LATEST NEWS
టాలీవుడ్ టాప్ కమేడియన్ లలో అలీ ఒకరు. కేవలం కమేడియన్ గానే కాకుండా పలు సినిమాలలో హీరోగానూ అలీ రాణించి యమలీల వంటి సినిమాలలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తరువాత ఆయనకు రాజకీయాలపై ఆసక్తి కలిగింది. ఎలాగైనా చట్ట సభలో కూర్చోవాలన్న ఆకాంక్షతో ఆయన ఒక్కసారిగా రాజకీయాలలోకి దూకేశారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని అన్ని పార్టీలనూ చుట్టేసి చివరికి జగన్ నేతృత్వంలోని వైసీపీని ఎన్నుకున్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరే విషయాన్నీ పరిశీలంచారు. కానీ చివరికి ఆయన వైసీపీ వైపే మొగ్గు చూపారు.  సినిమాల్లో ఏదో మేరకు హీరోగా రాణించిన అలీ.. రాజకీయాలలో మాత్రం కమేడియన్ గానే మిగిలిపోయారు.  2019 ఎన్నికలకు ముందు అలీ తన రాజకీయ అరంగేట్రం కోసం వేతుకులట ప్రారంభించారు. మూడు పార్టీల చుట్టూ చేరారు. ఏంటి మూడు పార్టీల్లోనూ చేరిపోతారా అనిపించేలా ఆయన వ్యవహరించారు.  అయితే చివరాఖరికి ఆయన జగన్ ను నమ్ముకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికలలో ఆయన ఏపీలోని ఏదో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే జగన్ ఆయనకు చెయ్యిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కానీ ఏదో ఒక కీలక పదవి ఇస్తానని ఆశ చూపారు. దాంతో ఆ ఎన్నికలలో అలీ వైసీపీ తరఫున తన శక్తి మేరకు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఇక అలీ ఎదురుచూపుల పర్వం మొదలైంది. జగన్ హామీ ఇచ్చిన కీలక పదవి ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాచేలా అలి ఎదురు చూశారు. మధ్యలో ఓ సారి ఇంకేముంది రాజ్య సభ ఖాయం అని గట్టిగా వినిపించింది. అప్పట్లో రాజ్యసభ సభ్యత్వంపై అలీని మీడియా అడిగితే ఆయన చిరునవ్వులు సంధించి నిజమేనని చెప్పకనే చెప్పేశారు. అయితే అదీ రాలేదు. మూడేళ్ల ఎదురు చూపుల తరువాత కంటితుడుపు చర్య అన్నట్లుగా జగన్ అలీకి ఓ సలహాదారు పదవి విదిల్చారు. అదే మహాభాగ్యం.. 2024లో పోటీకి అవకాశం ఇస్తారు అని అలీ తనకు తాను సర్ది చెప్పుకున్నారు. అయితే అదీ దక్కలేదు. సో అలీ ఇక తన వంటికి రాజకీయాలు పడవని నిర్థారణకు వచ్చేసి వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఇక సినిమాలే తన లక్ష్యం అని డిసైడైపోయారు. అప్పటి నుంచీ ఆయన వార్తల్లో ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. కానీ హఠాత్తుగా అలీ పేరు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే ఇది రాజకీయ విషయంలో కాదు. అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారంటూ అలీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కాదు. తెలంగాణలో.  అలీకి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ పంచయతీ ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలో తన తండ్రి మహ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉంది. అయితే ఈ ఫామ్ హౌస్ అనుమతులు లేకుండా నిర్మించారంటూ వికారాబాద్ గ్రామ పంచయతీ కార్యదర్శి అలీకి నోటీసులు ఇచ్చారు. తొలుత ఈ నెల 5న ఇచ్చిన నోటీసులకు అలీ స్పందించకపోవడంతో తాజాగా సోమవారం (నవంబర్25) మరో నోటీసు ఇచ్చారు.  మరీ దీనికైనా అలీ స్పందిస్తారో లేదో చూడాలి. 
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించారు. జగన్, బీజేపీల రహస్య మైత్రి అప్పట్లో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి వచ్చింది. జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలనూ అప్పట్లో బీజేపీ అన్ని విధాలుగా సమర్ధించింది. సహకరించింది. ప్రోత్సహించింది. సరే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ అధినాయకత్వం తన వైఖరి మార్చుకుని జగన్ తో దూరం పాటిస్తోందని ఇంత కాలం, అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టునకు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇతంతా ఉత్తిదేననీ, జగన్, బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతోందనీ తాజాగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా.. తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశాన్ని చూపుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారని ఆ పార్టీ నేతలే చెప్పడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  సోమవారం (నవంబర్ 25) నుంచి వచ్చే నెల 20 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ, షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిన్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతి బిల్లుకూ ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే.. బీజేపీతో ఆయన రహస్య మైత్రీ ఇంకా కొనసాగుతోందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని చెబుతున్నారు.   లోక్ సభలో వైసీపీ మద్దతు, వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు కానీ, రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకింత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రంగా కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుని జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురౌతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే  బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించకుంటే.. తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో?
లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్   సోమవారం  మహబూబాబాద్ లో మహాధర్నాకు  పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.   ప్లెక్సీ రగడతో జిల్లాలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. కెటీఆర్ ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.  లగచర్ల ఘటన తర్వాత బిఆర్ఎస్ దళితులు, గిరిజనుల హక్కుల కాపాడటానికి మహబూబాబాద్ లో మహాధర్నా కార్యక్రమానికి  పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ప్లెక్సీలను జిల్లా వ్యాప్తంగా అంటించారు. ఈ ప్లెక్సీలను నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఇది  కాంగ్రెస్ పనేనని బిఆర్ఎస్  ఆరోపిస్తుంది. బిఆర్ ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.
దేశంలో  సైబర్ క్రైమ్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ నకరం. అయితే ఈ తరహా క్రైమ్ ల నిరోధంలో బ్యాంకులు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే  వీటిని చాలా వరకూ నిరోధించవచ్చని ఇటీవల  ఏపీలోని తిరువూరు, తెలంగాణ లోని మహబూబ్ నగర్ లలో జరిగిన ఉందంతాలు రుజువు చేశాయి.   ఇటువంటి సైబర్ క్రైమ్ లను దాదాపు 90 శాతం వరకూ బ్యాంకులలోనే నివారించే అవకాశాలు ఉన్నా యని సైబర్ పోలీసులు చెబుతున్నారు.   బ్యాంకులు ఖాతా దారులకు ఇచ్చిన ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే  బ్యాంకులకు ఖాతా దారులను రక్షించే నైతిక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.  తిరువూరు,మహబూబ్ నగర్ లలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో  60లక్షల రూపాయల సైబర్ క్రైమ్ మనీ ట్రాన్స్ఫర్ ఆపగలిగారు. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే ఖాతాదారులను సైబర్ మోసాల నుంచి కాపడటం సులువు అని ఈ ఉందంతం రుజువు చేసింది.  ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో  సైబర్ మోసాల గురించి ప్రస్తావించడమే ఇది ఎంత తీవ్ర ముప్పుగా పరిణమించిందో అర్ధం చేసుకోవచ్చు.   సైబర్ నేరాలను అరికట్టడంలో సౌదీ అరేబియా మొదటిస్థానంలో ఉంది.ఆ దేశం 2015లో 1.60 లక్షల సైబర్ నేరాలు జరిగినట్లు నమోదైనాయి.నేరాల నియంత్రణలో బహుముఖ వ్యూహం అనుసరించి 100 శాతం విజయం సాధించింది. 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ ని స్థాపించి సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. బడ్జెట్లో నిధులు పెంచడం, విద్యా విధానంలో కోర్సు ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాల సాంకేతికత సహకార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో  సౌదీ అరేబియా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. భారత్ లో కూడా ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సౌదీనీ ప్రమాణికంగా తీసుకుని చర్యలు చేపట్టాలి. అందుకు విశ్వవిద్యాలయాలలో కోర్సులు ప్రవేశపెట్టి, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి.  అలాగే  ఈ సైబర్ సెల్ లను బ్యాంకులతో అనుసంధానం చేయాల్సి. అదే సమయంలో బ్యాంకులూ  అప్రయత్తంగా ఉండి   నేరాలను అరికట్టేందుకు సహకారం అందించాలి.ఇలాంటి చర్యలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే తప్పక  సత్ఫలితాలు వస్తాయి. 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20 వరకూ జరిగే ఈ సమావేశాలలో మొత్తం 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అత్యంత కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కూడా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఈ పార్లమెంటు సమావేశాలలో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలలో అందరి అంచనాలనూ తల్లకిందులు చేసి మరీ అనూహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ ఆ ఊపులో ఈ సమావేశాలలోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాగా సభలో ఏయే విషయాలు చర్చకు రానున్నయి అన్న విషయాన్ని సభ్యులకు లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మన్ ముందుగానే పరిశీలించి అనుమతి ఇస్తారు.   ఇక ఈ శీతాకాల సమావేశాలలో  భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు,  విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు,  ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు,  రైల్వేస్ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు,  వక్ఫ్ (సవరణ) బిల్లు,  చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు,  రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయాల బిల్లు,  పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఎజెండాలో లేకపోయినప్పటికీ ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లును కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపిలోని  ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీంతో మద్దిపాడు పోలీసులు వర్మ ని కలిసి విచారణకి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.