LATEST NEWS
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ. అయితే ఆయన వ్యూహాలు వికటించాయి. ఎత్తుగడలు ఫలించలేదు. పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలూ, ప్రజలే కాదు.. చివరాఖరికి కేసీఆర్ నేల విడిచి చేసిన సాముని తెలంగాణ ప్రజలే అంగీకరించలేదు. ఫలితం 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి సారిగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. అయితే ఈ మార్పును కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ నేతల మీద కోపమో, తన మీద తనకే కోపమో.. లేక సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తనను ఓడించారని ప్రజలపై అలకబూనారో తెలియదు కానీ.. ఓటమి తరువాత కేసీఆర్ మరీ నల్లపూస అయిపోయారు. ఈ పదిన్నర నెలల పైచిలుకు కాలంలో ఆయన జనం ముందుకు వచ్చింది, మీడియాతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. ఏదో మొక్కుబడికి ఒక సారి అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తరువాత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారంటే చేశారనిపించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. పుండు మీద కారం చల్లినట్లు వరుసగా రెండో సారి కూడా జనం తిరస్కరించడంతో కేసీఆర్ పూర్తిగా అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు.   అయితే కేటీఆర్, హరీస్ సహా బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ లేస్తే మనిషి కాదు. మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారు. రేవంత్ సర్కార్ కు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు అంటూ చెబుతూ వస్తున్నారు. అదీకాక బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియ వంటి కేసీఆర్ మౌనం ఆ పార్టీకి తీరని నష్టం చూకూరుస్తోంది. పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ మౌనం పట్ల అసంతృప్తితో ఉండటమే కాకుండా తరచుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ ఫలానా తేదీన బాంబు పేలుస్తారు. మళ్లీ రాజకీయాలలో క్రియాశీలం అవుతారు అంటూ తేదీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు తేదీలను వారు ప్రకటించారు. ఆ తేదీలు వచ్చాయి. వెళ్లిపోయాయి. కానీ కేసీఆర్ మాత్రం  బయటకు రాలేదు. ఈ తరుణంలో తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు ముహూర్తం ప్రకటించేశారు.  ఎక్స్ వేదికగా ఆయన నిర్వహించే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మార్గదర్శకంలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు.    రేవంత్‌  సర్కార్ కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని వివరణ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆయన మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతారు అని కేటీఆర్ ఒక నెటిజన్ ప్రశ్నకు సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం బానే ఉంది కానీ, పార్టీ అధినేత రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నప్పుడు.. కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు రేవంత్ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సమయం ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయంతో వీరు విభేదించారా?  లేక కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే వీరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ మాత్రం దానికి కేసీఆర్ మౌనం ఎందుకు? అంటూ నెటిజనులు కేసీఆర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  
అనంతపురం కలెక్టరేట్ లో గన్ మిస్ ఫైర్ సంచలనమైంది. శుక్రవారం తెల్లవారు జామున కలెక్టరేట్ లో గార్డు డ్యూటీలో ఉన్నాడు.1996 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు తన వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది.  ప్రాణాపాయస్థితిలో ఉన్న సుబ్బరాజును ఆస్పత్రికి తరలించారు.  
ప్రపంచం మొత్తం  ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఆరంభం కావడమే కాదు.. నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. మూడు వంతుల ప్రాజెక్టు పూర్తయ్యింది. అంతే కాదు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చంద్రబాబు ఐదేళ్ల హయాంలో మూడేళ్లు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రజలకు విద్యుత్ కష్టాలు లేవు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాయి.పింఛనర్లకూ అదే తేదీన ఠంచనుగా పించన్లు అందాయి.  ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. కియా వంటి పలు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లకు దీటుగా ఏపీలో ఐటీ పుంజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఎంతో కాలం పట్టదని అంతా భావిస్తున్న సమయంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది.  వైసీపీ విజయం సాధించి.. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఆ నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అంధయుగం నడుస్తున్నదా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు విజన్ కారణంగా, చంద్రబాబు కష్టం కారణంగా రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు ముఖం చాటేశాయి. అప్పటికే గ్రౌండ్ అయిన మరిన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ వంటి సంస్థలు సైతం రాష్ట్రంలో కొనసాగడం మా వల్ల కాదని పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయి. రాష్ట్రంలో అరాచక పాలన ఐదేళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగింది. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా జగన్ సర్కార్ వేధింపులకు గురి చేసింది. పాలన కక్ష సాధింపు, దోపిడీ, దౌర్జన్యం, అవినీతే అన్నట్లుగా జగన్ హయాంలో రాష్ట్రంలో పాలన సాగింది.  2024 ఎన్నికలలో జనం జగన్ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ప్రొగ్రసివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం చూపు మళ్లీ ఏపీ వైపు మళ్లింది. తరిలిపోయిన పరిశ్రమలు ఒక్కటొక్కటిగా మళ్లీ రాష్ట్రానికి రావడం మొదలైంది.పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో  తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి.  తెలుగుదేశం కూటమి కొలువుదీరిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇంతటి మార్పు కనిపించడానికి ప్రధాన కారణం విజనరీ చంద్రబాబు. ఆయన ప్రూవెన్ ఎబిలిటీ.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ముఖచిత్రం మారిపోయింది. టాటా చైర్మన్ తో  రాష్ట్ర ఐటీ మంత్రి కేవలం గంటన్నర భేటీతోనే రాష్ట్రానికి టీసీఎస్ వచ్చింది. ఒక్క ఈమెయిల్ తో సత్య నాదెళ్ల అప్పాయింట్ మెంట్ ఖరారైంది.  లోకేష్ వారంరోజుల అమెరికా పర్యటనలో  ఆయనకు దిగ్గజ పరిశ్రమలన్నీ రెడ్ కార్పెట్ పరియాయి. కేవలం ఏదో కలిశాం, వచ్చేశాం అన్నట్లుగా కాకుండా నారా లోకేష్ సమావేశమైన దిగ్గజ కంపెనీలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలంగా స్పందించాయి. అసలు నారా లోకేష్ కు అమెరికాలో పారిశ్రామిక వేత్తలు రెడ్ కార్పెట్ పరిచారంటే అందుకు కారణం ఆయన ఎఫిషియెన్సీకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోడు కావడమే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.     
ప్రధాని నరేంద్రమోడీ సైనికులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినం రోజున గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో కలిసి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోడీ సైనిక దుస్తులతో వారితో కలిసిపోయి ఆనందంగా దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లకు స్వీట్లు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఏటా దీపావళి పండుగను జవాన్లతో కలిసి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మార్చుకున్న సంగతి విదితమే.  2014లో మోడీ తొలి సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఆయన ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.  
ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు , చారుహసన్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని  ఆయన కుమార్తె, అలనాటి నటి సుహాసిని ధృవీకరించారు. చారుహసన్ అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు కూడా. చెన్నయ్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ‘‘ మా నాన్న దీపావళి ఒక రోజు ముందు ఆస్పత్రిలో చేరారు. పండగ రోజు ఆస్పత్రిలో గడిపాం. మేజర్ సర్జరీ జరగాల్సి ఉంది అని సుహాసిని ట్విట్టర్ లో భావో ద్వేగంగా రాసుకొచ్చారు.  93 ఏళ్ళ చారుహసన్ దక్షిణాదికి చెందిన అనేక చిత్రాల్లో నటించారు. దర్శకత్వం వహించారు.  ఈ ఏడాది ఆగస్టులో ఆయన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి చికిత్సపొందారు. మళ్లీ అనారోగ్య సమస్యలు ఆయనను వెంటాడాయి. కన్నడ హిట్  మూవీ తబరన చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. ఈ ఏడాది హర అనే తమిళ చిత్రంలో చారుహసన్ కన్పించారు. ఆయకు  సుహాసిని,సుభాషిణి,  నందిని  అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు
ALSO ON TELUGUONE N E W S
ఎఫ్-2, ఎఫ్-3 తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఈ సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఖరారు చేశారని, 2025 సంక్రాంతికి థియేటర్లలో అడుగుపెట్టనుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Sankranthiki Vasthunnam) వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ లో పంచెకట్టుతో, భుజాన గన్ తో వెంకీ మామ లుక్ అదిరింది. ఇక ఆయన పక్కన, మోడరన్ డ్రెస్ లో మీనాక్షి, చీరకట్టులో ఐశ్వర్య ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో ఏదో ఒక క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా గోడకి బోర్డు ఉంది. మొత్తానికి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అలాగే ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ సంక్రాంతి రేసులో ఉంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోన్న 'సంక్రాంతికి వస్తున్నాం' కూడా సంక్రాంతి బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా తాము నిర్మించిన రెండు సినిమాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'లను ఇలాగే 2023 సంక్రాంతికి విడుదల చేయడం విశేషం.
The exciting hat-trick collaboration of Victory Venkatesh, blockbuster director Anil Ravipudi, and Sri Venkateswara Creations for the highly anticipated #VenkyAnil3 is sparking inquisitiveness for several reasons. This dynamic trio has already delivered two major hits, and Anil Ravipudi boasts an impressive track record of delivering only blockbusters. While the upcoming movie promises to be a full-fledged entertainer, it also presents a unique triangular crime narrative. Today, the makers unveiled the title and first look poster of the film. Titled ‘Sankranthiki Vasthunnam’, the name itself hints at the film's festive significance, perfectly aligning with its release during Sankranthi. The title design cleverly combines elements of rangoli and a gun, symbolising the celebration and the film's crime themes. The font adds an attractive touch. In the first look poster, a lungi-clad Venkatesh strikes a serious pose, sporting shades and holding a gun, flanked by his on-screen wife Aishwarya Rajesh in a traditional look and ex-girlfriend Meenakshi Chaudhary in a trendy avatar. Venkatesh's look is a perfect blend of traditional and stylish elements, creating a unique fusion that highlights his charisma. The background features an investigative crime board filled with clues, important dates, and newspaper clippings, hinting at the film's intriguing plot. Overall, the first look poster piques curiosity and shows Anil Ravipudi’s mark in poster design as well. The movie enters its final shooting phase, with dubbing work already underway. It is produced by Shirish and presented by Dil Raju. Bheems Ceciroleo scores the music, while Sameer Reddy takes care of the cinematography. AS Prakash is the production designer, while Tammiraju handles the editing. The screenplay was penned by S Krishna and G Adhinarayana, while V Venkat choreographs the action sequences.  
  ప్రముఖ  కన్నడ హీరో శ్రీ మురళి(sri murali)హీరోగా దివాలి కానుకగా వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ బఘీరా(bagheera)సలార్, కేజీఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2 కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్(prashanth neel)ఈ చిత్రానికి కథని అందించగా రుక్మిణి వసంత్(rukmini vasanth)హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ ఇండియా వైడ్ గా  రెండు కోట్ల ఎనబై లక్షల నెట్ కలెక్షన్ ని సాధించింది. కన్నడ, మరియు తెలుగు భాషల్లో రిలీజైన  ఈ మూవీ ఏరియా వైడ్ గా ఎంత సాధించిందనే వివరాలని మాత్రం చిత్ర బృందం ఇంకా వెల్లడి చెయ్యలేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి సూరి(suri)దర్శకత్వం వహించగా అగ్ర నిర్మాణ సంస్థ హోంబులే ఫిల్మ్స్ భారీ వ్యయంతో నిర్మించింది.రామచంద్ర రాజు, ప్రకాష్ రాజ్, రంగాయన రాజు, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రలో చేసారు.     
దుల్కర్ సల్మాన్(dulquer salmaan)మీనాక్షి చౌదరి(meenakshi chaudhary)జంటగా దివాలి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ లక్కీ భాస్కర్(lucky baskhar)దుల్కర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయ పధానా దూసుకుపోతుంది.  తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల నలబై లక్షలు, తమిళనాడు లో నలబై లక్షలు,మలయాళం  కోటి ఎనభై లక్షలు,కర్ణాటక లక్ష రూపాయలు వసూలు చేసింది. అలాగే ముందు రోజు ప్రీమియర్స్  ద్వారా తొంబై లక్షలుని రాబట్టింది.ఇలా ఇండియా వైడ్ గా మొత్తం ఏడూ కోట్ల యాభై లక్షల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని సాధించింది. సితార ఎంటర్ టైన్మెంట్స్, మరియు ఫార్చ్యూన్ సినిమాస్ పై  సూర్య దేవర నాగవంశీ, సౌజన్య నిర్మించగా వెంకీ అట్లూరి దర్శకుడుగా వ్యవహారించాడు. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రాంకీ, లక్ష్మి, సర్వదామన్ డి బెనర్జీ,సచిన్ ఖేడ్ కర్, సాయి కుమార్, టిల్లు ఆనంద్, శివ నారాయణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో చేసారు.  
