LATEST NEWS
అంతర్జాతీయ ప్రసిద్దిగాంచిన నుమాయిష్ ఈ యేడు జనవరి మూడో  తేదీకి వాయిదా పడింది.  వాస్తవానికి జనవరి ఒకటో తేదీన నుమాయిష్ ప్రారంభం కావాల్సి ఉంది.  నుమాయిష్ ప్రారంభమై 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతీ యేడు 25 లక్షల  మంది సందర్శకులు  నుమాయిష్ సందర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుమాయిష్ ను ప్రారంభించనున్నారు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మయాన్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై ల్యాండ్ అవుతున్న విమానం స్వల్పంగా రక్షణ గోడను తాకడంతో ప్రమాదం సంభవించింది. దీంతో రన్ వేపై భారీ మంటలు చెలరేగాయి. 181 మందితో ల్యాండ్ అవుతున్న విమానం ప్రమాదవశాత్తు  రక్షణ గోడను ఢీ కొట్టగానే భారీ మంటలు చెలరేగి 179 మంది అక్కడికక్కడే చనిపోయారు. 
ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఎంఎల్ సి కవిత యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత ఆరునెలలపాటు తీహార్ జైలులో ఊచలు లెక్కబెట్టి బయటకు వచ్చారు. బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర పడ్డ కవిత జైలు నుంచి విడుదలయ్యాక ప్రజలకు దూరంగా ఉంటున్నారు.  దసరాకు ముందు గైనిక్ సమస్యలతో గచ్చిబౌలిలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి వచ్చే విజువల్స్ తో ఓ సారి కనపించి మాయమయ్యారు. బతుకమ్మ పండగకు కవిత రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు సత్యదూరమయ్యాయి. జైలు నుంచి విడుదయ్యాక  మొదటి సారి జగిత్యాల పర్యటన చేశారు. బిఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కేడర్ అంతా షిప్ట్ అయ్యింది. కవిత జగిత్యాల పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కొట్టొచ్చొంది. ఆ పర్యటన తర్వాత నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. జిల్లాకు రావడం ఇదే ప్రథమం. డిచ్ పల్లి వద్ద కవితకు బిఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి రూపు రేఖలపై విమర్శించిన కవిత బిఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లిని  ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌  వద్ద   పుష్పాంజలి ఘటించారు.  పార్టీలో హరీష్ రావ్ పై  కళ్లెం వేయడానికి  కవిత రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఒకవేళ ఎసిబి లేదా ఈడీ కెటీఆర్ ను అరెస్ట్ చేస్తే హరీష్ రావ్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మేన బావ అయిన హరీష్ కు చెక్ పెట్టాలంటే కవిత రీ ఎంట్రీ ఇచ్చే అగత్యం ఏర్పడింది. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ జైలుపాలయినప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్ర మంతా పర్యటించి బొక్కబోర్లా పడ్డారు  షర్మిల గతే కవితకు పట్టడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి.  తన  జిల్లా పర్యటనలో ప్రజా సమస్యలపై ఎక్కువ ఫోకస్  పెట్టారు ఈ మాజీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు. 
కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి తరతరాల చరిత్రకు ఆలవాలమైన ఖిల్లా ఘన్ పూర్ పొలాల్లో వెయ్యేళ్ల నాటి సిద్ధి గణపతి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  అన్నారు. గ్రామ గ్రామాన గల వారసత్వ సంపదను గుర్తించి స్థానికులకు అవగాహన కల్పించి పరిరక్షించేందుకు దోహదపడే "ప్రిజర్వ్ హేరిటేజ్ ఫర్ పోస్టేరీటి" కార్యక్రమంలో భాగంగా, ఆయన ఆదివారం నాడు ఖిల్లా ఘనపురం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ క్రమంలో ఘనపూర్ పట్టణానికి పశ్చిమంగా మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో గల ఒక పెద్ద గుండు పై ఐదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో, రాతిని తొలచి మలచిన పెద్ద గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. తలపై జటామకుటం, గజముఖం, ఎడమవైపుకు తిరిగిన తొండం, పై రెండు చేతుల్లో పరశు, పాశం, కింది రెండు చేతుల్లో విరిగిన దంతం, మోదకాలను, పొట్టపై నాగయజ్ఞోపవీతాన్ని ధరించి, లలితాసనంలో కూర్చుని ఉన్న, వనపర్తి జిల్లాలోని అతిపెద్దదైన ఈ గణపతి విగ్రహం క్రీ.శ. 11వ శతాబ్ది నాటి కందూరు చోళుల తొలి కాలపు ప్రతిమా లక్షణాన్ని తెలియజేస్తుందని శివనాగి రెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాన్ని కాపాడుకోవాలని ఖిల్లా ఘనపూర్ కు చెందిన, వనపర్తి జిల్లా విశ్వహిందూ పరిషత్ సేవా ప్రముఖ బెస్త శ్రీనివాస్, ఆగారం ప్రకాష్, ఆగారం శేఖర్ రెడ్డి, ఎం.డి పాషాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పట్నం కృష్ణంరాజు పాల్గొన్నారని ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి కొల్లు రవీంద్ర మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు ముదురుతోంది.  పేర్నినాని భార్య జయసుధను అరెస్ట్ చేయనున్నట్టు కొల్లు రవీంద్ర చేసిన ప్రకటనపై పేర్ని నాని  కట్టు కథలు అల్లుతున్నారు. ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు  పేర్ని నాని కట్టు కథలు అల్లినట్టు కొల్లు రవీంద్ర స్టేట్ మెంట్ ఇచ్చారు. వీరి మధ్య పంచాయతీ ముదురుతోంది. నన్ను అరెస్ట్ చేయాలని కొల్లు రవీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నట్టు కట్టు కథ అల్లారని అన్నారు. రేషన్ బియ్యం స్వంత గోడౌన్ నుంచి స్మగ్లర్లకు తరలించారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కేసు నమోదైన నాటి నుంచి పేర్ని తప్పిచుకుతిరుగుతున్నాడని కొల్లు రవీంద్ర అన్నారు.ప్యాంటు తడుపుకున్న పేర్ని నెలరోజులు మాయం అయ్యాడని కొల్లు అన్నారు.  నీ తప్పే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.   పేర్ని భార్య  జయసుధ గోడౌన్ నుంచి 7 500 బియ్యం బస్తాలు ఏమయ్యాయని మంత్రి ప్రశ్నించారు
ALSO ON TELUGUONE N E W S
ఈ నగరానికి ఏమైంది,ఫలక్ నామాదాస్,హిట్, పాగల్,ఓరి దేవుడా,దాస్ క ధమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్.రీసెంట్ గా మెకానిక్ రాఖీ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం 'లైలా' అనే ఒక విభిన్నమైన సినిమాలో చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి 'సోను మోడల్' అనే  సాంగ్ రిలీజ్ అయ్యింది. నారాయణ్ రవి శంకర్,రేష్మ శ్యామ్ ఈ సాంగ్ ని అత్యద్భుతంగా ఆలపించగా విశ్వక్ సేన్ ఒక సరికొత్త గెటప్ తో  రెడ్ కారులో నుంచి దిగడం,చుట్టూ అందమైన లేడీ మోడల్స్ ఉండడం చాలా కొత్త గా ఉంది, సాంగ్ లోని పదాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి.ఇక ఈ సాంగ్ కి ఉన్న స్పెషల్ ఏంటంటే విశ్వక్ సేన్ నే స్వయంగా ఈ పాటని రాసాడు. ఆల్రెడీ ఫలక్ నామ దాస్ తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు సరికొత్త గా పాటల రచయిత గా అవతార మెత్తడం విశేషం.ఇక ఈ లైలా మూవీ ని సాహు గారపాటి నిర్మిస్తుండగా రామ్ నారాయణ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా చేస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఐఏఎస్ ఆఫీసర్ గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్(game changer)ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు(dil raju)తన ఎంటైర్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.ఇటీవల యుఎస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'ధోప్' సాంగ్ రిలీజ్ అవ్వగా, ఆ సాంగ్ ని చూసీ ఇంత రిచ్ సాంగ్ నాదేనా అని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.