LATEST NEWS
నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది. బిఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కెటీఆర్ తో బాటు పలువురు ముఖ్య నాయకులు ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ హైకోర్టునాశ్రయించింది.  ఆఖరినిమిషంలో అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పడంతో బిఆర్ఎస్ కోర్టు తలుపులు తట్టింది.  పద్నాలుగు నెలల కాంగ్రెస్ హాయంలో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోవడంతో బిఆర్ ఎస్ పోరు బాట పట్టింది.   
హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా ఉన్నారు.  మణికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు తమ గ్రామానికి చెందిన యువతితో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. హన్మకొండ చౌరస్తా వద్ద ఇద్దరూ ఎదురు పడ్డారు.  మాటామాటా పెరగడంతో ఏనుగు వెంకటేశ్వర్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్ కుమార్ ను పొడిచి చంపేశాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ మార్ట్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. 
తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి.  ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది.  బుధవారం రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. ఈ నెల 24 వతేదీ డెడ్ లైన్ గా నిర్ణయించారు.  అయితే గ్రేటర్ హైద్రాబాద్ లో ఇంకా వార్డు సభలు మొదలు కాలేదు. సర్వే పూర్తయిన తర్వాత  వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వార్డు సభలు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. 
దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏడు నెల‌ల కాలంలో కూట‌మి పార్టీల మ‌ధ్య ఎక్క‌డా విబేధాలు పొడ‌ చూప‌లేదు. ఐక‌మ‌త్యంగా క‌లిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొర‌క‌డం లేదు. అయితే, గ‌త నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియ‌మించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. ప‌లువురు తెలుగుదేశం నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో కూట‌మి నేత‌ల మ‌ధ్య ఎలా అగ్గిరాజేయాలా అని  గోతికాడ  న‌క్క‌లా ఎదురుచూస్తున్న వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక రాబోతోంది.. ప్ర‌భుత్వం కూల‌బోతోంది అంటూ తెగ హ‌డావుడి చేశారు. అంతే కాదు.. కూట‌మి నేత‌లు మాట్లాడ‌ని మాట‌ల‌ను జోడించి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ పెట్టేలా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా తీవ్రంగా శ్ర‌మించింది. కానీ, చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డింది.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభివృద్ధిలో భాగ‌స్వామి అవుతున్నారు. దీంతో కూట‌మిలోని బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఒకే పార్టీ నేత‌ల త‌ర‌హాలో గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌లిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి టీడీపీ నేత‌లు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొన‌సాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయాన్ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేత‌ల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న డిమాండ్ తీవ్ర‌మైంది. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు తెలుగుదేశం వాద‌న‌ను స‌మ‌ర్ధించ‌గా.. మ‌రికొంద‌రు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక వ‌చ్చిందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోప‌క్క‌ లోకేశ్ ను తిట్టిన‌ట్లు జ‌న‌సేన పేరుతో పోస్టులు పెట్ట‌డం, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ తెలుగుదేశం నేత‌ల పేరుతో పోస్టులు పెట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోష‌ల్ మీడియా పాల్ప‌డింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండ‌టంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అధిష్టానం పార్టీ క్యాడ‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లోకేశ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీ బ‌లోపేతంలోనూ లోకేశ్ కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇటీవ‌లే టీడీపీ స‌భ్య‌త్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పార్టీ స‌భ్య‌త్వాలు  తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం లోకేశ్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  కార్య‌క‌ర్త‌ల‌కు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మ‌రో ప‌క్క‌ రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని తెలుగుదేశం నేత‌లు కోర‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే స‌మ‌యంలో తెలుగుదేశం బ‌లోపేతానికి మ‌రింత‌గా కృషిచేసే అవ‌కాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌టంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఎవ‌రూ ఈ అంశంపై మాట్లాడొద్ద‌ని సూచించింది. దీంతో గ‌త నాలుగు రోజులుగా కూట‌మిప్ర‌భుత్వంలో చీల‌క తేవాల‌ని ప్ర‌య‌త్నించిన వైసీపీ సోష‌ల్ మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.  గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి పార్టీల మ‌ధ్య చిన్న‌పాటి విబేధాలు రావ‌డం స‌హ‌జ‌మే. అవి టీ క‌ప్పులో తుఫాను లాంటివి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా వైసీపీ నేత‌లు లోకేశ్ డిప్యూటీ సీఎం విష‌యంపై తెగ హ‌డావుడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయాల్సిన వైసీపీ.. కేవ‌లం కూట‌మి పార్టీల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అస‌త్యాల‌తో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ పెట్టేందుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివ‌రికి వైసీపీ పెద్ద ఫూల్ అయింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై  ఫోక‌స్ చేస్తారా.. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య ఎప్పుడు విబేధాలు త‌లెత్తుతాయా అని గోతికాడ గుంట‌న‌క్క‌లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   ఇక ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత రామచంద్రారెడ్డిగారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మరణించారు.  చలపతి అనగానే ఎవరికైనా ఠక్కున 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన క్లెమోర్ మైన్ దాడి గుర్తుకు వస్తుంది. ఆ దాడి సూత్రధాని, కీలక పాత్రధారి ఈ చలపతే. అప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. అప్పటి నుంచీ ఎక్కడా కనిపించని చలపతి ఇప్పుడు ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిలో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ   సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. 
