LATEST NEWS
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సంక్రాంతి తరువాత వెలువడే అవకాశం ఉంది.   మొత్తం  మూడు విడతల్లో  ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే  జరగనున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా  12,815 గ్రామ పంచాయతీలు, 1.14లక్షల వార్డు సభ్యుల స్థానాలకు వచ్చే ఏడాది ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు  కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకుని పంచాయతీ ఎన్నికలలో జయకేతనం ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో  కాంగ్రెస్ సర్కార్ ఉంది.   ఇప్పటికే  పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం ఈ ఎన్నికల్లో  సత్తా చాటేందుకు భారీ ప్రణాళిక రూపిందించింది.    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించి పూర్తి నివేదిక అందింది.  ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు సమాయత్తమౌతోంది.   ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచు ల పదవీ కాలం ముగియగా, జూలై 3వ తేదీన ఎం పిటిసి, జడ్పిటిసి సభ్యుల పదవీ కాలం ముగిసిం ది. దీంతో అప్పటి నుంచీ స్థానిక ప్రజాప్రతి నిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో ఎన్నికల కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేప డుతోంది.  జనవరి 14వ తేదీన ఎన్నికల షెడ్యూల ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలానికి కనీసం ఐదు ఎంపిటిసి స్థానాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 
రేవంత్ స‌ర్కార్, టాలీవుడ్ మ‌ధ్య త‌లెత్తిన వివాదం తెలంగాణ రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా హీటెక్కించింది.  పుష్ప-2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ వ‌ద్ద‌ తొక్కిస‌లాట చోటుచేసుకుని మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు కోమాలో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో సినీ న‌టుడు అల్లు అర్జున్‌, థియేట‌ర్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌రువాత అల్లు అర్జున్ అరెస్టు కావ‌టం, బెయిల్ పై జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌టం చకచకా జరిగిపోయాయి. అయితే, వివాదం స‌ర్దుమ‌ణిగింద‌ని అంతా భావిస్తున్న దశలో  థియేట‌ర్ వ‌ద్ద తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వెంట‌నే అల్లు అర్జున్ మీడియా స‌మావేశం పెట్టి రేవంత్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో రేవంత్ స‌ర్కార్‌, సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య ఎవ‌రూ పూడ్చ‌లేని గ్యాప్‌ ఏర్ప‌డిందని అంతా భావించారు. కానీ  రెండుమూడు రోజుల‌కే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రంగంలోకి దిగి రేవంత్ ను రీచ్ అయ్యారు.  దీంతో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్ర‌ముఖులు కొంద‌రు భేటీ  అయ్యారు. ప్ర‌భుత్వం, ఇండ‌స్ట్రీకి మ‌ధ్య వివాదం స‌మ‌సిపో యిందనిపించారు. అయితే, గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలోనూ సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం అన్న‌ట్లుగా వివాదం కొన‌సాగింది. జ‌గ‌న్ త‌న మొండి వైఖ‌రితో వివాదాన్ని పెంచుకోగా.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం త‌న చాకచక్యంతో వివాదాన్ని ముగించడమే కాకుండా పై చేయి సైతం సాధించారు. రేవంత్ తీరును గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు సినీ పెద్ద‌ల ప‌ట్ల జ‌గ‌న్ అప్పట్లో అవ‌లంబించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉన్న స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీని చుల‌క‌న‌గా చూశార‌న్న‌ వాద‌న ఉంది. సినిమా రేట్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వ‌ర్సెస్ సినిమా ఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా కొద్ది రోజులు వివాదం కొన‌సాగింది. ఈ క్ర‌మంలో  మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మ‌హేశ్‌బాబు, ప్ర‌భాష్‌, రాజ‌మౌళి త‌దిత‌రులు సీఎం జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వారి ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఏవైనా.. ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్య‌క్తి వెళితే ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించేది. కానీ, జ‌గ‌న్ మాత్రం చిరంజీవి, ఇత‌ర హీరోల వాహ‌నాల‌ను లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో వారు కార్ల‌ను గేటు బ‌య‌టే వ‌దిలేసి జ‌గ‌న్ ను క‌లిసేందుకు న‌డుచుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. దీనికితోడు జ‌గ‌న్ తో స‌మావేశం అయిన స‌మ‌యంలో మీరేంటి హీరోలు.. నేను అస‌లైన హీరో అన్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న క‌నిపించింది. ఈ క్ర‌మంలో చిరంజీవి చేతులు జోడించి సినిమా ఇండ‌స్ట్రీకి మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాలంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌కు రావ‌టంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ తీరుప‌ట్ల‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  చిరంజీవి ప‌ట్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మెజార్టీ ప్ర‌జ‌లుసైతం సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలిని త‌ప్పుబ‌ట్టారు. దీనికితోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు సినీ ఇండ‌స్ట్రీపై నోరుపారేసుకున్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఘోరం ఓట‌మికి ఈ ఘ‌ట‌న కూడా కార‌ణ‌మైంద‌ని చెప్పొచ్చు. తెలంగాణలో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత మెగాస్టార్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున, ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. అయితే, హైద‌రాబాద్ లో చెరువులను ఆక్ర‌మించి నిర్మించిన క‌ట్ట‌డాల‌ను ప్ర‌భుత్వం కూల్చివేత‌ల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో హీరో నాగార్జున‌కు సంబంధించిన ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. ఆ స‌మ‌యంలో సినీ ఇండ‌స్ట్రీ నుంచి రేవంత్ రెడ్డిపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. కొద్దిరోజుల త‌రువాత కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల వ్య‌వ‌హారాన్ని మంత్రి కొండా సురేఖ ప్ర‌స్తావించారు. దీంతో అక్కినేని కుటుంబంతోపాటు సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈక్ర‌మంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారింది. తాజాగా పుష్ప‌-2 సినిమా బెనిఫిట్ షో సంద‌ర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో రేవంతి అనే మ‌హిళ మృతిచెంద‌గా.. ఆమె కుమారుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘట‌న‌కు సంబంధించి అల్లు అర్జున్ స‌హా ప‌లువురిపై కేసు న‌మోదైంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైల‌ుకు పంపించారు. అదే స‌మ‌యంలో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుద‌లై అల్లు అర్జున్ త‌న నివాసానికి వెళ్లిన త‌రువాత సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించారు. దీంతో రేవంత్ స‌ర్కార్ వ‌ర్సెస్ సినీఇండ‌స్ట్రీ అన్న‌ట్లుగా వివాదం మారింది.  ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సినీఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు ఆస్ప‌త్రిలో ప్రాణాపాయ‌స్థితిలో చికిత్స పొందుతుంటే అత‌న్ని చూసేందుకు వెళ్ల‌ని సినీ ప్ర‌ముఖులు జైలుకు వెళ్లివ‌చ్చిన అల్లు అర్జున్ ను ప‌రామ‌ర్శించ‌టం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక‌గా త‌ప్పుబ‌ట్టారు. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు ఉండ‌వ్‌, టికెట్లు పెంపు ఉండ‌ద‌ని ఖ‌రాఖండీగా చెప్పేశారు. దీంతో సినీ పెద్ద‌ల రంగంలోకిదిగి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న‌ సినీ ప్ర‌ముఖుల ప‌ట్ల‌ రేవంత్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వంగా న‌డుచుకున్నారు. హీరో నాగార్జున‌, వెంక‌టేశ్ తో రేవంత్‌ ఆప్యాయంగా మాట్లాడారు. త‌ద్వారా  ప్ర‌భుత్వం ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల్లో  కాఠిన్యం ఉన్నా.. సినీ ఇండ‌స్ట్రీ వారి ప‌ట్ల మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఉంటామ‌ని రేవంత్ చెప్ప‌క‌నే చెప్పారు. ఈ స‌మావేశంలో సినీ పెద్ద‌ల ప్ర‌తిపాదనలను రేవంత్ ఆమోదించలేదు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు వంటి వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయితే రేవంత్ సినీ ప్రముఖులకు ఇచ్చిన మర్యాద ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. రేవంత్ తో భేటీ తరువాత ఆ భేటీకి హాజరైన వారంతా రేవంత్ ను పొగడ్తల వర్షంలో ముంచేశారు. దీంతో  గతంలో సినీ ప్రముఖులతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వచ్చింది. రేవంత్ జగన్  మధ్య తేడాను ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది. అప్పట్లో సినీ హీరోల‌ ప‌ట్ల జ‌గ‌న్  వ్యవహరించిన తీరు ఏ మాత్రం సమర్ధనీయం కాదన్న అభిప్రాయం మరో సారి వ్యక్తం అవుతోంది.  
ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో కూడా పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. మాయం అయిన బియ్యం విలువకు సమానంగా సొమ్ములు చెల్లిస్తామంటూ ఆయన న్యాయవాదులు చెప్పడంతోనే పేర్ని కుటుంబం బియ్యం మాయం చేసినట్లు అంగీకరించినట్లైందని అంటున్నారు.  అయితే ఇలా గోదాముల నుంచి బియ్యం మాయం ఒక్క పేర్ని కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు ఉన్న వైసీపీ నేతలు మరింత మంది కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచర్లలో ఉన్న గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు రాగానే బుగ్గన స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..ఆ గోడౌన్లలో కొన్ని తన బంధువులకు చెందినవి అయి ఉండొచ్చంటూ ముక్తాయించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తన బంధువుల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయమైతే తనకేం సంబంధం అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలతోనే బేతంచర్లలోని గోదాంలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఎంతగా దబాయించాలని చూసినా.. బేతంచర్ల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయనీ, అది తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంలో  బుగ్గన ఉన్నారనీ ఆయన మాటలను బట్టే అవగతమౌతోంది. బుగ్గన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా ఆయన సహకారం, మద్దతు లేకుండా బియ్యం మాయం చేయడం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు.   బేతంచర్ల గోదాముల వ్యవహారంలో  విజిలెన్స్ దర్యాప్తు ఆరంభమైంది. మాయమైన బియ్యం లెక్కలు నేడో రేపో  బయటకు రాకపోవు. ఈ భయంతోనే బుగ్గన మీడియా ముందుకు వచ్చి మరీ ఆ గోదాములతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు.  అలాగే వైసీపీకి అలవాటైన ఎదురుదాడికీ పాల్పడుతున్నారు.  అదే సమయంలో బియ్యం మాయంతో తనకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే బుగ్గనకూ అజ్ణాత వాసంలోకి వెళ్లక తప్పని పరిస్థితి త్వరలోనే ఎదురు కావచ్చునంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  
ఫార్ములా ఈ రేసు కేసులో  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది.  ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్ స్వల్ప ఊరటను పొందారు. అసలింకా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ఈ లోగానే  ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో ఈడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.  ఈ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే వీరిరువురినీ కేటీఆర్ కంటే ముందుగానే అంటే జనవరి 2, 3 తేదీలలో విచారించనుంది.  ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ప్రివెంటివ్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది.  ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.  ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు అవినీతికి సంబంధించింది. అయితే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అవినీతి జరగలేదని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించారంటూ కేసు పెట్టింది. ఏదో రూపంలో సొమ్ములు తరలించినట్లు కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఆ తరలింపుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమంగా సొమ్ములు తరలింపులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తానంటూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కన్నా ఈడీ దూకుడుగా వ్యవహరించడం కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఆందోళన కలిగించే అంశమే.  అసలు ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న తరువాత అనుమతి ఇవ్వడంతోనే ఏదో తప్పు జరిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కు ఉచ్చు బిగిసిందన్న భావన రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది. 
కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు  చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.  అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది.  ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.   ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత  ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం  ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది. అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క  జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో  ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Marco starring Unni Mukundan, who played antagonist role in NTR's Janatha Garage, in a lead role, has become a huge blockbuster in Malayalam. The bloody action entertainer with its immaculate action sequences became a rage in Kerala, upon release.  Now, the movie is releasing in Telugu on 1st January 2025, during New Years' Eve. The movie team released a thrilling and riveting action trailer that increases our curiosity and anticipation. Interestingly, KGF and Salaar fame Ravi Basrur gave music for the film.  Yukti Thareja is playing leading lady role and popular actor Kabir Duhan Singh is playing another prominent role. The movie poster released with Unni Mukundan's face covered in blood is also raising expectations over the film.  With action sequences as the main highlight, the movie is gearing up to give a thrilling action experience to everyone upon release. Haneef Adeni wrote and directed the film and Shareef Muhammad produced with a high budget. NVR films is releasing it in Telugu. 
