LATEST NEWS
తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు దంపతులు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు  ప్రతి కాల్పులు జరిపితే ఏడుగురు నక్సలైట్లు చనిపోయారు.   చత్తీస్గడ్లో గత జనవరి నుంచి ఇప్పటివరకు 200 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణపూర్  దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. చత్తీస్ గడ్ లో మావోయిస్టుల రిక్రూట్ మెంట్ తగ్గింది. ఎన్ కౌంటర్ల ద్వారా నక్సలైట్లను మట్టు పెడితే రిక్రూట్ మెంట్ తగ్గిపోతుందని పరిశీలకులు అంటున్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 
జబ్జార్ భాయ్ బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. పెన్షన్ తప్పితే మరో ఆదాయ మార్గం లేకపోవడంతో నిరాశ, నిస్పృహ ఆవహించింది. నెలకు లక్ష రూపాయల జీతం రాకపోవడమే ఆయన నిస్పృహకు కారణమైంది.  ఒక రోజు మౌలానా తారసపడ్డాడు.  మౌలానా:  జబ్జార్ భాయ్ మునుపటి మాదిరిగా ఉత్సాహంగా లేకపోవడాన్ని మౌలానా పసిగట్టాడు. ఏమయ్యింది , జబ్బార్ భాయ్ అలా ఉన్నావు అని అడిగాడు.   జబ్బార్ భాయ్: సలాం వాలేకుం మౌలానాసాబ్. నేను 40 ఏళ్లు ఉద్యోగం చేసి రెండు ఇళ్లు , పిల్లల పెళ్లిళ్లు చేశాను. ఇటీవల రిటైరయ్యాను. పిల్లలకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సంపాదించే నేను రిటైరయ్యాను. పెన్షన్ తప్పితే మరో మార్గం లేదు. మనవడు, మనవరాళ్లను ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివించాలంటే డబ్బు లేదు మౌలానా సాబ్  మౌలానా: నేను ఇస్లాం అమలుకు సంబంధించి వేలాది తక్రీర్ ( ప్రవచనం)లు  ఇచ్చాను. వాటిని అమలు చేసే వారు కరువయ్యారు. ఏడెనిమిది ఏళ్ల క్రితం నేను ఇచ్చిన తక్రీర్ లను మనుషులు అమలు చేసే వారు. ఇప్పుడలా లేదు. డబ్బు ఎక్కువైతే  చాలామంది బుర్ర చెడిపోతుంది. డబ్బున్నవాడు పేదవాడిని అవమానపరుస్తాడు. అహంకారం ఎక్కువైతే మనుషులను వేధించడం ప్రారంభిస్తారు. బేవకూఫ్ హై, పాగల్ హై అని నానా బూతులు తిడుతుంటారు. రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నా పేదవాడు తరతరాలుగా అవమానానికి గురవుతున్నాడు. సమాజంలో ట్రెండ్ నడుస్తుంది. ఖురాన్ మీద విశ్వాసం లేకపోవడమే మనిషి నిరాశకు ప్రధాన కారణం. లాయ్ లా ఇల్లాల్లా మహమ్మదుర్ రసూలుల్లా అని అరబ్బీలో మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు. అల్లా తప్పితే మరో దేవుడు సృష్టిలో లేడని ప్రవక్త సందేశం ఇచ్చారు. అల్లా మీద నమ్మకం లేనివారు ఇలా డిప్రెస్ అవుతారు. సంపద పెరిగితే తృప్తి  పడరు. ఇం కా కావాలి కావాలి అంటారు.  నబీ ఎప్పుడు తప్పుడు ప్రవచనం  ఇవ్వడు కదా. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం.  ఎండాకాలంలో మా చిన్నప్పుడు చేతి విసనకర్రతో ఉక్కపోతతో ఉపశమనం పొందే వాళ్లం. పవర్ జనరేట్ అయ్యాక ఇళ్లలోకి కరెంట్ సప్లయ్ అయ్యింది. అప్పుడు ఫ్యాన్లతో సరిపెట్టుకున్నాం. జనాల దగ్గర డబ్బు ఎక్కువైతే విలాసవస్తువులపై మనసు పడుతుంది. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఎయిర్ కూలర్ల స్థానే ఎయిర్ కండిషన్ల ను కొనుగోలు చేస్తున్నారు. మన చెప్పులను స్థూల కాయులు ఒకసారి వేసుకుంటే ఆ చెప్పులు మళ్లీ మనకు వదులవుతాయి. మన తలకు సరిపడే హెల్మెట్ ను పెద్ద తల కాయ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే ఆ హెల్మెట్ కూడా వదులవుతుంది. మనిషి కోర్కెలు పెరిగితే అవి తీరవు . అప్పుడు మనిషి డిప్రెషన్  కు లోనవుతాడు. డబ్బున్న వ్యక్తులను చూసి మనకూ లేదని  మనలో విద్వేషం పెరుగుతుంది. నాకు అంత డబ్బు లేదు అని బాధపడొద్దు. కోట్లాది రూపాయలు సంపాదించిన వ్యక్తులకు అరుగుదల తగ్గిపోతుంది. అరుగుదల ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ధనికుడి కంటే పేదవాడు కంటినిండా నిద్రపోతాడు. డబ్బులెక్కువైన వ్యక్తి నిద్రమాత్రలు వేసుకుంటేనే కంటినిండా నిద్రపోతాడు.40 ఏళ్లు కష్టపడ్డా క్యారెక్టర్ లోపిస్తే అన్నీ పోయినట్టే. క్యారెక్టర్ పెంచుకునే యత్నం చేయాలి. అందం పోయినా పర్వాలేదు  కాని మన వ్యక్తిత్వం పోకుండా జాగ్రత్తపడాలి. పైసా హాత్ కా మైలా హై. ఇల్మ్ నహీతో సబ్ కుచ్  చీన్ లేగా అల్లా                                                                                                              -బదనపల్లి శ్రీనివాసాచారి  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలకు వెళ్ళారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం సందర్భంగా సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం మాఢవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బసచేస్తారు. శనివారం ఉదయం 7.35 గంటలకు పాంచజన్యం వెనుక నిర్మించిన వకుళమాత నూతన కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారు. అనంతరం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తారు.
కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని మినోవా పట్టణం నుంచి గోమా పట్టణానికి 278 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోటు ఓవర్‌ లోడ్‌ కారణంగా గోమా తీరానికి కేవలం 100 మీటర్ల దూరంలో బోల్తా పడింది. కివూ సరస్సులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా 200 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కాంగో ప్రభుత్వ బలగాలకు, ఎం23 తిరుగుబాటుదారులకు మధ్య గత మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పలు రోడ్డు మార్గాలను మూసివేశారు. గోమాకు చేరుకోవడానికి చాలా మంది పడవలను ఆశ్రయిస్తున్నారు. దాంతో పడవలు కిక్కిరిసిన జనంతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ప్రమాదం జరిగింది.
