LATEST NEWS
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు.  ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడో రోజు కాకినాడ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనానికి స్థానిక నేత‌లు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇక‌ ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న సూర‌ప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప‌ ఫిషింగ్ హార్బ‌ర్‌తో పాటు ఉప్పాడ‌లో కోత‌కు గురైన తీర ప్రాంతాన్ని ప‌రిశీలించారు. తుపాన్ ప‌రిస్థితుల‌పై ఫొటో గ్యాల‌రీని కూడా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా తీర ప్రాంతం కోత‌కు గురికాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌వ‌న్ అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. సాయంత్రం పిఠాపురంలో వారాహి స‌భ‌లో ప‌వ‌న్ పాల్గొననున్నారు. ఈ స‌భ‌లో డిప్యూటీ సీఎం హోదాలో ఆయ‌న ఇచ్చే ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.
జగన్ ప్రభుత్వం  అధికారంలో వున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు మీద అధికార పార్టీకి చెందిన గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానవీయంగా జరిగిన ఈ దాడి అప్పట్లో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇలాంటి గూండారాజ్యంలో మనం బతుకుతున్నామా అన్న ఆందోళన ప్రజల్లో కలిగించింది. జగన్ ఒత్తిడి మేరకు అప్పట్లో పోలీసులు ఈ కేసు మీద ధైర్యంగా దర్యాప్తు చేయలేకపోయారు. వైసీపీ రాక్షసపాలన ముగిసి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆనాటి సంఘటన మీద తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.  ఆరోజు టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణలు వినిపించాయి. ఈ కేసులో దాదాపు 150 మంది మీద కేసులు నమోదు చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దాడి జరిపిన వారిలో గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది వున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికల మీద పోలీసులు దృష్టి పెట్టారు. 
 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తన స్పీడ్ పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీకి రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.   తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది.. అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఆయన కోరలు పీకి మూలకు కూర్చోబెట్టారని ట్వీట్ లో పేర్కొంది. అలాంటి పెద్ద పామే పాముల గురించి, తేళ్ల గురించి మాట్లాడటం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది. ‘కేసీఆర్ ముందే చెప్పిండు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియోలో ‘పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. కరెంటు కాటగలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో మళ్లీ పెద్ద పాము మింగినట్లైతది. మళ్లా మొదటికొత్తది కథ’ అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఈ వీడియోను పోస్ట్ చేయగా.. గంట వ్యవధిలోనే 20 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్ వెంటనే కౌంటర్ ట్వీట్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై అధికారానికి దూరమైంది. ఉద్యమ పార్టీగా మొదలై అధికారం సాధించిన ఆ పార్టీ, ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రజాదరణ కోల్పోయి అధికారానికి దూరమైన తరువాత బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంటే అవసరమైంది. అధికారంలో ఉండగా పాండవులు తమ అస్త్రాలను జమ్మి జట్టుపై దాచినట్లు.. బీఆర్ఎస్ కూడా సెంటిమెంటు అస్త్రాన్ని రాజకీయం మాటున దాచేసింది. అవసరార్ధం ఇప్పుడు బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది.   తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో జరుగుతున్న ప్రయత్నాన్ని సెంటిమెంట్ అస్త్రంతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది.  ఔను.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఈ పదేళ్లలోనూ విభజన సమస్యల సామరస్య పరిష్కారానికి ఇటువంటి ఒక ప్రయత్నం జరిగిన దాఖలాలు కనిపించవు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయయుడు ఈ దిశగా చొరవ తీసుకుని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన రేవంత్ క్షణం ఆలస్యం చేయకుండా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు. ఇరువురూ ఈ నెల 6న ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలంటే పాతగాయాలను కెలుక్కోవడం కాదు... అగాధాలను పూడ్చుకుని రెండు రాష్ట్రాలూ ప్రగతి దారిలో ముందుకుసాగడానికి బాటలు పరచడం.  అయితే తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల నెగడు రావణ కాష్టంలా రగులుతుంటేనే తమకు మనుగడ అని  భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు చంద్రబాబు, రేవంత్ ల భేటీని స్వాగతిస్తూనే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన చందంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.  విభజన సమస్యల పరిష్కారం కోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు రావడం మంచిదే అంటూనే హరీష్ రావు విలీన మండలాల ప్రస్తావన తీసుకువచ్చారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును రగల్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించే ముందు రేవంత్ రెడ్డి విలీన మండలాలను మళ్లీ  వెనక్కు ఇవ్వాలన్న షరతు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తు న్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకువచ్చి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించుకున్నారనీ, అప్పట్లో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా సమర్ధించారనీ గుర్తు చేశారు. ఏకపక్షంగా జరిగిన ఈ విలీనం తెలంగాణ సమాజం హర్షించలేదని ఇప్పుడు అంటున్నారు.   వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు విలీన మండలాలూ ముంపునకు గురౌతాయి. ఈ మండలాలు ఏపీలో విలీనం కాకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే అవకాశమే లేదు. అందుకే అప్పట్లో చంద్రబాబునాయుడు ఈ మండలాల విలీనం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఆ పార్టీ కూడా ఏడు మండలాల విలీనాన్ని సమర్ధించింది. విలీనం జరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమూ మొదలైపోయింది. ఇప్పుడు ఆ మండలాలను వెనక్కు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేయడం రాజకీయ లబ్ధి కోసమే కానీ మరొకందుకు కాదు. అది జరిగే పని కాదని ఆయనకూ తెలుసు. కానీ అధికారానికి దూరమై, ప్రజామద్దతు కోల్పోయిన బీఆర్ఎస్  మళ్లీ పుంజుకోవాలంటే విలీన మండలాల పేరుతో సెంటిమెంట్ రగల్చడమే మార్గమన్న భావనతోనే షరీష్ రావు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు తెలంగాణ అన్న పదాన్నే తన పార్టీ పేరు నుంచి తొలగించి... జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేయాలని కలలుగన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని   పలుకుబడి సాధించాలని చేసే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తడం కొరివితో తల గొరుక్కోవడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు, స్వామీజీలకు ఇచ్చిన ప్రాధాన్యతను జనం వారికి గుర్తు చేసి ఎగతాళి చేసే అవకాశాలున్నాయంటున్నారు.  