ALSO ON TELUGUONE N E W S
Rashmika Mandanna is known for being cute and hyperactive. Her airport videos from paparazzi always showcase her being happy and laughing wide. She puts effort to treat paps as friends and at times, she even gives good poses giving her fans treats with pics.  But after having a bad leg injury while working out, she had to resort to wheel chair to travel. At Shamshabad airport, she covered her face with mask and huge cap to not show her face to anyone. While many paps and fans tried to take videos, she did not show her face for even a second.  It looks like she did not want to show her face after being injured to her fans in pain. She did share photo from hospital showcasing the depth of her injury. But she did not want to be photographed coming out from airport in a wheel chair unable to even hop.  Well, it is disheartening to see her suffer so much. Currently, the actress has Chhaava releasing in Hindi based on Chhatrapati Sambhaji Maharaj's story from history. She is working in The Girlfriend, Kubera, Sikandar and Thama movies in Telugu and Hindi. 
  మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు ఉన్నారు. మెగా హీరోల నుంచి ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఒకటి కాకపోతే మరొకటి హిట్ అవుతుంటాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గత ఏడు సినిమాలను గమనిస్తే, అన్నీ ఘోర పరాజయం పాలయ్యాయి. పైగా ఆ ఏడు సినిమాల్లో మూడు సినిమాలు వరుణ్ తేజ్ వే కావడం గమనార్హం.   2023 ప్రారంభంలో మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చింది. జనవరిలో 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి (Chiranjeevi) బ్లాక్ బస్టర్ అందుకుంటే, ఏప్రిల్ లో 'విరూపాక్ష'తో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా డిజాస్టర్స్ ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి తేజ్ కలిసి నటించిన 'బ్రో' మూవీ 2023 జులైలో విడుదలై, దాదాపు 70 శాతం రికవర్ సాధించి ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐదు సినిమాలు కనీసం 40 శాతం కూడా రికవర్ సాధించలేకపోయాయి. 2023 ఆగష్టులో చిరంజీవి 'భోళాశంకర్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున', నవంబర్ లో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' విడుదల కాగా.. మూడూ పరాజయం పాలయ్యాయి. 2024 లో మెగా హీరోలలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మార్చిలో 'ఆపరేషన్ వాలెంటైన్', నవంబర్ లో 'మట్కా' రిలీజ్ కాగా.. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. ఇలా 2023లో నాలుగు, 2024లో రెండు పరాజయాలను చూసింది మెగా ఫ్యామిలీ. అంతేకాదు 2025 ను కూడా ఫ్లాప్ తోనే ప్రారంభించింది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై, దాదాపు 50 శాతం రికవర్ సాధించి, ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ వరుసగా ఏడు ఫ్లాప్స్ ని చూసినట్లయింది.   ఈ వరుస పరాజయాలతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది 'విశ్వంభర'తో చిరంజీవి, 'హరి హర వీరమల్లు'తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాలతోనైనా మెగా ఫ్యామిలీ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.  
Saif Ali Khan has been in news from past few days due to an attack on him at his residence. He got stabbed six times and underwent a spinal cord surgery to recover. He came back to his house and latest reports suggest that the actor could lose properties valued at Rs.15000 crores in Madhya Pradesh.  Central Government has recognised Pataudi assets in Madhya Pradesh as "Enemy Property". Abida Sultan, daughter of Nawab Hamidullah Khan, Nawab of Bhopal, migrated to Pakistan post Independence while her sister, Sajida Sultan married Nawab Iftikhar Ali Khan Pataudi and stayed in India. Saif is her grandson and hence, got a share of her inheritence.  Now, according to the Enemy Property Act, framed after 1965 India - Pakistan, allow central to claim properties of people migrated to Pakistan as enemy properties. As per the provisions of the act, they have declared prominent properties like the Flag Staff House, Noor-Us-Sabah Palace, Dar-Us-Salam, Bungalow of Habibi, Ahmedabad Palace and Kohefiza Property as enemy properties.  According to amended Enemy Property Act, 2017, Saif can challenge the verdict in Court. If he doesn't want to challenge, the court will offer legality to central government's claim and he would lose his rights to the properties listed above. We have to wait for his official statement regarding the issue. 
