రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు. సరే సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితమైతేనేం, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసమైతేనేం తెలంగాణ సాకారమైంది. ఇది జరిగి పదేళ్లు దాటింది.  తెలంగాణ సాకారమైన సమయంలో కేసీఆర్ సకుటుంబ  సపరివార సమేతంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపి మరీ వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా అన్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావం తరువాత వరుసగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేటీఆర్.. ఆ సమయంలో  కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సహయంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని మన్మోహన్: నేతృత్వంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్న కేసీఆర్ మన్మోహన్ అంత్యక్రియలకు మాత్రం హాజరు కాలేదు. తనకు బదులుగా తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందాన్ని పంపారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ స్వయంగా హాజరై ఉండాల్సిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అయితే కేసీఆర్ సీతయ్య లాంటి వారు. ఎవరి మాటా వినరు. తనకు ఏది తోస్తే అదే చేస్తారు. గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అలాగని పూర్తిగా రాజకీయ సన్యాసం చేయలేదు. తాను కలవాలనుకున్నప్పుడల్లా పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు  కేసీఆర్ గైర్హాజర్ కావడం ఏ మాత్రం హుందాగా లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. పరాజయంతో ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. మన్మోహన్ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి హోదాలో  ఉన్న రేవంత్ ను ఫేస్ చేయడానికి ఇష్టపడకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే తాను సీఎంగా ఉండగా ప్రొటోకాల్ ను సైతం ధిక్కరించి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పరిశీలకులు ఇప్పుడు మోడీకి ఎదురుపడి అవమానపడటం కంటే దూరంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చిందని అంటున్నారు.  
మాజీ ఐఏఎస్ అధికారి  ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  తొలి నుంచీ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఇంతియాజ్ అహ్మద్   వైసీపీ హయాంలో   కీలక జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇంతియాజ్ అహ్మద్ కు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చే వారు. అటువంటి ఇంతియాజ్ అహ్మద్ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని ఉందన్న ఆసక్తి కనబరచగానే జగన్ ఓకే అనేశారు. అంతే ఆఘమేఘాల మీద  వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ గూటికి చేరిపోయారు. కర్నూలు, లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు జగన్ ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కర్నూలు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోవడం, అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో జగన్ ఇంతియాజ్ అహ్మద్ ను పట్టించుకోవడం మానేశారు.  దాంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.  పార్థీవ దేహానికి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. డిల్లీ నుంచి రేవంత్ రెడ్డి హైద్రాబాద్ కు తిరుగుపయనమయ్యారు. 
ALSO ON TELUGUONE N E W S
  మూవీ : మురా నటీనటులు:  హృదు హరన్, జోబిన్ దాస్, యదుకృష్ణ, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి తదితరులు ఎడిటింగ్: చమన్ చాకో సినిమాటోగ్రఫీ: ఫాజిల్ నజర్ మ్యాజిక్: క్రిస్టీ జోబీ నిర్మాతలు: రియా శిబు దర్శకత్వం:  మహమ్మద్ ముస్తాఫా ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ కథ:  కేరళలోని ఓ ప్రాంతంలో నలుగురు కుర్రాళ్ళుంటారు. వాళ్ళు మంచి స్నేహితులు. వాళ్ళే ఆనంద్ (హృదు హరున్) షాజీ (జోబిన్ దాస్) మను (యదుకృష్ణ) మనఫ్ (అనుజీత్). ఈ నలుగురిలో ఆనంద్ మాత్రమే మిడిల్ క్లాస్ కుర్రాడు. మిగతా వాళ్లంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఖర్చుల కోసం లోకల్ రౌడీలతో ఈ నలుగురు కలుస్తారు. లోకల్ రౌడీ లీడర్ వాళ్లను 'అనీ' (సూరజ్ వెంజరమూడు)కు పరిచయం చేస్తాడు. గ్యాంగ్ స్టర్ రమాదేవి (మాలా పార్వతి) దగ్గర ప్రధానమైన అనుచరుడిగా అతను పనిచేస్తుంటాడు. ఈ నలుగురు కుర్రాళ్లకు భయమనేది తెలియదనీ, అప్పగించిన పనిని ధైర్యంగా పూర్తి చేస్తారనే విషయాన్ని అనీ గమనిస్తాడు. తమ గ్రూప్ లో అలాంటి కుర్రాళ్లు ఉండాలని భావించి, వాళ్లకు అడ్వాన్స్ ఇస్తాడు. ఇక అప్పటి నుంచి నలుగురు కుర్రాళ్లు చెలరేగిపోతారు. అదే సమయంలో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటుంది. మధురై ప్రాంతంలో దాచబడిన ఆ బ్లాక్ మనీని తీసుకొచ్చే బాధ్యతను ఆ నలుగురు కుర్రాళ్లకు అప్పగించాలని అనీ అనుకుంటాడు. వాళ్లపై తనకి పూర్తి నమ్మకం ఉందని రమాదేవిని ఒప్పిస్తాడు. ఈ నలుగురు కుర్రాళ్లు, మధురైకి చెందిన లోకల్ కుర్రాళ్లను ఇద్దరినీ వెంటబెట్టుకుని, బ్లాక్ మనీ దాచిన ప్రదేశానికి చేరుకుంటారు. ఆ నలుగురు దొంగతనం చేశారా? అసలు అక్కడ ఏం జరిగిందనేది మిగతా కథ. విశ్లేషణ: మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ జీవనశైలి గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఎందులోనైనా స్టోరీ వారికి సపోర్ట్ ఇస్తూ క్లైమాక్స్ లో సక్సెస్ అయితే చాలు అది హిట్ సినిమా.