వైసీపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ విరామానికి బ్రేక్ వేసి పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని ఆయనకే తిరిగి కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంటున్నారు.  ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ, జనసేనల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో వారిని ఒప్పించాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట.   వైసిపి ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు.  విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు.   ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ  విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్నా, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా  విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం.  ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఆయన కుమార్తెకు సంబంధించి  భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి  చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయసాయిరెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో  కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా అన్న చర్చ జరిగింది. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరిగింది.  వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చిన ఆయన జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు.  ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్  చేసిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో. రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగుపెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఉప ఎన్నిక టెన్షన్‌ పట్టుకుందంట.  విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. అయితే విజయసాయి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వెళ్లాలంటే టీడీపీ, జనసేన ఆమోదం తప్పనిసరి.  రాష్ట్రంలో బీజేపీకి కేవలం ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఆయన రాజ్యసభకు వెళ్లగలరు.  సాయిరెడ్డి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవన్‌కళ్యాణ్‌తో సంప్రదించకుండా తీసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శల గుప్పించారు.  టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి, జనసేనాని ఇలా అందరిపై సాయిరెడ్డి నోరుపారేసుకున్నారు. అయితే రిటైర్‌మెంట్ ప్రకటన సమయంలో జగన్ ఆదేశాలతో సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదివానని వెళ్లడించి కలకలం రేపారు. ఏదేమైనా టిడిపి వర్గాలు ఆయనను వర్గ శత్రువుగా చూస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు పొత్తుల్లో బీజేపీకి దక్కి..  ఢిల్లీ పెద్దలు విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీ ఎలా స్పందిస్తుంది? అధినేత చంద్రబాబు ఏం చేస్తారు? తమ బద్ద శత్రువుని తమ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు పంపాలా? ఇదెక్కడి ఖర్మరా బాబూ.. అని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.  ఒక వేళ నిజంగా విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించాల్సి వస్తే మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడం ఖాయం. కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ భేటీలో విజయసాయిరెడ్డి వ్యవహారం తేలుతుందంటున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా ప‌డిందంట. అయితే ఈ సారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఒక వేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని, రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయకు అది తప్ప వేరే మార్గమేమీ లేదంటున్నారు. అయితే సాయిరెడ్డిని టీడీపీ కోటాలో రాజ్యసభకు పంపితే పార్టీ శ్రేణులకు అధిష్టానం వివరణ ఇచ్చుకుని సముదాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ సారికి చక్రం తిప్పి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు వేసినా.. బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైనా రాజ్యసభకు పంపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి సాయిరెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందో?
ఇద్దరి మధ్య ;పెరిగింది దూరమా.. వైరమా?  తెలంగాణలో ఏమి జరుగుతోంది? రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి? ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలను ,గీత దాటితే వేటు తప్పదని  హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేందుకు సుపారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగతున్న ప్రచారం వెనక ఉన్న రాజకీయం ఏమిటి? మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం  దేనికి సంకేతం? ఈ అన్నిటినీ మించి, నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు? రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇలా సమాధానం లేని  ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, ప్రశ్నార్ధకం చేస్తున్నాయని అంటున్నారు.  నిజమే, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహాజమే అయితే కావచ్చు కానీ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ఇవేవీ కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా దీపా దాస్ మున్షీ ఉన్నత వరకు,కాంగ్రెస్ పార్టీలో‘అంతా బాగుంది’ అన్నట్లుగానే కథ నడిచింది. ఢిల్లీ, హైదరాబాద్ సంబంధాలు అన్నీ సజావుగానే సాగిపోయాయి. కానీ,దీపాదాస్ మున్షీ  స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది. అంతే  కాదు.. అసలు ఈ  మార్పు  కోసమే  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఏరి కోరి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  అయితే  అది కొంత వరకు  నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి  మరీ ముఖ్యంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, మధ్య దూరం పెరిగిందని అంటారు. అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా.. లేకున్నా  రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రావడం,  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపలా బయటా మాట్లాడడం కూడా  ఇద్దరిమధ్య దూరం పెరడానికి ఒక కారణం అంటారు. నిజానికి  రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల అంతర్యం ఏమిటో ఆయన ఎందుకు అంత తరచుగా  ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో గానీ, రాహుల్, రేవంత్  మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్ధులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే  రాహుల్ గాంధీ అభీష్టానికి భిన్నంగా అదానీతో ఒప్పందం కుడుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటారు. సరే  తెర వెనక ఏమి జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. నిజానికి ఎవరూ కాదని అనడం లేదు కూడా. అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే వుంది. అహ్మదాబాద్ ఎఐసీసీ సదస్సు లో రాహుల్ గాంధీ, తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చు కున్నారు. ఒక విధంగా సుమారు పది నిముషాలకు పైగా మెచ్చుకున్నారు. కానీ.. ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు. అలాగే.. ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యవసానంగానే  కాంగ్రెస్  పార్టీ పరిస్థితి హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు. నిజానికి మంత్రి వర్గ విస్తరణ అనే తేనె తుట్టెను కదిలిస్తే.. ఏ మవుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు. అయినా.. ఓ వంక రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయంలో  మార్చి 24న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లను ఉన్నపళంగా ఢిల్లీకి వచ్చేయమని అధిష్టానం ఆదేశించింది. ఆ రాత్రి ఏమి జరిగిందో కానీ.. మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్  సిగ్నల్  అనే వార్త వచ్చింది. అంతే కాదు.. కొత్తగా కొలువు తీరే మంత్రుల పేర్లు, ముహూర్తాలు కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ముహూర్తాలు వచ్చి పోయాయి కానీ.. మంత్రి వర్గ విస్తరణ అయితే జరగలేదు. కానీ విస్తరణ చుట్టూ కావలసినంత రాజకీయం అయితే  జరిగింది. అసలు అంతలా ఉరుకులు పరుగులు పెడుతూ హడావిడిగా రాత్రికి రాత్రి, అది కూడా బడ్జెట్ సమావేశాలు జరుగతున్న సమయలో మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? నిజంగా అలాంటి అవసరం వచ్చి ఉంటే.. ఆ తర్వాత అధిష్టానం ఎందుకు ఉలుకూ పలుకూ లేకుండా ఎందుకు మౌనంగా ఉంది పోయింది?  తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి  అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తోంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   అలాగే, కంచ గచ్చిబౌలి భూముల వివాదం విషయంలోనూ  మీనాక్షి నటరాజన్  గీత దాటి చూపించిన చొరవ తదితర పరిణామాలను గమనిస్తే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం పైనుంచి జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు.  నిజానికి రాహుల్ గాంధీ, రేవంత్  రెడ్డి మధ్య  దూరం పెరగడం కాదు, వైరం పెరిగిందనీ ఆ   వైరం పర్యవసానంగానే కాంగ్రెస్ పరిస్థతి  హస్తవ్యస్తంగా మారిందని అంటున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని తెలిపారు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  బ్యాంకుర్లు ముందుకు వస్తే యువత ఆర్దికంగా ఎదుగుతారని రూ.61 వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. . రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు  గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం  అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది   .సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపుపై వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వం మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. వీరి ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. అర్హుల జాబితా రూపొందించిన తర్వాత కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్‌ తుది జాబితాను రీలీజ్ చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న రుణ పత్రాలు అందజేయనున్నారు
ALSO ON TELUGUONE N E W S
Deepika Padukone and Ranveer Singh are one of the most popular and power couples of Bollywood. Ranbir Kapoor and Alia Bhatt can give tough competition to their popularity. Such popular couple have recently become parents of their daughter, Dua.  The star couple have decided to move into their new huge sea-face luxurious building in Bandstand, Bandra. The huge house consists of 19 floors and it is spread across 11,000 acres in prime location in Mumbai. With state-of-art amenities and shocking fashionable interior designs, the buliding is almost ready to move in.  The cost of this huge building is stated to be Rs.100 crores. Within the vicinity, Shah Rukh Khan and Salman Khan are residing and the couple want their daughter Dua, to enjoy every luxury under the sun, while also being humble and grounded, say reports. 
Pooja Hegde did not find many Telugu film offers in recent times. She had been dropped out from Guntur Kaaram film and she found more offers from Tamil Cinema. Her Retro, with Suriya, is gearing up for a wide release on 1st May. During an interview, she made comments about social media influence.  She stated that she has 30 Million followers but can't assure 30 Million ticket sales with her presence. She stated that some stars don't have more than 5 Million but they are superstars. She stated that social media is not real and it is necessary to be aware of that aspect.  These comments have gone viral and fans of Telugu big stars are fighting with each other stating that Pooja targeted their hero. It is interesting to see that Pooja did not take any names but just talked about how social media popularity should not be taken seriously.  But some fans are dragging Allu Arjun's name and Ram Charan into their fights. These fans just need one or the other tool to target the other actor and Pooja's comments have come in handy. In fact, Pooja could have hinted at producers trying to give opportunities to social media influencers rather than real talents.  She did say it in a very genuine fashion taking her example. So, it is easy to blow out of proportion not taking the context into considentation. Hope, people who are looking at these silly fan wars don't get carried away and look at her interview with objectivity. 