శివ కార్తికేయన్(siva karthikeyan)సాయి పల్లవి(sai pallavi)జంటగా దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన మేజర్  ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ తో ముందుకు దూసుపోతుంది. తొలి రోజు ఈ మూవీ తమిళనాడులో పదహారు కోట్ల ఎనిమిది లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో నాలుగుకోట్ల ఐదు  లక్షలు,కర్ణాటక లో కోటి తొమ్మిది లక్షలు,కేరళలో కోటి తొమ్మిది లక్షలు,రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఆరు లక్షలు  ఇలా టోటల్ గా ఇండియా వైడ్ గా తొలి రోజు  ఇరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.  ఓవర్ సీస్ లో తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి టోటల్ గా ముప్పై నాలుగు కోట్ల గ్రాస్  కలెక్షన్స్ ని సాధించి శివ కార్తికేయన్ సినీ చరిత్రలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిల్చింది.   తమిళనాడులో నే తొలి రోజు  కలెక్షన్స్ ని సాధించిన మూడవ సినిమాగా కూడా అమరన్ నిలిచింది.మొదటి రెండు స్థానాల్లో గోట్, వెట్టయ్యన్ లు ఉన్నాయి. రామస్వామి పెరియార్(rama swami periyar)దర్శకత్వంలో వచ్చిన అమరన్ ని కమల్ హాసన్(kamal haasan)నిర్మించాడు.  
కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా సుజిత్, సందీప్(sujith,sandeep)ల దర్శకత్వంలో దివాలి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'క'(ka)  కొన్ని ఏరియాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ షోస్ కూడా పడ్డాయి.మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా  చివరి ఇరవై నిముషాలు చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని సాధించిందో చూద్దాం. ప్రీమియర్స్ ద్వారా మొదటి రోజు ముప్పై ఐదు లక్షలు సాధించగా ఆ తర్వాత రోజు  ఇండియా వైడ్ గా  గా మూడుకోట్ల నలభై లక్షల రూపాయలని సాధించింది. అంటే టోటల్ గా తొలి రోజు మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలని  సాధించింది. కిరణ్ అబ్బవరం సినీ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ గా కూడా  భావించవచ్చు. ఇంతవరకు ఎవరు టచ్ చెయ్యని ఒక కొత్త పాయింట్ ని చెప్పిన 'క' మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక(nayan saarika)హీరోయిన్ గా చెయ్యగా తన్వి రామ్, శరణ్య ప్రదీప్, అచ్యుత్ కుమార్,బలగం జయరామ్, అజయ్, రెడీన్ కింగ్ స్లే  తదితరులు  ముఖ్య పాత్రల్లో కనిపించారు.శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్మెంట్స్ ,క ప్రొడక్షన్స్ ల పై  చింతా గోపాలకృష్ణ రెడ్డి  నిర్మించాడు.  
సినిమా పేరు: బఘీర  నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, రామచంద్ర రాజు, ప్రకాష్ రాజ్, రంగాయన రాజు, అచ్యుత్ కుమార్ తదితరులు  కథ: ప్రశాంత్ నీల్ ఫొటోగ్రఫీ: ఏజే శెట్టి ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్ సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ బ్యానర్:హోంబులే ఫిలిమ్స్  నిర్మాత: విజయ్ కిరగందూర్ రచన, దర్శకత్వం: సూరి విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024  ప్రముఖ కన్నడ హీరో శ్రీ మురళి నటించిన బఘీర మూవీ దివాలి కానుకగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, సలార్ వంటి హిట్ చిత్రాలకి దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్(prashanth neel) కథని అందించాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ  వేదాంత్( శ్రీ మురళి) చిన్నప్పటి నుంచే సూపర్ హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. సమాజానికి మంచి చేసే పోలీస్ కూడా ఒక సూపర్ హీరోనే అని తన తల్లి చెప్పడంతో పెద్దయ్యాక  పోలీస్ అవుతాడు.ప్రజలకి అన్యాయం చేసే కొంత మంది కరుడు గట్టిన నేరస్తుల్ని అరెస్ట్ చేస్తాడు.కానీ రాజకీయ పలుకుబడి కారణంగా వాళ్ళని వదిలేయవలసి వస్తుంది. పైగా అప్పట్నుంచి తను కూడా లంచాలు తీసుకుంటూ నేరస్థులకు అండగా ఉంటాడు. కొన్ని వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు రానా (గరుడ రామ్)  మనుషుల శరీరానికి సంబంధించిన అవయవాలతో వ్యాపారం చేస్తూ శ్రీలంకకి చెందిన కొంత మంది తో ఒక భారీ  డీల్ సెట్ చేసుకుంటాడు.మరో పక్క  బఘిర అనే ఒక వ్యక్తి  ప్రజలకి అన్యాయం చేసే  రౌడీలని చంపుతుంటాడు.బఘీర  కోసం సిబీఐ రంగంలోకి దిగి ఒక స్పెషల్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) ని నియమిస్తుంది. మరో వైపు  వేదాంత్ కి స్నేహ(రుక్మిణి వసంత్) అనే డాక్టర్ తో  ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కూడా. కానీ ఆ తర్వాత స్నేహ ని పెళ్లి చేసుకోనని వేదాంత్  చెప్తాడు.వేదాంత్ అలా సడెన్ గా మారడానికి కారణం ఏంటి? అసలు  బఘీర ఎవరు? ఎందుకు రౌడీలని చంపుతున్నాడు?  వేదాంత్  ఎందుకు అవినీతి పరుడుగా మారాడు? రానా డీల్ నెరవేరిందా? స్నేహ, వేదాంత్ ల పెళ్లి ఏమైంది? సిబీఐ  బఘీర విషయంలో చివరకి ఏం చేసింది? అనేదే ఈ కథ. ఎనాలసిస్  ఇలాంటి కథలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద గతంలో చాలానే వచ్చాయి. పైగా మూవీ  ఫస్ట్ నుంచి చివరి దాకా నెక్స్ట్  ఏం జరుగుతుందో, లాస్ట్ కి ఏం జరుగుతుందో  ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రారంభ సన్నివేశం నుంచి ఒక పది నిముషాలు సేపు  కొత్త కథ ఏమైనా చూస్తామనే ఆశ ప్రేక్షకుడిలో మొదలవుతుంది.కానీ ఆ తర్వాత నుంచి రెగ్యులర్ సినిమాల కోవలోకి వెళ్ళింది. ఒక్కో సీన్ వస్తుంటే చాలా సినిమాలో చూసిన సీన్స్ అని అనిపిస్తుంది.ఇక హీరోయిన్ గా చేసిన రుక్మిణి వసంత్ ని కూడా సరిగా వాడుకోలేదు. శ్రీ మురళి, రుక్మిణి మధ్య కథ నడిపే అవకాశమున్నా కూడా ఆ దిశగా మేకర్స్ ఆలోచించలేదు.