LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌లో  వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.   అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజినీర్స్   రూ.67,29,398 చెక్కును ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కి అందించింది.  అలాగే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఒక రోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అందించారు.  అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి శ్రీమతి వెంకట లక్ష్మి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చారు. అలాగే టాలీవుడ్‌ యువ నటుడు  హైపర్‌ ఆది  3 లక్షల రూపాయలు  విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి చెక్కు అంద చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్   మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు  మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం  సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  అతిషితోపాటు ఆమె కేబినెట్‌‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్,  సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 
మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ అత్యాచారం జరిపిన కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. యువతిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువతిపై అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణలో జానీ మాస్టర్ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ  నేపథ్యంలో కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ  హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని తీవ్రంగా  పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయిందని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్  ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ నీతి ఆయోగ్ సీఈఓ బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భరత్   ఉత్పాద‌క రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగ‌తితో  వచ్చే ఐదేళ్లలో  రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల‌ను వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భరత్ ఈ సంరద్భంగా   పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను పెంచడంపై నీతి ఆయోగ్ సీఈవోతో చర్చించారు.  
ALSO ON TELUGUONE N E W S
పవన్‌కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూడు వరస హిట్స్‌ అందుకొని హీరోగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న తర్వాత చేసిన సినిమా తమ్ముడు. ఈ సినిమా ఘనవిజయంతో స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ సరసన నటించిన ప్రీతి జంగ్యానీ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2008లో 2008లో నటుడు, దర్శకుడు, మోడల్‌ పర్వీన్‌ దబాస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పర్వీన్‌ దబాస్‌ అనేక హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శనివారం తెల్లవారు జామున ముంబాయిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. పర్వీన్‌ స్వయంగా కారును డ్రైవ్‌ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడడంతో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీతి జంగ్యానీ భర్తతోపాటే ఆస్పత్రిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. దీని గురించి కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.  దీనిపై ప్రీతి జంగ్యానీ మాట్లాడుతూ ‘నేను, నా కుటుంబం షాక్‌లో ఉన్నాం. ఏమీ మాట్లాడలేని స్థితిలో నేను ఉన్నాను. తెల్లవారు జామున నా భర్త ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కండిషన్‌ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని వివరించారు. ప్రీతి తొలిసారి తెలుగులో నటించిన తమ్ముడు చిత్రంతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. ఆ తర్వాత నరసింహనాయుడు, అధిపతి, అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌, యమదొంగ, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌ సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రీతి చివరిగా 2017లో వచ్చిన ఓ రాజస్తానీ మూవీలో నటించారు.  గత ఏడాది కఫస్‌ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు.  
   లైంగిక వేధింపుల కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)కి హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టు వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.దీంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకి తరలించారు.ఇక జానీ మాస్టర్ మీద వస్తున్న ఆరోపణల మీద మొదటి నుంచి కూడా ఆయన భార్య అయేషా ఖండిస్తూ వస్తుండంతో పాటుగా జానీ మాస్టర్ నిర్దోషిగా తిరిగొస్తాడని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే  తాజాగా పవన్ కళ్యాణ్(pawan kalyan)స్థాపించిన జనసేన పార్టీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మేము ప్రాణం ఉన్నతవరకు జనసేన పార్టీలోనే ఉంటాం. కొంత మంది జనసేన నాయకులు కేసు విషయంలో మాట్లాడారు.అలాగే పార్టీ కూడా జానీ మాస్టర్ ని  పార్టీకి సంబంధించిన  కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పిందే  గాని సస్పెండ్ చెయ్యలేదు. పవన్ కళ్యాణ్ కోసం రెండు నెలలు పాటు షూటింగ్ లని కూడా ఆపుకొని జానీ మాస్టర్ తిరిగాడని చెప్పుకొచ్చింది.జానీ మాస్టర్ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే తనకి ప్రాణమని చెప్పాడు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం కూడా చేసాడు.    