ప్రముఖ హీరో నాగశౌర్య(Naga shaurya)కి గత కొంత కాలం నుంచి సరైన హిట్ సినిమాలు లేవు.2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఛలో' మూవీతో పాటు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' మాత్రమే నాగ శౌర్య కి విజయాన్నిఅందించిపెట్టాయి.కానీ ఈ మధ్యలో వచ్చిన అన్ని చిత్రాలు కూడా పరాజయాన్ని చవి చూశాయి.నాగశౌర్య తన క్యారక్టర్ కోసం కష్టపడి నటించడంతో పాటుగా, వేటికవే భిన్నమైన సినిమాలు అయినా కూడా కథనాల్లోని లోపాల వల్ల సక్సెస్ ని చూడలేకపోయాయి.కానీ ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకొని మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి 'బాడ్ బాయ్ కార్తీక్' అనే వినూత్నమైన టైటిల్ ని ఫిక్స్ చెయ్యడం జరిగింది.ఈ మేరకు మేకర్స్ టైటిల్ పోస్టర్ ఒక దాన్ని రిలీజ్ చేసారు.సీరియస్ లుక్ తో ఉన్న నాగశౌర్య పోస్టర్ అయితే ఇప్పుడు అందర్నీ  విశేషంగా ఆకట్టుకుంటుంది.సినిమాపై అభిమానుల్లో,ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. పక్కా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రామ్ దేసిన(Ram Desina)దర్శకుడు కాగా వైష్ణవి ఎంటర్ టైన్మేంట్ భారీ వ్యయంతో నిర్మిస్తుంది. చాలా రోజుల తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.హీరోయిన్ తో పాటు మిగతా నటి నటుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.       
  కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాలకు వరుసగా తమన్ (Thaman) సంగీతం అందిస్తూ వస్తున్నాడు. బాలకృష్ణ గత నాలుగు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్'కు తమన్ సంగీతం అందించాడు. ఈ నాలుగు సినిమాలూ ఘన విజయం సాధించడమే కాకుండా, తమన్ సంగీతానికి ఎంతో పేరు వచ్చింది. బాలయ్య సినిమా అంటే తమన్ పూనకం వచ్చినట్టు సంగీతం అందిస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇక బాలకృష్ణ అభిమానులైతే నందమూరి తమన్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. అలాంటి తమన్ ని ఒక సినిమా కోసం బాలకృష్ణ పక్కన పెడుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.   ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే 'అఖండ-2' తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ కి బదులుగా అనిరుధ్ (Anirudh)ని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ బాలకృష్ణ, తమన్ ని కాదని వేరే మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూసే అవకాశాలు చాలా తక్కువే. దానికి తోడు అనిరుధ్ చేతిలో ఇప్పటికే దాదాపు డజను ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మరికొన్ని లైన్ లో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో మరో కొత్త సినిమాని అనిరుధ్ అంగీకరించడం అనుమానమే. అయితే బాలయ్య-మలినేని ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశముంది. ఈలోపు ఏదైనా మ్యాజిక్ జరిగి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ వస్తే చెప్పలేము.   మామూలుగా అయితే తమన్ ని కాదని వేరే సంగీత దర్శకుడిని తీసుకోవడం నందమూరి అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ అనిరుధ్ వస్తే మాత్రం వారు నిరాశ చెందే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎంతో క్రేజ్ ఉంది. స్టార్ హీరోల ఎలివేషన్ సీన్స్ కి అనిరుధ్ ఇచ్చే స్కోర్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటి అనిరుధ్, బాలయ్య లాంటి బడా మాస్ హీరోకి మ్యూజిక్ అందిస్తే అభిమానులకు ఖచ్చితంగా కిక్ ఇస్తుంది. మరి నిజంగా బాలయ్య-మలినేని ప్రాజెక్ట్ కోసం అనిరుధ్ రంగంలోకి దిగుతాడో లేదో చూడాలి.  
