LATEST NEWS
తెలుగు రాష్ట్రాలలో కొత్త సినిమాలు విడుదలౌతున్నాయంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా అగ్ర హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే పండగ శోభకు కొత్త సొబగులు అద్దినట్లే ఉంటుంది. ఇక కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల ధరల పుంపు మామూలే. అయితే పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వైఖరినీ, అరెస్టై మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి జాతరలా వెళ్లిన సినీ ప్రముఖులనూ తప్పు పట్టారు. తాను సీఎంగా ఉన్నంత వరకూ బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ప్రశక్తే లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా తెలుగుసినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పుంపు లేకపోతే.. కోట్ల వ్యయంతో నిర్మించిన సినిమాల పెట్టుబడులు వెనక్కు వచ్చే అవకాశాలు మృగ్యమన్న ఆందోళన సినీ పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అయ్యింది. దీంతో తెలంగాణ సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ తరువాత కూడా రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రశక్తే లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అదే సమయంలో రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.  సరే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతించారు. దీంతో ఏపీలో కూడా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు బ్రేక్ పడినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. కానీ ఏపీ సర్కార్ తెలుగుసినీ పరిశ్రమకు ఊరట కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది.   ఈ సంక్రాంతికి విడుదలౌతున్న మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు వాటి వాటి బడ్జెట్ ను బట్టి  టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌  బడ్జెట్ దాదాపు 300 కోట్ల రూపాయలు కావడంతో ఆ సినిమాకి  మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.135, మల్టీప్లెక్స్‌ల్లో రూ.175లు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే పరిమిత సంఖ్యలో బెనిఫిట్‌ షోలకూ అనుమతించి, బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లను రూ.600లుగా నిర్ణయించింది. అదే విధంగా బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో   నిర్మించిన డాకు మహారాజ్ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి దక్కింది. సింగిల్ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.110లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ..135లు పెంపునకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అలాగే బెనిఫిట్‌ షోలకు టికెట్ రేటు 500రూపాయలుగా ఫిక్స్ చేసింది. అలాగే వెంకటేష్ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.75లు, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూడు సినిమాలకు ఏపీ ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించిందని చెప్పాలి.  మొత్తంగా కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలూ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో సంక్రాతి సినిమాలకు తెలంగాణలో తక్కువ కలెక్షన్లు, ఏపీలో అధిక కలెక్షన్లు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమకు శరాఘాతంగా మారితే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమ వర్గాలకు కొండంత ఊరట చేకూర్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద టీటీడీ నిర్మించిన  శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో   జె.శ్యామల రావు మంగళవారం (డిసెంబర్ 31) సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి  రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు.   తిరుమలలో జరుగుతున్న విధంగానే అమరావతి ఆలయంలోనూ శ్రీవారి రోజువారీ సేవలు జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.   టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఈ సందర్భంగా ఆదేశించారు. ఆలయానికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తరువాత నుంచీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పని చేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంత వరకూ నియోజకవర్గంలో తోపులం మేమే అంటూ బోర విరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే.  అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరఫున పని చేయడానికి నాయకుడూ, కార్యకర్తా కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట‌. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీ ఫేస్ గా ఫోజులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా, లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య.. ఓటమి తరువాత కనిపించడం లేదు. ఆమె అజాపజా లేదు. ఆమె మావ మురుగుడు హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నా... ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా దూకేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడినా గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగడమే కాదు.. జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంప్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారు కాదుకదా అసలా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది.  అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదర్బార్ లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికీ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 వేల మంది కొత్తగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసే సరికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి రద్దీని తట్టుకునేలా  6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిలో 557 సర్వీసు లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ సంక్రాంతికి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.  గత ఏడాది టీజీ ఆర్టీసీ సంక్రాంతి సందర్భంగా  4,484 ప్రత్యేక బస్సుల నడపాలని నిర్ణయించినప్పటికీ, ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉండటతో ఆ సంఖ్యలు  5246 బస్సులను సంస్థ నడిపింది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు   అందుబాటులో ఉంటాయి.  హైదరాబాద్ లో   ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది.  హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి కాకినాడ, కందుకూరు, అమలాపురం, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి లకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.  అలాగే ఏపీ నుంచి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేవారి కోసం కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.   రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని టీజీఆర్టీసీ తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది. 
