LATEST NEWS
వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు. పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి.  జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన సైతాన్ సైన్యం చేత విష ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించారు. ప్రభాస్ తో తనకు ఏవో సంబంధాలు ఉన్నాయని కొన్ని యూట్యూబ్ చానల్స్ చేత విష ప్రచారం చేయించింది జగన్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభాస్ తో ఏనాడు పర్సనల్ గా కలిసింది లేదు. జగన్ కు ఈ విషయం తెలుసు. చెల్లెలు మీద విష ప్రచారం జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడని షర్మిల ప్రశ్నించారు.  నా అన్న జగన్ తన సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించాడన్నారు. చెల్లెలు మీద జుగుప్సాకర ప్రచారం చేయడం, తల్లి మీద కేసు బనాయించడం, తండ్రి పేరును సిబిఐ చార్జిషీట్ లో ఇరికించడం జగన్ కే చెల్లిందన్నారు.  అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో యోగి చిత్రాన్ని షర్మిల మేనమామ  రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించారు. అప్పటి నుంచి షర్మిల, ప్రభాస్ మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో  ఈ వీడియోలు చక్కర్లు కొడుతుండటపై షర్మిల  తీవ్ర మనస్థాపం చెంది కేసు బనాయించారు.  వీడియోలను డిలీట్ చేయించారు. తాజాగా తనకుప్రభాస్ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 
అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. కాగా అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల పేరు ఖరారైంది. ఈ మేరకు వేగుళ్లకు ప్రభఉత్వం నుంచి సమాచారం కూడా అందింది.  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన వేగుళ్ల జోగేశ్వరరావు 2004 ఎన్నికలలో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆలమూరు నియోజకవర్గం మాయమై.. మండపేట నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికలలో మండపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో వేగుళ్ల విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వేగుళ్లకు చంద్రబాబు ఈ సారి కేబినెట్ లో చోటు కల్పిస్తారని అంతా భావించారు. అయితే సమీకరణాల కారణంగా వేగుళ్లకు కేబినెట్ లో స్థానం దక్క లేదు. అయితే పార్టీకి వేగుళ్ల సేవలను గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు అంచనాల కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు.  వేగుళ్లకు 2009 నుండి అనేక కమిటీల్లో సభ్యుడుగా వేగుళ్లకు పని చేసిన అనుభవం ఉంది
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న  బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని  దేశ సర్వోన్నత న్యాయస్థానం  పేర్కొంది. ఇది ఆర్టికల్ 19 ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. నిందితుడి తప్పు వల్ల  అతడి  కుటుంబ సభ్యులను రోడ్డున పడేయడం దారుణం, దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు విస్ఫష్టంగా పేర్కొంది.  అవి అక్రమ నిర్మాణాలు అయితే కనీసం   15 రోజుల ముందు నోటీసు ఇచ్చి కూల్చివేయాలని,  నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని ఆదేశించింది.   ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికారులే బాధ్యత వహించాలని, కూల్చిన కట్టడాలను సొంత ఖర్చులతో నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  ఈ తీర్పు బుల్డోజింగ్ పాలకులకు కనువిప్పు కలిగిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే యోగి సర్కార్ ఇలా సుమారు   నాలుగు లక్షల ఇళ్లు కూల్చివేశారు. ఈ నిరంకుశ న్యాయం మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన ఈ బుల్డోజింగ్ న్యాయానికి వ్యతిరేకంగా గత కొంత కాలంగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్లో వామపక్షాలు దీనిపై గట్టిగా గళమెత్తాయి.  గత ఏడేళ్లుగా ఈ దారుణం యూపీలో జరుగుతుంటే అదొక ఘనకార్యం గా ఆ పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి.   మైనార్టీ వర్గాలపై బీజేపీ ప్రభుత్వం బుల్డోజింగ్ ప్రయోగిస్తున్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్  ఇటీవల  ఆందోళన వ్యక్తం చేసింది.  తాజాగా ఇలాంటి కూల్చివేతలపై సుప్రీంకోర్టులో దాఖలైన ఈ కేసు విచారించిన  సుప్రీం కోర్టు ద్విసభ్య   ధర్మాసనం   తీర్పు వెలువరించింది. తెలంగాణలో కూడా బుల్డోజింగ్ తరహాను ఫాలో అవుతున్న హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలు నిర్మించిన వారికి సమయం ఇవ్వాల్సిఉంది. హైడ్రా విధానం ప్రారంభంలో దూకుడుగా వెళ్లిన విషయం విదితమే. మూసినది చుట్టుపక్కల ఆక్రమణల పై కూడా ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. దీనిపై  ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఈ బుల్డోజింగ్ పై సుప్రీంకోర్టు లో  విచారణ  ప్రారంభమైనప్పటి నుంచి హైడ్రా దూకుడు ఒకింత తగ్గింది.   మొత్తం మీద నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలను అక్రమంగా కూల్చివేయడం తగదంటూ సుప్రీం వెలువరించిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి  అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి  ఉంది. ఎంఎస్    చదవడానికి ఆర్యన్ రెడ్డి  గత సంవత్సరం అమెరికా వెళ్లాడు . లైసెన్స్ హంటింగ్ గన్ శుభ్ర పరుస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చదువుకోవడానికి వెళ్లిన ఆర్యన్ రెడ్డి లైసెన్స్ గన్ ఎక్కడ నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది.   నవంబర్ 13న ఆర్యన్ రెడ్డి బర్త్ డే. ఆ రోజు కాలేజికి వెళ్లకుండా తన గదిలోనే ఆర్యన్ రెడ్డి  మృతి చెందాడు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 23 ఏళ్ల ఆర్యన్ రెడ్డికి వేటాడటం హాబీ అని తల్లి దండ్రులు చెబుతున్నారు. శుక్రవారం సాయంతం(నవంబర్ 22) ఆర్యన్ రెడ్డి డెడ్ బాడీ హైద్రాబాద్ చేరుకోనుంది. పది రోజుల క్రితం చనిపోయినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికా పోలీసులు తల్లి దండ్రులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు. అనర్హులకు కూడా ప్రభుత్వం తరఫున వేతనాలు చెల్లించేశారు. మొత్తంగా జగన్ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోయాయి. నిబంధనలు అనేవి ఉంటాయన్న సంగతే ఆయా వ్యవస్థల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు సైతం మరచిపోయారా అన్నట్లుగా అప్పట్లో పరిస్థితి ఉండింది.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం కొలువుదీరిన తరువాత నాడు జరిగిన తప్పులు, అవకతవకలు, అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ కు కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చే అక్రిడెషన్ కు ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిన విషయం బయటకు వచ్చింది.  