LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం (06-07-24) నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో వున్న సంస్థల విభజన విషయంలో చర్చించే అవకాశం వుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న బకాయిల మీద చర్చ జరగనుంది. తనకు 24 వేల కోట్లు ఏపీ చెల్లించాలని తెలంగాణ చెబుతోంది. కానీ,7 వేల కోట్లు తెలంగాణ చెల్లించాల్సి వుందని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ చిక్కుముడిని విడిపించడానికి చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలో ఏపీ భవన్‌కి సంబంధించిన విభజన వివాదాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికే పరిష్కరించారు. మైనింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన చిక్కుముడి కూడా ఈమధ్యే వీడిపోయింది.  తొమ్మిదో షెడ్యూల్లో వున్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబేడీ కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల  పంపిణీపై చర్చ జరిగే అవకాశం వుంది. పదో షెడ్యూల్లో వున్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీ విషయంలో కూడా చర్చ జరగాల్సి వుంది. కీలకమైన ఈ భేటీలో రెండు రాష్ట్రాల అధికారులూ పాల్గొంటున్నారు. వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేసుకున్నారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కి చేరుకున్ చంద్రబాబుకి తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీఎంగా మొదటిసారి నగరానికి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం దగ్గర నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబిలీహిల్స్.లోని చంద్రబాబు నివాసం వరకు చంద్రబాబు ర్యాలీ జరిగింది. వర్షంలోనూ ర్యాలీ కొనసాగింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు ఈ ఇద్దరి నుంచే నామినేషన్లు రావడంతో, ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు ఎమ్మెల్సీలుగా వున్న సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రామచంద్రయ్య మీద అనర్హత వేటు పడింది. అలా ఖాళీ అయిన రెండు స్థానాలు ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా భర్తీ అయ్యాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో అభ్యర్థి పి.హరిప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి రాజకీయ కార్యదర్శి.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు  సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే  పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక  కొద్ది రోజులు పట్టిసీమను  వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది.  ఈ ఏడాది నాగార్జున  ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు  తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా  రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో   పట్టిసీమ మోటార్లతో  నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం  మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ  పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్  ఘటనతో  20 అడుగులు ఎత్తులో  నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో   గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి.  గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు  విడుదల చేశారు.   పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.      పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.  అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.  
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పార్టీ మారబోతున్నాడన్న వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిన జగన్, ఇదెక్కడి గొడవరా నాయనా అనుకుని కేతిరెడ్డిని విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట. గతంలో జగన్ అధికారంలో వున్నప్పుడు జగన్‌కి కలవటానికి కేతిరెడ్డి చాలాసార్లు ట్రై చేసినా అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఇప్పుడు జగనే స్వయంగా రమ్మని చెబితే, కేతిరెడ్డి పొమ్మని చెప్పేశాడు. జగన్ తిక్క ఇలాగే కుదరాలి!
ALSO ON TELUGUONE N E W S
ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2' (Pushpa 2) డిసెంబర్ 6కి వాయిదా పండిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఆగస్టు 15 పై కర్చీఫ్ వేస్తున్నాయి. ఇప్పటికే 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart), 'ఆయ్', '35' సినిమాలు ఆ తేదీకి వస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్టులో మరో సినిమా చేరనుంది. 'షాక్', 'మిరపకాయ్' తరువాత రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్' (Mr Bachchan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చేయనున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. ఆగస్టు 15న 'మిస్టర్ బచ్చన్' విడుదలైతే.. బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండే అవకాశముంది. రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ కావడంతో 'డబుల్ ఇస్మార్ట్'పై మంచి అంచనాలే ఉన్నాయి. 'మిరపకాయ్' కాంబోలో వస్తున్న మూవీ కావడంతో 'మిస్టర్ బచ్చన్' పైనా అదే స్థాయిలో అంచనాలున్నాయి. మరోవైపు 'ఆయ్' మూవీ వెనుక గీతా ఆర్ట్స్ ఉంటే, '35' వెనుక సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. దీంతో ఆ రెండు సినిమాలకు కూడా మంచి విడుదలే దక్కుతుంది. ఈ లెక్కన ఆగస్టు 15 తేదీకి 'పుష్ప-2' రావట్లేదన్న లోటుని మర్చిపోయేలా.. బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండనుంది. అందునా, గతంలో పూరి-రవితేజ కాంబినేషన్ లో పలు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్ కి దిగడం మరింత ఆసక్తికరంగా మారనుంది.