Nazriya Nazim Fahadh has delivered a huge blockbuster last year with her film, Sookshmadarshini. The actress has won Kerala Critics Choice Award for her performance. The actress has been absent from major events and she stated from past few months her emotional wellbeing has been bad.  While she did not reveal the reason behind her mental health challenges, she did not drop out Fahadh Faasil name or did not state that she is unhappy with her married life. She just stated that personally and emotionally she is facing some challenges and it could be related to any long term illness or missing some close relatives.  Rather the jumping the gun, it would be better to understand what could be the trigger behind her issues. Anyways, she did say that she would reconnect with everyone soon and assured that she is working on getting better, everyday. Let's hope, she would be her cheerful life again, in no time.    Here's what Nazriya wrote in her open letter:  I hope you're all doing well. I wanted to take a moment to share why I've been absent for a while. As many of you know, I've always been an active member of this wonderful community. However, over the past few months, I've been struggling with my emotional wellbeing and personal challenges that have made it difficult for me to be present. I missed celebrating my 30th birthday and New Year's, the success of my film 'Sookshmadarshini', along with many other important moments. I also want to apologize to all my friends for not explaining why I went missing and for not picking up calls or responding to messages. I'm truly sorry for any worry or inconvenience I may have caused. I did shut down completely. I also want to extend my apologies to all my colleagues who have been trying to reach me for work. I've been absent and I'm sorry for any disruptions this may have caused. On a positive note, I'm thrilled to share that I received the Kerala Film Critics Award for Best Actor yesterday! Thank you so much for all the recognition and congrats to fellow nominees and winners.  It's been a tough journey, but I want you to know that I'm working on healing and getting better every day. I appreciate your understanding and support during this time. I may need a bit more time to fully return, but I promise I'm on the path to recovery. I wrote this down today because I felt like I owe an explanation to all my family, friends and fans for disappearing like this. Love u all...and reconnect soon. Thank you all for being here and for your endless support.
Sarangapani Jathakam starring Priyadarshi, Roopa Koduvayur, VK Naresh, Tanikella Bharani, Avasarala Srinivas, Vennela Kishore, Viva Harsha, is creating good expectations. Priyadarshi after a blockbuster like Court, is looking to continue to his success streak with this Indraganti Mohana Krishna comedy.  The movie trailer has been released on 16th April and it looks very engaging and the comedy is refreshingly family friendly. Priyadarshi's belief on his astrological profile is going to determine the outcome of his life and to what extent he would go to change it before his marriage, is the story.  Indraganti Mohana Krishna who crafted enjoyable films like Ashta Chemma, Gentleman, Ami Thumi, Sammohanam is directing this movie with an interestingly storyline that points out the extent of blind beliefs among everyone. The light-hearted film without hurting anybody's sentiments tries to entertain them with a good message.  Also, the producer of the film, Sivalenka Krishna Prasad, has already told the movie is going to be another memorable one for them. The trailer rises our intrigue about the movie and the entertainment it offers. The movie is releasing on 25th April, all over. 
Prabhas is one of the biggest stars of Indian Cinema and his films have huge anticipation. Recently, he has been accepting multiple films but his fans have high anticipation for Spirit, to be directed by Sandeep Reddy Vanga. The movie will present him for the first time in a cop role.    The actor underwent knee surgery, a couple of times in Europe, as the knee injury been persistent from Baahubali time. He could not participate in big action stunts directly due to this injury. But Sandeep Reddy Vanga has asked him to achieve complete fitness before joining Spirit sets, it seems.    While the director understands the physical difficutly, he conceived big action sequences that need the actor to be at his physical best. So, the actor has gone to Italy for treatment and he will return as soon as he feels at his best, it seems.    Few reports also suggest that Kalki 2 shoot will start with Kamal Haasan and Amitabh Bachchan in June second half. For 15-20 days, the sequences featuring both the big legends will be shot, it seems. On the other hand, Prabhas will start shooting for Spirit from October as per other sources.    But he needs to complete The Raja Saab and Hanu Raghavapudi's film before he can join Spirit. We have to wait and see, when he will be coming back to India and complete the films.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji maharaj)తనయుడు 'శంభాజీ మహారాజ్'(Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'చావా'(Chhaava). విక్కీ కౌశల్(vicky kaushal)టైటిల్ రోల్ పోషించగా రష్మిక, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో కనపడ్డారు.  హిందీలో ఫిబ్రవరి 14 ,తెలుగులో మార్చి 7 న రిలీజై రెండు చోట్ల మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా సుమారు 789 కోట్ల రూపాయలని సాధించింది. ఇక నాచురల్ స్టార్ నాని(Nani)నిర్మాతగా వచ్చిన మూవీ కోర్ట్'(Court). ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో కనిపించగా, మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద 66 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టి  తన సత్తా చాటింది.  'చావా' హిందీతో పాటు తెలుగులో ఈ నెల  11 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కోర్ట్   మూవీ కూడా ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు రికార్డు వ్యూస్ ని అందుకొని ఓటిటి చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. చావా 5 .9 మిలియన్ గంటల్లో 2 .2 మిలియన్ల వ్యూస్ ని రాబట్టగా, కోర్ట్ 5 .4 మిలియన్ గంటల్లో 2 .2 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. దీంతో చావా టాప్ 4 లో కొనసాగుతుండగా, కోర్ట్ టాప్ 5 లో కొనసాగుతుంది. దీంతో ఈ రెండు చిత్రాల కథా నేపథ్యం వేరైనా, ఓటిటి లో పోటీ పోటీగా దూసుకెళ్తుండటం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చావా హిందీ వెర్షన్ కూడా ఏప్రిల్ 11 నే ఓటిటిలో అడుగుపెట్టగా రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలోనే ఈ రికార్డు పై అధికార ప్రకటన రానుంది.  
