LATEST NEWS
‘‘కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీలో చాటేలా చేస్తా. కడపలో పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరువును కాపాడటానికి కాంగ్రెస్ జెండా మోస్తూ కడపలో గల్లీలో తిరుగుతా’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌గా కూడా గెలవదని అంటారు. అయినప్పటికీ, ఈ ముళ్ళబాటలో నడవటానికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత తీసుకున్నారు. ఆమెకి అండగా నిలుస్తా. అందుకే, నేను ఈ వైఎస్సార్ సంస్మరణ సభకి నా మంత్రవర్గ సహచరులందరినీ తీసుకుని వచ్చాను అని రేవంత్ రెడ్డి అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘చాలామంది వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద అన్ని రకాల లాభాలు పొందారు. వాళ్లు మాత్రం వైఎస్సార్ బాటలో నడవటం లేదు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు.. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. పేద ప్రజలకు అండగా నిలవాలని, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వైఎస్సార్ ఆశయాలుగా పెట్టుకున్నారు. ఆయన ఆశయాలను మోస్తున్న వారినే మనం వారసులుగా గుర్తించాలి. వైఎస్సార్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేస్తున్నవాళ్ళు ఆయన వారసులు కాదు.. వైఎస్సార్ ఆశయాల సాధనలో నడుస్తున్న షర్మిలే ఆయన వారసురాలు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.    ఏపీలో షర్మిలే ప్రతిపక్ష నాయకురాలు   ‘‘ఏపీలో ప్రతిపక్షం లేదు.. ఉన్నదంతా పాలకపక్షమే. ఏపీలో బీజేపీ అధికారంలో వుంది. బీజేపీ అంటే, బాబు, జగన్, పవన్... ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో షర్మిల ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తారు. ప్రతిపక్ష బాధ్యతని నిర్వహించాల్సిన వారు ఆ బాధ్యతని వదిలేశారు. ఆ బాధ్యతను షర్మిల స్వీకరించారు. వైఎస్సార్ వారసురాలు షర్మిల మాత్రమే.. రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించేది షర్మిల మాత్రమే. 2009 నుంచి షర్మిల పోరాటం చేస్తున్నారు. ఆమెకు కూడా ఒక మంచి సందర్భం వస్తుంది. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి షర్మిల ముఖ్యమంత్రి అవుతారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అధిక వడ్డీ ఆశచూపి ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ఫౌండేషన్ ఛైర్మన్ కమలాకర్ శర్మ బాధితుల నుంచి 514 కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించాడు. తన దగ్గర పెట్టుబడులు పెట్టిన కొంతమంది ప్లాట్లను ఇస్తానని చెప్పి మోసం చేశాడు. కమలాకర్ శర్మ చేతిలో మొత్తం 4 వేల మంది మోసపోయారని పోలీసులు గుర్తించారు. బాధితులందరూ మోసగాడి సామాజివర్గానికి చెందినవారే కావడం గమనార్హం. మన అనుకున్నవాడే తమను మోసం చేశాడని అర్థం చేసుకున్న బాధితులందరూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, కమలాకర్ శర్మను అరెస్టు చేశారు. ఏదో చిన్న మోసం అనుకుంటే, అది 514 కోట్ల రూపాయల మోసం అని తమ విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద వున్న ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. అనంతరం దాదాపు 2 వందల మంది బాధితులతో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి సమావేశం నిర్వహించారు. జప్తు చేసిన ఆస్తులను విక్రయించి నగదు డిపాజిట్లు చెల్లించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. వాన్‌పిక్ చార్జిషీట్ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్‌ని తొలగించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. నిమ్మగడ్డ పిటిషన్ వేస్తే, ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు హైకోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్‌ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సమస్యను అర్థం చేసుకున్న లోకేష్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన జీవో నంబర్ 225 విడుదల చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని పలువురు దివ్యాంగులకు మేలు జరిగింది. ఈ జీవో వల్ల ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. వారందరూ తమ తల్లిదండ్రులతో కలసి ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి అభినందించి, వారికి లాప్‌టాప్‌లను బహుకరించారున. ‘సింపుల్ గవర్నమెంట్ -  ఎఫెక్టివ్ గవర్నెన్స్’ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అన్నారు.
ALSO ON TELUGUONE N E W S
ఏ ఫర్ యాపిల్, బి ఫర్  బాట్ ఎలాగో ఇప్పుడు పి ఫర్ ప్రభాస్(prabhas)తాజాగా మొన్న విడుదలైన  కల్కి (kalki)తో మరోసారి తన కట్ అవుట్ కి ఉన్న  స్టామినా ని చాటి చెప్పాడు. దీంతో తన గత చిత్రాల కోవలోనే కల్కి  వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు అధికారంగా  తొమ్మిది వందల కోట్ల రూపాయలని సాధించాడు. అవి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతాయో చెప్పలేం.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్  న్యూ మూవీలో పలానా  యాక్టర్ ఉండబోతున్నాడనే  చర్చ  జరుగుతుంది.  ఇప్పుడు ఆ  న్యూస్ వైరల్ గా మారింది. ప్రభాస్ సినీ డైరీలో ఉన్న  ప్రాజెక్ట్ లలో  సందీప్ రెడ్డి వంగ (sandeep reddy vanga)స్పిరిట్ (spirit)కూడా ఒకటి. లేటెస్ట్ యానిమల్ (animal)హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సందీప్  డార్లింగ్ మూవీని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కథ విషయంలో గాని నటుల విషయంలోగాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇందుకు నిదర్శనంగా ప్రముఖ కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ (ma dong seok)ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో సియోక్ కనిపించబోతున్నాడని అంటున్నారు. సందీప్ అధికారంగా ఈ విషయాన్నీ ప్రకటించకపోయినా సియోక్ ఎంట్రీ న్యూస్ నిజమే అని అంటున్నారు అదే జరిగితే ఇండియా సినీ ప్రేమికులంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పవచ్చు. స్పిరిట్ లో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ చెయ్యబోతున్నాడు. ఇక సీయోక్ విషయానికి వస్తే తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో  ఎంతటి వారినైనా కట్టిపడేయ్యగలడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి  ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 2012 లో వచ్చిన ది నైబర్ తో సీయోక్ నట ప్రస్థానం మొదలయ్యింది. నేమ్ లెస్ గ్యాంగ్ స్టార్, ది అన్ జస్ట్, ట్రైన్ తో బుసాన్,బాడ్ గయ్స్, ఎటర్నల్స్, స్క్వాడ్ ఇలా సుమారు యాభై ఒకటి సినిమాలకి పైగానే చేసాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ లో తన సినీ సెలవులని ఎంజాయ్ చేస్తున్నాడు. స్పిరిట్ కాకుండా  సలార్ 2 ,రాజాసాబ్, హను రాఘవ పూడి సినిమాలు  ప్రభాస్ చేతిలో ఉన్నాయి. రాజా సాబ్ అయితే  కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. బహుశా ఈ మూవీనే నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రభాస్ మూవీ అవ్వచ్చు.  