‌ మరి ఈ సినిమా అలా సక్సెస్ అయ్యిందా అంటే అయ్యిందనే చెప్పాలి. నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కలలకి సపోర్ట్ ఇచ్చే సరైన వ్యక్తి రావడంతో కథ ఎంగేజింగ్ గా సాగుతుంది. దర్శకుడు ఈ నలుగురు స్నేహితుల పాత్రలను చక్కగా డిజైన్ చేశాడు. ఈ నలుగురు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం .. స్నేహానికి కట్టుబడి ఉండటం బాగుంటుంది. నలుగురి పాత్రల్లో ఆడియన్స్ తమని తాము చూసుకుంటారు. ఒకానొక సమయంలో వాళ్లతో కలిసి ఎమోషనల్ గా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ఇంట్లోవాళ్లు చదువుకోమన్నా .. ఏదైనా పని చూసుకుకోమన్నా పెద్దగా పట్టించుకోరు. కుటుంబ బరువు బాధ్యతలు ఎంతమాత్రం పట్టనివారే. సరదాగా కబుర్లు  చెప్పుకుంటూ కులాసాగా బైక్ లపై తిరిగేస్తూ ఉంటారు. కుర్రాళ్లు గ్యాంగ్ స్టర్ కోసం పనిచేయడం ఫస్టు పార్టుగా .. గ్యాంగ్ స్టర్ తోనే తలపడటం ద్వితీయార్థంలో మలుపు తిరుగుతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు నేచురల్ గా ఉంటాయి. మొదటి అరగంట క్యారెక్టర్ల పరిచయానికి కాస్త టైమ్ తీసుకుంటాడు. కానీ అది తర్వాత వచ్చే సీన్లకి బలాన్ని ఇస్తూ ఆ నలుగురికి క్యారెక్టర్ల ఇంపాక్ట్  కనపడుతుంది. సెకంఢాఫ్ లో చివరి ఇరవై నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. యాక్షన్, ఎమోషన్ సీన్లు కనెక్ట్ అవుతాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఏదీ అనిపించదు. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. గ్యాంగ్, హత్యలు అంటు కాస్త రక్తపాతం ఉంటుంది. అది వదిలేస్తే మిగతాదంతా ఓకే. క్రిస్టీ జోబీ సంగీతం బాగుంది. ఫాజిల్ నజర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. చమన్ చాకో ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: ఆనంద్ పాత్రలో హృదు హరన్, షాజీగా జోబిన్ దాస్, మనుగా యదుకృష్ణ, మనఫ్ గా అనుజీత్ ఒదిగిపోయారు. అనీగా సూరజ్ వెంజరమూడు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. రమాదేవీగా మాలా పార్వతీ ఆకట్టుకున్నారు. మిగతావారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా : సంతృప్తినిచ్చే రివేంజ్ డ్రామా. సెకెంఢాఫ్ కోసం ఓసారి చూసేయొచ్చు. రేటింగ్: 2.5/ 5 ✍️. దాసరి  మల్లేశ్
అనన్య నాగళ్ళ అచ్చ తెలుగింటి అమ్మాయి.. అలాంటి అనన్య తెలుగు సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది అలాంటి అమ్మాయి ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూలో చెప్పింది. "నేను బాలీవుడ్ లో ఒక మూవీ చేయబోతున్నా. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళబోతున్నా. అదొక పీరియాడిక్ డ్రామా అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు. ఒక ట్రైబల్ గర్ల్ గా చేయబోతున్నా. ఆ ట్రైబల్ విలేజ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల నుంచి తన ట్రైబల్ పీపుల్ ని ఎలా కాపాడుకుంది ఆ అమ్మాయి అన్నదే స్టోరీ. ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది అన్నదే కథ. చాలా మంచి స్టోరీ అది. ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే లైన్ అది. మంచి స్క్రిప్ట్, మంచి ఫైట్స్, డాన్స్ లు కూడా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. మేబి వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందేమో. ఈ ప్రాజెక్ట్ కోసం కొంచెం కొంచెంగా ఫైటింగ్స్ కూడా నేర్చుకున్నా." అని చెప్పింది అనన్య నాగళ్ళ. ఇక  ఆరియానా ఐతే "అనన్య ముంబై ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పు నేను కూడా వచ్చి చేస్తాను అని చెప్పింది. తప్పకుండా  మనిద్దరం కలిసి హిందీలో ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం" అని చెప్పింది అనన్య. ఇక అనన్య నాగళ్ళ  "మ‌ల్లేశం' మూవీతో  తెలుగు ఆడియన్స్ కి  ప‌రిచ‌యం అయిన తెలుగమ్మాయి. 'మ‌ల్లేశం'లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్క‌డ నుంచి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీ 'వ‌కీల్ సాబ్'లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక ఈ మ‌ధ్యే 'తంత్ర' పేరుతో అంద‌రినీ భ‌య‌పెట్టింది. ఇక 'పొట్టేల్' లో నటించింది .  