సంక్రాంతి హీరోగా అభిమానుల చేత,ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకునే హీరోల్లో,నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ(balakrishna)ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.ఆయన నటించిన చాలా చిత్రాలు సంక్రాంతికి రిలీజయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాయి.ఆ కోవలోనే ఇప్పుడు  సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న'డాకు మహారాజ్' కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులతో పాటుప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.ప్రచార చిత్రాలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ  మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచబోతున్నారు.జనవరి 2 న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్,4 న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఒక సాంగ్ ని  రిలీజ్ చెయ్యబోతున్నారు.ఆ తర్వాత 8 న ఏపిలోని విజయవాడ లేదా మంగళగిరి లో మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరపనున్నారు. ఈ విషయాలన్నింటిని డాకు మహారాజ్(daku maharaj)ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నాగవంశీ(naga vamsi)నే స్వయంగా వెల్లడి చేసాడు.రీసెంట్ గా మూవీకి సంబంధించిన మరో విషయాన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఇరవై నిమిషాల ముందు ఒక క్రేజీ ఎపిసోడ్ ఉంటుంది.ఇది అభిమానులకి,మాస్ ఆడియెన్స్ కి ఒక రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ లా ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.డెఫినెట్ గా ఆడియెన్స్ థ్రిల్ అవుతారని చెప్పాడు.ఇప్పుడు నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలతో 'డాకు మహారాజ్' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులతో ప్రేక్షకులు రిగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్(pragya jaiswal)హీరోయిన్ గా చేస్తుండగా ఊర్వశి రౌతేలా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. హిందీ అగ్ర హీరో,ఇటీవల యానిమల్ మూవీలో విలన్ గా చేసి మెప్పించిన 'బాబీ డియోల్'(bobby deol)విలన్ గా చేస్తున్నాడు.బాబీ(bobby)దర్శకుడు కాగా సితార ఎంటర్ టైన్మెంట్ బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. తమన్(taman)సంగీత దర్శకుడు.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి శంకర్(shankar)దర్శకుడు.దీంతో గేమ్ చేంజర్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.పైగా తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.  రీసెంట్ గా చరణ్ అభిమాని 'రిప్ లెటర్' అనే టైటిల్ ని హెడ్డింగ్ గా పెట్టి  గేమ్ చేంజర్ టీం కి ఒక లెటర్ రాయడం జరిగింది.'గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా,సినిమాకి ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.మరి మీరు ఇంకా ఎలాంటి ట్రైలర్ అప్ డేట్ ఇవ్వలేదు.కనీసం అభిమానుల ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవటంలేదు.ఈ నెలాఖరుకల్లా,ట్రైలర్ అప్ డేట్ ఇవ్వకపోతే,న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని తెలియచేస్తున్నాని రాసుకొచ్చాడు.ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil raju)గాని,రామ్ చరణ్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.   ఇక గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ(Kiara Advan)హీరోయిన్ గా చేస్తుండగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.  
నాచురల్ స్టార్ నాని(nani)హీరోగా ఆర్ఆర్ఆర్(rrr)ప్రొడ్యూసర్ దానయ్య(danayya)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన మూవీ 'సరిపోదా శనివారం'(Saripodhaa Sanivaaram)అగస్ట్ 29 న రిలీజైన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ(vivek athreya)దర్శకుడు కాగా ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ గా చేసింది.వర్షాలని సైతం లెక్కచేయకుండా నాని అభిమానులు,ప్రేక్షకులు ఈ చిత్రానికి ఘన విజయాన్ని సాధించి పెట్టారు.నాని కెరీరి లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ ని కూడ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ హిందీలోకి రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(kartik aaryan)హీరోగా చెయ్యబోతున్నాడని,దీని మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇదే నిజమైతే కనుక కార్తీక్ ఆర్యన్ కెరీర్ లో ఇంకో హిట్ చేరినట్టే అనుకోవచ్చు ఎందుకంటే సరిపోదా శనివారం నూటికి నూరుపాళ్లు పర్ఫెక్ట్ యాక్షన్ సబ్జెక్టు.హిందీ ప్రేక్షకులు ఆ తరహా సబ్జెట్స్ ని ఎంతగానో ఇష్టపడతారు.మోస్ట్లీహిందీలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో కూడా యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటూ లవ్,కామెడీ,సెంటిమెంట్ దానికి అటాచ్మెంట్ గా ఉంటాయి.కాబట్టి హిందీ ప్రేక్షకులకి 'సరిపోదా శనివారం' నచ్చడం పక్కా అని భావించవచ్చు. మరి పోలీస్ ఆఫీసర్ గా విజృంభించి నటించిన ఎస్ జె సూర్య(sj surya)క్యారక్టర్ లో ఆయనే చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారో  తెలియాలి.అలాగే దానయ్య నే హిందీ లో కూడా నిర్మిస్తాడా,లేక వేరే వాళ్లా అనేది కూడా తెలియాల్సి ఉంది.కొన్ని రోజుల ఆగితే గాని మూవీకి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ గా 'చందు ఛాంపియన్' ,'భూల్ భూలయ్య 3 ' తో వరుస హిట్ లని అందుకొని ఎంటైర్ తన సినీ కెరీర్లోనే మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాడు.  