ఇంతకీ ఇంటూరి రవి కిరణ్ ఎవరంటే.. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అత్యంత అసభ్య పోస్టులను పెట్టే మొనగాడు. జగన్ భజన, జగన్ సర్కార్ వ్యతిరేకులపై అసభ్య పోస్టులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోవడంలో ఇంటూరీ ఆరితే రిపోయారు. ఆయన కృషి, ప్రత్యర్థులపై అసభ్య, అసహ్యకర పోస్టులు పెట్టడంలో ఆయన సృజన జగన్ ను మెప్పించింది. దాంతో ఆయన పనికి మెచ్చిన జగన్ తన హయాంలో డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెలకు 73 వేల రూపాయల భారీ వేతనాన్ని చెల్లించే ఏర్పాటు చేశారు. తన భజన చేసినందుకు, తన ప్రత్యర్థుల వ్యక్తిత్వహననానికి పాల్పడేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రజాధనాన్ని ఇంటూరికి జగన్ అప్పనంగా దోచి పెట్టేశారన్న మాట. అయితే అక్కడితో ఆగలేదు.. అర్హులైన జర్నలిస్టులకు కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టి మరీ నిరాకరించిన అక్రిడేషన్ ను ఎలాంటి అర్హతలూ లేని ఇంటూరి రవికుమార్ కు అతి సునాయాసంగా జారీ అయిపోయింది. డిజిటల్ కార్పొరేషన్ నుంచి అప్పనంగా వేతనం అందుకుంటూ, ఆ సంస్థ పే రోల్ లో ఉన్న ఇంటూరి రవికుమార్ కు జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ ఎందుకు ఇచ్చారంటే.. పాపం పౌరసరఫరాల శాఖ మాత్రం ఏం చెప్పగలదు? పైవాడు ఆదేశించాడు.. మేం ఆచరించామని బిక్కముఖం వేసుకోవడం తప్ప. జగన్ హయాంలో వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలు ఎంతగా దిగజారి వ్యవహరించాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. అయితే జగన్ హయాంలో జరిగిన పాపాల పుట్ట పగులుతోంది. సోషల్ మీడియాలో  అనుచిత పోస్టులతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా కేసులు, అరెస్టులు వెంటాడుతున్నాయి. ఇంటూరి ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారు. ఇక  నిబంధనలకు తిలోద కాలిచ్చేసిన అధికారుల వంతు రానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
రెబల్ స్టార్ ప్రభాస్ కి, వైఎస్ షర్మిలకు మధ్య రిలేషన్ ఉన్నట్టు గతంలో కొందరు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆ ప్రచారాన్ని ఖండించిన షర్మిల.. మరోసారి ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.  పొలిటికల్ మైలేజ్ కోసం తన అన్న జగన్మోహన్ రెడ్డి, తన పేరుని వాడుకుంటున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ ఉన్న ఐపీ అడ్రెస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టినట్లు ఇటీవల జగన్ గారు ఎంటర్టైనింగ్ గా చెప్పారు. చెల్లెలిపై నిజంగా ప్రేమ ఉంటే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వయిరీ చేయకుండా గాడిదలు కాసారా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్ళలో మీ సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించలేదా? అని నిలదీశారు. మీ మైలేజ్ కోసం ఏమైనా చేస్తారు. అమ్మ మీద కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐలో పెడతారు, చెల్లి మీద తప్పుడు ప్రచారం చేస్తారని షర్మిల విరుచుకుపడ్డారు. నేను అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం వేసి చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను.. ప్రభాస్ తో నాకు సంబంధం లేదు. అసలు ప్రభాస్ ఎవరో కూడా నాకు తెలీదు. ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు అని షర్మిల అన్నారు.
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వింటే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లైన్‌లో ఉన్న సినిమాలన్నీ భారీ నుంచి అతి భారీ బడ్జెట్‌ సినిమాలే. అన్నీ వందల కోట్లతో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలే. పాన్‌ ఇండియా స్టార్‌గా తన స్టామినా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్‌ మార్కెట్‌కి తగ్గట్టుగా బడ్జెట్‌ని ఎంతైనా పెట్టేందుకు నిర్మాతలు సిద్ధపడుతున్నారు. అయితే తమ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు ఉండాలని మాత్రం అనుకుంటున్నారు. ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఐదారు సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదట రిలీజ్‌ అయ్యే సినిమా ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కథ, కథనాల గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దాన్ని బట్టి రొమాంటిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందనే ప్రాథమిక అంచనాకి వస్తున్నారంతా.  ప్రభాస్‌ ఇంతవరకు చేయని ఓ కొత్త తరహా క్యారెక్టర్‌ రాజా సాబ్‌లో చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ సినిమాలో టోటల్‌గా 6 పాటలుంటాయి. అందులో ఒక రీమిక్స్‌ సాంగ్‌ కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఏ పాటను రీమిక్స్‌ చేశారనేది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇందులోనే ఒక స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉందని తెలుస్తోంది. ప్రభాస్‌ రేంజ్‌కి తగ్గట్టుగా, సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా ఆ  స్పెషల్‌ సాంగ్‌ కోసం ఎవరూ ఊహించని ఒక స్టార్‌ హీరోయిన్‌ని రంగంలోకి దింపే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. అందర్నీ షాక్‌కి గురిచేసే ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. నయనతార. 17 సంవత్సరాల క్రితం ‘యోగి’ చిత్రంలో ప్రభాస్‌తో జతకట్టిన నయన్‌తోనే ఆ పాట చేయించాలని మేకర్స్‌ భావిస్తున్నారు.  ఇక నయన్‌ విషయానికి వస్తే.. ఈమధ్యకాలంలో ఆమె లీడ్‌ రోల్స్‌తో వచ్చిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. 40 ఏళ్ళ వయసులోనూ ఇప్పటికీ ఫిట్‌గా ఉన్న నయన్‌ ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలు కమిట్‌ అయి ఉంది. హీరోయిన్‌గా తప్ప ఇప్పటివరకు ఏ సినిమాలోనూ స్పెషల్‌ సాంగ్‌ చెయ్యని నయనతారను రాజాసాబ్‌ కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. గతంలో తన డైరెక్షన్‌లో వచ్చిన ఓ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం నయన్‌ని అప్రోచ్‌ అయ్యారట మారుతి. కానీ, ఆ ఆఫర్‌ను నయన్‌ తిరస్కరించింది. ఇప్పుడు ప్రభాస్‌ కోసం ఆమె స్పెషల్‌ సాంగ్‌ చేస్తుందా అనే అనుమానం యూనిట్‌లో అందరికీ ఉంది. ఎలాగైనా ఆమెను ఒప్పించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. ఇప్పటివరకు రాజాసాబ్‌కి సంబంధించి రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌, మోషన్‌ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న రాజా సాబ్‌కి సంబంధించిన ఫస్ట్‌ సింగిల్‌ను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తారని తెలుస్తోంది. ఇక సినిమాను ఏప్రిల్‌ 10న సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 
