LATEST NEWS
ఫార్ముల-ఈ కార్ రేసు  విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఏసీబీ కేసు విషయంలో కోర్టు నుంచి వారం రోజుల ఉపశమనం లభించిందని ఊపిరి పీల్చుకునేలోగానే  ఇదే విషయంపై ఈడీ కేసు నమోదు చేసి షాక్ ఇచ్చింది.   ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. కేటీఆర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మరో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి కేటీఆర్‌కు ఊరట లభించిన గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్‌ను నమోదు చేసింది. ఈడీ కేసు నమోదు చేయడంలో ఈ రేసు కేసు మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఏసీబీ కేసు నమోదు చేసిన క్రమంలో అరెస్ట్ నుంచి ఊరట పొందిన కేటీఆర్.. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఏసీబీ కేసులో ఊరట లభించగానే.. రేసు కేసు డొల్లఅని, అందుకే తొలి అడుగులోనే కాంగ్రెస్‌కు చుక్కెదురైందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.  అయితే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ (ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపడంతో బీఆర్ఎస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజీనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా ఈడీ పేర్కొంది.  ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్లో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్ల కాపీలు ఇవ్వాలని ఈడీ   ఏసీబీని కోరింది. నిబంధనలకు విరుద్ధంగా... విదేశీ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 30 వరకు కేటీఆర్ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. ఈ క్రమంలో, కేటీఆర్ ఈడీ కేసుపైనా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా  ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి   చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు.   పోలీసులు సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు చెప్పాయి. అంతే కాకుండా పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కి ధియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్.. సైలెంట్‌గా థియేటర్‌లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందనీ, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 13న  అల్లు అర్జున్‌ను ఉ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు14 రోజుల రిమాండ్ విధించింది.  దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే  ఓ వ్యక్తి  ప్రచారం మోజులో పడి ఓ యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.  ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే  చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందన ఏమిటననది తెలియాల్సి ఉంది. 
అధికారమే పరమావధిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మ దినోత్సం డిసెంబర్ 21. ఆయనపై పలు కేసులు, అవినీతిపరుడంటూ ఆరోపణలు రావడంతో  గత ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపించి వేశారు. ఒక్కడిగా రాజకీయాలు ప్రారంభించిన జగన్ ఒక్కడిగానే మిగిలిపోయారు. .   గెలిచిన ఎమ్మెల్యేలను  పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ధీశాలి వైఎస్ జగన్.   ప్రజా సంకల్ప యాత్రతో  అకారణంగా జనంతో మమేకమైన నేతగా పేరు మూటగట్టుకున్నారు.  యువభేరీ పేరుతో ప్రత్యేకహోదా నినాదాన్ని  మోసిన జగన్ తనకు  ముఖ్యమంత్రి హోదా రాగానే ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా  సమాధి చేశారు.  తనని తాను అవకాశ వాద నేతగా ఐడెంటిటీ ఇచ్చుకున్నారు. .  వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వండి  అని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ ఒక్క చాన్స్ చివరి చాన్స్ అవుతుందని ఆనాడు జగన్ మోహన్ ఊహించి ఉండరు.   నవ్యాంధ్రలో రెండోసారి జరిగిన ఎన్నికల్లో(2019) గెలిచి వైకాపా కు విక్టరీని అందుకున్నప్పటికీ మూడో సారి జారవిడుచుకున్నారు. తన అధర్మ, అరాచకపాలను ఎపి ప్రజలు తగిన బుద్ది చెప్పారు.  ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగా కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. వైనాట్ 175 అనే జగన్ 11 సీట్లకే పరిమితమయ్యారు. రెండు సీట్లు పెరిగి డబుల్ డిజిట్ హోదా దక్కినందుకు జగన్ లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.  వైఎస్ జగన్ డిసెంబర్ 21 (శనివారం)తో 52 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. పులివెందులలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన  వైఎస్ జగన్మోహన్​రెడ్డి.. 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. . తండ్రి చనిపోయిన సమయంలో పరామర్శించడానికి వచ్చిన నేతలకు ముఖ్యమంత్రి సీటు కట్టబెట్టాలని రికమెండ్ చేసుకున్న వారసుడు  వైఎస్ జగన్. అప్పట్లో  కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని  కడప పార్లమెంటు  అభ్యర్థిగా గెలుపొందారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ ఎంపీ కాదు . ముఖ్యమంత్రి సీటు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ సృష్టించారు. . ఈ ఇమేజి తన రాజకీయ భవిష్యత్తుకు వాడుకున్న ఊసరవెల్లి వైఎస్ జగన్ . 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టగానే  హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ డెత్ మిస్టరీ ఇంకావీడలేదు. సిఎం కుర్చీ కోసం తండ్రిని చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కడంలో ముఖ్యభూమిక వహించిన సోనియాగాంధీని ఎదిరించి మాతృసంస్థ కాంగ్రెస్​ పార్టీ నుంచి జగన్ బయటికొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వైఎస్ జగన్ అధికార దాహంతోనే కాంగ్రెస్ పార్టీని వీడారు. తండ్రి మరణవార్తతో వైఎస్ అభిమానులు గుండెపగిలి చనిపోయారు. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి  ఆ కుటుంబాలను పరామర్శించాలని స్కెచ్ వేశారు జగన్ . .ఓదార్పు యాత్ర ప్రారంభించారు.తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించిన ఆరోపణ మీద 16 నెలలు జైలు జీవితాన్ని గడిపారు. ఈ సమయంలో తల్లి, చెల్లి జగన్ కు బాసటగా ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రికాగానే వారిని పక్కనపెట్టేసారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. 18 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైకాపాలో చేరారు.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సయయంలో వైకాపా  సంక్షోభంలో చిక్కుకుంది. సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానికెత్తుకోవడంతో తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన  వైకాపా రెండు రాష్ట్రాల్లో పరాజయం చెందింది.  ఎపిలో ఒక శాతానికి పడిపోయింది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో  వైకాపా పూర్తిగా చిత్తయ్యింది మాజీ ముఖ్యమంత్రి అనే పేరు తప్ప జగన్ సాధించింది ఏమీ లేదు.అక్రమాస్తులు, అరాచకపాలన తప్ప. 
మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలానికి కారణమవుతుందా..? అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఆధారాలతో సిద్ధంగా ఉందా..!? కేటీఆర్ అరెస్ట్ అనంతరం ఎదురు కాబోయే పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందా...   అసలు కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగాలి..ఆయన ఏం తప్పు చేశారు..ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది..  ఆ వివరాలు తెలుసుకుందాం.. ఫార్ములా 1 కార్ రేస్ ఉదంతంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయని.. అప్పటికి మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ వ్యవహారంలో నిధుల గోల్మాల్ కు పాల్పడ్డారని ప్రధానంగా ఆరోపిస్తూ ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం..కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టు కూడా వార్తలు ఉన్నాయి.  ప్రతి ఉదంతంలో జరిగినట్టే  ఈ వ్యవహారంలో కూడా ప్రధాన నిందితుడుగా పేర్కొనే కేటీఆర్ తాను ఏ తప్పు చేయలేదని..ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను గురించి ప్రశ్నిస్తున్నందుకే తమపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని  ఆరోపిస్తున్నారు.  ఈ విషయంలో న్యాయపోరాటానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తన వంతుగా ఆయన ఈసరికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు నిజానికి ఫార్ములా 1 రేసు ఉదంతంలో తాను మంత్రిగా విధాన నిర్ణయం తీసుకున్నానని.. ఈ విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన నిర్డవంధ్వంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తనను అరెస్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించిన రేవంత్ ప్రభుత్వం అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు మరో కొత్త తప్పుడు ఆరోపణతో తన అరెస్టుకు రంగం సిద్ధం చేసుకుంటోందని ఆయన దుయ్యబడుతున్నారు. ఏదోలా తనను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు  ఇదిలా ఉండగా కేటీఆర్ ను అరెస్టు చేయడం అంటూ జరిగితే అల్లర్లు సృష్టించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ అభిమానులు..బిఆర్ఎస్ కార్యకర్తలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రభుత్వం కూడా అరెస్టు విషయంలో వెనకంజ వేయకుండా ముందుకు వెళ్లాలని.. ఒకవేళ అరెస్టు అనంతరం ఎటువంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా తెలంగాణ ఏసీబీకి ఈడి అధికారులు ఇప్పటికే ఒక లేఖ రాసినట్టు సమాచారం ఉంది. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలను ఎఫ్ఐఆర్ కాపీలతో సహా తమకు అందజేయాలని.. ఈ విషయంలో డబ్బు ఎంత మేరకు చేతులు మారిందో  ఆ వివరాలు కూడా తమకు చెప్పాలని ఈడి ఏసీబీని కోరింది..కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని.. ఏ క్షణానైనా అరెస్టు జరగొచ్చని తెలుస్తోంది.  కేటీఆర్ అరెస్టు విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడే అడుగు ముందుకు వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.మొన్నటికి మొన్న సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత అభాసు పాలయింది..అల్లుఅర్జున్ అరెస్టు నిజంగా అవసరమా కాదా..సంధ్య థియేటర్ ఉదంతంలో అల్లు అర్జున్ కు ఎంతవరకు బాధ్యత ఉంది.. ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసినా అది ఏ మేరకు నిలబడుతుంది.. ఇత్యాది అంశాలను కూలంకషంగా పరిశీలించకుండా...  చట్టపరమైన కొన్ని అంశాలను నిశితంగా పరిగణనలోకి తీసుకోకుండా అదేదో  కాకతాళీయ వ్యవహారం అన్నట్టు బన్నీ అరెస్టు విషయంలో దుందుడుగ్గా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరా ఒక రోజులోనే పుష్పరాజ్ కు బెయిల్ రావడంతో ఒక రకంగా చెప్పాలంటే నవ్వులు పాలైంది. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ అరెస్టు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.. ఇప్పటికే ప్రాథమిక వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి గనుక పక్కా ఆధారాలతో కేటీఆర్ అరెస్టు విషయంలో ముందడుగు వేయాలని రేవంత్ ప్రభుత్వం నిశ్చయించింది.  ఇదిలా ఉండగా కేటీఆర్ అరెస్ట్ అనగానే బిఆర్ఎస్ పార్టీలో కొందరు పనిగట్టుకొని ఒక రకమైన ప్రకారాన్ని ఇప్పటికే జనాల్లోకి వదులుతున్నారు. రాజకీయ ప్రముఖులు ఎవరు అరెస్టు అయినా వారు వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అవుతున్నారని..ఈ లెక్కన ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తద్యమనే టాక్ తెలంగాణలో ఇప్పుడు బలంగా నడుస్తోంది. వైసీపీ అధినేత జగన్ అరెస్టు అయి జైల్లో ఉండి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని..తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా జగన్ ప్రభుత్వంలో అరెస్టై విడుదలైన కొన్నాళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు కనుక ఇప్పుడు అదే సెంటిమెంట్ వచ్చే ఎన్నికల నాటికి పనిచేసి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదంతా ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అన్న సామెత చందాన లేదూ.. అన్నట్టు మరో విషయం.. ఇంతకు ముందు కవితని అరెస్టు చేసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎటువంటి యాగీ చెయ్యలేదు. చాలా కూల్ గా తీసుకున్నారు. కవితలు బెయిల్ వచ్చిందా లేదా అనే విషయం పట్ల కనీస ఆసక్తి కూడా కనబరచలేదు..తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఉండి పోయారు. మరి ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అయితే మాత్రం తెలంగాణ ప్రజలు వేరుగా రియాక్ట్ అవుతారని..అల్లర్లు.. నిరసనలు..ఆందోళనలకు తెగబడతారని ఎలా అనుకోవడం. మరి అల్లర్ల విషయంలో వినిపిస్తున్న హెచ్చరికలు ముందస్తు ప్రణాళికతో బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్నవేనా.. ప్రజలు అప్పుడొకలా ఇప్పుడొకలా రియాక్ట్ అవడం అంటూ జరిగితే మాత్రం రేవంత్ సర్కార్ పాలనపై కొంత విముఖత మొదలైందని భావించవచ్చా..అదే జరిగితే ఇదంతా దేనికి సంకేతం అనుకోవచ్చు..చూద్దాం..
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత  హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. హర్యానా రాష్రానికి ఐదు సార్లు సీఎంగా సేవలందించిన నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.  గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో చౌతాలా చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి. చౌతాలా వయసు 89 ఏళ్లు.  హర్యానా రాజకీయాల్లో చౌతాలా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు.   1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా చౌతాలా సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా చౌతాలా కొంతకాలంగా రాజకీయాల్లో ఇన్ యాక్టివ్ అయ్యారు.