రాజమౌళి (Rajamouli) డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో కలిసి గ్లోబల్ సక్సెస్ అందుకున్నాడు రామ్ చరణ్ (Ram Charan). ఆ తర్వాత కొద్దిరోజులకే తన తండ్రి చిరంజీవి (Chiranjeevi)తో కలిసి స్క్రీన్ చేసుకున్న 'ఆచార్య' విడుదలై నిరాశపరిచింది. ఓ రకంగా ఫ్యాన్స్ కి 'ఆర్ఆర్ఆర్'తో వచ్చిన ఆనందాన్ని 'ఆచార్య' తగ్గించిందనే చెప్పాలి. అందుకే రామ్ చరణ్ బాక్సాఫీస్ సందడి కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer) బాగా ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైంలో.. 'గేమ్ ఛేంజర్' కంటే ముందే రామ్ చరణ్ బిగ్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. 'గేమ్ ఛేంజర్' సినిమా ఆలస్యమవడానికి కారణం 'ఇండియన్-2' (Indian 2) అనే విషయం తెలిసిందే. నిజానికి 'ఇండియన్-2'నే డైరెక్టర్ శంకర్ ముందు స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని వివాదాల కారణంగా ప్రొడక్షన్ కి బ్రేక్ పడింది. దీంతో రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'ని మొదలుపెట్టాడు శంకర్. అయితే 'గేమ్ ఛేంజర్' కొంతభాగం షూట్ అయ్యాక.. అనుకోకుండా వివాదాలు సద్దుమణగడంతో శంకర్ మళ్ళీ 'ఇండియన్-2' తో బిజీ కావాల్సి వచ్చింది. ఆ ప్రభావం 'గేమ్ ఛేంజర్'పై పడి బాగా ఆలస్యమైంది. ఓ రకంగా తమ హీరో సినిమా లేట్ అవడానికి కారణం కావడంతో.. 'ఇండియన్-2'పై చరణ్ అభిమానులు ముందు నుంచి కాస్త గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పుడు అదే 'ఇండియన్-2'.. చరణ్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయనుందని తెలుస్తోంది. 'ఇండియన్-2'లో రామ్ చరణ్ అతిథి పాత్రలో మెరవనున్నాడట. కనిపించేది కాసేపే అయినప్పటికీ, అది ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా ఉంటుందట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. జూలై 12న 'ఇండియన్-2' విడుదల కానుంది. ఆరోజు చరణ్ గెస్ట్ రోల్ పై క్లారిటీ రానుంది.
'14' is produced jointly by Subbarao Rayana and Sivakrishna Nichchana Metla under the banner of Royal Pictures. Directed by Lakmi Srinivas, the film delves into intriguing themes. The film released in theatres today and let's see how it fares. Story: Ratan (played by Ram Ratan Reddy), the son of Chief Minister Posani Krishna Murali, lives a carefree life with his friends until he falls in love with Neha (portrayed by Vishaka Dhiman), a junior doctor. Their story takes a tragic turn when they are found dead in Neha's apartment, appearing to have committed suicide. While the police close the case, journalist Subbu (played by Sreekanth Iyengar) suspects foul play and initiates an investigation with his colleagues to uncover the truth behind what seems like a murder staged as suicide. The film explores the circumstances surrounding their deaths, the identity of the murderer, the involvement of the Chief Minister, and the contribution of an unlikely detective to the investigation. To unravel these mysteries, viewers are encouraged to watch the movie. Analysis: '14' combines elements of a romantic thriller and a mystery. The dual deaths are introduced early, setting the stage for a complex narrative. The media's reaction to the deaths of the CM's son and his alleged girlfriend is portrayed with a sense of detachment, except for one newspaper that triggers a strong reaction from the CM. Rathan is depicted as a party-goer who fears legal repercussions that could affect his father's political career. His superficial lifestyle clashes with his father's expectations, revealing a deeper desire for genuine love. Neha initially sees Rathan as timid despite his powerful background, seeking a meaningful connection beyond superficiality. As their relationship develops, she confronts societal expectations and economic disparities, adding layers to their romance. Posani's portrayal of the Chief Minister adds intrigue, as his motives and relationship with his son are ambiguously portrayed. His character's complex dynamics are central to the story's suspense. The film touches on themes of love versus lust and incorporates a non-linear narrative to engage viewers in contemplating various possibilities. Performances: The majority of the film focuses on the duo of Ram Ratan and Vishaka Dhiman. Their performances range from intimate scenes to intense dialogues, driving the narrative forward. Posani returns to the screen portraying a politically influential figure with questionable behavior. Sreekanth