On the centenary of legendary Tollywood actor Akkineni Nageswara Rao, his family members paid tribute to him in a grand manner. His son, actor Akkineni Nagarjuna, made a significant announcement during the celebrations. Nagarjuna revealed that the ANR Lifetime Achievement Award for 2024 will be presented to Megastar Chiranjeevi. The award ceremony is scheduled for October 28 and will be presented by Bollywood icon Amitabh Bachchan. In light of this announcement, numerous Tollywood celebrities have extended their congratulations to Chiranjeevi. Additionally, to commemorate this centenary celebration, several classic films from ANR's career are being screened in theaters.
విక్టరీ వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఎఫ్‌2, ఎఫ్‌3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్‌ షెడ్యూల్‌ ఇటీవల పొల్లాచ్చిలో పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నటసింహ నందమూరి బాలకృష్ణ సెట్స్‌కి వచ్చారు. గత ఏడాది బాలయ్యతో అనిల్‌ రావిపూడి చేసిన భగవంత్‌ కేసరి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనిల్‌తో ఆ సినిమాకి పనిచేసిన అనుబంధంతోనే తాజా చిత్రం సెట్స్‌కి వచ్చి అనిల్‌, వెంకటేష్‌లతో ఆప్యాయంగా మాట్లాడారు. వెంకటేష్‌, బాలయ్య మంచి స్నేహితులు. సెట్‌లో ముగ్గురూ సోదర భావంతో సెట్‌లో సందడి చేయడం అందర్నీ ఆకర్షించింది.  #వెంకీఅనిల్‌03లో వెంకటేష్‌ భార్యగా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఎక్స్‌లవర్‌గా కనిపించనుంది. ఈ ట్రైయాంగిల్‌ క్రైమ్‌ డ్రామాను దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం టాప్‌ టెక్నీషియన్స్‌ పనిచేస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. ఎ.ఎస్‌.ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎస్‌.కృష్ణ, జి.ఆదినారాయణ కో-రైటర్స్‌గా, వి.వెంకట్‌ యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  విక్టరీ వెంకటేష్‌, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్‌, సాయి కుమార్‌, నరేష్‌, విటి గణేష్‌, మురళీధర్‌ గౌడ్‌, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్‌, ఆనంద్‌ రాజ్‌, చైతన్య జొన్నలగడ్డ, మహేష్‌ బాలరాజ్‌, ప్రదీప్‌ కాబ్రా, చిట్టి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 
After concluding the lengthy and crucial schedule in Pollachi, the crazy entertainer #VenkyAnil03 in the sensational combination of Victory Venkatesh, blockbuster machine Anil Ravipudi, and Sri Venkateswara Creations, is presently underway with its new shooting schedule in RFC, Hyderabad. Including Venkatesh, the film’s prominent cast is taking part in the shoot. In the meantime, the team got a special guest on the sets. Natasimham Nandamuri Balakrishna graced the sets of #VenkyAnil3 during the latest schedule at RFC. It was a delight to witness the dynamic camaraderie between Balakrishna, Venkatesh, and Anil Ravipudi, in these on-location stills. The entire team is thrilled to have such an esteemed visitor cheering them on. While Balakrishna and Venkatesh have been good friends since ages, Anil Ravipudi made NBK’s all-time hit Bhagavanth Kesari which won best film award at SIIMA. NBK109 shoot is also going on at RFC. The makers are planning for Sankranthi release. Both the film's will be clashing at box office along with another big hero Megastar Chiranjeevi’s Vishwambhara. NBK109 is directed by Bobby. While Aishwarya Rajesh is playing Venkatesh’s wife, Meenakshi Chaudhary will be seen as his ex-girlfriend. This gripping triangular crime drama is produced by Shirish, while Dil Raju presents it. Bheems Ceciroleo scores the music, while Sameer Reddy handles the cinematography. AS Prakash is the production designer, and Tammiraju takes care of the editing. The screenplay was written by S Krishna and G Adhinarayana, while V Venkat choreographs the action sequences. #VenkyAnil03 is aimed for release during Sankranthi, 2025.