ఎంత కోటీశ్వరుడికైనా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు వున్నా, ఏ మనిషికైనా కావలసింది... కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. కడుపు నిండా తిండి ఎలాగైనా వస్తుందేమోగానీ, కంటి నిండా నిద్ర మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. నా దగ్గర బోలెడన్ని కోట్లు వున్నాయి.. నిద్రా.. రా.. అంటే నిద్ర వచ్చేయదు. పోనీ, డబ్బుంది కదా... నిద్రని కొనుక్కుందామా అంటే, అదికూడా సాధ్యమయ్యే విషయం కాదు.. నిద్ర గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జగన్మోహన్‌రెడ్డి మనలాగా సాధారణ పౌరుడు. మనం దేశ సరిహద్దుల్లో సైన్యం కాపలాగా వున్నారన్న ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతాం. జగన్మోహన్‌రెడ్డి కూడా అంతే, తన ప్యాలెస్‌ చుట్టూ దాదాపు వెయ్యిమంది పోలీసులు కాపలాగా వున్నారన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతూ వుంటారు. ఒక్క పోలీసులు మాత్రమేనా.. బోలెడన్ని చెక్‌పోస్టులు... వందలకొద్ది సెక్యూరిటీ పరికరాలు.. ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా బారికేడ్లు... ఇక ఆయుధాల సంగతి సరేసరి. జగన్ ముఖ్యమంత్రిగా వుండగా తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ఈ సదుపాయాలు వుండేవి కాబట్టి ఆయన హాయిగా నిద్రపోయేవారు. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి.. మరి... ఆయన ఇక హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోగలరా? గతంలో జగన్ ఇంటి ముందు నుంచి సాధారణ పౌరులు ప్రయాణించడానికి అవకాశం వుండేది కాదు.. ఇప్పుడు అలా కాదు.. జగన్ ఇంటి ముందు వున్న రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని అధికారులు తొలగించారు. ఇప్పుడు  ఎవరైనా ఆ రోడ్డులో హాయిగా ప్రయాణించవచ్చు. హై సెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగంగా వున్న ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలతో జగన్ ఇంటి చుట్టూ వున్న రోడ్లతో ప్రవేశిస్తే, వాటిని ఆపడానికి రెండు టైర్ కిల్లర్లు, నేలలో నుంచి పైకి లేచే నాలుగు హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటినీ తొలగించారు. జగన్ ఇంటి దగ్గర భద్రతకోసం అన్నట్టుగా ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. జగన్ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొత్తం తీసేశారు. అలాగే, మొన్నటి వరకు జగన్‌కి సెక్యూరిటీగా వున్న దాదాపు వెయ్యిమంది పోలీసుల స్థానంలో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే మిగిలింది. జగన్ ఇంటి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది కోసం అనుమతి లేకుండా నిర్మించిన పక్కా గృహాలను, గవర్నమెంట్ ఖర్చుతో జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా త్వరలో తొలగిస్తారు. మరి, ఇంతకాలం ఇంత సెక్యూరిటీ, హడావిడి వుంటే తప్ప జగన్ నిద్రపోయేవారు కాదు.. మరి ఇకముందు జగన్‌కి ఎలా నిద్ర పడుతుందో ఏమో!
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినిమాకి ఒక కొత్త రకం డాన్స్ మూమెంట్స్ ని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)పాన్ ఇండియా లెవల్లో ఉన్న హీరోలకి, హీరోల అభిమానులకి ఫేవరేట్ మాస్టర్  కూడా. ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన  వెల్లడి చేసిన ఒక న్యూస్ తోటి డాన్సర్స్ లో ఆనందాన్ని తెస్తుంది.  జానీ మాస్టర్ కి తన పుట్టినరోజు సందర్భంగా  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి పిలుపు వచ్చింది. దీంతో చరణ్ ఇంటికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక  మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi)కూడా ఉన్నారు. దీంతో జానీ మాస్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీకి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత చరణ్, ఉపాసన (upasana)తో కలిసి ఫోటో కూడా దిగాడు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి నుంచి  జానీ మాస్టర్ కి  ఒక హామీ వచ్చింది. డ్యాన్సర్స్ యునియన్ టిఎఫ్ టిటిడిఎ లో ఉన్న ఐదువందల కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా చూస్తామని మాటిచ్చారు.  జానీ మాస్టర్ గతంలోనే  ఈ విషయాన్నీ చరణ్ దృష్టికి తీసుకొచ్చాడు.  ఇప్పుడు బర్త్డే కానుకకి ప్రకటించినట్లయ్యింది.  ఇక ఈ విషయంపై జానీ మాస్టర్ మాట్లాడుతు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తు, మా  కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనస్సులో ఎప్పుడు కృతజ్ఞతా భావం ఉంటుంది.అదే విధంగా అందరి తరపున చరణ్  అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వదిన నాకు ప్రత్యేకంగా ఇచ్చిన మాటకి నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చాడు.  
'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచస్థాయిలో సత్తా చాటిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇది. భారీ బడ్జెట్ తో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపొందనుంది. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా 'సలార్' స్టార్ నటించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో విలన్ రోల్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటాయి. 'SSMB 29'లో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉంటుందట. హీరో, విలన్ రోల్స్ నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా తలపడేలా ఉంటాయట. అందుకే ఈ మూవీలో విలన్ రోల్ కోసం మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ని.. రాజమౌళి రంగంలోకి దింపుతున్నారట. పృథ్వీరాజ్ టాలెంటెడ్ యాక్టర్, పైగా పాన్ ఇండియా గుర్తింపు ఉంది. అందుకే పృథ్వీరాజ్ పై రాజమౌళి దృష్టి పడిందట. పృథ్వీరాజ్ సైతం ఏమాత్రం ఆలోచించకుండా.. ఈ భారీ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. పలు డబ్బింగ్ సినిమాలతో అలరించాడు. అలాగే 2010లో 'పోలీస్ పోలీస్' అనే తెలుగు సినిమాలో నటించాడు. ఇక గతేడాది ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'సలార్'లో మన్నార్ గా అదరగొట్టాడు.