ALSO ON TELUGUONE N E W S
Macho Star Gopichand after a long streak of flops, is looking to make a huge blockbuster comeback with director Srinu Vaitla. Even the popular director is looking for a big comeback and he is planning to use everything at his disposal to make this film, Viswam, a major success.  The teaser has already promised that Srinu Vaitla is back to his strength and also added great action episodes to match Gopichand's image. The team has now unveiled third single, Vastanu Vastanule, on 4th October. Chaitan Bharadwaj's composition is blissful and highly melodious.  Kapil Kapilan's rendition and Vengi's lyrics enrich the romantic feel as well. Also, the sizzling chemsitry between the leading pair Gopichand and Kavya Thapar, enhances the beauty of the song on screen. The song is set to become a viral hit among the romantics for sure.  TG Vishwa Prasad is producing the film on People Media Factory on a massive scale. Movie is set to release worldwide on 11th October and makers are planning to capture the festival box office during Dasara weekend. https://www.youtube.com/watch?v=2yRPSYNPGdE
The much-anticipated film Thalapathy69 officially commenced with a traditional muhurat puja, held on the second day of Navratri. The event brought together an impressive ensemble of cast and crew, including the iconic Thalapathy Vijay, Bollywood star Bobby Deol, and the talented Pooja Hegde. Following this auspicious start, filming is set to begin from 5th October and makers promise it to be a historic film for Vijay.    In addition to Vijay, Pooja Hegde, and Bobby Deol, the film boasts a stellar cast that includes renowned filmmaker-actor Gautham Vasudev Menon, National Award-winning actress Priyamani, veteran actor Prakash Raj, and rising star Mamitha Baiju. The exciting lineup is a testament to the film's high expectations and ambition. Directed by H. Vinoth and produced by Venkat K. Narayana for KVN Productions, Thalapathy 69 promises to be a landmark film, a tribute celebrating Vijay's remarkable three-decade-long career. The music for the film will be composed by the celebrated Anirudh, further heightening anticipation among fans. Cinematographer Sathyan Sooryan already worked with Vijay for his Master and with H. Vinoth for Theeran Adhigaram Ondru. Other important technical crew includes editor Pradeep E Ragav, action choreographer Anlarasu, art director Selva Kumar, and costume designer Pallavi Singh. The movie is scheduled for a pan-Indian release in Tamil, Telugu, and Hindi in October 2025. 
తారాగణం: శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్‌,  దక్షా నాగర్కర్‌, గెటప్‌ శ్రీను, గోపరాజు రమణ, రవిబాబు, పృథ్వి, సునీల్‌, శరణ్యా ప్రదీప్‌ తదితరులు సాంకేతిక వర్గం:  సంగీతం: వివేక్‌ సాగర్‌  కెమెరా : వేదరామం శంకరన్‌  కూర్పు: విప్లవ్‌  రచన, దర్శకత్వం: హసిత్‌ గోలి  నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్‌  బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ విడుదల తేదీ: 04.10.2024 శ్రీవిష్ణు తనదైన శైలిలో కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు నమోదు చేస్తున్నాడు. తనతో రాజరాజ చోర వంటి వైవిధ్య భరితమైన చిత్రాన్ని తీసిన హసిత్‌ గోలి రూపొందించిన శ్వాగ్‌ సినిమాతో మన ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. స్వాగణిక వంశయోధుడుగా నాలుగు పాత్రల్లో మన ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. రీతూ వర్మ, ఒకప్పటి మేటి తార మీరా జాస్మిన్‌, దక్ష నాగర్కర్‌ ముఖ్య భూమికల్లో నట్చిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా ..!  కథ :  1551 సంవత్సరంలో  స్వాగణిక వంశ రాజు భవభూతి(శ్రీవిష్ణు) తన భార్య రాణి వింజామర రుక్మిణి దేవి (రీతూవర్మ)కి దాసుడై బ్రతుకు వెళ్లదీస్తుంటాడు. మాతృ స్వామ్యం అంతుచూసి పితృ స్వామ్యం స్థాపించాలి అనే ఆశతో సమయం కోసం కాచుకుని ఉంటాడు. అక్కడి నుంచి 2024 లో మనం టైం ట్రావెల్‌ చేసి వచ్చేసి కొత్త భవభూతి ని పరిచయం చేసుకుంటాం. అతను రిటైర్‌ అవుతున్న %ూI%. తన పై అధికారి ఆడది కనుక ఆమె తన పెన్షన్‌ ఆపిన పట్టించుకోడు. ఎప్పుడు పోలీస్‌ స్టేషన్‌ లేదా రైల్వే స్టేషన్‌ లో ఉంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. డబ్బు కోసం ఎం చెయ్యాలా అని సతమతమైపోతున్న అతనికి ఒక ఉత్తరం దొరుకుంటుంది.  అతను స్వాగణిక వంశ వారసుడు అని. వంశవృక్ష నిలయం లో రాజ వంశస్థుల వివరాలు నమోదు చేసి అతని నిధి అతనికి దక్కేలా చేస్తారు అని తెలుసుకుని వెళ్తాడు. కానీ వాళ్ళు రాజ వంశ గుర్తు అయినా పలక తెమ్మంటే ఎం చెయ్యాలో పాలుపోక ఆలోచనలో పడతాడు. అప్పుడే అనుభూతి(రీతూ వర్మ) దగ్గర ఆ పలక ప్రత్యక్షం అవుతుంది. ఈ లోపు భవభూతి కి వచ్చిన ఉత్తరం లాంటిదే సింగ( శ్రీ విష్ణు) కి వస్తుంది. అతను భవభూతి మరియు రేవతి(మీరా జాస్మిన్‌) కొడుకు కానీ అతని ఉనికి తండ్రికి తండ్రి ఉనికి కొడుక్కి తెలియవు. మరి వీళ్లందరిని ఒక్క తాటి మీద కి తేవాలి అని అనుకుంటున్నా వ్యక్తి ఎవరు? చిరవి వారసుడు యయాతి కి వీరి కి సంబంధం ఏమిటి? సినిమా చూసి తెలుసుకోండి.  