Salman Khan is one of the biggest stars of Indian Cinema. He celebrated his 59th birthday in the presence of his close friends and associates on 27th December. He looked happy in their presence and he seems to be busy with shooting of his upcoming film, Sikandar.  Over three decades, he built a huge star image with Hindi audiences calling him Bhai Jaan. He enjoyed a huge high in his career at the dawn of 2010's but then his much hyped Tubelight, proved to be an end to his illustrious run at the box office.    Ever since, he has been struggling to find the same level of success at the box office. Now, he is coming up with Sikandar in the direction of A.R. Murugadoss and he is hoping it would be his big comeback like Shah Rukh Khan's in 2023 with Pathaan and Jawan. Sikandar teaser has been postponed to Saturday from Friday.    As a mark of respect to ex-PM Manmohan Singh, who passed away on 26th December, the team took this decision to postpone the release of Sikandar teaser. The actor has decided to keep his birthday, low profile this year, from the pics. 
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(puri jagannadh)ప్రస్తుతం వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్,రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ పై పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతానికైతే తన అప్ కమింగ్ మూవీ మీద ఎలాంటి అప్ డేట్ ఇంకా రాలేదు. ఇక పూరి ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో 'పూరి మ్యూజింగ్స్' ద్వారా రకరకాల అంశాల గురించి  తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటాడు.రీసెంట్ గా 'జాకెంట్' అనే అంశం మీద ఆయన మాట్లాడుతు యుద్ధ  సమయాలతో పాటు రక రకాల ఇబ్బందులు వల్ల చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో,భార్య బిడ్డల్ని తీసుకొని వేరే ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. వీరు ఏ దేశమైతే వెళ్తారో అక్కడ ఇల్లు అనేది ఉండదు.నైజీరియా,ఇరాక్,సుడాన్,ఇండియా,చైనా,కాలిఫోర్నియా, న్యూయార్క్,ఇరాక్, ఫ్లోరిడా వంటి దేశాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రపంచంలో ఐదు శాతం జనాభాకి ఇల్లు కూడా లేదు.ఇండియాలో అయితే నాలుగు కోట్ల మంది అడుక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లంతా వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి.ఇలా వసతి సోకార్యం లేకుండా వడ దెబ్బతో పాటు తీవ్రమైన చలికి చాలా మంది చనిపోతున్నారు.   అలాంటి వారందరి కోసం 'ఏంజెలా లూనా' అనే ఒక మహిళాడిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.దాని పేరు 'జాకెంట్'.జాకెట్,టెంట్ ని కలిపి చేసిన డిజైన్ అది.దీన్ని జాకెట్ ల వేసుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు.పైగా ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులని కాపాడింది.ఇప్ప్పుడు ఆ  'జాకెంట్'.ఇండియాకి వస్తే మనం  ఏదైనా కాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవడంతో పాటుగా అడుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు.ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చాడు.  
