LATEST NEWS
తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు  ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కావడం లేదని సెలబ్రిటీలు చెబుతున్నారు. నేరం చేయనప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు . అయినా సెలబ్రిటిలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించడమే. బెట్టింగ్ యాప్ ప్రోత్సహించడం హీనియస్ క్రైం. బెట్టింగ్ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కూడా.   ఈ విషయం తెలుసుకాబట్టే సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లకు రావడానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్న వారిలో యూట్యూబర్ హర్షసాయి చేరాడు. ఆయనపై పంజాగుట్ట, మీర్ పేట పోలీస్ స్టేషన్లలో వేర్వురు కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు పిలిచినప్పటికీ హర్షసాయి ముఖం చాటేశాడు. నేరుగా  గురువారం ( ఏప్రిల్ 3) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై మియాపార్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదయ్యాయంటూ న్యాయస్థానం ఆశ్రయించాడు. తనపై కక్ష్య కట్టిన కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. వాస్తవానికి సామాజిక కార్యకర్త ఒకరు  ఆధారాలతో బయట పెట్టడం వల్లే 15 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు విచారణ జరుపుతుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవల్సి ఉంటుంది. అవేవి లేకుండానే సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు నాశ్రయిస్తున్నారు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు. కేవలం కేసు నమోదైతేనే కోర్టు నాశ్రయించడం అంటే తాము చేసిన నేరాన్ని పరోక్షంగా ఒప్పుకోవడమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. తహైకోర్టునాశ్రయించిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిలో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ శ్యామల ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమె హైకోర్టు నాశ్రయించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. యాంకర్ విష్ణు ప్రియ కూడా తెలంగాణ హైకోర్టు నాశ్రయించి భంగపడింది. తాజాగా యూట్యూబర్ హర్షసాయి హైకోర్టు నాశ్రయించినప్పటికీ ఫలితం శూన్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. క్వాష్ కొట్టివేస్తే అవమానమైనప్పటికీ హర్షసాయి హైకోర్టునాశ్రయించడం గమనార్హం. హర్షసాయిపై  ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్  అత్యాచార ఆరోపణలు  చేశారు. ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేసినట్టు ముంబైకు చెందిన యువతి కూడా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు ఆర్జించడమే పరమావధిగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నారు. దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుంది సెలబ్రిటీల తీరు. 
ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్‌పై విరుచుకుపడిన ఆ ఫైర్‌బ్రాండ్‌ నేత సడన్‌గా సైలెంట్ అయ్యారు.  ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం నెల్లూరులో హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన సింహపురి నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌. ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారంలో కొనసాగినప్పుడు అనిల్ దూకుడు అలా ఇలా  కాదు ఓ  రేంజ్ లో ఉండేది.  అసెంబ్లీలో సైతం చొక్కా గుండీలు విప్పుకుని బజారు గూండాలా టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలుతూ, సవాళ్లు విసురుతూ నానా హడావుడి చేసేవారు. వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయ్యారు. అనిల్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చారు. అప్పట్లో ఆనం ఫ్యామిలీ ఆశీస్సులతో నెల్లూరు కార్పొరేటర్‌గా గెలిచారు.  నెల్లూరు సిటీ రాజకీయాల్లో మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గం పెత్తనమే నడిచేది. 1972 నుంచీ అక్కడ వారిదే ఆధిపత్యం... అయితే 2014, 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన అనిల్ యాదవ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మొదటి టర్మ్‌ మంత్రిగా పనిచేశారు. మొదట్నుంచీ అగ్రెసివ్‌గా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్, జగన్‌పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా జగన్‌ను విమర్శిస్తే, ముందూ వెనుకా చూడకుండా విరుచుకుపడేవారు. జగనన్నకు నమ్మిన బంటునని ఓపెన్‌గానే చెప్పుకునే వారు. ఆ దూకుడుతోనే జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి, జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ, జగన్ క్యాబినెట్‌లో  స్థానం దక్కించుకోగలిగారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.  ఎవరినీ ఖాతరు చేయరనే విమర్శలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నేతలపైనే పరోక్ష విమర్శలు చేసేవారు. తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకునేవారంట. ఆయన మాట తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. మంత్రిగా ఉన్నా, జిల్లా అభివృద్ధికి ఆయన ఏమీ చేయలేదనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికలకు ముందు పార్టీలోని పలువురు నేతలు రకరకాల కారణాలతో అనిల్‌కు దూరమయ్యారు.  అయినా బీసీ సామాజిక వర్గం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో జగన్ కూడా  అనిల్‌ని బానే ప్రోత్సహించారు. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో పరిధులు దాటి ఓవర్ యాక్షన్ చేసిన ఆయన, ఒక రకంగా చెప్పాలంటే తన గొయ్యి తానే తవ్వుకున్నారంటారు.  నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా రెండు సార్లు పనిచేసిన అనిల్,  సొంత పార్టీలోనే అందరికీ శత్రువయ్యారు. తన తర్వాత జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డితో విభేధాలు,  ప్రస్తుత టీడీపీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో గ్యాప్ వంటివి మూడో సారి అనిల్‌కు నెల్లూరు సిటీ టికెట్ దక్కకుండా చేశాయి. వైసీపీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్‌ను కాదని మరో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించినా, అనిల్‌ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌కు దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు. దాంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇక నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ టీడీపీ నుంచి పోటీ చేసిన నారాయణ చేతిలో దారుణంగా ఓడిపోయారు . అసలు టికెట్ల కేటాయింపు సమయంలోనే అనిల్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది.  