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్(rajinikanth)కూడా ఒకరు. ఏడు పదుల వయసులో కూడా యువ హీరోలకి ధీటుగా రాణిస్తూ  రజనీ మానియాకి ఎక్స్ పైరీ డేట్ ఉండదనే మాటని నిజం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అక్టోబర్ పది న వేట్టయాన్  తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టబోతున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ  ఆడియో లాంచ్ కార్యక్రమం  చెన్నై వేదికగా  జరిగింది. అందులో రజనీ మాట్లాడుతు సందేశాత్మక చిత్రం  తెరకెక్కించాలని దర్శకుడు జ్ఞానవేల్(gnanavel raja)కి చెప్పడంతో  వెంటనే  వేట్ట యాన్  కథ తో వచ్చాడు. ఇది ప్రజలంతా సెలబ్రేట్ చేసుకునే చిత్రం. ఇందులో అన్ని భావోద్వేగాలు ఉంటాయి.సినిమా విజయం సాధించకపోతే దాని తర్వాత వచ్చే సినిమా అయినా ఎలాగైనా విజయం  సాధించాలనే టెన్షన్ ఉంటుంది.అదే విధంగా ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వచ్చే సినిమా కూడా దాన్ని మించి విజయం సాధించాలనే టెన్షన్ కూడా  ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ టెన్షన్ లోనే ఉన్నాను. జైలర్ ని ఆదరించినట్టే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాని చెప్పడంతో పాటుగా వేట్టయాన్ కి మ్యూజిక్ ని అందించిన  అనిరుద్(anirudh)నాకు కొడుకుతో సమానం అని చెప్పుకొచ్చాడు.  ఇక కంగువా(kanguva)కూడా అక్టోబర్ 10 నే రిలీజ్ డేట్ అవుతున్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా మాట్లాడుతు వేట్టయాన్ ని  పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్టే అక్టోబర్ 10 డేట్ ని ప్రకటించాలనుకున్నాం. కానీ నిర్మాణ సంస్థపై ఉన్న ఆర్ధిక ఒత్తిడులు వల్ల డేట్ ని ప్రకటించలేకపోయామని  చెప్పుకొచ్చాడు.ఇక  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, వర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ , మంజు వారియర్, రానా, దుషార విజయన్ వంటి వాళ్ళు వేట్టయాన్ లో ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు.  
ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా మొత్తం ఐదు లాంగ్వేజెస్ లో ఎన్టీఆర్(ntr)దేవర(devara)గా అడుగుపెట్టబోతున్నాడు. దీంతో ప్రమోషన్స్ చాలా వేగంగానే జరుగుతున్నాయి.వాటిల్లో  దేవర గురించి ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ(koratala siva)హీరోయిన్ జాన్వీ కపూర్(jahnvi kapoor),ప్రతి నాయకుడు సైఫ్ అలీ ఖాన్(saif ali khan)చెప్తున్న  విశేషాలు  ఎన్టీఆర్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులకి కూడా సినిమా మీద ఎంతో ఆసక్తిని కలగచేస్తున్నాయి. లేటెస్ట్ గా  దేవరకి ఫొటోగ్రఫీ ని అందించిన రత్నవేలు కూడా కొన్ని గూస్ బంప్స్ వ్యాఖ్యలు చేసాడు.  దేవర లో భారీ విఎఫ్ఎక్స్ షాట్స్ ని మ్యాచ్ చేసే కలర్ గ్రేడింగ్ షాట్స్ చెయ్యడానికి  ముప్పై నిద్ర లేని రాత్రులు గడపాల్సి వచ్చింది. అదే విధంగా  ఐమాక్స్, ఎక్స్ డి, ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ వంటి కంటెంట్ ని కూడా అందచేశాం. దేవర మీది, చూసి ఎంజాయ్ చెయ్యండంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అదే విధంగా దేవరలోని కొన్ని ఐకానిక్ షాట్స్. షూటింగ్ విజువల్స్ ని  కూడా షేర్ చేసాడు. కెమెరా మెన్ గా  రత్నవేలు కి ఇండియన్ చిత్ర సీమలో  ఒక ప్రత్యేక స్థానం ఉంది. తమిళ చిత్ర రంగానికి చెందిన రత్నవేలు తెలుగులో మహేష్ బాబు 1 నేనొక్కడ్నే, సరిలేరు నీకెవ్వరు, రామ్ చరణ్ రంగ స్థలం, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 , సైరా నరసింహారెడ్డి వంటి పలు చిత్రాలకి చేసాడు .ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22 న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో  ఘనంగా జరగనుంది.  
