చట్టానికి అతీతులు ఎవరూ  కాదు అని  ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తనను విచారణ నుంచి మినహాయించాలని  వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. అయితే వేణుస్వామికి  హైకోర్టు ఎలాంటి     మినహాయింపు ఇవ్వలేదు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో వేణుస్వామికి మహిళా కమిషన్  మరో మారు  నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి ఇవ్వాళ విచారణకు హాజరై నాగచైతన్య దంపతులపై తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.  వ్యక్తి గత జీవితాల్లో    ఇకముందు జోక్యం చేసుకోనని  వేణుస్వామి మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు.   వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని చట్టాలు చెబుతున్నాయి. అంతకుముందు క్రింది కోర్టు ఇదే విషయం చెప్పినప్పటికీ వేణుస్వామి హైకోర్టునాశ్రయించి మరోమారు అభాసుపాలయ్యారు. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు అడిగి మరింత దిగజారిపోయారు. 
ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా?  ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిస్సో జీసీసీ అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారనీ, అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో పాతికశాతం మందికి పైగా తెలుగువారేనని లోకేష్ వివరించారు.   ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనరంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్-టెక్ హబ్‌గా ఏపీ మారనుందని,  అతిపెద్ద టాలెంట్ పూల్‌ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఎపి అనువుగా ఉంటుందనీ లోకేష్ ఈ సందర్భంగా సస్కో వైస్ ప్రెసిడెంట్ కు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన  భారత్ లో త్వరలో 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామనీ,  సమర్థవంతమైన మానవవనరులు ఉన్న ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో  త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేలా.. అనేకానేక విషయాలలో ఈ కుంభమేళా దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు. కానీ మహాకుంభమేళా ఆరంభం నుంచీ వీళ్లెవరూ కాదు.. ఓ 16 ఏళ్ల అమ్మాయి.. అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలిక కుంభమేళాకు వచ్చిన వారందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం పోటీలు పడ్డారు. అలా పోటీలు పడ్డవారిలో చిన్నా పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి వీలైతే ఫొటో తీసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏమిటి? అంటే ఎవరూ చెప్పలేరు. అతి సాధారణమైన ఆ అమ్మాయి సహజత్వం, కల్మషమెరుగని మందహాసం, మరీ ముఖ్యంగా తెనెకళ్లు.. అన్నిటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గరల్ ఆఫ్ ది సాయిల్. ఆ అమ్మాయిలోని ఈ  సింప్లిసిటీ, ఈ సహజత్వమే అందరినీ ఆకర్షించింది. ఇంకే ముంది నెటిజనులు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కుంభమేళా ప్రారంభం నుంచీ  సామాజిక మాధ్యమంలో ఆమె ఫొటోలే చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి తేనెకళ్ల సుందరి హఠాత్తుగా కుంభమేళా నుంచి మాయమైపోయింది. ఎందుకు, ఏమిటి అన్న ఆరా తీస్తే.. కుంభమేళాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేంత స్థాయిలో అరాచకం కూడా రాజ్యమేలుతోందన్న విషయం వెలుగులోనికి వచ్చింది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రశాంతంగా కుంభమేళా నిర్వహణ అంటూ సొంత భుజాలను చరిచేసుకుంటున్న యూపీలోని యోగి సర్కార్ సిగ్గుతో తలవంచుకునేలాంటి సంఘటనలూ జరుగుతున్నాయని ప్రపంచానికి తెలిసింది.    పూసలూ, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసా (తేనెకళ్ల సుందరి) మీడియాకు ముడి సరుకుగా మారిపోయింది. అంతే కాదు ఆకతాయిలకు టార్గెట్ కూడా అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ ఆమెను అటకాయించడం, ఫొటోలు దిగాలని ఫోర్స్ చేయడం, వేధించడం ఎక్కువైపోయింది. దీనికి తోడు ఆమెలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖ పోలికలు కనిపించడంతో ఫ్యూచర్ బాలీవుడ్ హీరోయిన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది.తమది  దీంతో ఆమె అడుగు బయటపెట్టాలంటే బయపడే పరిస్థితి వచ్చింది. ఆమెను కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆమె తల్లిదండ్రులు మధన పడ్డారు.  చివరకు మహాకుంభమేళా నుంచి బిచాణా ఎత్తేశారు.  
ALSO ON TELUGUONE N E W S
Saif Ali Khan suffered from stabbing wounds when an outsider attacked him with knife during a burglary attempt. He stabbed him six times and the actor had been admitted to Lilavati Hospital, immediately. The actor recovered after a surgery in spinal cord and he returned to his Bandra residence on Tuesday.  His wife, Kareena Kapoor accompanied him in the afternoon as doctors decided to discharge him. The actor sat in the car and walked back to his residence waving to the spectators gathered nearby. He is able to walk normally and doctors advised ample rest before he starts back working.  The actor has been stabbed by a stranger who entered into their building on 16th January in the early hours. The actor had to be rushed to the hospital and doctors immediately performed a surgery to stop bleeding in his spinal cord and removed 3-inch hexa blade from his back.  He is stable and recovered quickly to walk. But the doctors have advised extreme care and dietary measures till his wounds fill up completely. It is heartening to see him hale and healthy after such a dangerous incident. 