ALSO ON TELUGUONE N E W S
డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో రిలీజ్‌ అయి మొదటి షోకే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న అల్లు అర్జున్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘పుష్ప2’. అతివేగంగా 500 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాగా, అతివేగంగా 1000 కోట్ల కబ్‌లో చేరిన సినిమాగా రికార్డులు క్రియేట్‌ చేసిన పుష్ప2 ఇప్పుడు భారత దేశ సినీ చరిత్రలోనే కేవలం 14 రోజుల్లో 1500 కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమా రికార్డులకెక్కింది. అంతేకాదు, ఇప్పటివరకు వివిధ ఇండస్ట్రీల్లో ఉన్న రికార్డులను క్రాస్‌ చేయడమే కాకుండా కొత్త రికార్డులను సృష్టిస్తోంది.  హిందీ మూవీ ‘స్త్రీ2’ చిత్రం లాంగ్‌ రన్‌లో కలెక్ట్‌ చేసిన మొత్తం రూ.608 కోట్లు కాగా, ఇప్పుడు దాన్ని క్రాస్‌ చేస్తూ రూ.632.5 కోట్లతో హిందీ సినిమా కలెక్షన్స్‌లో కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది పుష్ప2. అంతేకాదు, ముంబైలో రూ.200 కోట్ల నెట్‌ కలెక్ట్‌ చేసిన సినిమా ఇప్పటివరకు లేదు. ఆ ఫీట్‌ను ఈ సినిమా ఎంతో సునాయాసంగా సాధించింది. ఆ విధంగా బాలీవుడ్‌ సినిమాలకు ఒక కొత్త రికార్డును సెట్‌ చేసింది. 2024లో హయ్యస్ట్‌ గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన సినిమాగా పుష్ప2 ఓ రికార్డును సృష్టించింది.
నటరత్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ సభ్యులు మధుసూదనరాజు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు తదితరులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించి హైదరాబాద్‌లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించారు. దానితోపాటు ఎన్టీఆర్‌ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, దాన్ని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరగా హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100 అడుగుల విగ్రహం ప్రతిష్టాపనకు మరియు ఎన్టీఆర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వపరంగా స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలియజేశారు.  ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని.. ఆయన 100 అడుగుల విగ్రహం హైదరాబాద్‌లో ప్రతిష్టించాలన్న ప్రతిపాదనకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూల స్పందనకు ఎన్టీఆర్‌ అభిమానులందరూ సంతోషిస్తున్నారు. ఆయనకు ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ తరఫున ధన్యవాదాలను తెలియచేస్తున్నాము అన్నారు.
నటీటులు: ఉపేంద్ర, రీష్మా నానయ్య, సన్నీ లియోన్‌, సాధుకోకిల, జిస్సు సేన్‌గుప్తా, మురళీశర్మ, ఇంద్రజిత్‌ లంకేష్‌, రవిశంకర్‌ తదితరులు సంగీతం: బి.అజనీష్‌ లోకనాథ్‌ సినిమాటోగ్రఫీ: హెచ్‌.సి.వేణుగోపాల్‌ ఎడిటింగ్‌: విజయ్‌రాజ్‌ బి.జి. నిర్మాతలు: జి.మనోహరన్‌, శ్రీకాంత్‌ కె.పి. బ్యానర్స్‌: లహరి ఫిలింస్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ రచన, దర్శకత్వం: ఉపేంద్ర విడుదల తేదీ: 20.12.2024 సినిమా నిడివి: 132 నిమిషాలు ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా..’ అనే వ్యాకాన్ని రివర్స్‌ చేస్తే ‘సినిమాలందు ఉపేంద్ర సినిమాలు వేరయా’ అనుకునే పరిస్థితి మొదటి నుంచీ ఉంది. కన్నడలో రూపొందిన ‘ఓం’ చిత్రంతో ఉపేంద్రను తెలుగు ప్రేక్షకులు డైరెక్టర్‌గా గుర్తించారు. కన్నడలో శివరాజ్‌కుమార్‌తో రూపొందించి హిట్‌ కొట్టిన ఉపేంద్ర తెలుగులో రాజశేఖర్‌ హీరోగా ‘ఓంకారం’ పేరుతో తెరకెక్కించారు. అప్పటివరకు వచ్చిన సినిమాల తీరు వేరు, ఉపేంద్ర చేసిన ఈ సినిమా వేరు అన్నట్టుగా ఫీల్‌ అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఆ సినిమాతో ఉపేంద్రకు ప్రత్యేక అభిమానగణం మొదలైంది. ఆ తర్వాత అతని డైరెక్షన్‌లోనే కన్నడలో రూపొందిన ‘ఎ’, ‘ఉపేంద’ వంటి సినిమాలు చూసి జనం పిచ్చెక్కిపోయారు. సినిమాలు ఇలా కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా ఆ తరహాలోనే కొన్ని సినిమాలు చేశాడు ఉపేంద్ర. ఆ తరహా సినిమాలు ఉపేంద్ర తప్ప మరొకరు నిస్సందేహంగా చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అతను చేసే సినిమాలు టైటిల్‌ దగ్గర నుంచి కాన్సెప్ట్‌ వరకు అన్నీ డిఫరెంటే. అయితే ఈమధ్యకాలంలో అతని నుంచి అలాంటి సినిమాలు రాలేదు. తాజాగా ‘యుఐ ది మూవీ’ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. ఉపేంద్రలోని మ్యాడ్‌నెస్‌ని మరోసారి చూపించబోతున్నాడని ట్రైలర్‌ చూస్తేనే అందరికీ అర్థమైంది. అసలు ఈ సినిమా ఏ కాన్సెప్ట్‌లో తెరకెక్కించాడు, సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ ‘మీరు తెలివిగల వాళ్ళయితే వెంటనే థియేటర్‌ నుంచి బయటికి వెళ్లిపోండి’... సినిమా మొదలవగానే కనిపించే కార్డ్‌ ఇదే. ఆ తర్వాత ‘మూర్ఖులైతేనే ఈ సినిమాను పూర్తిగా చూడండి’, మూడో కార్డ్‌ ‘తెలివైన వాడు మూర్ఖుడుగా కనిపిస్తాడు, మూర్ఖులు తెలివైనవారిగా నటిస్తారు’... అంటూ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ముందుగానే రివీల్‌ చేశాడు. అయినా ఉపేంద్ర గతంలో చేసిన సినిమాలు ఎంత పిచ్చిగా ఉన్నా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఆ కారణంగానే థియేటర్‌ నుంచి బయటికి వెళ్ళకుండా తాము కూడా తెలివి తక్కువ వాళ్ళమే అని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేశారు ప్రేక్షకులు. సాదారణంగా ఉపేంద్ర సినిమాలు ఒక పట్టాన అర్థం కావు అంటారు. దానికి పరాకాష్టగా ‘యుఐ’ చిత్రాన్ని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వాళ్ళు అర్థం చేసుకోండి అనే విధంగానే అతని సినిమా ఉంటుంది.  