Cast: Satyadev, Daali Dhanunjaya, Priya Bhavani Shankar, Harsha Chemudu, Satyaraj, Jennifer Piccinato, Sunil, Satya Crew:  Written by Meeraqh, Eashvar Karthic, Yuva Cinematography by Sathya Ponmar Music by Ravi Basrur Produced by Bala Sundaram, S. N. Reddy, Dinesh Sundaram Directed by Eashvar Karthic Satyadev, one of the dependable performers of Telugu Cinema, has been looking to excel in leading roles and establish himself at the box office. But the actor has been marred by his script selection as the films he selected have been getting critical acclaim for his performances but failing at the BO. Now, he is taking a huge leap of faith with Zebra, a high budget multi-starrer in the direction of Eashvar Karthic. The movie released on 22nd November and let's discuss about it in detail.  Plot:  Surya (Satya), a skilled problem-solver, knows the ins and outs of the banking system and is adept at handling the most challenging customers at the Bank of Trust. He is in love with Swathi (Priya Bhavani Shankar) and considers Bob (Harsha) and his mother to be his family. When a minor issue arises in Swathi's bank, Surya takes charge and resolves it within minutes. However, he is unaware of the larger problems that will arise from his actions.  Enter Aadhi (Daali Dhananjaya), a ruthless assassin turned business mastermind, who needs to complete his most prestigious project to meet the most powerful figure in his life. Surya's intervention leads to unforeseen trouble, and Aadhi finds himself needing Surya to clear the issue. The question arises: What is Aadhi's issue with Surya? How does a small-time bank employee get embroiled in such a dangerous situation? Can Surya clear the stain on Aadhi's reputation, or will he have to face him in a battle? The rest of the story unfolds as we discover the answers to these questions Analysis:  For a film that deals with banking system, one needs to be clear and detail-oriented in screenplay. Lucky Baskhar gets this right while Zebra goes round in circles. It tries to include dark comedy elements, thriller elements and they threw everything at the wall trying to figure out if something does stick. The problem with such approach is that the movie falters in carrying audiences along with it. The intent in few scenes is clear that the makers want to be true to their story. But they leave those ideas half baked at script level itself.  Even a committed performance by Satydev doesn't really enhance the script. He once again gave everything to the character. He is able to convey emotions brilliantly yet it is hard to travel through just based on his character. The things he is pulling off needed much more explanation and detailing for us to connect with or even understand. Emotionally, comically and action wise he is able to do his best to salvage the script.  Daali Dhanunjaya has a charismatic screen presence. In his scenes, it is hard to notice another actor. But even his character has been limited to generic and regular tropes leaving us wondering "why". Satyaraj, Sunil, Satya and Harsha tried their best to evoke laughs but their characters aren't supported by consistent writing. Priya Bhavani Shankar looked beautiful but she did not have much scope to perform.  Production values are brilliant and huge for such a medium budget movie. Cinematography is top notch but Ravi Basrur disappoints with his songs. His Background score is fine but upto the standards we anticipate from him. Eashvar Karthic, the director repeated some of the mistakes he committed with his previous films like V1 and Penguin. His penchant to take a good idea is great but then he is not concentrating on detailing and character arcs that really help his films stand out. Zebra with good intentions could have been an enjoyable thriller but fizzles after an impressive beginning.  In Conclusion:  Movie starts off well but fizzles off towards the end.  Rating: 2.5/5 
రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత చరణ్‌ తర్వాతి సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ఎంతో కాలంగా ఆరోజు కోసం డైరెక్టర్‌ సానా బుచ్చిబాబు కూడా వెయిట్‌ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కానీ, రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం మొదలవ్వలేదు. నవంబర్‌ వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఏడాది లేనట్టేనని అందరూ భావించారు. నెక్స్‌ట్‌ ఇయర్‌లో ఆర్‌సి16 స్టార్ట్‌ అవుతుందని అందరూ ఫిక్స్‌ అయిపోయారు.  ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ మైసూర్‌లో ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజమేనని డైరెక్టర్‌ బుచ్చిబాబు శుక్రవారం అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మైసూర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్టు తెలిపారు. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ‘ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు బుచ్చిబాబు. అంతేకాదు, సినిమాకి సంబంధించిన బౌండెడ్‌ స్క్రిప్ట్‌ పట్టుకొని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ముందు ఆయన దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశారు. అనుకోకుండా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ న్యూస్‌ని, ఫోటోను షేర్‌ చేస్తున్నారు అభిమానులు.  విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రామ్‌చరణ్‌ ఇప్పటికే మైసూరు చేరుకున్నారు. మొదటి షెడ్యూల్‌ చరణ్‌తోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో ఉంటారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌లో జాన్వీ పాల్గొనే అవకాశం లేదట. ప్రస్తుతం బాలీవుడ్‌లో షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ రెండో షెడ్యూల్‌లో ఆర్‌సి16 సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన జాన్వీ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. 