Astrologer Venu Swamy has been in the heart of controversies with his bold predictions about celebrities on social media. He predicted Naga Chaitanya and Sobhita Dhulipala's divorce on eve of their marriage. He remarked that the couple's marriage will follow the suit of Chaitanya and Samantha marriage.  Telangana Women Commission took offence to his comments. They demanded an apology from him for his comments and sent notices. He neglected them at first and went to court challenging them. High court directed him to appear in front of the commission.   So, they sent him notices again and he appeared in front of them, today. He extended his unconditional apology for his comments on a letter. He submitted the letter and even stated that he would not repeat such offensive comments on popular medium further.   
NTR Memorial Trust has been conducting philanthropic activities from past 28 years ever since the inception. Now, the trust has decided to conduct a musical night with popular composer Thaman as lead composer. The NTR Memorial Trust Euphoria Musical Night will be conducted on 15th February at Vijayawada.  Managing Trustee Nara Bhuvaneswari made the announcement at NTR Trust Bhavan and stated that the event is being conducted to spread awareness about a genetic blood disorder Thalassemia. She thanked Thaman for agreeing to participate and perform at the event as the lead performer.    At the event, she remarked that blood donors in Telugu states are decreasing alarmingly. She stated that quality blood availability is a must for saving lives and requested people to trust NTR Blood Bank camps and donate blood without fears. She stated that they practice medically approved techniques to extract blood and hence, donors won't be having any sort of side effects.  Thaman stated that he is his privilege to be performing at the event. He stated that he felt honored to be asked to perform at the event. He promised to work hard for making the event a big success. He remarked that they will perform all NTR hits and latest chartbusters at the event to make it a memorable night. Tickets for the event will be avaiable on BMS app. 
2020 లో హిందీ సినీ ప్రేమికులని విశేషంగా అలరించిన వెబ్ సిరీస్ లో 'పంచాయత్' (Panchayath) కూడా ఒకటి. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచింది. మూడు సీజన్ల గా విడుదలయిన ఈ సిరీస్ కి దీపక్ మిశ్రా దర్శకత్వాన్ని వహించగా 'ది వైరల్ ఫీవర్'సంస్థ నిర్మించింది. జితేంద్ర కుమార్,నీనా గుప్తా,రఘుబీర్ యాదవ్,చందన్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సిరీస్ 'సివరపల్లి' (Sivarapalli) అనే పేరుతో తెలుగులోకి రీమేక్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుండగా రాగ్ మయూర్ (Rag Mayur), బలగం (Balagam) ఫేమ్ మురళి గౌడ్ (Murali goud), రూపలక్ష్మి ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. భాస్కర్ మౌర్య (Bhaskar mourya) దర్శకత్వాన్ని వహించగా విజయ్ కోషే, శ్రేయాన్స్ పాండే లు నిర్మాతలుగా వ్యవహరించడం జరిగింది. శ్యామ్ అనే యువకుడు తెలంగాణలోని ఒక మారుమూలపల్లెలో ఉధ్యోగం చేయాల్సి వస్తుంది. నిజాయితీగా ఉద్యోగం చెయ్యాలనుకున్న శ్యామ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. తమిళ నాట ఇప్పటికే రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.   
  తెలంగాణ మహిళా కమిషన్ కి వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అలాగే హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. గతంలో నాగచైతన్య-శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. (Venu Swamy)   జ్యోతిష్యం పేరుతో ప్రముఖ వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, వేణు స్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామి కి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించగా, ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. (Naga Chaitanya)   హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణు స్వామికి  ఉమెన్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి.. ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరాడు. ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఉమెన్ కమిషన్ వేణు స్వామిని హెచ్చరించింది.  
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సంక్రాంతి కానుకగా,జనవరి 10 న 'గేమ్ చేంజర్'(Game Changer)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా,డ్యూయల్ రోల్ లో చరణ్ ప్రదర్శించిన నటనకి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ మూవీ తర్వాత చరణ్ 'ఉప్పెన'మూవీ ఫేమ్ బుచ్చిబాబు(Buchi babu)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.చిత్ర బృందం అధికారకంగా ప్రకటించపోయినా, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో మూవీపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ హైప్ నెలకొని ఉంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే మైసూర్ లో షూటింగ్ ని జరుపుకుంది.ఆ తర్వాత షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.పైగాచరణ్ గేమ్ చేంజెర్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు ఆ హడావిడి లేకపోవడంతో చరణ్ ఆర్ సి 16 షూట్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు.అందులో భాగంగా కొత్త షెడ్యూల్ జనవరి 27 న ప్రారంభం కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ షెడ్యూల్ నుంచి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో వీలైనంత త్వరగా,షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని కూడా మేకర్స్ భావిస్తునట్టుగా తెలుస్తుంది.దాదాపు జూలై నెల నాటికి మొత్తం షూట్ ని పూర్తి  చేసి,దసరా లేదా డిసెంబర్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారనే  రూమర్స్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.  ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్  ఏఆర్ రెహమాన్(Ar rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)రీసెంట్ గా పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన విషయం తెలిసిందే.ఆ మూవీ డిసెంబర్ 5 న విడుదల అయ్యింది.దీంతో సెంటిమెంట్ గా చరణ్ సినిమాని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తారేమో అనే టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. చరణ్ సరసన దేవర(Devara)ఫేమ్ జాన్వీ కపూర్(Janhvi kapoor)హీరోయిన్ గా చేస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)జగపతిబాబు(Jagapathibabu)కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.  
  కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోవు. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకొని.. ఐదు, పదేళ్లకు విడుదలైనా ప్రేక్షకులు వాటిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే నిర్మాతలు కూడా అలా విడుదలకు నోచుకోని సినిమాలపై ఆశలు వదులుకుంటారు. అయితే అలా అనుకోవడం తప్పని ఏకంగా 12 ఏళ్ళ తర్వాత విడుదలైన 'మద గజ రాజ' రుజువు చేసింది. (Madha Gaja Raja)   విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మద గజ రాజ'. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సంతానం కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్లకు అడ్డంకులన్నీ తొలిగిపోయి సంక్రాంతి కానుకగా ఈ జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. 12 ఏళ్ళ నాటి సినిమా కావడంతో 'మద గజ రాజ'పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం మంచి వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ, మరో రెండు మూడు రోజుల్లో రూ.50 కోట్ల క్లబ్ లో చేరనుంది. దీంతో ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి.   అయితే 'మద గజ రాజ' ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి తమిళ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు. విడుదలైన ఇతర సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందిన 'గేమ్ ఛేంజర్' కూడా నిరాశపరిచింది. ఈ క్రమంలో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన 'మద గజ రాజ' ఆడియన్స్  కి బెస్ట్ ఆప్షన్ గా మారింది. పదేళ్ల క్రితం ఇలాంటి ఎంటర్టైనర్స్ బాగా వచ్చేవి. కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. పైగా పొంగల్ సీజన్ కూడా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ 'మద గజ రాజ' వైపు మొగ్గు చూపారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ లో విశాల్ తీవ్ర అనారోగ్యంతో కనిపించాడు. ఇది కూడా ప్రేక్షకుల్లో కాస్త సింపతీని క్రియేట్ చేసి, సినిమా చూసేలా చేసింది. ఇంకో విశేషం ఏంటంటే, సంతానం హీరోగా బిజీ కాకముందు.. కమెడియన్ గా తన ప్రైమ్ టైంలో చేసిన ఇది. దాంతో వింటేజ్ సంతానం కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు సంతానం మళ్ళీ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారంటే.. వారు కామెడీ సినిమాల ఎంతలా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా పలు అంశాలు కలిసొచ్చి, 'మద గజ రాజ' బాక్సాఫీస్ దగ్గర సర్ ప్రైజింగ్ కలెక్షన్స్ రాబడుతోంది.   'మద గజ రాజ' ఇచ్చిన ధైర్యంతో ఇలా విడుదలకు నోచుకోకుండా ఉన్న ఇతర సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయంలో తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమైంది. దీంతో పలు సినిమాలు విడుదలకు నోచుకునే అవకాశముంది.  
ప్రపంచ సినీ పితామహుడిగా అభివర్ణించబడే ప్రఖ్యాత దర్శకుడు'జేమ్స్ కామెరూన్'(James cameron)గురించి ప్రపంచ సినీ ప్రియులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.తనకి మాత్రమే సాధ్యమయ్యే సృజనాత్మకతతో,ఎన్నో వండర్ సినిమాలని సృష్టించి,ప్రేక్షకుల మనస్సులో చిర స్థాయిగా నిలిచిపోయాడు.విజువల్ ఎఫెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్ పై  సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో జేమ్స్ కామెరూన్ మంచి దిట్ట.పైగా ఆ విజువల్స్ అన్ని కూడా కథతో ఇమిడి ఉండటం కూడా ఆయన స్టైల్.ది టెర్మినేటర్, ఎలియెన్స్,టెర్మినేటర్ 2 ,టైటానిక్,అవతార్,(Avathar)అవతార్ 2 వంటి పలు చిత్రాలే అందుకు ఉదాహరణ.ఇప్పుడు 'అవతార్ 3(avathar 3)ఫైర్ అండ్ యాష్' ని తెరకెక్కిస్తున్నాడు.మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1950 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనుండగాప్రస్తుతం ఆ మూవీ చిత్రకరణ దశలో ఉంది. రీసెంట్ గా కామెరూన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు అవతార్ పార్ట్ 1 ,పార్ట్ 2 కంటే  పార్ట్ 3 నిడివి ఎక్కువగా ఉండబోతుంది. రెండు పార్ట్ ల్లో చూడని విజువల్స్ ని  కూడా ప్రేక్షకులు పార్ట్ 3 లో చూస్తారు.దైర్యంతో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను.అలా దైర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రేక్షకుల డబ్బు,సమయాన్ని వృధా చేసినవాడినవుతాను.భిన్నమైన కథనం,విభిన్నమైన పాత్రలని అవతార్ 3 లో చూడబోతున్నారని చెప్పుకొచ్చాడు.అవతార మొదటి రెండు పార్ట్ ల్లో కామెరూన్ ఒక అద్భుతమైన లోకాన్ని సృష్టించిన నేపథ్యంలో  పార్ట్ 3 లో సృష్టించబోయే ప్రపంచం ఎలా ఉండబోతోందనే ఆసక్తి సినీ ప్రేమికుల్లో ఉంది. ఇప్పటికే రిలీజైన చిన్నపాటి టీజర్ అయితే యు ట్యూబ్ ని షేక్ చేస్తుంది.పార్ట్ 3 2025 డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుండగా,పార్ట్ 4 ,పార్ట్ 5 లు కూడా ఉన్నాయి. 2029 వ సంవత్సరంలో ఒకటి, 2031 డిసెంబర్ లో ఒకటి విడుదల కానున్నాయి.  
  సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునను టాలీవుడ్ కి నాలుగు పిల్లర్స్ గా చెప్పుకునేవారు. ఈ నలుగురు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. ఈ తరం స్టార్స్ తోనూ పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ లెక్కల పరంగా మిగతా ముగ్గురు సీనియర్ స్టార్స్ తో పోలిస్తే.. నాగార్జున ఎందుకనో వెనకబడిపోయాడనే చెప్పాలి. (Nagarjuna)   రాజకీయాల కోసం కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి, 'ఖైదీ నెం.150'తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా, అందులో నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. పైగా అందులో 'సైరా నరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలు రూ.200 కోట్ల మార్క్ ని కూడా అందుకున్నాయి. ఇలా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నారు చిరంజీవి. (Chiranjeevi)   ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చివరి నాలుగు చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. రీసెంట్ ఫిల్మ్ 'డాకు మహారాజ్' అయితే ఇప్పటికే రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, రూ.200 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. (Balakrishna)   చిరంజీవి, బాలకృష్ణకు ధీటుగా వెంకటేష్ కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే 'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాలతో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నారు. ఇక రీసెంట్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'తో రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైంది. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్ల జోరు చూస్తుంటే.. రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచినా ఆశ్చర్యంలేదు. (Venkatesh)   చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పోలిస్తే నాగార్జున బాక్సాఫీస్ రేస్ లో కాస్త వెనకబడిపోయాడు. నాగార్జున నటించిన 'ఊపిరి' సినిమా రూ.90 కోట్లకు పైగా గ్రాస్, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినప్పటికీ.. ఆయన రీసెంట్ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. బంగార్రాజు రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబడితే, నా సామి రంగ రూ.40 కోట్ల లోపు గ్రాస్ కి పరిమితమైంది. పైగా నాగార్జున సోలో హీరోగా సినిమాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం 'కుబేర', 'కూలీ' వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి నాగార్జున కూడా త్వరలోనే తాను హీరోగా నటించిన సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరతాడేమో చూడాలి.  
స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika mandanna)యానిమల్,పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.దీంతో ఆమె అప్ కమింగ్ సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.ఈ క్రమంలో రష్మిక ఫిబ్రవరి 14 న 'చావా'(Chhaava)అనే మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠా యోధుడు,ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji)కుమారుడు శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'చావా' లో టైటిల్ రోల్ లో విక్కీ కౌశల్ నటించగా,మహారాణి యేసు బాయ్ క్యారక్టర్ లో రష్మిక చేస్తుంది.ఈ మూవీ గురించి రష్మిక 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేస్తు 'ప్రతి గొప్పరాజు వెనుక,సాటిలేని శక్తిగల రాణి ఉంటుంది.మహారాణి యేసుబాయి స్వరాజ్య గర్వం అనే ట్వీట్ ని షేర్ చేసింది.మూవీలోని తన క్యారక్టర్ కి సంబంధించిన కొన్ని పిక్స్ ని కూడా షేర్ చెయ్యగా,ఒంటి నిండా చీరని కప్పుకొని,నిండుగా ఆభరణాలని ధరించిన ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.దీంతో 'చావా'లో రష్మిక నట విశ్వరూపాన్ని చూడబోతున్నామనే  కామెంట్స్ అభిమానుల వద్ద నుంచి వినిపిస్తున్నాయి.    