LATEST NEWS
  బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.
ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.  వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జన సేనలు వ్యతిరేకించాయి. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిని మాత్రమే చేర్చుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడమే కాకుండా బాలినేని కోరినట్ల ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మందీ మార్బలంతో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని భావించిన బాలినేనికి చెక్ పెట్టారు. ఒంగోలులో కాదు.. ఒక్కరుగా మంగళగిరి వచ్చి పార్టీ కండువా కప్పుకోండని తేల్చి చెప్పారు. దాంతో బాలినేని అప్పట్లో ఒక్కడుగానే మంగళగిరి వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో తన అనుచరులందరినీ జనసేన గూటికి చేర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు.  వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. ఉమ్మడి ఒంగోలు జిల్లాలో  జనసేన బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   వైసీపీలోని ఓ కీలక నేతతో  బాలినేని మంతనాలు సాగిస్తున్నారనీ, త్వరలో ఆ కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తమ అనుచరులను వైసీపీకి రాజీనామా చేసి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు.  గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు.  కానీ  పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందన్న అంచనాకు తోడు బాలినేని ప్రోత్సాహంతో  మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.  ఆయన చేరికకు  జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడు, సీనియర్ నేత,  రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదనీ,  త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా పార్టీ అధినాయకత్వం కార్యకర్తల పక్షానే నిలబడింది.  సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తల గురించి ఆలోచించేదీ, మాట్లాడేదీ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రమే. ఆ పద్ధతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భిన్నంగానే ఉంది.  పార్టీ మనుగడ, ఉనికికి కార్యకర్తలే ప్రధానమని భావిస్తూ వచ్చింది.   ఇందుకు తజా నిదర్శనం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడుకు తొలి ఆహ్వానం పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడమే. అది కూడా పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన తోట చంద్రయ్య కుటుంబానికి మహానాడుకు తొలి ఆహ్వానం అంద జేయాలని నిర్ణయించింది. ఆ ఆహ్వానం కూడా  ఏ స్థానిక నేతతోనో పంపించడం కాకుండా.. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నారు.   చంద్రయ్య ఎవరో కాదు. పార్టీలో సామాన్య కార్యకర్త. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పని చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతున్న కాలంలో వైసీపీ గూండాల చేతిలో హతమయ్యారు. చంద్రయ్య తెలుగుదేశం జెండా మోయడమే వైసీపీ గూండాలు ఆయనను హత్య చేయడానికి కారణం.  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య 2022 జనవరి 13న స్థానిక వైసీపీ నేతలు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారు. గొంతు కత్తిమీద పెట్టి జై జగన్, జై వైసీపీ అంటే వదిలేస్తామన్నా కూడా చంద్రయ్య నోటి వెంట జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న నినాదమే వచ్చింది.దీంతో వైసీపీ   మూకలు ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. చంద్రబాబు స్వయంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై, ఆయన పాడె మోశారు.   ఇప్పుడు కడపలో నిర్వహించనున్న మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పండుగకు ఆహ్వాన పత్రికలు రెడీ అయ్యాయి. మొదటి ఆహ్వాన పత్రికను పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గుండ్లపాడు గ్రామానికి వెళ్లి తన స్వహస్తాలతో తోట చంద్రయ్య కుటుంబాన్ని మహానాడుకు ఆహ్వానిస్తారు.  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమనీ, అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడటం తన కర్తవ్యమనీ లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ చెప్పడం మాటల వరకే పరిమితం కాదనీ, చేతలు కూడా అలాగే ఉంటాయనీ మరోసారి పార్టీ  కార్యకర్త కుటుంబానికి మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించడం ద్వారా రుజువు చేస్తున్నారు నారా లోకేష్.  
  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.  కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఉట్నూరులో జరిగిన ఒక సభలో మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల నిధుల కోసం మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది.  