అయితే ఈ సినిమాను మాత్రం ఉపేంద్ర పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి చూస్తేనే అర్థమవుతుంది అని సినిమా చూస్తే తెలుస్తుంది. రాజ్యాలు ఏలుతున్న దొంగల్ని ఒక దారిలో పెట్టేందుకు సత్య (ఉపేంద్ర) వస్తాడు. అలాగే నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కల్కి(ఉపేంద్ర) కూడా వస్తాడు. అధికారాన్ని చేజిక్కించుకొని రాక్షసంగా మారతాడు.  అసలు వీరిద్దరూ ఎవరు? ఎవరి మీద ఎవరు ఆధిపత్యాన్ని తీసుకున్నారు? చివరికి మంచి గెలిచిందా? చెడు గెలిచిందా? అనేదే కథ. అయితే ఇదమిద్దంగా ఇదీ కథ అని చెప్పలేని విధంగా ఈ సినిమా ఉంటుంది.  విశ్లేషణ... సినిమా మొదటి 15 నిమిషాలు, చివరి 15 నిమిషాలు తప్ప మిగతా సినిమా అంతా అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉంటుంది. ఏ క్యారెక్టర్‌ ఎందుకొస్తుందో అర్థం కాదు. ఇక హీరోయిన్‌ అనే క్యారెక్టర్‌ ఉండాలి కాబట్టి ఉంటుందే తప్ప ప్రాధాన్యం అనేది ఉండదు. ఇక పాటల విషయానికి వస్తే ఏదీ అర్థమయ్యేలా ఉండదు. సినిమాలో పొలిటికల్‌ సెటైర్స్‌ ఉన్నాయి. పరోక్షంగా కొన్ని పార్టీలను విమర్శించాడు. గతంలో అతని డైరెక్షన్‌లోనే వచ్చిన సూపర్‌ చిత్రంలో 50 సంవత్సరాల క్రితం ఇండియా ఇలా ఉంటుంది అని అమెరికా తరహాలో చూపించాడు. ఈ సినిమా విషయానికి వస్తే.. దానికి పూర్తి భిన్నంగా ఇండియా నాశనం అయిపోయింది అన్నట్టు చూపించాడు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజంలోని అవకతవకలను ప్రశ్నించు. అలాగే ప్రకృతిని సంరక్షించు, అది నిన్ను కాపాడుతుంది.. ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సినిమా చేశాడు. నటన పరంగా ఉపేంద్రకు మంచి మార్కులే పడతాయి. మిగతా నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉందని చెప్పొచ్చు.  ఫైనల్‌గా చెప్పాలంటే..  ఈ సినిమా చూడాలంటే మనకు రెండు, మూడు బుర్రలు ఉండాలన్నది అర్థమవుతుంది. ఉపేంద్ర సినిమాలను చూసేందుకు ఇష్టపడే వారు నిరభ్యంతరంగా థియేటర్స్‌కి వెళ్లొచ్చు. కానీ, అందులో ఎంతమందికి ఈ సినిమా అర్థమవుతుంది అనేది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.  రేటింగ్‌: 2.25/5
మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(vijay sethupathi)వెట్రిమారన్(vetri maaran)కాంబినేషన్ లో తెరకెక్కిన విడుదలై పార్ట్ 2(viduthalai part 2)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.2023 లో వచ్చిన విడుదలై పార్ట్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.  ఈ మూవీలో విజయ్ సేతుపతి అభ్యుదయ భావాలు కల్గిన 'పెరుమాళ్' అనే ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ పోషించాడు.అణగారిన వర్గాలపై కొంత మంది పెత్తందార్లు ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తు అత్యంత జుగుప్సాకరంగా కూడా చూస్తుంటారు.దీంతో వారి పక్షాన నిలబడి వాళ్ళకి సరైన న్యాయం జరగడానికి విజయ్ సేతుపతి చేసిన పోరాటం, తపన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.ఉద్యమకారులు ఎలా పుట్టుకొస్తారు.ఆ తర్వాత చర్చల పేరుతో కొంత మంది పోలీసులు వాళ్ళని ఎలా వదిస్తున్నారో కూడా చాలా క్లియర్ గా చూపించారు. విజయ్ సేతుపతి సరసన మంజు వారియర్ జత కట్టగా సూరి,గౌతమ్ వాసుదేవమీనన్,అనురాగ్ కశ్యప్, కిషోర్,ఇళవరసు,రాజీవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో పోషించగా ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్ కుమార్,రామారావులు నిర్మించారు.      
మలయాళ చిత్ర సీమలో ఎన్నోసూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపుని పొందిన నటుడు సురేష్ గోపి(suresh gopi)తెలుగులోకి  కూడా ఆయన సినిమాలు రీమేక్ అయ్యి మంచి ప్రేక్షాదరణని పొందాయి.అదే విధంగా మలయాళ ముద్దు గుమ్మఅనుపమ పరమేశ్వరన్(anupuma parameswaran)కూడా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుంది.మొన్నీ ఈ మధ్యనే టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో యదార్థ సంఘటనల ఆధారంగా'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'(janaki v/s state of kerala)అనే సినిమా తెరకెక్కింది.తనకి జరిగిన అన్యాయాన్ని జానకి  కోర్టులో ఎలా ఎదుర్కొంది అనే పాయింట్ తో కోర్టు  ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కగా,టైటిల్ రోల్ జానకి క్యారక్టర్ ని  అనుపమ పరమేశ్వరన్ పోషిస్తుంది.లాయర్ గా సురేష్ గోపి కనిపించనున్నారు.  ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఫణీంద్ర కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కగా బైజు సందోష్,మాధవ్ సురేష్ గోపి,దివ్య పిళ్లయి,అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.సేతురామన్,హుమాయున్ అలీ అహమ్మద్ సహా నిర్మాతలుగా వ్యవహరించగా రెనదివ్ ఫోటోగ్రఫిని, జిబ్రాన్ సంగీతాన్ని,ఎడిటర్ సంజిత్ మహమ్మద్ పిఆర్ఓ : మధు VR.ఫిబ్రవరిలో విడుదల చేస్తామని  మేకర్స్ తాజాగా అనౌన్స్ చెయ్యడం జరిగింది.  