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ 'గేమ్ చేంజర్'(game changer).సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పుడిప్పుడే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.లక్నో వేదికగా టీజర్ రిలీజ్ అవ్వక ముందు ఎవరిలో కూడా 'గేమ్ చేంజర్' పై  పెద్దగా అంచనాలు లేవు.మూవీ ఎప్పట్నుంచో షూటింగ్ ని జరుపుకోవడం,దర్శకుడు శంకర్ 'గేమ్ చేంజర్' ని పక్కన పెట్టి భారతీయుడు 2 కి వెళ్లడం,పైగా ఆ మూవీ భారీ డిజాస్టర్ ని అందుకోవడం వంటి కారణాలతో గేమ్ చేంజర్ పై ఎవరకి కూడా అంచనాలు లేవు.కానీ ఇప్పుడు అలా కాదు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అంతా ఎప్పుడెప్పుడు 'గేమ్ చేంజర్' థియేటర్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్ గా గేమ్ చేంజర్ కి సంబంధించిన రివ్యూ ఇదే,సినిమాఇలా ఉంటుంది,అలా ఉంటుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అవుట్ ఫుట్ కూడా మాములుగా రాలేదని,ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కాలేజీ సీన్స్ అదిరిపోయాయని,ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ పీక్ లో ఉందని,సెకండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు,వాటిల్లోని రామ్ చరణ్ నటన నభూతో నభవిష్యత్తు అని అంటున్నారు.ఇక  తమిళనాట శంకర్(shankar)సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.దీంతో  తమిళ సోషల్ మీడియాలోను 'గేమ్ చేంజర్' ద్వారా పాత శంకర్ ని చూడబోతున్నామని, మూవీ ఒక రేంజ్ లో ఉందనే రివ్యూలు హల్ చల్ చేస్తున్నాయి  పుష్ప 2(pushpa 2)తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులని నెలకొల్పన సుకుమార్(sukumar)కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతు చిరంజీవి(chiranjeevi)గారితో కలిసి గేమ్ చేంజర్ ని చూసాను,మూవీ ఒక రేంజ్ లో ఉంది.చరణ్ నటనకి నేషనల్ అవార్డు రావడం ఖాయమని చెప్పుకొచ్చాడు.దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న గేమ్ చేంజర్ రివ్యూ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చరణ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ ని దిల్ రాజు నిర్మించగా కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.  
‘బలగం’ మూవీని ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ లేరు. ఐతే ఇప్పుడు ఆడియన్స్ అంతా  వేణు అప్‌కమింగ్ మూవీ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బలగం  మూవీ విడుదలయ్యి ఏడాది దాటిపోయింది. ఎన్నో గ్రామాల్లో ప్రజలు  ‘బలగం’ మూవీని  చూసి ఆదరించారు. దిల్ రాజు నిర్మాణం వల్ల ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు తన సెకండ్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. " నాకు మట్టి కథలంటేనే ఇష్టం. బలగం తర్వాత మంచి మూవీ చేయాలని అనుకుంటున్నా. ఆడియన్స్ కి మంచి మూవీ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. జబర్దస్త్ లో నాకు మంచి లైఫ్ ఉంది. అంత బిజీగా ఉండేవాడిని. అప్పట్లో జబర్దస్త్ లో ఫస్ట్ టీమ్ మాదే. మాకు అప్పట్లో అద్భుతమైన రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. కూరగాయలు వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించా. ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్స్ లేనప్పుడు డబ్బులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు  ఊళ్లోకి వెళ్లి ఒక పది రోజులు వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుని వచ్చేవాడిని. వాటినే ఖర్చుపెట్టుకునేవాడిని. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ కూడా చేసాను. షావలిన్ కుంఫులో  బ్రౌన్  బెల్ట్ హోల్డర్ ని కూడా. 1996 లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్ షిప్ ని కూడా అందుకున్నా. హనుమంతుడి భక్తుడిని నేను.  ‘బలగం’ తరువాతి సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ అని అనుకుంటున్నాం.  బలగం సినిమా హిట్ మాత్రమే కాకుండా చాలామంది దగ్గర నుండి ప్రేమ, గౌరవం ఇచ్చింది అందుకు నేను అదృష్టవం చేసుకున్న. సెకండ్  మూవీ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. ప్రేక్షకులు అందరికీ ఇది నచ్చుతుంది. ఇందులో కల్చర్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది." అని చెప్పుకొచ్చాడు వేణు.  
Marco starring Unni Mukundan, who played antagonist role in NTR's Janatha Garage, in a lead role, has become a huge blockbuster in Malayalam. The bloody action entertainer with its immaculate action sequences became a rage in Kerala, upon release.  Now, the movie is releasing in Telugu on 1st January 2025, during New Years' Eve. The movie team released a thrilling and riveting action trailer that increases our curiosity and anticipation. Interestingly, KGF and Salaar fame Ravi Basrur gave music for the film.  Yukti Thareja is playing leading lady role and popular actor Kabir Duhan Singh is playing another prominent role. The movie poster released with Unni Mukundan's face covered in blood is also raising expectations over the film.  With action sequences as the main highlight, the movie is gearing up to give a thrilling action experience to everyone upon release. Haneef Adeni wrote and directed the film and Shareef Muhammad produced with a high budget. NVR films is releasing it in Telugu. 