  హైదరాబాద్ బాలనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్ధి మృతి చెందాడు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. సదరు విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.సదరు వ్యక్తి మత్తు మాత్రలు, ఇంజెక్షన్ లను విక్రయిస్తున్నాడు? అతని వద్దకు మత్తు ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత మందికి విక్రయిస్తున్నారు? అనే కోణాల్లో ను బాలాపూర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
'మిస్టర్ బచ్చన్' తో సినీ ఆరంగ్రేటం చేసిన నార్త్ ఇండియన్ బ్యూటీ 'భాగ్యశ్రీ బోర్సే'. (Bhagyashri Borse)తొలి సినిమాతోనే తన అందంతో, పెర్ ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. అందుకే మిస్టర్ బచ్చన్  పరాజయంతో సంబంధం లేకుండా భాగ్యశ్రీకి  వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే  ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)విజయ్ దేవరకొండ(VIjay Devarakonda)వంటి హీరోల సరసన చేస్తు ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియా(Social Media)లో గత కొన్ని రోజుల నుంచి రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతు ఉన్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా రామ్, భాగ్యశ్రీ సోషల్ మీడియా వేదికగా తమ పిక్స్ షేర్ చేసారు. ఆ పిక్స్ లోని బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉండటంతో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో  ఒకే గదిలో ఫోటో దిగారా అంటు నెటిజన్స్  కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే భాగ్యశ్రీ చేతికి ఉన్న ఉంగరాన్ని గమనించి, మీ చేతికి ఉన్న ఉంగరం బాగుంది, ఎవరు తొడిగారనే ప్రశ్న వేసాడు. అందుకు భాగ్యశ్రీ రిప్లై ఇస్తు 'నేనే కొనుక్కున్నానని' ఆన్సర్ ఇచ్చింది. రామ్, భాగ్యశ్రీ మధ్య డేటింగ్ వార్తలు వస్తున్న టైంలో ఆమె ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రామ్, భాగ్యశ్రీ ప్రస్తుతం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్(Mahesh p)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ, కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలైతే మూవీపై రామ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో  ఆసక్తిని  కలగచేస్తున్నాయి. సాగర్, మహాలక్ష్మి క్యారక్టర్ లలో ఆ ఇద్దరు కనిపించనున్నారు. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)హై బడ్జెట్ తో నిర్మిస్తుండగా, తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన వివేక్,మెర్విన్(Vivek, mervin)ద్వయం మ్యూజిక్ ని అందిస్తుంది.      
  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు 'ఫౌజి' బడ్జెట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ ని షేక్ చేస్తోంది.    ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఫౌజి' చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్ల‌ని టాక్. ఇప్పటిదాకా మైత్రి బ్యానర్ లో ఇదే అత్యధిక బడ్జెట్ కావడం విశేషం. రెండు భాగాలుగా వచ్చిన 'పుష్ప'కి సైతం ఇంత ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది. రెండు భాగాలకు కలిపి రూ.500 కోట్ల లోపే బడ్జెట్ అయిందని సమాచారం. అలాంటిది ఇప్పుడు ఒకటే మూవీగా తెరకెక్కుతోన్న 'ఫౌజి' కోసం ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు పెడుతున్నారనే వార్త సంచలనంగా మారింది. ప్రభాస్ స్టార్డంకి తగ్గ సరైన కథను హను సిద్ధం చేశాడని, అందుకే మైత్రి మేకర్స్ ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.   హను కథని నమ్మి మైత్రి ఎలాగైతే రూ.600 కోట్ల బడ్జెట్ పెడుతుందో, అలాగే హను ప్రతిభను నమ్మి ఆయన డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి హనుకి అడ్వాన్స్ కూడా ఇప్పించినట్లు వినికిడి. మొత్తానికి 'ఫౌజి'తో హను సంచలనం సృష్టించేలా ఉన్నాడు.  
'సమంత'(Samantha)గత ఏడాది సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టకపోయినా 'సిటాడెల్ హనీబన్నీ' అనే హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించింది. తనకున్న హెల్త్ ఇష్యుస్ ని సైతం పక్కన పెట్టేసిన సమంత ఈ సిరీస్ లో ఎన్నో రిస్క్ ఫైట్స్ లు చేసి తన సత్తా చాటిందని చెప్పవచ్చు. ప్రస్తుతం 'మా ఇంటి మహాలక్ష్మి' అనే మూవీతో పాటు 'రక్త్ బ్రహ్మాండ్' అనే వెబ్ సిరీస్ చేస్తుండగా మూవీకి అయితే  తనే నిర్మాతగా వ్యవహరిస్తోంది.  రీసెంట్ గా 'సక్సెస్ వెర్స్' అనే ఇనిస్టాగ్రా ఖాతాలో భార్య అనారోగ్యానికి గురయితే పురుషుడు ఆమెని వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. కానీ భర్త అనారోగ్యానికి గురైతే భార్య మాత్రం వదిలెయ్యడానికి ఇష్టపడటం లేదు. భార్యతో భర్తకి ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేకపోవడం వల్లే  విడిచిపెట్టాలనుకుంటున్నాడని సర్వేల్లో తేలిందని సక్సెస్ వెర్స్ లో పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ కి సమంత లైక్ చేసింది. మరో అరవై వేల లైక్స్ కూడా వచ్చాయి. సమంత 2017 లో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021 లో ఆ ఇద్దరు విడిపోయారు. ఆ మరుసటి సంవత్సరమే తాను మయాసైటీస్ అనే ఒక అరుదైన వ్యాధి కి గురయ్యానని సమంత చెప్పింది. దీంతో సమంత లైక్ కొట్టడంపై అందరు చర్చించుకుంటున్నారు. సమంత చాలా సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు.    