తారాగణం: విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, నరేష్, సునీల్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు సంగీతం: జేక్స్ బిజోయ్ సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి ఎడిటర్: అన్వర్ అలీ ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం రచన, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి నిర్మాత: రామ్ తాళ్లూరి బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విడుదల తేదీ: నవంబర్ 22, 2024  ఈ ఏడాది ఇప్పటికే 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలతో అలరించిన విశ్వక్‌సేన్.. ఇప్పుడు 'మెకానిక్ రాకీ' అంటూ ముచ్చటగా మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Mechanic Rocky Movie Review) కథ: రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) చదువు మధ్యలోనే ఆపేసి, తన తండ్రి రామకృష్ణ(నరేష్) నడుపుతున్న గ్యారేజ్ లో మెకానిక్ గా పని చేస్తుంటాడు. గ్యారేజ్ లో రిపేర్లు చేయడంతో పాటు, డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజ్ ఉన్న స్థలంపై రంకి రెడ్డి (సునీల్‌) కన్నుపడింది. ఆ గ్యారేజ్ ని దక్కించుకోవాలంటే రూ.50 లక్షలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రూ.50 లక్షల కోసం రాకీ ఏం చేశాడు? గ్యారేజ్ ని కాపాడుకోగలిగాడా? అసలు ఈ కథలో ప్రియ (మీనాక్షి చౌదరి), మాయ (శ్రద్దా శ్రీనాథ్) పాత్రలేంటి? రాకీ జీవితంపై ప్రియ, మాయ పాత్రలు ఎలాంటి ప్రభావం చూపాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: విశ్వక్ సేన్ మొదటి నుంచి కథల ఎంపికలో ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తున్నాడు. కానీ 'మెకానిక్ రాకీ' ప్రచార చిత్రాలు చూసినప్పుడు మాత్రం ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనే అభిప్రాయం కలిగింది. నిజానికి ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది. మధ్యతరగతి వారి ఆశను ఆసరాగా చేసుకొని జరిగే మోసాలను ఇందులో టచ్ చేశారు. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథాకథనాలు రొటీన్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా నడుస్తుంది. ఎప్పుడో రావాల్సిన ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తుంది. పోనీ రొటీన్ గా ఉన్నా కాస్త అయినా ఎంటర్టైనింగ్ గా ఉంటుందా అంటే అదీ లేదు. పాత చింతకాయ పచ్చడి సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఇంటర్వెల్ కూడా జస్ట్ ఓకే. సెకండ్ హాఫ్ లోనే అసలు కథ ఉంటుంది. ట్విస్ట్ లు అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ తో నిరాశచెందిన ప్రేక్షకులు, సెకండ్ హాఫ్ తో కూల్ అవుతారు. సెకండ్ హాఫ్ లో కథనం, సన్నివేశాలు, ట్విస్ట్ లు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాలు పరవాలేదు. దర్శకుడు రవితేజ ముళ్లపూడిలో విషయంలో ఉంది. మొదటి సినిమా అయినప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా సినిమాని తెరకెక్కించాడు. అయితే రచన విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఒక మంచి పాయింట్ ని చెప్పాలనుకున్నప్పుడు, దానిని ఎంగేజింగ్ గా చెప్పాలని చూడాలి కానీ, అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఇరికించే ప్రయత్నం చేయకూడదు. ఫస్ట్ హాఫ్ ని ఏవో ఒక సీన్స్ తో నింపేసి, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ లతో హిట్ కొట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఫస్ట్ హాఫ్ కనీసం పరవాలేదు అనేలా ఉంటూనే, సెకండాఫ్ చూడాలనే ఆసక్తి కొంచెమైనా ప్రేక్షకుల్లో ఉంటుంది. అందుకే కేవలం ట్విస్ట్ ల పైనే ఆధారపడకుండా.. దాని చుట్టూ జరిగే కథ, సన్నివేశాలపై కూడా దృష్టి పెట్టాలి. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన జేక్స్ బిజోయ్, నేపథ్య సంగీతంతో మెప్పించాడు. చాలా సీన్స్ ని తన సంగీతంతో నిలబెట్టాడు. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ అన్వర్ అలీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటు డైలాగ్ లు, డ్యాన్స్ లతో అదరగొట్టాడు. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ఇద్దరికీ ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. ముఖ్యంగా శ్రద్దా శ్రీనాథ్ రోల్ సర్ ప్రైజింగ్ అని చెప్పవచ్చు. అయితే లుక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాలి. నరేష్, సునీల్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.  ఫైనల్ గా.. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మెప్పించింది. స్క్రిప్ట్ కి, అందునా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కి రిపేర్లు చేస్తే.. అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది. ప్రస్తుతానికైతే విశ్వక్ సేన్ ఎనర్జీ కోసం, సెకండ్ హాఫ్ కోసం ఒకసారి చూసేయొచ్చు. రేటింగ్: 2.5/5 
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప2’ రిలీజ్‌ని మళ్ళీ వాయిదా వేశారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్ట్‌ 15న సినిమా రిలీజ్‌ కావాల్సింది ఎన్నో కారణాలు, మరెన్నో అవరోధాల వల్ల రిలీజ్‌ని వాయిదా వేశారు. ఫైనల్‌గా డిసెంబర్‌ 5న సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. రెండేళ్ళ క్రితం రిలీజ్‌ అయిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండేళ్ళుగా ప్రేక్షకులు, అభిమానులు ‘పుష్ప2’ కోసం వెయిట్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 5న థియేటర్లలో సినిమా చూడొచ్చు అని ఆశపడుతున్న ప్రేక్షకులకు రిలీజ్‌ వాయిదా పడిందనే వార్త మింగుడు పడడం లేదు. అయితే ఈ వార్తలో నిజమెంత..?  రిలీజ్‌ని మళ్లీ ఎందుకు వాయిదా వెయ్యాల్సి వస్తోంది అనే దానిపై కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌ ఇంకా పెండింగ్‌ ఉందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ఇంకా బ్యాలెన్స్‌ ఉండడం వల్ల డిసెంబర్‌ 5 వరకు ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యే అవకాశం లేదనేది సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న మాట. ఇందులో నిజం ఉన్నప్పటికీ ఓ పక్క షూటింగ్‌ చేస్తూనే, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా ఫాస్ట్‌ ఫినిష్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఎక్కువ యూనిట్స్‌తో శరవేగంగా వర్క్‌ పూర్తి చేస్తున్నారని సమాచారం. నవంబర్‌ 28న షూటింగ్‌ పూర్తయ్యే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా స్పీడ్‌గా కంప్లీట్‌ చెయ్యాల్సిన అవసరం ఉంది. రిలీజ్‌కి సరిగ్గా వారం రోజుల ముందు షూటింగ్‌ పూర్తవుతుంది. మరి ఆ వారం రోజుల్లో ఎంత ఫాస్ట్‌గా వర్క్‌ చేసినా ఫస్ట్‌ కాపీ సిద్ధమవుతుందా అనే సందేహం అందరికీ వస్తుంది. కాబట్టి రిలీజ్‌ని వాయిదా వెయ్యడం అనివార్యం అనే వార్త ఇప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  సోషల్‌  మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై పుష్ప టీమ్‌ స్పందించింది. ట్విట్టర్‌లో పుష్ప అఫీషియల్‌ హ్యాండిల్‌ నుంచి ఒక జిఫ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘డిసెంబర్‌ 5న రిలీజ్‌. అసలు తగ్గేదేలే’ అంటూ ట్వీట్‌ చేశారు. దీన్ని బట్టి ఎట్టిపరిస్థితుల్లో ‘పుష్ప2’ డిసెంబర్‌ 5న రిలీజ్‌ అవుతుందని అర్థమవుతోంది. ప్రస్తుతం సుకుమార్‌ షూటింగ్‌లో ఉండగా, టెక్నికల్‌ టీమ్‌ నాన్‌స్టాప్‌గా వర్క్‌ కంప్లీట్‌ చేసే పనిలో ఉంది. మరోపక్క ప్రమోషన్స్‌ కోసం అల్లు అర్జున్‌ తన వంతు కృషి చేస్తున్నాడు. త్వరలోనే చెన్నయ్‌లో సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌కి సంబంధించిన ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. మేకర్స్‌ ఆ పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘పుష్ప2’ రిలీజ్‌ వాయిదా అనే ప్రచారానికి మేకర్స్‌ బ్రేక్‌ వేశారు. అంటే పుష్పరాజ్‌ డిసెంబర్‌ 5న థియేటర్లలో సందడి చేయడం ఖాయమన్నమాట. 
