పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జి ఎస్పీఎస్ఎస్ వర్మ  చేసిన త్యాగానికి గుర్తింపు లభించకపోయినా, ఎవరికోసమైతే గత అసెంబ్లీ ఎన్నికలలో సీటు త్యాగం చేశారో.. వారే గుర్తించడం సంగతి అటుంచి నియోజకవర్గంలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నా, అడుగడుగునా అవమానాల పాలు చేస్తున్నా తన స్థిర చిత్తాన్ని కోల్పోలేదు. తెలుగుదేశం పట్ల తన విధేయతను చెక్కు చెదరనీయలేదు. తనకు జరుగుతున్న అవమానాలు, పరాభవాలపై అనుచరగణం రగిలిపోతున్నా.. వారిని సముదాయిస్తూ, వారు గీత దాటకుండా నియంత్రిస్తూ వస్తున్నారు.  గత ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్పీఎస్ఎస్ వర్మకు అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇప్పటికి రెండు సార్లు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అయినా వర్మలో ఎక్కడా అసంతృప్తి కానీ, అసహనం కానీ కనిపించలేదు.  మరో వైపు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జనసేన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కొంత కాలం కిందట పిఠాపురంలో పర్యటించిన జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఒక అడుగు ముందుకు వేసి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పిఠాపురం జనసేన ఇన్ చార్జ్ కి మాత్రమే రిపోర్ట్ చేయాలి కానీ వర్మకు కాదన్నది ఆ ఆదేశాల సారాంశం.   ఇక తాజాగా పిఠాపురం వర్మకు తెలుగుదేశం ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించడం వెనుక ఉన్నది స్వయంగా జనసేనానే అని అంటున్నారు.  పిఠాపురంలో ఎమ్మెల్సీ వర్మ మరొక అధికార కేంద్రంగా మారతారన్న భయంతోనే.. పవన్ కల్యాణ్ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువచ్చి వర్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకుండా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.అక్కడితో ఆగకుండా.. తాజాగా జనసేన 12వ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా జరిగిన సభలో వర్మ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావిం చకుండానే.. మెగా బ్రదర్ నాగబాబు ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి   విజయానికి  పవన్ కళ్యాణ్, జనసేన క్యాడర్,  పిఠాపురం ప్రజలు మాత్రమే కారణం.. అలాకాకుండా  పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా ఊహించుకుంటే, అది వారి కర్మ” అని  చేసిన వ్యాఖ్యల తరువాత కూడా వర్మ సంయమనాన్ని పాటిస్తూ, తన సహచరులను, పార్టీ క్యాడర్ ను కూడా పార్టీకి, అధిష్ఠానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అననీయకుండా నియంత్రిస్తున్నారు. తాజాగా మంగళవారం (మార్చి 17) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం అయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక పోస్టర్ లో కూడా చంద్రబాబునాయుడి పక్కన పవన్ కల్యాణ్ పొటోను ఉంచారు.  ఈ పోస్టర్ ను చూసిన వారంతా దటీజ్ వర్మ అంటూ ప్రశంసిస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎంత క్రమశిక్షణతో ఉంటారో వర్మ తన ప్రవర్తన ద్వారా రుజువు చేస్తున్నారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  
బిఆర్ ఎస్ కార్యనిర్వాహణాధ్యక్షుడు కెటీఆర్ తో  కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్ )  అసెంబ్లీలో  భేటీ అయ్యారు. తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్  నేతను కలవడం చర్చనీయాంశమైంది. బిసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న బిఆర్ఎస్ నేతలైన కెటీఆర్ , హరీష్ రావులను కోరారు. మల్లన్న వెంట బిసీ నేతలు కూడా ఉన్నారు. తాము చేపట్టబోయే ధర్నాకు సంఘీభావం తెలపాలని  బిఆర్ఎస్ నేతలను మల్లన్న కోరారు.   పార్టీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ఆరోపణలపై ఈ నెల ఒకటో తేదీన తీన్మార్ మల్లన్నను  కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. . గత నెలలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారి చేసి వివరణ ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ మల్లన్న సమాధానం ఇవ్వకపోవడంతో  కాంగ్రెస్ పార్టీ సస్పెండ్  చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రశ్నించి కాంగ్రెస్ కు  ఆయన దగ్గరయ్యారు. అనూహ్యంగా ఎంఎల్ సి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై  మల్లన్న ఆరోపణలు చేయడం గమనార్హం.   