ఒకే రంగంలో ఎదగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఉండటం గొప్ప కాదు. ఎదిగిన తరువాత కూడా వారి మధ్య అదే స్నేహం కొనసాగడం గొప్ప. హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ది అలాంటి గొప్ప స్నేహమే.  విజయ్, నాగ్ అశ్విన్ ఇంచుమించు ఒకే సమయంలో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు సినీ ఫీల్డ్ లో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. ఒకరి సక్సెస్ ని చూసి ఒకరు మురిసిపోతున్నారు. వీరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో..  గతంలో నాగ్ అశ్విన్ చెప్పిన మాటని బట్టి అర్థం చేసుకోవచ్చు. తాను చేసే ప్రతి సినిమాలో విజయ్ ఉంటాడని అన్నాడు. అన్నట్టుగానే ఇప్పటిదాకా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన మూడు సినిమాల్లో విజయ్ ఉన్నాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి' సినిమాల్లో కథకి కీలకమైన పాత్రలు విజయ్ పోషించాడు. ఇక రీసెంట్ గా వచ్చిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD)లో అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించడం విశేషం. ప్రస్తుతం 'కల్కి' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో విజయ్, నాగ్ అశ్విన్ ఓల్డ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో విజయ్ చాలా యంగ్ గా మెరిసిపోతుండగా.. నాగ్ అశ్విన్ ఇప్పటికంటే బక్కగా, లాంగ్ హెయిర్ స్టైల్ తో ఉన్నాడు. ఇది కొన్నేళ్ల క్రితం ఓ ప్రైవేట్ పార్టీలో దిగిన ఫొటో. అప్పుడు ఆ ఫొటోలో ఉన్న కుర్రాళ్లే.. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా ఎదిగారు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు పెట్టిన పేరుతో సినిమా రంగంలో నలభై ఏళ్ళకి పైగా రాణిస్తూ వస్తున్న రచయితలు పరుచూరి  బ్రదర్స్.  350 కి పైగా సినిమాలు వాళ్ళ కలం నుంచి వచ్చాయి. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పవచ్చు. తాజాగా పరుచూరి బ్రదర్స్ (paruchuri brothers)లో ఒకరైన  పరుచూరి గోపాల కృష్ణ (gopala krishna) పవన్(pawan kalyan)పై చేసిన కొన్ని వ్యాఖ్యలు  వైరల్ గా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్  చాలా కీలకంగా వ్యవహరించాడు. సుదీర్ఘ మైన అనుభవం ఉన్న రాజకీయనాయకుడులా  చాలా ఎత్తుగడలు వేసాడు. చివరకి  ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని మానసిక బలంతో ముందుకు వెళ్తు విజయం సాధించాడు. అంతే కాకుండా తన పార్టీ ద్వారా పోటీ చేసిన అందర్నీ గెలిపించుకొని చరిత్ర సృష్టించాడు.దీంతో ఇన్ని రోజులు నేను  మాట్లాడింది సినిమా డైలాగ్ లు కాదని నిరూపించాడు. ఇక పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన క్షణంలో  ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కళ్ళార్పకుండా అలాగే చూస్తుండి పోయాను. చిన్న పిల్లాడు ఎంత ఎదిగిపోయాడని అనిపించింది.  రాజకీయాల్లో పవన్  ఇంకా ఎదగాలి. కానీ ఎంత ఎదిగినా  ఒదిగి ఉండే మనస్తత్వం. అలాగే ఉప ముఖ్యమంత్రి  హోదాలో ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాడు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఏ  రాజకీయ నాయకుడు  జీవితం అయిన  దెబ్బతింటుంది. అందుకే చాలా  జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు, పవన్ లు ఒకరు రాముడు అయితే ఇంకొకరు లక్ష్మణుడు. అదే విధంగా అవసరమైనప్పుడు కృష్ణార్జునులు లాగ  కూడా ఉండాలి. అప్పుడే రాష్టం అభివృద్ధి ప్రధాన నడుస్తుందని చెప్పాడు, ఇదే క్రమంలో పవన్ సినీ జీవితం పై కూడా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు.    సినిమాలు చెయ్యడం  మాత్రం మానుకోకూడదు. గతంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేసారు.  . ఈ విషయంలో  ఎన్టీఆర్ ని పవన్  ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలాగే   అత్తారింటి దారేది లాంటి  మూవీ పవన్  మళ్ళీ చెయ్యాలి. విఎఫ్ఎక్స్ లు,  పెద్ద పెద్ద  ఫైట్స్  అక్కర్లేదు.   పవన్ స్క్రీన్ మీద  కనపడి చిన్నపాటి  డైలాగ్స్ చెప్తే చాలు. సినిమా హిట్.  అదే విధంగా సినిమా రంగ సమస్యలని కూడా తీర్చాలని కూడా కోరుకుంటున్నాను..పవన్ కి నేను వీరాభిమానిని అని కూడా చెప్పాడు.  
  మూవీ : తీరా కాదల్ నటీనటులు: జై, ఐశ్వర్య రాజేశ్ , శివద, వృధ్ది విశాల్, అమ్జత్ ఖాన్ తదితరులు ఎడిటింగ్: ప్రసన్న మ్యూజిక్: సిద్దూ కుమార్ సినిమాటోగ్రఫీ: రవివర్మన్ నిర్మాతలు:  సుభస్కరణ్ దర్శకత్వం: రోహిణ్ వెంకటేశన్ ఓటీటీ : నెట్ ఫ్లిక్స్ కథ:  గౌతమ్ (జై) చెన్నైలో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య వందన (శివద) కూతురు ఆర్తి ఇదీ అతని కుటుంబం. వందన కూడా ఒక సంస్థలో హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా వారి జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఒకసారి అతను కంపెనీ పనిమీద మంగుళూరు బయల్దేరతాడు. ట్రైన్ లో అతనికి శరణ్య (ఐశ్వర్య రాజేశ్) తారసపడుతుంది. కాస్త ఇబ్బంది పడుతూనే ఒకరినొకరు పలకరించుకుంటారు. తన భార్య పిల్లలను గురించి గౌతమ్, తన భర్త ప్రకాశ్ గురించి శరణ్య ఒకరికొకరు చెప్పుకుంటారు. మంగుళూరు వెళ్లిన తరువాత కూడా ఇద్దరూ కలుసుకోవడం .. మాట్లాడుకోవడం .. కలిసి భోజనం చేయడం చేస్తుంటారు. అలా ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా మసలుకోవడం మొదలుపెడతారు. మంగుళూరు నుంచి చెన్నై కి వచ్చిన తరువాత కూడా గౌతమ్ ను శరణ్య మరిచిపోలేకపోతుంది. తన భర్త నుంచి విడిపోయి, గౌతమ్ ఫ్లాట్ కి ఎదురుగా ఉండే ఫ్లాట్ లో దిగుతుంది. గౌతమ్ ఇంట్లో ఉన్నా .. ఆఫీసులో ఉన్నా తరచూ కాల్ చేసి అతణ్ణి టెన్షన్ పెడుతూ ఉంటుంది. తన భార్య వందనకు తెలిస్తే ఏమౌతుందోనని గౌతమ్ సతమతమవుతూ ఉంటాడు. ఆమెకి అనుమానం రాకండా ఉండటం కోసం నానా తంటాలు పడుతుంటాడు. కొన్ని రోజులకి వందనని వదిలేసి రమ్మని గౌతమ్ తో శరణ్య అంటుంది. అసలు శరణ్య, గౌతమ్ ల మధ్య రిలేషన్ ఏంటి?  ఆమె మాట విని వందనని గౌతమ్ వదిలేశాడా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి లైఫ్ లో కీలకం.. పెళ్ళి ముందు వరకు ఎవరినో ఒకరిని ప్రేమించినా పెళ్లి తర్వాత మర్చిపోయి హ్యాపీగా ఉంటే ఒకే కానీ అలా లేకుండా భర్త హింసిస్తున్నాడనో, భర్య టార్చర్ చూపిస్తుందనే మాజీ ప్రేమని వెతుక్కుంటూ వెళితే ఏం జరుగుతుందో 'తీరా కాదల్ ' మూవీ చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు రోహిణ్ వెంకటేశన్ ఏం చెప్పాలనుకున్నాడో దానిని చక్కగా చెప్పేశాడు. ఎక్కడ ల్యాగ్ లేకుండా, సున్నితమైన సంభాషణలతో కథని గ్రిస్పింగ్ గా మార్చాడు. మెయిన్ లీడ్ గా చేసిన ముగ్గురు చాలా సహజంగా నటించారు‌. వారికి తోడుగా లోకేషన్స్ కూడా కథకు సరిపోయాయి.  మెచుర్డ్ అండ్ ఫీల్ గుడ్ మూవీ జాబితాలో ఈ మూవీని చేర్చొచ్చు. కొన్ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ టైమ్ పాస్ అయ్యేలా వెళ్ళింది‌. కానీ సెకెంఢాఫ్ లో ఒకే సీన్ రిపీట్ గా సాగుతున్నట్టు అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో  కన్ క్లూజన్ బాగుంది. డైలాగ్స్ లో ఫ్రెష్ ఫీల్ ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు.  ఫస్టాఫ్ లో కథని ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చేయడానికి పాత్రల పరిచయానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ కాస్త తొందరగా ముగిసినట్టుగా అనిపిస్తుంది. కుమార్ మ్యూజిక్ బాగుంది‌. ప్రసన్న ఎడిటింగ్ నీట్ గా ఉంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.   నటీనటుల పనితీరు: శరణ్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్, గౌతమ్ గా జై, వందనగా శివద సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. ఫైనల్ గా : కొన్ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. రేటింగ్ : 2.5 / 5 ✍️. దాసరి  మల్లేశ్
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'చిట్టి పొట్టి' (Chitti Potti). రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మగా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది అని చిత్ర బృందం తెలిపింది. చిట్టి పొట్టి టైటిల్ మరియు మోషన్ పోస్టర్ కు చక్కటి ఆదరణ లభించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్ లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు. కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మల్హర్బట్ జోషి, ఎడిటర్ గా బాలకృష్ణ బోయ వ్యవహరిస్తున్నారు.