ఈ విషయంపై వర్మ కోర్టుకి వెళ్లినా కూడా విచారణ తప్పదని, కోర్టు తీర్పుని ఇచ్చింది. కానీ వర్మ విచారణకి హాజరు కాకుండా మరికొంత సమయం కావాలని పోలీసులకి వాట్సప్ ద్వారా మెసేజ్ చేసాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ పోలీసులు వర్మ కి  మరోసారి  నోటీసులు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా విచారణకి హాజరు కాలేనని వర్మ పోలీసులకి చెప్పడంతో వర్మ ని అరెస్ట్ చేసి ఏపీకి తరలించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ లోని వర్మ ఇంటికి కూడా చేరుకున్నారు.  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరకి తెలిసిందే. దీంతో ఇప్పుడు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2(pushpa 2)పై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.రష్మిక(rashmika)హీరోయిన్ గా చేస్తుండగా శ్రీలీల(sreeleela)ఒక ప్రత్యేకమైన సాంగ్ లో చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఆ సాంగ్ నిన్న చెన్నై వేదికగా రిలీజయ్యింది. ఆ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్(devisriprasad)మాట్లాడుతు మా నిర్మాతలు ఫంక్షన్ ని రాంగ్ టైంలో వచ్చాడని అన్నారు. నన్నేం చేయమంటారు బయట కెమెరా వాళ్ళుని దాటుకొని లోపలకి రావడానికి టైం పట్టింది. అందుకని ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కువ సేపు మాట్లాడానని అనద్దు.టైంకి పాట ఇవ్వలేదు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. ప్రోగ్రాం కి రాలేదని అనకండి. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే కంప్లంట్స్ ఎక్కువ ఉంటాయేంటో అర్ధం కాదు.  ఇవన్నీ సపరేట్ గా అడిగితే కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా అడిగెయ్యండి నేనెప్పుడూ ఓపెన్. మనకి ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి.ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చే మన డబ్బైనా,స్క్రీన్ మీద వచ్చే మన క్రెడిట్ అయినా అడిగి తీసుకోవాలి. అడగకపోతే ఎవరు ఇవ్వరని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్ గా నిలిచాయి. ఇక పుష్ప 2  ప్రారంభ సన్నివేశాలకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్, శ్యామ్ అజనీశ్ వంటి సంగీత దర్శకులు వర్క్ చేసారు. ఈ విషయంలో కారణాన్ని పక్కన పెడితే సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అనే వార్తలు వచ్చాయి. కాబట్టి దేవిశ్రీప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లని అనాలి తప్ప నిర్మాతలని కాదనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)అప్ కమింగ్ మూవీ పుష్ప 2(pushpa 2)డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.ఈ మేరకు కొన్నిరోజుల క్రితం బీహార్ లోట్రైలర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం నిన్న చెన్నై వేదికగా  ఒక సాంగ్ ని రిలీజ్ చేసింది.  అత్యంత భారీగా ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక(rashmika)తో  పాటు చిత్ర  బృందం మొత్తం పాల్గొంది.చెన్నై లో సాంగ్ రిలీజ్ చెయ్యడానికి ప్రధాన కారణం తమిళ సినీ మార్కెట్ లో అల్లు అర్జున్ తన హవాని కొనసాగించడానికే అని తెలుస్తుంది. ఇంత  వరకు ఏ తెలుగు సినిమా కూడా చెన్నైలో అంత భారీ ఎత్తున ఒక సాంగ్ విషయంలో ఈవెంట్ ని జరపలేదు.తమిళ తంబిలకి అల్లు అర్జున్ మీ వాడే అని అనిపించుకోవడానికే అక్కడ భారీ ఎత్తున ఈవెంట్ జరిపినట్టు తెలుస్తుంది.త్వరలోనే కేరళ, కర్ణాటక, ముంబైలలో కూడా భారీ ఈవెంట్ లు జరగనున్నాయి.  ఇలా పుష్ప 2 ని ఆ లాంగ్వేజ్ ల వాళ్ళు తమ మూవీగా భావించాలని అల్లు అర్జున్ తో చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టుగా అంటున్నారు.తద్వారా పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని సాధించాలని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇక నిన్న రిలీజైన సాంగ్ప్రముఖ హీరోయిన్ శ్రీలీల(sreeleela)అల్లు అర్జున్ మీద చిత్రీకరించగా ఆ ఇద్దరు ఒక రేంజ్ లో స్టెప్స్ వేశారనే టాక్ వస్తుంది.   
  లెజెండరీ నటుడు శోభన్ బాబు (Sobhan Babu) ఇంట విషాదం చోటు చేసుకుంది. శోభన్ బాబు తమ్ముడు ఉప్పు సాంబశివరావు (Uppu Sambasiva Rao) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామమైన కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిన్న నందిగామలో అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. సాంబశివరావు మృతితో చిన్న నందిగామ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శోభన్ బాబు 2008 మార్చి 20న 71 ఏళ్ళ వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే.  
సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'లగ్గం'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన చిత్రమిది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరిస్తోంది. (Laggam On OTT) లగ్గం సినిమా ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ మరియు ఆహాలలో అందుబాటులోకి వచ్చింది. లగ్గం అనే టైటిల్ కి తగ్గట్టుగా పెళ్లి తంతును చూపించడమే కాకుండా, ఇందులో కొన్ని ఆలోచించదగ్గ అంశాలను చర్చించారు. సాఫ్ట్ వేర్ అల్లుడు, అమెరికా అల్లుడు అంటూ అత్యాశకు పోయే కొందరు తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించేలా ఈ సినిమా ఉంది. అశ్లీల సంభాషణలు, సన్నివేశాలు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ సినిమాను రూపొందించారు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా కావడంతో ఓటీటీలో 'లగ్గం'కి మంచి ఆదరణ లభిస్తోంది. లగ్గం సినిమాని సుబిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. రమేశ్ చెప్పాల రచన-దర్శకత్వం వహించగా, మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. చరణ్ అర్జున్ పాటలు స్వరపరిచిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరించారు. ఎల్బీ శ్రీరామ్ గారు, రఘు బాబు, రచ్చ రవి, చమ్మక్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.
మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం 'మనదేశం' విడుదలై నేటికి 75 వసంతాలు పూర్తయింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రూపొందించిన 'మనదేశం' 1949, నవంబర్ 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రతో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు ఎన్టీఆర్. పాత్ర చిన్నదైనా నటుడిగా ఎంతో ప్రభావం చూపారు. 'మనదేశం' తర్వాత ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు. షావుకారు, పల్లెటూరి పిల్ల, పాతాళ భైరవి, మల్లీశ్వరి వంటి సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తన అసాధారణ నటనతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు చేస్తూ నటసార్వభౌముడు అనిపించుకున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. (NTR Mana Desam) అలాంటి మహానటుడి సినీ ప్రస్థానానికి పునాది వేసిన 'మనదేశం' చిత్రం నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, నటుడిగా తాను 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. "నేను అనునిత్యం స్మరించే పేరు.. నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై 'మన దేశం' చిత్రంతో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24తో 75 ఏళ్ళు పూర్తిచేసుకొని 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, హీరోగా నేను 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాన్న గారి నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతికనిపుణులకు, పంపిణీదారులకు, థియోటర్స్ యాజమాన్యం & సిబ్బందికి, మీడియాకి , అన్ని విభాగాల సినీ కార్మికులకు, నా ఉన్నతిని కోరే ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని బాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  
అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం ఎక్మామిడి పంచాయతీలో అలీకి ఫామ్ హౌస్ ఉందట. అయితే ఆ ఫామ్ హౌస్ లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, పన్ను చెల్లించకుండా అలీ నిర్మాణాలు చేపడుతున్నారట. ఇది అధికారుల దృష్టికి రావడంతో, గ్రామ సెక్రటరీ శోభారాణి అలీకి నోటీసులు జారీ చేశారు. నిజానికి ఈ నెల 5వ తేదీనే నోటీసు ఇవ్వగా, అలీ నుంచి ఎటువంటి స్పందనా లేదట. దీంతో తాజాగా మరోసారి నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి కూడా స్పందించకపోతే అధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.
Cast: Nazriya Fahadh, Basil Joseph, Akhila Bargavan, Merin Philip, Pooja Mohanraj, Deepak Parambol, Sidharth Bharathan, Kottayam Ramesh  Crew:  Written by Mc Jithin, Athul Ramachandran, Libin T.B. Cinematography by Sharan Velayudhan Nair Editing by Chaman Chakko Music by Christo Xavier Produced by A.V. Anoop, Shyju Khalid, Sameer Thahir Directed by MC Jithin Nazriya Nazim Fahadh has been taking gap between her projects and she is making her appearance on screen worth all the efforts. She starred in Ante Sundaraniki in Telugu with Nani and then did not accept any projects. But she has come up with Sookshmadarshini in Malayalam and raising star Basil Joseph has been cast in another leading role in the film. The movie released on 22nd November and let's discuss about the movie in detail.  