అంత సీన్ లేదు, తనకు ఎవరూ అడ్డుకోలేరని.. అనిల్ ఘాటుగా రియాక్టయ్యారు. ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు . అయితే ఎన్నికల సమయంలో ఆ ప్రచారమే నిజమైంది . జగన్ ఆదేశాలతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నెల్లూరులో సవాల్ చేసిన అనిల్, రిజల్ట్ తర్వాత ఏమైంది మీ రాజకీయ సన్యాసం అని అడిగితే  తన సవాల్‌ని ప్రత్యర్థులు తీసుకోలేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు . అనిల్ మాట నిలబెట్టుకోకపోయినా,  పరిస్థితులు నిజంగానే ఆయన్ని రాజకీయ సన్యాసం తీసుకునేలా చేశాయంటున్నారు. ఓటమి తర్వాత అనిల్ కుమార్‌ సింహపురిలో కనిపించడమే మానేశారు. పార్టీ యాక్టివిటీస్‌కి కూడా పూర్తిగా దూరమయ్యారు. ఏమైపోయారా అని ఆరా తీస్తే ఆయన  నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారని తెలిసింది . అక్కడ ఆయనకి కొన్ని బిజినెస్‌లు ఉన్నాయంట. హైదరాబాద్‌లో కూడా వ్యాపారాలు ఉన్నాయని,  వాటినే ఫుల్ టైం చూసుకుంటున్నారని చెబుతున్నారు. అప్పుడప్పుడూ నెల్లూరుకు వస్తున్నా.. తన సన్నిహితులతో మాట్లాడి చాటుగా వెళ్లిపోతున్నారు తప్ప, పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదంటున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తూ .. మా అనిల్ బ్రో.. పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిందని ... రాజకీయ సన్యాసం తీసేసుకున్నారని సింహపురిలోని ఆయన పాత అనుచరులు ప్రచారం మొదలు పెట్టడం విశేషం. ఇదికూడా చదవండి https://www.teluguone.com/news/amp/content/anil-kumar-yadev-obscand-39-178365.html
మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ ఆ పరిసరాలలో నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ మూసి పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వరాదని రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిధిలో నిర్మాణాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.   ఇలా ఉండగా మూసీకి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతులను తప్పని సరి చేసింది. ఈ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతులు తప్పని సరని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.  పర్యావరణ పరిరక్షణ, క్రమబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కర్ ఈ నిర్ణయం తీసుకుంది.  
 కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన  వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు  12 గంటలకు పైగా చర్చ జరిగింది.  చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.  వాస్తవానికి ఈ బిల్లును గతంలోనే  కేంద్రం ప్రతిపాదించింది. అప్పట్లో ఈ బిల్లులోని కొన్ని అంశాలపై పలు పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బిల్లులో సవరణల కోసం జేపీసీని నియమించింది. పలు దఫాలుగా భేటీలు నిర్వహించిన జేపీసీ ఆయా పార్టీలు చేసిన సూచనలలో కొన్నిటిని ఆమోందింది. ఈ సవరణలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణలకు గాను జేపీసీ మూడింటిని ఆమోదించింది.  అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం గురువారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ చేపట్టగా ఎన్డీయే పక్షాలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరమేంటంటే.. వైసీపీ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ ఇప్పటి వరకూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ తొలి సారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లు ఆమోదం విషయంలో ఒకింత ఇబ్బందులను కేంద్ర సర్కార్ ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఏకతాటిపై నిలబడి లోక్ సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాయి.  
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు. వీరి మధ్య ద్వేపాక్షిక సంభంధాల మెరుగుదలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోడీ బెమ్ టెక్ శిఖరాగ్ర సదస్సులో  పాల్గొంటారు.  ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరుగుతాయి.  ఈ శిఖరాగ్ర సమావేశానికి థాయ్ ల్యాండ్ సీఎం పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య  హాజరుకానున్నారు. 2 018లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ పద్ధతిన జరిగింది.  
ALSO ON TELUGUONE N E W S
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ప్రముఖ సినీనటుడు ప్రకాష్ రాజ్(Prakash raj)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.కలియుగదైవంశ్రీ ఏడుకొండలవాడి దివ్యప్రసాదమైన తిరుపతి లడ్డు గత వైసిపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు వచ్చినపుడు జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా పవన్ సనాతన దర్మం దీక్ష చేయడంతో పాటు,లడ్డు కల్తీ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పాడు.దీంతో పవన్ ని ఉద్దేశిస్తు ప్రకాష్ రాజ్ విమర్శలు చెయ్యడం,పవన్ కూడా అదే రీతిలో సమాధానం ఇవ్వడం జరిగింది.రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో జాతీయ అవార్డులు,రాజకీయాలపై తన అభిప్రాయూలని పంచుకున్నాడు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడారు.అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలని పట్టించుకోకుండా సమయం వృధా చేస్తున్నారు.నేను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు.తిరుపతి లడ్డు విషయం చాలా సున్నితమైన అంశం.భక్తుల మనోభావాలకి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.లడ్డు తయారిలో నిజంగానే కల్తీ జరిగితే దోషులని వెంటనే  శిక్షించాలని చెప్పుకొచ్చాడు. పవన్, ప్రకాష్ కలిసి పలు చిత్రాల్లో నటించారు.బద్రి మూవీ ఈ ఇద్దరి కాంబోకి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చింది,చివరిగా ఈ ఇద్దరు వకీల్ సాబ్ లో నటించగా పవన్ అప్ కమింగ్ మూవీ 'ఓజి'(Og)లో కూడా ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.    
నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ ఆదిత్య 369(Aditya 369).ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కగా శ్రీకృష్ణ దేవరాయలు,కృష్ణ కుమార్ గా డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ నటన నభూతో నభవిష్యత్తు.1991 లో వచ్చిన ఈ మూవీ 35 ఏళ్ళ తర్వాత రేపు (ఏప్రిల్ 4 )న రీ రిలీజ్ అవుతుంది.దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉండగా చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singeetam Srinivasa rao)ప్రేక్షకులతో మూవీకి సంబంధించిన పలు విషయాలని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతు ఆదిత్య 369 ని ఇప్పుడున్న సాంకేతిక తో తెరకెక్కిస్తే బాగుండనే క్షణాలు ఎన్నో ఉన్నాయి.శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెరకెక్కిద్దామని అనుకున్నపుడు నా మదిలో బాలకృష్ణ ఒక్కరే మెదిలారు.ఎన్ టి ఆర్ గారు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు క్యారక్టర్ ని మెప్పించడం మళ్ళీ బాలకృష్ణ గారికే సాధ్యమవుతుంది.అందుకే ఆ క్యారక్టర్ కి బాలకృష్ణ గారిని తప్ప మరొకర్ని ఊహించలేదు.టైం మిషన్ అనేది కాంతి వేగంకి సంబంధించింది.కాంతి అంటే సూర్యుడు కాబట్టి ఆయన మరో పేరు ఆదిత్య అని అనుకున్నాం. అదే సమయంలో బోయింగ్ 737 విమానం గుర్తుకు రావడంతో ఆదిత్య 369 అని ఫైనల్ చేసాం. ఈ మూవీ సీక్వెల్ తో తన వారసుడు మోక్షజ్ఞని పరిచయం చెయ్యాలని బాలకృష్ణ గారు అనుకున్నారు కానీ కుదరలేదు.ఇప్పటకీ సీక్వెల్ చెయ్యాల్సిందే అని చెప్తుంటారు.హెచ్ జీ వేల్స్ రచించిన 'ది టైంమిషన్' పుస్తకాన్ని కాలేజీ రోజుల్లో చదివాను.అందులో సైన్స్,ఫిక్షన్ వంటి అంశాలు ఉన్నాయి.ఆ ఇన్ స్ప్రెషన్ తోనే ఆదిత్య 369 ని తెరకెక్కించానని చెప్పుకొచ్చారు.భారతీయ చిత్ర పరిశ్రమ దగ్గ దర్శక శిఖామణుల్లో సింగీతం శ్రీనివాస్ కూడా ఒకరు.1972 లో 'నీతి నిజాయితీ' అనే చిత్రంతో దర్శకుడుగా ప్రారంభించి,అన్ని రకాల జోనర్స్ కి సంబంధించిన చిత్రాలు తెరకెక్కించి తన సత్తా చాటారు.బహుశా ఇండియన్ చిత్ర పరిశ్రమలో సింగీతం గారిలా అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేసిన దర్శకుడు మరొకరు లేరేమో.తరం మారింది,పంతులమ్మ, అమెరికా అమ్మాయి,సొమ్మొకడిది సోకొకడిది,మయూరి,పుష్పక విమానం,బృందావనం,భైరవ ద్వీపం,మేడమ్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.కన్నడ,తమిళ భాషల్లోను పలు చిత్రాలు తెరకెక్కించారు.చివరిగా 2013 లో  వెల్ కం ఒబామా అనే చిత్రానికి దర్శకత్వం  వహించిన సింగీతం వయసు ప్రస్తుతం 93 ఏళ్ళు.ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి దగ్గరలో ఉన్న గూడూరు.     
  2023 లో వచ్చిన విజయవంతమైన చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన మూవీ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square). నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మ్యాడ్ స్క్వేర్.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.   'మ్యాడ్ స్క్వేర్'లో హీరోగా నటించిన నార్నె నితిన్‌.. ఎన్టీఆర్ కి బావమరిది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తోనూ ఆయనకు మంచి అనుబంధముంది. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే జరిగింది. అంతేకాదు, సితార బ్యానర్ లో రూపొందిన మరో సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ కి కూడా ఆయన గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక ఇప్పుడు మ్యాడ్ 2 సక్సెస్ మీట్ కి రాబోతున్నట్లు సమాచారం.   హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో శుక్రవారం(ఏప్రిల్ 4) సాయంత్రం 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావడానికి ఎన్టీఆర్ అంగీకరించాడని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని అంటున్నారు.   'మ్యాడ్ స్క్వేర్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు.   