సోషల్ మీడియాలో కొంత మంది మానవ సైతానులు చేసిన  పనికి  ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.  అందరు కూడా  వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.ప్రముఖ  హీరోలు సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ లు అయితే వాళ్లని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో చూద్దాం.    సోషల్ మీడియా  ద్వారా ఎంత మంచి జరుగుతుందో  చెడు  కూడా అంతే జరుగుతుంది. నిత్యం ఎన్నో ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.  కానీ  రీసెంట్ గా  కొంత మంది యువకులు మాట్లాడిన మాటలు  మాత్రం అత్యంత జుగుప్సాకరం. అలాంటి వారిని  అస్సలు  క్షమించకూడదు. వాళ్ల బి హేవియర్ కి సభ్య సమాజం మొత్తం తల దించుకునే పరిస్థితి. మేము బతుకుతున్న  జీవితం తల్లి తండ్రి ప్రసాదించిందని మర్చిపోయి  మృగాల కంటే హీనంగా ప్రవర్తించారు. కొంత మంది   ఇన్ స్టాగ్రాం వీడియో కాల్‌లో మీట్ అయ్యారు. తండ్రి కూతురు బంధం గురించి తప్పుగా మాట్లాడారు. పైగా ఆ మాటలకి వికటాహాసాన్ని కూడా పొందారు. ఇప్పుడు ఈ వీడియో మీద అందరు ఫైర్ అవుతున్నారు.వాళ్ళు మనుషులా, రాక్షసులా అనే డౌట్ ని  కూడా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయం  మీద  సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) స్పందించాడు.సదరు  వీడియోని టాగ్ చేస్తు  అలాంటి  వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రిక్వెస్ట్  చేసాడు. ఆలాగే ఇరు రాష్టాల   సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా  ట్యాగ్ చేశాడు. ఆ  వెంటనే వారు  స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఇక  మంచు మనోజ్(manchu manoj)కూడా  స్పందించాడు. అందులో ఉన్న ఒక వ్యక్తి పేరు  హన్మంతు. గత ఏడాది ఇన్ స్టాగ్రాం ద్వారా సంప్రదించాను.మహిళలు ఎదుర్కొంటోన్న వివక్ష, దారుణాల మీద పోరాడేందుకు  సాయం చేస్తాడేమో అని గత ఏడాది సంప్రదించాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇలాంటి వీడియోలతో కనిపించాడు. అతనితో చేసిన మెసెజ్‌లు, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అవసరమైనప్పుడు  వాటిని  పంపిస్తానని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, టెక్సాస్ ప్రభుత్వానికి, ఇండియన్ యూఎస్ ఎంబసీకి  టాగ్ చేసాడు. అదే విధంగా  హన్మంతు.. నిన్ను వదిలే ప్రసక్తి లేదు.. అమ్మ తోడు అంటూ వార్నింగ్ లాగా ఇచ్చాడు. ఇక వాళ్ళల్లో ఒకడైన హన్మంతు తల్లిదండ్రులు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారని తెలుస్తుంది.   