దీన్ని బట్టి గేమ్ చేంజర్ సినిమా యొక్క క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.శంకర్ తో సహా ఈవెంట్ కి హాజరయిన దర్శకుడు సుకుమార్ కూడా సినిమా గ్యారంటీ హిట్ అని కూడా చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా నలభై లక్షల రూపాయల వ్యయంతో విజయవాడలో 256 అడుగుల భారీ కట్ అవుట్ ని ఏర్పాటు చేసి హెలికాఫ్టర్ చేత కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించడం జరిగింది.ఈ కార్యక్రమానికి  నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేశాడు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుహతు గేమ్ చేంజర్ మూవీ బాగా వచ్చిందని,అభిమానులని,ప్రేక్షకులని నిరాశపరచదని సరికొత్త రికార్డులు కొట్టబోతున్నామని చెప్పడం జరిగింది. సినిమా డ్యూరేషన్ రెండు గంటల నలభై ఐదు నిమిషాలే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఇంత నిడివినే కోరుకుంటారని శంకర్ ని ఒప్పించి మరి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి కట్ చేయించడం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ మద్యన చాలా పాన్ ఇండియా సినిమాలు మూడుగంటల పైన నిడివితో వస్తున్నాయి.పుష్ప 2 ,యానిమల్ చిత్రాలే అందుకు ఉదాహరణ. దీంతో చాలా మంది ప్రేక్షకులు అంత నిడివి భరించడం కష్టమనే మాటలని అటు విశ్లేషకులతో పాటు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి.అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ డ్యూరేషన్ తో రావడం ప్రేక్షకులకి కొంత రిలీఫ్ అని చెప్పవచ్చు.  ఇక జనవరి 4 లేదా 5 న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తామని,ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని దిల్ రాజు చెప్పడం జరిగింది.దీంతో  మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చినట్లయింది. కాకపోతే ఎక్కడ నిర్వహిస్తామనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన  కియారా అద్వానీ జోడి కట్టగా  అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఐదో పాట కూడా రిలీజ్ కానుంది.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నటించిన గేమ్ చేంజర్(game changer)మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు ఇండియాలోనే ఇంత వరకు ఏ హీరోకి లేని విధంగా  256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలో  ఏర్పాటు చేసి ఈ రోజు హెలికాఫ్టర్ చేత కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించడం జరిగింది.ఈ కార్యక్రమానికి  నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుహతు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్(pawan kalyan)వస్తున్నారు.ఆయనకి ఉన్న డేట్స్ ని బట్టి జనవరి 4 లేదా 5 న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చినట్లయింది. కాకపోతే ఎక్కడ నిర్వహిస్తామనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మూవీ కూడా అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చుతుందని, సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని కూడా అయన చెప్పుకొచ్చాడు.  చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన  కియారా అద్వానీ జోడి కట్టగా  అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఐదో పాట కూడా రిలీజ్ కానుంది.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ గేమ్ చేంజర్(game changer).శంకర్(shankar)ఈ మూవీకి దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుండగా  ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడు. రీసెంట్ గా యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకుంది.  గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు ఇండియాలో ఏ హీరోకి లేని విధంగా  256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలోనే ఏర్పాటు చేసారు.ఈ రోజు అభిమానులు హెలికాఫ్టర్ చేత ఆ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించే ప్రోగ్రాం ని ఏర్పాటు చెయ్యగా, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆయన రాగానే అభిమానులు హెలికాఫ్టర్ నుంచి చరణ్ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించారు.ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఇక గేమ్ చేంజర్ లో  కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్(taman)సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.   
ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఆహా' లో ప్రసారమయ్యే నందమూరి లయన్ యువరత్న బాలకృష్ణ(balakrishna)టాక్ షో 'అన్‌స్టాపబుల్'(unstoppable)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.బాలయ్య సినిమా రిలీజ్ రోజు కోసం ఎంత ఎగ్జైట్ గా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎదురుచూస్తారో,ఆ షో కోసం కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తుంటారు.ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 4 నడుస్తుంది. రీసెంట్ గా వెంకటేష్ గెస్ట్ గా వచ్చి తన అభిమానులనే కాకుండా ప్రేక్షకులని కూడా ఎంతగానో అలరించాడు. ఇప్పుడు ఈ షో కి గేమ్ చేంజర్(game changer)రిలీజ్ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)గెస్ట్ గా రాబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ టీం కూడా పాల్గొనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 31 జరగనుందని అంటున్నారు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలోస్ప్రెడ్ అవ్వడంతో చరణ్,బాలయ్యఎపిసోడ్ లో ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి.వాటికి చరణ్ సమాధానాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నందమూరి,మెగా అభిమానుల్లో నెలకొని ఉంది.షో మధ్యలో స్పెషల్ గెస్ట్ లు రావడం,కంటెస్ట్ లకి సంబంధించిన సీక్రెట్స్ ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ చేత మాట్లాడించడం కూడా జరుగుతుంటుంది.ఈ నేపథ్యంలో చరణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్(ntr)ఫోన్ లో ఏమైనా మాట్లాడతాడా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.ఏది ఏమైనా చరణ్,బాలయ్య ఎపిసోడ్ టిఆర్పి లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటలు కూడా వ్యక్తమవుతున్నాయి.   ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే రామ్ చరణ్, బాలయ్య ఇద్దరు కూడా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్(daku maharaj)తో వస్తున్నారు. గేమ్ చేంజర్ జనవరి 10 న విడుదల కాబోతుండగా, డాకు మహారాజ్ జనవరి 12 న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో తమ సినిమాల మధ్య ఉన్న పోటీ గురించి కూడా  ఆ ఇద్దరు ఏం మాట్లాడతారో అనే ఆసక్తి అందరిలో ఉంది.    
2024 వ సంవత్సరానికి సంబంధించి మలయాళ చిత్ర పరిశ్రమలో రెగ్యులర్ చిత్రాలతో పాటు ఎన్నో వెరైటీ,ప్రేమకథా చిత్రాలు తెరకెక్కడం జరిగింది.వాటిల్లో మంజుమ్మేల్ బాయ్స్(manjummel boys),ప్రేమలు(premalu)ఆడుజీవితం వంటి చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ఈ సంవత్సరం మరికొన్నిరోజుల్లో ముగుస్తుందనగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఈ ఏడాదిలో విడుదలైన తమ సినిమాల గురించి మాట్లాడుతు ఈ ఏడాది మొత్తం 199 చిత్రాలు రిలీజ్ కాగా,వాటికి సుమారు 1000 కోట్లు ఖర్చు అయ్యింది.కానీ 26 సినిమాలు మాత్రమే విజయం సాధించడంతో 300 కోట్లు మాత్రమే రాగా 700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.నిర్మాణ విలువ, హీరోల పారితోషకం భారీగా పెరగడం వల్లే తమకి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందనే కారణాన్ని కూడా చెప్పింది.ఇప్పుడు కేరళ మూవీ అసోసియేషన్ ఇలాంటి ప్రకటన చెయ్యడం ఇండియన్ సినీ పరిశ్రమలో చర్చినీయాంశమయ్యింది. ప్రేమలు,ఆడు జీవితం,ఏ ఆర్ ఏం, ఆవేశం, భ్రమయుగం,సూష్మ దర్శిని,వంటి చిత్రాలు విజయాన్ని సాధించాయి.వాటిల్లో ప్రేమలు మాత్రమే 250 కోట్ల గ్రాస్ దాకా వసూలు చెయ్యగా మిగతావన్నీ 100 కోట్ల దాకా రాబట్టాయి  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన 'ఓజి'(og)కి అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.పవన్ ఎక్కడ కనపడినా కూడా ఓజి అని అరవడం కామన్ అయిపోయింది.అది ఎంతలా అంటే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,మంత్రి హోదాలో పవన్ పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూడా అరిచేంతలా. రీసెంట్ గా పవన్ కడపలోని  రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వైసిపీ మూకల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించాడు.అభిమానులు ఎప్పటి లాగానే 'ఓజి' అని అరవడం స్టార్ట్ చేసారు. దీంతో పవన్ తన అభిమానులని ఉద్దేశించి ఏంటయ్యా మీరు,ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు, పక్కకి జరగండంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు ఇప్పుడు ఈ విషయంపై ఓజి నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు 'ఓజి' పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.కానీ పవన్ రాజకీయ సభలకి వెళ్ళినప్పుడు సమయం,సందర్భం చూడకుండా 'ఓజి' అని అరుస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు.ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు.ఆ స్థానాన్ని,స్థాయిని గౌరవించడం మన బాధ్యత.మా చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.2025 లో 'ఓజి' పండుగా చాలా గట్టిగా జరుగుతుందని మేము నమ్ముతున్నామని ట్వీట్ చేసింది. ఇక ఓజి లో పవన్ సరసన ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ గా చేస్తుండగా ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి,అర్జున్ దాస్, వెంకట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.'ప్రభాస్' తో సాహూ మూవీని  తెరకెక్కించిన సుజిత్(sujith)దర్శకత్వం వహిస్తుండగా థమన్ (taman)సంగీతాన్నిఅందిస్తున్నాడు.  