Plot:  Priyadarshini (Nazriya Fahadh), wife of Antony (Deepak Parambol) and mother of a young daughter, decides to find a new job. But she gets suspicious of their new neighbor Manuel (Basil Joseph) and his connection with his mother. She starts to investigate into his actions with the help of her local neighborhood gang, Sulu (Akhila Bargavan), Asma (Pooja Mohanraj). Why she got so suspicious about Manuel? What is the reason behind his weird activities? Watch the movie to know more.  Analysis:  Nazriya showcased a highly matured side to her performing capabilties in this film. She is hyper-active at the same time very controlled, subdued from her previous performances. As a person, who is highly curious to get answers for her suspicion, she did a great job. Basil Joseph, once again, proved that he is one of the best performers with this role. He is able to create suspicion with a laughing face expression and his performance makes the film what it is.  While everyone impress us with their performances but Akhila stands out. Music by Christo Xavier adds to the intrigue and curiosity that we feel throughout. He is able to score aptly to the situation. Production values and technical aspects are top notch. With a very nominal budget, the makers have been able to give us a thrilling theatrical experience.  Writer and director MC Jithin has expertly crafted a thriller using realistic elements without exaggerating. While few elements seem to have been dramtised for effect, the core remains realistic and believable without over the top stunts to prove masculinity or feminism. With a grounded story telling and engaging screenplay, the director has been able to hold our interest with stunning twists. The cause, act and investigation everything is executed to pitch perfect level accuracy.  In Conclusion:  The movie holds your interest throughout and it is a must-have theatrical experience. Rating: 3.5/5 
ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా వేదికగా ప్రసారమయ్యే నందమూరి బాలకృష్ణ(balakrishna)వన్ మాన్ టాక్ షో అన్ స్టాప్పబుల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.ఇప్పటికే మూడు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలగవ సీజన్ లో మొదటి నాలుగు ఎపిసోడ్ లని పూర్తి చేసుకుంది.  రీసెంట్ గా ప్రారంభమయిన ఐదో ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)వచ్చిన విషయం   తెలిసిందే.మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ఎపిసోడ్ లో మొదటి భాగం ఇటీవలే టెలికాస్ట్ అవ్వగా,రెండవ భాగం రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యింది.ఈ ఎపిసోడ్ లో బన్నీ తన కూతురు,కొడుకు తో కలిసి పాల్గొన్నాడు.బాలయ్యతో కలిసి ఆ ముగ్గురు చేసిన హంగామ,ఎంతో ఇంట్రెస్టింగ్ గా,ఎంటర్ టైన్ మెంట్స్ సాగడంతో పాటు,బాలయ్య,అర్హ(arha)మధ్య సరదా సన్నివేశాలు, అర్హ తెలుగు భాషకి సంబంధించి చెప్పిన పద్యం,తెలుగు మాటలు, అల్లు అర్జున్, చిరంజీవి(chiranjeevi)గురించి మాట్లాడిన మాటలు,ఇలా మొత్తం ప్రేక్షకులకి ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కారణంతోనే ఇప్పుడు  ఆ ఎపిసోడ్ దెబ్బకి గత ఓటిటి రికార్డులన్నీ చెల్ల చెదురు అయ్యి హయ్యెస్ట్ వ్యూస్ ని  సంపాదించిందని తెలుస్తుంది.  