ప్రముఖ హీరోయిన్ నిత్య మీనన్(Nithya menen)సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.బాలనటిగా 'హనుమాన్' అనే ఇంగ్లీష్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నిత్య ఆ తర్వాత 2008 లో 'ఆకాశ గోపురం' అనే మలయాళ మూవీతో సోలో హీరోయిన్ గా మారింది.అక్కడ్నుంచి  మళయాళంతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,హిందీ చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని అలరిస్తూ వస్తుంది.ఇటీవలే జాతీయ అవార్డుని కూడా గెలుచుకొని నటిగా ఎంతో ఉన్నతవంతమైన స్థానంలో  ఉంది.  రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిత్య మాట్లాడుతు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 'జయలలిత' గారి బయోపిక్ చెయ్యాలని ఎంతగానో ఆశపడ్డాం.చర్చలు కూడా జరిగాయి.కానీ ఈ లోపు జయలలిత గారి బయోపిక్ ఆధారంగానే 'తలైవి' అనే సినిమా వచ్చింది.మళ్ళీ చేస్తే రిపీట్ అవుతుందని అనుకున్నాం.కానీ మా నాన్న ఎలాగైనా జయలలిత బయో పిక్ చెయ్యమంటే చేద్దామని అనుకున్నాను.మళ్ళీ ఈ లోపే  'క్వీన్' అనే మరో జయలలితగారి బయోపిక్ సంబంధించిన  వెబ్ సిరీస్ వచ్చింది.దీంతో ఇక రిపీట్ అవుతుందని ఆ ప్రయత్నం మానుకున్నాను. నిజానికి నాకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు.ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలనేది నా కోరిక.ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా వేరే రంగంలోకి వెళ్లిపోవాలని అనుకున్నాను.కానీ జాతీయ అవార్డు నా దృక్పధాన్ని మార్చేసి నాకో కొత్త దారిని చూపించిందని చెప్పుకొచ్చింది.నిత్య మీనన్ రీసెంట్ గా కాదలిక్క నెరమిల్లే అనే తమిళ మూవీలో జయం రవితో కలిసి నటించింది.జనవరి 14 న ఆ మూవీ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.     
  టాలీవుడ్ లో ఐటీ దాడులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, ఫైనాన్సియర్ సత్య రంగయ్య ఇలా సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ లిస్టులో ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకుమార్ కూడా ఉన్నారు. (Director Sukumar)   సుకుమార్ ఇంట్లో నిన్న ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయని సమాచారం. ఎయిర్ పోర్ట్ నుండి సుకుమార్ ను ఐటీ అధికారులు ఇంటికి తీసుకెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అలాగే ఆయన దర్శకత్వం వహించే సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల ఆయన డైరెక్ట్ చేసిన 'పుష్ప-2' చిత్రం విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ సహ నిర్మాత. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఐటీ రైడ్స్ జరుగున్నట్లు తెలుస్తోంది.   కాగా, రెండేళ్ల క్రితం 2023 ఏప్రిల్ లో కూడా టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు సుకుమార్ పై కూడా ఐటీ రైడ్స్ జరగడం విశేషం. లెక్కల మాస్టర్ గా పేరున్న దర్శకుడు సుకుమార్ లావాదేవీలన్నీ కరెక్ట్ గా ఉన్నట్టున్నాయి. ఆ సమయంలో ఆయనపై ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యే అవకాశముంది.  
Pushpa 2 The Rule has collected huge Rs.1830 crores gross at the box office. With such a huge collection, the movie has attracted IT officials interest. They started raiding Mythri Movie Makers offices and houses of owners, producers Naveen Yerneni, Ravi Yelamanchali and CEO Cherry as well.  Now, the news reports suggest that IT raids are going on at Sukumar's residence and office. Officials have escorted Sukumar from airport to his house and office, suggest reports. They are trying to investigate the fiscal records of director and producers to set the records straight.  They have been conducting raids at Dil Raju and Mango media owner Ram's house, offices as well. They even took Dil Raju's wife to the bank and searched their lockers. The producer's wife has dismissed them as routine IT checks from officials. But the raids are said to be serious and have been going on for past two days.  After Baahubali 2 film, IT raids have been conducted at producers houses and offices as well. It is shocking to see that they are conducting raids at Sukumar's house too. Maybe it could be because of the director being named as co-producer for Pushpa 2. Let's wait for official statement from the officials.
ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్( gautham vasudev menon)తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయమే. వెంకటేష్ తో ఘర్షణ,నాగచైతన్యతో ఏ మాయచేసావే,సాహసం శ్వాసగా సాగిపో,నాని తో ఏటోవెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడుగా మారాడు.  ప్రస్తుతం ఆయన మలయాళంలో మమ్ముట్టి(Mammootty)హీరోగా 'డొమినిక్ అండ్ లేడీస్ పర్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23 న విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమిళ చిత్ర పరిశ్రమని ఉద్దేశించి గౌతమ్ మాట్లాడుతు కోలీవుడ్ హీరోలు స్క్రిప్ట్ ల గురించి కంటే భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడానికే విలువ ఇస్తారు.100 కోట్లు ఖర్చుపెట్టి ఒక సినిమా తీసేకంటే ఆ డబ్బుతో 10 కోట్ల చొప్పున పది సినిమాలు తెరకెక్కించవచ్చు. కథల ఎంపిక నాకు ఇస్తే మలయాళ సినీ పరిశ్రమలోకి ఎన్నో కథల్ని తీసుకొచ్చి ఇక్కడ తెరకెక్కిస్తాను.అలాంటి కథలకి తమిళ హీరోలు ఓకే చెప్పరు కానీ, ఇక్కడ విజయం సాధిస్తే మళ్ళీ ఆ సినిమాలని తమిళంలోకి రీమేక్ చేస్తారు.ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇక తమిళ ఇండస్ట్రీ లో కొనసాగకపోవచ్చని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతానికి ఆయన మాటలు వైరల్ గా నిలిచాయి. నటుడుగా కూడా గౌతమ్ చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.     
Monalisa, the viral sensation girl from Maha Kumbh Mela 2025, lost sales after she went viral. Many started harassing her for a selfie and sales of beads dropped at her make-shift counter. The 16-year old girl has come to Kumbh with her father to sell beads to devotees.  But she got famous due to her attractive looks and became a viral sensation. Her father sent her back to Indore, their hometown looking at the kind of harassment she is facing. Now, a director Sanoj Mishra has decided to offer a leading role in his next film.  He stated that he would go and directly meet her and discuss about the offer with her family. He stated that he has been waiting for someone like her to be part of his upcoming film, Diary of Manipur. He stated that her dusky skin and honey flavor eyes are an asset for her and the film, as well.  The director's films did not become a huge success or highly popular. Still, this could be a good start for her as Rajkummar Rao's brother Amit Rao is said to be debuting with this film as a lead actor. Let's see if she would take this opportunity to set off her acting career. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  జాతి పిత అనే పేరు అందరూ వినే ఉంటారు.  జాతిపితగా గాంధీని పిలుస్తారని తెలుసు. కానీ ఆంధ్రదేశ పితామహుడి గురించి తెలుసా? అసలు ఆంధ్రదేశానికి పితామహుడిగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసా? ఆంధ్రదేశ ప్రజలకు తెలియని ఆంధ్ర పితామహుడు మన మాడపాటి హనుమంతరావు  గారు.  మాడపాటి హనుమంతరావు గారు ప్రముఖ రాజకీయ నాయకుడు,  రచయిత,  ఆంద్రోద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించాడు.  మాడపాటి హనుమంతరావు గారి గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  ఆయన జీవితం ఏంటి? ఆయన ఆంధ్ర పితామహుడుగా ఎలా పిలవబడ్డాడు.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. మాడపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లా, నందిగామ తాలూకా, పొక్కునూరులో వెంకటప్పయ్య,  వెంకట సుబ్బమ్మ దంపతులకు 1885, జనవరి 22న జన్మించారు.  వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు. ఈయన తండ్రి గ్రామాధికారిగా చేసేవారు. మాడపాటి వారు మంచి కవి,  రచయిత కూడా.  ఆయన చాలా కథలు రాశారు.  ఇవి పుస్తక రూపంలో కూడా వెలువడ్డాయి. తెలంగాణా ఆంద్రోద్యమం ఈయనకు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.  ఈయన బహుభాషా వేత్త. పాత్రికేయునిగా కూడా తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి  ఆంధ్ర మహాసభను నెలకొల్పారు.  