  ఈ తరంలో టాలీవుడ్ లో ఆరుగురు టాప్ స్టార్స్ ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడమే గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉంది. మహేష్ బాబు (Mahesh Babu) విషయానికొస్తే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. అది విడుదల కావడానికి కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. అప్పటివరకు మహేష్ కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశముండదు. ఇక మిగిలింది నలుగురు స్టార్స్. ప్రజెంట్ ఈ నలుగురూ కూడా పాన్ ఇండియా స్టార్స్ కావడం విశేషం. మరి వీరి లైనప్ ఎలా ఉందో చూద్దాం.   'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ (Prabhas).. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది 'కల్కి'తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ప్రశాంత్ నీల్ తో 'సలార్-2', నాగ్ అశ్విన్ తో 'కల్కి-2' కూడా చేయాల్సి ఉంది.   'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ (Allu Arjun).. తన తదుపరి సినిమాలతోనూ అదే జోరు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో యాక్షన్ ఫిల్మ్ చేయనున్నాడు. ఆ తర్వాత 'పుష్ప-3' లైన్ లో ఉంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు.    'ఆర్ఆర్ఆర్', 'దేవర' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' కూడా మొదలైంది. వీటితో పాటు 'దేవర-2' లైన్ లో ఉంది. అలాగే, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక మూవీ చేయనున్నాడని సమాచారం.   'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan).. ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. లోకేష్ కనగరాజ్ తోనూ ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి.  
నాచురల్ స్టార్ నాని(nani)దసరా(Dasara),హాయ్ నాన్న,సరిపోదా శనివారం లాంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ ని సాధించి మంచి జోష్ మీద ఉన్నాడు.అదే ఉత్సాహంతో ఇప్పుడు హిట్ 3 ,ది ప్యారడైజ్ అనే సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు కూడా వేటికవే డిఫరెంట్ సబ్జెట్ తో కూడిన చిత్రాలు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.హిట్ 3  మే 1 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుండగా'ది ప్యారడైజ్' వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)దర్శకుడు. కొన్ని రోజుల క్రితం'రా స్టేట్ మెంట్' పేరుతో ది ప్యారడైజ్ నుంచి నాని క్యారక్టరయిజేషన్ తో కూడిన వీడియో రిలీజ్ చెయ్యగా నాని గెటప్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీ ని పెంచడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పినట్లయింది. ఇప్పుడు 'ది ప్యారడైజ్'(The Paradise)మూవీ స్క్రిప్ట్ నాని కి నచ్చలేదని,బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి.వీటిపై నాని టీం స్పందిస్తు ఏనుగు నడుచుకుంటు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయి.కానీ ది ప్యారడైజ్ పనులు అనుకున్న విధంగానే సాగుతున్నాయి.దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో త్వరలోనే చూస్తారు.అప్పటికి వరకు మీరు రూమర్స్ సృష్టిస్తూ బతికేయండి.ఫ్యాన్స్ మా మూవీ పై చూపిస్తున్న అభిమానంతో పాటు వ్యతిరేక శక్తులని కూడా గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం. టాలీవుడ్ చరిత్రలోనే ది ప్యారడైజ్ గర్వించే మూవీ అవుతుంది.రూమర్స్ ప్రచారం చేసే వాళ్లంతా కోలుకోవాలని ఆశిస్తున్నాం.అభిమానులంతా గర్వపడేలా నాని ది ప్యారడైజ్ తో మీ ముందుకు వస్తారని టీం సదరు పోస్ట్ లో పేర్కొంది.తెలుగుతో పాటు తమిళ,హిందీ,మలయాళ,కన్నడ, బెంగాలీ లాంటి భాషలతో పాటు ఇంగ్లీష్,స్పానిష్ వంటి విదేశీ భాషల్లోను 2026 మార్చి 26 న విడుదల కానుంది.     
గత నెల మార్చి 2 వ తేదీన బంగారం అక్రమ రవాణా కేసులో ప్రముఖ కన్నడ సినీ నటి రన్యారావు(Ranyarao)అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె బెంగుళూరు(Bengaluru)లోని ఒక జైల్లో ఉన్నారు.ఈ కేసులో సినీ హీరో విరాట్ కొండూరు కూడా అరెస్ట్ కాగా,ఈ ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తునట్టుగా నిర్దారించారు.విరాట్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తాజాగా రన్యారావు నుంచి విడాకులు కోరుతు ఆమె భర్త జతిన్ తన లాయర్ ద్వారా కోర్టు ని ఆశ్రయించాలని కోరుకుంటున్నట్టుగా  తెలుస్తుంది.జతిన్,రన్యారావు కి గత ఏడాది అక్టోబర్ 6 న పరిచయం జరగగా నవంబర్ 27 న ఆ ఇద్దరి వివాహం 'పంచతారా'హోటల్ లో జరిగింది.జతిన్(Jatin)వద్దంటున్నా కూడా,వ్యాపారం చూసుకోవాలని తరచు రన్యారావు దుబాయ్(Dubai)వెళ్లి వస్తుండటంతో పెళ్లయిన కొన్ని రోజులకే ఆమెకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. రన్యారావు ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు జతిన్ ని కూడా విచారించి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకున్నాకే వదిలేయ్యడం జరిగింది.ఈ కేసు నుంచి బయటపడినా కూడా ఇక రన్యారావు తో ఉండటం సాధ్యం కాదనే జతిన్ విడాకులకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.  