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో 'గుంటూరు కారం'(guntur kaaram)ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణని అందుకున్న విషయం తెలిసిందే.త్రివిక్రమ్(trivikram)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల(sreeleela)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)జత కట్టగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర చినబాబు(chinababu)నిర్మాతగా వ్యవహరించాడు.థమన్(taman)సంగీతాన్ని అందించడం జరిగింది. రీసెంట్ గా యూట్యూబ్ తమ జాబితాలో వరల్డ్ వైడ్ గా వివిధ దేశాలకి చెందిన సినిమాల్లో టాప్ పొజిషన్ లో నిలిచిన పాటల జాబితాని ప్రకటించింది.అందులో ఇండియాలోని అన్ని భాషలకి సంబంధించి తెరకెక్కిన సినిమాల్లో టాప్ గా నిలిచిన పాటగా గుంటూరు కారంలోని సాంగ్  నిలిచింది. అందులోని కుర్చీ మడతపెట్టి  వీడియో సాంగ్ 526 మిలియన్ల వ్యూస్ ని అంటే 52 కోట్ల వ్యూస్ ని సంపాదించింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాలోని పాట ఈ రికార్డుని అందుకోలేదు.ఇక ఈ రికార్డు సాధించడం పై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని కూడా తెలియచేసింది.   కుర్చీ మడత పెట్టి సాంగ్ లో మహేష్, శ్రీలీల ఒక రేంజ్ లో డాన్స్ చెయ్యగా ప్రముఖ నటి పూర్ణ కూడా ఆ సాంగ్ లో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీని అందించడం జరిగింది.    
నటీనటులు: ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్, కరుణాస్, నటరాజ సుబ్రహ్మణియన్, సానియా ఇయ్యప్పన్ ఎడిటింగ్: సెల్వ మ్యూజిక్: క్రిస్టో సేవియర్ సినిమాటోగ్రఫీ: ప్రిన్స్ నిర్మాతలు:  సిద్దార్థ్ రావ్ , పల్లవి సింగ్ దర్శకత్వం: సిద్దార్థ్ విశ్వనాథ్ ఓటీటీ: నెట్ ఫ్లిక్స్ కథ:  చెన్నైలోని ఓ ప్రాంతంలో పార్తీబన్ (ఆర్జే బాలాజీ) తోపుడు బండిపై టిఫిన్స్  అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న రేవతితో అతను ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాలనేది చాలా  కాలంగా అతనికి ఉన్న కోరిక. అయితే అనుకోకుండా ఓ హత్య కేసులో పార్ధీవన్ జైలుకి వెళ్తాడు.  అదే జైల్లో గ్యాంగ్ స్టర్ గా ఉన్న 'సిగా' (సెల్వ రాఘవన్)కి అక్కడి ఖైదీలతో పాటు పోలీసులు కూడా భయపడుతూ ఉంటారు. 'సిగా' అనుచరులుగా టైగర్ మణి - శీలన్ ఉంటారు. ఆ ఇద్దరినీ దాటి సిగాను కలవడం అంత తేలికైన విషయం కాదు. పార్తీబన్ వచ్చి వాళ్ల మధ్యలో పడతాడు. సిగా గురించి అప్పుడే అతను వింటాడు. సాధ్యమైనంత త్వరగా జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. 'సిగా'ను లేపేస్తే, విడుదల చేస్తానని పార్తీబన్ కి ఎస్పీ సునీల్ కుమార్  ఆశపెడతాడు. అప్పుడు పార్తీబన్ ఏం చేస్తాడు? షణ్ముగాన్ని ఎవరు చంపారు? జైలు నుంచి పార్తీబన్ బయటపడతాడా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: జైలుకి వెళ్ళిన పార్ధీబన్ నిజంగా హత్య చేశాడా లేదా అతడిని ఆ కేసులో ఇరికించారా లేదా అనే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. అయితే కథలోకి వెళ్ళే కొద్దీ క్యారెక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. ఒకానొక దశలో ఏంట్రా ఈ జైలు, ఖైదీలు అనే ఫీలింగ్ వస్తుంటుంది. అయితే సాధారాణ జీవితాన్ని గడిపే ఓ వ్యక్తి జీవితాన్ని జైలులోని కొంతమంది గ్యాంగ్ స్టర్స్ ఏం చేశారోననే భాధ చూసే ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. కొట్లాట, ఎత్తుకి పై ఎత్తు వేయడం, నరుక్కోవడం, హత్యలు, రేప్ లు ఇలాంటివి క్రైమ్ థ్రిల్లర్స్ లో సహజం. అవి ఇందులోను ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి పార్ధీవన్ చాలా సాధారణంగా కనిపిస్తాడు. ఎందుకంటే అతను లైఫ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అతనికి ఓ ఫ్యామిలీ ఉందని, దానికోసం ఎలాగైనా జైలు నుండి బయటకెళ్ళాలని అతను పడే తపన ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది.  