లెజండ్రీ సింగర్ అభిజిత్(Abhijeet Bhattacharya)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్(Ar rahman)మాట్లాడుతు 'ఏఆర్ రెహ్మాన్ తన మ్యూజిక్ కంపోజ్ కోసం గాయని గాయకులు బదులు టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడతాడు. దాని వల్ల ఎంతో మందికి  ఉపాధి లేకుండా పోతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారిన  నేపథ్యంలో అభిజిత్ వ్యాఖ్యలపై ఏ ఆర్ రెహ్మాన్ స్పందించడం జరిగింది. రెహ్మాన్ మాట్లాడుతు నేను దుబాయ్ వేదికగా ఇటీవల ఒక మహిళా ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసాను. అందులో అరవై మంది దాకా మహిళలు ఉన్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రతినెలా జీతాలు ఇస్తున్నాను. వాళ్ల కోసం ఆరోగ్య భీమా, జీవిత భీమా కూడా కడుతున్నాను. పొన్నియన్ సెల్వం, చావా వంటి చిత్రాలు చేసినప్పుడు 200 మంది సంగీత కారులని ఆయా చిత్రాల్లో  భాగం చేశాను. కొన్ని సార్లు కేవలం పాటల కోసమే వంద మంది దాకా వర్క్ చేస్తుంటాను. నేను ఇలాంటివన్నీ ఎక్కడ చెప్పడం కానీ, వాటికి సంబంధించిన ఫోటోలని  పంచుకోవడం గాని చెయ్యను. అందుకే నా వర్కింగ్ స్టైల్ పై ఎవరకి అవగాహన ఉండదు. ఇవన్నీ తెలియక చాలా మంది నన్ను తప్పుపెట్టినా పర్లేదు. కావాలంటే అభిజిత్ కి స్వీట్స్ కూడా పంపుతాను. ఎందుకంటే ఒక్కొక్కొరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని చెప్పుకొచ్చాడు. హిందీ చిత్ర సీమకి చెందిన అభిజిత్ పూర్తి పేరు అభిజిత్ భట్టాచార్య కాగా, హిందీతో పాటు మరాఠీ, తమిళ్, నేపాలి, భోజ్ పురి, పంజాబీ, ఒడియా లాంటి భాషల్లో సుమారు 6000 కి పైగా పాటలు పాడారు. రెహ్మాన్, అభిజిత్ కాంబోలో 'దిల్ హై దిల్ మెయిన్' మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'ఏ నజనీన్ సునోనా' అనేది మొదటి సాంగ్. ఇదే మూవీ తెలుగులో ప్రేమికుల రోజుగా రాగా 'వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైన అనే లిరిక్ తో వచ్చి నేటికీ మారుమోగిపోతు ఉంది. కాకపోతే తెలుగు వెర్షన్ ఉన్ని మీనన్ పాడటం జరిగింది.  ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో ఒక సాంగ్ మాత్రమే వచ్చింది.
‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్‌ ఈ 20 సంవత్సరాల్లో 9 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. అన్ని సినిమాలకూ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాదే. అతన్ని దాటి ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గరకీ సుకుమార్‌ వెళ్ళలేదు. కానీ, అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప2’ చిత్రం మ్యూజిక్‌కి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చాయి. దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ప2’ నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో థమన్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన కారణంగానే థమన్‌ని తీసుకున్నారని కొందరు చెప్పుకోగా, దేవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల అనుకున్న టైమ్‌కి వర్క్‌ పూర్తి కావడం లేదనే కారణంతో థమన్‌ని రంగంలోకి దింపారని ప్రచారం జరిగింది. ఒక సందర్భంలో ‘పుష్ప2’ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కోసం తాను వర్క్‌ చేస్తున్నానని థమన్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. సినిమా రిలీజ్‌ అయ్యే వరకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ థమనే చేశాడని అందరూ అనుకున్నారు. కానీ, టైటిల్స్‌లో అతని పేరు కనిపించకపోవడంతో అందరూ షాక్‌ అయ్యారు.  దీనికి సంబంధించి థమన్‌ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘పుష్ప2’ కోసం తాను 10 రోజులు పని చేశానని, సుకుమార్‌ టేస్ట్‌కి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసి మూడు వెర్షన్లుగా ఇచ్చానని అన్నారు. తను చేసిన మ్యూజిక్‌ యూనిట్‌లోని అందరికీ నచ్చిందని చెప్పారట. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ ఫైనల్‌గా దేవిశ్రీప్రసాద్‌, సామ్‌ సి.ఎస్‌. చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని ఓకే చేశారు. అది తనకు బాధ కలిగించలేదని చెప్పుకొచ్చారు థమన్‌. తుది నిర్ణయం డైరెక్టర్‌దే కాబట్టి దాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ఇటీవల వచ్చిన చాలా సినిమాలకు థమన్‌ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ‘పుష్ప2’ కోసం మూడు వెర్షన్లు చేసినా సుకుమార్‌కి నచ్చలేదు. అయితే సుకుమార్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేనని సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఎన్నో సీన్స్‌ని బాగా ఎలివేట్‌ చెయ్యడానికి మ్యూజిక్‌ బాగా హెల్ప్‌ అయింది. ఏది ఏమైనా 130 సినిమాలకు సంగీతం అందించిన థమన్‌ని ‘పుష్ప2’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చెయ్యమని అడగడం, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టడం అనేది ఒక టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి జరిగిన అవమానంగానే భావించాలి.