మడాక్ ఫిలిమ్స్ పతాకంపై దినేష్ విజన్(Dinesh VIjan)130 కోట్ల భారీ వ్యయంతో 'చావా'ని నిర్మిస్తుండగా  లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar)దర్శకత్వం వహించాడు.అక్షయ్ ఖన్నా,అశుతోష్ రానా,దివ్య దుత్త,సంతోష్ జువేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషిని అధమ స్థితిలోకి నెట్టేసే దారుణమైన గుణం అహంకారం. అహంకారం గురించి కలిగిన నష్టాలను చరిత్రలో ఒకసారి పరికిస్తే.. మహాభారతంలో దుర్యోధనుడు స్వయంగా ఏమీ రాజ్యాన్ని సంపాదించుకోలేదు. కానీ కాలానుగుణంగా, వారసత్వంగా అధికారం సంప్రాప్తించింది. ఆ ఆధిపత్యం ఆయనలో అంతకు పదింతల అహంకారాన్ని తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ శకునుతో పాటు దుష్టులందరూ వచ్చి చేరారు. యువరాజుగా యౌవనంలో ఉన్న ఆయనకు గర్వం కళ్ళను నెత్తికెక్కించింది. ఇక నన్ను ఎదిరించేవారు ఎవరుంటారన్న అహంభావానికి మనస్సులో బీజం పడింది. అప్పటి వరకూ సోదరసమానులైన పాండవులతో అతను సఖ్యంగానే ఉన్నప్పటికీ ఆయనలోని అధికారమదం వారిపై విషభావనలను ఎగజిమ్మింది. ఫలితంగా పెద్దల మాటలను పెడచెవిని పెట్టాడు. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతుడు ప్రత్యర్థిగా ఉన్నాడని తెలుసుకోలేనంత గర్వాంధకారుడయ్యాడు. తన బలగం, బలం అతి స్వల్పమైనా, దానినే దుర్యోధనుడు అత్యధికమైందిగా భావించాడు. పాండవులను హేళన చేశాడు.  ఒక్క యాదవుడిని, అదీ యుద్ధం చేయకుండా సారథిగా రథం తోలుతానన్న వాడిని నమ్ముకొని కురుక్షేత్ర రణరంగంలోకి కాలుమోపుతున్నారని అవమానపరిచాడు. 'తాత్కాలిక సంపదలను, వైభవాలను చూసుకొని పొగరుతో ఎదుటివారిని చులకన చేసే వారి సంపదలు చెదిరిపోవటమే కాకుండా, వారికి పూర్వుల నుంచి సంక్రమించిన వారసత్వ వైభవాలు కూడా సమూలంగా నాశనమవుతాయి' అని విదురుడు లాంటివారు హితవు పలుకుతారు. అయినా దుర్యోధనుడు తలబిరుసుతో దాయాదులతో సమరానికే సిద్ధ పడ్డాడు. ఫలితంగా రణభూమిలో అసువులుబాసాడు. తాత్కాలికమైన పేరు ప్రతిష్ఠలనూ, ధన, పరివారాలనూ చూసుకొని విర్రవీగే అవివేకులను హెచ్చరిస్తూ కాలమహిమను అభివర్ణిస్తూ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు..... మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల స్సర్వమ్ ।  మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥ ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం వాటన్నింటినీ హరించివేస్తుంది. ఇదంతా మాయామయ మనీ, మిథ్య అనీ, అశాశ్వతమని గ్రహించి, జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందడమంటున్నారు. కాలవశాన సంప్రాప్తించినవి కాలంతోనే సమసిపోతాయని తెలుసుకోలేక, మనలో చాలామంది. అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.  నిజానికి ఈ ప్రపంచంలో మనం సాధించామనుకుంటున్నవన్నీ మధ్యలో వచ్చి, మధ్యలోనే వెళ్ళిపోతాయి. అందం కావచ్చు, అందలం కావచ్చు ఏదైనా శాశ్వతంగా మనతోనే ఉండిపోదు. అలాంటి తాత్కాలికమైన తళుకుబెళుకులను చూసుకొని అహంకరిస్తే, అంతకు మించిన అమాయకత్వం మరొకటి లేదు. మహా మహా సామ్రాజ్యాలే కాలగర్భంలో కలిసిపోయాయి. మగధీరులనిపించుకున్న మహారాజులే నేడు మౌనంగా సమాధుల్లో సేద తీరుతున్నారు. కాలమే మనందరితో భిన్నమైన పాత్రల్ని పోషింపజేస్తుందని తెలుసుకోలేక ఆయా స్థానాలతో విపరీతంగా తాదాత్మ్యం చెందుతున్నాం. వాటినే మన నిజ స్వరూపాలుగా నిర్వచించుకుంటున్నాం. తీరా అవి చేజారిపోయాక, విలపిస్తూ ఉన్నాం.   కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనం గలదే?... అంటాడు బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడితో! పూర్వం ఎందరో రాజులు ఉన్నారు! వారికి ఎన్నో రాజ్యాలూ ఉన్నాయి! వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదను మూటకట్టుకొని పోలేదు కదా! ప్రపంచంలో వారి పేరు కూడా మిగల్లేదు కదా! ఈ విషయం అర్థం చేసుకుంటే మనిషి జీవితం ఎంతో బాగుంటుంది.                                      *నిశ్శబ్ద.