నటీనటులు: ధర్మ, ఐశ్వర్యశర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సమీర్‌, ఎస్‌.ఎస్‌.కాంచి, భద్రం, కిర్రాక్‌ సీత, రీతు చౌదరి, ఫన్‌ బకెట్‌ రాజేశ్‌, రాజ ప్రజ్వల్‌ తదితరులు  సంగీతం: శ్రీవసంత్‌  సినిమాటోగ్రఫి: ప్రశాంత్‌ అంకిరెడ్డి  ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌  నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌  బ్యానర్‌: ఎవరెస్ట్‌ సినిమాస్‌, స్మార్ట్‌ స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌  రచన, దర్శకత్వం: కిరణ్‌ తిరుమలశెట్టి  విడుదల తేదీ: 27.12.2024 ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు టాలీవుడ్‌లో నిర్మాణం జరుపుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని యూత్‌ని టార్గెట్‌ చేస్తూ రూపొందిస్తుంటారు. లవ్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అంశాలను జోడిస్తూ కథ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అలాంటి కొన్ని సినిమాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతాయి. ఈ తరహా యూత్‌ఫుల్‌ మూవీస్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయితే డెఫినెట్‌గా పెద్ద విజయాలను అందుకుంటాయి. అలాంటి ఓ యూత్‌ఫుల్‌ మూవీ ‘డ్రింకర్‌ సాయి’. మరి ఇలాంటి యూత్‌ఫుల్‌ మూవీకి ‘డ్రింకర్‌ సాయి’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు? యూత్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఏం ఉన్నాయి? ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రేక్షకులు ఈ సినిమాకి ఎలాంటి ఫలితాన్ని అందించారు అనే విషయాల గురించి ఈ సమీక్షలో తెలుసుకుందాం. కథ : సాధారణంగా యూత్‌ సినిమాలో హీరో అల్లరి చిల్లరగా తిరుగుతున్నట్టుగా, జీవితం పట్ల అవగాహన లేకుండా చూపిస్తుంటారు. ఆ తర్వాత అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించడం, దాంతో తన లైఫ్‌ స్టైల్‌ని మార్చుకోవడం జరుగుతుంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి కంటేంటే ఉంటుంది. ధనిక కుటుంబంలో పుట్టిన సాయి(ధర్మ) స్నేహితులతో కలిసి జులాయిలా తిరుగుతుంటాడు. చెడు అలవాట్లకు బానిసవుతాడు. జీవితాన్ని జాలీగా గడిపేందుకే ఇష్టపడతాడు. ఆ సమయంలో భాగీ(ఐశ్వర్య శర్మ) పరిచయమవుతుంది. అది కూడా అనుకోకుండా జరుగుతుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టుగా వెంటనే ఆమె ప్రేమలో పడిపోతాడు సాయి. తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేస్తాడు. తనకి అతన్ని ప్రేమించడం ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నట్టు నటిస్తుంది. ఆ క్రమంలోనే ఓ సంఘటన జరుగుతుంది. అప్పుడు సాయి ప్రేమను రిజెక్ట్‌ చేస్తుంది. మొదట ప్రేమించినట్టు ఎందుకు నటించింది, ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్‌ చేసింది? సాయికి ఎదురైన సమస్య ఏమిటి? దాన్నుంచి బయటపడ్డాడా? చివరికి సాయి ప్రేమను భాగీ యాక్సెప్ట్‌ చేసిందా? అనేది మిగతా కథ.  విశ్లేషణ :  ప్రస్తుతం యూత్‌ ఎలా ఉంది, వారి అలవాట్లు, లివింగ్‌ స్టైల్‌ ఎలా ఉంది అనేది ప్రధానంగా సినిమా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఎంపిక చేసుకున్న కథలో బలం లేదు అనిపిస్తుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. అయితే హీరో, హీరోయిన్‌ల క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే వారి నుంచి చక్కని పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఒక చక్కని కథను ప్రేక్షకుల ముందు ఉంచే క్రమంలో పాటలనేవి ఎప్పుడూ అడ్డంకిగానే ఉంటాయి. కథలో మిళితమైన పాటలైతే కథా గమనం ఎప్పుడూ దెబ్బ తినదు. కథకు సంబంధం లేని పాటలు వచ్చినపుడు ఖచ్చితంగా అది బ్రేక్‌ అవుతుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే అందులోనూ కొన్ని కొత్త అంశాలను తీసుకు రావడం వల్ల ఆ లోపం స్పష్టంగా కనిపించదు. ఏది ఏమైనా తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పడంలో దర్శకుడు సఫలం అయ్యాడని చెప్పొచ్చు. నటీనటులు :  సాయి క్యారెక్టర్‌లో ధర్మ, భాగీగా ఐశ్వర్య శర్మ రాణించారు. తమకు ఇచ్చిన క్యారెక్టర్లను పూర్తిగా అర్థం చేసుకొని న్యాయం చేశారని చెప్పొచ్చు. కొత్త వారైనప్పటికీ అనుభవం ఉన్న ఆర్టిస్టుల్లాగే స్క్రీన్‌పై కనిపించారు. ధర్మ విషయానికి వస్తే నటనలోనే కాకుండా డాన్సులు చేయడంలో, ఫైట్స్‌లో, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.  