Man of Masses NTR, is currently busy with "Devara," directed by Koratala Siva. Anticipation is high as fans look forward to this action-packed drama hitting the big screen. Ahead of the film's release, the makers are busy with promotions. The entire team gearing up for grand pre release event in Hyderabad. The film pre release event will be held on September 22nd at Novotel, Hyderabad. The total team will attend and many more surprises waiting for fans and audience. Top Tollywood directors SS Rajamouli and Trivikram along with KGF sensation Prashanth Neel will attend the grand pre-release event of Devara. All the three directors share a close bonding with NTR. This grand release event will have Anirudh concert where he exclusively will sing Aayudha Pooja and Chuttamalle song. The film also stars Prakash Raj, Srikanth, Shine Tom Chacko, Ajay, Getup Srinu, and other ensemble cast members.  The action-packed saga, planned as a two-part film, will debut with "Devara: Part 1" on September 27th. Presented by Nandamuri Kalyan Ram and produced by Mikkilineni Sudhakar and Hari Krishna K under the banners of NTR Arts and Yuvasudha Arts, "Devara" is set to make a major impact.
SAPBRO Productions is excited to announce that the much-anticipated film Shanmukha, starring Aadi Saikumar and Avika Gor, has officially entered the post-production phase and is gearing up for a grand release during the Diwali season. With its unique blend of devotional and thriller elements, Shanmukha promises to deliver a complete Family Entertainment. Directed and produced by Shanmugam Sappani & Tulasiram Sappani the film has been highly anticipated ever since its first look was unveiled earlier this year. Shanmukha follows the thrilling journey of Investigation Officer, played by Aadi Saikumar, who embarks on a mysterious and adventurous quest to uncover ancient truths. The film’s suspenseful and spiritually-driven storyline is set to captivate audiences and introduce a new dimension to Indian cinema. One of the most exciting aspects of Shanmukha is the involvement of renowned music director Ravi Basrur, famous for his chart-topping work on KGF Chapter 1 & 2 and Salaar. For Shanmukha, Basrur has composed four highly anticipated songs that are expected to leave a lasting mark on the music industry. Known for his powerful and emotionally resonant scores, Basrur’s contribution adds an extra layer of excitement to the film.“We have very high expectations for the soundtrack. Ravi Basrur’s music will elevate the film to new heights. His compositions perfectly capture the essence of the story, blending devotional themes with thrilling sequences, Shanmukha is set to be a visual spectacle, with 40% of the film created using high-end CGI.  With its post-production phase nearing completion, the film is slated for a Diwali release, setting the stage for a blockbuster holiday season. The team is working around the clock to deliver a film that will appeal to a wide audience, blending suspense, action, and spiritual themes in a way that resonates with both younger and older viewers.” said Shanmugam Sappani. Diwali is the perfect time to release Shanmukha. It’s a film filled with excitement, spiritual depth, and family-friendly entertainment. We believe audiences will love it,” added Sappani.