కొత్త సంవత్సరానికి తిరుమలలో ఓ నాగుపాము స్వాగతం చెప్పింది. బుసలు కొడుతూ ఊగిపోతున్న ఆ తాచుపామును చూసి భక్తులు భయకంపితులయ్యారు. బుధవారం (జనవరి 1) ఉదయం తిరుమల  రాంబగిచా గెస్ట్ హౌస్ దగ్గర ఓ తాచుపాము హల్ చల్ చేసింది. దాదాపు ఆరు అడుగులు ఉన్న ఈ పాము బుసలు కొడుతూ ఊగిపోతుండటంతో భక్తులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో అతడు వెంటనే రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆ తాచుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం జనంలో సందడిగా ఉండే రామ్ బగీచా గెస్ట్ హౌస్ వద్ద నాగుపాము హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు.  
ALSO ON TELUGUONE N E W S
సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘‘ప్రేమచరిత్ర - కృష్ణ విజయం’’ ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దర్శకనిర్మాత మధుసూదన్‌ హవల్దార్‌ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.ఎం.శ్రీలేఖ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలో నాగబాబు, అలి వంటి పలువురు ప్రముఖులు నటించారు. యశ్వంత్‌ - సుహాసిని హీరోహీరోయిన్లు. ‘ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం’ విడుదలను పురస్కరించుకుని దర్శకనిర్మాత మధుసూదన్‌ హవల్దార్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు!! మూడే మూడు పాత్రలతో... నాగబాబు - చంద్రమోహన్‌ - బాలదిత్య నటించిన ‘వంశం’ దర్శకుడిగా నా తొలిచిత్రం. రివార్డులతోపాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిత్రమిది. ‘వంశం’ తర్వాత... తెలుగు - కన్నడ భాషల్లో రూపొందిన ‘అమెరికా - అమెరికా, నంబర్‌వన్‌ హీరో’ చిత్రాల తెలుగు వెర్షన్స్‌కు నేను దర్శకత్వం వహించాను. ఈ రెండు చిత్రాలు కూడా దర్శకుడిగా నాకు సంతృప్తిని, పేరును తెచ్చిపెట్టాయి. నా నాలుగో చిత్రం ‘ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం’. సూపర్‌ స్టార్‌ కృష్ణగారిని ఈ చిత్రం కోసం డైరెక్ట్‌ చేయడం దర్శకుడిగా నా జీవితంలో ఒక సువర్ణాధ్యాయం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ చిత్రం విడుదలలో అసాధారణ జాప్యం జరిగింది. ఆ తర్వాత కన్నడలో నేను దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా బిజీ అయిపోయాను. అయితే, కృష్ణగారు లాంటి ఒక లెజెండ్‌ నటించిన సినిమా రిలీజవ్వకుండా ఆగిపోవడం నాకు మనస్కరించలేదు. అందుకే... ఈ చిత్రానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అద్ది ఫస్ట్‌ కాపీ సిద్ధం చేశాం. బిజినెస్‌ పరంగా కూడా కొంత క్రేజ్‌ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటకతోపాటు ఇంకా అనేక చోట్ల ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. కృష్ణగారి అభిమానులంతా కచ్చితంగా చూస్తారని నా నమ్మకం!! కన్నడలో ఇప్పటివరకు నేను ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ‘‘ఆమర్మ, డిసెంబర్‌ 16, శ్రీ దాసరు, శ్రీ జగన్నాధ దాసరు, శ్రీ ప్రసన్న వెంకట దాసరు, శ్రీ విజయ దాసరు’’ అనే ఈ చిత్రాలు నాకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఓ అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. నేను స్వతహా సంగీత దర్శకుడ్ని కూడా. నా సినిమాలకు మాత్రమే కాకుండా వేరే సినిమాలకు కూడా మ్యూజిక్‌ డైరెక్షన్‌ చేస్తుంటాను. తెలుగు - కన్నడ భాషల్లో ‘‘నా కూతురు లవ్‌ స్టొరీ’’ పేరుతో ఒక భావోద్వేగ భరిత ఇంటెన్స్‌ లవ్‌ స్టొరీ తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను!!
గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రిలీజ్‌ కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. పాన్‌ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అయితే అందరూ ఎదురు చూస్తున్న ట్రైలర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చెయ్యబోతున్నారు. నూతన సంవత్సర కానుకగా జనవరి 2 సాయంత్రం గం.5.04లకు రిలీజ్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ సినిమాలోని అప్పన్న క్యారెక్టర్‌తో కూడిన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.   ఇదిలా ఉంటే.. ఈవారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రాజమండ్రిలో భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గేమ్‌ ఛేంజర్‌కి టికెట్ల రేట్లను పెంచుకునే సదుపాయంతోపాటు, బెనిఫిట్‌ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో గేమ్‌ ఛేంజర్‌ చిత్రానికి ఓపెనింగ్స్‌ ఎలా వస్తాయి, ఏ రేంజ్‌ కలెక్షన్లు సాధిస్తుంది అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్‌ పాల్గొన్న ఈ షో ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తాజాగా సీజన్‌ 4లో రామ్‌చరణ్‌ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ను డిసెంబర్‌ 31న చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చరణ్‌తోపాటు శర్వానంద్‌ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్‌ ఎంతో సందడిగా జరిగిందని ఆహా యూనిట్‌ తెలియజేస్తోంది. సరదా మాటలు, సెటైర్లు, ఆట పాటలు... ఇలా ఎంతో ఫన్నీగా ఎపిసోడ్‌ ఉంటుందని చెబుతున్నారు.  ఇదిలా ఉంటే.. షోకి సంబంధించిన విషయాల కంటే చరణ్‌ వేసుకున్న హుడీ గురించి సోషల్‌ మీడియాలో చర్చ స్టార్ట్‌ అయింది. గూగుల్‌ బాగా అందుబాటులోకి రావడంతో తమ హీరోలు ఏదైనా కొత్త డ్రెస్‌, వాచ్‌, గ్లాసెస్‌ పెట్టుకున్నప్పుడు వెంటనే దాని రేట్‌ ఎంత అనేది గూగుల్‌ చేస్తున్నారు. ఆ రేటు చూసి హీరోల అభిమానులు కాలర్‌ ఎగరేస్తుంటారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ షోలో చరణ్‌ వేసుకున్న హుడీ ధరను కూడా కనిపెట్టేసారు. దాని ధర రూ.1.35 లక్షలు. ఆఫర్‌ రేటు రూ.88,000 ఉంది. దీంతో తమ హీరో వేసుకున్న డ్రెస్‌ని, దాని రేటును వైరల్‌ చేస్తున్నారు అభిమానులు. ఇక రామ్‌చరణ్‌ కొత్త సినిమా గేమ్‌ ఛేంజర్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. 
తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌కి తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత 30 సంవత్సరాలు అజిత్‌ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులోనూ ఘనవిజయం సాధించాయి. తాజాగా అజిత్‌ చేస్తున్న విదాముయర్చి చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. అజిత్‌ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా, అర్జున్‌, రెజీనా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.  సంక్రాంతికి అజిత్‌ సినిమా వస్తోందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్‌ ప్రకటించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే ఏ డేట్‌కి రిలీజ్‌ చేస్తారనేది మాత్రం మేకర్స్‌ చెప్పలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి అజిత్‌ నటించిన గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా సంక్రాంతికి అజిత్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
నాని, అడివి శేష్‌, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్‌ 3 చిత్రం షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ జమ్ము కాశ్మీర్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కె.ఆర్‌.కృష్ణ అనే మహిళ లొకేషన్‌లోనే గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల చిత్ర యూనిట్‌ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   
వరుణ్‌రాజ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పోకిరి’. ఈ సినిమాలో మమత హీరోయిన్‌ కాగా వికాస్‌ దర్శకులు. వరుణ్‌రాజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని మొదటి పాటని విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. హీరోయిన్‌ మమత మాట్లాడుతూ ‘ఇది నా ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. డైరెక్టర్‌ వికాస్‌గారికి, వరుణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా గురించి చెప్పాలంటే యూనిటీ గుర్తొస్తుంది. ఇదొక మంచి సినిమా. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. డైరెక్టర్‌ వికాస్‌గారు మాట్లాడుతూ ‘మేము స్టోరీ లైన్‌ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్‌ అనుకున్నాం. వేరే టైటిల్స్‌ పెడదాం అనుకున్నా పోకిరినే సెట్‌ అవుతుందని ఈ టైటిల్‌ సెట్‌ చేసుకున్నాం. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్‌ తీసుకున్నాం. ఈ సినిమా బాగా హిట్‌ అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.  హీరో మరియు నిర్మాత వరుణ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాతో గట్టిగా హిట్‌ కొడతాం. ఈ సినిమా హిట్‌ అవుతుందని మాకు కాన్ఫిడెన్స్‌ ఉంది. నేను పవన్‌ కళ్యాణ్‌గారి అభిమానిని. నేను చిరంజీవిగారికి మహేష్‌బాబుగారికి కూడా అంతే అభిమానిని. ఈ సినిమా టైటిల్‌లోనే దమ్ముంది. పోకిరికి ఓనర్‌ మహేష్‌బాబుగారే. మేమంతా అభిమానులం అంతే’ అన్నారు.  మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడటం కన్నా నా మ్యూజిక్‌ మాట్లాడితే బాగుంటుంది అని ఆశిస్తున్నాను’ అన్నారు.
Well, when you list out hits and misses of the year, if you are able to find the number of hits perfectly, then the rest should be the number of flops, quite obviously. But some films does showcase some promise and have some well-known stars or popular heroes, names attached to them. We can say that such films have been misses of the year as on paper they might have had all the ingredients to succeed yet that did not translate on to the screens.  While most of the Star heroes did secure the investments of their producers, Victory Venkatesh's Saindhav and Vijay Deverakonda's The Family Star with interesting combinations could not really translate the initial interest and anticipation into collections post release.  Depressingly enough, Mass Maharaja Ravi Teja and young stars like Ram Pothineni and Varun Tej failed big time with their films. Ravi Teja seriously needs to re-invent himself at the box office as his Eagle and Mr. Bachchan did not end up profitable. Mr. Bachchan accumulated more bad name for him than any good.  Ram Pothineni's dependency on known directors did not prove to be profitable as Puri Jagannath failed big time with Double Ismart. Matka looked promising for Varun Tej but it just ended being another flop to his credit. Alarmingly, Suhas delivered more box office flops this year and it is important for such a young actor to continue finding better and different scripts.  Allari Naresh once again had a disappointing year with comedy Aa Okkati Adakku and Bachchala Malli. Kajal Aggarwal's foray into action oriented films with Satyabhama proved to be unfruitful. Films that really showcased a promise with trailers and teasers but could not deliver like Swag, Krishnamma, Bhaje Vaayu Vegam, Love Me, Zebra and Sundaram Master should be a case study for upcoming technicians to understand the flaws and better their scripts as the ideas behind the films got critical acclaim but the makers failed to make them entertaining and engaging films.  Here's the complete list of Misses and Disappointments of the year:  Saindhav Eagle Operation Valentine Matka Mr Bachchan The Family Star Gangs of Godavari Harom Hara Swag Double Ismart Ambajipeta Marriage Band Bootcut Balaraju Yatra 2 Siddharth Roy Sundaram Master Geethanjali Malli Vachindi Sriranga Neethulu Manamey     Aa Okkati Adakku     Prasanna Vadanam Krishnamma Prathinidhi 2 Love Me Bhaje Vaayu Vegam Gam Gam Ganesha Satyabhama Darling Shivam Bhaje Tiragabadara Saami Maruthi Nagar Subramanyam Bhale Unnade Janaka Aithe Ganaka Appudo Ippudo Eppudo Devaki Nandana Vasudeva Mechanic Rocky Zebra Bachchala Malli Srikakulam Sherlock Holmes   Let's hope the next year will be better for every film that promises and filmmakers let their films reach the full potential that they show on paper.   