Rani Mukherji starrer Mardaani is the biggest solo female-led franchise in Hindi cinema that has garnered love and acclaim for over 10 years now. The blockbuster franchise has received unanimous love from people and has attained a cult status amongst cine-lovers. Yash Raj Films are producing the film.  Also, the biggest and only female cop franchise of India, Mardaani is now in its third instalment. Mardaani 3 will see Rani Mukerji reprise the role of a daredevil cop, Shivani Shivaji Roy, who selflessly fights for justice.  Today, YRF announced the release date of Mardaani 3 and it is Friday, 27 February 2026, marking the auspicious Holi festival as its release window. Holi, which falls on March 4th, symbolises the triumph of good over bad and the makers are pegging this film to be a bloody, violent clash between Shivani’s goodness vs sinister evil forces with its choice of release date.   Rani had revealed that the edge of the seat thriller is ‘dark, deadly and brutal’ and it immediately piqued curiosity amongst netizens, the fans of the star and the franchise.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)వన్ మ్యాన్ షో పుష్ప 2 (Pushpa 2)డిసెంబర్ 4 న వరల్డ్ వైడ్ గా విడుదలై ఎంతగా సంచలన విజయాన్ని అందుకుందో  తెలిసిందే. ముఖ్యంగా హిందీలో అయితే స్ట్రెయిట్ హిందీ సినిమా కూడా సాధించలేని విధంగా 800 కోట్ల వసూళ్ళని సాధించి చరిత్ర తిరగరాసింది. దీన్నిబట్టి నార్త్ ఆడియెన్స్  పుష్ప 2 కి ఎంతగా బ్రహ్మరధం పట్టారో అర్ధం చేసుకోవచ్చు. పైగా లోకల్ సినిమాని కూడా అక్కడి ప్రేక్షకులు పట్టించుకోలేదు. రీసెంట్ గా ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ యువహీరో ఉత్కర్ష్ శర్మ(Utkarsh Sharma)మాట్లాడుతు మా 'వనవాస్'(Vanvaas)మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేమంతా ఇంకోసారి ఆలోచించాల్సింది. అలా చెయ్యకుండా  పుష్ప 2 సమయంలోనే మా మూవీని రిలీజ్ చేసాం. దీంతో ప్రేక్షకులకి మా మూవీ   చేరుకొనేలోపే స్క్రీన్స్ దొరక్క చనిపోయింది. ఫస్ట్ వీక్ బాగానే టాక్ వచ్చినప్పటికీ సరైన స్క్రీన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. దాని వల్లే మా చిత్రానికి ఆశించినంత వసూళ్లు రాలేదు. ఒకేసారి రెండు మూడు కొత్త చిత్రాలని ప్రేక్షకులు చూడటానికి మన దగ్గర కావలసిన స్క్రీన్స్ లేవని నా అభిప్రాయం. ఈ కారణం వల్లే  కొన్ని మాత్రమే పోటీలో నిలవ గలుగుతున్నాయి. కాకపోతే ఓటిటి లో స్క్రీన్స్ ప్రాబ్లమ్ లేదు. కాబట్టి  మా సినిమా ఓటిటి లో ప్రేక్షాదరణతో బాగా ఆడింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన 'వనవాస్' డిసెంబర్ 20 న థియేటర్స్ లో రిలీజవ్వగా  ఉత్కర్ష్ శర్మ తో పాటు లెజండ్రీ యాక్టర్ నానా పటేకర్, సిమ్రత్ కౌర్, రాజ్ పాల్ యాదవ్, ఖుష్బూ, తదితరులు కీలక పాత్రలు పోషించారు. గదర్, గదర్ 2 , వీర్, సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రాల ఫేమ్ అనిల్ శర్మ(Anil Sharma) దర్శకుడిగా వ్యవహరించాడు. జీ స్టూడియోస్ నిర్మాణ సారధ్యం వహించగా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 5 .61 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది.    
  ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాప్ ఫామ్ లో ఉన్నారు. కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' ఇలా వరుసగా నాలుగు సక్సెస్ లను చూశారు బాలకృష్ణ. ఆయనతో భారీ సినిమాలు చేయడానికి నిర్మాతలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య సినిమా అంటే.. షూటింగ్ దశలో ఉండగానే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ అనే తేడా లేకుండా రైట్స్ కోసం పోటీ ఏర్పడుతోంది. ఇక బాలకృష్ణ తదుపరి చిత్రం 'అఖండ-2' (Akhanda 2) విషయంలో ఈ పోటీ మరో స్థాయికి వెళ్ళిపోయింది.    బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. ఇప్పటిదాకా వీరి కలయికలో 'సింహ', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడూ ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ముఖ్యంగా 'అఖండ' సంచలనం సృష్టించింది. ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో సినిమాగా 'అఖండ-2' రూపొందుతోంది. అసలే బాలకృష్ణ టాప్ ఫామ్ లో ఉన్నారు. దానికి తోడు బాలయ్య-బోయపాటి కాంబోలో 'అఖండ' సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. దీంతో 'అఖండ-2'పై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉండగానే ఓ రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.   థియేటర్లలోనే మాత్రమే కాకుండా, ఓటీటీలోనూ బాలకృష్ణ సినిమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఆయన గత చిత్రం 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. అందుకే 'అఖండ-2' డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ఆసక్తి చూపిస్తోంది. అయితే మరో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా నెట్ ఫ్లిక్స్ కి పోటీ వస్తోందట. రెండూ సంస్థలు పోటాపోటీగా కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'అఖండ-2' డిజిటల్ రైట్స్ కోసం రెండు ప్రముఖ సంస్థలు పోటీ పడటం చూస్తుంటే.. రికార్డు ధరకు రైట్స్ అమ్ముడవడం ఖాయమనిపిస్తోంది. ఓవరాల్ గా 'అఖండ-2' బిజినెస్ డీల్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యేలా ఉన్నాయి.  
  కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇడ్లీ కడై' (Idly Kadai). తమిళనాడులోని తేని జిల్లా అనుప్పపట్టి గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షూట్ కోసం వేసిన సెట్ లు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.    ధనుష్ హీరోగా, దర్శకుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా(నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం) తర్వాత ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'ఇడ్లీ కడై'. వుండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ లో రూపొందుతుండగా ధనుష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ధనుష్, నిత్య మీనన్ జంటగా నటిసున్న ఈ చిత్రం, అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.    
  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.   'విశ్వంభర'ను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ కంపెనీలతో ప్రతిష్టాత్మకంగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. దీని కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. వీఎఫ్ఎక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారంటే.. అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఆసక్తి కలుగుతోంది.   మరోవైపు 'విశ్వంభర'ను జులై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్ లో ఈ డేట్ కి ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'ఇంద్ర' 2002 లో జులై 24నే విడుదలైంది. సెంటిమెంట్ డేట్ కి వస్తున్న చిరంజీవి.. అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.    ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ గా వ్యవహరిస్తున్నారు.  