Cast: Vishwak Sen, Shraddha Srinath, Meenakshi Chaudhary, Naresh, Sunil Crew:  Music by Jakes Bejoy Cinematography by Manojh Reddy Katasani Editing by Anwar Ali Produced by Rajani Talluri Written & Directed by Ravi Teja Mullapudi Mass ka Das Vishwak Sen has been desiring to expand his market while sticking to interesting and diverse scripts. But he did not see much critical and financial appreciation for his Gangs of Godavari while Gaami did receive critical acclaim. Now, he needs Mechanic Rocky to click big time so that he can move on to his next film with even more confidence. But the movie got delayed due to his other films' issues and now, the movie released on 22nd November. Let's discuss about it in detail.  Plot:  Naresh (Vishwak) is a happy-go-lucky guy enjoying his college life with his best friend, Sekhar (Vishwadev Rachakonda), who is a passionate cricketer. Sekhar has a beautiful sister, Priya (Meenakshi), and at first glance, Rocky falls for her. Their lives are moving happily until an unexpected event causes everything to fall apart, and everyone gets separated.  After some time, Maaya (Shraddha Srinath) enters Rocky's life. Things start to change as Rocky narrates the events of his past to Maaya. Listening to his story, Maaya becomes a supportive shoulder for him. The mystery of who Maaya is, what happened to Rocky's life and his friends, and the issue that separated them all while eventually reuniting them, forms the rest of the story. Analysis:  Vishwak Sen as Rakesh is good in parts but he seemed a little bit disinterested in few scenes. Maybe he just did not get right direction to approach those scenes. But the ever reliable actor did not really give a highly convincing performance in a role like this. Still, he is effective in key scenes and did try to elevate the meandering script in the first hour.  Shraddha Srinath is again very good in this role. She proved once again that she is one of the best in the business when it comes to elevating the written material with her performance. Meenakshi Chaudhary is good but maybe she had too many releases in short time and she did look a little fatigued. All others did their best.  Production values and technical aspects for this film are good. Mainly, Jakes Bejoy did his best to elevate the scenes that really needed someone to give a push. He tried his best but the writing did not really help him. Production design is apt for the film and we could see the budget spent, on the screen.  Writing wise the film falters in setting up a decent level base in the first hour. While the twists and turns does slowly sink in during the second hour giving us a picture on what makers wanted to say, it still needed a better set-up. Also, the comic scenes in first hour test our patience to a level that it feels like we walked into an old film's re-release screening rather than watching a new one.  Similar to Das Ka Damki, where Vishwak tried to pull it off by telling an old tale in new bottle, here also he did try similar beats in screenplay to major commercial films from past few decades rather than making a fresh attempt in the setting up portions. Had the set up been more convincing, the second hour would have been a solid knit and movie would have been better.  In Conclusion:  Movie tries to be many things at the same time and hence, lacks coherence.  Rating: 2.5/5 
విశ్వక్ సేన్(Vishwak Sen)హీరోగా మీనాక్షి చౌదరి(meenakshi chowdary)శ్రద్దా శ్రీనాథ్(shraddha srinath)హీరోయిన్లుగా నటించిన 'మెకానిక్ రాకీ(mechanic rocky)మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజయ్యింది.రవితేజ ముళ్ళపూడి(ravi teja mullapudi)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ఆర్ టి కంబైన్స్ పతాకంపై రామ్ తాళ్లూరి(ram talluri)నిర్మించగా నరేష్, సునీల్,హర్ష వర్ధన్, హైపర్ ఆది వంటి వారు ప్రధాన పాత్రలని పోషించారు. ఇపుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు పొందటం జరిగింది. ఈ విషయాన్నీ మూవీ ప్రారంభంలో వచ్చే టైటిల్స్ ద్వారా అధికారకంగా వెల్లడి చేసారుఇక రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వెయ్యగా విశ్వక్ సేన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున వీక్షించడం జరిగింది.చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతాన్ని అందించాడు.  
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్(rocking rakesh)హీరోగా పరిచయమవుతున్న చిత్రం కేసిఆర్(kcr)అలియాస్ కేశవ చంద్ర రమావత్.ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గరుడవేగ' అనే చిత్రానికి ఫోటోగ్రఫిని అందించిన అంజి(anji)దర్శకత్వం వహించగా, రాకింగ్ రాకేష్ నే నిర్మాతగా కూడా వ్యవహరించాడు.  రీసెంట్ గా ఈ చిత్రం గురించి రాకింగ్ రాకేష్ మాట్లాడుతూఈ మూవీలో నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ అభిమానిగా కేశవ చంద్ర రమావత్ అనే బంజారా యువకుడిగా కనిపిస్తాను. అందుకే షార్ట్ కట్ లో కెసిఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యడం జరిగింది.ఇందులో కెసిఆర్ కూడా నటించారు. ఆయనకి తెలియకుండానే ఆయన్ని పెట్టి ఈ సినిమా తీసాను,ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ ని తీసుకొస్తుంది.ఇలాంటి మ్యాజిక్ లు సినిమాలో చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అనన్య కృష్ణన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్,లోహిత్ కుమార్, ధనరాజ్,రచ్చరవి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో చెయ్యగా చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించడం జరిగింది.  