పోలీసుల ఇగో ఓ వైపు, సామాన్యుడి జీవితం ఓ వైపు అనేలా కథ ముందుకు సాగడంతో ఉత్కంఠ మొదలవుతుంది. అయితే ద్వితీయార్థంలో వచ్చే ట్విస్ట్ అందరిని ఆలోచనలో పడేస్తుంది. చేయని క్రైమ్ కి అతను ఎందుకు అంగీకరించాడనే పర్ స్పెక్టివ్ భిన్నంగా అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం స్క్రీన్ ప్లే.. కేసులో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కరిని మరోసారి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాలతో కథ ఫుల్ ఆఫ్ థ్రిల్ ని పంచుతుంది. అయితే జైలులో ఓ రౌడీ నాలుకని కోసే సీన్ చూపించినప్పుడు మరీ ఇంత క్రూరంగా ఎలా ఉంటార్రా అనిపిస్తుంది. అయితే ఓ మనిషిని మార్చేది అతని చుట్టూ ఉండే పరిస్థితులు అంటూ దర్శకుడు చూపించిన పాయింట్ కొత్తగా ఉంటుంది. ప్రిన్స్ ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ ఫ్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  పార్ధీబన్ గా ఆర్జే బాలాజీ నటన ఆకట్టుకుంది. సిగా పాత్రలో సెల్వరాఘవన్ ఒదిగిపోయాడు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : ఎంగేజింగ్ క్రైమ్ థ్రిల్లర్ మస్ట్ వాచెబుల్. రేటింగ్: 2.75  / 5                                                                                                              ✍️. దాసరి     మల్లేశ్
Remember, the childhood story where two cats fight about who gets the cake, monkey appears to be the judge but takes the whole cake for itself. Here, in Sankranti 2025 battle, when everyone is thinking Ram Charan's Game Changer and NBK's Daaku Maharaaj will be big players, Venkatesh's Sankrantiki Vasthunnam is taking the cake.  The cake is the positive attention and buzz. Daaku Maharaaj teaser and NBK's young get up got good hype, attention but nothing further. The two songs released did not click big time with audiences. Game Changer's Dhop song has garnered some interest due to Ram Charan's dance but nothing really clicked from the movie, too.  In fact, fans of both the actors have been asking for updates from both the production teams but they are not getting any sort of response. Thaman scored music for both the films and Shankar's films always have hit music but Game Changer has lagged behind in that aspect.  Venkatesh's Sankrantiki Vasthunnam with creative promotions and hit songs like Godari Gattu and Meenu, has created positive buzz. Also, the upcoming song sung by Venkatesh has been promoted in the most creative manner too. Anil Ravipudi has been able to create good buzz better than Bobby and Shankar.  Such conclusion would be hard to swallow for Nandamuri Fans and Mega Fans but that is the truth. Game Changer team is trying to do huge scale promotions with 256 feet cutout but their promotions have been little off color. NBK's Daaku Maharaaj team needs to buckle up, one must say. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల  తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా  జ్వరం రావడం,  తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు  అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు.  కొన్నిసార్లు  ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి.  బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ  తెలియదని,  ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని  వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది.  ఈ కారణంగా  దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం,  వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇది కాకుండా ప్లాస్టిక్,  రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో  పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు.  