  మూవీ : అహం రీబూట్ నటీనటులు : సుమంత్ ఎడిటింగ్: మురళీకృష్ణ మన్యం మ్యూజిక్: శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: వరుణ్ అంకర్ల నిర్మాతలు: రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ ఓటీటీ : ఆహా కథ:  నిల‌య్ (సుమంత్‌) ఓ రేడియో జాకీ. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా గొప్ప పేరు తెచ్చుకోవాల‌ని క‌ల‌లు క‌న్న అత‌డి జీవితాన్ని ఓ యాక్సిడెంట్ మార్చేస్తుంది. ఆట‌కు అత‌డిని దూరం చేస్తుంది. అదే యాక్సిడెంట్ లో నిల‌య్ కార‌ణంగా ఓ అమ్మాయి కూడా చ‌నిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ తనని వెంబడిస్తుంది. ఆ బాధ నుంచి దూరం అయ్యేందుకు రేడియో జాకీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. రోజు అత‌డి రేడియో స్టేష‌న్‌కు ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. త‌న‌ను ఎవ‌రో కిడ్నాప్ చేసి చీక‌టి రూమ్‌లో బంధించార‌ని చెబుతుంది. తొలుత ఫ్రాంక్ కాల్ అని భావించిన నిల‌య్ ఆమె మాట‌ల‌ను న‌మ్మ‌డు. ఆ అమ్మాయితో జ‌రుగుతోన్న క‌న్వ‌ర్జేష‌న్‌ను లైవ్‌లో పెట్టేస్తాడు. నిల‌య్‌తో ఆ అమ్మాయి మాట్లాడిన‌ మాట‌లు విన్న పోలీసులు ఆమె నిజంగానే కిడ్నాప్ అయ్యింద‌ని ఫిక్స‌వుతారు. ఆ యువ‌తి నుంచి వివ‌రాలు సేక‌రించే బాధ్య‌త‌ను నిల‌య్‌కు అప్ప‌గిస్తారు. ఇంతకీ ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? ఎక్క‌డ ఉంచార‌నే స‌మాచారాన్ని నిల‌య్ ఎలా సేక‌రించాడు? ఆమెను నిల‌య్ స‌హాయంతో పోలీసులు సేవ్ చేశారా? నిల‌య్ కార‌ణంగా యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన అమ్మాయి ఎవ‌రన్నదే మిగతా కథ. విశ్లేషణ: సోలో క్యారెక్టర్ తో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. హలో మీరా, ఎలోన్, రారా పెనిమిటి లాంటి సినిమాల్లో సింగిల్ క్యారెక్టర్ తో చాలా కష్టంగా గడిచింది. ఈ అహం రీబూట్ కూడా ఒక వీడియో చూడకుండా ఆడియో లాగా వినేయొచ్చు. ఇక సింగిల్ క్యారెక్టర్ కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ ని పెట్టి ఇదే థ్రిల్లర్ ని కొనసాగిస్తూ తీస్తే అప్పుడు బాగుండేది.  సింగిల్ క్యారెక్ట‌ర్ తో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కొంతవరకు ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగున్నాయి. సీన్ కి తగ్గట్టుగా చాలా వేరియేషన్స్ ప్రదర్శించాడు సుమంత్. కొంతవరకు తన యాక్టింగ్ తో నెట్టుకొచ్చాడు హీరో‌. సినిమా మొత్తంలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆకర్షణను పెంచగా, చాలా సన్నివేశాలు చాలా రెగ్యులర్ గా సాగాయి. సపోర్టింగ్ రోల్స్ లేకుండా సినిమా మొత్తం సింగిల్ క్యారెక్టర్ అంటే చూసే ఆడియన్స్ కి కష్టమే.. అందులోను గంటన్నర పాటు ఒకే క్యారెక్టర్ ని చూడటం అంటే సాహసమనే చెప్పాలి. ఈ లోటు సినిమాలో బాగా కనిపించింది. సింగిల్ క్యారెక్ట‌ర్‌తో తెర‌కెక్కిన ప్ర‌యోగాత్మ‌క సినిమాగా ఈ సినిమాకి గుర్తింపు అయితే వస్తుంది గానీ పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. త‌ప్పు చేశాన‌ని ప‌శ్చాత్తాపంతో ర‌గిలిపోతున్న ఓ ఆర్జే, ఆ అప‌రాధ భావం నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలా కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు అనే కోణం ఆకట్టుకున్నప్పటికీ, ఆ కోణాన్ని ఆవిష్కరించిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదు. స్క్రిప్టు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  ఒకే ఒక పాత్రలో సుమంత్ తన నటనతో సినిమా మొత్తం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది‌. అతని నటన ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  ఫైనల్ గా : అక్కడక్కడ థ్రిల్ ని పంచే ఈ మూవీని ఓ సారి చూసేయొచ్చు.  రేటింగ్ :  2.25 / 5 ✍️. దాసరి మల్లేశ్
టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో టాప్-2 హీరోలు అంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేర్లు వినిపిస్తాయి. అప్పట్లో వీరి బాక్సాఫీస్ వార్ కి ఫుల్ క్రేజ్ ఉండేది. తరువాతి తరం స్టార్స్ వచ్చినా కూడా.. ఇప్పటికీ ఈ స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే చిరంజీవి వారసుడిగా ఆయన కుమారుడు రామ్ చరణ్ (Ram Charan) సినీ రంగ ప్రవేశం చేసి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. కానీ బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna) మాత్రం లేట్ గా లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అతని రీసెంట్ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటూ నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతో పాటు ఒత్తిడి కూడా భారీగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అదే సమయంలో రామ్ చరణ్ వంటి స్టార్స్ తో పోలికలు కూడా వస్తాయి.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత' సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండో సినిమాగా రాజమౌళి డైరెక్షన్ లో చేసిన 'మగధీర' ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, చరణ్ ని తిరుగులేని స్టార్ ని చేసింది. ఇప్పుడు మోక్షజ్ఞకు కూడా అలాంటి ఎంట్రీ పడాలి. మోక్షజ్ఞ మొదటి మూవీ 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో చేయనున్నాడని తెలుస్తోంది. రెండో సినిమా కోసం బోయపాటి శ్రీను లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగంలోకి దిగే అవకాశముంది అంటున్నారు. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే, మోక్షజ్ఞకు సాలిడ్ ఎంట్రీ కుదిరినట్టే. ఇప్పటికే తన రీసెంట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక యాక్టింగ్ తోనూ అదరగొడితే తిరుగులేని స్టార్ అవుతాడు అనడంలో డౌట్ లేదు. అదే జరిగితే, అప్పట్లో చిరంజీవి-బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ ని తలపించేలా.. భవిష్యత్ లో రామ్ చరణ్-మోక్షజ్ఞ బాక్సాఫీస్ వార్ ని చూడవచ్చు.