ప్రియురాలిపై ఉన్న వ్యామోహం వల్ల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని పాతాళానికి తొక్కేసింది. కన్నడ సినీ రంగంలో ఉజ్వలంగా సాగుతున్న అతని కెరీర్‌కి బ్రేక్‌ పడింది. సరిదిద్దుకోలేని తప్పు అతన్ని, అతని కుటుంబాన్ని అయోమయంలో పడేసింది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. బయటి ప్రపంచానికి కనిపించకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉంటున్నాడు దర్శన్‌. అయినా అతనికి ప్రశాంతత లేదు. ఈ హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దర్శన్‌తోపాటు మిగతా నిందితులపై కూడా అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.  రేణుకాస్వామి హత్య అనంతరం మూడు వేల పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశారు పోలీసులు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేయడానికి కారణం.. కేసులో మరిన్ని సాక్ష్యాలు, నేర నిరూపణకు ఉపయోగపడే కొన్ని ఫోటోలు పోలీసులకు లభించాయి. అందుకే 1300 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేస్తున్నారు. ఈ చార్జిషీటు కేసుకు అత్యంత కీలకంగా మారబోతోంది. ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్‌ పర్సనల్‌ స్టాఫ్‌లోని పవన్‌ అనే నిందితుడు కూడా ఉన్నాడు. అతను హత్యాస్థలంలో కొన్ని ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, అతను కొన్ని ఫోటోలను డిలీట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వాటిని కూడా రీస్టోర్‌ చేయగలిగారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆ ఫోటోల్లో దర్శన్‌ ఉన్నాడు. అంతేకాదు, ఇతర నిందితులు వాడిన కారు ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. వీటితోపాటు మరో మంది 30 సాక్షుల వాంగ్మూలాలు, 40కి పైగా సాక్ష్యాధారాల్ని కొత్త చార్జిషీటులో పొందుపరిచారు. రేణుకాస్వామి హత్య కేసును బెంగళూరు పోలీసులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ వచ్చిన తర్వాత ఆ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. దర్శన్‌, పవిత్రగౌడ్‌తోపాటు ఇతర నిందితులు సాధారణ బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు వినేందుకు 26వ తేదీకి వాయిదా వేసింది బెంగళూరు హైకోర్టు. అనారోగ్య కారణాల వల్ల దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది కోర్టు. అతని వెన్నెముక ఆపరేషన్‌ నిమిత్తం ఈ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరు వారాల్లోపు చికిత్స పూర్తి చేసుకొని కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈలోగా సాధారణ బెయిల్‌ వస్తుందని దర్శన్‌ ఆశ పడ్డాడు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేస్తుండడంతో ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవిధంగా దర్శన్‌ చాప్టర్‌ ముగిసినట్టే. తాజా చార్జిషీటుతో నిందితుల్ని నేరస్తులుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
విజయం ఒక మనిషిని మరొక మెట్టు పైకి తీసుకెళుతుంది.  ప్రతి వ్యక్తి తాము ఎంచుకున్న రంగంలో, చేసే పనిలో  విజేత కావాలనే కలలు కంటారు.  అయితే కలలు కన్నంత సులువుగా అవి నిజం కావు.. వాటిని సాకారం చేసుకోవడం అనేది కొందరికే సాధ్యం అవుతుంది.  అయితే కేవలం 5 పనులు చేస్తే చాలు.. ప్రతి వ్యక్తి తను అనుకున్న పనులలో విజయాన్ని చాలా తొందరగా అందుకుంటాడని అంటున్నారు. ఇంతకీ ఆ పనులు ఏమిటంటే.. కష్టం.. విజయం సాధించాలన్నా, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా కష్టపడి పని చేయాలని అందరూ అంటారు.  చాలామంది విజయం కోసం కష్టపడతారు.  అయినా సరే  వారికి కూడా విజయం దక్కదు. ఎందుకని వారికి వారే ప్రశ్నించుకుని సతమతం అవుతారు. కాన ఈ 5 పనులు చేస్తే  విజయం సులువుగా తథ్యం అవుతుంది. లక్ష్యాలు.. విజయం సాధించాలంటే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.  ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఏ పని చేసినా అది స్పష్టత లేకుండా ఉంటుంది.  అందుకే లక్ష్యాన్ని నిర్థేశించుకున్న తరువాత చేసే పని తొందరగా పూర్తీ చేయవచ్చు. ప్లానింగ్.. పనిలో విజయం సాధించాలంటే లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తరువాత దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం.  ప్రణాళిక ఉంటే పనిని ఒక క్రమ పద్దతిలో  పూర్తీ చేయవచ్చు. దీని వల్ల సమస్యలు కూడా పెద్దగా అడ్డు రావు. యాక్షన్.. పనిని మొదలు పెట్టాలి అనుకున్న తరువాత ప్రణాళిక తయారు చేసుకున్న తరువాత  దాన్ని వెంటనే మొదలు పెట్టాలి.  రేపు,  ఎల్లుండి అని దాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేయకూడదు. దీని వల్ల పని భారం పెరగదు. సమయం.. విజయం సాధించడంలో సమయం కీలక పాత్ర పోషిస్తుంది.  సమయానికి విలువ ఇచ్చే వ్యక్తి  విజయం సాధిస్తారు.  పనిని ప్రణాళిక పరంగా పూర్తీ చేయగలరు. యాక్టివిటీ.. చురుగ్గా ఉండటం వల్ల పనులు సులువుగా చేయగలుగుతారు. పనులలో విజయాన్ని సాధించడానికి వ్యక్తులు చురుగ్గా ఉండటం చాలా అవసరం.   ఇందుకోసం మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాలి. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు. వీటిని చేసే పనిలో అమలు చేస్తే విజయం సాధించడం సులభం.                                       *రూపశ్రీ.
పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు.  తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా  అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు.  కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి.  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు.  చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి.  అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు.  ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. గౌరవం.. ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు.  ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు.  బయటి వారి నుండి పెద్దలు,  కుటుంబ సభ్యులు,  చివరకు భార్య,  పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు.  కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా,   అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం.. కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి.  తన భాద్యతగా భార్య, పిల్లలు,  తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది.  పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు. ఇతరుల మాట వినడం.. తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట,  తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి.  ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు. శారీరక శ్రద్ద.. ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి.  ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ,  మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక,  ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి. ఇంటి పనులు.. కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి..  ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ  ఇంటి పనులు చక్కబెడుతుంటారు.  మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.                                                  *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో మనుషులకు ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా కొత్త ఆహారపదార్థం లేదా కొత్త స్టైల్ ను అనుసరించడం ఇంకా ఇంకా కొత్తదనం అనుకుంటూ వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ ఉండటం అలవాటు. అలాంటి కొత్తదనం వెంట పరుగులుతీసే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో లేదా అంతకు మించి విషయాల్లో ఎక్కువగా మునిగిపోతుంటారు. ఆ విషయాల గురించే తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళు అవుతుంటారు. అలాంటి పిచ్చిని వ్యసనం అని కూడా అనొచ్చు. ఈ వ్యసనం చాలామందిలో, చాలా విషయాల్లో ఉన్నట్టు, చాలా రకాలుగా కూడా ఉంటుంది. అయితే ఆ వ్యసనం జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అంతలా జీవితాన్ని తికమకలోకి నెడుతున్నా ఒత్తిడికి లోనవుతూ కూడా ఆ వ్యసనాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వ్యసనం మరి.  ఈకాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు, ఫుడ్ విషయంలో, తాత్కాలిక సంతోషాన్నిచ్చే విషయాలకు, ఇంకా మనుషులకు, కొన్ని విచిత్రమైన అలవాట్లకు, మగవాళ్ళు అయితే ధూమపానం, మద్యపానం, అమ్మాయిలు అయితే షాపింగ్, మేకప్ ఇలా చాలా విషయాలను అతిగా ఇష్టపడుతూ వాటికి వ్యసనపరులుగా  మారిపోతున్నారు. అలా మారినవాళ్ళు కూడా చాలామంది ఉంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో.  దేన్నైనా జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవడం మంచిదే కానీ జీవితమే ఆ విషయానికి అంకితం చేసేయ్యకూడదు. అలా చేస్తే జీవితమంతా కల్లోలమే కదా!!  అలాంటి కల్లోలాన్ని తప్పించుకోవాలంటే వ్యసనానికి  విడాకులు ఇచ్చేయ్యాలి.  పరిధులు, పరిమితులు! మనిషి ఆలోచనలకు ఒక పరిధి ఉన్నట్టే అలవాట్లకు కూడా ఒక పరిధి  ఉంటుంది. ఆ పరిది దాటిపోతే మనిషి పరిమితులు కూడా అస్తవ్యస్తం అవుతాయి.  నిజానికి మనిషి స్థాయిని బట్టి పరిమితులు కూడా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తం అయితే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటన్నిటినీ ఒకటికీ రెండు సార్లు విశ్లేషించుకుంటూ ఉంటే వ్యసనం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.  ప్రతి విషయానికి ఒక పరిధి నిర్దేశించుకుంటూ ఉంటే అది అతిగా మారదు. భోజనం చేసేటప్పుడు కళ్లెదురుగా నచ్చిన పదార్థం ఎంతున్నా అది కడుపు నిండేవరకు మాత్రమే తినగలం, అలా కాదని ఎక్కువ తింటే రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా ఒక పదార్థాన్ని మితంగా తింటే హాయిగా ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం తినేస్తే అజీర్తి, దాని వెంట మళ్లీ అనుబంధంగా బోలెడు సమస్యలు కూడా వస్తాయి. తీపి పదార్థాలు ఇష్టమని అతిగా తింటే చెక్కర వ్యాధి శరీరాన్ని కబళించి ఇక మళ్లీ తీపిని కన్నెత్తి చూడనివ్వని పరిస్థితికి నెట్టేస్తుంది. మార్పు కోసం మంత్రం! వ్యాసనాల బారినపడ్డవారికి వాటి నుండి బయటకు వచ్చేయ్యాలి అని ఉన్నా గట్టిగా దాన్నుండి దూరం కాలేరు. మనసు నిలకడ లేనితనం దానికో పెద్ద కారణం.  నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దానిమీద గట్టిగా నిలబడటమే కొంచం కాదు చాలా కష్టం. అయితే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లవాడి వేలుకు వేపనూనె పూస్తే వాడు నోట్లో వేలు పెట్టుకోవడానికి ఎలా భయపడి ఆ అలవాటు నుండి దూరమవుతాడో అలాగే వ్యసనం అనుకున్న  విషయం నుండి దూరమవ్వడానికి ఏదో ఒక పరిస్థితిని అడ్డు కల్పించుకుంటూ ఉండాలి.  "పిల్లాడంటే తెలియని అమాయకుడు, పెరిగి పెద్దయిన ఈ ఉద్దండుల సంగతేంటి??" అనే ప్రశ్న గనుక వస్తే ఈ పిచ్చి మనసును బుజ్జగించడం అంతే సులువేమీ కాదు. కాబట్టి ఒకపని తప్పించుకోవాలి అంటే మరొకపనిని తప్పనిసరిగా, తప్పకుండా చెయ్యాల్సిన పనిగా ఒక లక్ష్యంగా ముందేసుకోవాలి. అప్పుడే అనుకున్నది సాదించగలం. ఊగిసలాట వద్దు! ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మళ్లీ ముందుకూ వెనక్కు మనసును ఊగించకూడదు. మొదట్లో అలా వ్యసనంగా మారిన పని నుండి, విషయం నుండి దూరంగా ఉంటున్నందుకు అసహనంగానూ, బాధగానూ ఉన్నా అది మెల్లిగా తగ్గుతూ మరొకవిషయంలో మనసును లీనం చేస్తుంది. కాబట్టి ఊగిసలాట ఇక్కడ అసలు ఉండకూడదు. చాలామంది నిర్ణయాలు తీసుకుని, దారులు మార్చుకుని, పట్టుమని నిమిషాలు గంటలు కూడా కాకముందే చేతులెత్తేస్తారు. అలా కాకుండా మెల్లి మెల్లిగా ఆ పనికి తక్కువ సమస్య కేటాయిస్తూ వెళ్తే ఆ వ్యాసనమనే భూతం నుండి తప్పించుకోవడం పెద్ద సమస్యేమీ కాదు! కాబట్టి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ఏ సమస్యనూ, వ్యసనంగా మార్చుకోవద్దు, వ్యసనంగా మారిన దేన్నీ భరించద్దు దానికి వెంటనే మార్పు అనే మంత్రంతో విడాకులు ఇచ్చేయండి. ◆ వెంకటేష్ పువ్వాడ  