తలనొప్పి  దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే  ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది.  అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు.  ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.   వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.   కంటిచూపు సరిగా లేకపోవడం,   ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత,  మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్  తీవ్రమైన సమస్యగా మారే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  పెద్దవారు,  స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి  సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స,  కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.   అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.                                 *రూపశ్రీ
  స్నానం శారీరక శుభ్రతలో ప్రధాన భాగం.  ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించడం చిన్నతనం నుండి అలవాటుగా వచ్చేస్తుంది. కొందరైతే రోజులో రెండుపూటలా స్నానం చేస్తారు.  ఇది శరీరానికి చాలా రిఫ్రెషింగ్ అనుభూతి ఇస్తుంది.   అధిక శాతం మంది స్నానానికి వేడి నీరే ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేస్తుంటారు.  ఇది ఎంత వరకు ఆరోగ్యం.  బాగా వేడిగా ఉన్న నీటితోస్నానం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? తెలుసుకుంటే.. చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది.  అందుకే చాలామంది పొగలు కక్కుతున్న నీటితో స్నానం చేస్తారు.  చాలా వరకు గమనిస్తే చలికాలంలో స్నానం చేసి బాత్రూమ్ డోర్  ఓపెన్ చేయగానే బాత్రూమ్ నుండి మంచు పొగ బయటకు వచ్చినట్టు వేడనీటి ఆవిర్ల పొగ బయటకు వస్తుంది.  పొగలు కక్కే వేడి నీరు శరీరానికి చాలా రిలాక్స్ గా అనిపించినా అది చర్మానికి చాలా చెడు చేస్తుంది.  ముఖ్యంగా చర్మం కందిపోవడం,  ఎర్రబడటం జరుగుతుంది. చలికాలంలో ముందే చర్మం తొందరగా పొడిబారే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మరింత వేడినీరు పడటం వల్ల చర్మం దెబ్బతింటుంది. చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. లో బిపి.. చాలామందికి ఉండే సమస్య.  ఈ మధ్యకాలంలో అధిక బీపీ కంటే లో బీపీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.  లో బీపీ సమస్యలు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదని అంటున్నారు.  దీని వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును మరింత తగ్గేలా చేస్తాయట.  ఈ కారణంగా శరీరంలో రక్తపోటు తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుందట. ఎప్పుడో ఒకసారి శరీరం బాగా అలసిపోయినప్పుడు,  చాలా చలిగా ఉన్నప్పుడు వేడినీటితో స్నానం చేసినా పర్లేదు.. కానీ ప్రతిరోజూ పొగలు కక్కే నీటితో స్నానం చేస్తుంటే మాత్రం చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారికి చాలా ఇబ్బంది అనే చెప్పాలి. చాలా వేడిగా ఉన్న నీరు చర్మం పిహెచ్ బ్యాలెన్స్ ను పాడు చేస్తుంది.  ఇది స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మమే అంత దెబ్బతినే అవకాశాలు ఉన్నప్పుడు.. చాలా సున్నితంగా ఉండే తల చర్మం,  వెంట్రుకలు మరింత సమస్యకు లోనవుతాయి.  బాగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.  వేడి నీరు జుట్టు పొడిగా మారడానికి,  సున్నితంగా మారడానికి,  డ్యామేజ్ కావడానికి కారణం అవుతుంది.  ఫలితంగా జుట్టు పెరుగుదల అస్సలు ఉండదు. చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరంగా పరిగణించబడుతుంది.  అందుకే స్నానానికి వేడినీరు ఉపయోగించాలి అనుకుంటే ఆ నీరు గోరువెచ్చగా ఉండాలి. అంతే కానీ పొగలు కక్కే నీటితో స్నానం చేయకూడదు.                                         *రూపశ్రీ.
  స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.                                     *రూపశ్రీ.