తిరుపతి లడ్డు విషయంలో ప్రముఖ అగ్ర హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)చాలా ఘాటుగానే స్పందించాడు.లడ్డు లో జంతువుల నూనె వాడటం చాలా బాధాకరం.ఈ సంఘటనతో  భారతదేశ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఆందోళన చెందుతున్నారు. మొత్తం భారత్‌లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ని ఏర్పాటు చేయాల్సిన సమయం కూడా  ఆసన్నమైందని ట్విట్టర్ ద్వారా తన ఆవేదనని తెలియచేసాడు. అలాగే దోషులని వదలబోమని పూర్తి ఎంక్వరీ చేసి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు మీద చట్టప్రకారం చర్యలు కూడా తీసుంటామని కూడా చెప్పాడు.ఇక  దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా నిరసన జ్వాలలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్(praksash raj)ఒక ట్వీట్ చేసాడు  పవన్ కళ్యాణ్ గారు  మీరు డిప్యూటీ సిఎం గా ఉన్న రాష్ట్రంలో తిరుపతి  లడ్డు కల్తీ  సంఘటన జరిగింది.దయచేసి ఈ విషయం  మీద విచారణ చేపట్టి  దోషులెవరో కనిపెట్టి  కఠిన చర్యలు తీసుకోండి. కానీ  మీరు ఆందోళనలను  వ్యాపింపజేస్తు  సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు. దేశంలో మనకి  ఇప్పటికే మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ  ట్వీట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం  హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రకాష్ రాజ్ ట్వీట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ట్వీట్ మంచి ఉద్దేశంతోనే చేసుండచ్చు, కానీ ఏడుకొండలవాడికి విశ్వమంతా భక్తులున్నారు. తిరుపతి లడ్డుని ప్రసాదంగా తీసుకోవడాన్ని  హిందువులంతా పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డు లో కల్తీ జరిగితే హిందువులంతా ఆందోళన చెయ్యకుండా ఉంటారా! పవన్ చెబితేనో, కేంద్ర పెద్దలు చెబితేనో  హిందువులు ఆందోళన చేయటం లేదనే విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తించాలని కామెంట్స్ చేస్తున్నారు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నిత్యం మనం అనేక వాటిని మన అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కొన్ని ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. కానీ అవి మాత్రం అలానే ఉంటాయి. అసలు అవి అలా ఎందుకు ఉన్నాయి అనే ఆలోచనే తట్టదు. అవి మనకు పెద్దగా ఉపయోగపడకపోయినా ప్రతి ఒక్కదాని వెనుక ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అలాంటి నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం. 1. లైన్‌లో సంతకం చేయాలా వద్దా. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకప్పుడు చెక్ బుక్ ను ఉపయోగింస్తాం. చెక్కుపై సంతకం చేసేటప్పుడు చాలా మంది తరచుగా లైన్ పైన సంతకం చేస్తున్నామా లేదా అనే గందరగోళానికి గురవుతూ ఉంటారు. అటువంటప్పుడు భూతద్దం ఉపయోగించి దగ్గరి నుండి చూస్తే మీకు రహస్యం తెలుస్తుంది. సంతకం చేసే చోట ఉంటే లైన్ గురించి అసలు ఆలోచించం. ఈ లైన్స్ ను  పదాలు రిపీట్ అయితే గుర్తించడానికి రూపొందించారు. ముద్రణ చాలా చిన్నగా ఉండటం వల్ల వాటిని కళ్లతో చూస్తే సాధారణ సంతకంలాగే కనిపిస్తుంది కానీ, మైక్రో టెక్నాలజీ అని పిలిచే దాన్ని భద్రతా ప్రయోజనాల కోసం రూపొందించారు. ప్రింటింగ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకవేళ జిరాక్స్ తెస్తే ఆ లైన్స్ బ్లర్ అయి అస్పష్టంగా కనిపిస్తాయి. 