Cast: Vijay Sethupathy, Soori, Manju Warrier, Bhavani Sre, Rajiv Menon, Gautham Vasudev Menon, Chetan Crew:  Cinematography by R. Velraj Editing by R. Ramar Music by Ilaiyaraaja Written & Directed by Vetrimaaran Produced by Elred Kumar, Vetrimaaran Vetrimaaran became one of the biggest and most important directors of Indian Cinema. Each one of his film has become popular and Vada Chennai, Aadukalam, Asuran have cult following too. His Vidhuthalai Part-1 became a huge blockbuster and now, Viduthalai Part-2 released on 20th December 2024. Soori became a box-office hero from being a comedian with the first part. In the second one, Makkal Selvan Vijay Sethupathy is playing most prominent leading role along with Soori. Let's discuss about the film in detail.  Plot:  Perumal(Vijay Sethupathy) starts his life as a school teacher. His ideology doesn't let him work peacefully and he starts to fight against oppressors. He marries Mahalakshmi(Manju Warrier) and then a traumatic incident involving Karuppan(Ken Karunas) shakes him completely. He meets KK(Kishore) and that leads into a violent path and becomes Makkal Padai. Now, he is caught by police after a long time and the current story continues as Perumal is looking for a solution for the local issues.  Analysis:  Vijay Sethupathy once again delivered one of his best performances. He is able to bring out his best as Perumal, handling different shades with great panache. His performance keeps the first half far more engaging as few portions feel slightly stretched. Soori is also good in his performance but his role is slightly limited from the first one. Manju Warrier and Ken Karunas leave their mark in few scenes given to them.  Vetrimaaran is one of the best storyteller and it is evident with this film, too. Even though first hour could have been more crisper but the movie finds its pace in the second half. The climax leaves a huge impact on us with the performances, mainly, Vijay Sethupathy's performance. Vetrimaaran finds a way to establish the problem and find a different solution as well.  Even performances from Gautham Vasudev Menon, Rajiv Menon and Chetan keep haunting us throughout the film. Ilaiyaraaja's impressive score and melodies keep the impact intact. Still, the preachiness in dialogues does hurt a little bit in the first half. The point that Vetrimaaran wanted to make is loud and clear. The equality that people wish to be present in the society has been a by-product of many moments and it should be nurtured and saved for all.  Never ever the solution for a problem lies in violence and that's what he conveys in an undertone. The movie is another solid movie from a master filmmaker as the technical values and production values are once again top tier. Had the dialogues been not so preachy, movie would have had much bigger impact.  In Conclusion:  Vetrimaaran and Vijay Sethupathy deliver!  Rating: 2.5/5 
పాత్రలు, గాత్రధారులు: మహేష్‌బాబు(ముఫాసా), బ్రహ్మానందం(పుంబా), అలీ(టిమోన్‌), సత్యదేవ్‌(టాకా), అయ్యప్ప పి.శర్మ(కైరోస్‌) సంగీతం: డేవ్‌మెట్జర్‌ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ ల్యాక్స్‌టన్‌ ఎడిటింగ్‌: జాయ్‌ మెక్‌మిలన్‌ నిర్మాతలు: అడెలె రొమాన్‌స్కీ, మార్క్‌ సెర్యాక్‌ బ్యానర్‌: వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ దర్శకత్వం: బ్యారీ జెన్‌కిన్స్‌ విడుదల తేదీ: 20.12.2024 సినిమా నిడివి: 118 నిమిషాలు హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ డిస్నీ సంస్థ నుంచి సినిమా వస్తోందంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో లయన్‌ కింగ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ‘ది లయన్‌ కింగ్‌’ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. అయితే అప్పుడు 2డి యానిమేషన్‌లో ఈ సినిమాను రూపొందించారు. 45 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన  ఈ సినిమా అప్పట్లోనే 980 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసింది. పాతిక సంవత్సరాల తర్వాత దాన్ని 3డి యానిమేషన్‌లో నిర్మించి అదే పేరుతో విడుదల చేశారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావడంతో నిజంగానే జంతువులతో సినిమా తీశారా అన్నంత సహజంగా ‘ది లయన్‌ కింగ్‌’ చిత్రాన్ని రూపొందించారు. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని 250 మిలియన్‌ డాలర్లతో నిర్మించగా, 1650 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. ఒక డబ్బింగ్‌ సినిమాలా కాకుండా డైరెక్ట్‌ తెలుగు సినిమా చూస్తున్నామా అనేంతగా డబ్బింగ్‌ ఆర్టిస్టులు తమ వాయిస్‌ను అందించారు. ఇప్పుడు ది లయన్‌ కింగ్‌కి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా.. ది లయన్‌ కింగ్‌’ డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ముఫాసాకి సూపర్‌స్టార్‌ మహేష్‌ వాయిస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో సత్యదేవ్‌, అయ్యప్ప పి.శర్మ, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్‌ శేషు తదితరులు తమ గాత్రాన్ని అందించారు. సీక్వెల్‌గా కాకుండా ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది, ది లయన్‌ కింగ్‌ స్థాయిలో ‘ముఫాసా’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ :  ముఫాసా ఎంతో బలమైనవాడు. ఎంతో చురుగ్గా కూడా ఉంటాడు. చిన్నతనంలోనే వరదల వల్ల తల్లిదండ్రులకు దూరమవుతాడు. మరో రాజ్యంలో అనాథగా పెరుగుతాడు. ఆ రాజ్యానికి రాజైన ఒబాసికి ముఫాసా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే అతని భార్య, కొడుకు ముఫాసాను ఆదరిస్తారు. ముఫాసా పెద్దవాడైన తర్వాత కూడా అతని మీద ఒబాసీకి అయిష్టత అలాగే ఉంటుంది. ఆ సమయంలో కొన్ని తెల్ల సింహాలు ఒబాసి భార్య మీద దాడి చేస్తాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో తెల్ల సింహాల రాజు కొడుకును ముఫాసా హతమారుస్తాడు. దీంతో ఆ రాజు ముఫాసాపై కక్షగట్టి అతనికి సంబంధించిన వారందర్నీ చంపేందుకు సిద్ధమవుతాడు. మరి తెల్ల సింహాలతో ముఫాసా పోరాటం ఎలా సాగింది, ఆ యుద్ధంలో వారిని గెలిచాడా? చివరికి తన తల్లిదండ్రుల్ని కలుసుకున్నాడా? ఈ క్రమంలో జరిగిన పరిణామాలేంటి అనేది మిగతా కథ.  