాటి గురించి తెలుసుకుంటే.. కాలేయం దెబ్బతిన్నప్పుడు, కాలేయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది చర్మం,  కళ్లు పసుపు రంగులోకి మారడం. అంటే తరచుగా కామెర్ల వ్యాధి రావడం.  తగ్గిపోయిన కొన్ని రోజులకే కామెర్ల వ్యాధి మళ్లీ వస్తుంటే కాలేయం పనితీరు మందగించిందని అర్థం.  దీని వల్ల కాలేయం దెబ్బ తిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నా,  లేదా కాలేయం దెబ్బ తిన్నా అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే బాగా అలసటగా కనిపిస్తుంటారు.  వీరు ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కడుపులో వాపు లేదా నొప్పి ఉన్నా కాలేయం దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కడుపులో కుడి వైపు ఎగువ భాగంలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే ఆకలి అనిపించదు.  లేదా అసలు ఆకలి వేయదు.  ఏమీ తినాలని కూడా అనిపించదు. అంతేకాదు.. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.  తరచుగా వికారం,  వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాలేయ సమస్యలు ఉన్నవారికి మల విసర్జన ద్వారా కూడా సంకేతం వస్తుంది.  మల విసర్జనకు వెళ్లినప్పుడు మలం రంగులో మార్పులు ఉంటాయి. మలం బురద నలుపు రంగులో ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు.                                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...