LATEST NEWS
విశాఖపట్నానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.   వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ను నియమించారు.ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. సీతంరాజు సుధాకర్ గతంలో  వైసీపీలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.   ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేశారు.   వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో  దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న సీతంరాజు సుధాకర్  2013 వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. 2013లో  కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైన తరువాత సీతంరాజు విశాఖలో పార్టీ పటిష్టత కోసం పని చేశారు.   2019లో  వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీతంరాజు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆ తరువాత 2021లో ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తరువాత  2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. సుధాకర్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాగా.. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు తెలపడంతో సీతంరాజు సుధాకర్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం  మొదలైంది. దాంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గత ఏడాది డిసెంబర్ లో పార్టీకి  గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు.   
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి జత్వానీ కేసులో అరెస్టైన కుక్కల విద్యాసగర్ బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. కాగా కుక్కల విద్యాసాగర్ కు బోయిల్ ఇవ్వొద్దంటూ నటి జత్వానీ తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు.   కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగరరావు బెయిలు పిటిషన్ పై విజయవాడ కోర్టులో గురువారం (నవంబర్ 14)న వాదనలు పూర్తయ్యాయి. తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారంటూ నటి కాదంబరి జెత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన డెహ్రాడూన్ లో ఉండగా పట్టుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనను రిమాండ్ కు తరలించింది.  తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారని కొద్ది రోజుల క్రితం కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కుక్కల విద్యాసాగర్ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షులను  ప్రభావితం చేస్తారని నటి జత్వాని తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో నిందితుడికి అప్పట్లో ఐపీఎస్ అధికారులు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు పత్రాలు సృష్టించి జత్వానీని అక్రమంగా ముంబై నుంచి తీసుకువచ్చి 42 రోజుల పాటు జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఇప్పుడు విద్యాసాగర్ కు బెయిలు మంజూరు చేస్తే వాస్తవాలు బయటకు రాకుండా సాక్షులను ప్రభావితం చేస్తారని జత్వాని తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా కుక్కల విద్యాసాగర్ పరారయ్యే అవకాశం కూడా ఉందన్నారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి తీర్పును శనివారం (నవంబర్ 16)కు రిజర్వ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.   
తమ రాజీనామాలు ఆమోదించాల్సిందేనంటూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు శాశనమండలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. చైర్మన్ గారూ స్పీకర్ ఫార్మట్ లో ఇచ్చిన మా రాజీనామాలను ఎందుకు ఆమోదించడం లేదంటూ ఎన్నిసార్లు కోరినా సమాధానం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలో ఉన్నాయని చెప్పి చైర్మన్ తప్పించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్పీకర్ ఫార్మట్ లో చేసిన తమ రాజీనామాలు ఆమోదించకుండా, ఇందుకూరి రఘురామ రాజుపై అనర్హత వేటు వేశారని వారు పేర్కొన్నారు. అయితే ఆ అనర్హత వేటును హైకోర్టు తప్పుపట్టిందని వారు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి మండలిలో తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.   రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ వదిలేశామని వారు బాహాటంగా ప్రకటిస్తున్నా.. వైసీపీ మాత్రం కాదు కాదు మీరు పార్టీలోనే ఉన్నారు, ఉండాలంటూ కాళ్లా వేళ్లా పడుతోంది. వీరి ముగ్గురి రాజీనామాలూ ఆమోదిస్తే.. మరింత మంది అదే దారిలో వెడతారనీ, అప్పుడు మండలిలో ఉన్న మెజారిటీ కూడా హుష్ కాకీ అయిపోతుందనీ వైసీపీ అగ్రనాయకత్వం భయపడుతోంది.  వారు సభలోనే రాజీనామాల ఆమోదం కోసం పట్టుపడుతున్నా చైర్మన్ హోషేన్ రాజు మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు.  వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఆ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు. వీరి దారిలో మరింత మంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే మండలిలో ఉన్న ఆ కాస్త బలం కూడా పోతుందన్నది వైసీపీ భయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (నవంబర్ 15) ఢిల్లీకి వెడుతున్నారు. అక్కడ ఒక ప్రముఖ పత్రిక  శనివారం నిర్వహించే లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరౌతారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెడతారు.  ఈ పర్యటనలో ఆయన   కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అవుతారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర కు చేరుకుని  అక్కడ ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి  సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురూ  మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. 
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.  శుక్రవారం (నవంబర్ 15) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. అదే సమయంలో రూ.300లు ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది. ఇక గురువారం  స్వామి వారిని మొత్తం 56,711 మంది  దర్శించుకున్నారు. వరిలో 19,755 మంది   తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ  ఆదాయం రూ.3.64 కోట్లు వచ్చింది.
ALSO ON TELUGUONE N E W S
నందమూరి నట సింహం బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాఫబుల్ షో ఎంతగా పాపులర్ అయ్యిందో అందరకి తెలిసిందే.ప్రెజంట్ సీజన్ 4 లో ఉన్న ఈ షో మొదటి ఎపిసోడ్ ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)తో ప్రారంభించి ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ ని కూడా కలగ చేసింది. త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)కి సంబంధిచిన ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోలు గత కొన్ని రోజులుగా విడుదల అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక ప్రోమో విడుదల అయ్యింది.అందులో స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పిక్  రాగానే పవన్ కళ్యాణ్ మీద నీ ఒపీనియన్ ఏంటని అల్లు అర్జున్ ని బాలయ్య అడగటం జరిగింది అప్పుడు  అల్లు అర్జున్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్(pawan kalyan)గారి దైర్యం అంటే నాకు చాలా ఇష్టం.సొసైటీ లో నేను చాలా మంది లీడర్స్, బిజినెస్ మేన్స్ ని దగ్గర నుంచి చూస్తుంటాను. కానీ నేను లైవ్ లో మాత్రం పవన్ గారి ధైర్యాన్ని చూస్తుంటాను. చాలా డేరింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.    
నందమూరి బాలకృష్ణ తన 109 వ చిత్రాన్ని చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సినిమా తెరకెక్కించి   సంచలన విజయాన్ని అందుకున్న బాబీ దర్శత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై నందమురి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ అభిమానుల సమక్షంలో విడుదల అవ్వడం జరిగింది. సినిమాకి 'డాకు మహారాజ్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.టీజర్ కూడా బాలయ్య ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. టీజర్ ని చూస్తుంటే బాలయ్య ఈ సారి ఒక సరికొత్త కథ తో రాబోతున్నాడని తెలుస్తుంది. బాలయ్య ఇంట్రడక్షన్ కి సంబంధించిన డైలాగులు కానీ, గుర్రం మీద బాలయ్య రావడం కానీ చూస్తుంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ మారుమోగిపోవడం ఖాయమని కూడా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్, ఫార్చ్యూన్ సినిమా పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, సౌజన్య నిర్మిస్తున్న డాకు మహారాజ్ కి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ద శ్రీనాద్ హీరోయిన్ గా చేస్తుండగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.  