విశ్లేషణ :  ఒకప్పుడు యానిమేషన్‌లో జంతువులు మాట్లాడుతుంటే బాగానే అనిపించినా అంత జీవం వున్నట్టు కనిపించేది కాదు. కానీ, 3డి యానిమేషన్‌ వచ్చిన తర్వాత డైలాగుల ఉచ్ఛారణకు తగ్గట్టుగానే ఆ జంతువుల ముఖ కవళికలు, హావ భావాలు కనిపించడం ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్నాయి. తెరపై జంతువులు మనుషుల్లాగే మాట్లాడడం, మనలా హావభావాలు పలికించడం వంటివి చూసేందుకు ఎంతో బాగుంటుంది. మనకు సినిమాల ద్వారా పరిచయం ఉన్న నటీనటులు ఆ జంతువులకు గాత్రదానం చేస్తే సినిమాకు మరింత వన్నె చేకూరుతుంది. ది లయన్‌ కింగ్‌లోగానీ, ముఫాసాలోగానీ అదే జరిగింది. ది లయన్‌ కింగ్‌లో జగపతిబాబు, నాని, బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్‌ శేషు, రవిశంకర్‌ వంటి వారు తమ గాత్రదానంతో ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ను తీసుకురాగలిగారు. ఇప్పుడు ముఫాసా చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం మహేష్‌బాబు వాయిస్‌ ఇవ్వబోతున్నాడనే వార్త వచ్చిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మహేష్‌ కోసం సినిమాకి వెళ్లిన ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని పొందుతారు. ముఫాసా క్యారెక్టర్‌కు మహేష్‌ ఎంతో శ్రద్దగా డబ్బింగ్‌ చెప్పారు. కథ, ముఫాసా పాత్ర తత్వం, భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకొని మహేష్‌ చెప్పిన డైలాగులు బాగా పండాయి. ఇక విజువల్‌గా ముఫాసా ప్రేక్షకులకు ఓ మధురానుభూతిని పంచుతుంది అనడంలో సందేహం లేదు. యానిమేటెడ్‌ సినిమా అనే ఫీల్‌ రాకుండా నిజంగా జంతువులే మాట్లాడుతున్నాయా అనే భావన ప్రేక్షకులకు కలిగించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇంతవరకు మనకు బాగానే అనిపిస్తుంది. కానీ, ది లయన్‌ కింగ్‌ తరహాలో ఓ విభిన్నమైన కథను ఆశించే ప్రేక్షకులకు మాత్రం నిరాశ కలుగుతుంది. ఎంతో రొటీన్‌గా కథ సాగుతుంది. కథ పరంగా ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంగేజ్‌ చేయలేకపోయింది. పార్ట్‌ పార్ట్‌గా సినిమా బాగున్నా.. టోటల్‌ కథ మాత్రం ఎక్సైట్‌ చెయ్యదు. ది లయన్‌ కింగ్‌లో పాటలు ఎంతో ఆకట్టుకుంటాయి. సందర్భోచితంగా కూడా ఉంటాయి. కానీ, ఈ సినిమాలోని పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ముఫాసా పాత్ర అంత స్ట్రాంగ్‌గా లేకపోయినా మహేష్‌ వాయిస్‌తో దాన్ని కవర్‌ చేసేశారు. ఎప్పటిలాగే బ్రహ్మానందం, అలీ, షేకింగ్‌ శేషు తమ డైలాగులతో నవ్వించారు. విలన్‌ పాత్రకు అయ్యప్ప పి.శర్మ డబ్బింగ్‌ బాగా చెప్పారు.  ఫైనల్‌గా చెప్పాలంటే.. సినిమాలో టెక్నికల్‌ వేల్యూస్‌కి అసలు లోటు లేదు. ఎక్కడిక్కడ విజువల్‌గా ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. అయితే కథ, కథనాల్లో పట్టు లేకపోవడం వల్ల సినిమా తేలిపోయింది. కథను పక్కన పెట్టేస్తే జంతువులు, అవి మాట్లాడే తీరు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. ఇక మహేష్‌ వాయిస్‌ పెద్ద ప్లస్‌ పాయింట్‌ కాబట్టి సినిమాను ఒకసారి చూసెయ్యచ్చు.  రేటింగ్‌: 2.25/5
సినిమా పేరు: విడుదలై 2  తారాగణం:విజయ్ సేతుపతి,సూరి,మంజువారియర్, గౌతమ్ వాసుదేవమీనన్,అనురాగ్ కశ్యప్, కిషోర్,ఇళవరసు,రాజీవ్ మీనన్ తదితరులు సంగీతం:ఇళయరాజా  సినిమాటోగ్రఫీ:ఆర్.వేళ్ రాజ్  రచన,దర్శకత్వం: వెట్రిమారన్  నిర్మాతలు:కుమార్,రామారావు  బ్యానర్స్:ఆర్ఎస్ ఇన్ఫోటైన్మేంట్,శ్రీ వేదాక్షర మూవీస్  విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2024  2023 లో సూరి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై పార్ట్ 1 ఘన విజయాన్ని  అందుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు దానికి కొనసాగింపుగా విడుదలై పార్ట్ 2 ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.పైగా మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి హీరో కావడంతో అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్(విజయ్ సేతుపతి) పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ గా వర్క్ చేస్తుంటాడు.ఆ తర్వాత కొంత కాలానికి ఒక ఫ్యాక్టరీ లో కార్మికుడుగా ఉద్యోగం చేస్తు,తనలాగే అభ్యుదయ భావాలు కలిగిన ఫ్యాక్టరీ ఓనర్ కూతురు మహాలక్ష్మి( (మంజు వారియర్) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.ఇద్దరు కలిసి అణగారిన వర్గాల తరుపున పోరాడుతూ ఉంటారు.ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు పెరుమాళ్ ని చంపాలని రహస్యంగా బంధించి చిత్ర హింసలకి గురి చేస్తుంటారు.కానీ బయట ప్రపంచానికి పెరుమాళ్ తమ వద్ద లేడని చెప్తారు.ఆ తర్వాత పెరుమాళ్ పోలీసుల నుంచి పారిపోతాడు.టీచర్ గా పని చేస్తున్న పెరుమాళ్ తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణం ఏంటి? ఒక ఫ్యాక్టరీ లో కూలీగా ఎందుకు పని చేసాడు? పోలీసులు,ప్రభుత్వం కలిసి పెరుమాళ్ ని ఎందుకు చంపాలనుకుంటుంది?పెరుమాళ్,మహాలక్ష్మి లు కలిసి చేసిన పోరాటం ఏంటి? తప్పించుకున్న పెరుమాళ్ మళ్ళీ పోలీసులకి దొరికాడా? దొరికితే ఏం చేసారు? అసలు  పెరుమాళ్ పోరాటం యొక్క లక్ష్యం ఏంటి?  ఈ సమాజానికి ఏమైనా సందేశం ఇచ్చాడా? ఈ కథలో పోలీస్ వాన్ డ్రైవర్ కుమరేశన్(సూరి) పాత్ర ఏంటనదే ఈ కథ ఎనాలసిస్ విడుదలై పార్ట్ 1 లో  పోలీస్ ట్రైనింగ్ కి వచ్చిన సూరి,పెరుమాళ్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో మొదటి భాగం ముగుస్తుంది. పార్ట్ 2 లో  పోలీసుల కస్టడీలో ఉన్న పెరుమాళ్ ని పోలీసులు చిత్ర హింసలకి గురి చెయ్యడంతో ప్రారంభమయ్యి,పెరుమాళ్ జీవితంలో గతంలో జరిగిన విషయాలన్నింటిని పార్ట్ 2 లో దర్శకుడు వెట్రి మారన్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి కథలు తమిళనాడులో తక్కువ గా వచ్చి ఉండవచ్చు.కానీ తెలుగులో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి.ఎర్రజెండా ఎలా పుట్టుకొస్తుందో,ఒక విప్లవకారుడు ఎలా పుట్టుకొస్తాడో,  కొంత మంది జమిందారీ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు,పేద వాళ్ళని ఎంత దారుణంగా హింసిస్తూ,ఎదురుతిరిగితే ఎలా హతమారుస్తున్నారో,దానికి పరిష్కారం ప్రజల్లోనే ఉందనేది అంతర్లీనంగా చెప్పడం జరిగింది.ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్  అభ్యుదయ బావాలు కలగడానికి గల కారణాలు,ఎర్రజెండా కి సంబంధించిన పార్టీ పెద్దల పరిచయం,పెరుమాళ్ ఒక ఉద్యమ నాయకుడుగా ఎదగడానికి తోడ్పడిన మనుషులు, ఆ తర్వాత ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తని వదిలేసినా ఒక జమిందారీ వంశానికి చెందిన మహాలక్షి పరిచయం,ప్రేమ,పెళ్లి ని చూపించారు.ఇంకో పక్క కస్టడీ లో ఉన్న పెరుమాల్ ని చూపిస్తూనే ఈ కథ మొత్తాన్ని పెరుమాళ్ వాయిస్ ఓవర్ లో ఫ్లాష్ బ్యాక్ గా చెప్తు ప్రేక్షకులకి ఎక్కడా  బోర్  కొట్టకుండా చేసారు. కాకపోతే మహాలక్షి,పెరుమాళ్ పాత్రల మధ్య కథ ని కొంచం లెన్త్ గా చూపించి,ఆ క్యారెక్టర్స్ మధ్య ఎంటర్ టైన్మెంట్ ని చుపించాల్సింది. ఎందుకంటే మహా లక్ష్మి జమిందారీ వంశానికి చెందిన అమ్మాయైనా కూడా ఫ్యాక్టరీ లో కార్మికురాలిగా,ఖాకి డ్రెస్ వేసుకొనే పని చేస్తుంది.కాబట్టి ఆ కోణంలో ఎంటర్ టైన్ మెంట్ ని ఫిక్స్ చేసుండాలసింది. అదే విధంగా పెరుమాళ్ ని బంధించిన పోలీసు ఉన్నతాధికారులు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా వాళ్లే మాట్లాడుకుంటు ఉంటారు.కథ ప్రకారం ముఖ్యమంత్రి క్యారక్టర్ ని కూడా చూపించి ఆయనకి కథ కి ఉన్న లింక్ కి కూడా ఇన్ వాల్వ్ చేసుండాల్సింది. ఇక సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే కథ  స్టార్టింగ్ నుంచే సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి సెకండ్ ఆఫ్ కూడా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది.పెరుమాళ్ అహింస నుంచి  హింసకి పూనుకోవడం, ఆ తర్వాత హింసని కుడా వదిలెయ్యడం లాంటివి చూపించి చివరకి ఒక నిర్ణయం తీసుకోవడంపైనే దృష్టి  కేంద్రీకరించడాన్ని చూపించారు.కాకపోతే అడవిలో పెరు మాల్ పోలీసులతో ట్రావెల్ అవుతు వాళ్ళతో చెప్పే మాటలు గాని సన్నివేశాలు గాని చాలా కొత్తగా ఉన్నాయి. నటీనటులు,సాంకేతిక నిపుణల పనితీరు: విజయ్ సేతుపతి(vijay sethupathi)యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది.పెరుమాళ్ క్యారక్టర్ కి సంబంధించిన పలు షేడ్స్ లో  తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు.మూవీ చూస్తున్నంత సేపు ప్రేక్షకులకి విజయ్ సేతుపతి కనపడకుండా కేవలం పెరుమాళ్ మాత్రమే కనపడతాడు.అంతలా ఆయన తన క్యారక్టర్ లో ఒదిగిపోయాడు.మంజు వారియర్ కూడా మహాలక్ష్మి క్యారక్టర్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో తనని తప్ప మరొకర్ని ఊహించలేం.సూరితో పాటు మిగతా క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళ ముందు మెదులుతున్న నిజమైన పాత్రల్లా నటించారు.ఇక వెట్రి మారన్(vetri maaran)దర్శకత్వ ప్రతిభ మరోసారి అర్ధమయ్యింది.ఆర్టిసుల నుంచి పర్ఫెక్ట్ నటనకి రాబట్టుకోవడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు.కరుప్పన్ క్యారక్టర్ లో చేసిన ఆర్టిస్ట్ కూడా తన పెర్ ఫార్మెన్స్ తో   థియేటర్స్ లో విజిల్స్ వేయించాడు. డైలాగ్స్ కూడా కథ కి చాలా హెల్ప్ అవ్వడంతో పాటుగా    ప్రతి ఒక్కర్ని కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.ఇళయరాజా నేపధ్య సంగీతం కూడా మూవీకి ప్లస్ అయ్యింది.పావురం అనే సాంగ్ అయితే హైలట్. కెమెరా పని తనం కూడా సూపర్బ్ గా ఉంది.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. విడుదలై 2 లాంటి సామాజిక నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో చాలానే వచ్చాయి.పైగా తెలిసిన సన్నివేశాలు కావడం కూడా మూవీకి మైనస్ గా పరిగణించవచ్చు.మూవీ అయితే మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.    రేటింగ్ 2 .5 / 5                                                                                                                                                                                                                                                                                                         అరుణాచలం
  శేఖర్ మాష్టర్ ఏ స్టెప్ వేసినా టాప్ స్టార్స్ తో వేయించినా అది సూపర్ డూపర్ హిట్ ఐపోతుంది. అంత టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ మూమెంట్స్ కి మంచి క్రేజ్ కూడా ఉంది. అతనివి చాలా హుక్ స్టెప్స్ పాపులర్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు కూడా హాజరవుతున్నారు. ఢీ షోకి జడ్జ్ గా ఆయన పని చేసాడు. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలాంటి శేఖర్ మాష్టర్ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పిక్ పెట్టారు.       అది కూడా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా మాష్టర్ తో కలిసి. ఇద్దరి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ప్రభుదేవా మాష్టర్ కలిసి చేస్తున్న ఒక వర్కింగ్ స్టైల్ ని పోస్ట్ చేసాడు శేఖర్ మాష్టర్. "మీతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 9 సంవత్సరాల క్రితం నేను మీ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ మూవీ జాక్సన్ అనే హిందీ చిత్రానికి కొరియోగ్రఫీ చేసాను ...ఇక ఇప్పుడు మీ రాబోయే మరో చిత్రానికి కొరియోగ్రఫీ చేయడం చూస్తుంటే మరో సారి నా కల నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చింది మాష్టర్. నా చిన్నప్పటి నుంచి మీరే నాకు ఇన్స్పిరేషన్.  మున్ముందు మీరు భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను" అంటూ పోస్ట్ చేసాడు ... కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్ శేఖర్ మాష్టర్ గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా ఉంటూ సాధారణ స్థాయి నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వచ్చాడు. కొందరికైతే ఆయన ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. తమ సినిమాల్లో శేఖర్ మాష్టర్  ఉండాల్సిందేనని పట్టుబట్టి మరి అవకాశాలు ఇస్తుంటారు స్టార్స్. బుల్లితెరపైనా డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తూనే స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. అలా అటు సిల్వర్ స్క్రీన్, ఇటు స్మాల్ స్క్రీన్ మీద ఆయన తన టాలెంట్ ని చూపిస్తూ వస్తున్నారు.