రాజకీయంలో ఈయన మితవాదిగా ఉన్నారు. పేరుకు మితవాదిగా ఉన్నా ఈయన తరువాతి తరం వారు అతివాదులుగా రాణించడానికి ఈయన నాయకత్వమే కారణమని విమర్శకుల అభిప్రాయం.  తెలంగాణలో చైతన్యానికి ఆయన చేసిన  తొలి ప్రయత్నాలే కారణం.  అందుకే ఈయన అంటే అందరికీ ఇష్టం ఉండేది. ఆంధ్ర మహాసభకు ఈయన పెద్ద దిక్కులా ఉండేవారు. నిజాం పాలన కారణంగా తెలంగాణలో తెలుగు భాష దెబ్బతింటున్నప్పుడు  తెలుగు భాష, తెలుగు సంస్కృతి వికాసానికి చాలా కృషి చేశారు. ఆయన కృషిని గురించి ప్రస్తావిస్తూ రావి నారాయణరెడ్డి "తెలంగాణాలో తెలుగుభాషకు ఒక గౌరవస్థానాన్ని కలిగించి, తెలుగువారికి తెలుగుభాషను నేర్పిన ఘనత కూడా మాడపాటి వారిదే. నాతోటి యువకులెందరో ఆయన వల్ల ప్రాభావితులై ఆంధ్ర వాఙ్మయంతో పరిచయం ఏర్పరుచుకున్నారు. నాలాగే ఇంకెందరినో ప్రభావితులను చేసిన పంతులుగారికి ఆంధ్ర పితామహుడన్న బిరుదు ఆయన పట్ల సార్థకతను సంతరించుకుంది." అన్నారు. ఆంద్రోధ్యమంలో పనిచేయగలిగిన వారిని స్వయంగా గుర్తించి వారికి తగిన భాద్యతలు అప్పగించేవారట.  ఇలా సమర్థులైన  తెలంగాణ వారే తరువాతి తరంలో తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో నాయకత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారని అంటారు. గ్రంథాలయోధ్యమంలోనూ చెప్పుకోదగ్గ కృషి సాగించారు మాడపాటి వారు. సన్మానాల ద్వారా తనకు వచ్చే డబ్బును కూడా గ్రంథాలయాల అభివృద్దికే ఉపయోగించారు.  భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత  పాఠశాలను హైదరాబాద్ లోని నారాయణగూడలో స్ఖాపించారు.  ఈ పాఠశాల ఇప్పటికీ ఉంది.  ఈయన ప్రజా జీవితాలలోనే ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల రాజకీయ రంగంలో అంత చురుగ్గా ఉండలేకపోయారు. ఆంధ్రోద్యమాన్ని బలోపేతం చేయాలంటే గ్రంథాలయాల స్థాపన జరగాలి, మాతృభాష పట్ల అభిమానం పెరగాలి. ఆంధ్రోద్యమ స్ఫూర్తి పల్లెసీమల ద్వారా వ్యాపించాలి. గ్రామీణ జనావళికి సర్కారీనౌకర్ల వల్ల ఏర్పడే పీడను తొలగించాలి. ఉద్యమంలో రాజకీయ క్రీనీడలు చోటు చేసుకోకుండా చూడాలి. ప్రభుత్వానికి అధికార వర్గానికి ఆంధ్రోద్యమ కార్యకర్తలపై అనుమానాలు ప్రబలకుండా జాగ్రత్తపడాలని ఆయన అనుకునేవారు. మాడపాటి హనుమంతరావు తన ప్రజాజీవితంలో ఒకే ఒకసారి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని శాసనసభకు 1952లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ నగరానికి తొలి మేయరుగా పనిచేసిన ఘనత ఆయనకు దక్కింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోనూ ఆయనకు స్థానం దక్కింది. ఆ శాసనమండలికి తొలి అధ్యక్షునిగానూ ఆయన వ్యవహరించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి కృషి చేసిన మాడపాటి వారు చిరస్మరణీయులుగా నిలిచారు.                                   *రూపశ్రీ. 
  ఫ్యూచర్ అంటే భవిష్యత్తు..  రేపు అనేది కూడా భవిష్యత్తు కిందకే వస్తుంది.  రేపు అనేది ఎప్పుడూ బావుంటుంది.  చాలా వరకు రేపటి గురించి పాజిటివ్ గానే ఆలోచిస్తారు.  కానీ రేపు అనేది  చాలా అందంగా ఉంటుందని నమ్మించి ఆ తర్వాత మోసం చేయడమే ఫ్యూషర్ పేకింగ్ అని పిలవబడుతోంది. చాలా వరకు ఈ ఫ్యూచర్ ఫేకింగ్ లో ప్రేమ, వివాహం బంధాలలో చిక్కుకున్న వాళ్లే బలి అవుతూ ఉంటారు.  అసలు ఈ ఫ్యూచర్ పేకింగ్ కారణంగా ఎందుకు నష్టం జరుగుతుంది? దీని కారణంగా ఎవరు ఎలా బలి అయిపోతున్నారు తెలుసుకుంటే.. నువ్వు బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు అందంగా ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తుంది అని పెద్దలు పిల్లలకు చెబుతారు. ఇది పిలల్ల భవిష్యత్తును మంచిదిశగా తీసుకెళ్తుంది. కానీ ప్రేమించిన అమ్మాయితో  అబ్బాయి  భవిష్యత్తు గురించి ఆశ కల్పించి,  భవిష్యత్తులో  తనను చూసుకునే విధానం గురించి అందంగా, గొప్పగా చెప్పి  వాస్తవ జీవితంలో ఆ అమ్మాయిని  శారీరకంగా లేదా ఆర్థికంగా ఉపయోగించుకోవడం అనేది ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది.  ఎందుకంటే అమ్మాయికి తన ప్రేమికుడు చెప్పిన మాటలన్నీ కేవలం ఆశ పెట్టడం కోసం చెప్పిన మాటలే తప్ప అవన్నీ వాస్తవంగా అతను చేయడు.   పైన చెప్పుకున్నట్టే.. వివాహం అయిన తరువాత భార్యను మభ్యపుచ్చి  భార్యను ఇబ్బందుల పాలు చేసి,  ఆర్థికంగా అయినా వేరే ఇతర విషయాలలో అయినా లాభపడే భర్తలు చాలామంది ఉన్నారు.  భార్యకు భవిష్యత్తు గురించి ఆశను,  సంతోషాన్ని ఎర వేసి భార్యను  మోసం చేసేవారు ఉంటారు.  