Iyengar impresses as a bold journalist who challenges authority, particularly the Chief Minister. Noel Sean adds a unique touch as an office worker. Other actors were decent. Technical Department: Director Dangeti Lakshmi Srinivas could have enhanced scene transitions, while Kalyan Nayak's music serves its purpose adequately. Saindh T's cinematography, though competent, could have benefitted from more dynamic lighting. Overall: '14' is a gripping romantic thriller that evolves into a compelling mystery. It explores themes of technology's pervasive influence and hidden desires lurking beneath the surface. Rating: 2.75
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి విడుదలవుతుందని మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. మధ్యలో శంకర్ 'ఇండియన్ 2' తో బిజీ కావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇంకా రెండు వారాల షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది. రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. అక్టోబర్ చివరిలో లేదా డిసెంబర్ చివరిలో విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే అక్టోబర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని, డిసెంబర్ లో కూడా అనుమానమేనని అంటున్నారు. ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చూపు సంక్రాంతిపై పడినట్లు సమాచారం. 'గేమ్ ఛేంజర్' లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు సోలో రిలీజ్ తో పాటు, లాంగ్ రన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే భారీ ఓపెనింగ్స్ తో పాటు, ఫుల్ రన్ లో రికార్డు కలెక్షన్స్ వస్తాయి. అయితే డిసెంబర్ లో విడుదల అనేది.. 'గేమ్ ఛేంజర్'కి అంతగా కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 6న 'పుష్ప-2', జనవరి 10న 'విశ్వంభర' ఉన్నాయి. ఈ రెండు భారీ సినిమాల మధ్యలో 'గేమ్ ఛేంజర్' విడుదలైతే.. ఖచ్చితంగా కల్లెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అందుకే ఈ సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు చిరంజీవి సైతం తన కుమారుడు కోసం సంక్రాంతి సీజన్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట. అదే జరిగితే 'విశ్వంభర' జనవరి చివరికి లేదా మార్చికి వాయిదా పడే అవకాశముంది.
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. అలాగే 'కల్కి'లో నాని కూడా అతిథి పాత్రలో కనిపిస్తాడని సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగింది. కానీ సినిమాలో నాని క్యామియో లేదు. అయితే నానితో పాటు, మరో హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ పార్ట్ లో మెరుస్తారని నాగ్ అశ్విన్ చెప్పారు. 'కల్కి' చిత్రం భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "వైజయంతి బ్యానర్ లో నటించిన పలువురు హీరోలు కల్కిలో సందడి చేశారు. కానీ నాని, నవీన్ కనిపించకపోవడానికి కారణమేంటి?" అనే ప్రశ్న ఎదురు కాగా.. "నాని, నవీన్ ఈ పార్టులో కుదరలేదు. కానీ నెక్స్ట్ పార్టులో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేస్తాను." అని నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. "శ్రీ కృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో అంటున్నారు కదా.. మీ అభిప్రాయం?" అని ప్రశ్నకు.. "ఈ సినిమాలో కాదండి.. కానీ వేరే సినిమాలో ఆయన చేస్తే బాగుంటుంది" అని ఆన్సర్ ఇచ్చాడు. 
Nani is currently on a best phase of his career. The actor is scoring back to back hits. After sensational hit Dasara and Hi Nanna, the actor is completed shooting for Saripodha Sanivaaram in Vivek Athreya direction. Priyanka Mohan is playing female lead in the film. He is currently holidaying in USA. We've reported that Nani shelved his upcoming two projects with Sujeeth and Venu Yeldandi. The actor's immediate next will be with director Srikanth Odela, the director of Dasara. Sudhakar Cherukuri of SLV Cinemas will be bankrolling this project too. Natural Star Nani is also planning ti start HIT 3 immediately. The third franchise in Homicide Investigation Team will be directed by Sailesh Kolanu. Nani is all set to take Arjun Sarkaar role. As per the ongoing buzz, Rana Daggubati has been approached to essay the role of the lead antagonist and the discussions are going on. Nani and Rana share a great bonding with each other. Rana never hesitates to pick up challenging and interesting roles. HIT franchise is based on the lead actor who hunts for psycho killers. Rana’s role will be deadly as per the buzz. The film will be shot in 100 days across Hyderabad, Kashmir, Sikkim and other beautiful locations.