విశ్వకధానాయకుడు కమల్ హాసన్ (kamal haasan)తీరే వేరు. అగ్ర హీరోని అనే గర్వం  ఈసమంతైనా ఉండదు. మాట్లాడే  ప్రతి మాట కూడా హృదయం నుంచి వస్తుంది. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది.  ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా మరోసారి   జరిగింది. కమల్ అప్ కమింగ్ మూవీ భారతీయుడు 2 (bharatheeyudu 2).వరల్డ్  వైడ్ గా జులై 12 న విడుదల అవుతుంది. ఈ మేరకు తెలుగు నాట ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా తెలుగు రిలీజ్ కి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. కమల్ తో పాటు సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సిద్దార్ధ్ , రకుల్ ప్రీత్, బాబీ సింహ, దర్శకుడు శంకర్ (shankar)తదితరులు పాల్గొన్నారు.ఇందులో సిద్దార్ధ్ (siddharth) ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ చాలా స్టేజి ల మీద సిద్దార్ధ్ నన్ను తన  గురువు అని, ఏకలవ్య శిష్యుడ్ని  అని చెప్తాడు. కానీ నేను గొప్ప కాదు. ఎందుకంటే  నాకు కూడా ఒక  గురువు ఉన్నాడు. అంతటీ శక్తీ కళకి ఉంది. అదే విధంగా ప్రతి వ్యక్తి సినీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది సిద్దార్ధ్ ఒక్కడికే కాదు నాకు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాతో సిద్దార్ధ్ రీ ఎంట్రీ ఇచ్చినట్టే. చాలా అద్భుతంగా నటించాడు. అలాగే ఇంకా మోర్  కమల్ హాసన్,  మోర్ సిద్దార్ధ్ రావాలని కూడా చెప్పాడు. ఇక ఈ మాటలకి సిద్దార్ధ్ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.రకుల్ ప్రీత్, బాబీ డియోల్ ని కూడా కమల్ పొగిడాడు. కమల్ మాటలకి అక్కడున్న వాళ్ళందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఇండియన్ 2 ఎలా  ఉంటుందనే విషయం  గురించే చర్చ జరుగుతుంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది  
  మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి భారీ హిట్ ని పొందుతున్నారు కొందరు మేకర్స్. అదే పంథాలో ఇప్పుడు మరో కొత్త మూవీ తెలుగులో రానుంది. అదే 'నాగేంద్రన్స్ హనీమూన్స్ '.  ప్రముఖ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు మేకర్స్. సూరజ్ వెంజరమూడు, శ్వేత మీనన్ , గ్రేస్ ఆంటోనీ, నిరంజన అనూప్, కనికుశృతి, ఆల్ఫీ పంజికరన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. నితిన్ రెంజీ పనికర్ ఈ సిరీస్ ని నిర్మించాడు.  నాగేంద్రన్ డబ్బులు సంపాదించాలని దుబాయ్ కి వెళ్ళాలనుకుంటాడు. అదే సమయంలో తను అయిదుగురు అమ్మాయిలని పెళ్ళి చేసుకుంటాడు. అసలు నాగేంద్రన్ ఎందుకు ఆ అయుదు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది? అతను విదేశాలకి వెళ్ళాలనుకు‌న్న కలని నెరవేర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. అయితే ఈ సిరీస్ జూలై 19 నుండి స్ట్రీమింగ్ కు రానున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. 
ఒక హీరో ఎన్ని సినిమాలు చేసాడు. ఎంత బాగా నటించాడు. ఆ సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయి. ఎన్ని రికార్డులు నెలకొల్పాయి. ఎన్ని కలెక్షన్స్ ని సాధించాయి. ఈ విధంగా హీరో స్టామినా గురించి చెప్పుకుంటారు. కాకపోతే ఇందుకు భిన్నంగా హీరో రాజ్ తరుణ్ (raj tarun)రికార్డు లిస్ట్ ఒకటి  బయటకి వచ్చింది. ఇప్పుడు ఆ లిస్ట్ సోషల్ మీడియాకి మంచి బూస్టప్ ని ఇస్తున్నాయి.  లావణ్య(lavanya)ప్రెజంట్  ఒక  టాప్ హీరోయిన్ రేంజ్ లో ఈ పేరు తెలుగు నాట మారుమోగిపోతుంది. ఇందుకు కారణం రాజ్ తరుణే. కొన్ని రోజుల క్రితం లావణ్య మీడియా ముందుకొచ్చింది. రాజ్ తరుణ్ నాతో పదకొండేళ్ళుగా సహజీవనం చేసాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని  ఆరోపించింది. ఏకంగా పోలీసు కేసు కూడా పెట్టింది. ఇప్పుడు  అమ్మాయితో కాదు అమ్మాయిలతో  తిరుగుతున్నాడని చెప్తుంది. చెప్పడమే కాదు  సదరు లిస్ట్ ని  కూడా వెల్లడి చేసింది. ఫస్ట్  లవర్  సినిమా రిద్ధి తో  ఎఫైర్ కొనసాగించాడు.  నాకు ఈ విషయం ఆరునెలల  తర్వాత తెలియడంతో రిద్ధి కి ఫోన్ చేసి చెప్పాను. దాంతో ఆమె రాజ్ రిలేషన్ నుంచి తప్పుకుంది. ఇద్దరి లోకం ఒక్కటే  హీరోయిన్ షాలిని తో కూడా కొన్నాళ్ళు తిరిగాడు.  అలాగే బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ తో కూడా సంబంధం ఉంది. ఈ ఇద్దరు కలిసి సినిమాల్లో చెయ్యకపోయినా కేవలం  ఒక్క రోజు చిన్న షూట్ జరిగింది. ఆ టైం లో నేను చెన్నై లో ఒక కోర్స్ నేర్చుకుంటు  ఉన్నాను. మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేసి విషయం చెప్పడంతో హైదరాబాద్ వచ్చేసాను. కాకపోతే వాళ్ళతో రిలేషన్ కొనసాగించినా కూడా రాజ్ నా వాడే అని అనుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే రాజ్ లైఫ్ లోకి  మాల్వి మల్హోత్రా (malvi malhotra)ఎంటర్  అయ్యిందో, రాజ్ ఇక నాకు  దక్కడు అని అర్ధమయ్యింది. మాల్వి కోసం రోజుకు   డెబ్భై వేలు ఖర్చు చేస్తున్నాడు. కానీ  పదకొండు ఏళ్లుగా సహజీవనం చేస్తున్న నాకు ఇల్లు గడవడానికి డబ్బులు కూడా ఇవ్వలేదు. అదే విధంగా రాజ్ కి చెందిన పదకొండు కుక్కలు నా దగ్గరే ఉన్నాయి. వాటి ఆలనా పాలనా కి కూడా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చింది.  మరికొంత మంది హీరోయిన్లతో కూడా రాజ్  కి  సంబంధం ఉందని వాళ్ళ పేర్లు గుర్తుకు రావడంలేదని చెప్పింది. ఇక  మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ కలిసి తిరగబడరా సామి లో చేసారు. త్వరలోనే మూవీ విడుదలకి కానుంది.   