2009 లో రవితేజ(ravi teja)హీరోగా వచ్చిన కిక్(kick)తో తన తన సినీ కెరీర్ ని ప్రారంభించిన తమన్(thaman)తన సంగీతంతో సినీ ప్రియులని అలరిస్తూ వస్తున్నాడు.ప్రస్తుతం తన చేతిలో గేమ్ చేంజర్, అఖండ 2 ,ఈ రోజు టైటిల్ రివీల్ కాబోతున్న బాలకృష్ణ(balakrishna)బాబీ(bobby)మూవీతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తమన్ చేతిలో ఉన్నాయి. డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న పుష్ప 2(pushpa 2)కి కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నాడు. ఒక వ్యక్తి రీసెంట్ గా కిడ్నీ ట్రాన్స్పలెంట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది.కానీ అతనికి  ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమన్ ఆ ఆపరేషన్ తాలూకు డబ్బులు చెల్లించి ఆపరేషన్ విజయంతంగా పూర్తవడానికి సహకరించాడు. ఈ విషయాన్నీ సదరు వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.తమన్  మంచి మనసుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరకి తెలియచేసింది. దీంతో పలువురు నెటిజన్స్ తమన్ ని మెచ్చుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి(sathya reddy)నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం(ukku satyagraham)ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్(gaddar)ఈ చిత్రంలో మూడు పాటలు పాడటమే కాకుండా రెండు పాటలతో పాటు కొన్ని సందేశాత్మక సీన్స్ లో కూడా నటించారు.పైగా ఆయన నటించిన ఆఖరి చిత్రం కూడా ఇదే. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించిన ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఈసందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత, కథానాయకుడు సత్యారెడ్డి ఢిల్లీ లోని ఏ పి భవన్ లో  మాట్లాడుతువిశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల తో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా, గద్దర్ అన్న తో కలిసి ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను నిర్మించాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని అన్ని కార్మిక సంఘాలు, సంఘ నాయకులు, భూ నిర్వాసితులు మా సినిమాలో  నటించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను నిర్మించామని సెన్సార్ లేట్ అవ్వడం వల్ల మరియు గద్దర్ గారి మరణం వలన ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నాం. ఈ కాలంలో విప్లవానికి సంబంధించిన సినిమాలు తీయడం చాలా కష్టం. సెన్సార్ ఆపేస్తారు సినిమాని విడుదలకుండా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆగకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా విజయాన్ని సాధించిన కారణంగా ఈ సినిమాని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.  ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ను మద్రాస్ లో పెట్టాలి అని ఇందిరాగాంధీ గారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనేది చూపించాం. ఈ కథని గద్దర్ అన్నే రాసాడు.నాలుగు పాటలు కూడా  రాసి కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా  నటించారు. తన వారసులు ఎలా ఉండాలి ఉద్యమాలు ఎలా నిర్మించాలి అనేది కూడా ఆయన చనిపోయే ముందు రాసుకున్న చివరి పాట. ఉద్యమకారులు, గద్దర్ గారి అభిమానులు మరియు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.పల్సర్ బైక్ ఝాన్సీ, మాజీ ఎం ఎల్ ఏ కరణం ధర్మశ్రీ, ఎంవివి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల.తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. శ్రీ కోటి సంగీతాన్ని అందించాడు.      
తమిళనాడులో ఉన్న తెలుగు వారి వృత్తి గురించి ప్రముఖ సినీ నటి కస్తూరి(kasthuri)కొన్ని రోజుల క్రితం  అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆమె  మాటల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.చెన్నై,మదురై, తేని వంటి జిల్లాల్లో అయితే ఆమెపై కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో అరెస్ట్ భయంతో కస్తూరి ముందస్తు బెయిల్‌ కోరుతూ మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది కేసు ని పూర్తిగా పరిశీలించిన న్యాయమూర్తి కస్తూరి మాటల గురించి ప్రస్దావిస్తూ 'కస్తూరి  వ్యాఖ్యలు ముమ్మాటికీ హింసను ప్రేరేపించేవిలా ఉన్నాయి.వాక్‌ స్వాతంత్య్రం అనేది వ్యక్తులు తమ ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఆ మాటలు విద్వేషాన్ని ప్రేరేపించడానికో, లేదా మత సామరస్యాన్ని దెబ్బ తీయడానికో దుర్వినియోగం చేయకూడదు.బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అంటూ కస్తూరి బెయిల్ పిటిషన్ ని  కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి  కస్తూరి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఫోన్ చేసినా కూడా స్విచ్‌ ఆఫ్‌ వస్తుండంతో  రెండు ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.  
శివ కార్తికేయన్(sivakarthikeyan)సాయి పల్లవి(sai pallavi)జంటగా రాజ్ కుమార్ పెరియ స్వామి(Rajkumar Periasamy)దర్శకత్వంలో కమల్ హాసన్(kamal haasan)నిర్మించిన అమరన్(amaran)దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తమిళనాడు కి చెందిన దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్(major mukund varadarajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రెండు వందల అరవై కోట్ల రూపాయల క్రాస్ ని రాబట్టి సరికొత్త హిస్టరీ ముంగిట నిలిచింది.  రీసెంట్ గా శివ కార్తికేయన్ కి పర్సనల్ లైఫ్ కి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అమరన్ సినిమాలో ఎలా అయితే యంగ్ ముకుంద్ గెటప్ లో కనపడ్డాడో ఆ గెటప్ లో తన భార్య ఆర్తి వంటిట్లో ఉంటే వెళ్లి ఆమె వెనుక సైలెంట్ గా ఉన్నాడు. ఆర్తి(aarti)మాత్రం శివ కార్తికేయన్ ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది.ఆ తర్వాత కాసేపటికి వెనక్కి తిరిగి చూసి ఒక్క సారిగా షాక్ కి గురయ్యింది. ఆ తర్వాతప్రేమగా తన భార్యపై చెయ్యి వేసి నవ్వాడు. క్యూట్ వీడియో అంటూ శివ కార్తికేయన్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్  కామెంట్స్ చేస్తున్నారు.      