The blockbuster director who delivered massy hits like KGF franchise and Salaar. The director is now planning to start his next. Which project would that be? We've revealed news that Salaar 2 is shelved and Prashanth Neel is completely focused on NTR’s project. Several Bollywood media houses have reported that Salaar 2 is on and Prashanth Neel will shoot for Salaar 2 and NTR’s film simultaneously. The news is completely untrue. Prashanth Neel is completely focused on the script of NTR’s film and the filming commences for Dussehra. NTR will complete the shoot of Devara and he will have few portions of War 2 to be filmed. Prashanth Neel will also narrate the final draft of his film to NTR next month. Mythri Movie Makers in association with NTR Arts will bankroll this prestigious film that is planned on a massive budget. The film will be made in the backdrop of Europe and will be a semi Periodic action thriller. Rashmika Mandanna is likely to play the female lead. The entire crew of Prashanth Neel who worked for his previous films will join NTR’s project. The film, Most likely titled "Dragon" will head for a theatrical release during the second half of 2025. On the other side, Prabhas too has no time for Salaar 2 as he has to complete Raja Saab and he will have to allocate dates for Kalki 2. He also has Sandeep Vanga’s Spirit to shoot and Hanu Raghavapudi’s romantic drama lined up.
Sai Dharam Tej, now known as Sai Durgha Tej, is set to embark on an ambitious new project following his blockbuster success with "Virupaksha." Initially, the actor planned to collaborate with director Sampath Nandi on a film titled "Gaanja Shankar." However, due to budget constraints, this project was unfortunately shelved. Sai Durga Tej's next venture, tentatively titled "SDT18," was recently announced. The film will be directed by debutant Rohith and produced by Niranjan Reddy, the recent blockbuster producer behind "HanuMan." Makers considering title "Sambaraala Yeti Gattu," which will explore a pre-Independence mining backdrop in Andhra Pradesh, drawing inspiration from the grand scale and intense storytelling of the blockbuster "KGF." With its period setting and ambitious scope, "Sambaraala Yeti Gattu" promises to be a significant undertaking, aiming to deliver a visually stunning and emotionally engaging cinematic experience. It may be shocking but the makers are spending a whopping amount of 120 crores for the film. This is the costliest ever film made in Sai Dharam Tej’s career. 20 crores are spent for several sets that are constructed in the outskirts of Hyderabad. A major portion of the shoot will happen in a village set and the makers spent lavishly for the set.  Aishwarya Lekshmi is the leading lady considered for this expensive film. The movie will have a pan-Indian release next year.nFans of Sai Durga Tej are eagerly anticipating this new chapter in his career, looking forward to seeing how he brings his dynamic energy and nuanced performance to this historical drama.
Powerstar Pawan Kalyan is fully focused on politics. The actor recently won as Pithapuram MLA and became Deputy Chief Minister of Andhra Pradesh. The actor has multiple works to do as a leader and he will stay busy with his political engagements for the next three months. He is focused on the developments and is interacting with the people. Pawan toured in Pithapuram constituency for the first time after his victory. His fans asked him about OG and other films. For the first time, Pawan responded saying that he will focus on AP politics for now and he will shoot for his pending projects after three months. We've already reported the same. He also said that he apologized to all his producers for the delay in the film shoots. “I have no time for film shoots now. I have been committed to the people of AP for three months. I should not do films when I am elected as a representative for the state. I have informed all my producers that I will serve the people of AP on a priority basis and will shoot for the pending projects. Without disturbing my service, I will complete the shoots of my films” told Pawan Kalyan. He also said that "OG Chudhurugaani Baguntadhi." His upcoming films are currently in hold. The actor was working with Sujeeth for a massive action drama OG backed by DVV Danayya under DVV Entertainment. He may resume the shoot of OG and he will complete the shoot of the film in a single schedule after three months. Pawan Kalyan will also allocate dates for Ustaad Bhagat Singh and Hari Hara Veera Mallu. Some of his close sources say that Pawan Kalyan will complete the current projects and he will not take up any new films for now. He will spend his full time on politics for now.