విశ్లేషణ:  వంశ పరంపర వారసత్వ హక్కు మగవారికో లేదా ఆడవారికో ఉండాలి అంటారు తప్ప వారివురు కానీ వారు ఉంటారని గుర్తించడం లేదు. సమాజం లో నిజమైన గుర్తింపు లేని వ్యక్తులు గా అణచివేత కు గురి అవుతూ అవమానాల పాలవుతూ బ్రతికేస్తున్న వారికి అవమానాలు ఛీత్కారాలు ఎదురవుతుంటే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? ఒక వేళా సమానత్వం కోసమే పోరాడుతున్నారు అనుకుంటే మరి వారిని మనలో ఒకరిగా గుర్తించడానికి అడ్డుపడుతున్న పాత సంప్రదాయాలు ఆలోచనలు ఎక్కడ మొదలు అయ్యాయి? దర్శకుడు హసిత్‌ గోలి తనదైన శైలి లో ఈ సున్నిత  కధాంశాన్నీ జనరంజకం గా చెప్పే ప్రయత్నం చేసాడు.  శ్రీవిష్ణు అతనికి అన్ని విధాలు గా సహకారం అందించాడు. ఎప్పుడు చెయ్యని పాత్ర ఎంతో నైపుణ్యం తో చేసి ఒప్పించాడు. భవభూతి గా కాస్త కష్టపెట్టిన విభూతి గా మెప్పించాడు. యయాతి గా చాలా బాగా కనిపించాడు నటించాడు కూడా. మీరా జాస్మిన్‌ ఎక్కడ ఆపిందో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంది ఏమో అద్భుతం గా నటించింది. రీతూ వర్మ, దక్షా కూడా తమ పాత్రలకు తగినట్టు నటించారు. మిగిలిన వారు తమకు ఇచ్చిన సరుకు మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు.  వీటికి తోడు ప్రొడక్షన్‌ వాల్యూస్‌, విఎఫ్‌ఎక్స్‌, కెమెరా పనితనం, మంచి పాటలు అన్ని సమకూరాయి అనుకుంటే సరుకు లో సత్తువ సరిపోలేదు. ఎందుకు రాజుల కలం లో కి వెళుతున్నాం? ఎందుకు ఇంతమంది వారసులు వస్తున్నారు? అసలు ఏమిటి బ్రహ్మోత్సవం అనుకుంటూ ఉంటాం తప్ప ఇదీ విషయం అని తెలిసే సరికి పుణ్యకాలం కాస్తా స్వాగార్పణం అయిపొయింది. చెప్పాలనుకున్న విషయం గొప్పది అయినప్పుడు మంచిది అయినప్పుడు తమిళ్‌ లో విజయ్‌ సేతుపతి చేసిన ‘‘సూపర్‌ డీలక్స్‌’’ లా మానని ఆ బాధ తో మమేకం అయ్యేలా చేస్తే అద్భుతం గా ఉండేది. ఎప్పుడో రాజులు చేసిన తప్పులు ఇప్పటికి మనలో అలానే నాటుకుపోయి ఉన్నాయి అని చెప్పడం లో తప్పు లేదు కానీ శాపాలు కోపాలు అంటూ మరీ ఫార్స్‌ ఫాంటసీ లో కి మనల్ని తోసేసాడు దర్శకుడు.  కొన్ని సన్నివేశాలు తీసినప్పుడు అతని ప్రతిభ అబ్బురపరచకమానదు. ఉదాహరణకి భవభూతి కి హాస్పిటల్‌ కంపౌండర్‌ కి ఉన్న గ్లాస్‌ కనెక్షన్‌, యయాతి ని ఒప్పించలేక విభూతి పడ్డ పట్లు చూపించిన తీరు హత్తుకునే లా తీసి మెప్పించాడు. కానీ అవి ఎండాకాలం వానలా వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ మనల్ని మండే ఎండల్లో ఎడారి లో వదిలేసినట్టు వదిలేస్తాయి. నలుగురు శ్రీ విష్ణు పాత్రలు ఒకే చోట ఉన్న ఎవరు ఏమిటో తెలుసుకునే లా చేసిన కెమెరా పనితనం, మేకప్‌ వారి పనితనం అన్నటికి మించి శ్రీ విష్ణు నటనా ప్రతిభ మెచ్చుకోకుండా ఉండలేం. అదే సమయం లో ఇన్ని ఉంది ఇలా దారి తప్పింది ఏమిటి అని నొచ్చుకోకుండాను ఉండలేం. కొత్త ప్రయత్నమే కానీ మెచ్చుకుని వీరతాడ్లు వేద్దాం అంటే జంబూ చెబుతున్న కథ కి లంబూ ఇచ్చిన  వ్యాఖ్యానం లా అడ్డదిడ్డం గా దిద్దాడడం గా సాగే సరికి  ‘‘హై హై నాయక’’ అనటం కష్టమే!  చివరిగా  శ్రీ విష్ణు కష్టం, చెప్పిన విషయం, అందరి పనితనం ఇవి మనల్ని ఒక సరి చూసేందుకు ప్రేరేపించినా ఎటు వెళుతోంది ఈ పయనం ఏది నీ తీరం అనుకుంటూ బాధపడకుండా విసుగు చెందకుండా స్వాగణిక రాజు ని అనుసరించాలి అనుకున్నా ‘మార్గం’ కష్టమే!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే జరుగుతోంది. రాజకీయ లబ్ది కోసం నాగార్జున కుటుంబాన్ని బజారుకీడ్చిన కొండా సురేఖపై ప్రతి ఒక్కరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండిరచారు. యావత్‌ సినీ పరిశ్రమ నాగార్జున కుటుంబాన్ని సపోర్ట్‌ చేస్తోంది. అంతేకాదు, ప్రతి ఒక్కరూ మంత్రి చేసిన పనిని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నానని ఇటీవల మీడియా తెలియజేసింది. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్‌ జరిగింది.  ఈ విషయాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్న నాగార్జున... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అయితే పరువు నష్టం కింద ఎలాంటి డబ్బు డిమాండ్‌ చెయ్యని నాగార్జున, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ వేశారు. శుక్రవారం ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలియజేసింది. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణను వాయిదా వేశారు. అక్టోబర్‌ 7న  కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలియజేసింది. నాగార్జున కుటుంబాన్ని అభాసుపాలు చేసేందుకు పూనుకున్న మంత్రి కొండా సురేఖపై అన్నివర్గాల ప్రజలు, ప్రముఖులు ఆగ్రహంతో ఉన్నారు. త్వరితగతిన ఈ కేసు విచారణ జరిగితే బాగుండేది అని భావిస్తున్నారు ప్రజలు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో, కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ విశ్వంభర(vishwambhara)జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూడా ఇదే. దీంతో విశ్వంభర ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి అడుగు పెడుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల నుంచి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది.ఇంకో పక్క డబ్బింగ్,పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. రెండు పాటలు  మినహా షూటింగ్  మొత్తం కంప్లీట్ అయ్యిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.భోళా శంకర్ పరాజయంతో చిరంజీవి ఎంతో కసిగా చేస్తున్న విశ్వంభర లో త్రిష(trisha)ఒక హీరోయిన్ గా చేస్తుండగా నాగార్జున తో నా సామిరంగ లో జత కట్టిన ఆషికా రంగనాధ్(Ashika Ranganath)కూడా ఒక హీరోయిన్ గా చేస్తుంది. తెలుగు చిత్ర సీమకి చెందిన భారీ తారాగణం మొత్తం చేస్తుండగా ఆస్కార్ విన్నర్  కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. కళ్యాణ్ రామ్(kalyan ram)కి   బింబిసార(bimbisaara)లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వశిష్ఠ(vasishta)దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ పై ప్రమోద్, వంశీ రెడ్డి లు  అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మూవీ ప్రారంభోత్సవం నాడే  జనవరి పది న  రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ  డేట్ మారే అవకాశాలు ఉన్నాయనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి.     