ఇందులో భార్య నష్టపోవడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ఎలాంటి సంతోషం లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది.   మనుషులకు రేపటి మీద ఆశ చూపడం,  భవిష్యత్తులో అది చేస్తా, ఇది చేస్తా అని అబద్దపు వాగ్దానాలు చేసి వారు లాభపడిన తరువాత   అవన్నీ వట్టి మాటలుగానే మిగిలిపోతాయి. ఇది కేవలం భార్యాభర్తలు, ప్రేమ వంటి స్థితులలోనే కాకుండా  వృద్దులు, పిల్లలు కూడా ఈ ఫ్యూచర్ పేకింగ్ లో బలైపోయే అవకాశాలు ఉన్నాయి.    అందుకే భవిష్యత్తు గురించి ఎవరైనా చేసే వాగ్థానాల కోసం  వర్తమానంలో నష్టపోవడానికి ఎప్పుడూ సిద్దపడకూడదు.                                       *రూపశ్రీ.  
మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.  ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు..... మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।  మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.  నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.   కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో! పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా! ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.                                      *నిశ్శబ్ద.
  పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వాళ్లకు కాస్త నడక వచ్చిందంటే చాలు.. ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. తమ తల్లిదండ్రులను, పెద్దలను కూడా పరుగులు పెట్టిస్తారు. అయితే కాళ్లు, చేతుల ప్రాంతాలలో కలిగే గాయాలు, దెబ్బలు మందు రాస్తే లేదా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ పిల్లల హడావిడి ఆటల్లో వారికి  చాలా సార్లు తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి.  నిజానికి ఇలా తలకు దెబ్బలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  పిల్లలు నొప్పికి ఏడిస్తే బుజ్జగించడం,  దెబ్బ తగిలిన ప్రాంతంలో  రుద్దడం వంచివి చేయడం వల్ల నొప్పి  తగ్గేలా చేస్తారు.  గాయాలు అయ్యి చర్మం  దెబ్బ తిన్నప్పుడు లేదా రక్తం కారడం వంటివి జరిగినప్పుడు తప్ప వైద్యులను సంప్రదించడం జరగడం లేదు.  అయితే  పిల్లలకు పదే పదే తలకు దెబ్బ తగలడం అంత తేలికగా తీసుకోవాల్సి విషయం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఏదైనా గాయాలు తగిలినప్పుడు  చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చెయ్యాలని చూస్తారు. పిల్లలకు కోతలు,  కాలిన గాయాలు జరిగితే వాటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చాలామంది పేస్ట్ రాయడం,  కొబ్బరినూనె రాయడం, బర్నల్ వంటి ఆయింట్మెంట్లు రాయడం,  పసుపు పెట్టడం వంటివి చేస్తారు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇవి చేయకూడదు. వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. పిల్లలకు తగిలే గాయాలు, వారికి అయ్యే కోతలు వంటివి కొన్నిసార్లు పైపైన కాకుండా లోతుగా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు ఇచ్చే వైద్యమే సరైనది. తల గాయాలు.. పిల్లల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే.. పదే పదే దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. చాలా వరకు తలకు దెబ్బలు తగులుతాయి కానీ ఎలాంటి నష్టం బయటకు కనిపించదు.  కానీ ఇలాంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటే మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.   ముఖ్యంగా ఇన్పెక్షన్  సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు గాయాలు, దెబ్బలు తగిలితే మొదట గాయాలు క్లీన్ చేయడానికి శుభ్రమైన నీరు, డెట్టాల్ లేదా మెడికేషన్ వైప్ వంటివాటితో శుభ్రం చేయాలి. వైద్యులు సూచించిన మందులను ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా వాడాలి.  తరువాత వైద్యుడిని సంప్రదించాలి.  తగిలిన ప్రాంతం నల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే లోపలి ప్రాంతంలో రక్తం గడ్డ  కట్టిందని అర్థం.  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు తగిలే దెబ్బల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                                      *రూపశ్రీ.  
  దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం చాలా సాధారణం.  అయితే కొందరికి ఎప్పుడూ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు, ఎన్ని నీళ్లు తాగినా సరే.. దాహం తీరదు. ఈ పరిస్థితి ఏంటో అర్థం కాక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని సమాధానం చెప్పుకుని కొందరు ఈ సమస్యను లైట్ తీసుకుంటారు.  కానీ విపరీతమైన దాహం అనేది కొన్ని వ్యాధులకు సూచన అని,   ఈ సమస్య వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.   ఇంతకీ ఎప్పుడూ దాహంగా అనిపించడం సమస్య అవుతుందా? దీని వెనుక కారణాలు ఏంటి? ఇవి ఏ జబ్బులు కలిగిస్తాయి? తెలుసుకుంటే.. వేసవికాలంలో దాహం వేయడం సహజం.  అయితే దాహం వేసినప్పుడు నీరు తాగితే దాహం తీరుతుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. ఇలా తరచుగా దాహం వేయడం అనేది శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూందనడానికి సూచన. మధుమేహం.. కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది.  చాలామందికి తెలియదు కానీ ఇది మధుమేహానికి సూచన.  ఎప్పుడూ గొంతు పొడిబారడం,  దాహం వేయడం అనేవి  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతాయట.  రక్తంలో అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఈ కారణంగా శరీరం నుండి ద్రవం ఎక్కువగా చెమట,  మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది.  దీని వల్ల పదే పదే దాహం వేస్తుంది.   రక్తహీనత.. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాన్ని రక్తహీనత అంటారు. ఎర్ర రక్తకణాలు శరీరంలో తగినంత  ఉత్పత్తి చేయబడవు.  శరీరంలో రక్తం తక్కువగా ఉంటే శరీరం డీహైడ్రేట్ కు గురికావడం,  పదే పదే దాహం వేయడం జరుగుతుంది.  పొడి గొంతు సమస్య కూడా పెరుగుతుంది. జీర్ణక్రియ.. వేయించిన ఆహారాలు,  నూనెలో డీప్ ప్రై చేసిన ఆహారాలు,  తీపి పదార్థాలు మొదలైనవి తిన్నప్పుడల్లా జీర్ణక్రియ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.   ఇదే పదే పదే దాహం వేయడానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.  
  వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి.  వేసవిలో చల్లగా ఏమైనా తాగాలని అనుకుంటాం. అదే చలికాలం వచ్చే సరికి ఆహారపు అలవాట్ల ఎంపిక నుండి ఆహారం ఉండే స్థితి వరకు అన్నీ మారతాయి.  ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు,  ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందినదే కుంకుమ పువ్వు పాలు.  చలికాలంలో చాలామంది కుంకుమ పువ్వు జోడించిన పాలు తాగాలని అనుకుంటారు.  కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిపిట్స్ ఏంటంటే.. కుంకుమ పువ్వు ఖరీదైన మసాలా దినుసు.  అయినా సరే కొన్ని సందర్భాలలో కుంకుమ పువ్వును తప్పక వాడతారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సెరోటోనిన్ హార్మోన్ పాత్ర చాలా ముఖ్యం.  కుంకుమ పువ్వు సెరోటోనిన్ హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది.  అందుకే కుంకుమ పువ్వు పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుంది.  గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగాలనే నిబంధన పెట్టినది కూడా వారిలో గర్భధారణ కారణంగా ఏర్పడే ఒత్తిడి నియంత్రణలో ఉండాలనే. కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగేటప్పుడు చాలా కొద్ది పరిమాణమే ఉపయోగిస్తారు.  కేవలం కొన్ని కుంకుమ పువ్వు రేకలను ఉపయోగిస్తారు.  కానీ ఇది చాలా శక్తివంతమైనది.  ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది.  అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. రోజూ కుంకుమపువ్వు పాలు తాగుతుంటే వయసు పెరిగినా అందం తగ్గదు. కుంకుమ పువ్వులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలలో కూడా కాల్షియం ఉంటుంది.  ఇది ఎముకలను బలపరుస్తుంది.  బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే కుంకుమ పువ్వులో కంటికి మేలు చేసే విటమిన్-ఎ కూడా ఉంటుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో కూడా  కుంకుమ పువ్వు పాలు సహాయపడతాయి. కుంకుమ పువ్వు పాలు నిద్ర బాగా పట్టడంలో సహాయపడతాయి.  చలికాలంలో ప్రతిరోజూ కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల  పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్నీ చేకూరతాయి.                                              *రూపశ్రీ.