సమ్ థింగ్.. సమ్ థింగ్.. సమ్ థింగ్.. అందరిలోన ఏదో సమ్ థింగ్ ఉంటుందనేది ఒక కవి ఉవాచ. అందుకు సాక్ష్యంగా   ఇప్పుడు ఒక  టాటూ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. టాటూ షేక్ చెయ్యడం ఏంటని అనుకోకండి.  ఎందుకంటే  అది అలాంటి ఇలాంటిది కాదు. బాలీవుడ్ బ్యూటీ ట్ దిశా పటాని (disha patani)టాటూ.. అసలు విషయం ఏంటో చూద్దాం.   2015 లో వరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ ద్వారా  దిశా సినీ రంగ ప్రవేశం చేసింది. మూవీ సక్సెస్ అయ్యి ఉంటే మరిన్ని తెలుగు సినిమాల్లో  ఆఫర్స్ వచ్చేవి. కానీ పరాజయం పాలవ్వడంతో  బాలీవుడ్ కి మకాం మార్చేసింది. ధోని, భాగీ 2 , భాగీ 3 ,యోధ, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ లాంటి హిట్ చిత్రాల ద్వారా  గోల్డెన్ లెగ్  అనే పేరు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చేతి మీద ఒక టాటూ ఉంది. ఇప్పుడు అది పబ్లిక్ కంట పడింది. పీడీ అనే పేరుతో  ఉండటంతో ఇప్పుడు  ఆ పేరు అందరిలో కొత్త చర్చలకి దారితీసింది.కొందరేమో  పీడీ అంటే  ప్రభాస్, దిశా పటానీ  అని   మరికొందరు  పీడీ అంటే  ప్రభాస్  డార్లింగ్  అనే అర్ధం అని  అంటున్నారు.  ఇద్దరి ఫ్యాన్స్ అయితే  ఏకంగా ఆ పేరుపై పెద్ద రీసర్చే  చేస్తున్నారు. దిశా పటాని గత చిత్రాల్లో నటించిన  హీరోల దగ్గర నుంచి ఆమెతో  క్లోజ్ గా ఉండే వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. అలా సేకరించి  పీడీ అనే పేరుకి  మ్యాచ్ అవుతుందేమో   చెక్ చేస్తున్నారు. వాళ్ళ రీసర్చ్ సక్సెస్ అయినా అవ్వకపోయినా  కాలమే నిజాన్ని చెప్తుంది.  ఇక  ప్రభాస్ (prabhas)దిశా లు లేటెస్ట్ గా కల్కి (kalki)లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ప్రభాస్ ని ఇష్టపడే అమ్మాయిగా దిశా చేసింది.  నిడివి కాసేపే అయినా ప్రేక్షకుల నుంచి  మంచి స్పందనే  వస్తుంది. సూర్య పాన్ ఇండియా మూవీ కంగువాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది.  ఎక్కువ మంది    ప్రభాస్ పేరే అని కామెంట్స్ చేస్తున్నారు.  
Maverick Filmmaker SS Rajamouli is gearing up for superstar Mahesh Babu's film tentatively titled SSMB 29. Mahesh Babu is currently busy bringing out best version of himself. The pre production work has been going on for almost 9 months. The makers had plans to start the shoot by May end. Due to unforeseen circumstances, the film shoot pushed to September. SS Rajamouli completed script work and pre production work and also finalizing the locations and actors. Mahesh Babu began his workshop for the various sequences of the film.  The story will be locked this week and the look test will start soon. The film is a jungle adventure and it happens in the forests of Africa. SS Rajamouli will direct Mahesh Babu in a globe-trotting forest action-adventure, with the star playing an adventurer. Now, SS Rajamouli locked Prithviraj Sukumaran in key antagonist role. The actor previously impressed Telugu audience with Salaar and The Goat Life. This news has created sensation on social media. This combination is almost confirmed. American-Indonesian actress Chelsea Islan is reportedly playing the female lead. PS Vinod of Panja and Sita Ramam fame handling cinematography. Tammiraju will be handling the editing works. Mohan Nath Bingi of Aakashavaani and Adipurush fame will be taking care of production design. Kamal Kannan RC who collaborated with Jakkanna for Eega and Baahubali 2 VFX will be acting as VFX supervisor. KL Narayana of Kshana Kshanam and Hello Brother fame will be producing this huge project on a grand scale with mammoth budget. The film might release in May 2026.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుతకాలంలో వివహబంధాలు చాలా పేలవంగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి గొడవ పడటం, ఇగో లు, మిస్ అండర్స్టాండింగ్, అనుమానాలు, ఇంకా ముఖ్యంగా కమర్షియల్ విషయాల్లో ఆర్గ్యు జరగడం,  పర్సనల్ ఇంపార్టెన్స్, పబ్లిక్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాలు లైఫ్ పార్టనర్స్ మధ్య గొడవలకు దారి తీసి అవి కాస్తా విడిపోయేవరకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్టనర్ దగ్గర కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జాగ్రత్త అజాగ్రత్త అయితే తరువాత చాలా రిలేషన్ కోసం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు.  