భార్యాభర్తల మధ్య  బంధం దృఢంగా ఉండటానికి,  భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఫిజికల్ రిలేషన్,  ప్రేమను వ్యక్తం చేయడం, చనువుగా ఉండటం,  ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడం వంటివి ఎన్నో ఉంటాయి.  చాలామంది భార్యలు తమ మనసులో భర్త పట్ల తమకున్న ప్రేమను,  వారి పట్ల తమ ఇష్టాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తుంటారు. కానీ మగాళ్లు మాత్రం తమ మనసులో విషయాలు బయట పడకుండా కొందరు,  అసలు ఎలాంటి రొమాంటిక్ సెన్స్ లేకుండా ఎప్పుడూ గంభీరంగా ఉండటం,  తమ పనులలో తాము నిమగ్నం అయి ఉండటం వంటివి చేస్తుంటారు.  దీని కారణంగా భార్యలు చాలా డిజప్పాయింట్ అవుతుంటారు.  తమ వైవాహిక జీవితం ఆశించినంత రసభరితంగా లేదని వాపోతుంటారు.  అలాగని తమ భర్తలు చెడ్డ వారు ఏమీ కాదని చెబుతుంటారు.  ఇలాంటి భార్యలు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. వారి భర్తలు భార్యలను ప్రేమలో ముంచెత్తుతారు. తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఓపెన్ గా మాట్లాడాలి.. ప్రతి భార్య చాలా వరకు తను ఏమీ చెప్పకుండా, అడగకుండానే తన భర్త తన ముందు ప్రేమను వ్యక్తం చేయాలని,  తనను సంతోషపెట్టాలని అనుకుంటుంది. కానీ భర్త రొమాంటిక్ గా లేనప్పుడు భార్య ఓపెన్ గా మాట్లాడటం ముఖ్యం.  తను కోరుకుంటున్నది ఏంటి? జీవితంలో ఉండాల్సిన విషయాలేంటి? భార్యాభర్తలు ఎలా ఉండాలని తను అనుకుందో.. ఇద్దరికీ సాధ్యాసాధ్యమైన విషయాలు ఏంటో.. భర్త ఏ విషయాల పట్ల నిరాసక్తిగా ఉంటున్నాడో,   ఎందుకు నిరాసక్తిగా ఉంటున్నాడో.. మొదలైన విషయాలన్నీ ఫిర్యాదు చేస్తున్నట్టు కాకుండా, భర్తను నిందిస్తున్నట్టు కాకుండా..  సౌమ్యంగా తన మనసును అర్థం అయ్యేలా చెప్పాలి. ఇలా చేస్తే భర్త కూడా భార్య మనసును అర్థం చేసుకుని భార్య కోరుకున్నట్టు ఉండటానికి తన వంతు ప్రయత్నం చేయగలడు. సర్ఫ్రైజ్.. చిన్న చిన్న సర్ప్రైజ్ లు భార్యభర్తల మధ్య బంధాలను దృఢంగా ఉంచుతాయి. భర్త కోసం కూడా అదే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేయవచ్చు.  లేదంటే భర్తకు నచ్చిన ఆహారాన్ని వండి పెట్టవచ్చు. అతను చాలా రోజుల నుండి కొనాలనుకుని కొనలేకపోయిన  వస్తువును అతనికి ఇవ్వవచ్చు. ఇవన్నీ చేస్తే భార్య భర్త గురించి ఎంత ఆలోచిస్తోందో అనే విషయం భర్తకు అర్థమవుతుంది. అతను కూడా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి సమయం కేటాయించుకుంటాడు. ఆప్యాయత.. భార్యాభర్తలు రొమాంటిక్ గా ఉండాలంటే వారి మద్య ప్రేమ కూడా బలంగా ఉండాలి.  ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయత,  ఒకరి పట్ల ఒకరు చూపించే బాధ్యత వంటివి ఇద్దరినీ దగ్గర చేస్తాయి. అప్పుడప్పుడు భార్యభర్తలు ఒకరిపట్ల  ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలి.  ప్రేమికులలాగా చిలిపి పనులు చేయడం,  సమయాన్ని గడపడం,  ప్రేమను వ్యక్తం చేయడానికి తమకు తూచిన విషయాలను కవితాత్మకంగా వ్యక్తం చేయడం, చూపులు,  సైగలతోనే మాట్లాడటం వంటివి రొమాంటిక్ ఫీలింగ్ ను పెంచుతాయి. స్పేస్.. ఒక మనిషిని అతిగా పట్టించుకోవడం కూడా అవతలి వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.  భార్యాభర్తలు కూడా అంతే.  వారు ఇద్దరూ ఓ శాశ్వత బంధంలో ఉన్నా సరే.. ఇద్దరికి స్పేస్ అవసరమే.. భర్తకు ఉన్న స్నేహాలు, పరిచయాలలో అతను తనంతకు తాను భార్యకు పరిచయం చేసే వరకు భార్య పట్టించుకోకపోవడమే మంచిది. ప్రతి వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేయడానికి వివిధ మార్గాలు   ఉంటాయి.  వారు ఆ మర్గాన్ని ఎంచుకుని తమ ప్రేమను వ్యక్తం చేసేవరకు ఓపిక పట్టాలి తప్ప రొమాంటిక్ తెలియని వ్యక్తి అని అనకూడదు. ఈ కాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలే తమ మనసులో విషయాలను వ్యక్తం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు.  కాబట్టి అబ్బాయిలకు  సమయం ఇవ్వాలి.  బలవంతంగా అతను ఏదో చెయ్యాలని చేయడానికి బదులు, అతను సహజంగా భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేసేవరకు అతనితో ఫ్రెండ్లీగా ఉంటూ సాగాలి. అంగీకారం.. భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు ప్రేమను పెంచుకోవాలన్నా, దాన్ని వ్యక్తం చేయాలన్నా అంగీకార గుణం బాగా సహాయపడుతుంది.  భర్త అలవాట్లు, అతని ఇష్టాలు, అభిరుచులను భార్య గౌరవిస్తూ ఉంటే సహజంగానే భర్తకు తన భార్య పట్ల ఎనలేని ప్రేమ,  గౌరవం పెరుగుతాయి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడమే కాకుండా ఒకరికి నచ్చిన పనులు  ఇద్దరూ కలిసి చేస్తుంటే ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరుగుతుంది.  దాన్ని వ్యక్తం చేసే సందర్బాలు కూడా పెరుగుతాయి. గ్రహించడం ముఖ్యం.. ప్రేమ అంటే పెద్ద పెద్ద సర్ప్రైజ్ లు ఇవ్వడం,  పెద్ద బహుమతులు ఇవ్వడం, ఖరీదైన వస్తువులు ఇవ్వడం.  పనులు పదులుకుని మరీ సమయాన్ని కేటాయించడం కాదు.. భర్తలు తమకున్న సమయంలోనే భార్యలను సంతోషపెట్టాలని చూసేవారు ఉంటారు.  భార్యకు చిన్న పనులలో సహాయం చేయడం,  భార్య చెప్పే విషయాలను ఓపికగా వినడం, భార్య బాధలో ఉన్నప్పుడు ఆమెకు ఊరట ఇవ్వడం మొదలైనవన్నీ భార్య పట్ల ప్రేమతో చేసేవే. కొందరు సింపుల్ గా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు.  ఈవిషయాన్ని భార్యలు గుర్తిస్తే  భర్తకు తమ పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.                                                *రూపశ్రీ. 