ఐశ్వర్యశర్మకు తన క్యారెక్టర్‌ ద్వారా ఎమోషన్స్‌ను పండిరచే అవకాశం లభించింది. శ్రీకాంత్‌ అయ్యాంగార్‌, సమీర్‌, ఎస్‌.ఎస్‌.కాంచి, భద్రం, కిర్రాక్‌ సీత, రీతు చౌదరి తదితరులు ఫర్వాలేదు అనిపించారు.  సాంకేతిక నిపుణులు :  ఇలాంటి సినిమాకు కావాల్సిన టెక్నికల్‌ వేల్యూస్‌ బాగా కుదిరాయి. శ్రీవసంత్‌ సంగీతం బాగుంది. ప్రశాంత్‌ అంకిరెడ్డి చక్కని విజువల్స్‌తో సినిమాకి ఒక లుక్‌ తీసుకు రావడంలో తోడ్పడ్డారు. మార్తాండ్‌ కె.వెంకటేష్‌ ఎడిటింగ్‌ ఎప్పటిలాగే బాగుంది. అయితే సినిమా నిడివి కొంత ఎక్కువైందా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ట్రిమ్‌ చేయదగ్గ సీన్లు సినిమాలో ఉన్నాయి. వాటిని కట్‌ చేసి ఉంటే గ్రిప్పింగ్‌గా ఉండేది. నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ సినిమాను రిచ్‌గా నిర్మించడంలో ఎలాంటి రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టి.. తాను అనుకున్న పాయింట్‌ను ఆడియన్స్‌కి కనెక్ట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు.  ఫైనల్‌గా చెప్పాలంటే.. : హీరో క్యారెక్టర్‌ చెడు సావాసాలతో, దురలవాట్లతో జులాయిగా తిరిగేదే అయినా ఓ అమ్మాయి ప్రేమవల్ల వాటిని పక్కనపెట్టి గుడ్‌ బాయ్‌గా ఎలా మారాడు అనే పాయింట్‌ను చూపించిన విధానం బాగుంది. ఈ క్రమంలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ సినిమాలు, పాన్‌ ఇండియా మూవీస్‌తో బోర్‌ ఫీల్‌ అవుతున్న యూత్‌కి ఈ సినిమా ఒక రిలీఫ్‌ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  రేటింగ్‌: 2.75/5
భారతీయ సినీ ప్రపంచంలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.1970 లో మొదలైన ఆయన సినీప్రస్థానం నేటికీ కొనసాగుతు ఉందంటే అమితాబ్ కట్ అవుట్ కి ఉన్న స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎంతో మంది హీరోలకి ఇన్సిపిరేషన్ గా కూడా నిలిచాడు. ఈ విషయాన్నే ఆయా హీరోలు చాలా ఇంటర్వూస్ లో చెప్పారు.రీసెంట్ గా కల్కి 2898 ad,వేట్టయ్యన్ లో  నటించి తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' ప్రోగ్రాం సీజన్ 16 టెలికాస్ట్ అవుతుంది.అందులో కోల్ కతా కి సంబంధించిన ఒక గృహిణి కంటెస్ట్ గా వచ్చింది.అందులో ఆమె అమితాబ్ తో మాట్లాడుతు నాకు అల్లు అర్జున్ అన్నా, మీరన్నా చాలా ఇష్టం.నటనకి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మ్యానరిజమ్స్ ఒకేలా ఉంటాయి.ఈ షో వల్ల మిమ్మల్ని కలిసాను.ఏదో ఒక రోజు అల్లు అర్జున్(allu arjun)ని కలిస్తే నా కల నెరవేరుతుందని  చెప్పుకొచ్చింది.ఆమె మాటలకి అమితాబ్ స్పందిస్తు నేను కూడా అల్లు అర్జున్ కి వీరాభిమానిని. అతను చాలా గొప్ప ప్రతిభావంతుడు మాత్రమే కాకుండా తనకి వచ్చిన గుర్తింపులన్నిటికి అర్హుడని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత సరదాగా అల్లు అర్జున్ తో నన్ను పోల్చవద్దంటు కూడా  చెప్పుకొచ్చాడు.అంతే కాకుండా పుష్ప 2 మూవీ ఎవరైనా మిస్ అయితే వెంటనే చూడండి అని  ప్రేక్షకులకి చెప్పడం జరిగింది. ఇప్పుడు అమితాబ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అల్లుఅర్జున్ అభిమానులైతే ఆ మాటలకి ఫుల్ ఖుషి అవుతున్నారు.అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్ళినప్పుడు అమితాబ్ గారి స్ఫూర్తితోనే సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే.  