Manoj Kumar Manchu is married to Mounika Bhuma Manchu. Manoj Kumar and Mounika have been blessed with a baby girl, as officially announced by Manoj's sister, Lakshmi Manchu, on Twitter and Instagram recently. The child is nicknamed MM Puli. Today, Manchu Manoj introduced his baby daughter to the world, 'Devasena Shobha MM' who is named after his mother-in-law and Lord Subramaniam Swamy's wife with utter delight. Manchu Manoj daughter's name has mighty blockbuster Baahubali connection. In this film, Anushka role is Devasena. Manchu Manoj and his wife Mounika Bhuma took this special occasion to thank both their families, and friends who stood by them in every thick and thin. This is the Special day for family. On the work front, Manoj Kumar has returned to acting. He has several projects in the pre-production phase, and one unannounced crazy action film has already started shooting in full  swing. This high-octane action film titled as Mirai.
The legendary Ulaganayagan Kamal Haasan and acclaimed director Shankar are set to create cinematic magic once again with their highly anticipated project, "Indian 2," the sequel to the iconic 1996 blockbuster "Indian." The film is scheduled for a grand worldwide release on July 12th, 2024, in multiple Indian languages, generating immense excitement among movie enthusiasts. Makers yesterday arranged a grand pre release event in Hyderabad. At the event, Shankar gave a known update about Game Changer while praising Ram Charan. He said, "Ram Charan has excellent screen presence. “I have been waiting to do a straight film for the Telugu audience from a long time. It is turning true through Game Changer." He added, Ram Charan’s portions are completed. He has an excellent screen presence. He has a controlled power which can blast at any time. You can see that in the film. I am very happy to work with Ram Charan and we have 10-15 days of shoot. We will soon lock the double positive and it will be ready for the release soon” told Shankar. He also thanked all the actors and technicians who worked for the film. Kiara Advani is playing the female lead. SJ Suryah, Anjali, Srikanth, Naveen Chandra, Sunil, Jayaram, and Samuthirakani are playing pivotal roles. Dil Raju is bankrolling this film and Thaman is the tunesmith. Karthik Subbaraj penned the film’s story.
Kiran Abbavaram, the young and talented hero, is set to captivate audiences with a monumental periodical thriller film. The announcement today unveiled a striking poster featuring a postcard with a letter, hinting at the intriguing narrative that lies ahead. The film, produced by Kiran Abbavaram's own KA Productions in collaboration with Srichakraas Entertainments and presented by Varalakshmi, promises an intense action thriller set in a rural backdrop. Having wrapped up filming, the movie is now in its final stages of preparation for release. Kiran Abbavaram's return to the screen has sparked immense curiosity, fueled by the anticipation surrounding this project. Scheduled for a grand reveal on the 9th of this month at 11:01 AM, the details of the film are eagerly awaited by fans and industry insiders alike. Moreover, the film is slated to reach audiences beyond Telugu-speaking regions, with releases planned in Tamil, Malayalam, and Kannada as well.
బాబులకే బాబు మహేష్ బాబు(mahesh babu)ఈ స్లోగన్ మహేష్ బాబు కొత్త మూవీ రిలీజ్ రోజున వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో మారుమోగిపోతు  ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఈ  ఆనవాయితీని మహేష్ ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఆనవాయితీ కి భారీ బ్రేక్ వస్తుందేమో అనే దిగులు వాళ్ళల్లో మొదలయ్యింది. ఎందుకో చూద్దాం.    మహేష్ గుంటూరు కారం (guntur kaaram)వచ్చి అప్పుడే ఆరు నెలలు అవుతుంది.  ఆ మూవీ  షూటింగ్ దశలోనే జక్కన్న(rajamouli)మూవీ కన్ఫార్మ్ అయ్యింది. దాంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద మహేష్ జక్కన్న  కాంబో సరికొత్త రికార్డులు సృష్టించబోతుందని సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఇంతవరకు మూవీ గురించి అధికారంగా ఎలాంటి అప్ డేట్ లేదు.మొన్న ఆ మధ్యన స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా జరుగుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad)చెప్పాడు అంతే. ఇక మళ్ళీ సినిమా గురించి న్యూస్ లేదు. అసలు మహేష్ తప్ప వేరే ఆర్టిస్టుల గురించి కూడా ఎలాంటి చర్చ లేదు. జక్కన్న ప్రీ ప్రీ ప్రొడక్షన్ కి  ఎక్కువ టైం తీసుకుంటాడులే అని సరిపెట్టుకున్నారు. కానీ  ఇప్పుడు వాళ్ళల్లో సహనం కోల్పోయింది. కానీ వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్. ఆగ‌స్టు 9 న మహేష్, జక్కన్న ల మూవీ  గురించి ఒక  ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ రానుందనే వార్తలు వస్తున్నాయి.  ఎందుకంటే  ఆరోజు మ‌హేష్ పుట్టిన రోజు. దీంతో మేకర్స్ ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా మూవీ అప్ డ్తే ఇవ్వనున్నారని తెలుస్తుంది.ఇందుకు  సంబంధించి జక్కన్నఒక  కాన్సెప్ట్ వీడియోని కూడా విడుదల చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఆ పనుల్లోనే జక్కన్న  బిజీగా ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ వీడియోతో పాటు ప్రాజెక్టుని కూడా  అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని అనుకుంటున్నాడు. జనరల్ గా జక్కన్న తన  కొత్త సినిమాని  స్టార్ట్ చేసే ముందు  ఒక  ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. అందులో  సినిమాకు సంబంధించిన కీల‌క‌మైన వివరాల గురించి  మీడియాకి వెల్లడి చేస్తాడు. ఇప్పుడు కూడా  ఆగ‌స్టు 9కి ముందే  మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తాడని అంటున్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం. ఎప్పుడొచ్చామని కాదు. బుల్లెట్ దిగిందా లేదా. మహేష్ జక్కన్న మూవీ ఎప్పుడొచ్చినా సరే  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం పక్క.  దుర్గ ఆర్ట్స్ పై సీనియర్ నిర్మాత కే ఎల్ నారాయణ(kl narayana)అత్యంత  భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.  టైటిల్ కూడా అదిరిపోనుందనే  సమాచారం.  