ఇక సెకండ్ ఆఫ్ అయినా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే ఎంత సేపు ఆపదలో ఉన్న వాళ్లని కాపాడటమే సరిపోయింది. విలన్ క్యారక్టర్ ని  ఎక్కువగా వాడుకోలేదు. కేవలం రెండు డైలాగులు, క్లైమాక్స్ ఫైట్ తోనే సరిపెట్టారు. క్యారక్టర్ ల మధ్య నడిచే  నాటకీయత అనేది ఈ సినిమాలో  లోపించింది. ప్రకాష్ రాజ్ చేసిన క్యారక్టర్ లో  కూడా డైలాగులు తప్ప ఆయన పెద్దగా ఇన్విస్టిగేషన్ చేసింది ఏం లేదు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: హీరో శ్రీ మురళి(sri murali)తన క్యారక్టర్ కోసం పడ్డ కష్టం మొత్తం ఈ సినిమాలో కనపడుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు.కాకపోతే సీన్స్ లో కొత్త దనం లేకపోవడం వల్ల తను ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రుక్మిణి(rukmini vasanth)కి పెద్దగా చేయడానికి ఏమి లేకపోయినా కూడా ఉన్నంతలో బాగానే  చేసింది. ఇక విలన్ గా చేసిన రామచంద్ర రాజు  దగ్గరనుంచి ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్ వరకు ఎవరి నటనలో ప్రత్యేకంగా మెరుపులు లేవు. దర్శకుడు విషయానికి వస్తే   ప్రతి సీన్ ని కూడా చాలా చక్కగా ఎలివేట్ చేసాడు. కానీ సీన్స్ లో బలం లేదు.ఇక ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్లేదనే స్థాయిలో ఉన్నాయి.అజనీష్ లోక్‌నాథ్ ఆర్ ఆర్ మాత్రంఒక రేంజ్ లో ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే.. రొటీన్ కథ, కథనాలతో  సాగిన బఘీర(bagheera)ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు రేటింగ్: 2.5/5                                                                                                                                                                                                                                                                        అరుణాచలం                                                                                                                                               
తారాగణం: శివకార్తికేయన్, సాయిపల్లవి, రాహుల్ బోస్, భువన్ అరోరా, గీతా కైలాసం తదితరులు సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ డీఓపీ: సి.హెచ్. సాయి ఎడిటర్: ఆర్. కలైవానన్ దర్శకత్వం: రాజ్‌కుమార్‌ పెరియసామి నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణాని బ్యానర్స్: రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్, సోనీ పిక్చర్స్ విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024 నిజ జీవిత హీరోల కథలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అలా రియల్ హీరో బయోపిక్ గా రూపొందిన చిత్రం 'అమరన్'. 2014లో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాడి వీర మరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ఇది రూపొందింది. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ 'అమరన్' మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఇది కథ కాదు. వీరుడి జీవితం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల సమాహారం. అసలు ముకుంద్ వరదరాజన్ ఎవరు? ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? సైనికుడు కావాలనే కలకు బీజం ఎలా పడింది? కేరళ అమ్మాయి ఇందు రెబెకా వర్గీస్‌ (సాయి పల్లవి)తో పరిచయం ఎలా ఏర్పడింది? వారి ప్రేమకథ ఏంటి? వారి పెళ్ళికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సైనికుడిగా ముకుంద్ సాధించిన విజయాలేంటి? చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు ఎలా వదిలేశాడు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: బయోపిక్ తీయడం, అందునా ఒక సైనికుడి జీవిత కథను తెరమీదకు తీసుకురావడం అనేది కత్తిమీద సాము లాంటిది. డాక్యుమెంటరీలా ఉన్నది ఉన్నట్టు తీస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. అలా అని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కథను పక్కదారి పట్టిస్తే.. విమర్శలు ఎదురవుతాయి. అందుకే గీతకి అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ తో సినిమా చేయాలి. ఆ విషయంలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి బాగానే సక్సెస్ అయ్యాడు. మామూలుగా సైనికుడి కథ అంటే ఉగ్రవాదులతో పోరాడే ఆపరేషన్ల నేపథ్యంలోనే ఎక్కువగా సినిమా నడుస్తుంది. కానీ ఇందులో ముకుంద్ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడం విశేషం. దేశం కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ సైనికులు చేసే త్యాగమే కాదు.. ఆ సైనికులకు దూరంగా ఉంటూ, వారికి ఏం జరుగుతోందన్న ఆందోళనతో ఉండే కుటుంబ త్యాగాల గురించి కూడా ఇందులో చూపించారు. ముకుంద్ భార్య ఇందు కోణంలో ఈ కథ నడుస్తుంది. ముకుంద్-ఇందుల పరిచయం మరియు ప్రేమాయణం, ఉద్యోగం రావడంతో ఇద్దరూ దూరంగా ఉండాల్సి రావడం, పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు, ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచలంచెలుగా ఎదిగే క్రమంతో ప్రథమార్థం నడుస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి. ముఖ్యంగా ముకుంద్-ఇందు మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ద్వితీయార్థం ఎక్కువగా ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు హత్తుకున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: శివకార్తికేయన్, సాయిపల్లవి ల నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, ఫిజిక్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ఏం చేయాలో అంతా చేశాడు. ఇక ఇందు రెబెకా వర్గీస్‌ పాత్రలో సాయి పల్లవి నటన టాప్ క్లాస్ లో ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించింది.  జి.వి. ప్రకాష్ సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. సాయి కెమెరా పనితనం మెప్పించింది. యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేసిన తీరు బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని తెరమీదకు తీసుకురావడానికి చిత్ర బృందం చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది.  రేటింగ్: 2.75/5 