2019 లో మలయాళ చిత్ర సీమలో తెరకెక్కిన కామెడీ డ్రామా ఫిలిం 'వికృతి' ద్వారా ప్రేక్షకులకి పరిచయమైన నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)ఈ మూవీలో 'జీనత్' అనే క్యారక్టర్ లో విన్సీ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత 'కనకం కామిని కలహం, భీమంతే వజి, జనగణమన, 1744 వైట్ ఆల్టో, రేఖ, పద్మిని వంటి పలు చిత్రాల్లో నటించి అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. 'రేఖ' చిత్రానికి అయితే ఉత్తమ నటి కేటగిరిలో  కేరళ స్టేట్ అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకొని తన సత్తా చాటింది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో విన్సీ మాట్లాడుతు ఒక మూవీ షూటింగ్ టైంలో హీరో డ్రగ్స్ తీసుకునేవాడు. నాతో అనుచితంగా ప్రవర్తిస్తు తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందులకి గురి చేసేవాడు. నా జీవితంలో ఇదొక పెద్ద అసహ్యకరమైన సంఘటన. డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించకూడదని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం వల్ల నాకు భవిష్యత్తులో అవకాశాలు  రాకపోవచ్చు.  నాతో అలా ప్రవర్తించిన హీరో గురించి అందరికి తెలుసు. ఎందుకంటే లొకేషన్ లో అందరి ముందే  అసభ్యకరంగా మాట్లాడే వాడు. కానీ ఎవరు స్పందించలేదు. డ్రగ్స్ తీసుకోవడం అతని వ్యక్తిగత విషయం కావచ్చు. కానీ వృత్తి పరమైన వాతావరణంపై అది ప్రభావితం చూపించకూడదు కదా అని తన ఆవేదనని  చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విన్సీ మాటలు సౌత్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి.  'రేఖ' చిత్రం 2022 లో ప్రేక్షకుల ముందుకు రాగా, 2023 లో పద్మిని, ది ఫేస్ ఆఫ్ ఫేస్ లెస్, ఫజంజన్ ప్రణయం వంటి చిత్రాల్లో విన్సీ కనిపించింది. గత ఏడాది 'మారివిల్లియన్ గోపురంగల్' అనే ఒకే ఒక్క చిత్రాన్ని చెయ్యగా ఈ సంవత్సరం 'సూత్రవ్యాక్యం' అనే మూవీలో చేస్తుంది.  
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఎఐ) అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత మంగళవారం తమ సంస్థ ట్విట్టర్‌ ఖాతాలో ‘బోల్డ్‌.. బిగ్‌ బియాండ్‌ ఇమాజినేషన్‌’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. బుధవారం ఉదయం 11.08 గంటలకు దానికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశారు.  ఎఐలో విశేష కృషి చేస్తున్న ‘క్వాంటమ్‌ ఎఐ గ్లోబల్‌’తో కలిసి ఒక ఎఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కోసం ఎఐ టూల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, దానికి సంబంధించిన కంటెంట్‌ను అందించడానికి తమ స్టూడియో పనిచేస్తుందని వివరించారు స్టూడియో నిర్వాహకులు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సంస్థ పేరు, దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను మే 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎనౌన్స్‌మెంట్‌కి సంబంధించి ఒక వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  గత కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తే ఆడవాళ్లు వంటింటి కుందేళ్ల స్థానం నుండి మల్టీ టాస్కర్లు గా ఎదిగారు.  ఇంటి పని,  వంటి పని, ఉద్యోగంతో పాటు ఆర్థిక విషయాలు కూడా చూసుకుంటున్నారు. అయినా సరే పెళ్లి తర్వాత ఆడవాళ్ల పాత్ర చాలా వరకు తగ్గించాలని చూస్తారు మగవారు. ఇంటి విషయాలలో మగవారు తమ మాటే నెగ్గాలని అనుకుంటూ ఆడవారి మాటను లెక్కచేయరు. కానీ మహిళల గురించి చాలామందికి తెలియని కొన్ని నిజాలను అధ్యయనాలు బయటపెట్టాయి. ఆడవారికి ఏమీ తెలియదు.. వారికి ఏమీ చెప్పక్కర్లేదు అనుకోవడం మాత్రమే కాదు.. ఆడవారి మాట వినకుండా విస్మిరించే మగవారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఒక అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం.. మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుందట.  