మే 19న బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ ఎంతటి కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పార్టీలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది యూత్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు జిఆర్‌ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 103 మంది అరెస్ట్‌ చేశారు. వారిలో టాలీవుడ్‌ నటి హేమ కూడా ఉండడంతో ఈ వార్త క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. హేమ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిందన్న వార్తపై ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత హేమ అరెస్ట్‌ కావడం, బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. ఈలోగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ విషయంపై స్పందిస్తూ హేమ సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేసింది. పోలీసులు అరెస్ట్‌ చేసిన రోజు నుంచీ తాను నిర్దోషినని చెబుతూ వచ్చిన హేమ తాజాగా ‘మా’కు ఒక లెటర్‌ సమర్పించింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఆ లెటర్‌ను అందించింది.  తాను ఆ కేసులో నిందితురాల్ని మాత్రమేనని, దోషి అని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు పోలీసుల దగ్గర లేవని ఆ లెటర్‌లో పేర్కొన్నారు హేమ. దేశంలోనే అత్యుత్తమ లేబొరేటరీలో రక్త పరీక్షలు చేయించుకున్నానని, డ్రగ్స్‌ వాడకానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్ళు లేవని రిపోర్ట్‌ వచ్చిందని ఆమె తెలిపింది. పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన టెస్టుల్లో కూడా ఇదే రిజల్ట్‌ వస్తుందన్న నమ్మకం తనకు ఉంది అంటోంది. మీడియాలో తనపై వచ్చిన కథనాల వల్ల ఒత్తిడికి లోనై ‘మా’ నన్ను సప్పెండ్‌ చేసిందని, విచారణలో దోషి అని తేలేవరకు అందరూ నిర్దోషులేనని ఆ లెటర్‌లో వివరించారు హేమ. నిబంధనలకు వ్యతిరేకంగా తనను సస్పెండ్‌ చేశారని, కాబట్టి ఆ సస్పెన్షన్‌ని వెంటనే రద్దు చేయాలని ఆమె కోరారు. ఆ లెటర్‌ కాపీని ‘మా’ వ్యవస్థాపకుడు మెగాస్టార్‌ చిరంజీవికి కూడా పంపారు హేమ.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేనేగనక దేవుడినయితే నా సృష్టి రహస్యాలను కనుగొనడానికి శాస్త్రజ్ఞులకు కొంత అవకాశమిస్తాను అంటారు విశ్వవిఖ్యాత చైనీస్ రచయిత లిన్ యూటాంగ్. ఆయన ఇంకా ఇలా అంటారు. నా అంతట నేను వారికి అట్టే సహాయమందివ్వక పోయినా, వారు చేసే కృషిలో మాత్రం అడ్డం రాను. ఒకటి రెండు శతాబ్దాల పరిశోధన ద్వారా వారేమీ కనుక్కుంటారనేది శ్రద్ధగా గమనిస్తుంటాను. శాస్త్రజ్ఞుడి దృష్టి సాలీడువంటి సామాన్య పురుగు మీదికి మళ్లిందనుకుందాం. అది ఎట్లా నిర్మింపబడిందీ, ఏ రసాయనాల ప్రభావం చేత అది ఆ విధంగా చరిస్తున్నదీ, మొదలైన విషయాలన్నీ అతడు తన పరిశోధన ద్వారా తెలియజేస్తాడు. నిర్మాణం యాంత్రికంగా జరిగిందనే విషయంలో ఎవరికీ సందేహ ముండనక్కరలేదు. అతడు సత్యమే ప్రకటించాడని అనవచ్చు. శాస్త్రజ్ఞుడి అన్వేషణ అతడ్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. సాలీడు దవడలు, జీర్ణప్రక్రియ ఎలాంటివో, అది తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటుందో అన్నీ కనిపెడతాడు. సాలీడు నుండి వెలువడే మెత్తటి సన్నని దారం వంటిది ఎలా ఉత్పత్తి అవుతుందో, గాలి తగిలినప్పుడు కూడా అది అది ఎందుకు ఎండిపోదో కనిపెట్టవలసి వుంటుంది. ఈ ఆన్వేషణలో మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతాయి. తాను