Cast: Sivakarthikeyan, Sai Pallavi, Rahul Bose, Bhuvan Arora, Geetha Kailasam  Crew:  Inspired by India's Most Fearless: True Stories of Modern Military Heroes by Shiv Aroor, Rahul Singh                     &  True incidents in the life of Major Mukund Varadarajan  Music by G.V. Prakash Kumar  Cinematography by CH Sai  Editing by R. Kalaivanan  Produced by Kamal Haasan, R. Mahendran, Vivek Krishnani Written by Stefan Ritcher, Rajkumar Periasamy  Directed by Rajkumar Periasamy  Released on 31st October 2024  Amaran has created a wave of anticipation among audiences with "Hey Minnale" song and "Sai Pallavi Intro" teaser. The movie has been successful in creating curiosity among people to watch it and Sivakarthikeyan's transformation, Vijay handing over "Thuppakki" to him, all added to the buzz. Legend like Kamal Haasan being the producer also made people expect that the movie will be authentic and genuine attempt at giving a fitting tribute to a martyr like Major Mukund Varadarajan. The movie released for Diwali and let's discuss about it in detail.  Plot:  Indhu Rebecca Varghese (Sai Pallavi) starts narrating her long-distance relationship with her husband Mukund Varadarajan (Sivakarthikeyan) equating their state with sea and the sky. She starts with their first meeting at college as a MA student. They both fall for each other as Mukund trains Indhu for fashion show competition.  Their parents keep bringing Mukund's dream to join Army as the obstacle for their marriage. They overcome it but still as an army wife, Indhu has to get used to his absence while Mukund, being a braveheart throws himself first into combat zones. How did his life journey influence Indhu and people around him? Watch the movie to know more.  Analysis:  Sivakarthikeyan as Mukund is believable and his efforts are visible. Body transformation and his genuine attempt at being subtle and powerful come across well. Still, Sai Pallavi takes the cake with her innocence and strong emotional prowess. The chemistry between the leads and breakdown scenes of Sai Pallavi have been rendered in a heartwarming way.  Among others Geetha Kailasam is good and while others are also good, none of them register. The sequences involving villains' backstory and their motivation could have been handled better. While not asking for over dramatising them, the makers could have tried to push the envelope a little bit more like Kamal Haasan's Drohkaal, Mani Ratnam's Roja, where villains are handled better.  The action sequences, production values, background score by GV Prakash and songs all are well done. Major sequences have authenticity written all over it. Still, there are sequences that have been dragged to the tee and some characters being introduced to kill off, all don't add to the surprise or emotion factor. This aspect in the film could have been worked upon or like in Shershah, could have been avoided.  The familiarity with a martyr's story is going to be a small diadvantage for the film.  Even more fast paced narrative could have combated the fatigue of watching many such "real hero" stories. While Amaran still stands out in being authentic and genuine, narrative could have been much better to give a dramatic high.  In Conclusion:  Amaran is an easy one-time watch for the efforts.  Rating: 2.75/5
తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రిత్విక్, సాయికుమార్, రాంకీ, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సచిన్ ఖేడేకర్, శ్రీనాథ్ మాగంటి, హైపర్ ఆది, అనన్య, గాయత్రి భార్గవి, మాణిక్ రెడ్డి తదితరులు  సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ డీఓపీ: నిమిష్ రవి ఎడిటర్: నవీన్ నూలి ఆర్ట్: బంగ్లాన్ రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి నిర్మాతలు: ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024 తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఇతర భాషల నటుల్లో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన, ఇప్పుడు 'లక్కీ భాస్కర్' అనే మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగులో దుల్కర్ కి హ్యాట్రిక్ ని అందించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Lucky Baskhar Movie Review) కథ: ముంబైలో నివసించే మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ (దుల్కర్ సల్మాన్) ఒక ప్రైవేట్ బ్యాంక్ లో అకౌంటెంట్ గా పని చేస్తుంటాడు. చాలీచాలని జీతం, తీర్చలేని అప్పులతో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతుంటాడు. డబ్బు లేకపోవడంతో అయినవాళ్ళు కూడా చులకనగా చూస్తారు. ప్రమోషన్ వస్తే జీతం పెరిగి, జీవితం కొంత మెరుగు పడుతుంది అనుకుంటే.. ఆ ప్రమోషన్ కూడా చేజారిపోతుంది. దురదృష్టం వెంటాడుతూ, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో.. వేరే దారి లేక, అడ్డ దారిలో డబ్బు సంపాదించడం కోసం ఆంథోనీ (రాంకీ) అనే వ్యక్తితో చేతులు కలుపుతాడు. మొదట అవసరం కోసం డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత అది వ్యసనంలా మారుతుంది. అసలు భాస్కర్ డబ్బు ఎలా సంపాదించాడు? ఎవరినీ ముంచకుండా, కేవలం బ్యాంక్ ని అడ్డుపెట్టుకొని స్కాంలు చేసి ఎలా కోటీశ్వరుడు అయ్యాడు? స్టాక్ మార్కెట్ కింగ్ హర్ష మెహ్రా చేసిన బ్యాంకింగ్ స్కాం ఏంటి? దానికి భాస్కర్ కి సంబంధమేంటి? కోటీశ్వరుడు అయ్యాక భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పులేంటి? డబ్బు అతనికి నేర్పిన పాఠాలేంటి? డబ్బుతో ఆడిన జూదంలో గెలిచి, చివరికి భాస్కర్ 'లక్కీ భాస్కర్' అనిపించుకున్నాడా లేదా? అనేది మిగతా కథ. విశ్లేషణ: ఇది భాస్కర్ కథ. డబ్బుల్లేక ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురుకావడంతో.. ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకొని సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఒక మధ్య తరగతి వ్యక్తి కథ. ఇలాంటి సినిమాలకు కథానాయకుడి పాత్రే కీలకం. కథానాయకుడి పాత్రను మలిచిన తీరు, ఆ పాత్ర చుట్టూ అల్లుకునే సన్నివేశాలు, ఆ సన్నివేశాలను కలుపుతూ కథానాయకుడి పాత్రను నిలబెట్టే కథనం.. ఇవే సినిమాని నిలబెడతాయి. లక్కీ భాస్కర్ లో కథానాయకుడి పాత్రను మలిచిన తీరు బాగుంది. ఆ పాత్రను పరిచయం చేస్తూ రాసుకున్న సన్నివేశాలు కూడా బాగున్నాయి. కానీ మనల్ని మనం మర్చిపోయి పూర్తిగా ఆ పాత్రతో ప్రయాణం చేసే, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తించే.. కథనం తోడవ్వలేదు. ఒక సాధారణ బ్యాంక్ అకౌంటెంట్ అయిన భాస్కర్ అకౌంట్ లో కోట్ల రూపాయిల డబ్బు ఎలా ఉందని, సీబీఐ ఎంక్వయిరీతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుండి భాస్కర్ ప్రయాణాన్ని చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. భార్య, కొడుకు, తండ్రి, తమ్ముడు, చెల్లి.. ఇలా కుటుంబంలోని అందరి బాధ్యత భాస్కర్ పైనే ఉంటుంది. తనకు బ్యాంక్ లో వచ్చే జీతం సరిపోక, అప్పులు చేస్తూ.. అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంక్ లో స్కాం చేయడం మొదలుపెడతాడు. వేలతో మొదలైన సంపాదన లక్షల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. అతను ఎదిగే క్రమం ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఒక మంచి హై ఇస్తుంది.  ఫస్ట్ హాఫ్ లో లక్షల్లో ఉన్న భాస్కర్ సంపాదన, సెకండ్ హాఫ్ లో కోట్లలోకి వెళ్తుంది. బ్యాంక్ ని, స్టాక్ మార్కెట్ ని ముడిపెడుతూ భారీ స్కాం ని చూపిస్తారు. హర్షద్ మెహతాను గుర్తుచేసే హర్ష మెహ్రా పాత్ర ప్రధానంగా సెకండాఫ్ నడుస్తుంది. ఓ రకంగా ఇది 'స్కామ్ 1992' సిరీస్ కి మరో కోణంలా ఉంటుంది. అయితే ఆ సిరీస్ చూసినవారికి ఈ సెకండాఫ్ అంత గొప్పగా అనిపించకపోవచ్చు. పైగా భాస్కర్ పాత్ర చివరికి ఎలాగూ గెలుస్తుందని, చూసే ప్రేక్షకులకు తెలుసు. అలాంటప్పుడు అతని ప్రయాణాన్ని ఎంత ఆసక్తికరంగా చెబితే అంతలా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. లక్కీ భాస్కర్ అని టైటిల్ పెట్టాం కాబట్టి, లక్కీగా అతనికి అన్ని అనుకూలంగా జరుగుతున్నట్టుగా ఉండకూడదు. ఎంత అతనికి తెలివితేటలు ఉన్నప్పటికీ, విప్పలేని చిక్కుముడులు ఎదురవ్వాలి, భాస్కర్ దొరికిపోతాడేమో అనే ఆందోళన ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కలగాలి, క్లిష్టమైన చిక్కుముడులు అన్నింటిని దాటుకొని చివరికి భాస్కర్ గెలవాలి. అప్పుడు చూసే ప్రేక్షకులకు కిక్ వస్తుంది. ఆ కిక్ ని లక్కీ భాస్కర్ పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయింది. పతాక సన్నివేశాలు బాగున్నాయి కానీ, అందుకు తగ్గట్టుగా దానికి ముందు వచ్చే సన్నివేశాలను కూడా అంతే పగడ్బందీగా, మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నట్లయితే.. అవుట్ పుట్ మరోస్థాయిలో ఉండేది. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రయత్నం బాగుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆయన ఎంతో రీసెర్చ్ చేశాడని అర్థమవుతోంది. అయితే కథనాన్ని ఇంకా మెరుగ్గా రాసుకొని, సినిమాని మరింత ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది. సంభాషణలు బాగున్నాయి. నిమిష్ రవి కెమెరా పనితనం ఆకట్టుకుంది. కథకి తగ్గట్టుగా మనల్ని 80-90ల లోకి తీసుకెళ్లాడు. బంగ్లాన్ ఆర్ట్ వర్క్ బాగుంది. 80ల నాటి బొంబాయి(ముంబై)ని అద్భుతంగా సృష్టించాడు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇలా కథానాయకుడి పాత్ర ప్రధానంగా సాగే సినిమాలకు ఎడిటింగ్ కీలకం. ఆ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి తన పని తాను బాగానే చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: భాస్కర్ పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించుకోలేం అనే అంతలా దుల్కర్ సల్మాన్ మ్యాజిక్ చేశాడు. నటించినట్లుగా కాకుండా, సహజంగా ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు మెప్పించింది. ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగ్స్ లేనప్పటికీ.. ఆ పాత్రకి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ తనదైన హావభావాలు, ముఖ కవళికలతో హీరోయిజాన్ని చక్కగా ప్రదర్శించాడు. భాస్కర్ భార్య సుమతిగా మీనాక్షి చౌదరికి మంచి పాత్రే లభించింది. డబ్బులేనప్పుడు పుట్టింటి అవమానాలను తట్టుకొని భర్తకి అండగా, డబ్బులొచ్చాక భర్త ప్రవర్తనలో మార్పు చూసి బాధపడే భార్యగా ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. భాస్కర్ పార్టనర్ గా రాంకీ, ఫ్రెండ్ గా రాజ్‌కుమార్ కసిరెడ్డి వారి పాత్రలకు న్యాయం చేశారు. భాస్కర్ కొడుకుగా రిత్విక్, సీబీఐ ఆఫీసర్ గా సాయికుమార్, సచిన్ ఖేడేకర్, శ్రీనాథ్ మాగంటి, హైపర్ ఆది, అనన్య, గాయత్రి భార్గవి, మాణిక్ రెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా... తెలుగులో బ్యాంకింగ్ నేపథ్యంలో సినిమాలు రావడం అరుదు. ఆ పరంగా చూస్తే, లక్కీ భాస్కర్ మూవీ కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు, కథనం విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. కథాంశం కోసం, భాస్కర్ పాత్ర కోసం, భాస్కర్ పాత్రను పోషించిన దుల్కర్ సల్మాన్ కోసం ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.  రేటింగ్: 2.75/5  - గంగసాని