  Cast: Upendra, Reeshma Nanaiah, Sadhu Kokila, Ravi Shankar, Achyuth Kumar  Crew:  Cinematography by H.C. Venugopal  Edited by Vijay Raj B. G. Music by Ajaneesh Loknath  Written - Directed by Upendra  Produced by G. Manoharan, Sreekanth K. P. Upendra is one of the biggest stars of Kannada Cinema who has enormous popularity in Telugu, Tamil languages as well. His films created sensation in different languages from original Kannada and hence, people to wait for his directorials with a bated breathe. After a decade, his directorial UI The Movie released on 20th December and let's discuss about it in depth.  Plot:  Satya(Upendra) is prophecised to bring Satya Yugam back by eliminating Kali Yugam. But his alter-ego Kalki(Upendra), an evil twin, wants to be a dictator by ruining the people who ruined mother nature. He uses all sorts of sins to lure them to his side and a huge political leader Vamana Rao(Ravi Shankar), who started out as a pick-pocketer, becomes his aid. Why? How does this psychological battle between Satya and Kalki turn out? Watch the movie to know more.  Analysis:  Upendra has never been a normal storyteller and director. His way of narrating something prominent has always been different and innovative. Once again, Upendra did the same by starting his movie with post release reactions and then continuing with his story.  He transfers us into his brain to understand the story and his thoughts behind it. The set-up is clever in telling us that one needs to try to understand what his ideology behind the story and intentions are. His performance and visuals, technical values, production values everything are top notch.  But the execution and eccentricity behind the thoughts and scenes are so raw that it tests patience of majority. The thought behind showcasing how purity of soul gets corrupt by people and how manipulative ways implemented by "uneducated pretentious leaders" gets into focus is all great yet execution is too weird.  Upendra is in no mood to tell you a story in simplistic terms and ways. He wants you to travel with him at his level and that's the issue with this film. Ajaneesh Loknath's BGM works, performances are good, visuals are stunning yet film is hard to digest.  In Conclusion:  Only for those who have patience to dvelve into Upendra's thought process.  Rating: 2.25/5
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  చలికాలంలో  తరచుగా ఆహారం మార్చుకుంటాం. ఈ సీజన్‌లో కొన్ని ఆహారాలు తినమని సలహా ఇస్తారు, కొన్ని తినవద్దని చెబుతారు. వీటిలో అరటిపండు ఒకటి. చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు.  మరికొందరు అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, తింటే పర్లేదు అనుకుంటారు. చలికాలంలో అరటిపండు తినడం ఎంతవరకు సరైనదో, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏమిటో తెలుసుకుంటే.. అరటిపండు తినడం వల్ల చాలా మందికి శ్లేష్మం పెరగడం వల్ల జలుబు, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది.  రొమ్ము భాగం అంతా చాలా భారంగా ఉంటుంది.   అరటిపండు చాలా తియ్యగా ఉంటుంది.  ఇది కాస్త పచ్చిగా ఉన్నప్పుడు పర్లేదు కానీ బాగా పండేకొద్దీ ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  దీని కారణంగా అరటిపండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అరటి పండ్లను ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు . అరటి పండ్లు కాస్త దోరమాగనప్పటి కంటే పండే కొద్దీ  చాలా తియ్యగా మారుతుంది.  ఈ కారణంగా ఇందులో చక్కెరల శాతం ఎక్కువగా ఉంటుంది.  సాధారణ వ్యక్తులు దీన్ని రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.  ఇక డయాబెటిక్ రోగులు అరటిపండును పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అరటి పండు ఎప్పుడు తినకూడదంటే.. జలుబు, దగ్గు... మీకు జలుబు, దగ్గు లేదా జలుబు ఉంటే, మీరు అరటిపండు తినకుండా ఉండాలి, ఎందుకంటే కొంతమంది దాని వల్ల శ్లేష్మం పెరుగుతుందని ఫిర్యాదు చేయవచ్చు. రాత్రి.. రాత్రిపూట అరటిపండు తినడం మానుకోవాలి, ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి బరువును పెంచుతాయి. ఎన్ని అరటి పండ్లు తినవచ్చు.. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినవచ్చు. అయితే బరువు తగ్గాలనుకుంటే ఎక్కువ అరటిపండ్లను తినకూడదు. చలికాలంలో అరటిపండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమందికి ఇది అలెర్జీ కావచ్చు. కాబట్టి, అరటిపండు తినే ముందు శరీర పరిస్థితిని బట్టి తినాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.  
నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ.
  సీజన్ ఏదైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.  అయితే సీజన్ కు తగ్గట్టు జీవనశైలి,  ఆహార వేళలు,  శారీరక చురుకుదనం మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో చాలామంది జీవనశైలి చాలా బద్దకంగా మారుతుంది.  దీని వల్ల బరువు పెరిగి గుండ్రాయిలా మారిపోతారని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.  ఇంతకీ చలికాలంలో చాలామంది చేసే తప్పులేంటో తెలుసుకుంటే.. చలికాలంలో శారీరక శ్రమ తగ్గిపోతుంది.  ఉదయం ఎంత సేపైనా చలి తగ్గదు.. సాయంత్రం చాలా తొందరగా చలి వచ్చేస్తుంది.  ఈ కారణాల వల్ల ఇంటి పనులు,  ఉద్యోగం చేసుకోవడంతో రోజును గడిపేస్తుంటారు.  పైగా చలి కారణంగా తొందరగా తెల్లవారదు,  సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది.  దీని వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో చలి నుండి ఉపశమనం కోసం వేడివేడిగా పకోడాలు,  సమోసాలు, మిర్చి బజ్జీలు బేకరీ ఆహారాలు ఎడాపెడా తింటారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.  వీటిని ఎక్కువ తినడం వల్ల  బరువు పెరుగుతారు. చలికాలంలో చలి కారణంగా తొందరగా నిద్ర లేవరు.  దీని వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది.  ఎక్కువ సేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. దీని వల్ల బద్దకం పెరుగుతుంది. సాధారణ సమయంలో 7,8 గంటలు నిద్రపోతే చలికాలంలో 10 గంటల వరకు నిద్రపోయే వారు ఉంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. చలి కారణంగా చల్లని వాతావరణంలో నీరు తాగడం మరచిపోతుంటారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చలికాలంలో శరీరంలో హార్మోన్ల మార్పులు  ఏర్పడతాయి.  దీని కారణంగా జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు.. చలికాలంలో సీజనల్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువగా తినేస్తారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.                            *రూపశ్రీ.