లైఫ్ పార్టనర్ దగ్గర ఎలా ఉంటే వాళ్ళు ఇంప్రెస్స్ అవుతారు అనే విషయాలు అన్ని చోట్లా ఉంటాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. కానీ లైఫ్ పార్టనర్ దగ్గర చేయకూడని పనులు ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. అవేంటో తెలుసుకుంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వడం అంటూ ఉండదు. ఓపిక ఉండాలి! ఓపిక ఉండాలనే విషయం అందరికీ తెలిసిందేగా అనుకోవచ్చు. కానీ లైఫ్ పార్టనర్ తను చెప్పాలనుకున్న విషయాన్ని, తన ప్రోబ్లేమ్స్ ను చెప్పేటప్పుడు ఓపికగా వినాలి. నువ్వెప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు పో….. లాంటి మాటలు మనుషుల మధ్య చాలా దూరాన్ని పెంచేస్తాయి. ప్రతి ఒక్కరికీ తాము ఫేస్ చేసే ప్రాబ్లెమ్ పెద్దగానే కనబడుతుంది కాబట్టి ప్రోబ్లేమ్స్ గురించి చెప్పేటప్పుడు వినడం, చెప్పేసిన తరువాత ఆ ప్రాబ్లెమ్ గురించి అన్ని కోణాలలో కొంచెం వివరించి దాన్ని సాల్వ్ అయ్యేలా సలహా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. స్పెండింగ్ టైమ్! కలసి ఉండే సమయం గురించి కొంచెం ఫోకస్ చెయ్యాలి ఇప్పటి జనరేషన్ వారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ఉద్యోగం పనుల్ని ఇంటికి తెచ్చి ఆ పని తాలూకూ ఎఫెక్ట్ ను ఇంట్లో కూడా చూపిస్తూ ఉంటే అన్నిటికంటే ఉద్యోగమే ఎక్కువైపోయింది లాంటి డైలాగ్స్ బాణాల్లా వచ్చేస్తాయి. ఉద్యోగం చేస్తున్నవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాన్ని ఉద్యోగంలా చూస్తూ పర్సనల్ టైమ్ ను హాయిగా గడపాలి. అప్పుడే ప్రొఫెషన్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను రెండింటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసె జెంటిల్ మెన్ లేదా జెంటిల్ ఉమెన్ అవుతారు. ఓపెన్ గా ఉండాలి! కొంతమంది సీక్రెక్స్ మైంటైన్ చేస్తుంటారు. అలాంటి కపుల్స్ మధ్య అపార్థాలు చాలా తొందరగా వచ్చేస్తాయి. అవి వచ్చినంత తొందరగా తగ్గిపోయేవి కావు. పైపెచ్చు ఒకదానికొకటి ఇంకా అగ్గి రాజుకున్నట్టు పెద్ద గొడవల వైపుకు మల్లుతాయి. కాబట్టి ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఉండటం బెటర్. ఏ విషయం జరిగినా ఇద్దరూ డిస్కస్ చేసుకోవడం, ఏ గొడవ జరిగినా  ఇద్దరూ కలిసి మాట్లాడుకుని దానికి సాల్వ్ చేసుకోవడం బెటర్. కాంప్రమైజ్! జీవితమంతా కాంప్రమైజ్ లతోనే గడిచిపోవాలా లాంటి ఆవేశపు క్వశ్చన్స్ వద్దు కానీ నిజానికి చాలా బంధాలు బ్రేక్ అవ్వకుండా నిలబడేట్టు చేసే శక్తి కాంప్రమైజ్ కు ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రాబ్లెమ్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉంటే ప్రోబ్లేమ్స్ ను సులువుగానే ఒక కొలిక్కి తీసుకురావచ్చు.  లోపాలు ఎత్తిచూపద్దు! లోపమనేది చాలా సహజం. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు లోపాలు ఉన్నవాళ్లు బోలెడు. లోపం అనేది స్వీయతప్పితం కానే కాదు. అలాగని దాన్ని అదేపనిగా ఎవరూ భరించాలని అనుకోరు. కాబట్టి మానసికంగా, శారీరకంగా ఏదైనా లోపం ఉంటే  కోపంలో ఉన్నప్పుడో, వేరే పనుల అసహనంతో ఉన్నప్పుడో, వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడో లైఫ్ పార్టనర్ మీద లోపాన్ని ఎట్టి చూపుతూ మాట్లాడకూడదు. అది చాలా పెద్ద బాధాకరమైన విషయంగా మారుతుంది. ఎక్స్ప్రెస్ చేయడంలో తగ్గద్దు! ప్రేమ, ఇష్టం అనేది కామన్. నిజానికి పెళ్లికి ముందు, పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు కాలం గడిచేకొద్దీ ఉండదు. 90% జీవితాల్లో ఇలాగే ఉంటుంది. అయితే మనసులో ఇష్టం, ప్రేమ కలిగినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎలాంటి సంకోచం అక్కర్లేదు. అది కేవలం రొమాన్స్ ఫీలింగ్ వస్తేనే కాదు, ఏదైనా మంచి పని చేసినప్పుడో ప్రాబ్లెమ్ సాల్వ్ చేసే ఐడియా ఇచ్చినప్పుడో, గుర్తుపెట్టుకొని నచ్చిన పని, నచ్చిన వస్తువు, నచ్చిన ఫుడ్, నచ్చిన డ్రెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. నచ్చినవి ఏవైనా తెచ్చినప్పుడు ప్రెసెంట్ చేసినప్పుడు, ప్రేమను, అనురాగాన్ని  వ్యక్తం చేయడంతో తగ్గొద్దు. అలాగే ప్రోబ్లేమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలి. ఇలా ఇవన్నీ ఫాలో అయితే రిలేషన్ బ్రేకప్ అనేది ఉందనే ఉండదు.                                ◆వెంకటేష్ పువ్వాడ.