మహిళల నుండి సలహాలు తీసుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగుపడుతుందని,  తప్పులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అందుకే పురుషులు స్త్రీల మాట వినాలని అంటారు. మహిళల విషయానికి వస్తే.. మహిళలు  చాలా కోణాలను   పరిగణలోకి తీసుకుంటారు, సహకారాన్ని ఇష్టపడతారు . మహిళల ఆలోచనలు  పురుషుల కంటే సమతుల్య దృక్పథాన్ని అందిస్తాయి, ఇది ఎక్కువ  విజయావకాశాలకు దారితీస్తుంది. వారి ఆలోచనా విధానం పురుషుల ఆలోచనా విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వారు అంచనా వేయగలరు. పురుషులు ఇంట్లో,  కార్యాలయంలో మరింత సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు.  ఇంట్లో,  కార్యాలయంలో మహిళల దృక్పథం  ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. తన సలహా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విజయమే కాకుండా, మానసిక ఆరోగ్యం,  ఇరువురి మధ్య  ఆనందం కూడా మెరుగవుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటే వారి ముందు భార్యాభర్తలు  ఒక జట్టులా ఉంటారు. తరచుగా పిల్లల ముందు పురుషులు తమ భార్యలను తిడతారు.  ఇది వారి ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది. అయితే  సమస్యలను ప్రైవేట్‌గా పరిష్కరించుకోవాలి.  భార్య గృహిణి అయినప్పటికీ, ఆర్థిక నిర్ణయాల కోసం  ఎల్లప్పుడూ ఆమె దగ్గరికి వెళ్లాలి. అది పొదుపు అయినా లేదా పెట్టుబడుల గురించి అయినా. ఆమె దాని సాంకేతిక అంశాలలోకి వెళ్ళలేకపోయినా, దానిని ఎలా చేయాలో,  మీరిద్దరూ కుటుంబంగా ప్రతి నెలా ఎంత ఆదా చేయాలో ఆమె మీకు చెప్పగలదు. పిల్లల ముందు ఒక జట్టుగా ఉండాలంటే, అది కిరాణా సామాను కొనడం లాంటి చిన్నదైనా లేదా కారు కొనడం లాంటి పెద్దదైనా  కలిసి మాట్లాడుకోవాలి.  ప్రతిదానిపైనా ఆమె అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. దీని వలన    జీవితంలోని ప్రతి అంశంలోనూ తాను కూడా ఉన్నానని భార్య భావిస్తుంది. ఇది ఆడవారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే అంశం.                                            *రూపశ్రీ.
  కందుకూరి విరేశలింగం అనగానే అందరికీ ఉద్యమ స్పూర్తి గుర్తుకు వస్తుంది.  స్త్రీల కోసం పాటు పడిన సంఘసంస్కర్తలలో కందుకూరి విరేశలింగం తెలుగు ప్రజల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించారు.  ఈయనను నవయుగ వైతాళికుడు అని పిలుస్తారు. భారత ప్రభుత్వం కందుకూరి విరేశలింగం ను రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది.  ఏప్రిల్ 16, 1848లో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు. ఆయన జయంతి సందర్బంగా ఆయన గూర్చి తెలుసుకుంటే.. కందుకూరి విరేశలింగం గూర్చి.. వీరేశలింగం ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన కేవలం నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు  తండ్రి మరణించాడు. దీంతో ఈయన  తన మామ వద్ద పెరిగాడు. విరేశలింగం గారి  విద్యా నైపుణ్యం,  స్నేహపూర్వక స్వభావం  పాఠశాల రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 1869లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత, ఒక గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. వీరేశలింగం తెలుగు, సంస్కృతం,  ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన తెలుగులో మొదటి నవలను రచించారు,  తెలుగు సాహిత్యానికి ఆత్మకథ,  వ్యాస ప్రక్రియలను పరిచయం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంపై మొదటి తెలుగు పుస్తకాన్ని కూడా రాశారు.  అనేక ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. తెలుగు సమాజ సంస్కరణకు ఆయన చేసిన గణనీయమైన కృషి ఎంతో గౌరవనీయమైనది. అయితే రాజా రామ్ మోహన్ రాయ్,  కేశుబ్ చంద్ర సేన్ వంటి సామాజిక సంస్కర్తలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెలుపల ఆయన కీర్తి పరిమితం. ఆయన మహిళల హక్కులకు చాలా మద్దతు ఇచ్చారు.  మహిళల హక్కుల గురించి చాలా  విస్తృత రచనలు చేశారు. బాల్య వివాహాలను,  యువతులను వృద్దులతో  వివాహం చేసే ఆచారాన్ని ఆయన ఖండించారు. వితంతు పునర్వివాహాన్ని కూడా ఆయన సమర్థించారు. విరేశలింగం గారి  రాడికల్ ఆలోచనలు,  పదునైన విమర్శలు అతన్ని చాలా మంది విమర్శకులకు,  ప్రజల ఎగతాళికి గురి చేశాయి. స్త్రీలను ఎల్లప్పుడూ ద్వితీయ పౌరులుగా పరిగణించరని వాదించడానికి ఆయన పురాతన గ్రంథాలను ఉపయోగించారు. రామాయణంలో, శ్రీరాముడు ఎల్లప్పుడూ సీతతో సభలో ఎలా ఉండేవాడో ఆయన నొక్కి చెప్పారు.   