  విశ్వదాభిరామ వినురవేమ..  ఈ వాక్యం దాటి ఏ విద్యార్థి ముందుకు వెళ్లడు.  పిల్లల నాల్కల మీద నాట్యం అడే తొలి పద్యాలు వేమన పద్యాలే.. ఎంతో సులువుగా ఉంటూ ఎంతో లోతైన విషయ సమాచారాన్ని తెలపడం వేమన పద్యాల విశిష్టత.  వేమన 1367-1478 కాలాల మధ్య జీవించాడు.  సి.పి బ్రౌన్ వేమన పద్యాలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం ద్వారా వేమన పద్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.  అంతేనా.. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను ఇంగ్లీషులోకి కూడా అనువదించాడు. పామరులకు అర్థమయ్యే భాషలు పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన. ఆటవెలది పద్యాలతో అందరిని మెప్పించిన వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. యోగి వేమన ఎంత ప్రాచీన కవినో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన కులం నుండి ఈయన జన్మ వృత్తాంతం, కవిగా మారిన వైనం అన్నీ ఇప్పటికీ  స్పష్టత లేకుండానే ఉన్నాయి. వేమన గురించి పరిశోధన చేసిన వారు ఒక్కొక్కరు ఒకో విధమైన విశ్లేషణ,  ఒకో విధమైన కథనం అందించారు. అయితే వీటిలో వేమన వేశ్యాలోలుడి నుండి కవిగా మారిన కథనే చాలా ఆదరణ పొందింది.  పైగా వేమన కవిగా మారిన విధానం,  వేమన పద్యాల మకుటం గురించి కూడా స్పష్టత ఇస్తుంది. వేమన కథ.. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అసలు పేరు అనువేమారెడ్డి. ఈయన చిన్నతమ్ముడే వేమన్న.  వేమన వదిన నరసాంబారాణి. వేమన ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేశ్య ఏది అది కాదనకుండా ఆమె ముందు ఉంచేవాడు.  ఒకరోజు వేశ్య తనకు రాణి అయిన నరసాంబారాణి ఆభరణాలు వేసుకుని సంతోషపడాలని ఉందని వేమనకు చెబుతుంది.  వేమన వేశ్య మాటను కాదనలేక తన వదినతో ఆభరణాలు అడుగుతాడు.  నరసాంబారాణి తన ముక్కుకు ఉన్న బులాకీ తప్ప మిగిలిన ఆభరణాలు అన్నీ వేమనకు ఇచ్చి పంపుతుంది. కానీ వేశ్య మాత్రం తనకు బులాకీ కూడా కావాల్సిందే అని పట్టుబడుతుంది. దీంతో వేమన బులాకీ కూడా అడుగుతాడు.  అయితే నరసాంబారాణి తన బులాకీని ఇస్తూ నేను ఇచ్చిన ఆభరణాలు అన్నీ వేసుకుని నగ్నం ఉన్నప్పుడే నువ్వు ఆమెను చూడు అని చెప్పి పంపుతుంది.   వేమన వేశ్యను అలాగే చూడగా అతనికి స్త్రీలు అంటే విరక్తి పుట్టింది.  వెంటనే కోటకు వెళ్లిపోయాడు. నరసాంబారాణి నగలను తయారుచేసే అభిరాముడు ఎప్పుడూ కోటకు ఆలస్యంగా వచ్చేవాడు. ఇది గమనించిన వేమన అతను ఎందుకు కోటకు వస్తున్నాడో తెలుసుకోవాలని అభిరాముడిని కంట కనిపెట్టాడు.  అభిరాముడు దగ్గరలో ఒక కొండ గుహలో ఉన్న అంబికాశివయోగిని సేవించడం వేమన్న చూశాడు.  అంబికాశివయోగి అబిరాముడితో రేపు రా నీకు మంత్రోపదేశం చేస్తాను అంటాడు.  అయితే వేమన్న అంబికాశివయోగిని బంధించి అబిరాముడిలాగా కొండ గుహకు వెళతారు.  యోగి వేమన్న చెవిలో మంత్రోపదేశం చేసి నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. దీంతో వేమన్నకు పాండిత్యం లభిస్తుంది.  అబిరాముడికి దక్కాల్సినది తనకు దక్కినందుకు వేమన పశ్చాత్తాప పడి అబిరాముడి కాళ్ల మీద పడి.. తను రాసే పద్యాల మకుటంలో అభిరాముడి పేరు చేర్చి అభిరాముడి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాడు. ఇదీ వేమన వెనుక ఉన్న కథ. యోగి వేమన గురించి తెలుగు సాహిత్యం చాలా గొప్పగా చెప్తుంది.  తెలుగు కవులు, రచయితలు వేమన పద్యాల లోతును, పద్యాల విశిష్టతను తమ పరిశోధనలు,   విశ్లేషణల ద్వారా తెలిపారు.  వేమన గురించి,  వేమన పద్యాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు కూడా వెలువడ్డాయి. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నార్ల వెంకటేశ్వరరావు  వేమన జీవిత చరిత్రను రాయగా అది 14 భాషలలోకి అనువాదం అయ్యింది.  ఐక్యరాజ్యసమితి -యునెస్కో విభాగం వారు ప్రపంచ భాష కవులలో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను కూడా ఎన్నుకుని ఆయన పద్యాలను వివిధ భాషలలోకి అనువదించారు.                                             *రూపశ్రీ.
  వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి.  వేసవిలో చల్లగా ఏమైనా తాగాలని అనుకుంటాం. అదే చలికాలం వచ్చే సరికి ఆహారపు అలవాట్ల ఎంపిక నుండి ఆహారం ఉండే స్థితి వరకు అన్నీ మారతాయి.  ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు,  ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందినదే కుంకుమ పువ్వు పాలు.  చలికాలంలో చాలామంది కుంకుమ పువ్వు జోడించిన పాలు తాగాలని అనుకుంటారు.  కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిపిట్స్ ఏంటంటే.. కుంకుమ పువ్వు ఖరీదైన మసాలా దినుసు.  అయినా సరే కొన్ని సందర్భాలలో కుంకుమ పువ్వును తప్పక వాడతారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సెరోటోనిన్ హార్మోన్ పాత్ర చాలా ముఖ్యం.  కుంకుమ పువ్వు సెరోటోనిన్ హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది.  అందుకే కుంకుమ పువ్వు పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుంది.  గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగాలనే నిబంధన పెట్టినది కూడా వారిలో గర్భధారణ కారణంగా ఏర్పడే ఒత్తిడి నియంత్రణలో ఉండాలనే. కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగేటప్పుడు చాలా కొద్ది పరిమాణమే ఉపయోగిస్తారు.  కేవలం కొన్ని కుంకుమ పువ్వు రేకలను ఉపయోగిస్తారు.  కానీ ఇది చాలా శక్తివంతమైనది.  ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది.  అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. రోజూ కుంకుమపువ్వు పాలు తాగుతుంటే వయసు పెరిగినా అందం తగ్గదు. కుంకుమ పువ్వులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలలో కూడా కాల్షియం ఉంటుంది.  ఇది ఎముకలను బలపరుస్తుంది.  బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే కుంకుమ పువ్వులో కంటికి మేలు చేసే విటమిన్-ఎ కూడా ఉంటుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో కూడా  కుంకుమ పువ్వు పాలు సహాయపడతాయి. కుంకుమ పువ్వు పాలు నిద్ర బాగా పట్టడంలో సహాయపడతాయి.  చలికాలంలో ప్రతిరోజూ కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల  పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్నీ చేకూరతాయి.                                              *రూపశ్రీ.  
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ.
    శనగలు భారతీయులు ఆహారంలో బాగా ఉపయోగించే పప్పు ధాన్యం.  బస్సు ప్రయాణాలలో,  పార్కుల దగ్గర, సినిమా సెంటర్ల దగ్గర, స్కూళ్ల దగ్గర వేయించిన శనగలు తింటూ ఎంజాయ్ చేసేవారు బోలెడు మంది ఉంటారు. ఈ వేయించిన శనగలు పది, ఇరవై ఏళ్ల కిందట మంచి టైం పాస్ చిరుతిండి. ఇప్పుడు అవే శనగలు పోషకాహార జాబితాలో ఉంది. కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం చాలా బావుంటుందని అంటున్నారు.  ఇంతకీ ఈ కాల్చిన శనగలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే.. పోషకాలు.. వేయించిన శనగలలో ప్రోటీన్,  ఫైబర్,  కాల్షియం,  మెగ్నీషియం,  ఫాస్పరస్,  ఐరన్,  కార్బోహైడ్రేట్లు, ఫోలేట్,  యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి.  చలికాలంలో వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. శనగలను సాధారణ కాలంలోనే కాకుండా చలికాలంలో కూడా నిక్షేపంగా తినవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే   వేయించిన శనగలను తీసుకవడం మంచిది.  శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేయించిన శనగలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉంటే రోగనిరోధ శక్తి కూడా బలపడుతుంది. శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం.  సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకుంటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని తినవచ్చు.  వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయి. వేయించిన శనగలు తింటే శక్తి లభించడం,  రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారడం మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు చాలా మంచిది.   వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బరువు  తగ్గాలని అనుకునే వారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ.  పైగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.   చలికాలంలో జీర్ణసమస్యలు వస్తుంటాయి.  ఇలాంటి సమయంలో  ఆహారం జీర్ణం కాకపోవడం,  మలబద్దకం,  గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి.  వీటికి చెక్ పెట్టాలంటే వేయించిన శనగలు చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.