Renowned actress-producer Niharika Konidela delivered a smashing success with the film 'Committee Kurrollu'. Featuring a cast of relatively new faces, the film became a massive box-office success, establishing Niharika as one of the most discerning producers in the Telugu film industry. Now, Niharika is set to launch her second production feature film under her banner, Pink Elephant Pictures. Filmmaker Manasa Sharma will direct the movie. Supremely talented young actor Sangeeth Shobhan, who rose to stardom with his spectacular performances in MAD and MAD Square, will play the lead role in this movie.  This will be his first time headlining a major theatrical feature film as a solo lead hero. More details about the rest of the cast to be revealed in the coming days. Both Manasa and Sangeeth have previously collaborated with Niharika on web projects like Oka Chinna Family Story.  Manasa Sharma worked as a writer for web series Oka Chinna Family Story and as a director for Bench Life produced by Niharika. Now, she is set to debut as a feature film director under the same banner. Manasa Sharma has penned the story of this movie, while Mahesh Uppala has co-written the screenplay and dialogues. 
Popular actress Poonam Kaur, who has acted in several films and became controversial in the news, is gearing up to entertain the audience with an innovative program on a digital platform.  Poonam Kaur is the anchor of the program to be aired titled 'Shakti Aur Sanskrithi'. It is noteworthy that this program has been designed to inspire this generation by respecting the power of women and the culture of India. On Wednesday, the logo of 'Shakti Aur Sanskriti' was unveiled by Jishnu Dev Verma. He congratulated Poonam Kaur for initiating a great program like 'Shakti Aur Sanskriti'.   Speaking on the occasion, he reminded that it is our responsibility to empower women and preserve culture. Jishnu Dev Verma said that programs like 'Shakti Aur Samskriti' will help greatly in achieving that.   
Director Lokesh Kanagaraj has become the most loved and followed director in recent times. His emergence with Maanagaram did not create big wave but his second film, Kaithi changed even the way South Indian action cinema is approached. He took it to next level with Lokesh Cinematic Universe.  He delivered huge blockbusters with Vikram and Leo, starting connected universe concept adding new characters to Kaithi. The director made Master with Thalapathy Vijay and the movie has many moments that have gone viral and became memorable. The director is now returning the favor of Akkineni Nagarjuna.  The Master director has agreed to take a masterclass, that is, give a guest lecture at Annapurna College of Film and Media. He will be taking the class on 4th April and this is the first time, he is giving such a lecture. He is doing so, specially, for Nagarjuna, who agreed to play a prominent role in his Coolie.  Nagarjuna doesn't agree to star in a film without any prominence, and Lokesh asked him to play a negative role. After several discussions, Nagarjuna agreed only due to Lokesh's persistent approach. As Nag did not want to play negative role in Rajinikanth film, it took so much of convincing.  Still, it is a big deal, as Nagarjuna is actively pursuing lead protagonist roles in Telugu Cinema and such a turn could change the perception about him. So, when Nagarjuna asked him to give a lecture for his students, he agreed to it. Coolie is releasing in August this year. 
  ప్రేక్షకులకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని అందిస్తూ వినూత్న కార్యక్రమాలతో అలరించే తెలుగువన్ యూట్యూబ్ ఛానల్.. మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) వ్యాఖ్యాతగా 'శక్తి ఔర్ సంస్కృతి' కార్యక్రమాన్ని తెలుగువన్ తలపెట్టింది. స్త్రీ శక్తిని, భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ.. ఈ తరంలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. (Shakti and Samskruthi)   'శక్తి ఔర్ సంస్కృతి' లాంటి గొప్ప కార్యక్రమానికి తెలుగువన్ శ్రీకారం చుట్టడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా 'శక్తి ఔర్ సంస్కృతి' లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలుగువన్ టీంని ప్రశంసించారు. మహిళలకు సాధికారత కల్పించడం, సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేసిన జిష్ణుదేవ్.. 'శక్తి ఔర్ సంస్కృతి' లాంటి కార్యక్రమాలు అందుకు దోహదపడతాయని అన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవికాలం మొదలవగానే చాలా ఇళ్లలో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు.  ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుండి రాగానే చల్లని నీరు తనివితీరా తాగితే తప్ప శరీరానికి ఉపశమనం, మనసుకు హాయి అనిపించవు. అయితే చాలామంది ఫ్రిజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. అందుకే మేం ఫ్రిజ్ వాటర్ తాగము అని చెబుతూ ఉంటారు. నిజంగా ఫ్రిజ్ వాటర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు.  అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలా మంది.  మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటి? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఫ్రిజ్ నుండి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది.  ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు,ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది.  అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడం చాలా ఆలస్యం. ఫ్రిజ్ నీళ్ళు తాగే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల శరీరంలో మలబద్దకం రావచ్చు.   ఫ్రిజ్ లో చల్లని నీరు తాగడం వల్ల మైగ్రైన్ వచ్చేప్రమాదం పెరుగుతుంది.  ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది.  ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు చల్లని నీరుకు దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలి అనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగవచ్చు.                                  *రూపశ్రీ.