సంక్రాంతి హీరోగా అభిమానుల చేత,ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకునే హీరోల్లో,నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ(balakrishna)ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.ఆయన నటించిన చాలా చిత్రాలు సంక్రాంతికి రిలీజయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాయి.ఆ కోవలోనే ఇప్పుడు  సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న'డాకు మహారాజ్' కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులతో పాటుప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.ప్రచార చిత్రాలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ  మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచబోతున్నారు.జనవరి 2 న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్,4 న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఒక సాంగ్ ని  రిలీజ్ చెయ్యబోతున్నారు.ఆ తర్వాత 8 న ఏపిలోని విజయవాడ లేదా మంగళగిరి లో మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరపనున్నారు. ఈ విషయాలన్నింటిని డాకు మహారాజ్(daku maharaj)ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నాగవంశీ(naga vamsi)నే స్వయంగా వెల్లడి చేసాడు.రీసెంట్ గా మూవీకి సంబంధించిన మరో విషయాన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఇరవై నిమిషాల ముందు ఒక క్రేజీ ఎపిసోడ్ ఉంటుంది.ఇది అభిమానులకి,మాస్ ఆడియెన్స్ కి ఒక రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ లా ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.డెఫినెట్ గా ఆడియెన్స్ థ్రిల్ అవుతారని చెప్పాడు.ఇప్పుడు నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలతో 'డాకు మహారాజ్' ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులతో ప్రేక్షకులు రిగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్(pragya jaiswal)హీరోయిన్ గా చేస్తుండగా ఊర్వశి రౌతేలా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. హిందీ అగ్ర హీరో,ఇటీవల యానిమల్ మూవీలో విలన్ గా చేసి మెప్పించిన 'బాబీ డియోల్'(bobby deol)విలన్ గా చేస్తున్నాడు.బాబీ(bobby)దర్శకుడు కాగా సితార ఎంటర్ టైన్మెంట్ బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. తమన్(taman)సంగీత దర్శకుడు.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ మూవీకి శంకర్(shankar)దర్శకుడు.దీంతో గేమ్ చేంజర్ పై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.పైగా తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.  రీసెంట్ గా చరణ్ అభిమాని 'రిప్ లెటర్' అనే టైటిల్ ని హెడ్డింగ్ గా పెట్టి  గేమ్ చేంజర్ టీం కి ఒక లెటర్ రాయడం జరిగింది.'గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి నేను అనగా ఈశ్వర్ చరణ్ అన్న ఫ్యాన్ చింతిస్తూ రాయునది ఏమనగా,సినిమాకి ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.మరి మీరు ఇంకా ఎలాంటి ట్రైలర్ అప్ డేట్ ఇవ్వలేదు.కనీసం అభిమానుల ఎమోషన్స్ ని కూడా పట్టించుకోవటంలేదు.ఈ నెలాఖరుకల్లా,ట్రైలర్ అప్ డేట్ ఇవ్వకపోతే,న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చెయ్యకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానని తెలియచేస్తున్నాని రాసుకొచ్చాడు.ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.మరి ఈ విషయంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil raju)గాని,రామ్ చరణ్ గాని ఎలా స్పందిస్తారో చూడాలి.   ఇక గేమ్ చేంజర్ లో కియారా అద్వానీ(Kiara Advan)హీరోయిన్ గా చేస్తుండగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.  
నాచురల్ స్టార్ నాని(nani)హీరోగా ఆర్ఆర్ఆర్(rrr)ప్రొడ్యూసర్ దానయ్య(danayya)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన మూవీ 'సరిపోదా శనివారం'(Saripodhaa Sanivaaram)అగస్ట్ 29 న రిలీజైన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ(vivek athreya)దర్శకుడు కాగా ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ గా చేసింది.వర్షాలని సైతం లెక్కచేయకుండా నాని అభిమానులు,ప్రేక్షకులు ఈ చిత్రానికి ఘన విజయాన్ని సాధించి పెట్టారు.నాని కెరీరి లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ ని కూడ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ హిందీలోకి రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(kartik aaryan)హీరోగా చెయ్యబోతున్నాడని,దీని మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇదే నిజమైతే కనుక కార్తీక్ ఆర్యన్ కెరీర్ లో ఇంకో హిట్ చేరినట్టే అనుకోవచ్చు ఎందుకంటే సరిపోదా శనివారం నూటికి నూరుపాళ్లు పర్ఫెక్ట్ యాక్షన్ సబ్జెక్టు.హిందీ ప్రేక్షకులు ఆ తరహా సబ్జెట్స్ ని ఎంతగానో ఇష్టపడతారు.మోస్ట్లీహిందీలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో కూడా యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటూ లవ్,కామెడీ,సెంటిమెంట్ దానికి అటాచ్మెంట్ గా ఉంటాయి.కాబట్టి హిందీ ప్రేక్షకులకి 'సరిపోదా శనివారం' నచ్చడం పక్కా అని భావించవచ్చు. మరి పోలీస్ ఆఫీసర్ గా విజృంభించి నటించిన ఎస్ జె సూర్య(sj surya)క్యారక్టర్ లో ఆయనే చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారో  తెలియాలి.అలాగే దానయ్య నే హిందీ లో కూడా నిర్మిస్తాడా,లేక వేరే వాళ్లా అనేది కూడా తెలియాల్సి ఉంది.కొన్ని రోజుల ఆగితే గాని మూవీకి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ గా 'చందు ఛాంపియన్' ,'భూల్ భూలయ్య 3 ' తో వరుస హిట్ లని అందుకొని ఎంటైర్ తన సినీ కెరీర్లోనే మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాడు.  