  Esteemed production house RS Infotainment, headed by Mr. Elred Kumar, proudly announces its 16th production venture, titled MANDAADI. A gripping sports action drama, the film is set to offer a mix of emotion, grit, and rooted storytelling. Written and directed by Mathimaran Pugazhendhi, who earlier made a strong impression with his debut film Selfie, Mandaadi marks his next directorial outing — this time with a bigger canvas and deeper emotional layers. The film stars Soori in the lead, further continuing his rise as a powerful performer in content-driven cinema. Mandaadi also proudly introduces Telugu actor Suhas to the Tamil industry, expanding the film’s Pan-South appeal. Mahima Nambiar plays the female lead.   The stellar ensemble cast includes Sathyaraj, Ravindra Vijay, Achyuth Kumar and Sachana Namidass, each bringing depth and dimension to this emotionally gripping narrative.   Coming to the technical crew, music is composed by G.V. Prakash Kumar, while cinematography is handled by the acclaimed S.R. Kathir ISC. Production Design is by D.R.K. Kiran, whereas the editing is in the hands of Pradeep E. Ragav. Action is choreographed by the legendary Peter Hein. Sound Design by Prathap, with R. Harihara Suthan heading VFX, ensuring both technical finesse and emotional depth.   The first look of Mandaadi was unveiled on April 19 in a grand media event attended by the film’s cast and crew. The striking visual has already sparked intrigue and anticipation among fans and industry circles alike.     With the test shoot completed and pre-production underway along the coastal regions of Ramanathapuram, the team is gearing up to begin principal photography in the coming days. The film is poised to take audiences on a poignant journey of passion, perseverance, redemption, and human connection, all woven into the high-stakes world of coastal sports.   At the media event, the team also screened a documented video on sailboat racing, offering a captivating glimpse into the world of Mandaadi. This sequence, rich in adrenaline and emotion, sets the tone for what promises to be an immersive cinematic experience.   In the coastal belts of Ramanathapuram and Tuticorin, the term Mandaadi refers to a seasoned expert who leads fishing expeditions. Possessing an exceptional understanding of ocean currents, wind directions, and wave patterns, the Mandaadi plays a crucial role in predicting the movements of fish and navigating treacherous waters. These same skills make him a fearless leader in sailboat races, where strategy, intuition, and courage are tested to their limits.   Writer-Director Mathimaran Pugazhendhi said: “I’m grateful to Elred sir & Vetri sir for trusting my vision and giving me the platform to tell this story. I’ve admired Soori sir’s transition as an actor, and writing this role for him was a heartfelt process. Soori sir’s vision and view in selecting scripts have always been inspiring, and Mandaadi will definitely hold a special place in his career. This film not only elevates him as a performer but also demanded a kind of physical ability and commitment that only an artist like him could bring to life — Mandaadi can only be done by someone who is physically fit and dedicated. Having someone like Vetri Maaran sir as a creative producer has been a guiding force. With a team like this — from GV Prakash’s music to SR Kathir’s visuals — Mandaadi is shaping up to be an honest, rooted sports action film that will emotionally connect with the audience.”  
  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2'తో పాటు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. వీటిలో మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'రాజా సాబ్' మొదట పట్టాలెక్కింది. నిజానికి ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి కూడా రాలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. (The Raja Saab)   'రాజా సాబ్' కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ రిలీజ్ డేట్ ని టీజర్ తో రివీల్ చేయనున్నారట. ఇప్పటికే టీజర్ కూడా రెడీ అయిందని వినికిడి. త్వరలోనే టీజర్ ప్రేక్షకులను పలకరించనుందట. టీజర్ అద్భుతంగా వచ్చిందని, టీజర్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో లేదా 2026 సంక్రాంతికి విడుదల చేసే అవకాశముందని చెబుతున్నారు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఒక వ్యక్తి సానుకూలంగా ఉంటే, కష్టాలను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు డబ్బు గురించి తన అభిప్రాయాలను వివరంగా తన నీతి శాస్త్రంలో చెప్పాడు. నిజాయితీగా పనిచేసే వారికి తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని, తమ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన చెబుతారు. సంపద ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, దానిని లాక్కుంటోంది. జీవితం ఎంత కష్టంగా అనిపించినా, సంపదకు మించిన ఒక ముఖ్యమైన  విషయాన్ని చాణక్యుడు  చెబుతాడు.  ఆ ముఖ్యమైన విషయం మనిషి జీవితంలో చాలా గొప్పదని,  మనిషి ఆ ఒక్క ఆయుధంతో జీవితంలో కావలసినది సాధించుకోగలడని చెబుతాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుంటే.. జ్ఞానం కామధేనువు వంటిది.. చాణక్యుడి ప్రకారం జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడూ వెనుకాడని వ్యక్తిని దుఃఖ మేఘాలు  తాకలేవు. జ్ఞాన శక్తితో వ్యక్తి విజయ శిఖరాన్ని చేరుకోగలడు. చాణక్యుడు ధనవంతుల కంటే జ్ఞానం, మేధావిగా ఉన్నవారిని గొప్పవారిగా నిర్వచించాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. జ్ఞానాన్ని సంపాదించడం అనేది కామధేనువు ఆవు లాంటిదని, అది మానవులకు అన్ని కాలాల్లోనూ అమృతాన్ని అందిస్తుందని, అందుకే జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సంపాదించాలని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం ఎప్పుడూ వృధా కాదని అన్నాడు. అనుభవంతో పాటు జ్ఞానం ఉంటే విజయం సిద్ధిస్తుంది.. జ్ఞానం,  అనుభవం ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటుంది కానీ అతను ఆ పరిస్థితిలో జీవించినప్పుడే అతనికి అనుభవం లభిస్తుంది. ఒక వ్యక్తి తాను నేర్చుకున్న విషయాలను ఆచరించడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఒక వ్యక్తి మంచి,  చెడుల మధ్య తేడాను బాగా గుర్తించగలడు. మానవ జీవితంలో జ్ఞానం ఎంత ముఖ్యమో అనుభవం కూడా అంతే ముఖ్యం. చాణక్యుడి ప్రకారం  ఒక వ్యక్తి అతిపెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించగల గుణం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే  జ్ఞానం గురించి ఎప్పుడూ గర్వపడకూడదు. పంచుకున్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది.  దీనితో వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందుతాడు.                                      *రూపశ్రీ.