2. ఖాళీ పేజీలు. మీకు చదవడం ఇష్టమైతే, మీరు ఒక నవల లేదా ఏదైనా పుస్తక చదువుతూ ఉంటే పుస్తకాల చివరలో ఖాళీ పేజీలు చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి.ఆ పేజీలలో ఎక్కువగా పాఠకులు తమ కళాత్మక డ్రాయింగ్‌లతో లేదా ఇతర విషయాలతో నింపి వేస్తారు.  కానీ  వాస్తవానికి ఆ పేజీలు ఎందుకు ఖాళీగా ఉంన్నాయి అన్న విషయం ఎవరూ గమనించరు. ఈ కాలంలో పుస్తకాలు అన్నీ కూడా డిజిటల్‌ ప్రక్రియలో ముద్రిస్తారు. పెద్దగా ఉన్న కాగితపు షీట్లను పేజీలుగా మడిచి ముద్రిస్తారు. అలా ముద్రిస్తున్న వాటిని సిగ్నేచర్ పేపర్ అంటారు. వాటినన్నింటిని కూడా ఒకదానితో ఒకటి జతచేసి బైండ్ చేసి పుస్తకం రూపంలో తీసుకొస్తారు. డిజిటల్‌గా ముద్రించిన వాటిలో ఇలాంటి సిగ్నేచర్ పేపర్లు  2 నుండి 48 పేజీల వరకు ఉండవచ్చు.  ఇదంతా కూడా పుస్తకంలో మ్యాటర్ ఎక్కడితో ముగుస్తుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్ద ప్రచురణకర్తలు తమ పుస్తకాలను ముద్రించడానికి, రచయితలు తన స్వీయ రచనలను ముద్రించడానికి తేడా ఉంటుంది. సాధారణంగా ప్రచురణ కర్తలు పెద్ద కాగితంపైనే అనేక పేజీలను ముద్రిస్తారు. అటువంటి సందర్భాల్లో మీకు కొన్ని ఖాళీ పేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. 3. ట్రామ్ రైలు క్రిస్ - ఓవర్ హెడ్ లైన్ దాటడం. ట్రామ్‌లో లేదా ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్రిస్ క్రాస్ లైన్లను చూడవచ్చు.  ట్రామ్‌లు, కొన్ని రైళ్లు పాంటోగ్రాఫ్ కాటెనరీ వ్యవస్థపై నడుస్తాయి, ఇవి  విద్యుత్తును కాటెనరీ వైర్ నుండి లోకోమోటివ్‌కు మార్చబడుతుంది. స్లైడింగ్ స్ట్రిప్ కాటెనరీ వైర్‌తో విద్యుత్ సంబంధాన్ని ఉత్పత్తి చేస్తుంది. పాంటోగ్రాఫ్ స్ప్రింగ్ సిస్టమ్ ఏ వేగంతో ప్రయాణించినా కూడా దాని సంబంధం శాశ్వతంగా ఉండేలా చూస్తుంది. రాగి తీగలను తాకిన స్లైడింగ్ స్ట్రిప్ కోతకు గురవుతూ పైలాన్‌పై రాపిడీని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ క్రిస్ క్రాస్ లైన్ల అసలు ఉద్దేశం రాపిడి కలిగిస్తూ విద్యుత్ ను వ్యాప్తి చేయడం. 4. స్నార్కెల్స్. స్నార్కెల్స్ అంటే నీటి అడుగున ఈత కొడుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే పైప్ ను స్నార్కెల్స్ అంటారు. వీటికి స్క్యూబా ఎక్విప్మెంట్ కాగా ఆక్సిజన్ టాంకులు ఉండవు. ఈ స్నార్కెల్స్ నీటి బయటి వాతావరణం నుండి గాలిని పీల్చుకోవడానికి శ్వాసక్రియగా పనిచేస్తాయి. చాలావరకు ఈ స్నార్కెల్స్ 30  సెంటీమీటర్ల లోపల వరకు లేదా  40 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వరకు పనిచేయవు. ఎందుకంటే ఇవి ఉపరితలానికి దగ్గరగా మనిషి ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఉపరితలానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ నీటిలో పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసౌకర్యంగా ఉంటుంది. స్నార్కెల్ ద్వారా ఆక్సిజన్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు లంగ్స్ మీద కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ స్నార్కెల్ ఉపయోగించడం వల్ల కార్బన్ డి ఆక్సైడ్‌ను తిరిగి పీల్చుకోవడమే కాకుండా  సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.  