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషికి శారీరక రుగ్మతలు ఎన్ని ఉన్నా.. వాటిని ఔషధాలతో తగ్గించుకోవచ్చు. కానీ శరీరానికి నొప్పి లేకుండా మనిషిని వేధించే సమస్యలు మానసిక సమస్యలు. మానసిక సమస్యలలో ఆందోళన ఒకటి. ప్రతి నిమిషం మనిషిని భయానికి, సంఘర్షణకు లోను చేసి జీవితంలో అల్లకల్లోలం పుట్టించే ఈ ఆందోళన మనిషి పాలిట పెద్ద శాపమే అని చెప్పవచ్చు. కానీ దురదృష్ట వశాత్తు తాము అనుభవిస్తున్నది మానసిక సమస్య అని, దాని పేరు ఆందోళన అని చాలామందికి తెలియదు. తెలుసుకోకుండానే ఎంతోమంది జీవితంలో నలిగిపోతూ కాలాన్ని వెళ్లబుచ్చుతుంటారు.  చాలామంది మానసిక సమస్య అంటే పిచ్చి అనే ఒకానొక భావనతో ఉంటారు. అందుకే తమకు మానసిక సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ ఈ సమస్యను గుర్తించడం చాలా అవసరం, దీనికి సరైన పరిష్కారాలు వెతకడం, దీని ప్రభావాన్ని తగ్గించడం, నిర్మూలించడానికి ప్రయత్నాలు చేయడం ఎంతో అవసరం.  చరిత్రలోకి చూస్తే.. 19వ శతాబ్దం చివరలో ఆందోళన అనేది ఒక ప్రత్యేక అనారోగ్యంగా వర్గీకరించబడలేదు. కానీ ప్రజలు మాత్రం దీన్ని వేర్వేరు పేర్లతో పిలిచారు. మానసిక రుగ్మతల గురించి సగటు మనిషికి అవగాహన లేని కాలంలో దీని దీని ప్రభావం ఇప్పుడున్న ప్రభావవంతంగా లేదు.  18వ శతాబ్దంలో, బోయిసియర్ డి సావేజెస్ పానిక్ అటాక్స్, సాధారణీకరించిన యాంగ్జయిటీ డిజార్డర్‌ని 'పనోఫోబియాస్'గా గుర్తించిన నోసోలజీని ప్రచురించారు. తర్వాత 19వ శతాబ్దంలో, అలసట, తలనొప్పి, చిరాకుతో కూడిన వైద్య పరిస్థితిని లక్షణాలుగా వర్ణించి 'న్యూరాస్తెనియా' అనే పదాన్ని రూపొందించారు. ఈ ఆందోళన లక్షణాలు కొత్త వ్యాధి నిర్మాణాలలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.  ఇక భారతదేశంలో ప్రజలు ఆందోళన అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన రుగ్మతగా భావించారు. మనస్సును శాంతపరచడానికి మానసిక స్థితిని సానుకూలంగా మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా అనేక ఆయుర్వేద మూలికలను ఉపయోగించారు. వీటిలో అత్యంత సాధారణమైనవి బ్రాహ్మి, అశ్వగంధ. వైద్యశాస్త్రంలో పురోగతికి సాధించడానికి ముందు, పురాతన చికిత్సలలో వైద్యం అందించేవారు. వీటిలో  మూలికలు, ఔషధతైలం మధ్యయుగ కాలంలో సాగింది. హైడ్రోపతి విధానంలో చికిత్స అందించడం కూడా ప్రసిద్ధిగాంచింది. ఇందులో  శరీరాన్ని విపరీతమైన ఉష్ణోగ్రతలకు గురిచేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా..  అత్యంత చల్లని ప్రవాహాలు, నదులలో స్నానం చేయడం, హెల్త్ స్పాలు, జలగలను ఉపయోగించి రక్తాన్ని తీయడం వంటివి ఉన్నాయి. అయితే మనోవిశ్లేషణలో క్రమంగా  ఫ్రాయిడ్ పరిశోధనల ఆధారంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు.  అన్నిటిలోకీ.. ఈమధ్య కాలంలోనే మానసిక సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిమీద దృష్టి పెట్టడం, వాటిని నియంత్రించడానికి ప్రయత్నం చేయడం సగటు వ్యక్తులలో కూడా కనబడుతోంది.  మానసిక సమస్యలు కూడా ఈమధ్య కాలంలో చాలా దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా కాలం మనుషుల్లో ఆందోళనను పెంచిందని చెప్పాలి. మానసిక సమస్యలున్నవారితో సామరస్యంగా మాట్లాడటం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా ఇప్పించడం, వారి ఆందోళనను పోగొట్టడానికి చేయూత ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఆందోళన అనే సమస్య దూదిపింజలా ఎగిరిపోతుంది.                                       ◆నిశ్శబ్ద.
  మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు. జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'. దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'. మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి. దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..  శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు  దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది.   'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది.  అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది.  "ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు. వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.                                   *నిశ్శబ్ద.
తాను వెలుగుతూ చుట్టూ వెలుగును అందిస్తూ ఆశను పెంచి, ఆశావహ జీవితానికి ప్రేరణగా నిలిచేది దీపం. ప్రతి ఇంట్లో దీపం తప్పనిసరి. అది ఏ కులం అయినా హిందువులు దేవతా విగ్రహాలు పటాల ముందు, ఇస్లాం మతస్తులు దర్గాలలో, వారి ఇళ్లలో వారి దేవుడి ముందు, క్రిస్టియన్స్ వారి యేసు ప్రభువు దగ్గర కాండీల్స్ వెలిగించడం అన్ని చోట్లా కనబడుతుంది. దీపారాధన మనిషిలో కొన్ని కల్మషాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుందని చెప్పుకుంటారు. ఇక హిందూ మతంలో దీపావళి ముగిసి ప్రారంభమయ్యే కార్తీకమాసం మొదలు నుండి మాసం ముగింపు దాకా దీపాల సందడి కొనసాగుతూనే వుంటుంది. మనుషులందరూ సుమారు పట్టణాలకు తరలిపోయినపుడు, పల్లెలు పట్టణాల రంగులోకి మారుతున్నపుడు కొన్ని సాంప్రదాయాలు తగ్గిపోతున్నా దాన్ని కాపాడుకుంటున్నామంటూ పలుచోట్ల దీపాల మిణుకులు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇకపోతే మునుపు దీపాలు వెలిగించడంలోనూ ఇప్పుడూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా చోట్ల కాండీల్స్ పెదుతుంటారు. కానీ దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ ప్రయోజనం అంటే దేవుడి పుణ్యమో మరేదో కాదు.  దీపాలు వెలిగించడం వెనుక శాస్త్రీయత!! కార్తీకమాసం నవంబర్ డిసెంబర్ నెలల్లో సాగుతుంది. ఆ సమయంలో వర్షాలు సరేసరి, చలి మొదలవుతుంది. ప్రతి ఇంట్లో ముందు నూనె వేసి, వత్తితో, మట్టి ప్రమిధల్లో దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపం కాలుతున్నపుడు వచ్చే వాసనే క్రిమికీటకాలను ఇంట్లోకి వెళ్లకుండా చేస్తుంది. కానీ ఇప్పట్లో అంతా కృత్రిమంగా తయారైపోయారు. నూనె ముట్టుకుంటే చేతికి జిడ్డు అంటారు, వత్తులు చేయడం చాలమందికి రానే రాదు. మట్టి ప్రమిధలు కొనాలంటే నామోషీ!! పెద్దవాళ్లే ఇట్లా ఉంటే ఇక పిల్లలకు ఏమి వస్తాయి ఈ అలవాట్లు హిందుత్వాన్ని సంప్రదాయాలను కాపాడుకోవడానికి కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు నిర్వహిస్తే సమాజంలోని బీదరికం, వెనుకబడిన వాళ్ళ ఆకలి గుర్తొస్తాయి నాస్తికులకు, వైజ్ఞానిక వేత్తలకు. కానీ వేలంటైన్స్డే, న్యూ ఇయర్ లకు మాత్రం పేదవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు గుర్తుకురారు. ఎందుకంటే వీళ్ళందరూ పాశ్చాత్య సంస్కృతిని దాని విశిష్టత. దాని గొప్పదనాన్ని ఎప్పుడూ మైక్ పట్టుకుని చెబుతుంటారు మరి!! ఇంకొక శాస్త్రీయ కారణం ఏమిటంటే కార్తీక మాసం మొదలైనపుడు పగటి కాలం తక్కువగానూ చీకటి కాలం ఎక్కువగానూ గడుస్తూ ఉంటుంది. ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల చీకటిని దీపాల వెలుగుతో తరిమినట్టే. దీపాలు ఉపయోగించే నూనె, పత్తి కాలడం వల్ల వచ్చే పొగ, వాసన ఎంతో గొప్ప పలితాన్ని చేకూర్చుతాయని ఆయుర్వేదంలో పేర్కొంటారు. అలాంటి గొప్ప సంప్రదాయం, ఆరోగ్య విశిష్టత నిండి ఉన్న మన వారసత్వాన్ని చేతులారా నిర్లక్ష్యం చేస్తే మనం నష్టపోవడం మాత్రమే కాకుండా పరోక్షంగా నాటి బ్రిటిష్ బానిస బతుకులు మొదలవుతాయి. నాడు ప్రత్యక్షంగా అయితే నేడు వ్యాపారమనే వలయంలో వాళ్ళ గుప్పట్లో భారతాన్ని బంధించే ప్రయత్నాలు ఎన్నో!! అందుకే మన సంప్రదాయంలో ఉన్న అన్నిటినీ పిల్లలకు వివరిస్తూ, మనమూ పాటిస్తూ ఉంటే చిన్ని చిన్ని చేతులు వెలిగించే దీపాలు రేపటి కొండంత జీవితానికి ఆశావహ దృక్పథాన్ని ఎంతో ఉన్నతంగా మారుస్తాయి. ఆలోచనా విధానాన్ని విస్తృతం చేస్తాయి. చిన్ని చిన్ని ఆశ, ఈ దీపమంత ఆశ అని పాడుకుంటూ దీపాల సందడిలో మునిగిపోండి. ◆వెంకటేష్ పువ్వాడ  
  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పుడు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  
దీపావళికి షుగర్ మిఠాయిలు తినకుండా ఇంట్లోనే ఈ షుగర్ ఫ్రీ స్వీట్‌లను తయారు చేసి ఆరోగ్యంగా ఉండండి. ఖర్జూర లడ్డూలు: ఖర్జూరం సహజ స్వీటెనర్. డ్రై ఫ్రూట్స్,  నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు షుగర్ పేషంట్లు మంచి ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. ఫ్రూట్ చాట్: వివిధ తాజా పండ్లు, చాట్ మసాలాతో చేసిన ఫ్రూట్ చాట్ ఒక సంతోషకరమైన ఎంపిక. చక్కెర అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డెజర్ట్ డయాబెటిస్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బరువు చూసేవారికి కూడా గొప్ప ఎంపిక. బాదం పాలతో తక్కువ కార్బ్ పాయాసం: దీపావళి సమయంలో పాయసం ఒక ప్రసిద్ధ తీపి వంటకం. అధిక కేలరీల ఆహారాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. కేలరీలను తగ్గించడానికి సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్‌లను జోడించడం వల్ల డెజర్ట్ యొక్క పోషక విలువను పెంచుతుంది. షుగర్ ఫ్రీ గులాబ్ జామూన్: చక్కెర స్థానంలో ఖర్జూరం వంటి సహజమైన స్వీటెనర్‌లతో గులాబ్ జామూన్‌ను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. ఫైబర్,  అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గించే ఆహారంలో ఉన్నవారు తినవచ్చు. గోధుమ బెల్లం కేక్: గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన కేక్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.  ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికతో సహజ స్వీటెనర్. రక్తంలో చక్కెర స్థాయిలు, కేలరీల తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది.  
  వంటింట్లో చాలా వరకు స్టీల్ సామాన్లు ఉంటాయి.  స్టీల్ బిందెలు, స్టీల్ జోడాలలో తాగడానికి నీరు పోసి పెట్టుకుంటారు.  మరికొందరు మట్టి కుండలలో నీరు  తాగుతుంటారు. అయితే ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగుతుంటారు.  అసలు రాగి పాత్రలో నీరు ఎందుకంత శ్రేష్టం. రాగి పాత్రలలో నీరు తాగితే ఆరోగ్య కలిగే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. రాగి పాత్రల వాడకం.. రాగిపాత్రలలో నీరు నిల్వ చేసి నీటిని తాగడం ఇప్పుడు కొత్తగా పుట్టిన అలవాటు ఏమీ కాదు..  దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాగి పాత్రలలో నీరు తాగడం ప్రజల జీవనశైలిలో భాగం. ముఖ్యంగా రాగి పాత్రల వినియోగం, రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం  ఆయుర్వేదంలో ప్రాచుర్యం చెందింది.  రాగి పాత్రలను ఆహారం వండుకోవడానికి,  ఆహారం నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు తాగడం, రాగి పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో రాగి ప్రధానమైనది.  ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. రాగి పాత్రలలో నీరు తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయవచ్చు. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు రాగి పాత్రలలో నీరు తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రాగిలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ,  యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు  మెరుగ్గా ఉంటాయి.  ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతాయి. రాగి పాత్రలలో నీరు తాగితే శరీరం శుద్ది అవుతుంది. చాలామంది ఉదయాన్నే రాగి పాత్రలలో నీటిని తాగుతుంటారు.  దీని వల్ల రోజంతా శరీరం ఉత్సాహంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలలో నీటిని ఎక్కువ సేపు నిల్వ చేయకూడదు.  ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు నీటిని నిల్వచేస్తే ఆ నీరు వేడి గుణం అధికంగా అవుతాయి.  అంతేకాదు.. రాగి పాత్రలలో నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా తాగకూడదు. రోజుకు రెండు గ్లాసుల కంటే ఎక్కువ రాగి పాత్రలలో నీటిని తాగకూడదు. శరీరంలో  రాగి ఎక్కువైనా హాని కలుగుతుంది. ముఖ్యంగా గర్భవతులు,  ఎసిడిటీ,  కిడ్నీ సమస్యలు ఉన్నవారు,  గుండె జబ్బులు ఉన్నవారు రాగి పాత్రలలో నీరు తాగాలంటే మొదట వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టాలు సంభవిస్తాయి.                                                    *రూపశ్రీ.