  Cast: Sree Vishnu, Ritu Varma, Meera Jasmine, Daksha Nagarkar, Goparaju Ramana, Sunil, Saranya Pradeep, Vadivukkarasi, Ravi Babu, Pridhvi Crew:  Music by Vivek Sagar,  Cinematography by Vedaraman Shakaran, Edited by Viplav Nyshadam Produced by TG Vishwa Prasad Written & Directed by Hasith Goli Telugu Film Industry has been blessed with good content makers from time to time. Every generation does have a good actor with great run at the box office content wise and commercially, too. In current generation, Sree Vishnu has been concentrating on good content and delivering some really memorable films. After his much adored Raja Raja Chora, the actor has joined hands with the film's director, Hasith Goli, for another film, Swag. The combination is back working for same production house, People Media Factory, owned by TG Vishwa Prasad. Swag also marks as Meera Jasmine's comeback film in Telugu and it released on 4th October, worldwide. Let's discuss about it in detail.  Plot:  In 1551, a matriarch Vinjamara Rukhmini Devi(Ritu Varma) treats men as slaves and asks them to wear face masks and doesn't let them any kind of freedom of any sorts. She wants to give birth to only female babies but previously, her male babies died early. Many royal staff believe that she killed the male babies as she harbours fierce hatred towards males. Her husband, Swaganika Bhavabhuti(Sree Vishnu) wants to establish patriarchal society, where men have all the freedom and women have restrictions. Cut to 2024, we see SI Bhavabhuti(Sree Vishnu) being retired and his head, SP Dhana Lakshmi decides to withhold his pension and other benefits. Rather than trying to sort out differences with her, he rebels and decides to live without benefits.  He doesn't want to bow down to a woman in any case. At this juncture, he receives a letter stating that he belongs to royal family Swaganika lineage and he has a huge amount of treasure waiting to be claimed. He tracks down the "Royal Family lineage" recorder Vamsa Vruksha Nilayam and decides to register himself as Yayathi(Sree Vishnu)'s son and only surviving "male kin" to the lineage. But he is asked to submit a proof of lineage but it happens to be with Anubhuti(Ritu Varma). Meanwhile, Bhavabhuti is completely in love and longing for his estranged wife, Revathi(Meera Jasmine) and their kid. His son, Singa aka Singa(Sree Vishnu) desperately tries to become an influencer. Will Bhavabhuti meet his son? What would Anubhuti do with the "Swaganika identity proof"? Is there any other successor to the royal family? Watch the movie to know more.  Analysis:  Sree Vishnu is one of the finest performers and he did his best in the four distinctive characters. His looks and body language for different characters are unique and differentiable. In the transgender character, his look and performance needs to be praised. But as Bhavabhuti, he did go a little overboard at places and the writing also did not help him at places. He did his best in Yayathi role by being true to the character and time period. Ritu Varma has a good character and she did perform well. Meera Jasmine has the meatiest role and she did her best. Saranya Pradeep, Daksha Nagarkar characters don't really connect with us but they did well. All others performed aptly to their characters.  Writing wise Hasith Goli looked highly ambitious for the subject he had in his mind. He tried to include how matriarchal society gave rise to patriarchal society in a satiric way. It is true that some Indian kingdoms were identified to be matriarchal. In Mahabharata, Queen Prameela was said to be the head of matriarchal kingdom and Arjuna married her, after falling in love with her. Among Telugu dynasties, Satavahana dynasty is known for being matrilineal, where Kings assume their mother's name rather than father's name. Taking these sort of examples, Hasith Goli wanted to create a gender war between male and female. He tried to give an origin to the entire central clash in the film but then he did not establish the transgender not being inclusive in gender classification.  When the story deals with acceptance of humans as humans without any gender bias, the focus needed to be more about that core than just identifying the kith and kin of a royal family. As a premise, it does provide great number of possibilities to explore but the screenplay that Hasith Goli went for did not really convey the point in an exciting and engaging way. The talented director did not identify a core emotion and it almost looked like he is searching for it throughout. In actuality, he did knew the core emotion, essential beats but in trying to expand the simple point, he traveled too many places in trying to bring everything he wants to say in one story.  There are moments of brilliance here and there with director bringing out inner turmoil of Meera Jasmine's character. The delicate touch he has added to Vibhuthi character in Flashback episodes is also good. But then, he fails to integrate all the emotions, characters and their motivations in a streamlined manner. There are lot of good things hidden amongst some weird and very strange things. All those could have been simplified, structured and presented without going for shock value. With good score from Vivek Sagar, fine visuals from Vedaraman Shakaran and good production values by People Media Factory, film still ends up being a messy effort with lofty ideals.  In Conclusion: Sree Vishnu does try his best and there are few sparks here and there. But the film finds it hard to connect with us as too many characters and back stories fail in hooking us to core emotions.  Rating: 2/5  - Naresh Kota