అప్పు ఆకర్శించని మనిషి ఎవరైనా ఉంటారా ? ఎవరూ ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకుని కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతదే! ఈ ప్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్సిల్ మానేజ్మెంట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనై కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనం క్రెడిట్ కార్డ్ నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని ఔట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవదిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే! ఇక్కడే మనవాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేస్తుంది క్రెడిట్ కార్డ్. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు లాభాలు కూడ ఉన్నాయి అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వేసులుబాటుని కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్ధిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకుల పై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇకనుంచి క్రెడిట్ కార్డ్ వినియోగించే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డుని వినియోగిస్తే మంచిది. డబ్బుని సంపాదించడమే కాదు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్ధిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణల్లో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడో పక్కింటివాడో అయితే కాస్త ఆలస్యం అయినా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధిలు, యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేమీ పట్టవు వాటికి. చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్ట్ నోటీసులు కూడా పంపిస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు కి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దాన్ని వాడండి. ◆వెంకటేష్ పువ్వాడ  
హాస్యం-అపహాస్యం!! నవ్వడం ఒక భోగం!! నవ్వించడం ఒక యోగం!! నవ్వలేకపోవడం ఒక రోగం!! అబ్బబ్బా ఏమైనా చెప్పారా జంధ్యాల. కేవలం చెప్పడంతో ఆగిపోలేదే, హాస్యాన్ని జోడించి, ఆ హాస్యంలో కూడా సమాజానికి కాస్తో, కూస్తో సందేశాలు ఇస్తూ సినిమాలు తీసి, నవ్వుల జల్లు కురిపించిన ఘనుడు ఆయన. ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా, ఎంతో ఆరోగ్యవంతమైన హాస్యాన్ని ప్రజలకు సినిమాల ద్వారా అందించినవారు జంధ్యాల. ఇదేమి జంధ్యాల గారి గురించి ఊదరగొట్టడానికి రాస్తున్నది కాదు కానీ ఉత్తమ హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినవారు కాబట్టి చెప్పుకోవలసిందే.  అంతకు ముందు…. పాత సినిమాలు చూస్తే అందులో రేలంగి, రాజబాబు, పేకెటి రంగా, గిరిజ, రమాప్రభ వీళ్ళ నుండి హాస్యాన్ని దోసిళ్ళతో పట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ ఉన్న సినిమాలలో ఎలాంటి భయం లేకుండా హాయిగా నవ్వుకుంటూ సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది. ఆ తరువాత తరువాత తరువాత కాలం మారేకొద్ది కొత్తదనం పేరులో హాస్యాన్ని అపహాస్యం చేయడం  మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా హాస్యం పేరుతో అసభ్య పదజాలన్ని వాడుతున్నారు. వాటిని పిల్లల కోసం ప్రత్యేకం అన్నట్టు కవరింగ్ ఇచ్చి నిజంగా పిల్లల్ని కూడా అసభ్య పదజాలానికి అలవాటు చేస్తున్నారు. షోస్ లో ఏముంది?? టీవీ లో ప్రసారం అయ్యే ప్రతి చానల్ లో ఒక కామెడీ షో తప్పక ఉంటోంది. ఆ షో లలో పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి వాళ్ళతో పెద్ద పెద్ద డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ చూసే ఇంట్లో పిల్లలు కూడా వాటిని అలవాటు చేసేసుకుంటారు. చిన్నా పెద్దా లేకుండా పంచు డైలాగులు వేయడం అన్ని చోట్లా కామన్ అయిపోతోంది. అసలింతకూ అసలైన హాస్యం అంటే ఏమిటి?? అసభ్యత లేకుండా, ఒకరిని నొచ్చుకునేలా చేయకుండా, సరదాగా నవ్వించేది హాస్యం. అలా నవ్వించే వారు నిజంగా నవ్వుల రాజులు, కిలకిల రాణులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడెక్కడుంది అలాంటి హాస్యం. సాడిజంలో హాస్యం ప్రస్తుత టీవీ షోల పుణ్యమా అని ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో, ఒకరి ఇబ్బందిని ఎగతాళి చేయడంలో హాస్యం పాళ్లు పుష్కలంగా నింపేస్తున్నారు. ఫలితంగా ఇళ్లలో పిల్లలు కూడా వాటిలోని హాస్యాన్ని చూస్తూ వాటి ద్వారానే హాస్యాన్ని సృష్టిస్తున్నారు. ఒక అరభై సంవత్సరాల తాతయ్య తన పదేళ్ల మనవడితో ఒరేయ్ నువ్వు ఉద్యోగం చేసి,డబ్బు సంపాదించి నాకు మంచి బట్టలు కొనివ్వాలిరా అని అడిగితే, ఆ పదేళ్ల బుడ్డోడు తన తాతతో  నేను చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుని సంపాదించే వరకు నువ్వు బతికే ఉంటావా?? అప్పుడు నేను బట్టలు కొని నీ సమాధి మీద కప్పుతాలే అంటాడు. ఇలాంటివి ఈ కాలంలో ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు.  