సూపర్ స్టార్ కృష్ణ(krishna)మనవడు,మహేష్ బాబు(mahesh babu)మేనల్లుడు అశోక్ గల్లా(ashok galla)ఈ రోజు'దేవకీ నందన వాసుదేవ'(devaki nandana vasudeva)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఆర్ఎక్స్100 ఫేమ్ కార్తికేయ హీరోగా వచ్చిన గుణ 369 సినిమాని తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల(arjun jandyala) దర్శకుడు కాగా  హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)కథని అందించగా సోమినేని బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక చిత్రం రిలీజ్ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడుతూ మా మూవీ ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కిందే గాని, హనుమాన్ తరహాలో దేవుణ్ణి చూపించటంలేదు. నా క్యారక్టర్ పేరు కృష్ణ,హీరోయిన్ పేరు సత్యభామ,ప్రతి నాయకుడు కంసుడు.నా పాత్రకు ఒక గండం ఉండటంతో పాటుగా సినిమాలో కనిపించే కృష్ణుడి విగ్రహానికి కథకి ఒక లింక్ ఉంటుంది.ఇలా మూవీ ఆధ్యంతం మైథాలజీ మెటాఫర్ ఉంటూ బోలెడన్ని ట్విస్ట్ లు వస్తుంటాయి. చిత్ర ప్రారంభంలో మూవీ చూస్తుంటే మురారి గుర్తుకొస్తుంది.కానీ ఆ కధకు,మా మూవీకి పోలిక ఉండదు.ప్రశాంత్ వర్మ కథని బోయపాటి స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో మూవీ అలా ఉంటుంది.దర్శకుడు అర్జున్ జంద్యాల కూడా  గొప్పగా ఎలివేట్ చేసి చూపించాడని చెప్పుకొచ్చాడు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుత కాలంలో మనుషులకు ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా కొత్త ఆహారపదార్థం లేదా కొత్త స్టైల్ ను అనుసరించడం ఇంకా ఇంకా కొత్తదనం అనుకుంటూ వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ ఉండటం అలవాటు. అలాంటి కొత్తదనం వెంట పరుగులుతీసే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో లేదా అంతకు మించి విషయాల్లో ఎక్కువగా మునిగిపోతుంటారు. ఆ విషయాల గురించే తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళు అవుతుంటారు. అలాంటి పిచ్చిని వ్యసనం అని కూడా అనొచ్చు. ఈ వ్యసనం చాలామందిలో, చాలా విషయాల్లో ఉన్నట్టు, చాలా రకాలుగా కూడా ఉంటుంది. అయితే ఆ వ్యసనం జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అంతలా జీవితాన్ని తికమకలోకి నెడుతున్నా ఒత్తిడికి లోనవుతూ కూడా ఆ వ్యసనాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వ్యసనం మరి.  ఈకాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు, ఫుడ్ విషయంలో, తాత్కాలిక సంతోషాన్నిచ్చే విషయాలకు, ఇంకా మనుషులకు, కొన్ని విచిత్రమైన అలవాట్లకు, మగవాళ్ళు అయితే ధూమపానం, మద్యపానం, అమ్మాయిలు అయితే షాపింగ్, మేకప్ ఇలా చాలా విషయాలను అతిగా ఇష్టపడుతూ వాటికి వ్యసనపరులుగా  మారిపోతున్నారు. అలా మారినవాళ్ళు కూడా చాలామంది ఉంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో.  దేన్నైనా జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవడం మంచిదే కానీ జీవితమే ఆ విషయానికి అంకితం చేసేయ్యకూడదు. అలా చేస్తే జీవితమంతా కల్లోలమే కదా!!  అలాంటి కల్లోలాన్ని తప్పించుకోవాలంటే వ్యసనానికి  విడాకులు ఇచ్చేయ్యాలి.  పరిధులు, పరిమితులు! మనిషి ఆలోచనలకు ఒక పరిధి ఉన్నట్టే అలవాట్లకు కూడా ఒక పరిధి  ఉంటుంది. ఆ పరిది దాటిపోతే మనిషి పరిమితులు కూడా అస్తవ్యస్తం అవుతాయి.  నిజానికి మనిషి స్థాయిని బట్టి పరిమితులు కూడా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తం అయితే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటన్నిటినీ ఒకటికీ రెండు సార్లు విశ్లేషించుకుంటూ ఉంటే వ్యసనం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ప్రతి విషయానికి ఒక పరిధి నిర్దేశించుకుంటూ ఉంటే అది అతిగా మారదు. భోజనం చేసేటప్పుడు కళ్లెదురుగా నచ్చిన పదార్థం ఎంతున్నా అది కడుపు నిండేవరకు మాత్రమే తినగలం, అలా కాదని ఎక్కువ తింటే రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా ఒక పదార్థాన్ని మితంగా తింటే హాయిగా ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం తినేస్తే అజీర్తి, దాని వెంట మళ్లీ అనుబంధంగా బోలెడు సమస్యలు కూడా వస్తాయి. తీపి పదార్థాలు ఇష్టమని అతిగా తింటే చెక్కర వ్యాధి శరీరాన్ని కబళించి ఇక మళ్లీ తీపిని కన్నెత్తి చూడనివ్వని పరిస్థితికి నెట్టేస్తుంది. మార్పు కోసం మంత్రం! వ్యాసనాల బారినపడ్డవారికి వాటి నుండి బయటకు వచ్చేయ్యాలి అని ఉన్నా గట్టిగా దాన్నుండి దూరం కాలేరు. మనసు నిలకడ లేనితనం దానికో పెద్ద కారణం.  నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దానిమీద గట్టిగా నిలబడటమే కొంచం కాదు చాలా కష్టం. అయితే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లవాడి వేలుకు వేపనూనె పూస్తే వాడు నోట్లో వేలు పెట్టుకోవడానికి ఎలా భయపడి ఆ అలవాటు నుండి దూరమవుతాడో అలాగే వ్యసనం అనుకున్న  విషయం నుండి దూరమవ్వడానికి ఏదో ఒక పరిస్థితిని అడ్డు కల్పించుకుంటూ ఉండాలి.  "పిల్లాడంటే తెలియని అమాయకుడు, పెరిగి పెద్దయిన ఈ ఉద్దండుల సంగతేంటి??" అనే ప్రశ్న గనుక వస్తే ఈ పిచ్చి మనసును బుజ్జగించడం అంతే సులువేమీ కాదు. కాబట్టి ఒకపని తప్పించుకోవాలి అంటే మరొకపనిని తప్పనిసరిగా, తప్పకుండా చెయ్యాల్సిన పనిగా ఒక లక్ష్యంగా ముందేసుకోవాలి. అప్పుడే అనుకున్నది సాదించగలం. ఊగిసలాట వద్దు! ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మళ్లీ ముందుకూ వెనక్కు మనసును ఊగించకూడదు. మొదట్లో అలా వ్యసనంగా మారిన పని నుండి, విషయం నుండి దూరంగా ఉంటున్నందుకు అసహనంగానూ, బాధగానూ ఉన్నా అది మెల్లిగా తగ్గుతూ మరొకవిషయంలో మనసును లీనం చేస్తుంది. కాబట్టి ఊగిసలాట ఇక్కడ అసలు ఉండకూడదు. చాలామంది నిర్ణయాలు తీసుకుని, దారులు మార్చుకుని, పట్టుమని నిమిషాలు గంటలు కూడా కాకముందే చేతులెత్తేస్తారు. అలా కాకుండా మెల్లి మెల్లిగా ఆ పనికి తక్కువ సమస్య కేటాయిస్తూ వెళ్తే ఆ వ్యాసనమనే భూతం నుండి తప్పించుకోవడం పెద్ద సమస్యేమీ కాదు! కాబట్టి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ఏ సమస్యనూ, వ్యసనంగా మార్చుకోవద్దు, వ్యసనంగా మారిన దేన్నీ భరించద్దు దానికి వెంటనే మార్పు అనే మంత్రంతో విడాకులు ఇచ్చేయండి. ◆ వెంకటేష్ పువ్వాడ  