   ధనం మూలం ఇదం జగత్.. అని ఓ గొప్ప మాట చెప్పారు. ఈ ప్రపంచం ధనంతోనే నడుస్తోందన్నది ఆ మాటకు అర్థం. ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఓ పాట కూడా ఉంది. డబ్బు విలువ తెలుసుకోవడం మనిషి ధర్మం అన్నది  ఆ పాట వాక్యాలలో అర్థం. ప్రస్తుతకాలంలో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న మొత్తానికే దారుణాలకు పాల్పడుతున్నవారు ఉన్నారు. డబ్బు సులువుగా సంపాదించడానికి టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు రాజ్యాల కోసం తోడబుట్టినవారిని రాజులు బలితీసుకుంటే ఇప్పటికాలంలో ఆస్తుల కోసం, పదవులకోసం రక్తం పంచుకుపుట్టిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. మొత్తానికి డబ్బు ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మనిషి చేతిలోనే రూపొందిన డబ్బు మనిషినే శాసించడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అందుకే మనిషి డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో మనిషి ఎలా ఉండాలో  నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డబ్బు అవసరం.. ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. చేతిలో రూపాయి లేకుండా ఎక్కడా బ్రతకలేడు నేటికాలం మనిషి. కష్టపడటం, సంపాదించుకోవడం, చదువులు, జీవనం, ఆహారం,  వసతి.. ఇలా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వడం మంచిదే. మనిషి డబ్బుకు ఇచ్చే విలువ అంతా తను సంపాదించే విధానంలోనే ఉంటుందని కొందరు అంటారు. కష్టపడి సంపాదించే వాడు ఒక్క రూపాయి వృధాగా ఖర్చు చేయాలన్నా చాలా బాధపడతాడు. ఒక్క  రూపాయి ఇతరుల చేతిలో మోసపోయినా తనను తాను సంభాళించుకోలేడు.  అయితే కష్టానికి. డబ్బుకు మధ్య ఉన్న కోణాన్ని వదిలేస్తే డబ్బును  కేవలం అవసరమైన వస్తువుగా చూడటం వల్ల అది మనిషి మీద చూపించే ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే బ్రతకడం కోసం డబ్బు సంపాదించుకోవాలి అంతే కానీ డబ్బు కోసమే బ్రతకకూడదు అని అన్నారు విజ్ఞులు. ఈజీ మనీ.. ఈ కాలంలో చాలామంది కుర్రాళ్లు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కష్టపడకుండా ఇతరుల సొమ్మును సులువుగా చేజిక్కించుకోవడం, దానితో జల్సా జీవితాలు గడపడం ఎక్కువైపోయింది. కానీ ఇలాంటి మార్గాలలో వచ్చే సొమ్ము దీర్ఘకాలం జీవితాలను నిలబెట్టదనే విషయం తెలుసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినా వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ వారిని ఏమీ అనకుండా నిమ్మకు నీరెత్తినట్టు  ఉంటారు. ఇలాంటి వారు చేజేతులా తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని గ్రహించాలి. ప్రాధాన్యత.. డబ్బుకు గుణం అంటూ ఏమీ లేదు. దాన్ని మనిషి ఎలా   ఉపయోగిస్తే అది దానికి అనుగుణమైన ఫలితాలను మనిషికి అంటిస్తుంది. మంచి, చెడు, కోపం, అసూయ, ద్వేషం.. ఇలా పాజిటివ్.. నెగిటివ్ గుణాలను డబ్బు మనిషిలో నింపుతుంది. అందుకే డబ్బును తటస్థ వస్తువుగా చూడాలి. దాన్ని  ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి తప్ప డబ్బే పరమావధిగా  ఎప్పుడూ బ్రతకకూడదు. డబ్బు మనిషికి అవసరమైనదే అయినా దానికోసం అస్తమానూ ఆరాటపడే మనిషికి జీవితంలో సుఖం అనేది ఎప్పటికీ దక్కదు. అందుకే డబ్బును దానిలాగే చూడాలి. మనుషులతో కంపేర్ చేయకూడదు.                                                                              నిశ్శబ్ద.         
మనిషిని భయం అనే మాట చాలా ప్రభావితం చేస్తుంది. బాగా గమనిస్తే, మన భయాలన్నిటికీ ఏదో ఒక రకంగా అజ్ఞానం కారణం అని అర్థమవుతుంది. మనకు తెలియని విషయం మనల్ని భయపెడుతుంది. తెలిసిన విషయం గురించి బాధనే లేదు. ఉదయం పూట హాయిగా స్వేచ్ఛగా తిరిగిన దారుల్లోనే, రాత్రి దీపం వెలుతురు లేకుండా తిరగాలంటే ఎంతవారికైనా గుండెలు అదురుతాయి. మన ఇళ్ళల్లోనే, చీకటి గది భయం కలిగిస్తుంది. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే, అజ్ఞానం భయం కలిగిస్తుంది. జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. చీకట్లో తాడును చూసి పాము అని భ్రమ పడతాం, భయపడతాం, చెమటలు కక్కేస్తాం. కానీ వెలుతురు వేసి చూస్తే అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అంత వరకూ మనం అనుభవించిన భయం మటుమాయం అవుతుంది. కాబట్టి మనకు కలిగే చిన్నచిన్న భయాల స్వరూపస్వభావాలను అర్థం చేసుకుంటే, వాటిని మించటం ఎంతో సులభం అవుతుంది. భయభావన పూర్తిగా అదృశ్యం కాకున్నా, భయభావనను మనకు లాభకరంగా వాడుకొనే వీలుంటుంది. మానసికశాస్త్రవేత్తల ప్రకారం పుట్టిన పిల్లవాడికి భయాలుండవు. అతడిలో భయాలను మనమే కలిగిస్తాం. ఈ రకమైన ఆలోచనను ప్రతిపాదించటమే కాదు, వైజ్ఞానిక పరిశోధనల ద్వారా నిరూపించిన వ్యక్తి జాన్.బి. వాట్సన్. 1920లో ఈయన వైజ్ఞానికపరిశోధనలు చేసాడు. పదకొండు నెలల ఆల్బర్ట్ అనే బాలుడిపై భయంకరమైన పరిశోధనలు చేశాడు. ఆ వయసు పిల్లల్లాగే ప్రతి విషయం పట్ల భయరహితమైన కుతూహలం ప్రదర్శించేవాడు అల్బర్ట్, అటువంటి అల్బర్ట్ దగ్గరలో పెద్ద శబ్దం చేసి భయపెట్టటం ప్రారంభించాడు వాట్సన్. ఆ తరువాత అతని ఎదురుగా ఓ ఎలుకను వదిలిపెట్టేవాడు. అల్బర్ట్ ఎలుక వైపు చూసి భయపడటం ప్రారంభించాడు. ఈ ప్రయోగం ఇలాగే కొనసాగింది. ఇంకొన్నాళ్ళకి కేవలం ఎలుకను చూస్తూనే కాదు, బొచ్చు ఉన్న ప్రతి జంతువూ అతడిలో భయం కలిగించేది. కుక్క, పిల్లి, కుందేలు  ఇలా ప్రతీదీ అల్బర్ట్ ను భయపెట్టేది.  ఈ ప్రయోగం ద్వారా పిల్లలకు భయాలు పెద్దలే కలుగజేస్తారని వాట్సన్ నిరూపించాడు. బాల్యంలో పిల్లలు నిద్ర పోకపోతే, బూచి వస్తుందని బెదిరిస్తాం. ఇది వారిలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. దాంతో నిద్ర వారికొక భయకారణం అవుతుంది. అలాగే ఇచ్చింది తీసుకోకపోతే పక్క పిల్లవాడికి ఇచ్చేస్తాం, వాడొచ్చి ఎత్తుకుపోతాడు వంటి వాక్యాలతో భయపెడతాం. తాత్కాలికంగా పిల్లవాడు మనం చెప్పిన మాట విన్నా ఇటువంటి మాటలు అతడి మనసులో శాశ్వతంగా భయాలు కలిగిస్తాయి. ఎదిగిన కొద్దీ, అచేతనలోని ఈ భయాలు, తన దాన్ని ఎవరైనా ఎత్తుకు పోతారేమో, తనకు రావాల్సింది ఇతరులకి వెళ్ళిపోతుందేమోనన్న భావనలుగా రూపాంతరం చెందుతాయి. వ్యక్తిలో అభద్రతాభావాన్ని కలిగిస్తాయి. సాధారణంగా మనం కొందరిలో కొన్ని విషయాలకు వాటి స్థాయిని మించిన తీవ్రమైన స్పందనను గమనిస్తాం. పిల్లలు మట్టి ముట్టితే చాలు, చితకబాదే తల్లిదండ్రులు మనకు తెలుసు. పరిశీలిస్తే ఈ ప్రవర్తనకు కారణం, ఇప్పటి పెద్దవాళ్ళు, పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు మట్టి ముట్టినప్పుడల్లా వాళ్ళ పెద్దలు బెదిరించటం, కొట్టటం వంటివి చేసేవారని తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ కారణంగానే పిల్లలు మట్టిని తాకగానే హిస్టీరియా వచ్చినట్టు ప్రవర్తించటం చూస్తాం. ఇందుకు భిన్నంగా కొందరు పిల్లలు మట్టితో ఆడుతున్నా వారి తల్లితండ్రులు పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం బాల్యంలో వాళ్ళ తల్లిదండ్రులు, వారి పెద్దవాళ్ళ ప్రవర్తన కారణం. పిల్లలు మట్టిలో ఆడటం సహజం. అందువల్ల ఏమీ కాదు. స్నానం చేయిస్తే సరిపోతుంది. అన్న రీతిలో పెద్దలు ప్రవర్తిస్తే పిల్లల్లో కూడా మట్టిలో ఆడటం తప్పు అన్న భావన కలగదు. ఇలా భయం అనేది ఏదైనా ఎవరిలో అయినా ఉందంటే దానికి కారణం దాన్ని కల్పించుకోవడమే.                                        ◆నిశ్శబ్ద.