ఈవారం విడుదలైన సినిమాల్లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘శ్వాగ్‌’ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్‌గా అనిపించిన ట్రైలర్‌ వల్ల ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. హసిత్‌ గోలి దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ‘శ్వాగ్‌’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు విడుదలైంది. అంతేకాదు, ఒక రోజు ముందు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్‌ షోలు వేశారు. సినిమా మీద దర్శకనిర్మాతలకు ఉన్న నమ్మకం వల్లే ప్రీమియర్స్‌ వేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌పై విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది.  ఈ సినిమా రిలీజ్‌కి ముందు శ్రీవిష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ‘భిన్నమైన టైటిల్‌, విభిన్నమైన కథతో వస్తున్న ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. సినిమాను చూసిన వారు దయచేసి ఆ ట్విస్టుల గురించి ఎవరికీ చెప్పొద్దని మనవి. మీడియా ద్వారాగానీ, సోషల్‌ మీడియా ద్వారాగానీ వాటిని రివీల్‌ చెయ్యొద్దు. మీరు సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 
  సినిమా పేరు:రామ్ నగర్ బన్నీ తారాగణం: చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్ర, మురళి గౌడ్,సుజాత తదితరులు    సంగీతం:అశ్విన్ హేమంత్  ఫొటోగ్రఫీ: అష్కర్ అలీ    ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్  రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్   బ్యానర్ :శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్   నిర్మాతలు:ప్రభాకర్ పొడకండ్ల,మలయజ పొడకండ్ల విడుదల తేదీ: అక్టోబర్ 4 , 2024  సుదీర్ఘ కాలంగా తన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నప్రముఖ సినీ, టివి నటుడు ప్రభాకర్ నట వారసుడు చంద్ర హాస్ తొలిసారి నటించిన రామ్ నగర్ బన్నీ(ram nagar bunny)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ బన్నీ అలియాస్ రామ్ నగర్ బన్నీ(చంద్రహాస్) ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నేటి తరం చాలా మంది కుర్రోళ్ల మాదిరిగా ఇరవై నాలుగు గంటలు ఫుల్ యాటిట్యూడ్ తో ఉంటాడు.ప్రేమకి, ఆకర్షణకి  తేడా తెలియని బన్నీ తొలి చూపులోనే దివ్య సింగ్ (రిచా జోషి) నయన(అంబికా వాణి,) అనే ఇద్దరమ్మాయిల ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరు కూడా బన్నీ ని ప్రేమిస్తారు. మరో వైపు శైలు(విస్మయ శ్రీ) అనే అమ్మాయి బన్నీ మీద ప్రేమని పెంచుకొని బన్నీ ఇంట్లోనే పని మనిషిగా ఉంటూ ఇంట్లో వాళ్లందరికీ సేవ చేస్తూ ఉంటుంది.అనుకోకుండా ఒక రాత్రి బన్నీ, శైలు శారీరకంగా కలవడంతో  పెళ్లి చేసుకోమని  శైలు అడుగుతుంది.దాంతో విషయాన్నీ లైట్ గా తీసుకోమని చెప్తాడు.ఇలా జరుగుతున్న కథలో బన్నీ కంటే వయసులో పది సంవత్సరాల పెద్దదైన తార(  రితు మంత్ర) అనే కోటీశ్వరులు బన్నీ మీద ఇష్టాన్ని పెంచుకొంటుంది. దాంతో పెళ్లి చేసుంటానని చెప్తే బన్నీ కూడా ఒప్పుకుంటాడు. బన్నీ ఆ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు? దివ్య సింగ్, నయన ల లవ్ ఏమైంది? శైలు కి న్యాయం జరిగిందా? అసలు శైలు పని మనిషిలా  బన్నీ లైఫ్ లోకి ఎందుకు వచ్చింది? మరి చివరకి బన్నీ నిజమైన ప్రేమకి అర్ధం తెలుసుకున్నాడా? లేదా అనేదే ఈ కథ  ఎనాలసిస్ : ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్త కాకపోయినా కూడా పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉండటం వలన ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు సాగింది.ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ సినిమాని కాపాడింది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రారంభ సన్నివేశంలోనే తన కంటే వయసులో పెద్దదయిన ఆంటీ ని పెళ్లి చేసుకోబోతున్నానని చంద్రహాస్(chandrahass)చెప్పడంతో   ప్రేక్షకుడికి సినిమా మీద ఆసక్తిని పెంచేలా చేసింది.ఇక ఆ తర్వాత కాలేజీ గొడవలు, ఇద్దరు అమ్మాయిలని ప్రేమించడం,వాళ్ళతో జల్సాగా తిరగడం కోసం ఇంట్లో డబ్బులు దొంగతనం చెయ్యడం లాంటివన్నీ ఎన్నో యూత్  సినిమాల్లో వచ్చినవే. కాకపోతే ప్రెజంటేషన్ కొత్తగా ఉండటంతో బోర్ కొట్టకుండా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో బన్నీ ఉండే  సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి. థియేటర్ లో ఆ సీన్స్ కి నవ్వని ప్రేక్షకుడంటూ ఉండడు.ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే ప్రతి సీన్ కూడా ఫాస్ట్ గా ఉండి సినిమాలో వేగాన్ని పెంచింది. సినిమాలో ఏముంది అని ప్రేక్షకుడు ఆలోచించే లోపు   ఫస్ట్ ఆఫ్ లో చూపించని ఒక ట్విస్ట్ ని ప్రారంభంలోనే రివీల్ చేసి ఇంట్రెస్టింగ్ ని కలగచేసారు.ప్రతి సీన్ కి కూడా ఒక పర్పస్ ఉండేలా డిజైన్ చేసారు.కాకపోతే బన్నీ తన కంటే వయసులో పెద్దదయిన ఆవిడతో  పెళ్ళికి ఒప్పుకోటానికి కొంచం టైం ఇచ్చి ఉండాల్సింది.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: బిరుదుకి తగ్గట్టే తన యాటిట్యూడ్ తో చంద్రహాస్ ఒక రేంజ్ పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా బాగుంది.పెద్ద హీరో స్థాయిలో ఒంటి చేత్తో సినిమాని ముందుండి నడిపించాడు.ముఖ్యంగా డాన్స్ లలో వీరవిహారం చేసాడు. చంద్రహాస్ రూపంలో  ఇండస్ట్రీ కి ఇంకో మంచి హీరో దొరికినట్టే. ఇక హీరోయిన్లు గా చేసిన  విస్మయ శ్రీ,రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్ర లు  ఎంతో అనుభవమున్న వాళ్ళలా చేసారు. ముఖ్యంగా విస్మయ శ్రీ మెయిన్ హీరోయిన్ హోదాలో  అయితే రెండు వేరియేషన్స్ లో పరిణితి తో కూడిన నటనని ప్రదర్శించింది.చంద్ర హాస్ తండ్రిగా చేసిన మురళి గౌడ్ అయితే మరోసారి తన నటనతో నవ్వులు పూయించాడు.తల్లిగా చేసిన  సుజాత, బామ్మగా చేసిన బలగం ఫేమ్ నటి కూడా  చాలా బాగా చేసారు. ఇక అష్కర్ అలీ కెమెరా పని తనం, అశ్విన్ హేమంత్ సంగీతం సినిమాని అదనపు బలాన్ని ఇచ్చాయి.ఇక శ్రీనివాస్ మహత్ (srinivas mahath)రచనా దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనే కొట్టొచ్చినట్టు కనపడింది. ముఖ్యంగా డైలాగులు అయితే సూపర్ గా ఉన్నాయి.  ఇలాంటి కథలు తెలుగు తెరపై గతంలో చాలానే వచ్చాయి. కానీ బోర్ కొట్టని కధనాలు, కామెడి, నటీనటుల పెర్ఫార్మెన్సు  సినిమాని  పర్లేదనే స్థాయిలో ఉంచాయి.            రేటింగ్ : 2.25/ 5                                                                                                                                                                                                                                                                                              అరుణాచలం 