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన‌ డిటెక్టివ్ వెబ్ సిరీస్ 'వికటకవి' (Vikkatakavi). ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో న‌వంబ‌ర్ 28 నుంచి తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌ కు 'స‌ర్వం శ‌క్తిమ‌యం' ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.  ‘వికటకవి’ ప్ర‌యాణం ఎలా మొద‌లైంది? - ప్ర‌శాంత్ వ‌ర్మ‌గారితో అ!, క‌ల్కి సినిమాల‌కు వ‌ర్క్ చేసిన రైట‌ర్ తేజ దేశ్‌రాజ్‌ రాసుకున్న క‌థ‌. త‌ను నాకు మంచి స్నేహితుడు. జీ5 వారికి క‌థ‌ను వినిపించి సిరీస్‌ను చేయ‌టానికి ఒప్పించి అన్నీ సిద్ధం చేసుకున్నారాయ‌న‌. సిరీస్‌ను రూపొందించ‌టానికి జీ5 టీమ్ హీరోలను, ద‌ర్శ‌కుల‌ను కొంత‌మందితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఆ స‌మ‌యంలో తేజ, నేను ఓసారి క‌లుసుకున్నప్పుడు విక‌ట‌క‌వి సిరీస్ గురించి చెప్పి.. నువ్వు డైరెక్ట్ చేస్తావా! అని అడిగారు. నేను క‌థ విన్నాను. నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరిగారు, జీ5 టీమ్ ఓ బ‌డ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగ‌ల‌వా? అన్నారు. నేను అంగీక‌రించాను. అక్క‌డి నుంచి విక‌ట‌క‌వితో నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది.  పీరియాడిక్ జోన‌ర్‌లో సిరీస్‌ను చేయ‌టం ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది? - విక‌ట‌క‌వి త‌ర‌హా పీరియాడిక్ సిరీస్ చేయ‌టం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నాతో పాటు నా టీమ్‌కి కూడా వ‌ర్క్ ప‌రంగా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ ఇది. ఎందుకంటే క‌థ‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. క‌థంతా 1940, 1970 కాలాల్లో జ‌రుగుతుంది. అలాంటి ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసి తెర‌కెక్కించ‌టం అనేది ఓ కిక్ ఇచ్చింది. 1940, 1970 కాలాల‌కు సంబంధించిన సెట‌ప్స్‌, బ‌ట్ట‌లు, అప్ప‌టి ప్ర‌జ‌లు మాట్లాడే భాష‌, లుక్స్‌, లైటింగ్, వ‌ర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది. సిరీస్‌ను కంటెంట్ ప్ర‌కారం ఓ రాయ‌ల్ లుక్‌తో చూపిస్తూనే క‌థానుగుణంగా మంచి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్‌తో తెర‌కెక్కించాను.  పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్‌ను తెర‌కెక్కించ‌టం అనేది ద‌ర్శ‌కుడిగా మీకు ఎలా చాలెంజింగ్ అనిపించింది? - పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్ లేదా సినిమాను తెర‌కెక్కించ‌టం అనేది ప్ర‌తీ టెక్నీషియ‌న్‌కి ఎంతో చాలెంజింగ్ విష‌యం. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. కంటెంట్‌ను ఎలా తెర‌కెక్కించాల‌నుకుంటున్నామో దాన్ని తెర‌పైకి తీసుకు రావ‌టం అనేది పెద్ద చాలెంజింగ్ విష‌యం. దీని కోసం ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌కు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్, కెమెరామెన్ ఆలోచ‌న‌లు స‌రిగ్గా స‌రిపోవాలి. అదృష్టం కొద్ది మంచి టీమ్ కుదిరింది. ప్రతీ ఒక్క‌రూ త‌మ సొంత ప్రాజెక్ట్‌గా భావించి, నిరూపించుకోవాల‌ని త‌ప‌న‌తో అంద‌రూ వర్క్ చేశారు.  మేకింగ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి? - విక‌ట‌క‌వి సిరీస్‌కు షోయ‌బ్ అనే సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్క్ చేశారు. త‌ను ఓ ప్రాజెక్ట్ చేశాడు. మూడు వంద‌ల‌కు పైగా పంజాబీ సాంగ్స్‌కి వ‌ర్క్ చేశారు. త‌న‌ని ఈ ప్రాజెక్ట్‌కి తీసుకొద్దామ‌ని అనుక‌న్న‌ప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. అందుకు కార‌ణం.. నాకు చాలా మంది సినిమాటోగ్రాఫ‌ర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు.. అలాగే ఇండ‌స్ట్రీలో టాలెంటెడ్ డీఓపీలున్నారు. ఇక్క‌డ ఇంత మంది ఉండ‌గా పంజాబీ కెమెరామెన్‌ను ఎందుకు తీసుకోవటం అని అన్న‌వాళ్లు లేక‌పోలేదు. అయితే విక‌ట‌క‌విలో డ్రామా వేరుగా ఉంది. అందుక‌నే కొత్త సినిమాటోగ్రాఫ‌ర్ అయితే బావుంటుంద‌నిపించి షోయ‌బ్‌ను తీసుకున్నాను. అలాగే ఈ సిరీస్‌కు ముందు నేను చూసిన ఓ బెంగాలీ సినిమా టెక్చ‌ర్ చూసిన‌ప్పుడు నాకెంతో న‌చ్చింది. దానికి గ్రాఫ‌ర్‌గా సంజీవ్ అనే టెక్నీషియ‌న్ వ‌ర్క్ చేశారు. ల‌క్కీగా త‌ను మా డీఓపీ షోయ‌బ్‌కు స్నేహితుడు కావ‌టం క‌లిసొచ్చింది. త‌ను అలా మా ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. కాస్ట్యూమ్స్ చేసిన గాయ‌త్రి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ కిర‌ణ్‌.. ఇలా మంచి మంచి టెక్నీషియ‌న్స్ అంద‌రూ సిరీస్‌లో పార్ట్ అయ్యారు.  విక‌ట‌క‌వి సిరీస్ కోసం ఎన్ని సెట్స్ వేశారు? - సిరీస్‌లో చూపించిన ప్యాలెస్ సెట్‌.. అలాగే అవ‌స‌ర‌మైన చోట మాత్ర‌మే విఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఉప‌యోగించాం. ఇక దాదాపు రియ‌ల్ లోకేష‌న్స్‌లోనే షూట్ చేశాం. రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్ట‌రీ వంటి చోట్ల లోకేష‌న్స్‌లోనే చిత్రీక‌రించాం. అయితే ఉన్న లొకేష‌న్స్‌ను క‌థ‌కు త‌గ్గ‌ట్టు మార్చుకున్నాం. దానికి ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. అలాగే ఆర్ఎఫ్‌సీ టీమ్ కూడా బాగా స‌పోర్ట్ చేసింది. నాకు తెలిసి ఓ సిరీస్ కోసం ఆర్ఎఫ్‌సీను ఇంత గ్రాండియ‌ర్‌గా ఎవ‌రూ ఉప‌యోగించుకోలేదు. సిరీస్‌ను చూస్తే మేం ఆర్ఎఫ్‌సీలో చేసిన‌ట్టే అనిపించ‌దు. అంత డీప్‌గా వ‌ర్క్ చేశాం.  అమ‌రగిరి సంస్థానం అనే కాన్సెప్ట్‌ను క‌థ‌లో ఎంచుకోవ‌టానికి కార‌ణమేంటి? - స్వాతంత్య్రం రాక మునుపు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి ప్రాంతం ఒక‌టి. రైట‌ర్ తేజ డిఫ‌రెంట్ క‌థ‌ను చెప్పాల‌నుకున్న‌ప్పుడు త‌న మైండ్‌లో వ‌చ్చిన ఐడియా ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్ల‌లో ఊరు మునిగి పోతుంది.. అనే బ్యాక్ డ్రాప్ క‌థ‌తో విక‌ట‌క‌వి అనే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను తీసుకున్నారు.  ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారు? - క‌థ‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను పెట్టింది రైట‌ర్ తేజ‌. నిజానికి మ‌న తెలుగు సినిమాల్లో విక‌ట‌క‌వి అంటే రాయ‌ల సంస్థానంలో ప‌ని చేసిన తెనాలి రామ‌కృష్ణుడు హ‌స్య చ‌తుర‌త క‌లిగిన క‌వి అనే ఫీలింగ్ ఉంది. దీనిపై తెలుగులో సినిమాలు కూడా వ‌చ్చాయి. మ‌న‌ది ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్ క‌దా, ఎందుకు విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టార‌ని నేను అడిగాను. దానికి ఆయ‌న తెనాలి రామ‌కృష్ణుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుగారి ద‌గ్గ‌ర గూఢ‌చారిగా ప‌ని చేశారు. బ‌హ‌మ‌నీ సుల్తానుల నుంచి రాయ‌ల‌వారి రాజ్యాన్ని కాపాడ‌టంలో ఎంతో కీల‌క పాత్ర‌ను పోషించార‌ని, మ‌న క‌థ‌లో హీరోకు అలాంటి షేడ్స్ ఉండ‌టంతో విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టాన‌ని తేజ చెప్పారు.  న‌రేష్ అగ‌స్త్య‌ను హీరోగా ఎంచుకోవ‌టానికి రీజ‌నేంటి? - నేను డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందు మేక‌ర్స్ కొంత మంది హీరోల‌ను అప్రోచ్ అయ్యారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. నేను బోర్డ్ పైకి వ‌చ్చిన త‌ర్వాత న‌రేష్ అగ‌స్త్య పేరుని సూచించాను. అందుకు కార‌ణం.. ఆయ‌న రాజేంద్ర‌ప్రసాద్‌గారితో న‌టించిన సేనాప‌తి, మ‌త్తువ‌ద‌ల‌రా  చూశాను. త‌న యాక్టింగ్ న‌న్నెంతో ఆక‌ట్టుకుంది. దాంతో నేను న‌రేష్ పేరుని స‌జెస్ట్ చేశాను. ఆ స‌మ‌యంలో జీ5వాళ్లు న‌రేష్‌తో ప‌రువు సిరీస్‌ను చేస్తున్నారు. నాకు త‌న‌ను క‌ల‌వ‌టం చాలా సుల‌భ‌మైంది. లుక్ టెస్ట్ చేసిన త‌ర్వాత నాతో పాటు ఎంటైర్ టీమ్ న‌రేష్ అగ‌స్త్య‌నే విక‌ట‌క‌వి అని ఫిక్స్ అయ్యారు. న‌రేష్ రెట్రో లుక్‌లో అలా పాత్ర‌లో ఒదిగిపోయాడు.  న‌రేష్ అగ‌స్త్య పాత్ర‌ను ఎలా డిజైన్ చేశారు? - తెనాలి రామ‌కృష్ణుడి పాత్ర‌లోని చతుర‌త మిస్ కాకుండా ఉండేలా న‌రేష్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాం. హైద‌రాబాద్‌లో ఉండే ఓ యువ‌కుడు అప్ప‌ట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడుతూ ఎలా ఉండేవాడ‌నే దానిపై రీసెర్చ్ చేసి త‌న పాత్ర‌ను రాసుకున్నాం. ఇందులో న‌రేష్ డిటెక్టివ్‌.. డ‌బ్బు కోసం అమ‌ర‌గిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేదే అస‌లు క‌థ‌. న‌రేష్ చాలా మంచి న‌టుడు. యాక్ట‌ర్‌గా త‌న పాత్ర‌ను స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తారు. త‌ను నేచుర‌ల్ యాక్ట‌ర్‌.  మేఘా ఆకాష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది? - సీనియ‌ర్ యాక్ట‌ర్ సిజు మీన‌న్ అమ‌రగిరి ప్రాంతానికి వ‌య‌సుమ‌ళ్లిన‌ రాజుగా న‌టించారు. ఆయ‌న‌కు కొడుకు, కూతురు ఉంటారు. కూతురు కుమార్తె.. అంటే సిజు మీన‌న్ మ‌న‌వ‌రాలు పాత్ర‌లో.. అంటే అమ‌ర‌గిరి యువ‌రాణి మేఘా ఆకాష్ న‌టించింది. త‌ను సైక్రియాటిస్ట్ చ‌దువుకుంటున్న డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంది.  అమ‌ర‌గిరి ప్రాంతంలోని ఏ ర‌హ‌స్యాన్ని మీరు చూపించ‌బోతున్నారు? - 1940ల్లో అమ‌ర‌గిరి ప్రాంతంలో ఓ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంది. 1970లో అది మ‌ళ్లీ పున‌రావృత్త‌మ‌య్యేలా ఉంటుంది.  అలా జ‌ర‌గ‌టాన్ని అక్క‌డి ప్రజ‌లు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు స‌మ‌స్యా? అని హీరో అక్క‌డ‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అదేంటనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే.  విక‌ట‌క‌వి సీజ‌న్‌ 2 ఉంటుందా? - ఉంటుందండి.. రైట‌ర్ తేజ ఇప్ప‌టికే దాని మీద వ‌ర్క్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఇంకా పెద్ద స్కేల్‌లో విక‌ట‌క‌వి 2 ఉండ‌బోతుంది.  మ్యూజిక్ ప‌రంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు? - విక‌ట‌క‌వి సిరీస్‌కు అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించారు. రీసెంట్‌గా ఆయ‌న ఆయ్ సినిమాకు సంగీతాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. త‌ను 2016 నుంచి మంచి స్నేహితుడు. ఇద్ద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటుండే వాళ్లం. ఈ సిరీస్‌లోకి నేను ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అజ‌య్‌ను క‌లిసి వ‌ర్క్ చేద్దామా? అని అడిగాను. అప్పుడే ఆయ్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ అయ్యింది. త‌ను ముందు విక‌ట‌క‌వి మోష‌న్ పోస్ట‌ర్‌కు ఇచ్చిన థీమ్ మ్యూజిక్ అంద‌రికీ న‌చ్చింది. అలా త‌ను మా ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాడు. ఇక విక‌ట‌క‌వి పీరియాడిక్ క‌థ‌తో సాగే సినిమా కాబ‌ట్టి వింటేజ్ ట‌చ్‌తో సాగేలా సిరీస్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.  విక‌ట‌క‌విలో మిగిలిన కీల‌క పాత్ర‌లేవి? - న‌రేష్ అగ‌స్త్య‌, మేఘా ఆకాష్ కాకుండా రాజు పాత్ర‌లో సిజు మీన‌న్‌, ఎమ్మెల్యే పాత్ర‌లో ర‌ఘు కుంచె, ముక్తార్ ఖాన్‌, తార‌క్ పొన్న‌ప్ప‌, ర‌మ్య రామ‌కృష్ణ, అశోక్ కుమార్‌, అమిత్ తివారిగారు.. ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.   నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి? - ఓ న్యూ ఏజ్ ఐడియాతో సైఫై హార‌ర్ క‌థ‌ను తయారు చేసే ప‌నిలో ఉన్నాను. ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫాంట‌సీ మీద వ‌ర్క్ చేస్తున్నాను.
యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన స్రవంతి చొక్కారపు(sravanthi chokarapu)కొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే పొందింది.ప్రస్తుతం ఆమె అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో జాయిన్  అయ్యింది.ఈ విషయాన్ని తనే సామాజిక మాద్యమాల ద్వారా వెల్లడి చేసింది.  కేవలం ఆడవారి కోసం మాత్రమే ఈ పోస్ట్ చేస్తున్నాను. అసలు ఇలాంటి పోస్ట్ చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. గత ముప్పై, నలభై రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్. డాక్టర్ ని కలిసే టైమ్ లేక స్కానింగ్ చేయించుకోలేదు. ఒక రోజు షూటింగ్ ఉదయం 6:45 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది.ఆ తర్వాత విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ ని సంప్రదించాను. అప్పుడు కానీ తెలిసి రాలేదు నాకొచ్చింది చిన్న సమస్య కాదని,దాంతో వెంటనే హాస్పిటల్ లో  అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు హెల్త్ కంప్లీట్ గా రికవర్ అవ్వాలి ఇంతకు ముందు లాగా నడవాలంటే నాలుగు వారాల నుంచి ఐదు వారాల దాకా పడుతుందని డాక్టర్ చెప్పారు. సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే. ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిలు ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాం కాబట్టి హెల్త్ బాగోలేదని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో,ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి.అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరేహెల్త్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ వర్క్,షూట్స్ ఈవెంట్స్ అని హెల్త్ ని  నెగ్లెట్ చెయ్యకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి ఇవన్నీ ఆటోమేటిక్ గా సెట్ అవుతాయి  అని ఇనిస్టాగ్రమ్ వేదికగా సుదీర్ఘ నోట్ రాసుకొచ్చింది.  
  తారాగణం: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర, సలోని, కిషోర్, అజయ్ ఘోష్, సత్యం రాజేష్, పి. రవిశంకర్ తదితరులు సంగీతం: జి. వి. ప్రకాష్ సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఆర్ రచన, దర్శకత్వం: కరుణ కుమార్ నిర్మాతలు: విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి బ్యానర్స్: వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ విడుదల తేదీ: నవంబర్ 14, 2024 కెరీర్ స్టార్టింగ్ లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej). అయితే కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. వరుణ్ తేజ్ సోలో హీరోగా చేసిన చివరి మూడు సినిమాలు 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్' ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో 'మట్కా' (Matka) పైనే ఆశలు పెట్టుకున్నాడు వరుణ్. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాతో వరుణ్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకాన్ని కలిగించింది. మరి మట్కా ఎలా ఉంది? వరుణ్ తేజ్ ని హిట్ ట్రాక్ ఎక్కించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం. (Matka Movie Review)  కథ: తన తల్లితో కలిసి బర్మా నుంచి వైజాగ్ కి వస్తాడు వాసు(వరుణ్ తేజ్). చిన్నతనంలోనే హత్య కేసులో జైలుకి వెళ్లిన వాసు, తిరిగి వచ్చాక పూర్ణ మార్కెట్ కి చేరుకుంటాడు. అక్కడ కొబ్బరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఈ క్రమంలో ఒక గొడవలో గ్యాంగ్‌స్టర్ కె.బి.రెడ్డి(జాన్ విజయ్) మనుషులను కొట్టి, అతని ప్రత్యర్థి నాని బాబు (కిషోర్)కి దగ్గరవుతాడు. నాని బాబు క్లబ్బులు నడుపుతూ రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచనలో ఉంటాడు. అతని అండదండలతో వాసు పూర్ణ మార్కెట్ కి నాయకుడిగా ఎదుగుతాడు. బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తాడు. ఆ తర్వాత మట్కా అనే కొత్త జూదం వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో వాసుకి ఎదురైన సవాళ్లు ఏంటి? మట్కా ఆటలోకి ప్రవేశించాక అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  విశ్లేషణ: గ్యాంగ్‌స్టర్ కథలు దాదాపు ఒకేలా ఉంటాయి. సామాన్యుడైన హీరో.. నేర సామ్రాజ్యంలో అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ కామన్ గా ఉంటుంది. అయితే పాయింట్ కామన్ అయినప్పటికీ.. దాని చుట్టూ కథనాన్ని, సన్నివేశాలను ఎలా అల్లుకున్నామనేది కీలకం. కానీ మట్కాలో అదే కొరవడింది. ఒక రొటీన్ కథను మరింత రొటీన్ గా తెరకెక్కించారు.  వాసు పాత్రను పరిచయం చేస్తూ మట్కా సినిమా ప్రారంభమైన తీరు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వాసు ప్రయాణమే చాలా చప్పగా సాగింది. కథనం ఆసక్తికరంగా లేదు, సన్నివేశాలలో కొత్తదనం లేదు. ఇలాంటి కథకు, హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేయాలి. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి, చివరివరకు ట్రావెల్ అవ్వగలిగేతేనే సినిమా మెప్పిస్తుంది. కానీ ఇందులో ఏ దశలోనూ వాసు పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా టైం తీసుకున్నాడు. పోనీ మెయిన్ స్టోరీలోకి వెళ్లిన తర్వాత అయినా.. ఎంగేజింగ్ గా ఉంటుందా ఉంటే అదీ లేదు. హీరో పాత్రకి బలమైన సవాళ్లు ఎదురుకావు. అసలు తనకు ఎదురే లేదన్నట్టుగా అన్నీ చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాడు. దాదాపు సన్నివేశాలన్నీ సినిమాటిక్ గానే ఉన్నాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయినా కాస్త పరవాలేదు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాయి. ఏకంగా దేశ ఆర్ధిక వ్యవస్థకే ముప్పులా మట్కా మారుతుంది. ఈ క్రమంలో మట్కా కింగ్ అయిన వాసుని పట్టుకోవడానికి సీబీఐ ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు వాసు సామ్రాజ్యాన్ని కూల్చడానికి అతని ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వాసుకి ఎన్నో సవాళ్లు ఎదురు కావాలి. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. చూసే ప్రేక్షకులకు కలగాలి. కానీ ఏ సందర్భంలోనూ అలాంటి ఉత్కంఠ కలగదు. పతాక సన్నివేశాలు కూడా మెప్పించలేదు. మట్కా రచయితగా దర్శకుడు కరుణ కుమార్ ఏమాత్రం మెప్పించలేకపోయారు. మట్కా అనే కొత్త పాయింట్ తీసుకుంటే సరిపోదు.. కథనం, సన్నివేశాల్లో కొత్తదనం ఉండాలనే విషయాన్ని ఆయన పూర్తిగా మరిచారు. జి.వి. ప్రకాష్ సంగీతం మెప్పించింది. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలాల్లో ఒకటిగా నిలిచింది. ఏ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: వాసు పాత్రలో వరుణ్ తేజ్ చక్కగా ఒదిగిపోయాడు. విభిన్న దశల్లో జరిగే కథ కావడంతో.. అందుకు తగ్గట్టుగా లుక్స్ పరంగా, బాడీ ల్యాంగ్వేజ్ పరంగా వైవిధ్యం చూపించాడు. నటుడిగా వరుణ్ తేజ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మీనాక్షి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సినిమాలో ఎందరో పేరున్న నటీనటులు ఉన్నారు కానీ, వారి పాత్రలు గుర్తుంచుకునే అంత గొప్పగా లేవు. ఫైనల్ గా... కొత్తదనం లేని కథ, ఆసక్తి రేకెత్తించని కథనంతో మట్కా సినిమా చప్పగా సాగింది. వరుణ్ తేజ్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. రేటింగ్: 2.25/5  
Cast: Suriya, Bobby Deol, Disha Patani, Natarajan Subramaniam, K. S. Ravikumar, Redin Kingsley, Yogi Babu, Kovai Sarala, Mansoor Ali Khan Crew:  Cinematography by Vetri Palanisamy Music by Devi Sri Prasad Editing by Nishadh Yusuf Written by Siva, Adhi Narayana, Madhan Karky Directed by Siva Produced by K. E. Gnanavel Raja, V. Vamsi Krishna Reddy, Pramod Uppalapati Suriya has been promising to take Kollywood to Pan-India level with Kanguva from past one year. He worked on Kanguva with this dream from past 2 years with Siva as director to deliver a cinematic epic. He has been promotiong tirelessly for past three months expecting a good turn out to the film and the much awaited big box office success for him. His fans have been eager to see him make a big comeback as for past one decade, he has been delivering one underwhelming film after another. Let's discuss in detail, if Kanguva delivers on all the big promises.  Plot:  Francis Theodore(Suriya) lives in Goa and he is a bounty hunter. His girlfriend Angelina(Disha Patani) is also a bounty hunter and they keep accepting difficult tasks keeping their live in danger. One day, when Francis hunts for a criminal, accidentally the criminal dies in his hands. A kid, Zita watches this incident and Francis asks him to stay with him. He almost forces him but the kid starts to see Franics as Kanguva(Suriya). He keeps referring to him by the name of 2000 year old clan ruler. Why would he do so? Is the kid, a reincarnation? Is Francis really Kanguva's reincarnation? Why the kid is important to him and how Rudhira(Bobby Deol) is connected to all this? Watch the movie to know more.  Analysis:  Kanguva is an ambitious film with little effort put in to make it worthy. When you see a film like Avatar, you tend to ask yourself, what is the reason for making such a huge film with so many stunning visuals. You get 100 different perspectives to decipher about the ambition, social commentary, intention and honesty behind the craft. Kanguva lacks in inspiring such discussion even though it is technically good and spectacular visually. The problem lies in lacklustre execution.  Siva as a director is good visual grammar but has few extreme choices in comedy and high belief in commerical formula. There is a need for him to break out from those beliefs as his ambition, vision and visual capabilities are being hindered by his choices in comedy, loud scenes. He loves to showcase characters loud but there is difference in them being loud for the purpose and on purpose. This film seems to have loud scenes on purpose rather than suitable for the story and setting.  Also, he is able to patiently create a world, take us into it but then he is unable to sustain our interest in that world, in this film. You need the story to move and screenplay cannot feel stagnant forever. When there is so much to say and you limit it for the sake of putting it out in two parts, the weight of the ambition drags you down. Kanguva has lot going for with an inspired Suriya, good back ground score by Devi Sri Prasad, grand production values and great technical team.  Yet, the writing seems to be on the wall with characters having generic ambitions and never growing out of being cardboard pieces as lively characters. All the effort seems to have down a drain. Suriya's performance as Kanguva is much better and inspired than as Francis. Rest all actors also looked like they have been invited to a screaming match rather than to act as characters.  In Conclusion:  Kanguva needed a much better and innovative writing for all the effort, ambition and technical craft went into its making.  Rating: 2.5/5   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి జీవితంలో పురోగతి కోసం అనేక ఆలోచనలను అందించాడు. వాటిలో ఒకటి మరొకరి సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో ఉండకూడదు. ఒక వ్యక్తి దురాశతో ఇతరుల డబ్బుపై చెడు కన్ను వేయకూడదు. అది ఇతరుల సంపదపైనా లేదా డబ్బుపైనా, మనం దానిపై చెడు దృష్టి పెడతాము. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇతరుల సంపద లేదా డబ్బు కోసం అత్యాశతో మనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము...? ఇప్పుడు తెలుసుకుందాం. ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది: చాణక్యుడు ప్రకారం, మితిమీరిన అత్యాశతో ఉన్న వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను లేదా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. జీవితంలో చాలా నష్టాలను భరించవలసి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఇతరుల సంపదపై: ఆచార్య చాణక్య మనం ఎప్పుడూ ఇతరుల సంపదపై అత్యాశకు గురికాకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దానితో మనం సంతృప్తి చెందాలి. మరి వారిలాగా ప్రగతి సాధించేందుకు కృషి చేయాలి. ప్రాణాపాయం: ఇతరుల సంపదపై అత్యాశతో ఉండటం ప్రమాదానికి దారి తీస్తుంది. మితిమీరిన కోరికతో ఇతరుల సంపదను అపహరించడానికి చెడు మార్గాలను ఆశ్రయించవలసి ఉంటుంది. దీని వల్ల మీరు మీ జీవితాన్ని కోల్పోవచ్చు. మనిషి జీవితంలో ఏది లభించినా దానితో సంతృప్తి చెందాలని చాణక్యుడు చెప్పాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే మనం సంతృప్తి చెందగలం, ఇతరుల డబ్బును దోచుకోవడం లేదా వారి డబ్బు కోసం అత్యాశతో కాదు.                                                 
  సమాజమైనా, దేశమైనా, ప్రపంచమైనా అభివృద్ధి చెందాలంటే  పూలమొక్కల్లాంటి పిల్లల్ని మనం చక్కగా కాపాడుతూ, వారిని విలువలవైపు నడిపిస్తూ, వారిలో అవకాశాలన్నీ అందిపుచ్చుకునే సామర్ధ్యం పెంచాలి. అప్పుడే ఈ లోకం అందమైన పూలతోటలా విస్తరిస్తుంది.  ఇదే నిజాన్ని పండిట్ జవహార్లాల్ నెహ్రూ నమ్మి, వారిని దేశ భవిష్యత్తుగా భావించి, వారి వికాసం కోసం కృషి చేశారు. అందుకే ఆయన జన్మదినమైన నవంబర్14 తేదీన, సమాజానికి బాలల ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వారి మౌలిక హక్కుల రక్షణకు ప్రతిజ్ఞ చేస్తూ జాతీయ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము.  ఈ రోజు పిల్లల అభిరుచులు, అభివృద్ధి, వారి హక్కులు, అవసరాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. జవహర్‌లాల్‌ నెహ్రూ దృష్టిలో పిల్లలు దేశ భవిష్యత్తు. అందుకే వారి విద్య, సురక్ష, ఆనందంపై మనం కృషి చేయాలి. ప్రతి చిన్నారి భయపడి కాకుండా తన కలల్ని నిజం చేసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని ఆయన ఆశించారు. చిన్నారుల జీవితాలు ఆనందమయం కావడం మనందరి బాధ్యత. ఈ రోజు మన చిన్నారులకు ప్రేమ, అవగాహన, స్నేహం చూపించి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి. అలాగే సమాజంలో పిల్లలు ఎదుర్కునే సమస్యల గురించి కూడా అర్థం చేసుకోవాలి.  చిన్నారులు ఎదుర్కొనే సవాళ్ళు.. బాలల దినోత్సవం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనే సవాళ్లను కూడా ముందుకు తీసుకువస్తుంది, వీటిలో పేదరికం, విద్య, ఆరోగ్య సంరక్షణ కొరత, శిశు కార్మికత్వం వంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా  తక్కువ ఆదాయ కుటుంబాల పిల్లలు, పాఠశాలకు వెళ్లాల్సింది పోయి చిన్న వయసులోనే పని చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాలల దినోత్సవం  ఈ సవాళ్లను పరిష్కరించేందుకు అవగాహన పెంపొందించడమే కాకుండా, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడం కోసం అందరూ కలసి చేపట్టవలసిన చర్యలను ప్రోత్సహిస్తాయి. బాలల ప్రాథమిక హక్కులు.. బాలల  దినోత్సవంలో  ప్రధానంగా  ఉన్నది  విద్యకున్న  ప్రాముఖ్యత  తెలియచేయటం.  పేదరికం  నుంచి బయటపడేందుకు, పిల్లలకు మంచి విద్య అందించడమే కీలకమైన మార్గం. పిల్లల నేపథ్యమేదైనా సరే, వారికి విద్య అనేది మౌలిక హక్కుగా పరిగణించబడుతోంది. పాఠశాలలు, చాలా సంస్థలు విద్యను సరదాగా నేర్చుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలను నిర్వహిస్తాయి. విద్యతో పాటు, ఆట కూడా పిల్లల అభివృద్ధిలో విలువైన పాత్ర పోషిస్తుంది. వినోదాత్మక కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక ప్రదర్శనలు పిల్లల సృజనాత్మకతను, సామాజిక నైపుణ్యాలను వెలుగులోకి తెస్తాయి. ఈ సంఘటనలు పిల్లలకు  అభివృద్ధి అనుభవాన్ని కలిగిస్తాయి. పిల్లల ప్రతిభ.. బాలల   దినోత్సవం   పిల్లల  ప్రతిభను గుర్తించి  ప్రశంసించే గొప్ప అవకాశం. పాఠశాలలు, వివిధ సంస్థలు తరచుగా టాలెంట్ షో,  కళా ప్రదర్శనలు  వంటి   కార్యక్రమాలను   నిర్వహిస్తాయి. ఈ   గుర్తింపు   పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచి, తమ అభిరుచులు, ఆసక్తులను  అనుసరించేలా  ప్రోత్సహిస్తుంది. డిజిటల్ భూతంతోజాగ్రత్త.. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు ఆన్‌లైన్ భద్రత కలిగి ఉండాలని నేటి బాలల దినోత్సవం నొక్కి వక్కాణిస్తోంది.  పిల్లలు ఎక్కువగా డిజిటల్  ప్లాట్‌ఫారమ్‌లతో  గడుపుతున్నారు.  స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, సిస్టమ్ వంటివి పిల్లలకు ఆటవస్తువులు అయిపోయాయి. అయితే వీటి వల్ల  కలిగే ప్రమాదాలు, ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం.  చివరిగా పెద్దలుగా మనం చేయాల్సిన పనేంటంటే, పిల్లల అభిరుచులు, ఆసక్తులు,  వారి భవిష్యత్తు నిర్మాణం మన కర్తవ్యంగా భావించి, ఆ దిశగా అడుగులు వేయాలి. అప్పుడే దేశం ప్రగతిపథంవైపు వెళ్తుంది.                              *రూపశ్రీ   
  పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి! ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు. ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు. ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. - నిర్జర.