    ఛత్రపతి అనే పేరు వెంటే చాలు.. శివాజీ మహారాజ్ గుర్తుకు వస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు కూడా ఈయనే. 17వ శతాబ్దపు భారతీయ యోధులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా ప్రముఖమైన వారు.  శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఛత్రపతి మహారాజ్ 1680 సంవత్సరం,  ఏప్రిల్ 3వ తేదీన మరణించారు.  2025 ఏప్రిల్ 3వ తేదీ అయిన ఈ రోజు గురువారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్థంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు,  ఆయన మరణానికి దారి తీసిన సంఘటనల గురించి తెలుసుకుంటే.. శివాజీ భోంస్లే (1630-1680 CE) గా జన్మించిన ఆయన ఈ సంవత్సరం  ఫిబ్రవరి 18న ఆయన 395వ జయంతిని జరుపుకున్నారు  ఈరోజు ఆయన 345వ వర్ధంతిని జరుపుకుంటున్నాము.  1680, ఏప్రిల్ 3న, శివాజీ మహారాజ్ అనారోగ్య సమస్యల కారణంగా, తీవ్రమైన జ్వరం,  విరేచనాలతో బాధపడుతూ రాయ్‌గడ్ కోటలో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ రోజున, మహారాష్ట్రతో పాటు  ఇతర ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు,  నివాళుల ద్వారా శివాజీ మహారాజ్  వారసత్వాన్ని గౌరవిస్తున్నాయి.   శివాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియని నిజాలు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630న పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. కొంతమంది శివుడి ప్రేరణగా ఈయనకు శివాజీ అని పెట్టారని చెబితే కొందరుపండితులు అతనికి స్థానిక దేవత అయిన శివాయ్ పేరు పెట్టారని చెబుతారు. శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు.  అతని లక్ష్యం సంస్కృతంలో ఉన్న తన రాజ  ముద్రలో స్పష్టంగా పేర్కొనబడింది. షాహాజీ కుమారుడు శివాజీ రాజ్యం చంద్రవంకలా పెరుగుతూనే ఉంటుందని,  ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆ ముద్ర హామీ ఇచ్చింది. స్వరాజ్యానికి పునాది వేయడానికి శివాజీ మహారాజ్  రాజ్‌గడ్, తోర్నా, కొండనా,  పురందర్ వంటి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. 1656లో శివాజీ మహారాజ్ సతారా జిల్లాలోని జావాలిని స్వాధీనం చేసుకున్నాడు, ఇది వ్యూహాత్మక కారణాల వల్ల చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. తరువాత  రైరీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు, తరువాత దీనిని రాయ్‌గడ్ అని పేరు మార్చారు. దీన్ని శివాజీ మహారాజ్ తన   రాజధానిగా మార్చుకున్నాడు. కొంకణ్ ప్రాంతంలోని మహులి, లోహగడ్, తుంగా, టికోనా, విసాపూర్, సోంగడ్, కర్నాల, తాలా,  ఘోసాల వంటి కోటలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ అష్ట ప్రధాన మండల్‌ను ఏర్పాటు చేశాడు, ఇది ఎనిమిది మంది సలహాదారుల మండలి. వారు రాజకీయ,  ఇతర ముఖ్యమైన విషయాలలో శివాజీ మహారాజ్ కు  సహాయం చేసేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడరేవులు,  వ్యాపార నౌకలను రక్షించడానికి,  వాణిజ్యం,  కస్టమ్స్ నుండి డబ్బు సంపాదించడానికి ఒక నావికాదళాన్ని నిర్మించాడు. అతను 1665 లో తన మొదటి నావికా దండయాత్రను చేపట్టాడు. శివాజీ మహారాజ్ విద్యకు ఒక చిన్న బృందం బాధ్యత వహించింది. ఆ బృందం అతనికి చదవడం, రాయడం, గుర్రపు స్వారీ, యుద్ధ కళలు,  మతపరమైన అధ్యయనాలను నేర్పింది. సైనిక శిక్షణ కోసం అతనికి ప్రత్యేక బోధకుడు కూడా ఉండేవారు. జూన్ 6, 1674న, గగాభట్ అనే గౌరవనీయ పండితుడు అతనికి రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేశాడు. ప్రత్యేక నాణేలు తయారు చేయబడ్డాయి - హోన్ అనే బంగారు నాణెం,  శివరాయ్ అనే రాగి నాణెం - పురాణగాథ శ్రీ రాజా శివఛత్రపతి అని చెక్కబడి ఉన్నాయట.                                        *రూపశ్రీ.
  జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, చాలా అందమైన బంధం భార్యాభర్తల బంధం.  ఇది మధ్యలో ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసి జీవితాన్ని నడిపించే బంధం.  బాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఇచ్చే బంధం ఇది. ఈ బంధం ప్రేమ,  గౌరవం,  నమ్మకం,  అవగాహన పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ప్రతి జంట తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ తెలిసో తెలియకో ఆ బంధంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి.  అవి కాస్తా బంధాన్ని విషపూరితంగా మారుస్తాయి. భార్యాభర్తల బందంలో సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి,  ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.  కానీ ఇవి లేకుండా ఆ బంధంలో ఒత్తిడి మాత్రమే ఉంటున్నట్టు అయితే ఆ బంధం విషపూరితమైన లేదా అనారోగ్యకరమైన వ్యక్తితో బంధంలో ఉన్నట్టు అర్థం. తమ బంధం విషపూరితంగా మారిందా లేదా అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని రిలెషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. అసౌకర్యం.. మీరు మీ భాగస్వామితో మాట్లాడే ప్రతిసారీ అసౌకర్యంగా భావిస్తున్నారా? మీరు తరచుగా చిన్న విషయాలకే వాదించుకుంటారా?  మీ భాగస్వామి ప్రతి వాదనలోనూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారా? అలా అయితే, ఇది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన సంబంధంలో, సంభాషణ తర్వాత  రిలాక్స్‌గా ఉంటారు. కానీ విషపూరిత సంబంధంలో, ప్రతి విషయం మిమ్మల్ని బాధపెడుతుంది.  మిమ్మల్ని బలహీనంగా ఫీలయ్యేలా చేస్తుంది. నియంత్రణ.. మీ భాగస్వామి  ప్రతి చిన్న లేదా పెద్ద విషయంలో జోక్యం చేసుకుంటారా? నువ్వు ఏం వేసుకున్నావు, ఎవరిని కలిశావు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ అతను తన నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటాడు. ఈ ప్రవర్తన సంబంధంలో సమానత్వాన్ని నాశనం చేస్తుంది. దీని కారణంగా, ఇద్దరి మధ్య గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి స్వేచ్ఛ,  గౌరవం రెండూ ఉంటాయి. కానీ మీరు అడుగడుగునా ఆంక్షలను ఎదుర్కొంటుంటే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఒత్తిడి.. మీరు సంబంధంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆందోళన, భయం లేదా ఒత్తిడికి గురవుతుంటే, ఇది సాధారణంగా తీసి పారేసే విషయం  కాదు. విష సంబంధాలలో ప్రజలు తమ భాగస్వామిని సంతోషపెట్టే ప్రయత్నంలో తరచుగా తమను తాము మరచిపోతారు.  మానసికంగా అలసిపోయారని  ప్రశాంతత అదృశ్యమైందని మీరు భావిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఎగతాళి.. ప్రతి వ్యక్తికి తన సొంత అవసరాలు ఉంటాయి. సాధారణంగా ప్రజలు ఈ విషయాల గురించి మొదట తమ భాగస్వాములతో మాట్లాడుతారు. కానీ మీ భాగస్వామి మీ  అవసరాలను విస్మరిస్తే లేదా ప్రతిసారీ  ఎగతాళి చేస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. విమర్శ.. మీ భాగస్వామి మీ స్నేహితుల ముందు మిమ్మల్ని ఎగతాళి చేస్తే,  ప్రతిదానినీ విమర్శిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం. ఆరోగ్యకరమైన సంబంధంలో, మీ భాగస్వామి ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబం లేదా బంధువుల ముందు మిమ్మల్ని సంతోషంగా  ఉంచుతారు.                                    *రూపశ్రీ
ఎనర్జీ డ్రింక్స్ చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇవి తాగగానే బాగా యాక్టీవ్ గా అనిపిస్తుంది కూడా. ఈ రోజుల్లో యువత టీవీ యాడ్స్,   ఫిట్‌నెస్ ఐకాన్‌ లు   శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ తాగడం చూసి ఎనర్జీ డ్రింక్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. యువత మాత్రమే కాదు, అన్ని వయసుల వారు తమను తాము శక్తివంతంగా ఉంచుకోవడానికి,  తక్షణ శక్తి కోసం   ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు. ఈ పానీయాలు తాగడం వల్ల  శరీరానికి కొత్త శక్తి వస్తుంది, కానీ నిజం ఏమిటంటే అవి  గుండె ఆరోగ్యానికి కూడా చాలా హాని కలిగిస్తున్నాయి. వ్యాయామం చేసిన తర్వాత ఎనర్జీ డ్రింక్స్ తాగడం చాలా మంది అలవాటు. దీని వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుందని అనుకుంటారు.  అయితే దీని వల్ల  వ్యాయామం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదని, దీనికి విరుద్ధంగా అది గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్ లో  ఏముంది? ఎనర్జీ డ్రింక్స్ లో ప్రధానంగా కెఫిన్, చక్కెర, టౌరిన్, గ్వారానాతో పాటు  కొన్ని ఇతర ఉత్తేజకాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తాయి, కానీ వాటి అధిక పరిమాణం  హానికరం కావచ్చు. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గుండెపోటు వస్తుందా?  అధిక కెఫిన్ ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది, ఇది హృదయ స్పందన రేటు,  రక్తపోటును పెంచుతుంది. ఇది హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది,  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల ఎనర్జీ డ్రింక్స్ తాగిన తర్వాత రక్తపోటు పెరుగుతుందని పరిశోధనలలో తేలింది.  ఇప్పటికే అధిక రక్తపోటు ఉంటే, ఎనర్జీ డ్రింక్స్ తాగడం ప్రమాదకరం. దీని కారణంగ గుండెపోటు ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అధిక చక్కెర స్థాయి చాలా ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది,. ఇది మధుమేహం,  ఊబకాయాన్ని పెంచుతుంది. ఈ రెండూ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడానికి ప్రధాన కారణాలు.  గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.  క్రమరహిత హృదయ స్పందన ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే కెఫిన్,  ఇతర ఉత్తేజకాలు క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా) కు కారణమవుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుంది. దీని వల్ల గుండెపోటు వస్తుందనే భయం ఉంటుంది. శాస్త్రీయ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి? ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల రక్తపోటు,  హృదయ స్పందన రేటుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది, ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారిలో చాలా ప్రభావం ఉంటుంది.                          *రూపశ్రీ     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వాకింగ్ అనేది చాలామంది దినచర్యలో భాగం.  వాకింగ్ వల్ల శరీరం చాలా వరకు ఫిట్ గా ఉంటుంది. పైగా వాకింగ్ కు ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేదు.  అయితే వాకింగ్ కంటే రివర్స్ వాకింగ్ చాలా బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు, ఫిట్‌నెస్ నిపుణులు.  ఫిట్‌గా ఉండటానికి కేవలం నేరుగా నడవడం సరిపోదని,  ఎప్పుడైనా 15 నిమిషాలు వెనుకకు నడవడానికి ప్రయత్నించి చూస్తే అందులో కలిగే మార్పు మాములుగా ఉండదని అంటున్నారు.  ఈ రివర్స్ వాకింగ్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యానికి చాలా  ప్రయోజనాలను కూడా అందిస్తుంది.  ప్రతిరోజూ వాకింగ్ చేస్తుంటే ఇప్పుడు దాన్ని రివర్స్ వాకింగ్ మోడ్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండోయ్.. వెనుకకు నడవడం వల్ల  కండరాలు కష్టపడి పనిచేస్తాయి.   శరీర సమతుల్యతను మెరుగుపడుతుంది. ఇంకా దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. శరీర బాలెన్స్.. రివర్స్ గా  నడవడం వల్ల  శరీరం తనను తాను సమతుల్యం చేసుకోవడానికి కష్టపడి పనిచేస్తుంది.  ఇది సమతుల్య శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా  తరచుగా తడబడుతూ ఉంటే బ్యాక్ వాక్ దానిని తొలగించడంలో సహాయపడుతుంది. మోకాళ్లు, నడుము నొప్పి తగ్గుతాయి..  మోకాళ్లు లేదా నడుము నొప్పి ఉంటే, వెనుకకు నడవడం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఇది  మోకాళ్లు,  వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది, వాటిని బలంగా చేస్తుంది. ఆర్థరైటిస్ లేదా వెన్నునొప్పితో బాధపడే చాలా మందికి దీని నుండి చాలా ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది..  బరువు తగ్గాలని అనుకునేవారు వెనుకకు నడవడం  గేమ్ ఛేంజర్‌గా సహాయపడుతుంది. ఇది సాధారణ నడక కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెదడు శక్తి.. వెనుకకు నడవడం వల్ల  మెదడు మరింత చురుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీర బాలెన్స్ ను కాపాడుకోవడానికి కష్టపడి పనిచేస్తుంది. ఇది  జ్ఞాపకశక్తిని పదును పెట్టడమే కాకుండా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. కండరాలను బలంగా ఉంచుతుంది.. ఇది  కాళ్ళు, తొడలు,  నడుము కండరాలను బలపరుస్తుంది. గంటల తరబడి కుర్చీపై కూర్చుని పనిచేసే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    
వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తగినంత నీరు తాగరు, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఒక సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్న చాలా మందికి గందరగోళం కలిగిస్తుంది. వైద్యులు కూడా నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  వేసవిలో ఎంత నీరు తాగాలి అనే విషయం తెలుసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుండి బయటపడతారు.  ఇంతకీ వేసవిలో ఎన్ని నీరు తాగాలి తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అయితే, ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం,  ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.  ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరకంగా కష్టతరమైన పని చేస్తే ఎక్కువ నీరు త్రాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు.. నీరు మన శరీరానికి ఇంధనం లాంటిదని అందరికీ తెలుసు. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఇవి చిన్న సమస్యల నుండి ప్రారంభమై తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఆ సమస్యలు ఏంటంటే.. డీహైడ్రేషన్.. నీరు లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చాలా సార్లు డీహైడ్రేషన్ కారణంగా మూర్ఛపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే  ప్రతి వ్యక్తి వేసవి కాలంలో ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. జీర్ణ సమస్యలు.. జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం వల్ల మలబద్ధకం రావడం చాలా సాధారణం. అదనంగా గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా పెరగవచ్చు. మూత్రపిండాలపై ప్రభావం.. మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరులో  నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర ఇన్ఫెక్షన్ల  ప్రమాదం పెరుగుతుంది.  దీనిని నివారించడానికి, జుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...