మహిళల పరిస్థితి దిగజారినప్పుడు భారతదేశం యొక్క క్షీణత ప్రారంభమైందని ఆయన నమ్మాడు. ఆయన బాలికలు,  మహిళల కోసం పాఠశాలలను స్థాపించాడు.  డిసెంబర్ 11, 1881న ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించాడు.  ఇది సంప్రదాయవాద సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సమాజం ఎంతగానో అవమానించినా, ఆయన తన జీవితకాలంలో దాదాపు 40 మంది వితంతువులకు పునర్వివాహం చేయించాడు. మహిళల హక్కులు,  విద్యను ప్రోత్సహించడానికి ఆయన వివిధ పత్రికలు,  జర్నల్స్‌ను ప్రచురించారు.  1887లో రాజమండ్రిలో బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1885లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభ సమావేశానికి హాజరైన వారిలో వీరేశలింగం మొదటి వ్యక్తి.  1893లో భారత ప్రభుత్వం ఆయనను 'రావు బహదూర్' బిరుదుతో సత్కరించింది. ఆయన మే 27, 1919న 71 సంవత్సరాల వయసులో మరణించారు.                                               *రూపశ్రీ.
  కళలకు భారతదేశం పెట్టింది పేరు.  ఇప్పుడు సినిమా హాళ్లలో సినిమాలు ఇంతగా వస్తున్నాయి కానీ.. కొన్ని సంవత్సరాల క్రితం వీధులలో నాటకాల రూపంలో వివిధ కథలు, చారిత్రాత్మక సంఘటనలను ప్రదర్శించేవారు. ఇలా పుట్టిందే నాటక రంగం. రాత్రి సమయాల్లో లాంతర్లు,  దివిటీలు పెట్టి నాటకాలను ప్రదర్శించేవారు.  పగలంతా కష్టం చేసిన ఆనాటి ప్రజలకు రాత్రయ్యే సరికి ఇదొక మంచి వినోదంగా ఉండేది. ఈ కోవలో హరికథలు,  బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివి ఎన్నో ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమ ఇంత ఎత్తు ఎదగడానికి కారణమైనది మాత్రం నాటక రంగమే..  ప్రతి ఏడాది ఏప్రిల్ 16వ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవం గా జరుపుకుంటారు.  అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తెలుగు నాటక రంగ దినోత్సవం అనేది ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం సందర్బంగా  జరుపుకుంటారు.  తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవం తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఎలా మారింది?   తెలుగు నాటక రంగ దినోత్సవం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు నాటక రంగానికి మార్గదర్శకుడు (రచయిత). బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన నాటకాలు, నవలలు,  సామాజిక వ్యంగ్య రచనలు రాశారు. ఇవి తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అన్నింటికంటే మించి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా. ఆయన తన రచనల ద్వారా జాతి వివక్ష,  అనేక ఇతర సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సమయంలో అరుదుగా ఉండే వితంతు పునర్వివాహాలను ఆయన ప్రోత్సహించారు.  మొదటి తెలుగు నాటకం కందుకూరి రాసిన వ్యవహార ధర్మ బోధని మొదటిసారిగా ప్రదర్శించబడింది. 2007లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వీరేశలింగం పుట్టినరోజును 'తెలుగు నాటకరంగ దినోత్సవం'గా జరుపుకుంటామని ప్రకటించింది. అప్పటి నుండి నాటక కార్యకర్తలు ఏప్రిల్ 16ని తెలుగు నాటక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కందుకూరి విరేశలింగం పంతులు గారు ఆధునిక నాటక ప్రదర్శనకు రూపం ఇచ్చిన వారిలో ఒకరు. విరేశలింగం పంతులు గారు డైలాగ్స్ రూపంలో బ్రాహ్మ వివాహము అనే నాటకాన్ని హాస్య సంజీవని అనే పత్రికలో రచించారు.  ఆ తరువాత వ్యవహార ధర్మభోధిని  అనే నాటకాన్ని ప్రకటించారు. ఆనాటి గ్రాంథిక భాష కాలంలో వ్యవహారిక బాషలో ఒక నాటకాన్ని సాగించడం పెద్ద సాహసమనే చెప్పాలి.  వేదిక మీద ప్రదర్శించిన తొలి నాటకం ఇది. తెలుగు రాష్ట్రంలో  తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత కందుకూరి విరేశలింగం పంతులు గారిదే. ఈ కారణంగానే కందుకూరి విరేశలింగం పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.                                 *రూపశ్రీ.  