తియ్యగా ఉండే సపోటా పండును తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటలో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి చూద్దాం. మలబద్ధకం నుండి ఉపశమనం: సపోటా పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా పేగు భాగాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.పేగు భాగంలో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మీకు సులభంగా ప్రేగు కదలికను కలిగి ఉండటానికి, మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. శోథ నిరోధక లక్షణాలు: సపోటా పండ్లలో టానిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.అందువలన ఇది మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగిస్తుంది. మంట,నొప్పి నుండి ఉపశమనం కూడా సపోటా పండుతో సాధ్యమవుతుంది. చర్మం, జుట్టుకు : సపోటా పండ్ల రసం మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు జుట్టును బాగా ఎదిగేలా  చేస్తుంది. చాలా మందికి జుట్టు రాలే సమస్యను సరిచేస్తుంది. సపోటా పండులో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను, చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌పై ప్రభావం చూపుతాయి  చర్మంపై,  మరియు గీతల రూపాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తపోటు నిర్వహణ: సపోటా పండులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. అదనంగా, ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం మనల్ని మన సొంతం చేస్తుంది. క్యాన్సర్ నుండి రక్షణ: సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంతే కాకుండా సపోటా పండులో విటమిన్ ఎ,  విటమిన్ బి కూడా లభిస్తాయి, ఇది మన చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.  ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు: ఇందులో కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే సపోటా పండులో ఉండే ఈ మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తాయి.  
  ఇటీవలి కాలంలో ఆర్గానిక్ ఆహార పదార్థాలకు మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అసలు ఆర్గానిక్ ఫుడ్ కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ.. ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటీ..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=lsQH29XE2iI  
జూన్ లో ప్రపంచ పాల దినోత్డవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం మీకోసం .ఒంటె పాలు రోజుకి ఒక్కసారి తాగిచూడండి.రోజూ తాగితే మీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.ఆరోగ్యానికి పాలు చాలా లాభదాయకం మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉండచ్చు.పల వల్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని. రోజూమీఆహారం లో పాలు చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.మీకు,ఆవు,గేదె,మేక,గాడిద పాల గురించి మాత్రమే తెలుసు.వీటిగురించి మీరు వినే ఉంటారు.కాని మీరు ఒంటె పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నారా. మీరు విని ఉండనట్లై తే మీకు చెప్పల్సిదే.ఒంటె పాలు చాలా రకాల రోగాలను నివారించడం లో లాభదాయకం గా ఉంటుంది.శరీరం లో రోగనిరోదక శక్తి పెంచే మెదడుచురుకుగా పనిచేయాలంటే ఒంటె పాల లాభాల గురించి తెలుసుకుందాం. సంక్రమణం నుండి రక్షణ... ఒంటె పాలలో విటమిన్లు ఖనిజ లవణాలు,పుష్కలంగా ఉంటాయి.ఇందులో యాంటీ బాడీలు ఉంటాయి.వైరస్ సంక్రమించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది.గ్యాస్టిక్,క్యాన్సర్,వంటి సమస్యను నిలువరించేందుకు సహాయ పడుతుంది. ఎముకలు గట్టిపడతాయి... ఒంటె పాలలో కాల్షియం అధిక సంఖ్యలో ఉండడం గమనించవచ్చు.ఎముకల ను పరిచే పని చేస్తుంది.ఒంటె పాలలో ఫ్యాక్టో ఫెలిన్ అనే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.క్యాన్సర్ తో పోరాడే శక్తి మనకు లభిస్తుంది.ఒంటె పాలు రక్తం లో ఉన్న టాక్సిన్ ను బయటికి పంపిస్తుంది.లివర్ ను శుభ్రం చేస్తుంది.ఒకవేళ పొట్టకు సంబందించిన సమస్యలతో బాధ పడుతుంటే ఒంటె పాలు లాభ దాయకమని అంటున్నారు నిపుణులు. డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు వరం... డయాబెటిస్ రోగులకు ఒంటె పాలు రామబాణం లా పనిచేస్తుందని.ఒకలీటరు ఒంటె పాలు 82 యూనిట్ల ఇన్సులిన్ తో సమానం.అది మధు మెహ రోగులకు లాభదాయకం కాగలదని నిపుణులు భావిస్తున్నారు. మెదసును చురుకుగా ఉంచుతుంది... ఎవరైతే పిల్లలు నియమిత పద్దతిలో ఒంటె పాలు సేవిస్తారో.వారి మెదడు ఇతర పిల్లల కన్నా అన్నిరకాలుగా చురుకుగా బలంగా ఉంటుంది.ఒంటె పాలు తాగిన వాళ్ళలో పోషక ఆహారం ఉన్న వారు బయట పడతారు. పచెంద్రియాలకు లాభం... ఒంటె పాలు తీయడం చాలా కష్టం.ఒంటె పాలాలో కాల్షియం ప్రోటీన్ తో పాటు, కార్బోహైడ్రేడ్స్, చక్కర,పీచుపదార్ధం,ఐరన్,మెగ్నీషియం,విటమిన్ సి,లాక్తర్,ఆమ్లం,సోడియం,పాస్ఫరస్,పొటాషియం,జింక్,కామ్ప్ర్,మాంగనీస్,లాంటి పోషక తత్వాలు.గ్రహించవచ్చు.          చర్మ సంబంధిత సమస్యల ను దూరం చేస్తుంది... ఒంటె పాలు రోగాలు తగ్గిస్తుంది.శరీరానికి లాభాలను చేకూరుస్తుంది.చర్మ సౌందర్యానికి,వాల్ఫా హైడ్రో క్విల్ ఆమ్లం గుర్తించ వచ్చు.అది చర్మానికి కాంతి నిస్తుంది.