స్టార్‌ హీరోల సినిమాల ఫస్ట్‌ వీక్‌ కలెక్షన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్‌ లాంటి పవర్‌ ఫుల్‌ హీరో సినిమా రిలీజ్‌ అవుతోందంటే ముందు నుంచే రికార్డుల మోత మోగుతుంది. గత వారం విడుదలైన ఎన్టీఆర్‌ సినిమా ‘దేవర’కి కొంత డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్లపరంగా దాని ప్రభావం అంతగా లేదని ఫిగర్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.365.89 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. కేవలం ఆరు రోజుల్లోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయిందంటే.. సినిమాకి ఎలాంటి ఆదరణ లభిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. ఇక్కడ కూడా ఊహకందని కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ‘దేవర’. 7వ రోజు రెండు రాష్ట్రాల కలెక్షన్స్‌..(కోట్లలో) నైజాం.. 1.02 సీడెడ్‌.. 0.73 వైజాగ్‌.. 0.24 ఈస్ట్‌.. 0.19 వెస్ట్‌.. 0.12 కృష్ణా.. 0.11 గుంటూరు.. 0.11 నెల్లూరు.. 0.12 టోటల్‌గా 7వ రోజు కలెక్షన్‌ రూ.2.64 కోట్లు టోటల్‌గా 7 రోజుల కలెక్షన్స్‌(కోట్లలో) నైజాం.. 42.48 సీడెడ్‌.. 22.99 వైజాగ్‌.. 11.43 ఈస్ట్‌.. 7.07 వెస్ట్‌.. 5.60 కృష్ణా.. 6.39 గుంటూరు.. 9.30 నెల్లూరు.. 4.41 టోటల్‌గా 7 రోజుల కలెక్షన్‌ రూ.109.67 కోట్లు టోటల్‌గా 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ.365.89 కోట్లు
నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ను చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. నాలుగు రోజలు చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్‌ చేశారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈరోజు ఉదయం తన నివాసానికి చేరుకున్నారు రజినీ. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడటంతో వైద్యులు ఆయనకు స్టెంట్‌ అమర్చారు. ట్రాన్స్కాథెటర్‌ పద్ధతి ద్వారా తలైవాకు స్టెంట్‌ వేసినట్టు అపోలో వైద్యులు తెలిపారు.    తమ హీరో ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారని తెలుసుకున్న సూపర్‌స్టార్‌ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చేవారం రజినీ కొత్త సినిమా ‘వేట్టయాన్‌’ రిలీజ్‌ కాబోతోంది. ఈ సమయంలో సూపర్‌స్టార్‌ అనారోగ్యానికి గురి కావడం అభిమానుల్ని బాధించింది. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రజినీ ఆస్పత్రిలో ఉన్నారని తెలిసి వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో రజినీకాంత్‌ సతీమణి లత మీడియా ముందుకు వచ్చి రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందనే శుభవార్తను అభిమానులకు చెప్పారు. ఇక వచ్చే వారం దసరా కానుకగా రిలీజ్‌ కానున్న తలైవా కొత్త సినిమా సంబరానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం.  ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు,  సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది.  అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట.  ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. మెడ నొప్పి.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది.  ఇది కాస్తా వెన్నునొప్పికి,  మెడ నొప్పికి దారితీస్తుంది. భుజాలు.. చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు.  సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ  ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది. ఊబకాయం.. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి.  ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి  బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది. టెన్షన్.. ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది.  ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది.  ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో  టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం. పరిష్కారాలు.. సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు  తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది.  చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి.  బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి.  నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.                                                        *రూపశ్రీ.
    ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా చాలా జీవులు ఉన్నాయి. జంతువులకు లేని ఎన్నో అడ్వాంటేజస్ మనుషులకు ఉన్నాయి. ఈ కారణంగానే జంతువులు మనుషుల్లా అభివృద్ది చెందలేకపోయాయి.   అయితే జంతువులకు మనసుంటుంది. అవి కూడా వాటి మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయడానికి విభిన్న రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటికి కావలసిన స్వేచ్చ గురించి మరెన్నో విషయాల గురించి చెప్పాలనుకుంటాయి. కానీ అవి చెప్పలేవు. అందుకే వాటి  తరపున సగటు మనిషే గొంతు వినిపిస్తాడు. జంతువుల సంరక్షణ,  జంతువుల హక్కులు, అంతరించిపోతున్న జంతుజాతుల కోసం పోరాడటం వంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక రోజు ఏర్పాటుచేయబడింది. ఇది అక్టోబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది. ఈ రోజున జంతు ప్రేమికులు జంతువుల తరపున తమ గొంతును ప్రపంచానికి వినిపిస్తారు. అసలు ఈ జంతు దినోత్సపం ఎప్పుడు ఎలా ఏర్పడింది? మూగజీవుల కోసం ఒకరోజు ఏర్పాటు చెయ్యాలని అనిపించడం వెనుక కారణం ఏమిటి? పూర్తీ వివరాలు తెలుసుకుంటే.. చరిత్ర ఏం చెబుతోందంటే.. ప్రపంచ జంతు దినోత్సవం 1925లో హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ బెర్లిన్‌లో మొదటిసారి  నిర్వహించింది. జిమ్మెర్‌మాన్, జర్మన్ జంతు ప్రేమికుల మ్యాగజైన్ “మ్యాన్ అండ్ డాగ్” ను  ప్రచురించారు.  జంతువుల పట్ల అవగాహన పెంచడానికి, ఆ అవగాహనను  మెరుగుపరచడానికి  ఈ ఈవెంట్‌ను ప్రారంభించారు. కాథలిక్కులందరూ గౌరవంగా భావించే  సెయింట్ ఫ్రాన్సిస్ జంతువులు ఇంకా ఇతర  అన్ని జీవులతో  ఎంతో గొప్ప అనుబంధాన్ని ఏర్పరుచున్నారు.   జంతువుల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ ఎన్నో గొప్ప పనులు చేశారు.  ఈ రోజున కొన్ని కాథలిక్ చర్చిలు పెంపుడు జంతువులకు ఆశీర్వాదాలు అందిస్తాయి. ప్రపంచ జంతు దినోత్సవం పర్యావరణ శాస్త్రవేత్తలకు అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఒక వేదికగా మారింది. 