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన హీరోలు,నిర్మాతలు,దర్శకులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని కలవడం జరిగింది. ఈ భేటీ పై భారతీయ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఏ కేటిఆర్ కొన్ని విమర్శలు చేసాడు.   ఇప్పుడు ఈ విషయంపై ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(dil raju)ఒక బహిరంగ లేఖ విడుదల చేసాడు.అందులో గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలాబాధాకరం. సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే.తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి,మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు.హైదరాబాద్ ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్నితెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది.అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని కూడా అందరిని కోరుతున్నాం.లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం,ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని తన లేఖలో పేర్కొన్నాడు.  
On the last day of 2024, we are all wondering about how to welcome the New Year 2025 but cinema lovers in every Telugu person would be wondering about listing out the hits, misses, good and disappointing films of the year from the language. A whopping total of 332 films, including direct to OTT releases, have been released in Telugu. Out of all of them, it is heart-breaking to see only 16 films have ended up being profitable to producers, theatrically and non-theatrically, excluding OTT commissioned films.  There is no standard metric to determine the success of OTT films that is universally agreed upon. Mostly, the platforms describe the viewing minutes and hours for a particular film. Mostly, there are no ground-breaking hits that became popular except for theatrical releases also becoming popular on OTT platforms upon release.  Here are Profitable, in other words. Hit Films of 2024  Top 10 grossers:  Pushpa 2 The Rule  Kalki 2898 AD  Devara Part-1 HanuMan Guntur Kaaram Tillu Square Lucky Baskhar KA Saripodhaa Sanivaaram Naa Saami Ranga Interestingly, big stars films did not end up as losses for producers - Allu Arjun, Prabhas, Mahesh Babu and Jr. NTR had their releases this year and each one of them emerged profitable for producers. More importantly, among senior star heroes, Nagarjuna Akkineni managed to use Sankranti festival for his advantage to deliver a hit with Naa Saami Ranga.  Nani's Saripodhaa Sanivaaram became one of his biggest hits while Teja Sajja and Siddhu Jonnalagadda surprised everyone with Hundred crore grossers with HanuMan and Tillu Square, respectively. Kiran Abbavaram gave a strong comeback with KA and Dulquer Salmaan surprised many with Lucky Baskhar.  Coming to other profitable ventures, low to medium budget films could impress audiences with variety. Mathu Vadalara 2 emerged as a highly popular comedy entertainer and along with Tillu Square, Pushpa 2 The Rule, it cemented the belief over a strong and established IP to be continued as a franchise among producers.  Here's the list:  Om Bheem Bush     Mathu Vadalara 2 Ooru Peru Bhairavakona Gaami Committee Kurrollu Aay 35 Let's hope the variety continues further into 2025 and offers us more than just one sort of action films. 