అల్లినగూడులో తానే చిక్కుకోకుండా వుంటానికి సాలీడు కాళ్ళల్లో బంకని నిరోధించే శక్తి ఏమున్నదనేది అంతుబట్టదు. ఇలా మరికొన్ని దశాబ్దాలు గడిచిపోతై. ఈ లోగా కాన్సర్ వ్యాధిని పరిశోధిస్తున్న సంస్థ ఏదో అనుకోకుండా, ఈ బంక నిరోధక శక్తి ఎలా ఉద్భవిస్తుందనే విషయాన్ని కనుగొని, అలాంటి కృత్రిమ రసాయనాన్ని తాను ఉత్పత్తి చేస్తున్నానని ప్రకటిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. కానీ శాస్త్రజ్ఞుడికి ఇపుడొక ప్రధానమైన సమస్య ఎదురవుతుంది. తల్లి యొక్క శిక్షణ లేకుండానే పిల్లసాలీడు గూడు అల్లుకోడం ఎలా సాధ్యం? ఇది పుట్టుకతో వస్తుందా తల్లిని చూచి నేర్చుకుంటుందా, పుట్టగానే తల్లినుండి వేరుచేస్తే నేర్వగలదా అనే తర్కవితర్కాలలో పడిపోతాడు. అప్పుడు శాస్త్రజ్ఞుడు దేవుడితో ముఖాముఖి సంభాషించ కోరుతాడు. "శాస్త్రజ్ఞుడి కోరికపై, సాలీడు మెదడులో దానికి అవసరమైన విజ్ఞానమంతా స్మృతిరూపంలో ఎలా నిక్షిప్తం చేసిందీ దేవుడు విశదీకరించవచ్చు. అటు తర్వాత సంభాషణ ఈ రూపంలో వుండచ్చునని అంటాడు లిని యూటాంగ్.   "జీవరసాయనిక శాస్త్రాధారంగా సాలీడు జీన్స్ ఎలా ప్రవర్తిల్లేదీ నీకు తెలియజేశాను కదా శాస్త్రజ్ఞా” అంటాడు దేవుడు. "తెలియజేశారు భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "సాలీడు ప్రవర్తనను యాంత్రిక సరళిలో వివరించాను కదా?” "కృతజ్ఞుణ్ణి” భగవాన్ అంటాడు శాస్త్రజ్ఞుడు. "తృప్తి కలిగిందా నాయనా?” అని అడుగుతాడు.  "ధన్యుణ్ణి " అంటాడు శాస్త్రజ్ఞుడు. "అంతా అర్థమైనట్లే కదా?” అని మళ్ళీ అడుగుతాడు దేవుడు.  "అందుకు సందేహమా స్వామీ? ఏ రసాయనిక మిశ్రమం వలన, ఏ పదార్థాల ద్వారా ఈ ప్రపంచం నిర్మించబడినదో తెలుసుకోగలిగితే ఈ సమస్తాన్ని అర్థం చేసుకోవచ్చని నా నిశ్చితాభిప్రాయం” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదలావుంచి ఈ అద్భుతమంతా ఏమైవుంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా శాస్త్రజ్ఞా?" అని అడుగుతాడు దేవుడు. "మీ సృజనాశక్తికి అచ్చెరువొందుతూనే వున్నాను, భగవాన్” అంటాడు శాస్త్రజ్ఞుడు. "అదికాదు శాస్త్రజ్ఞ, ఇదంతా ఎలా సంభవిస్తున్నదీ, ఏ పదార్థాలు, రసాయనాలు ఇందులో ప్రయోగించారు అనే వివరణ కొంత కనుగొన్నావు. నేను మరికొంత తెలియజేశాననుకో, కానీ అసలీ విధంగా ఎందుకు జరుగుతున్నది దీని అంతరార్థం ఏమైవుంటుంది. ప్రయోజనమేమిటి అనే విషయం నీకు నేను చెప్పలేద సుమా. ఎలా సంభవిస్తున్నదనే ప్రశ్న వేరు. మొదటి ప్రశ్న అలాగే వుండిపోయింది. కదా నాయనా." అంటాడు దేవుడు. శాస్త్రజ్ఞుడి కళ్ళల్లో నీళ్ళు నిండినై, గద్గద స్వరంతో "చెప్పండి స్వామి. ఇదంతా ఏమిటి? ఈ సృష్టి ప్రయోజనమేమిటి? ఎందుకదంతా?" అని ఆక్రందించాడు. “రసాయనిక సూత్రాలద్వారా అది కనుగొనలేవు బాబూ. కాని “ఎందుకు?” అనే ప్రశ్నకు నువు సమాధానం కనుగొనలేనంత కాలం సాలీడు జన్మ రహస్యాన్ని చేదించలేవు నాయనా!". "నిజమే ప్రభూ" అంటూ శాస్త్రజ్ఞుడు వినమ్రుడైనాడు. రచయిత కథనిలా అంతం చేస్తే ముచ్చటగా వుంటుందంటారు వాళ్ళంతా. చెమటలతో శాస్త్రజ్ఞుడు నిద్ర మేల్కొన్నాడు. ఏడు రోజులపాటు నోట మాటలేకుండా, స్పృహ లేకుండా పడివున్న తన భర్త కళ్ళు తెరవడం చూచి భార్య చాలా సంతోషించింది. ఆ రోజు ఇంత పథ్యం పెట్టింది. అతడు మాత్రం ఎక్కడైనా సాలీడు కనిపిస్తే అంతదూరం పరుగెడతాడు. సాలీడును గురించి అతడి కేర్పడ్డ ఈ తీవ్రమైన భయం నయమయ్యే రోగం కాదని వైద్యులు తేల్చి చెప్పారు.”                                 ◆నిశ్శబ్ద.