Cast: Lee Jung-jae, Wi Ha-joon, Lee Byung-hun, Im Si-wan, Kang Ha-neul, Lee Jin-wook, Park Sung-hoon, Yang Dong-geun, Jo Yu-ri, Kang Ae-shim, Lee Seo-hwan Crew:  Showrunner: Hwang Dong-hyuk Written & Directed by Hwang Dong-hyuk No: of Episodes: 07 Streaming on Netflix Available from 26th December 2024  Genre: Survival Thriller, Horror Squid Game Season 1 became a global phenomenon with the shocking twists and gory games that few billionaires created to have some fun against the lives of not so lucky humans. You feel that they are playing God and side with the characters who are trying to end it. At the same time, you see the psychological side behind the narrative and how the creators are mirroring human greed with incredible character writing. So, the biggest blockbuster series is back with Season 2 on Netflix. Let's discuss about the season 2 in detail.  Plot:  Seong Gi-hun (Lee Jung-jae) continues his search for the Games creator and he wants to get his revenge from the creators. After 3 years of his investigation, he again ends up being a part of the games with new people. He finds support in Hwang Jun-ho (Wi Ha-joon) and both of them try to create an uprising and stop the games, avenge the creator for playing with their lives. But Player 001, the creator has upper hand on them initially. Will they be able to overpower him? Will the other players under the "real purpose" and help the main characters? Watch the series to know more.  Analysis:  With a total of 456 players, the games became even more bloodier this time around. But the shock value that engaged us along with the incredible writing in the first season, is not at the same level. The games are similar but the character writing is not as strong as the first one. Maybe makers could have added new games rather than just twisting the rules. While the psychological twists and study are even more deep, the engaging value decreases drastically mid-season.  People who regularly watch Korean dramas can understand the beats and predict outcome more quickly than the first time viewers. While that could be a plus point, it actually works against this series and this season, as the first time viewers would be feeling the narrative being overstuffed forcibly. The games created a huge fan frenzy due to the characters involved as well inside the dorms. We could connect with majority of them and hence, the psychological battle along with main character helped us travel through.  But here we feel like the investigation is going nowhere. The new characters are drawn out too much and even the investigation feels to be going nowhere for long time. The makers seem to have been overwhelmed by the global success as the issues being handled and writing looked more to please the global level fan base than the persisting angle of greed vs justice.  Had they spent time on establishing connection with unknown characters from the word go and then bring in the twists with the introduction of the old characters might have helped the season 2 to flourish better. It had its moments has the climax approaches but still the writing did not feel as powerful as the first one. The performances, technical standards and production values are again good but this is an underwhelming follow-up for a great season 1.  In Conclusion:  Squid Game Season 1 shocked many but season 2 underwhelms.  Rating: 2.5/5 
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వాయిస్ ఓవర్ తో తెలుగు నాట డిసెంబర్ 20 న రిలీజైన పాన్ వరల్డ్  మూవీ 'ముఫాసా'(mufasa).నాలుగు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది లయన్ కింగ్' మూవీ కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు  మంచి ప్రేక్షకాదరణతో ముందుకు దూసుపోతుంది. రీసెంట్ గా చిత్ర బృందం 'ముఫాసా'ఇండియాలో సాధించిన మొదటి వారం కలెక్షన్స్ ని ప్రకటించింది.దేశ వ్యాప్తంగా మొత్తం 74 కోట్లు వసూలు చెయ్యగా,ఇంగ్లీష్ లో 26 .75 కోట్లు, హిందీ,తెలుగు భాషల్లో 11 .2 కోట్లు,11 .3 కోట్లుతో మొత్తం 74 కోట్లు రాబట్టింది.మాములు హీరోల స్థాయిలో 'ముఫాసా' మొదటి వారానికే రికార్డు స్థాయి కలెక్షన్ ని రాబట్టడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్య పరుస్తుంది. తాజాగా 'ముఫాసా' గురించి మహేష్ బాబు మాట్లాడుతు మనకు తెలిసిన ఇష్టపడే పాత్రకు కొత్త అంకం.'ముఫాసా' కి వాయిస్ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ క్లాసిక్ కి నేను విపరీతమైన అభిమానిని.కాబట్టి ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చాడు.ముఫాసా ని  ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్ని 200 మిలియన్ల డాలర్స్ తో నిర్మించగా బేరి జెన్కీన్స్ దర్శకత్వం వహించాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల  తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా  జ్వరం రావడం,  తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు  అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు.  కొన్నిసార్లు  ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి.  బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ  తెలియదని,  ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని  వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది.  ఈ కారణంగా  దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం,  వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇది కాకుండా ప్లాస్టిక్,  రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో  పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు.  తలనొప్పి  దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే  ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది.  అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు.  ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.   వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.   కంటిచూపు సరిగా లేకపోవడం,   ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత,  మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్  తీవ్రమైన సమస్యగా మారే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  పెద్దవారు,  స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి  సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స,  కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.   అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.                                 *రూపశ్రీ
  స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.                                     *రూపశ్రీ.  
  జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి.  ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు.  కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి.  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి.  దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ  నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు.  శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం,  కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.                                                  *రూపశ్రీ.