  శరీరం,  మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర  బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు  అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు.  తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది  మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు.  కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని  చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట.  నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు.  దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట.  6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవి కాలం సాధారణ కాలం కంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం,  ఎలక్ట్రోలైట్లు కోల్పోవడం, నీరసం,  అలసట వంటివి ఎదురవుతూ ఉంటాయి.  వీటి కారణంగా  శరీరం బాగా బలహీనంగా అనిపిస్తుంది. అలా కాకుండా రోజంతా శరీరం శక్తితో ఉండాలంటే గుప్పెడు వేయించిన శనగలు,  బెల్లం తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు. అసలు రోజూ ఒక గుప్పెడు శనగలు బెల్లంతో కలిపి తింటే ఏం జరుగుతుంది తెలుసుకుంటే.. బెల్లం,  వేయించిన శనగల  కలయిక పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు కలిసి శరీరానికి ఐరన్, ఫైబర్, ప్రోటీన్ తో పాటు  అనేక ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి,  హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.  ఎటువంటి భారీ ఆహారం తీసుకోకుండా శరీరం  ఫిట్‌గా,  ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బెల్లం,  వేయించిన శనగలు తినాలి. బెల్లం శరీరానికి ఐరన్,  యాంటీఆక్సిడెంట్లను అందించే సహజ స్వీటెనర్. శనగలలో ప్రోటీన్,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ కలిస్తే రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా గొప్పగా సహాయపడే స్నాక్ అవుతుంది. బెల్లంలో ఉండే పొటాషియం,  శనగలలో  ఉండే ఫైబర్ కలిసి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి . ఇది గుండెపై భారాన్ని తగ్గిస్తుంది,  కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. పగటిపూట త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తే లేదా శక్తి లేకపోయినట్టు అనిపిస్తే, బెల్లం,  వేయించిన శనగలు  దివ్యౌషధం గా పనిచేస్తాయి. బెల్లం శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది,  శనగలు  కండరాలను బలపరుస్తుంది. శనగపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఆకలిని నియంత్రిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది,  బరువును నిర్వహించడం సులభం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెలసరి  సమయంలో బలహీనత,  అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది. శనగపప్పు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది,  చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.                               *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    
వేసవి కాలం వచ్చిందంటే పండ్ల రసాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది.  శరీరాన్ని చల్లబరిచి శరీరానికి శక్తిని ఇవ్వడం పండ్ల రసాల ప్రత్యేకత.  అయితే బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఎంచుకునే వాటిలో కొబ్బరి నీరు.. దాని తరువాత చెరకు రసం మొదటి వరుసలో ఉంటాయి.  చెరకు రసం శరీరానికి చలువ చేస్తుంది.  శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది.  వేసవి వేడి ప్రభావానికి గురి కాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.  అయితే చెరకు రసం తియ్యగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దాన్ని తాగవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. డయాబెటిస్ లో రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలి.  ఇలా నియంత్రణలో ఉంచగలిగే ఆహార పదార్థాలను తీసుకోవాలి.  అలాంటి పానీయాలనే తాగాలి అని ఆహార నిపుణులు,  వైద్యులు చెబుతారు.   చెరకు రసం శరీరానికి తక్షణ  శక్తిని ఇస్తుంది.  ఈ కారణంగానే చాలామంది బయటకు వెళ్లినప్పుడు అలసటగా అనిపించగానే చెరకు రసం తాగుతూ ఉంటారు.  దీని వల్ల శరీరం వేగంగా రీచార్జ్ కావడమే కాకుండా శరీరం  హైడ్రేట్ గా కూడా ఉంటుంది.  అందుకే చెరకు రసం ఆరోగ్యానికి మంచిదిగా పరిగణిస్తారు. చెరకు రసంలో ప్రధానంగా సహజ చక్కెరలు ఉంటాయి.  ఇవి కూడా చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి.  చెరకు రసాన్ని తాగినప్పుడు ఇందులోని సహజ చెక్కరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ప్రతి ఆహార పదార్థంలో ఉన్న చక్కెర శాతాన్ని గ్లైసెమిక్ సూచిక ద్వారా కొలుస్తారు.  చెరకు రసంలో ఉన్న గ్లైసెమిక్ సూచిక కూడా ఎక్కువగా ఉంటుంది.  అంటే ఇలా గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న పదార్థాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు చెరకు రసాన్ని తాగాలి అంటే మొదట వారి రక్తంలో చక్కెర స్థాయిల పరిమాణాన్ని  పరిగణలోకి తీసుకోవాలి.  చక్కెర స్థాయిలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ చక్కెర స్థాయిలు అప్పటికే ఎక్కువగా ఉన్నవారు పొరపాటున కూడా చెరకు రసం తాగకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది.  దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. వైద్యుల సిఫారసు లేకుండా చెరకు రసం తాగడం మంచిది కాదు.                                    *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...