Salman Khan is one of the biggest stars of Indian Cinema. He celebrated his 59th birthday in the presence of his close friends and associates on 27th December. He looked happy in their presence and he seems to be busy with shooting of his upcoming film, Sikandar.  Over three decades, he built a huge star image with Hindi audiences calling him Bhai Jaan. He enjoyed a huge high in his career at the dawn of 2010's but then his much hyped Tubelight, proved to be an end to his illustrious run at the box office.    Ever since, he has been struggling to find the same level of success at the box office. Now, he is coming up with Sikandar in the direction of A.R. Murugadoss and he is hoping it would be his big comeback like Shah Rukh Khan's in 2023 with Pathaan and Jawan. Sikandar teaser has been postponed to Saturday from Friday.    As a mark of respect to ex-PM Manmohan Singh, who passed away on 26th December, the team took this decision to postpone the release of Sikandar teaser. The actor has decided to keep his birthday, low profile this year, from the pics. 
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(puri jagannadh)ప్రస్తుతం వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్,రామ్ పోతినేని తో చేసిన డబుల్ ఇస్మార్ట్ పై పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాకూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.ప్రస్తుతానికైతే తన అప్ కమింగ్ మూవీ మీద ఎలాంటి అప్ డేట్ ఇంకా రాలేదు. ఇక పూరి ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో 'పూరి మ్యూజింగ్స్' ద్వారా రకరకాల అంశాల గురించి  తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటాడు.రీసెంట్ గా 'జాకెంట్' అనే అంశం మీద ఆయన మాట్లాడుతు యుద్ధ  సమయాలతో పాటు రక రకాల ఇబ్బందులు వల్ల చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో,భార్య బిడ్డల్ని తీసుకొని వేరే ప్రాంతాలకి వలస వెళ్తుంటారు. వీరు ఏ దేశమైతే వెళ్తారో అక్కడ ఇల్లు అనేది ఉండదు.నైజీరియా,ఇరాక్,సుడాన్,ఇండియా,చైనా,కాలిఫోర్నియా, న్యూయార్క్,ఇరాక్, ఫ్లోరిడా వంటి దేశాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.ప్రపంచంలో ఐదు శాతం జనాభాకి ఇల్లు కూడా లేదు.ఇండియాలో అయితే నాలుగు కోట్ల మంది అడుక్కు తినే వాళ్ళు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లంతా వర్షం వస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి.ఇలా వసతి సోకార్యం లేకుండా వడ దెబ్బతో పాటు తీవ్రమైన చలికి చాలా మంది చనిపోతున్నారు.   అలాంటి వారందరి కోసం 'ఏంజెలా లూనా' అనే ఒక మహిళాడిజైనర్ ఒక అద్భుతమైన డిజైన్ ని సృష్టించింది.దాని పేరు 'జాకెంట్'.జాకెట్,టెంట్ ని కలిపి చేసిన డిజైన్ అది.దీన్ని జాకెట్ ల వేసుకోవడంతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టెంట్ లా వాడుకొని అందులో పడుకోవచ్చు.పైగా ఈ జాకెంట్ ఎంతో మంది సిరియా శరణార్థులని కాపాడింది.ఇప్ప్పుడు ఆ  'జాకెంట్'.ఇండియాకి వస్తే మనం  ఏదైనా కాంప్ కి వెళ్ళినప్పుడు వాడుకోవడంతో పాటుగా అడుక్కునే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు.ఏదైనా కంపెనీ దీనిని ఇండియాకి పరిచయం చేస్తే బాగుండు.ఎంతో మంది ప్రాణాలని కాపాడిన వాళ్లవుతారని చెప్పుకొచ్చాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  దేశం నాకేమిచ్చిందని కాదు.. దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలనేది పెద్దలు చెప్పిన మాట.   మన భారతదేశంలో  పుట్టిన మహా పురుషుడు  శ్రీ రతన్ టాటా..  ఈ మాటను నిజం చేశారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక బిజినెస్ మెన్ ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించినా సరే జనం అతన్ని ఒక బిజినెస్ మేన్ లాగానే గుర్తించుకుంటారు. కానీ టాటా గారిని అందరూ ఒక గొప్ప బిజినెస్ మెన్లా  కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా  గుర్తుపెట్టుకుంటారు. టాటా అనేది ఇంటి పేరు అయినప్పటికీ ఆ పేరు కుటుంబంలో అందరికీ ఉన్నప్పటికీ,  టాటా అనగానే ఈ తరానికి గుర్తొచ్చేది  రతన్ టాటా గారి  నవ్వు మొహమే. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ గా  ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఆయన  భారత వ్యాపార రంగాన్ని పునః రూపొందించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నైతికత, దానగుణం కలిగిన వ్యక్తిగా  అందరి మనసులూ గెలుచుకున్నారాయన. డిసెంబర్ 28 ఆయన జన్మదిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంట..  రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బాంబేలో(నేటి ముంబై) జన్మించారు. ఆయనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవటంతో  వాళ్ళ బామ్మ, తాతయ్యలు దత్తత తీసుకుని పెంచారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీ నుంచి  ఆర్కిటెక్చర్ అండ్ కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో హయ్యర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. టాటా సంస్థకు వారసుడు అయినా  1962లో టాటా గ్రూపులో ఒక సాధారణ ఉద్యోగిగా  ప్రయాణాన్ని  ప్రారంభించారు. తన ప్రతిభతోనే 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించబడ్డారు. టాటా సంస్థకు చైర్మన్ అయ్యాక భారత వ్యాపార వాతావరణం వేగంగా మారిపోంది. టాటా గ్రూపుని  తనదైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కించారు. సంస్థ కార్యకలాపాలను విభజించడంలోనూ,  గ్లోబల్ స్థాయిలో  బిజినెస్ను  విస్తరించడంలో, సాహసోపేతమైన  నిర్ణయాలు తీసుకోవడంలోనూ వెనకడుగు వేయక విదేశాలలో వ్యాపారం చేయగల సత్తా భారత్ కు ఉందని నిరూపించారు. టాటా నానో.. టాటాకు మిగిల్చిన నిరాశ.. భారతదేశంలో  అత్యంత చౌకైన కారుగా టాటా నానో సెన్సేషన్ సృష్టించింది.  మధ్యతరగతి  వారు కారులో తిగాలనే కలను చవకగా అందించాలనేది టాటా సంకల్పం.  కానీ డబ్బు ఎక్కువ పెట్టి బ్రతకడమే గొప్ప అనే మెంటాలిటీతో ఉన్న భారతీయులు టాటా సంకల్పం పై నీళ్లు చల్లారు. టాటా నానో కారును నిరుత్సాహపరిచారు.  ఫలితంగా ఆ కారు కనుమరుగైంది.  ఆర్థిక సమస్యలు పెరిగిన నేటి కాలంలో చాలామందికి ఇప్పుడు ఆ కారు విలువ అర్థం అవుతోంది. కానీ ప్రజల చేయి దాటిపోయింది.   రతన్ టాటాగారి  21 సంవత్సరాల నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభం 50 రెట్లు పెరిగింది. టాటా టీ ద్వారా టెట్‌లేను, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను, టాటా స్టీల్ ద్వారా కోరస్‌ వంటి ఎన్నో పెద్ద కంపెనీలను  సొంతం చేసుకున్నారు. వంటగదిలో ఉండే ఉప్పు నుంచి ప్రతిష్టాత్మక వాహనాల దాకా అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి  ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు.   రతన్ టాటా యొక్క నాయకత్వంలో ఉన్న కీలక అంశాలలో ఒకటి... ఆయన వ్యాపారంలో నైతికతపై దృష్టి పెడతారు. వ్యాపారంలో న్యాయం, పారదర్శకత ఉండాలని నమ్ముతారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ యొక్క ప్రాముఖ్యతను ఆయన గట్టిగా నమ్మేవారు.  తాత్కాలిక లాభాల కంటే తన ఉద్యోగుల సంక్షేమాన్ని, సమాజ పటిష్టతలకి ప్రాధాన్యత ఇచ్చేవారు.  2008 లో ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన టాటా గ్రూపుని సమర్థవంతంగా నడిపించారు. రతన్ టాటా ఇంత పెద్ద వ్యాపార వేత్త అయినా ఆయన ధనవంతుల జాబితాలో పైకి కనిపించరు. దీనికి కారణం  ఆయన చేసే సేవా  కార్యక్రమాలు.  ఆయన నేటికాలపు దానకర్ణుడు అని చెప్పవచ్చు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి వివిధ  కార్యకలాపాల కోసం తన వ్యాపార లాభాల రాబడి నుండి సుమారు 60 నుండి 65శాతం విరాళాలకు కేటాయించారు. ప్రపంచానికి గడ్డు కాలం అయిన కరోనా సమయంలో భారతదేశంకోసం 500కోట్లను విరాళంగా ఇచ్చిన మహనీయుడు ఆయన.  కావాలంటే దేశం కోసం నా ఆస్తులు అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన దయా హృదయుడు. దేశం కష్టాలలో ఉన్న ప్రతిసారి దేశాన్ని ఆదుకున్న భరతమాత ముద్దు బిడ్డ. రతన్ టాటా ఈ దేశం కోసం మళ్లీ పుట్టాలని కోరుకుందాం.                               *రూపశ్రీ.  