Star hero Suriya's prestigious movie 'Kanguva' is set for a grand worldwide theatrical release on October 10, coinciding with the Dussehra festival. This eagerly anticipated film is being distributed in the Nizam area by Mythri Movie Distributors, a renowned distribution company known for bringing numerous super hit films to audiences. The association of Mythri Movie Distributors with 'Kanguva' has only increased the excitement surrounding the film. Directed by Siva, 'Kanguva' is a massive period action film featuring pivotal roles played by Disha Patani and Bobby Deol. Produced by KE Gnanavel Raja, Vamsi, and Pramod under the banners of Studio Green and UV Creations, the film has been made with huge budget. The sizzle teaser and posters released so far have piqued curiosity and heightened anticipation for the movie. 'Kanguva' promises to captivate audiences with a novel concept within the period action genre. The film is being released in ten languages, will also be available in 2D and 3D and is set to debut in many international languages. As one of the biggest films emerging from the Indian film industry, 'Kanguva' is generating immense expectations among trade circles and audiences alike.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జంతువులకి ఆకలి, ఆరోగ్యంలాంటి భౌతికమైన సమస్యలే ఉంటాయి. వాటి సమస్యలన్నీ ఉనికి చుట్టూనే తిరుగుతాయి. కానీ మనిషి అలా కాదయ్యే! అతను ఏర్పరుచుకున్న క్లిష్టమైన సమాజజీవితంలో ప్రతిదీ ఒక సమస్యే! ఉద్యోగంలో ప్రమోషన్‌ దగ్గర్నుంచీ, పిల్లల చదువుల దాకా... ఆర్థిక సమస్యల దగ్గర్నుంచీ అత్తగారి పోరుదాకా అన్నీ సవాళ్లే. ఈ సవాళ్లను కనుక ఎదుర్కోలేకపోతే, ఎదుర్కొని ఛేదించకపోతే జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందుకే సవాళ్ల గురించి నిపుణులు ఇస్తున్న సూచనలు కొన్ని ఇవిగో...   సమస్యని అంగీకరించండి చాలామంది సమస్య ఎదురుపడగానే దాని నుంచి ఎలాగొలా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. తాము కాసేపు కళ్లు మూసుకుని ఉంటే ఏదో ఒక అద్భుతం జరిగి సమస్య మాయమైపోతుందన్న భ్రమలో ఉంటారు. కాలం కొన్ని సమస్యలని తీర్చగల మాట నిజమే అయినా చాలా సమస్యలకి మన చేతలే అవసరం అవుతాయి. ఆ చేతలే లేకపోతే చిన్నపాటి సవాళ్లు కాస్తా జీవన్మరణ సమస్యలుగా మారిపోతాయి. అందుకనే ముందు మన ముందు ఒక సమస్య ఉన్నదనీ... దానిని అభివృద్ధీ, వినాశనం మన చేతుల్లోనే గుర్తించడం తొలి మెట్టు.   విశ్లేషణ సమస్య పట్ల భయంతో చాలామంది దాన్ని పైపైనే తడిమేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో సమస్యని కేవలం తమ దృష్టికోణం నుంచే చూస్తారు. అలా కాకుండా సమస్యని లోతుగా, అన్నివైపులా విశ్లేషించిన రోజున దాని మూలాలు తెలుస్తాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానిని ఎటునుంచి పరిష్కరించాలన్న అవగాహన ఏర్పడుతుంది.   సలహా- సంభాషణ సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.   భేషజాలను వదులుకోవాలి చాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.   అంగీకారం కట్టుదిట్టమైన ఇనుపగోడల మధ్య ఉన్నా ఏదో ఒక సమస్య రాక మానదు. సమస్యలనేవి జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. సవాళ్లు లేకపోతే ఎదుగుదల అసాధ్యమని గ్రహించినప్పుడు ఎక్కడలేని తెగువా ఏర్పడుతుంది. ఏ సమస్యా లేనప్పుడు మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ సమస్య ఉన్నప్పుడు కూడా స్థిరిచిత్తంగా, ప్రశాంతంగా దానిని ఎదుర్కోగలిగే వారు విజయం సాధించగలుగుతారు.   సిద్ధంగా ఉండాల్సిందే! సమస్య తరువాత జీవితం ఎప్పటిలాగే ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమస్యని పరిష్కరించుకునే క్రమంలో కొన్ని బంధాలు చేజారిపోవచ్చు, కొన్ని సౌకర్యాలు దూరం కావచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉండి, జీవితాన్ని మళ్లీ ఎప్పటిలా గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.   - నిర్జర.