చాణక్యుడి గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు అర్థం చేసుకోవాలి గానీ జీవితంలో వైఫల్యం అనేదే ఎదురుకాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితాలు, వ్యక్తుల మద్య సంబంధాలు.. ఇలా ఒక్కటనేమిటి? ఎన్నో విషయాల గురించి చాణక్యుడు కుండ బద్దలు కొట్టినట్టు విషయాలను స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా డబ్బు చేతికి వచ్చినప్పుడు చాలామంది తమకు తెలియకుండానే కొన్ని, తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. వీటి వల్ల  వ్యక్తుల దగ్గర డబ్బున్నా  ప్రశాంతత, సంతోషం అనేది మాత్రం అస్సలుండవట. మరికొందరు పతనానికి చేరుకుంటారట. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుంటే.. డబ్బు చేతిలో ఉన్నప్పుడు చాలామంది తాము ఇబ్బంది పడిన రోజులను, బాధతో గడిపిన రోజులను మరచిపోతాడు. పూర్తీగా చేతిలో డబ్బుందనే మాయలో పడిపోతారు. ఇలా మరచిపోవడం,  కష్ట సమయాలను, బాధల్ని మరచిపోవడం, డబ్బు విషయంలో తప్పు పనులు చేయడానికి దారితీస్తుంది. దీనివల్ల మళ్లీ డబ్బు లేని స్థితికే చేరుకుంటాడు. సహజంగా ప్రతి ఒక్కరూ డబ్బులేనప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తారు. డబ్బున్నప్పుడు. డబ్బులోనే సంతోషాన్ని చూస్తున్నప్పుడు దేవుడిని పక్కన పెడతాడు.  ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో కొన్నిసార్లు తప్పు మార్గంలో కూడా వెళతాడు. ఇలాంటి వారు డబ్బును మధ్యలోనే పోగొట్టుకుంటారు. తిరిగి అశాంతికి, కష్టానికి, బాధలకు దగ్గరవుతారు. కొంతమందికి డబ్బు చేతికి రాగానే అహంకారం వస్తుంది. కుటుంబ సభ్యులతోనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తారు.  అయితే పొరపాటున కూడా కుటుంబ సభ్యుల ముందు డబ్బు గర్వాన్ని చూపించకూడదు. డబ్బు ఈరోజు ఉండి రేపు పోవచ్చు. కానీ మరణం వరకు తోడుండే ఆత్మీయులు మాత్రం డబ్బు వల్ల దూరం అయితే మళ్లీ దగ్గరకు రావడం కష్టం. డబ్బు సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడమే పరమావధి కాకూడదు. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మరీ డబ్బు సంపాదించే పనులు ఎప్పుడూ చేయకూడదు.  అలాంటివారితో ఎక్కడా ఎవరూ బ్రతకలేరు. ముఖం మీదనే చెప్పి దూరం వెళ్లిపోతారు. అందుకే డబ్బుకోసం ఆత్మగౌరవం విషయంలో అస్సలు రాజీ పడవద్దు. డబ్బు దండిగా ఉన్నప్పుడు అయినా, డబ్బు లేనప్పుడు అయినా ఒకే విధంగా ఉండే వాడే ఎప్పటికైనా జీవితంలో సఫలం అవుతాడు. డబ్బు ఉంది కదా అని అనవసరంగా ఖర్చు చేస్తే అది చాలా తప్పు. కానీ డబ్బు ఉన్నప్పుడు అందులో కొంత భాగాన్ని మతపరమైన కార్యక్రమాలలో  వినియోగించడం ఉత్తమమని చాణక్యుడు చెప్పాడు. డబ్బు వృధా కంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సహాయం చెయ్యడం చాలా మంచిది. దీని వల్ల మానసిక ఆరోగ్యం, ప్రశాంతత చేకూరతాయి. డబ్బు సంపాదించడం ధనవంతుడు కావడం  గొప్పే.. కానీ  ఆ డబ్బును ఇతరులకు హాని తలపెట్టడానికి ఉపయోగిస్తే మాత్రం పతనానికి చేరుకుంటారు. ఇలాంటి పనులవల్ల ఎంత గొప్ప ధనవంతుడు అయినా పేదవాడిగా మారిపోవడం ఖాయమని చాణక్యుడు చెప్పాడు.                                           *నిశ్శబ్ద.
జంతువులకి ఆకలి, ఆరోగ్యంలాంటి భౌతికమైన సమస్యలే ఉంటాయి. వాటి సమస్యలన్నీ ఉనికి చుట్టూనే తిరుగుతాయి. కానీ మనిషి అలా కాదయ్యే! అతను ఏర్పరుచుకున్న క్లిష్టమైన సమాజజీవితంలో ప్రతిదీ ఒక సమస్యే! ఉద్యోగంలో ప్రమోషన్‌ దగ్గర్నుంచీ, పిల్లల చదువుల దాకా... ఆర్థిక సమస్యల దగ్గర్నుంచీ అత్తగారి పోరుదాకా అన్నీ సవాళ్లే. ఈ సవాళ్లను కనుక ఎదుర్కోలేకపోతే, ఎదుర్కొని ఛేదించకపోతే జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందుకే సవాళ్ల గురించి నిపుణులు ఇస్తున్న సూచనలు కొన్ని ఇవిగో...   సమస్యని అంగీకరించండి చాలామంది సమస్య ఎదురుపడగానే దాని నుంచి ఎలాగొలా తప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. తాము కాసేపు కళ్లు మూసుకుని ఉంటే ఏదో ఒక అద్భుతం జరిగి సమస్య మాయమైపోతుందన్న భ్రమలో ఉంటారు. కాలం కొన్ని సమస్యలని తీర్చగల మాట నిజమే అయినా చాలా సమస్యలకి మన చేతలే అవసరం అవుతాయి. ఆ చేతలే లేకపోతే చిన్నపాటి సవాళ్లు కాస్తా జీవన్మరణ సమస్యలుగా మారిపోతాయి. అందుకనే ముందు మన ముందు ఒక సమస్య ఉన్నదనీ... దానిని అభివృద్ధీ, వినాశనం మన చేతుల్లోనే గుర్తించడం తొలి మెట్టు.   విశ్లేషణ సమస్య పట్ల భయంతో చాలామంది దాన్ని పైపైనే తడిమేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో సమస్యని కేవలం తమ దృష్టికోణం నుంచే చూస్తారు. అలా కాకుండా సమస్యని లోతుగా, అన్నివైపులా విశ్లేషించిన రోజున దాని మూలాలు తెలుస్తాయి. అసలు సమస్య ఎక్కడ ఉంది? దానిని ఎటునుంచి పరిష్కరించాలన్న అవగాహన ఏర్పడుతుంది.   సలహా- సంభాషణ సమస్య గురించి మన లోలోనే కుమిలిపోయి ఉపయోగం లేదు. దానిని అనుభవజ్ఞులతోనో, పెద్దవారితోనో, ఆత్మీయులతోనో పంచుకోవడం వల్ల వారి దృష్టికోణం నుంచి కూడా సమస్యని అవగాహన చేసుకోవచ్చు. ఒక సమస్యకు అతీతంగా ఉన్న వ్యక్తి దానిని గమనించే తీరు ఎప్పుడూ వేరుగానే ఉంటుంది. పైగా అలాంటి కష్టకాలంలో వారు అందించే నైతిక స్థైర్యం మనం ఆత్మన్యూనతకీ, క్రుంగుబాటుకీ లోను కాకుండా కాపాడుతుంది.   