  ప్రపంచంలో మనిషి ఎప్పుడూ ఎదుటివారి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటాడు.  అది తన కంటే తక్కువ వర్గానికి చెందిన జాతుల మీద అయినా,  వేరే వర్గానికి చెందిన జంతువుల  మీద అయినా..  తన కింద కొందరు ఆటబొమ్మలుగా ఉంటే తృప్తి పడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు.  వారి మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా నమ్మిస్తారు.  సులభంగా వారి మీద  తమ మాటలతో  ఆధిపత్యం తెచ్చుకుంటారు.  ఇతరులను నియంత్రిస్తారు.  ఇలాంటి వారిని మానిప్యులేటివ్ వ్యక్తులని చెబుతారు. ఇలా మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం వల్ల తాము చాలా గొప్పవారిమని, తెలివైన వారిమని అనుకుంటారు. ఇతరులు ఎప్పుడూ తమ చెప్పుచేతలలో ఉంటారనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం ఇతరులకే కాదు.. మానిప్యులేటివ్ వ్యక్తులకు కూడా మంచిది కాదని చెబుతున్నారు. మానిప్యులేటివ్ గా ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.  మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన వారి వ్యక్తిగత రిలేషన్స్ విచ్చిన్నం కావడానికి దారి తీస్తుందట.  వారి ప్రవర్తన వ్యక్తిగత బంధాలలో విభేదాలు సృష్టిస్తుంది.  ఇది వ్యక్తులకు బంధం మీద,  పరిస్థితుల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానిప్యులేటివ్ వ్యక్తులు తమ మాటలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటారో.. ఇతరులను ఎలా బోల్తా కొట్టిస్తారో..ఇతరులు తనతో అలాగే ఉంటారేమో అనే భ్రమలో ఉంటారు.  ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో భాగస్వామి, స్నేహితులు,  కుటుంబ సభ్యుల మాటలను కూడా అంత తేలికగా నమ్మరు.  వారిని విశ్వసించరు. ఈ కారణం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అపనమ్మకం చాలా ఎక్కువగా తొంగిచూస్తుంది. మానిప్యులేటర్ వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉండటానికి, వారితో మాట్లాడటానికి ప్రజలు ఇష్టపడరు.  మానిప్యులేటివ్ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మానిప్యులేటివ్ వ్యక్తులు తమ సొంత ఇష్టాలను,  వారి సొంత అవసరాలను కూడా వారే అర్థం చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గందరగోళంగా ఉంటారు.  ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ ఎక్కువగా ఇతరులపైనే ఉంటుంది.  సింపుల్ గా చెప్పాలంటే మానిప్యులేటర్లు ఎక్కువగా ఇతరుల జీవితాలను చూస్తూ.. ఇతరుల జీవితాలను తమ చెప్పుచేతలలో ఉంచుకోవడంలోనే కాలం గడిపేస్తుంటారు. మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన ఆఫీసులలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల నుండి,  పై అధికారుల నుండి   చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందరి నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను తమ చెప్పుచేతలలో పెట్టుకోవాలనే ఆలోచనల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఏర్పడతాయి.  వీటి కారణంగా మానసిక,  శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. క్రమంగా ఒకరిని నియంత్రించాలని ప్రయత్నించడమనే అలవాటు.. ఆ నియంత్రించే వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది.                                              *రూపశ్రీ.  
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.
   చాలా మంది తరచుగా తలనొప్పి, సాధారణ జ్వరం వంటి సమస్యలను చాలా లైట్ గా తీసుకుంటారు.  కానీ కొన్ని సందర్భాల్లో వీటి వల్ల  తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటాయని తెలుసా..? అకారణంగా  జ్వరం రావడం,  తలనొప్పి రావడం.. ఉన్నట్టుండి సుస్తీ చేయడం వంటి సమస్యలు  అంతర్లీన వ్యాధుల సంకేతాలు కావచ్చు.  కొన్నిసార్లు  ఇది ప్రాణాంతకమైన సమస్య కూడా కావచ్చు. అలాంటి సమస్యలలో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి.  బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం బ్రెయిన్ ట్యూమర్ వల్ల రెండున్నర లక్షల మందికి పైగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? తెలుసుకుంటే.. 2020లో బ్రెయిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌ కారణంగా 2.46 లక్షల మంది చనిపోయారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నప్పటికీ.. చాలా ఏళ్ల వరకు దాని గురించి ఎవరికీ  తెలియదని,  ఆ సమస్య అంత సులువుగా గుర్తించలేమని  వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో మెదడులో కణితి చాలా నెమ్మదిగా పెరుగుతుంది.  ఈ కారణంగా  దాని లక్షణాలు కనిపించవు. ఈ పరిస్థితిలోకొన్ని సాధారణ సంకేతాలను తెలుసుకోవడం,  వీటిని గుర్తించడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల గురించి తెలుసుకునే ముందు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం! మెదడు కణితులు మెదడులో లేదా దాని చుట్టూ ఉన్న కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా ఏర్పడతాయి. ఇది క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు అభివృద్ధి చెందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఇతర వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇది కాకుండా ప్లాస్టిక్,  రసాయన పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. జన్యుశాస్త్రం, జీవనశైలి-ఆహారం మొదలైనవాటితో  పాటు అనేక రకాల పర్యావరణ పరిస్థితుల కారణంగా బ్రెయిన్ ట్యూమర్ బాధితులుగా మారే అవకాశం ఉంది. తలనొప్పి.. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు.  