ప్రతి మనిషీ తన జీవితంలో తన వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి గమనించుకుని విశ్లేషించుకుంటే  తను సరిగానే ఉన్నాడా లేదా తనని తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయం అర్థమవుతుంది. మనం చేసే ప్రతికార్యమూ, శరీరంలోని ప్రతిచలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనస్సులో ఒక విధమైన సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు పైకి మనకు కనబడకపోయినా అంతర్గతంగా ఉండి అజ్ఞాతంగా పనిచెయ్యడానికి తగినంత శక్తిమంతాలై ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో ఉన్న  స్థితి ఇంతకు క్రితం  జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా వ్యక్తిత్వం అంటే ఇదే. ప్రతి మానవుడి స్వభావము అతనికి ఉన్న అన్ని సంస్కారాలచే నిర్ణయించబడుతుంది. మంచి సంస్కారాలు ప్రబలంగా ఉంటే వ్యక్తిత్వం మంచిదౌతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా వుంటే స్వభావం చెడ్డదౌతుంది.  ఒకవ్యక్తి ఎప్పుడూ చెడుమాటలను వింటూ, చెడు ఆలోచనలను చేస్తూ, చెడుపనులు చేస్తూవుంటే అతడి మనస్సు చెడు సంస్కారాలతో నిండి ఉంటుంది. అతడికి తెలియకుండానే అవి అతడి తలపులలో, చేతలలో తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నిజానికి ఈ చెడు సంస్కారాలు సదా పని చేస్తూంటే చెడే వాటి ఫలితమౌతుంది. చెడు సంస్కారాల మొత్తం అతనిచే చెడుపనులను చేయించడానికి బలీయ ప్రేరకమవుతున్నది.  ఒకరి వ్యక్తిత్వాన్ని నిజంగా నిర్ణయించాలని చూస్తే అతడు చేసిన  మహత్కార్యాలను పరికించకూడదు. ప్రతి మూర్ఖుడూ ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు కావచ్చు. మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని అలాంటి పనులే వ్యక్తం చేస్తాయి. గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం ఏదో కొంత గొప్పదనం సంతరించుకొనేలా చేస్తాయి. కాని ఎక్కడ ఉన్నప్పటికీ సర్వదా ఎవరు గుణసంపన్నుడో అతడే నిజానికి మహోన్నతుడు.  మన భావనలు తీర్చిదిద్దిన మేరకే మనం రూపొందుతాం కాబట్టి  భావనల విషయంలో శ్రద్ధ వహించాలి. మాటలు అప్రధానం. భావనలు సజీవాలు, అవి సుదూరాలకు పయనిస్తాయి. మన ప్రతి భావన మన స్వీయ నడవడితో మిశ్రితమై ఉంటుంది.. మంచి పనులు చేయడానికి నిరంతర దీర్ఘకాలం ప్రయత్నం అవసరం. అది ఫలించకపోయినా మనం కలత చెందకూడదు. మనం చేసే ప్రతి కార్యం  సరస్సు పైభాగంలో చలించే అల లాంటిది. ఇదంతా అభ్యాసమే.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే. కాబట్టి ఒక అభ్యాసాన్ని అలవాటు చేసుకోవటం లేదా వదలిపెట్టటం మన చేతులలోనే ఉంది. అందుకని ప్రస్తుతమున్న మన స్వభావం గూర్చి మనం నిరాశ చెందనవసరం లేదు.  ఒకవ్యక్తి ఎంత చెడ్డవాడైనాసరే, 'అతనిక మంచివాడు కాలేడు' అని చెప్పవద్దు. ఎందుకంటే, అతని ప్రస్తుత ప్రవర్తన అతను గతంలో చేసిన పనుల ఫలితం. అదే అతను కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే అతను తన వ్యక్తిత్వాన్ని మార్చుకుని మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది.  మనిషి తన వ్యక్తిత్వాన్ని అలాగే మార్చుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.