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు. ఇందుకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  చట్ట సరవణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో మంగళవారం (మార్చి 17) ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై  జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు.  ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని, ఇందు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు.  ఇక బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని చెప్పారు. తెలుగువర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్చకుండా.. ఉస్మానియా యూనివర్సిటీకి  సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు అనంత‌రం తెలుగు వ‌ర్శిటి పేరు మార్పు చేసే బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది.
ALSO ON TELUGUONE N E W S
Telugu TV and social media influencers like Harsha Sai, Tasty Teja, Vishnu Priya, Supritha Naidu, Rithu Chowdary, Shyamala, Sunny Yadav, Pareshan Boys, Sudeer Raju, Kiran Goud, Ajay have been found to be promoting Betting Apps. Hyderabad Police have registered a case on these influencers and celebrities today.  Harsha Sai has already supported his stance on promoting such apps saying that if he doesn't someone else would. Suprita Naidu has apologised publicly on Holi day in a special video about the same. Vishnu Priya and others have stated that they did not know it is illegal to promote them.  Now, Panjagutta Police have strictly registered case about them under Public Gambling Act 1867. As Indian law condemns betting and any sort of promotion of betting, these celebrities can look at long jail time as well. 
Sukumar, the crazy director from Telugu Cinema, has created a huge sensation with Pushpa 2. The movie became biggest hit ever in Indian Cinema, crossing Baahubali 2 collections. Now, the director is one of the hot topics in the news. Reports suggest that he could be working Shah Rukh Khan in coming days.  But the director has Ram Charan's next after Buchi Babu Sana's RC16 and Pushpa 3 as well in the pipeline. He stated that he needed three years to complete Pushpa 2 and he might need such long time to make Pushpa 3 as well. On the other hand, his script work for Ram Charan's film might be going on at a full swing.  He would be wanting to deliver even bigger success than Rangasthalam and better character than Rangasthalam, Chitti Babu, for the actor. So, it is hard to believe that he would be rushing his work for both the films. Mythri Movie Makers producer Ravi, did announce that they are planning 2028 release for Pushpa 3 but Sukumar needs time.  As a staunch perfectionist, the director will be taking his time to complete Ram Charan's film and attempting another Pushpa film will need so much more energy, resources and time from him. So, we have to wait and see, if Sukumar will try to finish his films, so fast.  And Shah Rukh Khan has Pathaan 2 in his line up post King, say Hindi media reports. Until and unless, he makes an annoucement his next films like he did announcing his comeback, we would not know, how many he had already planned for coming years. 
గత కొన్నేళ్లుగా యూ ట్యూబ్‌లో రకరకాల వీడియోలు చేస్తూ విపరీతంగా ఫాలోవర్స్‌ని సంపాదించుకొని యూ ట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఛలామణి అవుతున్న కొందరు అధిక ఆదాయం కోసం సమాజానికి ప్రమాదకరంగా మారిన బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. ఇటీవల ఈ విషయాన్ని ఐపిఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించడమే కాకుండా అలా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న వారి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఆ విధంగా ఎంతో మంది యూ ట్యూబర్లు బెట్టింగ్‌ చేస్తున్నారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అలాంటి వారిపై కొరఢా రaళిపిస్తున్నారు. ఇప్పటికే సజ్జనార్‌ సూచన మేరకు లోకల్‌ బాయ్‌ నానిపై కేసు పెట్టి రిమాండ్‌కి తరలించారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు.  హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్‌ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్‌రాజు, అజయ్‌లపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలికాలంలో ఎంతో బెట్టింగ్‌ యాప్‌ల బారిన పడి లక్షల్లో, కోట్లలో నష్టపోయారు. దాని ఫలితంగా కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఇకపై అలాంటి విషాదకరమైన ఘటనలు జరగకూడదని సజ్జనార్‌ ఈ సందర్భంగా తెలియజేస్తూ బెట్టింగ్‌లను ప్రోత్సహిస్తున్న ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో యూ ట్యూబర్లలో ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరుగా అందరి పేర్లూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి వారు సోషల్‌ మీడియాలో ఇంకా ఉన్నారని, వారిపై కూడా త్వరలోనే కేసులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. 