ప్రస్తుతకాలంలో వివహబంధాలు చాలా పేలవంగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవ పడటం, ఇగో లు, మిస్ అండర్స్టాండింగ్, అనుమానాలు, ఇంకా ముఖ్యంగా కమర్షియల్ విషయాల్లో ఆర్గ్యు జరగడం,  పర్సనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాలు లైఫ్ పార్టనర్స్ మధ్య గొడవలకు దారి తీసి అవి కాస్తా విడిపోయేవరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్టనర్ దగ్గర కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త అజాగ్రత్త అయితే తరువాత చాలా రిలేషన్ కోసం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు.  లైఫ్ పార్టనర్ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ఇంప్రెస్స్ అవుతారు అనే విషయాలు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ లైఫ్ పార్టనర్ దగ్గర చేయకూడని పనులు ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో తెలుసుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం అంటూ ఉండదు. ఓపిక ఉండాలి! ఓపిక ఉండాలనే విషయం అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు. కానీ లైఫ్ పార్టనర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని, తన ప్రోబ్లేమ్స్ ను చెప్పేటప్పుడు ఓపికగా వినాలి. నువ్వెప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు పో….. లాంటి మాటలు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి. ప్రతి ఒక్కరికీ తాము ఫేస్ చేసే ప్రాబ్లెమ్ పెద్దగానే కనబడుతుంది కాబట్టి ప్రోబ్లేమ్స్ గురించి చెప్పేటప్పుడు వినడం, చెప్పేసిన తరువాత ఆ ప్రాబ్లెమ్ గురించి అన్ని కోణాలలో కొంచెం వివరించి దాన్ని సాల్వ్ అయ్యేలా సలహా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. స్పెండింగ్ టైమ్! కలసి ఉండే సమయం గురించి కొంచెం ఫోకస్ చెయ్యాలి ఇప్పటి జనరేషన్ వారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ఉద్యోగం పనుల్ని ఇంటికి తెచ్చి ఆ పని తాలూకూ ఎఫెక్ట్ ను ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటే అన్నిటికంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది లాంటి డైలాగ్స్ బాణాల్లా వచ్చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తూ పర్సనల్ టైమ్ ను హాయిగా గడపాలి. అప్పుడే ప్రొఫెషన్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసె జెంటిల్ మెన్ లేదా జెంటిల్ ఉమెన్ అవుతారు. ఓపెన్ గా ఉండాలి! కొంతమంది సీక్రెక్స్ మైంటైన్ చేస్తుంటారు. అలాంటి కపుల్స్ మధ్య అపార్థాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి వచ్చినంత తొందరగా తగ్గిపోయేవి కావు. పైపెచ్చు ఒకదానికొకటి ఇంకా అగ్గి రాజుకున్నట్టు పెద్ద గొడవల వైపుకు మల్లుతాయి. కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండటం బెటర్. ఏ విషయం జరిగినా ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఏ గొడవ జరిగినా  ఇద్దరూ కలిసి మాట్లాడుకుని దానికి సాల్వ్ చేసుకోవడం బెటర్. కాంప్రమైజ్! జీవితమంతా కాంప్రమైజ్ లతోనే గడిచిపోవాలా లాంటి ఆవేశపు క్వశ్చన్స్ వద్దు కానీ నిజానికి చాలా బంధాలు బ్రేక్ అవ్వకుండా నిలబడేట్టు చేసే శక్తి కాంప్రమైజ్ కు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాబ్లెమ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే ప్రోబ్లేమ్స్ ను సులువుగానే ఒక కొలిక్కి తీసుకురావచ్చు.  లోపాలు ఎత్తిచూపద్దు! లోపమనేది చాలా సహజం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు లోపాలు ఉన్నవాళ్లు బోలెడు. లోపం అనేది స్వీయతప్పితం కానే కాదు. అలాగని దాన్ని అదేపనిగా ఎవరూ భరించాలని అనుకోరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఏదైనా లోపం ఉంటే  కోపంలో ఉన్నప్పుడో, వేరే పనుల అసహనంతో ఉన్నప్పుడో, వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడో లైఫ్ పార్టనర్ మీద లోపాన్ని ఎట్టి చూపుతూ మాట్లాడకూడదు. అది చాలా పెద్ద బాధాకరమైన విషయంగా మారుతుంది. ఎక్స్ప్రెస్ చేయడంలో తగ్గద్దు! ప్రేమ, ఇష్టం అనేది కామన్. నిజానికి పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు కాలం గడిచేకొద్దీ ఉండదు. 