తలనొప్పి  దాని అత్యంత సాధారణ లక్షణం. ఉదయం వేళలో తలలో నొప్పి లేదా ఒత్తిడి పెరగడం లేదా నిరంతర తలనొప్పి చాలా సందర్భాలలో బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. మెదడు కణితి లక్షణాలు దాని పరిమాణం, అది పెరిగే  ప్రదేశంపై ఆధారపడి ఉంటాయి. అనేక సందర్భాల్లో మెదడు కణితి ఎంత వేగంగా పెరుగుతుందనే దానిపై కూడా లక్షణాలు ఆధారపడి ఉంటాయి. తలనొప్పి దాని ప్రారంభ సంకేతంగా పరిగణించబడుతుంది.  అందుకే దానిని విస్మరించవద్దు. ఈ లక్షణాలు కూడా.. మెదడులో కణితితో బాధపడుతున్న వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు.  ఇది అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదయం సమయంలో తలనొప్పి లేదా ఒత్తిడి చాలా దారుణంగా ఉంటాయి. ఎక్కువసార్లు చాలా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.   వికారం లేదా వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది.   కంటిచూపు సరిగా లేకపోవడం,   ఒక వస్తువు రెండుగా కనిపిండం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చేతులు లేదా కాళ్ళలో సంచలనం లేదా కదలిక తగ్గడం జరుగుతుంది. శారీరక సమతుల్యత,  మాట్లాడటంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాలక్రమేణా జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్నాయ తరచుగా తల తిరగడం లేదా ప్రపంచం తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అనుమాలు వద్దు.. సకాలంలో చికిత్స తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్  తీవ్రమైన సమస్యగా మారే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  పెద్దవారు,  స్థూలకాయులు లేదా రసాయనాలకు ఎక్కువగా గురయ్యేవారు మెదడు కణితి  సంకేతాలపై తీవ్రమైన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. వ్యాధిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని చికిత్స,  కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.   అయితే మెదడులో పెరిగే అన్ని కణుతులు బ్రెయిన్ క్యాన్సర్ కాదని గుర్తుపెట్టుకోవాలి.                                 *రూపశ్రీ
  స్థూలకాయం అనేది చాలా మంది బాధపడుతున్న  తీవ్రమైన సమస్య. నడుము చుట్టూ  కొవ్వు, చేతుల మీద కొవ్వు, తొడల మీద కొవ్వు, చంకల మీద కొవ్వు, పొట్ట మీద కొవ్వు, తుంటి మీద కొవ్వు ఇలా శరీరంలో ఎక్కడ చూసి కొవ్వు పేరుకుపోయి శరీరం దెబ్బతినడం మొదలవుతుంది. ఊబకాయం  అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ మొండి కొవ్వు వల్ల  క్యాన్సర్, మధుమేహం,  గుండె జబ్బులకు  కూడా కారణం అవుతుంది. డైట్ చేసినా, వ్యాయామం చేసినా, యోగా చేసినా, జిమ్‌కి చేసినా, రన్నింగ్‌కి చేసినా, వాకింగ్ చేసినా, బోలెడు రకాల వెయిట్ లాస్ పానీయాలు,  ట్రిక్స్, టిప్స్ మొదలైనవి అన్నీ ఫాలో అయినా అవన్నీ బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి.  నిజానికి  వేలకొద్దీ పరిష్కారాలతో ఇంటర్నెట్ నిండిపోయింది. విచిత్రం ఏంటంటే..చాలా మందికి ఈ టిప్స్ తో  ఫలితం ఉండటం లేదు.  బరువు తగ్గడానికి అన్ని పద్ధతులను ప్రయత్నించి అలసిపోయినవారికి భలే టిప్ ఇప్పుడు సహాయపడుతుంది. ఆయుర్వేదం చెప్పిన ఈ సీక్రెట్ టిప్ ఏంటంటే.. శరీర కొవ్వు  మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.  ఇది ఊబకాయానికి అతి పెద్ద కారణం. కొవ్వును కరిగించడం చాలా కష్టమైన పని. కానీ  సరైన టిప్ ను ఫాలో అయితే  ఈ పని సులభం అవుతుంది. కావలసిన పదార్థాలు.. 10 గ్రాముల పచ్చి పసుపు, 4 నల్ల మిరియాలు, ఒక చెంచా సొంపు తయారీ విధానం.. పచ్చి పసుపును బాగా గ్రైండ్ చేసి, దాని తర్వాత ఆ మిశ్రమంలో సోపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని స్టవ్ మీద ఉంచి బాగా  మరిగించి తరువాత వడకట్టాలి. మంచి ఫలితాలను పొందడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని త్రాగాలని వైద్యు చెప్పారు. కావాలంటే రెండు సార్లు తాగొచ్చు. దీనితో  కేవలం 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.                                     *రూపశ్రీ.  
  జాజికాయ మసాల దినుసుల్లో ఒకటి.  ఇది చాలా రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు.  కేవలం వంటల్లోనే కాకుండా పురాతన కాలం నుండి వైద్యంలోనూ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లోనూ ఔషదంగా కూడా జాజికాయను ఉపయోగిస్తున్నారు. జాజికాయ నీళ్లను నెలరోజుల పాటు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాకవుతారు. పోషకాలు.. జాజికాయ నీళ్లను నెల రోజులు క్రమం తప్పకండా తాగడం వల్ల కలిగే లాభాలు తెలుసుకునే ముందు జాజికాయలో ఉండే పోషకాలు తెలుసుకోవాలి.  జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. జాజికాయలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు జాజికాయ నీటిని తాగాలి.  దీని వల్ల నిద్ర బాగా వస్తుంది. జాజికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. జాజికాయ నీరు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జాజికాయ  నీరు తాగుతుంటే బరువు తగ్గుతారు.  శరీరాంలో ఉంటే టాక్సిన్లను తొలగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. జాజికాయ వాసన చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఫలితంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జాజికాయ నీళ్లు తాగుతుంటే మానసికంగా రిలాక్స్ గా ఉంటారు. జాజికాయ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  దీంతోపాటు ఎసిడిటీ, మలబద్దకం,  కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  జాజికాయ నీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.                                                  *రూపశ్రీ.