రాజస్థాన్.. చాలా ప్రత్యేకమైన రాష్ట్రం.  రాజస్థాన్  రాష్ట్రంలో కోటలు,  అందమైన రాజ భవనాలు కోకొల్లలు ఉన్నాయి. ఇక్కడి రాజులు, రాణుల చరిత్ర చాలా గొప్పది కూడా.  వీరిలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కో విధమైన విస్మయాన్ని కలిగిస్తుంది.  ముఖ్యంగా కొందరు రాజులు, రాణుల నిర్ణయాలు చాలా షాకింగ్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో రాణి ఉమాదే భాటియా కూడా ఒకరు.  ఈమెను రాజస్థాన్ ప్రజలు రుతీ రాణి అని పిలుస్తారు.  ఈమెకు చాలా కోపమట. ఎంతగానంటే ఈమె జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఈమె భర్త బ్రతికున్నంత వరకు అసలు అయన దగ్గరకు వెళ్ళనే వెళ్లలేదట.  ఇంతకీ ఈ రాణి గారి కోపం ఎందుకో.. ఈమె ఎందుకు అంత కఠినంగా మారిపోయారో తెలుసుకుంటే.. ఉమాదే భాటియాని రాజస్థాన్ కు చెందిన రాణి.  ఈమెను ఉమా దేవి భాటియాని అని కూడా పిలుస్తారు. ఉమాదే భాటియాని  జైసల్మేర్ కు చెందిన రాజా రావల్ లుంకరన్ కుమార్తె. ఈమె రాజపుత్ర వంశానికి చెందిన యువరాణి.  ఈమె చాలా అందగత్తె ఈమె అందం గురించి సుదూర రాష్ట్రాలకు కూడా పాకింది.  1537లో జోధ్పూర్ కు చెందిన మాల్ఢియో రాథోడ్ తన రాజ్య విస్తీర్ణాన్ని పెంచుకునే చర్యలో భాగంగా  పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ జైసల్మేర్ ను ముట్టడించాడు. రావల్ లుంకరన్ తన కుమార్తె ఉమాదే భాటియాను మాల్డియో రాథోడ్ కు ఇచ్చి వివాహం చెయ్యడం ద్వారా తన రాజ్యాన్ని ఆక్రమణ నుండి కాపాడుకున్నాడు. మాల్డియో రాథోడ్ తో ఉమాదే భాటియాకు వివాహం జరిగిన తరువాత జైసల్మేర్ నుండి ఉమాదే భాటియాతో పాటు కొందరు మహిళా పరిచారకులను కూడా ఉమాదే భాటియాతో అత్తవారింటికి పంపారు. ఉమాదే భాటియా వద్ద ఉన్న పరిచారకులలో భర్మాలి అనే ఒక దాసి ఉండేది.  ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు మాల్డియో రాథోడ్ బాగా మద్యం సేవించి రాణి దగ్గరకు రాకుండా మద్యం సేవించే గదిలోనే ఉండిపోయాడు.  దీంతో ఉమాదే భాటియా తన పరిచారిక భర్మాలిని పిలిచి రాజు దగ్గరకు వెళ్లి అతణ్ణి పిలుచుకుని రావలసిందిగా చెబుతుంది.  రాణి చెప్పినట్టు భర్మాలి రాజు దగ్గరకు వెళుతుంది. కానీ రాజు భర్మాలి అందానికి ముగ్ధుడై ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటాడు.   రాజును తీసుకుని రావడానికి వెళ్లిన దాసి ఎంతసేపటికి రాకపోవడంతో ఉమాదే భాటియా తనే స్వయంగా రాజు దగ్గరకు వెళుతుంది.  అక్కడ రాజు భర్మాలితో సన్నిహితంగా ఉండటం చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ కోపంలోనే ఆమె జైసల్మేర్ కు తన పుట్టింటికి వెళ్లిపోయింది.   అలా ఆరోజు వెళ్లిన ఉమాదే భాటియా అసలు ఎప్పుడు తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.  భర్త చేసిన పనికి అతడిని జీవితంలో క్షమించలేకపోయింది.  జీవితాంతం ఆమె భర్త మీద కోపంతో అలా ఉండిపోవడంతో ఆమెను కోపిష్టి రాణి అని పిలవడం అందరికీ అలవాటైంది.                                            *రూపశ్రీ.
మన జీవితంలో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల వల్ల మనం డబ్బు పోగొట్టుకుంటాం. చాణక్యుడి ప్రకారం, కొన్ని తప్పులు ధనవంతులను కూడా పేదలుగా మారుస్తాయి. ఆ తప్పులేంటో చూద్దాం. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేయడంలో అతని పాత్ర గొప్పది. చాణక్యుడి ఈ తత్వశాస్త్రం మన జీవితంలో చాలా ముఖ్యమైనది.ఆచార్య చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో జీవితం, డబ్బు, సమాజం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆలోచనలు ఇచ్చారు. ఆయన సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తే విజయం వరిస్తుంది.అలాగే, చాణక్యుడు ప్రకారం, జీవితంలో మనం చేసే తప్పులు డబ్బు నష్టానికి,  బాధకు దారితీస్తాయి. అదేవిధంగా మన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ప్రధానంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కుటుంబ పోషణ,  ఇతరుల సంక్షేమం కోసం ఉపయోగించాలి.  మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టాలి.మీరు సంపాదించిన డబ్బును జూదం, బెట్టింగ్ మొదలైన వాటిపై ఎప్పుడూ వృధా చేయకండి. ఆనందం కోసం డబ్బును దుర్వినియోగం చేయడం సమీప భవిష్యత్తులో మిమ్మల్ని మరింత సమస్యగా మార్చే అవకాశం ఉంది.డబ్బు ఎప్పుడూ ఇతరుల మంచికే ఉపయోగించాలి. ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇది లక్ష్మీ దేవికి కోపం తెప్పిస్తుంది. తద్వారా మనం డబ్బును కోల్పోవచ్చు.మరీ ముఖ్యంగా డబ్బు ఆదా చేసే అలవాటు ఉండాలి. ఎంత డబ్బు వచ్చినా ఖర్చు పెట్టకూడదు. మనం వీలైనంత తక్కువ డబ్బు ఖర్చు చేయాలి. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.
చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.   ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్‌నట్‌లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు.  అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం  నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు  చర్మ సమస్యలను  నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్‌ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.  
  టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్.  ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది.  టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి.. ఫిల్టర్ పేపర్ తో.. టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద  కొంచెం నీరు చిలకరించాలి.  తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు. నీటితో.. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ  నీటిలో టీ ఆకులు వేయాలి.  నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది. రుచి.. స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి.  కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం.  మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి.  వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి  తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు. రంగు.. స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి.  కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది. స్వభావం.. నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి.  ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. కల్తీ టీ .. చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి.  పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది.  ఇది   నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది.                                             *రూపశ్రీ. 
అస్తమా వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే ఊపిరి తీసుకోవడం లో కష్టంగా ఉంటుంది. ఇందుకోసం ఎన్నొఏళ్ళుగా అనేక  రకాల ఇంహేలర్లు మందులు వాడుతూనే ఉంటారు. వాతావరణం మారిందా ఆస్తమా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ప్రతి ఏటా వరల్డ్ అస్తమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా అస్తమా పై అవగాహన కొన్ని రకాల  అస్తమా లక్షణాలను తగ్గించడం లో కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు సహకరిస్తయన్న విషయం మీకు తెలుసా. పిల్లల నుండి పెద్దలు అంటే వృ ద్దుల వరకూ అస్తమా బారిన పడుతూనే ఉన్నారు.అస్తమా వచ్చిన వారిలో శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం తీవ్రమైన దగ్గు.ఊపిరి పీల్చుకోవడం గుండెల్లో మంట,వంటి సమస్యలు వస్తాయి. చికిత్సలో భాగం గా ఇన్హేలర్ లు వినియోగిస్తారు.అలాగే కొన్ని రకాల కూరగాయాలు పళ్ళు అస్తమా లక్షనాలను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది. సిమ్లా మిర్చి... సిమ్లామిర్చి యాంటి ఆక్సిడెంట్ గా ను,విటమిన్ సి ఫైటో న్యుట్రీ యంట్స్ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి అది మీఅరోగ్యానికి పూర్తిగా సహకరిస్తుంది. దానిమ్మ పండు.. ఇందులో విట మిన్ సి పీచుపదార్ధము యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటాయి.ముఖ్యంగా శ్వాస నాళం  నాశనంకాకుండా సహకరిస్తుంది.వ్యక్తి బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం శాతం తగ్గినప్పుడు. దానిమ్మ జ్యూస్,లేదా దానిమ్మ గింజలు ఆరోగ్యవంతులను చేసేది దానిమ్మ పండే అస్తమాతో ఇబ్బడి పడుతూ నీరసించి పోయేవారికి అద్భుత మైన ఔషదం గాసంజీవని గా  పనిచేస్తుంది. అల్లం... అల్లం లో యాంటి ఆక్సిడెంట్ సంపూర్ణంగా ఉంటుంది.ఒత్తిడిని నియంత్రిస్తుంది.శరీరంలో డి ఎన్ ఏ కు ఎలాంటి నష్టం జరగ కుండా నిలువరించడం లో అల్లం సహాయ పడుతుంది.బ్లడ్ ప్రేషర్,గుండె పోటు.శ్వాస నాళా లలో ,ఊపిరి తిత్తులలో ఎలాంటి అనారోగ్యం తో నైనా పోరాడే విధంగా అల్లం సహాయ పడుతుంది.ముఖ్యంగా శ్వాస నాళాలలో మనకు అడ్డం పడే కళ్ళే ను తొలగించడం లో అల్లం మనకు సహాయ పడుతుంది. పాల కూర... పాల కూరలో ప్రోటీన్,ఐరన్,విటమిన్ మినరల్స్,పొటాషియం మెగ్నీషియం,వంటి విటమిన్ పీచు పదార్ధం పాస్పరస్,తయా మిన్ విటమిన్ ఇ, వంటి పోషకతాత్వాలు ఉంటాయి.పాల కూర వాడకం వల్ల జుట్టు,ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ఆస్తమా లక్షణాలను తగ్గించడం లో మీకు సహక రిస్తుంది. టమాట రసం... విటమిన్ సి విటమిన్ బి పొటాషియం సంపూర్ణంగా టమాటా లో ఉంటుంది.లైకో పిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్ధిగా లభించడం వల్ల గుండె అనారోగ్య సమస్యల నుండి క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుండి తగ్గించడం లో సహకరిస్తుంది. యాపిల్... యాపిల్ సంపూర్ణ పోషకాలు ఉన్న పళ్ళలో సంపూర్ణంగా పీచుపదార్ధం ఉండడం వల్ల.శరీర బరువు తగ్గించడం లో ఊపిరి తీసుకోవడం లో సహకరిస్తుంది. అయితే యాపిల్ డయాబెటిస్,గుండె సంబంధిత క్యాన్సర్,దీర్ఘకాలిక రోగాలను నిలువరించడం లో సహకరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు అని న్యూ ట్రీషియనిస్ట్ లు అంటున్నారు. బీన్స్... బీన్స్ లో విటమిన్ ఏ,సి పోలక్ట్ యాసిడ్ ,కాల్షియం,ఫైబర్,సంపూర్ణంగా ఉంటుంది.బీన్స్ ఎముకలను పటిష్టంగా బలంగా ఆరోగ్యంగా ఉంచేందుకు. ఎముకలు విరగడం వంటి ప్రమాదాల నుండి కాపాడ డం లో కీలక పాత్ర పోషిస్తుంది.బీన్స్ లో విటమిన్ బి,డిప్రెషన్ ను తగ్గించడం లో మీకు బీన్స్ సహాయ పడుతుంది. కమలా పండు... సంత్రా... విటమిన్లు ,ఖనిజ లవణాలు యాంటి ఆక్సిడెంట్ తో నిండిన పోషక తత్వాలు ఖజానా ఉంటుంది.పైన పేర్కొన్న పండ్లు కూరగాయాలు శ్వాస కొస సంబంధిత సమస్యలను నిలువరించడం లో సహాయ పడుతుంది.