2003 నుండి, UK-ఆధారిత స్వచ్ఛంద సంస్థ నేచర్‌వాచ్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను ఏర్పాటు  చేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఈ ఈవెంట్ కు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని వ్యాప్తం చేస్తూ వచ్చింది. ప్రపంచ జంతు దినోత్సం రోజున  కేవలం పెంపుడు జంతువులకు మాత్రమే కాదు అడవి జంతువులు, అంతరించిపోతున్న జాతులు,  పర్యావరణ విధ్వంసం లేదా రక్షణ లేకపోవడం వల్ల  జరుగుతున్న నష్టాన్ని చర్చించడం, దాన్ని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవడం. జంతువుల హక్కులు, వాటి సంరక్షణ, ప్రజల ఆలోచనలలో మార్పు మొదలైన విషయాల గురించి అవగాహన పెంచండం దిశగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సగటు పౌరుడి భాద్యత ఏంటంటే.. చాలామంది ఇళ్ళలో పెంపుడు జంతువులు ఉంటాయి. అయితే కేవలం పెంపుడు జంతువులనే కాకుండా సమాజంలో భాగంగా ఉన్న జంతువులకు కూడా ఆహారం ఇవ్వడం వాటి సంరక్షణ దిశగా ఆలోచన చెయ్యడం, జంతు హింస మానడం, జంతువుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిలో మార్పు తీసుకురావడం, సమాజంలో మనుషులతోపాటు నివసించే హక్కు జంతువులకు ఉందని గుర్తించడం, ఈ విషయాలను అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని గుర్తించి ఆ జంతువులతో ప్రేమగా మసలుకోవడం ఎంతో ముఖ్యం. మనిషి జంతువులను ప్రేమిస్తే మనిషి కంటే ఎక్కువ ప్రేమను అవి తిరిగి ఇస్తాయి. ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. జంతు దినోత్సవం వెనుక కొన్ని ఆసక్తిర విషయాలు.. జంతువుల పట్ల తన గొంతు వినిపించడం అనేది ఇప్పటినాటి మాట కాదు. గ్రీకు తత్వవేత్త పైథాగరస్  జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయని, అవి కూడా బాధపడతాయని, వాటికి కూడా ఆత్మ ఉంటుందని గుర్తించాడు. అందుకే అందరూ శాఖాహారం తీసుకోవాలని, జంతు హింస మానేయాలని  ఎప్పుడో చెప్పారు.   లూయిస్ గోంపెర్ట్జ్ అనే వ్యక్తి జంతువుల హక్కుల కోసం వాదించడానికి మొదటిసారి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు “Moral Inquiries on the Situation of Man and of Brutes,” ఇది 1624లో జరిగింది. 1877లో సాహిత్య పరంగా కూడా జంతువుల హక్కులు, వాటి జీవితం గురించి ఒక నవల వెలువడింది. అన్నా సీవెల్ రచించిన ఈ  నవల 'బ్లాక్ బ్యూటీ'.  మానవేతర దృక్కోణం నుండి వ్రాయబడిన మొదటి ఆంగ్ల నవల ఇదే.   గుర్రాల చికిత్సపై ఈ నవల  చర్చను రేకెత్తిస్తుంది. ఫ్లోరెన్స్ ఇటలీలోని ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ జంతు దినోత్సవాన్ని' ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది 1931 వ సంవత్సరంలో జరిగింది. సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ (SAPL) USలో హ్యూమన్ స్లాటర్ చట్టం కోసం లాబీయింగ్ చేసిన మొదటి సంస్థ. ఇది 1955లో జరిగింది.                                                              *నిశ్శబ్ద.
    మహాత్మాగాంధీ పేరు చెప్పగానే చిన్న పిల్లలు కూడా జాతిపిత అని పిలుస్తారు. గాంధీ ఫొటో కానీ గాంధీ గురించి ఉపన్యాసం కానీ లేకుండా ఏ జాతీయ పండుగ ముగియదు. ఇక అక్టోబర్ 2న వచ్చే గాంధీ జయంతిని జరుపుకోవడం తప్పనిసరి.  అయితే మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన 40 ఏళ్ల పోరాటంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రధాన ఉద్యమాలకు న్యాయకత్వం వహించారు. ఈ ఉద్యమాలు బ్రిటీష్ పాలకులను, బ్రిటీష్ ప్రభుత్వాలను భయపెట్టడమే కాకుండా భారతదేశంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమానలు బలోపేతం చేసిన ఈ ఉద్యమాలు ఏంటంటే.. సత్యాగ్రహం.. 1906 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బ్రిటీష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షా పూరిత విధానాలకు వ్యతిరేకంగా గాంధీజి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. చంపారన్ ఉద్యమం.. 1917లో బీహార్ లోని చంపారన్ రైతుల దోపిడీకి, నీలిమందు విధానానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఖేడా సత్యాగ్రహం.. 1918లో బ్రిటీష్ ప్రభుత్వం పన్ను వసూలుకు వ్యతిరేకంగా గుజరాజ్ లో గాంధీజి రైతుల ఉద్యమానికి న్యాయకత్వం వహించారు. దీన్నే ఖేడా సత్యాగ్రహం అంటారు. స్వదేశీ ఉద్యమం.. గాంధీజి స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది 1920 లో జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం.. 1920-22 సంవత్సరాలలో మహాత్మా గాంధీ బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. చౌరీ చౌరా.. 1922లో చౌరీచౌరా హింసాత్మక సంఘటన చోటుచేసుకుంది.  దీని కారణంగా గాంధీజి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ముగించారు. ఉప్పు సత్యాగ్రహం.. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం ఉప్పు పన్ను విధించింది.  దీనికి వ్యతిరేకంగా గాంధీజి దండిలో పాదయాత్ర చేసి ఉప్పు తయారు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు.   శాసనోల్లంఘన ఉద్యమం.. 1930 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యక్తం చేయడానికి దాని నిబంధనలను పాటించక పోవడం,  పికెటింగ్ ప్రదర్శన, సమ్మెలు చేయడం వంటివి చేశారు. ఇవన్నీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి. దళిత ఉద్యమం.. మహాత్మా గాంధీ దేశంలో కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత ఉద్యమాన్ని 1933లో చేపట్టారు. క్విట్ ఇండియా.. 1942లో బ్రిటీష్ పాలనను అంతం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని గాంధీజి 1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.                                                  *రూపశ్రీ.  
  ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.  ఇవి శ్వాస వ్యవస్థకు మూలం.  మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి,  కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర.  సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి.  ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా.  ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి.  అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే  కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి. తులసి నీరు.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.  రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ.. అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనా టీ.. పుదీనాలో మెంథాల్ ఉంటుంది.  ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో,  శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.  పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాము నీరు.. వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది.                                                  *రూపశ్రీ.