90% జీవితాల్లో ఇలాగే ఉంటుంది. అయితే మనసులో ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు. అది కేవలం రొమాన్స్ ఫీలింగ్ వస్తేనే కాదు, ఏదైనా మంచి పని చేసినప్పుడో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ఐడియా ఇచ్చినప్పుడో, గుర్తుపెట్టుకొని నచ్చిన పని, నచ్చిన వస్తువు, నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. నచ్చినవి ఏవైనా తెచ్చినప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు, ప్రేమను, అనురాగాన్ని  వ్యక్తం చేయడంతో తగ్గొద్దు. అలాగే ప్రోబ్లేమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇలా ఇవన్నీ ఫాలో అయితే రిలేషన్ బ్రేకప్ అనేది ఉందనే ఉండదు.                                ◆వెంకటేష్ పువ్వాడ.
మనిషికి జీవితంలో ఆలోకాహాన చాలా ముఖ్యమైనది. మంచిగా ఆలోచించడం, చెడుగా ఆలోచించడం ఆ మనిషి మానసిక పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి ఆలోచనలో కూడా ఒక అంశం ఇమిడిపోయి ఉంటుంది. అదే ప్రేరణ. చాలామంది తమ ఆలోచనల్లో వ్యర్థమైన విషయాలు జొప్పించి ప్రేరణ కలిగించే విషయాలను అసలు తమ బుర్రలోకి రానివ్వరు. అయితే… ప్రేరణ కాని… ఆలోచన కాని అది ఇతరుల నుండి ఆశించడం చాలా పొరపాటు.  ఈ కాలంలో ఎవరికి వారే ప్రేరణ కలిగించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం అమాయకత్వమే అవుతుంది. మీకు మీరు ప్రేరణ కలిగించుకోవాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మిమ్మల్ని మీరు అభిమానించుకోవాలి. మీలోని లోపాలను అవకాశాలుగా భావించుకోవాలి. ఇదంతా జరగాలి అంటే… ముందు మీ స్థాయిని, మీ పరిస్థితిని వాస్తవిక కోణంలో అంగీకరించాలి.  కులం, మతం, భాష ఏవైనా, శారీరకంగా మనిషి  పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, అందవికారంగా ఉన్నా, నలుపు, తెలుపు... ఎలా వున్నా భౌతిక రూపాన్ని మరియు ఆంతరంగిక మనసత్వాన్ని రెండింటిని కూడా ప్రేమించాలి. అదే మీలో ప్రేమించే, ప్రేరేపించుకునే తత్వాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరు అనుక్షణం అభినందించుకోవాలి. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించాలి. ఒకరోజు ఇద్దరు స్నేహితులు దగ్గరలో ఉన్న పార్కుకు అలా నడకకు బయలుదేరారు. వారు అలా వెళ్లి కాస్త నడిచి ఒకచోట కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఎగురుకుంటూ పోతున్న పక్షులలో ఒక పావురం  రెట్టవేసింది. వెంటనే అతను చేత్తో తుడుచుకుంటూ పక్కనున్న స్నేహితుడితో "దేవుడు ఎంత గొప్పవాడు” అన్నాడు. ఆ స్నేహితుడు ఆ మాటకు విస్తుపోయి. “మీద రెట్ట పడితే అలా అంటున్నావేమిటి?” అన్నాడు.  అప్పుడు మొదటి స్నేహితుడు “నిజంగా దేవుడికి ఎంత దూరదృష్టి కదా?" అన్నాడు మళ్ళీ. ఈసారి రెండో స్నేహితుడికి కాస్త వెర్రెత్తి   “నువ్వు చెప్పేదేమిటో నాకర్థం కావటం లేదు” అన్నాడు చిరాగ్గా.  “పక్షులకు గాలిలోకి ఎగిరే శక్తి ఇచ్చిన దేవుడు నిజంగా ఎంతో అభినందనీయుడు" అన్నాడు రుమాలుతో తుడుచుకుంటూ. రెండవ స్నేహితుడి కోపం నషాళానికి అంటించి. “నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు నువ్వనేది ఏమిటి?” అన్నాడు స్నేహితుడు చిటపటలాడుతూ. "అహా! నా ఉద్దేశ్యమేమిటంటే దేవుడు పక్షులకు మాత్రమే ఇలా ఎగిరే శక్తి ఇచ్చాడు. ఆవులకు, గేదెలకు ఎగిరే శక్తి ఇవ్వలేదు” అంటూ వాష్ బేసిన్ వైపు వెళ్ళాడు. ఆ మాట విన్న రెండవ స్నేహితుడు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. పైన చెప్పనా సంఘటనలో వేరే వ్యక్తి అయితే “అంతా నా ఖర్మ” “ఆ దిక్కుమాలిన పావురం సరిగ్గా నా మొహం మీదే వెయ్యాలా?” “ఈరోజు లేచిన వేళావిశేషం బాగాలేదు” ఏదో అవుతుందని నాకు పొద్దున్నే అనిపించింది” లాంటి మాటలు చెప్పుకుని తనకు ఏదో పెద్ద ఉపద్రవం కలిగింది అన్నంతగా ఫీలైపోయి బాధలో మునిగిపోయేవాడు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనకు ఇంతకంటే పెద్ద సమస్య రాలేదు కదా అని తనకు తాను చెప్పుకోవడంలో, అలా ఆలోచించడంలో ఎంతో గొప్ప పరిపక్వత ఉంటుంది. అలాంటి ఆలోచనను అందరూ పెంపొందించుకోవాలి.                                     ◆నిశ్శబ్ద.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పెరగడానికి అతి పెద్ద కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే, మీరు ఈ వ్యాధిని నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచే అనేక ఆహారాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. కాకరకాయ: కాకరకాయ రుచి ఎంత చేదుగా ఉంటుందో మనందరికీ తెలుసు, కానీ ఈ కూరగాయ మధుమేహ రోగులకు వరం లాంటిది.  పాలీపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముల్లంగి: ముల్లంగి, పోషకాలు సమృద్ధిగా, మధుమేహ రోగులకు చాలా ప్రభావవంతంగా నిరూపించవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఈ రూట్ వెజిటబుల్ చాలా సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది. ఆకుకూరలు: ఆకు కూరలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో బచ్చలికూర మధుమేహ రోగులకు ఉత్తమ ఎంపిక. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, అనేక విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పొట్లకాయ: పొట్లకాయ ఆరోగ్యానికి నిధి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో పొట్లకాయను ఖచ్చితంగా చేర్చుకోండి.    
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
తియ్యగా ఉండే సపోటా పండును తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటలో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి చూద్దాం. మలబద్ధకం నుండి ఉపశమనం: సపోటా పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా పేగు భాగాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.పేగు భాగంలో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మీకు సులభంగా ప్రేగు కదలికను కలిగి ఉండటానికి, మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. శోథ నిరోధక లక్షణాలు: సపోటా పండ్లలో టానిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.అందువలన ఇది మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగిస్తుంది. మంట,నొప్పి నుండి ఉపశమనం కూడా సపోటా పండుతో సాధ్యమవుతుంది. చర్మం, జుట్టుకు : సపోటా పండ్ల రసం మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు జుట్టును బాగా ఎదిగేలా  చేస్తుంది. చాలా మందికి జుట్టు రాలే సమస్యను సరిచేస్తుంది. సపోటా పండులో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను, చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌పై ప్రభావం చూపుతాయి  చర్మంపై,  మరియు గీతల రూపాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తపోటు నిర్వహణ: సపోటా పండులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. అదనంగా, ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం మనల్ని మన సొంతం చేస్తుంది. క్యాన్సర్ నుండి రక్షణ: సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంతే కాకుండా సపోటా పండులో విటమిన్ ఎ,  విటమిన్ బి కూడా లభిస్తాయి, ఇది మన చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.  ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు: ఇందులో కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే సపోటా పండులో ఉండే ఈ మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తాయి.