  కాలుష్యం నేటి కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పు తెచ్చిపెడుతోంది.  గాలి, నీరు, ఆహారం తో పాటు జీవనవిధానం కూడా చాలా వరకు కలుషితమైపోయింది.  చాలామంది జీవినశైలి చాలా అధ్వానంగా మారింది. ఇంటి నుండి బయటకు వెళితే వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ.. మొదలైన వాటి వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.  దీని వల్ల ఊపిరితిత్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  నిజానికి ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకునేవారు. కానీ నేటికాలం వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తులు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులలో పేరుకున్న మురికి శుభ్రం చేసుకోగలిగితే ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవచ్చు.  ఇందుకోసం కొన్ని మూలికలు తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. తులసి.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. దగ్గు, జలుబు,  ఉబ్బసం వంటి సమస్యలలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాలుగైదు తులసి ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగాలి. లేదా తులసి ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అల్లం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గిస్తుంది.  ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి.  ఇది చాలా బాగా సహాయపడుతుంది. అతి మధురం.. అతి మధురం ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన మూలిక.  ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.  ఇది మాత్రమే కాకుండా దగ్గు,  గొంతు నొప్పి, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. తిప్పతీగ.. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. పైగా మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది.  తిప్పతీగను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.                                                   *రూపశ్రీ.
  టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి.  శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు.  కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం,  మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు.  వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా  పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే.. పోషకాలు.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు  అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి. ఐరన్,  కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.  ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి,  శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా,  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు,  ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మునగ ఆకులను  తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది.  ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్  ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ  ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.  జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ ఆకులలో కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్,  కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి,  బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.  కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి  వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది,  వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది.                                                      *రూపశ్రీ.
చూడటానికి గుండ్రంగా కనిపించే అంజీర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.   ఓ రెండు అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొందరు బాదం, వాల్‌నట్‌లను, అత్తి పండ్లతో నానబెట్టి తింటుంటారు.  అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పునరుత్పత్తి వ్యవస్థకు మంచిది: అత్తి పండ్లలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని సమతుల్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఇనుము మొదలైనవి. ఇవన్నీ కూడా మీ జీర్ణవ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. అంజీర్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో రుతుక్రమం తర్వాత, హార్మోన్ల సమస్యలకు ప్రత్యేకంగా సహాయపడుతుంది. మెనోపాజ్ సమస్యలకు ఇది దివ్యౌషధం వంటిది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది: మీ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నిర్వహించగల గుణం అత్తి పండ్లలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తీసుకోవడం చాలా మంచిది. ఓట్స్‌తో పాటు అత్తి పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. మలబద్ధకం  నుంచి ఉపశమనం: చాలా మందికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మలవిసర్జన సరిగా జరగకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ విచ్ఛిన్నమై మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అలాంటి వారికి రాత్రిపూట అంజూర పండును నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం వల్ల మలవిసర్జన సులభతరం చేయబడి, దీర్ఘకాలంగా ఉన్న మలబద్ధకం సమస్య దూరమవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మన చర్మ కాంతిని పెంచడంతోపాటు  చర్మ సమస్యలను  నయం చేస్తుంది. తద్వారా మీ అందం పెరుగుతుంది. బరువు తగ్గుతారు: ఈ రోజుల్లో శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దీని కోసం ఆహార నియమాలు, వ్యాయామాలు అనుసరిస్తున్నారు. కానీ బరువు తగ్గించుకోవడానికి ఫైబర్ కంటెంట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అత్తిపండ్లు మనకు అవసరమైన ఫైబర్‌ని అందిస్తాయి. అయితే దీన్ని రెగ్యులర్‌ పరిమాణంలో తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు దీన్ని ఎక్కువగా తింటే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.