పవన్ కళ్యాణ్(pawan kalyan)కొడుకు అకిరానందన్(akiranandan)గురించి పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేదు.సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ తన నాన్న అభిమానులని తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటాడు.పియానో వాయించడంలో మంచి టాలెంట్ ఉన్న అకిరా ఆ పియానో ద్వారా పవన్ కి సంబంధించిన వ్యక్తిత్వం గురించి కొన్ని సాంగ్స్ కూడా చేసాడు. అకిరా ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి(కాశీ)లో అకీరా నందన్ పర్యటిస్తున్నాడు. గంగానదిపై ఒక పడవలో కూర్చుని అకిరా వెళుతున్నాడు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలోని  అకీరా లుక్స్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.పవన్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన ఓజిలో అకిరా చేస్తున్నాడనే టాక్ అయితే ఉంది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నిమ్మరసం భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం.  నిమ్మరసాన్ని వంటల్లో మాత్రమే కాకుండా రిఫ్రెషింగ్ డ్రింక్స్ లోనూ,  డిటాక్స్ డ్రింక్స్ లోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని భారతీయ సంప్రదాయ వంటల తయారీలోనూ ఉపయోగిస్తారు.  నిమ్మరసాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిమ్మరసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.   నిమ్మరసం సిట్రస్ జాతికి చెందిన పండు.  దీన్ని పండు అని పిలుస్తామే కానీ నేరుగా దీన్ని తినలేము.  చాలా పుల్లగా ఉండే నిమ్మరసాన్ని పానీయాలలోనూ,  వంటల్లోనూ పులుపు కోసం జోడించుకుంటారు.  ఇక నిమ్మకాయలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగాలి.  ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  ఇది మలబద్దకం, అజీర్ణం సమస్యలను కూడా తొలగిస్తుంది.  గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడతాయి.  శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి.  ప్రతి ఒక్కరి శరీరంలో టాక్సిన్లు ఉంటాయి.  ఇవి ఆహారం, తాగే పానీయాలు, నీరు,  వాతావరణం కారణంగా శరీరంలో చేరతాయి.  ఈ టాక్నిన్లను తొలగించుకోవాలంటే డిటాక్స్ వాటర్ తాగాలి. డిటాక్స్ వాటర్ తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది.  అందుకోసం ఉదయాన్నే నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి.  ఇలా చేయడం వల్ల శరీరంలో విష పదార్థాలు,  వ్యర్థాలు అనబడే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుందనే విషయం తెలిసిందే.  ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  రోజూ నిమ్మరసం కలిపిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే రోగనిరోధక శక్తి బలపడి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది.  నిమ్మరసంలో ఉండే సమ్మేళనాలు శరీరానికి చురుకుదనం ఇస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  శరీరంలో ఉండే అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది.  ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచి పానీయం.  నిమ్మరసం కలిపిన నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులలోనే బరువు విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. నిమ్మకాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది.  ఎలాగంటే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  రక్తపోటు ఎక్కువైన సందర్బాలలోనే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.  అందుకే నిమ్మరసాన్ని అధిక రక్తపోటు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా నిమ్మరసం మంచిది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీటిని తాగుతుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.                                        *రూపశ్రీ.  
  శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు,  ఎంజైమ్ లు, పోషకాలు, ప్రోటన్,  ఫైబర్.. వంటివన్నీ చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ శరీరం ఫిట్ గా ఉండటంలో సహాయపడతాయి.  అయితే శీతాకాలంలో సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది.  ఒక్కోసారి సూర్యుడి ఉనికి చాలా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.  శరీరానికి సూర్యుడి లేత కిరణాలు తగిలినప్పుడు శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది.  కానీ సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడినట్టు కొన్ని లక్షణాల ద్వారా చెప్పవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. అలసట.. శరీరం అలసిపోయిందని చెప్పే చాలా మంది ఎక్కువ పని చేయడం,  నిద్ర సరిగా లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి కారణాలుగా చెబుతుంటారు.  కానీ ఆహారం బాగా తీసుకుని,  శరీరానికి తగిన విశ్రాంతి లభించి, మంచి నిద్ర లభించి,  ఎక్కువ అలసట తెప్పించే పనులు చేయకపోయినా సరే.. అలసటగా అనిపిస్తుంటే అది విటమిన్-డి లోపానికి ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. కండరాల నొప్పి.. శరీరం కాల్షియం ను గ్రహించాలన్నా,  ఎముకలు దృఢంగా ఉండాలన్నా విటమిన్-డి చాలా అవసరం.  