భేషజాలను వదులుకోవాలి చాలా సమస్యలు మన అహంకారం వల్లే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధాలకి సంబంధించిన సమస్యలెన్నో పంతాలు, పట్టింపుల వల్లే వస్తుంటాయి. మన తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా... నేను ఎక్కడా తగ్గాల్సిన పని లేదు, ఎవరికీ తలవంచాల్సిన పరిస్థితి రాదు అనుకుంటూ భేషజాలకి పోతే అంతిమంగా నష్టపోయేది మనమే! ఇతరులను క్షమాపణ కోరడమో, ఇతరుల సలహాను పాటించడమో, ఎదుటివారి సాయం తీసుకోవడమో చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే తప్పకుండా భేషజాలను వదులుకోవాల్సి ఉంటుంది.   అంగీకారం కట్టుదిట్టమైన ఇనుపగోడల మధ్య ఉన్నా ఏదో ఒక సమస్య రాక మానదు. సమస్యలనేవి జీవితంలో భాగమే అని అంగీకరించినప్పుడు, వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వస్తుంది. సవాళ్లు లేకపోతే ఎదుగుదల అసాధ్యమని గ్రహించినప్పుడు ఎక్కడలేని తెగువా ఏర్పడుతుంది. ఏ సమస్యా లేనప్పుడు మనిషి సంతోషంగానే ఉంటాడు. కానీ సమస్య ఉన్నప్పుడు కూడా స్థిరిచిత్తంగా, ప్రశాంతంగా దానిని ఎదుర్కోగలిగే వారు విజయం సాధించగలుగుతారు.   సిద్ధంగా ఉండాల్సిందే! సమస్య తరువాత జీవితం ఎప్పటిలాగే ఉండకపోవచ్చు. చాలా సందర్భాలలో జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, సమస్యని పరిష్కరించుకునే క్రమంలో కొన్ని బంధాలు చేజారిపోవచ్చు, కొన్ని సౌకర్యాలు దూరం కావచ్చు. వీటన్నింటికీ సిద్ధంగా ఉండి, జీవితాన్ని మళ్లీ ఎప్పటిలా గడిపేందుకు సిద్ధంగా ఉండాలి.   - నిర్జర.
ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద.  
సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు  ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఆలివ్ అంత గొప్పదని అర్థం. కేవలం ఆలివ్ నూనె మాత్రమే కాదు.. ఆలివ్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్స్  ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయితే  ఆలివ్స్ తింటే కలిగే లాభాలేంటో ఒక్కసారి చూడాల్సిందే.. గుండె ఆరోగ్యం.. ఆలివ్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈ కారణంగా ఆలివ్ తీసుకుంటే గుండె  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఇవి మంచి కొవ్వులను పెంచడం ద్వారా చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ లో ఉండే ఫాలీఫెనాల్స్  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో  విటమిన్ ఇ, హైడ్రాక్సీటైరోసోల్,  ఒలీరోపిన్‌లతో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలోనూ, ప్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. పేగు ఆరోగ్యం.. ఆలివ్ లో ఉండే పోషక విలువలు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆలివ్ లు ప్రోబయోటిక్ లను కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. చర్మానికి మంచిది.. ఆలివ్ లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీద దాడి చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను  ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. బరువు.. బరువు తగ్గడంలో ఆలివ్స్ సహాయపడతాయి. ఆలివ్ లలో ఉండే మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. అదే విధంగా ఆలివ్స్ లో ఉండే ఫైబర్ కూడా ఆకలిని నియంత్రిస్తుంది.  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఆలివ్స్ ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.                                      *నిశ్శబ్ద.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పెరగడానికి అతి పెద్ద కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే, మీరు ఈ వ్యాధిని నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచే అనేక ఆహారాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. కాకరకాయ: కాకరకాయ రుచి ఎంత చేదుగా ఉంటుందో మనందరికీ తెలుసు, కానీ ఈ కూరగాయ మధుమేహ రోగులకు వరం లాంటిది.  పాలీపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముల్లంగి: ముల్లంగి, పోషకాలు సమృద్ధిగా, మధుమేహ రోగులకు చాలా ప్రభావవంతంగా నిరూపించవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఈ రూట్ వెజిటబుల్ చాలా సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది. ఆకుకూరలు: ఆకు కూరలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో బచ్చలికూర మధుమేహ రోగులకు ఉత్తమ ఎంపిక. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, అనేక విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పొట్లకాయ: పొట్లకాయ ఆరోగ్యానికి నిధి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో పొట్లకాయను ఖచ్చితంగా చేర్చుకోండి.