పిలల్లో విలువల స్థాయి అంతకంతకూ తగ్గిపోతోంది, వాళ్ళు వయసును మించి మాట్లాడే ప్రతి మాటా బాల్యానికి ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి. ఏమి చేయాలిప్పుడు?? హాస్యం అంటే మనసారా నవ్వుకుంటూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉండాలి. ఆ కోవలోకి చెందినవే అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు మొదలైనవి. ఇవన్నీ పిల్లలకు నవ్వు తెప్పిస్తూనే అందులో నీతిని, విలువలను మెల్లగా మెదడులలోకి జోప్పిస్తాయి. అవన్నీ కూడా పుస్తకాల ద్వారా కాకపోయినా ఆడియో, వీడియో లు అందుబాటులో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి, పిల్లలకు అసభ్య హాస్యాన్ని దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి. పార్కులలో కూర్చుని ఊరికే గట్టిగా నవ్వుతూ నవ్వుతో ఆరోగ్యం అని చెప్పుకునే బదులు, కాసేపు చిన్నపిల్లల్లా మారిపోయి చిన్ననాటి కథల పుస్తకాల్లో పేజీలను తిరిగేస్తూ, వాటిలో నుండి మిమ్మల్ని మీరు వెతుక్కుంటే హాస్యం అపహాస్యం కాకుండా ఆరోగ్యమస్తు అని దీవించడం ఖాయం. కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ
  వినడానికి చిత్రంగా ఉంది కదా. కానీ లక్షలమందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్యలోకంలో సంచలనం సృష్టిస్తోంది.   గుండెజబ్బులకీ బ్లడ్‌గ్రూపుకీ ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా పదమూడు లక్షలమందిని పరిశీలించారు. ఇందులో myocardial infarction, coronary artery disease, ischaemic heart disease, heart failure వంటి గుండె సమస్యలు ఉన్నవారిని బ్లడ్‌ గ్రూప్ ఆధారంగా విభజించారు. వీరిలో O గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారిలో గుండె సమస్యలు దాదాపు 9 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.   O గ్రూప్ రక్తం వారికీ, ఇతరులకీ మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు కారణాలని ఊహిస్తున్నారు.   - O గ్రూప్ కాని వ్యక్తులలో von Willebrand అనే ప్రొటీన్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రొటీను వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయం అయినప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా... కొన్ని సందర్భాలలో అది గుండెపోటుకి దారితీసే ప్రమాదం ఉంది.   - A గ్రూప్‌ రక్తంవారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల, వారిలో కొలెస్టరాల్‌ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్టరాల్‌ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా!   - O గ్రూపు కాని వ్యక్తులలో galectin-3 అనే ప్రొటీన్‌ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని (inflammation) నియంత్రిస్తుంది. ఈ ప్రొటీన్‌ కారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో సమస్యల మరింత తీవ్రతరమైపోతుందట.   మొత్తానికి O గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగులకి చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్‌ గ్రూప్‌ని దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. - నిర్జర.
పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం  ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్  పరీక్షలు  చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే  ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు.   ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో  పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం  జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది. కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు. హైపెర్ కీల్మియా సమస్యలు... *రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు. *కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది. *కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి. *డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.        రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం  పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం  ను సమతౌల్యం లో ఉంచుతాయి.                                           
పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా  అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ  రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు.  ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది  బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం  ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు  నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సీజన్ ఏదైనా  తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు,  నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి  చర్మ సంరక్షణలో  ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల  చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం  జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.  మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో  చిటికెడు జాజికాయ కూడా  కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  పసుపు పాలు తయారుచేసేటప్పుడు  కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే   గొంతు నొప్పి,  ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.