  ప్రయాణం చాలామందికి ఇష్టమైన పని.  కొందరు జట్టుగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. మరికొందరు ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. కొందరు ప్రకృతి మధ్య ప్రయాణిస్తూ ఆస్వాదిస్తారు.  మరికొందరు చరిత్ర తెలుసుకుంటూ ఆశ్చర్యపోతుంటారు.  భారతదేశం గొప్ప సంపదకు పుట్టినిల్లు. ఈ సంపద ఏది అంటే చారిత్రక సంపద.   భారతదేశంలో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒక ప్రదేశం వెనుక ఉన్న కథలు దానిని మరపురానివిగా చేస్తాయని ప్రతి అనుభవజ్ఞుడైన ప్రయాణికుడికి తెలుసు. అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న  ప్రపంచ వారసత్వ దినోత్సవం  జరుపుకుంటారు. అధికారికంగా అంతర్జాతీయ స్మారక చిహ్నాలు,  ప్రదేశాల దినోత్సవం అని పిలుస్తారు.  ఇది మానవత్వాన్ని,   సాంస్కృతిక,  సంప్రదాయాలను  అందరికి పరిచయం చేసే వేదిక అవుతుంది.  ఈ సందర్భంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం గురించి తెలుసుకుంటే.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని 1982లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ICOMOS) ప్రతిపాదించింది.   దీనిని 1983లో UNESCO అధికారికంగా ఆమోదించింది. ఇది ఏప్రిల్ 18వ తేదీ ఆమోదించడంతో  అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ వారసత్వాన్ని ప్రదర్శించడానికి, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి,  స్మారక చిహ్నాలు,  చారిత్రక ప్రదేశాలను రక్షించడానికి ఈ రోజును జరుపుకుంటున్నాయి. థీమ్.. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా థీమ్ ప్రకటించారు. "విపత్తులు,  సంఘర్షణల నుండి ముప్పులో ఉన్న వారసత్వం: 60 సంవత్సరాల ICOMOS చర్యల నుండి సంసిద్ధత మరియు అభ్యాసం".  ఇదే ఈ ఏడాది థీమ్.  ఇది మన దేశానికి దగ్గరగా ఉంది. వాతావరణ మార్పు, పట్టణ విస్తరణ,  భౌగోళిక రాజకీయ అశాంతి ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రదేశాలలో కొన్నింటిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2025 లో ఆరు దశాబ్దాల వారసత్వ రక్షణ నుండి స్థితిస్థాపకతను పెంపొందించడం,  నేర్చుకోవడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఇది ప్రయాణికులకు ఒక మేల్కొలుపుతో కూడిన ఆహ్వానం.  ప్రయాణికులు బాధ్యతతో ఉంటూ వారసత్వ ప్రదేశాలను సంరక్షించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వారసత్వ దినోత్సవం ప్రయాణికులకు ఎందుకు ముఖ్యమైనది ప్రతి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం - అది పురాతన గుహ అయినా,  శిథిలావస్థ ప్రదేశం అయినా, వేరే ఏదైనా  మానవ చరిత్రలో ఒక సజీవ అధ్యాయం. ఆసక్తిగల ప్రయాణీకుడికి, ఈ ప్రదేశాలు కేవలం గమ్యస్థానాలు మాత్రమే కాదు - అవి ఒక సంస్కృతికి, చరిత్రకు సాక్ష్యాలు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం ప్రపంచాన్ని అన్వేషించవలసిన ప్రదేశంగా మాత్రమే కాకుండా, రక్షించవలసిన వారసత్వంగా చూడమని మనల్ని సవాలు చేస్తుంది. భారతదేశం.. భారతదేశం ఒక సజీవ మ్యూజియం. దాని ప్రకృతి దృశ్యంలో చెల్లాచెదురుగా ఉన్న 43 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.  తాజ్ మహల్ నుండి ఆధ్యాత్మిక ఎల్లోరా గుహల వరకు ప్రతి ప్రదేశం నిర్మాణ నైపుణ్యం, ఆధ్యాత్మిక లోతు,  సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది.                                  *రూపశ్రీ.
  నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు.  ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్,  మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే.  పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి.  ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  ప్రిజర్వేటివ్‌లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్‌లను  బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట,  గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట. బ్రెడ్ వల్ల  సమస్య ఎందుకు? బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్,  అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు. ఎవరు తినకూడదు.. డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా  'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది. బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే.. రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ  లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి,  రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయవం.  ఇది కలుషితమైతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది.  ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవన శైలి సరిగా లేకపోవడం,  ఆహారం తీసుకునే విధానం సరిగా లేకపోవడం.  ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోవడం వంటివి లివర్ పాడవడానికి కారణం అవుతాయి.  ఎక్కువ కొవ్వు పదార్థాలు,  బేకరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలేయం దెబ్బ తింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  వాటి గురించి తెలుసుకుంటే.. కాలేయం దెబ్బతిన్నప్పుడు, కాలేయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది చర్మం,  కళ్లు పసుపు రంగులోకి మారడం. అంటే తరచుగా కామెర్ల వ్యాధి రావడం.  తగ్గిపోయిన కొన్ని రోజులకే కామెర్ల వ్యాధి మళ్లీ వస్తుంటే కాలేయం పనితీరు మందగించిందని అర్థం.  దీని వల్ల కాలేయం దెబ్బ తిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నా,  లేదా కాలేయం దెబ్బ తిన్నా అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే బాగా అలసటగా కనిపిస్తుంటారు.  వీరు ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కడుపులో వాపు లేదా నొప్పి ఉన్నా కాలేయం దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కడుపులో కుడి వైపు ఎగువ భాగంలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.  ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే ఆకలి అనిపించదు.  లేదా అసలు ఆకలి వేయదు.  ఏమీ తినాలని కూడా అనిపించదు. అంతేకాదు.. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.  తరచుగా వికారం,  వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాలేయ సమస్యలు ఉన్నవారికి మల విసర్జన ద్వారా కూడా సంకేతం వస్తుంది.  మల విసర్జనకు వెళ్లినప్పుడు మలం రంగులో మార్పులు ఉంటాయి. మలం బురద నలుపు రంగులో ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు.                                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  మలబద్దకం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య.  ఆహారం ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా తినాలంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై ఆహారపు వ్యర్థాలు మలం రూపంలో అంతే సాఫీగా బయటకు వెళ్లిపోవాలి. కానీ కొందరిలో మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడటమే కాదు.. కనీసం వైద్యుల దగ్గరకు వెళ్లాలన్నా కూడా సంకోచిస్తారు చాలామంది.  అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీ మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి మంచి సువాసన కలిగిన గులాబీ రేకలు బాగా సహాయపడతాయి.  గులాబీ పువ్వును సాధారణంగా అలంకరణ కోసం,  పూజ కోసం మాత్రమే వాడుతుంటారు. కొందరు వంటకాలలో వాడినప్పటికి అవన్నీ కేవలం సువాసన కోసమే ఉపయోగిస్తారు. గులాబీ కడుపు సంబంధ సమస్యలనే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. పొట్టలో యాసిడ్ లు ఎక్కువ ఉత్పత్తి అయ్యే సమస్యకు ఇది చెక్ పెడుతుంది. గులాబీ రేకలతో గుల్కండ్ తయారు చేసి తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.  గుల్కండ్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. గుల్‌కంద్‌ తయారీకి కావలసిన పదార్థాలు.. నాటీ గులాబీ రేకలు.. చక్కెర.. తేనె.. నల్ల మిరియాలు.. పచ్చి ఏలకులు.. తయారీ విధానం.. గులాబీ రేకులను ఒక రోటిలో వేసి బాగా నూరాలి. ఇందులోనే పంచదార, తర్వాత తేనె కూడా కలపాలి. రుచి కోసం కాస్త నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి.  ఇందులో కాస్త యాలకులు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి ఎండలో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఎవరైనా తీసుకోవచ్చు.  కానీ మలబద్దకం ఉన్నవారికి, ప్రేగు శోథ సమస్యలు ఉన్నవారికి ఇది గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది కడుపు సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. మరొక విషయం ఏమిటంటే.. ఈ గుల్కండ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...