కాళ్లు,  వెన్ను,  కీళ్లు,  కాలి కండరాలు బలహీనంగా ఉండటం,  పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటే అది కూడా విటమిన్-డి లోపానికి కారణం కావచ్చు. ఎముకల నొప్పి.. ఎముకల నొప్పి, బలహీనత, ఎముకలు పెళుసుగా ఉండటం, నడుస్తున్నప్పుడ లేదా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఎముకలు శబ్దం రావడం వంటివి జరుగుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం కూడా ఉన్నట్టే అర్థం. ఎందుకంటే విటమిన్-డి ఉంటేనే శరీరంలో కాల్షియం ఏర్పడుతుంది.  విటమిన్-డి లోపిస్తే కాల్షియం కూడా ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. మూడ్.. చాలామందికి ఉన్నట్టుండి మూడ్ మారిపోతూ ఉంటుంది. చిన్న విషయాలకు చిరాకుగా,  కోపంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి విటమిన్-డి లోపం ఉండే అవకాశం ఉంటుంది. మూడ్ స్వింగ్స్ అయ్యేవారిలో విటమిన్-డి లోపం ఉంటుంది. విటమిన్-డి లోపం ఒత్తిడి హార్మోన్లు పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం.. జుట్టు పలుచగా మారుతున్నా,  జుట్టు రాలిపోతున్నా, జుట్టు విరిగిపోతున్నా.. బలహీనంగా మారుతున్నా అది విటమిన్-డి లోపానికి సంకేతమే.. రోగనిరోధక వ్యవస్థ.. శరీర రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంలో విటమిన్-డి చాలా సహాయపడుతుంది.  విటమిన్-డి లోపిస్తే తరచుగా జలుబు,  జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు లోనవుతుంటారు. గాయాలు.. సాధారణంగా శరీరం మీద ఏదైనా గాయం జరిగితే అది నయం కావడానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. కానీ గాయాలు నయం కావడానికి  నిర్ణీత  సమయం కంటే ఎక్కువ సమయం పడుతుంటే శరీరంలో విటమిన్-డి లోపం ఉన్నట్టే లెక్క.                                                          *రూపశ్రీ         
  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి,  అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు,  జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే బరువు తగ్గడం  అంత సులభం కాదని అనుకుంటారు. బరువు తగ్గడానికి జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టించడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్‌లు పాటించడం వరకు చాలా ఫాలో అవుతారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ  ప్రయోజనాలు లభించకపోతే బరువు తగ్గడానికి డైటింగ్ లేదా వ్యాయామం మాత్రమే పనికిరావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం రోజువారీ దినచర్యలో కొన్ని ప్రత్యేక మార్పులు అవసరం. ముఖ్యంగా నాలుగు పనులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చట.  ఈ నాలుగు ఫాలో అయితే బరువు తగ్గడం ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. నిద్ర.. చాలామంది  బరువు తగ్గడానికి జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఆహారం తక్కువ తీసుకోవడం వంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇలాంటివి  కొనసాగించడం సరికాదు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి,  తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.   మంచి రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. విశ్రాంతి..  వ్యాయామం చేయడం లేదా పరుగు వంటి మార్గాల  ద్వారా బరువు తగ్గుతారు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వ్యాయామం అవసరమే కానీ  దానితో పాటు కండరాలు తిరిగి రిపేర్ కావడానికి ,  అవి శక్తివంతంగా తయారవ్వడానికి  వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలి.  శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. సాధారణ వాకింగ్ లేదా యోగాతో పాటు పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి మంచి అవకాశం ఉంటుంది. కేలరీలు.. ఫిట్‌గా ఉండటానికి సులభమైన సూత్రం  రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంలో తరచుగా  తమను తాము మోసం చేసుకుంటారు.  ఈ సమయంలో కేలరీలు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిప్స్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్.. డెజర్ట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్..  చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినాలి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెస్.. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు  బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రోజువారీ వాకింగ్ చేయాలి.  లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి.  ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్‌నట్స్,  గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.  ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి.   మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి.                                         *రూపశ్రీ.