శరీరం  మెరుగైన పనితీరుకు కారణమయ్యే అన్ని పోషకాలను కలిగి ఉండటం వల్ల  పాలు లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2 (రిబోఫ్లావిన్), విటమిన్ B12, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ A, విటమిన్ D వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెంపొందించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  పాల వల్ల  ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలు తాగడం కొంతమందికి ప్రమాదకరం. ఏయే వ్యక్తులు పాలు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు  పాలు తాగకూడదు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంటగా మారుతుంది. వీరు పాలను తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లాక్టోస్ ప్రతికూలత  ఉన్నవారు పాలు తాగకూడదు. అంటే పాలు తాగడంతో  కడుపు ఉబ్బరం, అసిడిటీ లేదా వాంతులు లేదా విరేచనాలు కలుగుతుంటాయి కొందరికి. ఇలాంటి సమస్య ఉన్నవారు పాలు తాగకూడదు. పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత కొంతమందికి   వికారం లేదా వాంతులు అవుతాయని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి సమస్యలు  ఉన్న వ్యక్తులు పాలు తాగకూడదు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు, వీరికి  ఒక సిప్ పాలు తాగిన తర్వాత  వికారం మొదలైపోతుంటుంది. క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకూడదు. ప్రోస్టేట్ క్యాన్సర్ అయినా, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా, అండాశయ క్యాన్సర్ అయినా, అలాంటి వారు పాలు అస్సలు తాగకూడదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం పడటం వంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు. అలాగే పాలు తాగడం వల్ల అలర్జీ ఉన్నవారు కూడా  పాలు అస్సలు తాగకూడదు.  ఏవైనా చర్మవ్యాధులు ఉన్నా, పాలు తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు లేదా ముడతలు వచ్చే ప్రమాదం ఉన్నా పాలు తాగకూడదు.  ఇవి మాత్రమే కాకుండా హృద్రోగులు పాలు తాగకూడదు. పైన చెప్పుకున్న సమస్యలున్నవారు పొరపాటున కూడా పాలు తీసుకోకూడదు.                                                             *నిశ్శబ్ద.
మెదడు కూడా మన శరీరవ్యవస్థలో ఒక భాగమే! దానికీ తగినంత నీరు కావాలి. దానికీ సరిపడా పోషకపదార్థాలు చేరుతుండాలి. అందుకే మనం తీసుకునే ఆహారపు ప్రభావం ఎంతోకొంత మన మెదడు పనితీరు మీరు ఉంటుంది. అంతేకాదు! శరీరంలోని మిగతాభాగాల ఆరోగ్యం కూడా ఒకోసారి మెదడు మీద కనిపిస్తుంది. అందుకే... ఎలాంటి ఆహారం తీసుకుంటే మన మెదడుకి మంచిదో సూచిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని ఇవిగో...   చాక్లెట్లు చాక్లెట్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చేమాట నిజమే! కానీ డార్క్‌ చాక్లెట్లను మితంగా తినడం వల్ల మన గుండెకు, రక్తపోటుకీ మంచిదంటూ ఎన్నో పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తద్వారా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందంటున్నారు. డార్క్‌ చాక్లెట్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ల వల్ల కీడుకంటే మేలే ఎక్కువ. కాకపోతే చాక్లెట్‌ నల్లటిదై ఉండాలి (డార్క్‌), మోతాదు మించకుండా తినాలి.   ఆకుకూరలు పచ్చగా ఉండే ఆకుకూరలు తింటే ఆ ప్రభావమే వేరంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర, బ్రకోలి వంటి ఆకుకూరల వల్ల జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుందట. వీటిలో ఉండే సి,బి, కె, ఇ వంటి విటమిన్లు.... ఐరన్‌, మెగ్నీషియం వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆకుకూరలను తరచూ తిన్నవారి జ్ఞాపకశక్తి అమోఘంగా ఉండటమే కాదు... వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న విషయాలు సుదీర్ఘకాలం పాటు చెక్కుచెదరవని అనేక పరిశోధనలలో రుజువైంది.   చేపలు మాంసాహారం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక. కానీ వాటిలో చేపల గురించి మాత్రం కాస్త మంచి మాటలే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ వల్ల గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఈ ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటుగా Docosahexaenoic acid (DHA) అనే రసాయనం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందట. పిల్లల్లో కనిపించే ADHD వంటి మానసికమైన లోపాలలో సైతం చేపలు తమదైన ప్రభావం చూపుతాయట.   పప్పులు బాదంపప్పులు తింటే మెదడు చురుగ్గా ఉంటుందని తరతరాల నుంచీ వింటూనే ఉన్నాము. ఇక ఈ మధ్యకాలంలో బాదంతో పాటుగా ఆక్రోటుని కూడా తినమని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లతో పాటుగా సమృద్ధిగా లభించే విటమిన్‌ ఇ వల్ల మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయట. పైగా వయసుతో పాటుగా వచ్చే మతిమరపు వంటి సమస్యలు కూడా దరిచేరవని ఘంటాపథంగా చెబుతున్నారు.   టమాటాలు మెదడుకి మేత కోసం రూపొందిన జాబితాలో టమాటాలు కూడా ఉండటం ఆశ్చర్యమే! టమాటాలలో ఉండే ‘లైసోపిన్’ అనే రసాయనం మెదడులోని కణాలు దెబ్బతినకుండా చూస్తుందట. దానివలన మెదడు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అల్జీమర్స్ వంటి వ్యాధులు సైతం దాడి చేసేందుకు వెనకాడతాయట. ఇవే కాకుండా పసుపు, తృణధాన్యాలు, కొబ్బరినూనె, నెయ్యి, బీన్స్‌, అవ్‌కాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటి పదార్థాలు కూడా మెదడు సామర్థ్యాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యవంతంగా ఉంచడంలోనూ సాయపడతాయని సూచిస్తున్నారు.   - నిర్జర.