శరీరానికి అవసరమైన మూడు స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి,  కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణ కోసం మనకు అవసరమైన విధంగా సరిగ్గా పనిచేయడానికి మన శరీరానికి పెద్ద పరిమాణంలో ప్రోటీన్ అవసరమవుతుంది.  ప్రొటీన్లు వ్యాధులతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి, ఇవి లేకపోతే మన శరీరం నిరంతరం అరిగిపోతుంది.   ప్రోటీన్ల యొక్క ప్రయోజనాల జాబితా అంతులేనిది, ఈ మాక్రోన్యూట్రియెంట్‌ను మన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పర్ఫెక్ట్  గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ సమయం ఏదంటే  అల్పాహార సమయమే..  తద్వారా మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ప్రోటీన్ అందిందే కొన్ని ఆహార పదార్థాలు ఇవే.. నట్స్ - నట్స్ రుచికరమైన, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం అని చెప్పవచ్చు.  మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మోతాదును అందిస్తాయి. అంతే కాదు ఇవి బెస్ట్ రికమెండషన్ కూడా.  తినడానికి కూడా సులభమైనవి.  ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజల్లో బాదం, వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వేరుశెనగ ఉన్నాయి.  నట్స్ తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ప్రొటీన్‌ను పొందడంలో మీకు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు మరియు ఎముకలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందేలా చేస్తుంది. పచ్చి బఠానీలు - ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి అవసరమైన రెండు పోషకాలు, ఇవి బఠానీలలో పుష్కలంగా ఉంటాయి.  బఠానీలు ఆకలిని నియంత్రించగలుగుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  ఒక కప్పు బఠానీ తీసుకుంటే అందులో విటమిన్ సిలో సగానికి పైగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రోజువారీ అల్పాహారంలో బఠానీలను చేర్చడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లను అందించవచ్చు.  క్వినోవా - క్వినోవా ఉత్తమ అల్పాహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్వినోవాను కంప్లీట్ ప్రోటీన్‌గా సూచిస్తారు.  శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి క్వినోవా కలిగి ఉండటం దీనికి కారణం.  ఇది చాలా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది, అలాగే ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. సోయా మిల్క్ - సోయా మిల్క్‌లో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.  సోయా పాలు ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది బలమైన కండరాలు అవయవాలను నిర్వహించగలదు.  మీ శరీరం స్వంతంగా ఉత్పత్తి చేయలేని "మంచి" కొవ్వులు అయిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో పుష్కలంగా ఉన్నాయి.   ఓట్స్ - ఓట్స్ తక్కువ-ధర, పోషకాలు ఎక్కువగా ఉండే ప్రోటీన్‌ల మూలం.   ఓట్స్ లో 11-15% అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి.  పీనట్ బటర్, చియా గింజలు, అవిసె గింజలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ లను ఓట్స్ కు జోడించవచ్చు.  సమర్థవంతమైన ప్రోటీన్ ఫుడ్ కు వోట్స్ సరైన మార్గం.  చియా విత్తనాలు - చియా గింజలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అధిక-నాణ్యత గల ప్రోటీన్. అలాగే అవసరమైన ఖనిజాలు యాంటీఆక్సిడెంట్‌లలో సమృద్ధిగా ఉంటాయి.  ఈ విత్తనాలను  సలాడ్లతో తీసుకోవచ్చు. లేదంటే  పెరుగుతోనూ తీసుకోవచ్చు. చాలా రకాల పుడ్డింగ్‌ లలో వీటిని వాడతారు.   ఇలా సాధారణ వ్యక్తులు కూడా తమ అల్పాహారంలో జోడించుకోగల ప్రోటీన్ ను తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.  
  నిద్ర గొప్ప మెడిసిన్ అంటారు.  కంటి నిండా నిద్రపోయేవారి ఆరోగ్యం చాలా మటుకు చాలా బాగుంటుంది.  హాయిగా నిద్ర పోయే వారు మానసిక ఒత్తిడి,  డిప్రెషన్,  ఆందోళన వంటి మానసిక సమస్యలను చాలా బాగా డీల్ చేయగలుగుతారు. అంతేనా రాత్రి సమయంలో బాగా నిద్రపోయేవారు తమ రోజును పర్పెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. రాత్రి సమయంలో నిద్రపోయే వారి శరీరంలో నిద్ర చక్రం ఒక క్రమ పద్దతిలో పనిచేస్తుంది.  అయితే ఈ కాలంలో చాలామంది నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు.  రాత్రి తొందరగా పక్క మీదకు చేరినా తొందరగా నిద్ర పట్టక గంటలు గంటలు దొర్లుతూ కాలం గుడుపుతారు.  అయితే కొన్ని పనులు చేయడం వల్ల రాత్రి సమయంలో హాయిగా నిద్ర పోవచ్చట. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. శ్వాస.. లోతైన శ్వాస వ్యాయామాలు శరీరాన్ని, మెదడును, మనస్సును అలసట , ఒత్తిడి నుండి బయటకు తెస్తాయి.  ఈ కారణం వల్ల నిద్రపోయే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి పాటించడం పడుకున్న తరువాత తొందరగా నిద్ర వస్తుంది.  నిద్రలేమి,  తొందరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. శ్రద్ద.. శ్రద్ద వల్ల నిద్ర పట్టడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర పట్టడం కోసం చేసే లోతైన శ్వాస వ్యాయామాల విషయంలో శ్రద్ద చాలా అవసరం. శ్వాస వ్యాయామాలు మనస్సుకు, శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి  సహజ మార్గంలా సహాయపడతాయి.  ఈ శ్వాస వ్యాయామాలు శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.  ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. డిజిటల్ డిటాక్స్.. డిటాక్స్ అంటే కలుషితం అవ్వడం.  డిజిటల్ యుగంలో శరీరం చాలా రకాల సమస్యలతో కలుషితం అవుతోంది.  ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ ఉండాల్సిందే.. ఇలా రాత్రి పడుకునేవరకు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అది నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. ఫోన్ లేదా టీవి, ల్యాప్టాప్ నుండి వెలువడే నీలి కాంతి కళ్లకు ఎఫెక్ట్ ఇస్తుంది.  ఈ కాంతి తగిలిన తరువాత తొందరగా కళ్లు విశ్రాంతిలోకి వెళ్లలేవు. అందుకే వీటికి దూరం ఉండాలి. నిద్ర పోవడానికి కనీసం గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీ వంటి పరికరాలను బంద్ చేయాలి. మెలటోనిన్ లోపం.. మెలటోనిన్ అనేది హార్మోన్.  మెలటోనిన్ నిద్రకు సహాయపడుతుంది.  ఇది మెదడు పనితీరు ద్వారా ఉత్పత్తి అవుతుంది.  రాత్రి సమయంలో ఫోన్,టీవి, ల్యాప్టాప్ వంటి స్క్రీన్లు పడుకునే వరకు చూడటం వల్ల స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మెదడును యాక్టీవ్ గా ఉంచుతుంది. మెదడు ఎక్కువసేపు యాక్టీవ్ గా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి నిద్రకు ఆటంకం కలుగుతుంది.                                              *రూపశ్రీ.