Allari Naresh changed his direction from sticking to only comedy entertainers to content rich different films. He is not choosing same script as his previous film and now, he will be seen in a serious horror thriller, 12A Railway Colony. The movie is written by Dr. Anil Vishwanath, Polimera fame and directed by Nani Kasaragadda.  Srinivasa Chitturi is producing the film and the makers have unveiled the teaser of the film. We see Allari Naresh in a railway colony home noticing something weird from his window. He starts his journey to investigate some paranormal occurences and we see random hints about black magic being used on someone.  The makers did not reveal much but the pattern of the edit showcases that the director is coming up with something similar to his Polimera films with once again emphasis on black magic. Kamakshi Bhaskarla, Sai Kumar, Viva Harsha and several actors are playing prominent roles in the movie.  The director did impress one and all with his Polimera but in the sequel he overdid the twists and turns. In the teaser, this film too seems to have twists but they need to work like Polimera. As Naresh needs this one to succeed big time in theatres, let's see how trailer and movie pans out.
Puri Jagannadh could not repeat the success of Ismart Shankar with both his films - Liger and Double Ismart. Both of them have become such huge disasters than they have earned him further bad name. The recent reports state that director is said to have narrated a script to Vijay Sethupathi and their film could start soon.  But reports from Tamil media channels state that Vijay Sethupathi wanted to work with the director and came to Hyderabad for a narration as well. They state that he did not like the storyline and hence, dropped the idea of working with him. Now, Telugu media reports suggest that he agreed to give dates, immediately.  On the other hand, reports about Puri working with Akhil and Nagarjuna have also surfaced. At this moment, these reports seem to be speculations from different sources rather than consolidated reports. The writer-director is not finding immediate acceptance from actors due to his recent track record.  Still, his name sparks huge amount of interest on whom he would work with next. Currently though, the media reports are confusing everyone around. Vijay Sethupathi has big line-up in Tamil, after Maharaja success, and for him to keep them all on a back burner and work with Puri, the story has to be that exceptional. Let's wait for the official announcement, as it is hard to believe in random speculations and speculate on speculations. 
Mohanlal has delivered a resounding blockbuster with Lucifer. Prithviraj Sukumaran, as director, delivered his biggest box office success with the film. Now, they are back with the promised sequel, L2: Empuraan. The movie is scheduled for release on 27th March and Dil Raju has joined the team as Telugu distributor.  His Sri Venkateswara Creations (SVC) , will distribute the film in Andhra Pradesh and Telangana. The team guarantees a huge release all over Telugu states. The makers have revealed that the filming of L2E: Empuraan began in a grand way on October 5, 2023, in Faridabad. The shoot continued in various other places, including Shimla, Leh, the United Kingdom, the United States, Chennai, Gujarat, Hyderabad, the United Arab Emirates, Mumbai, and Kerala. Along with Mohanlal, the film features an ensemble star cast, including Prithviraj Sukumaran, Tovino Thomas, Manju Warrier, Indrajith Sukumaran, Suraj Venjaramoodu, Saniya Iyappan, Saikumar, Baiju Santhosh, Fazil, Sachin Khedekar, Nyla Usha, Giju John, Nandhu, Shivaji Guruvayoor, Manikuttan, Aneesh G. Menon, Sshivada, Alexx O'Nell, Eriq Ebouaney, Mikhail Novikov, and Karthikeya Dev in pivotal roles. English actor Jerome Flynn of Game of Thrones fame also makes his Indian cinema debut by playing a crucial role in L2E: Empuraan. The makers promise a highly satisfying cinematic ride in theatres. 
తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకరు. పవన్‌ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో బద్రితో మొదలైన పూరి సినిమా ప్రయాణం వరసగా రవితేజ, అక్కినేని నాగార్జున, మహేష్‌ బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, గోపీచంద్‌, నందమూరి బాలకృష్ణ.. ఇలా టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ కొనసాగింది. వీరిలో కొందరికి మెమరబుల్‌ హిట్స్‌ ఇచ్చారు. అయితే సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఆ విషయం పూరికి కూడా తెలుసు. అందుకే అతని చేతికి ‘నాట్‌ పర్మినెంట్‌’ అనే ట్యాటూ వేయించుకున్నారు. అంటే విజయమైనా, అపజయమైనా, సంతోషమైనా, బాధైనా ఏదీ పర్మినెంట్‌ కాదు అనేది దాని సారాంశం. తరచూ తన చేతిని చూసుకొని అప్పుడతను ఉన్న పరిస్థితి పర్మినెంట్‌ కాదని సర్ది చెప్పుకుంటారు పూరి. ప్రస్తుతం అతన్ని అపజయాలు వెంటాడుతున్నాయి. వరసగా పూరి చేసిన సినిమాలన్నీ డిజాస్టర్‌ అవుతున్నాయి. ఆమధ్య వచ్చిన చివరి సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌ పూరిని కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో నెక్స్‌ట్‌ సినిమా ఎవరితో చెయ్యాలి అనే కన్‌ఫ్యూజన్‌ అతనిలో మొదలైంది. సినిమా చేసే విషయంలో అతనికి కన్‌ఫ్యూజన్‌ ఉందో లేదో తెలీదుగానీ, సోషల్‌ మీడియాలో మాత్రం వరసగా ఎవరో ఒకరి పేరు వినిపిస్తూనే ఉంది.  డబుల్‌ ఇస్మార్ట్‌ తర్వాత గోపీచంద్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేని అఖిల్‌ పేరు వినిపించింది. ఆ తర్వాత ఆ పేరు కూడా పక్కకి వెళ్లిపోయి అక్కినేని నాగార్జున పేరు బయటికి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ వార్త సర్క్యులేట్‌ అవుతోంది. ఇప్పుడు అతను కూడా కాదని, కోలీవుడ్‌ హీరోతో పూరి సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అతను ఎవరో కాదు, విజయ్‌ సేతుపతి. ఇటీవల పూరి చెన్నయ్‌ వెళ్లారని, విజయ్‌ సేతుపతిని కలిసి ఒక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ నేరేట్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా ఉంటుందనే సమాచారం కూడా సర్క్యులేట్‌ అవుతోంది. ప్రస్తుతం ఇది డిస్కషన్‌ స్టేజ్‌లో ఉందని, సబ్జెక్ట్‌ ఓకే అయి, నిర్మాతలు కూడా సెట్‌ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటిస్తారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా విజయ్‌ సేతుపతితో పూరి సినిమా అనే వార్త మాత్రం బలంగానే వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌గానే ఉంటుందని ప్రేక్షకులు, పూరి అభిమానులు భావిస్తున్నారు.  
Kannappa is set to unveil its third single, “Mahadeva Shastri Intro Song,” on March 19 in celebration of Dr. M. Mohan Babu’s birthday. As the film’s producer and the powerhouse behind the character Mahadeva Shastri, his birthday provides a fitting occasion to launch this high-energy, impactful track. In addition to Dr. M. Mohan Babu’s formidable presence, the film boasts a stellar cast featuring lead actor Vishnu Manchu and female lead Preeti Mukundan, along with acclaimed stars such as Akshay Kumar, Prabhas, Mohanlal, Mukesh Rishi, and Kajal Agarwal.    Composed by renowned music director Mr. Stephen Devassy, the track promises to be a musical spectacle with fierce, powerful, and magnificent beats, delivering an unparalleled auditory experience that encapsulates the dynamic spirit of Mahadeva Shastri. This deliberate release marks a significant milestone in Kannappa’s promotional journey, reinforcing the film’s commitment to innovative storytelling through music. With its bold composition and impressive star power, the “Mahadeva Shastri Intro Song” is poised to captivate audiences and elevate the film’s devotional narrative to new heights.
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai)పై బిగ్ బాస్(Big Boss)ఫేమ్, ప్రముఖ నటి మిత్రాశర్మ(Mitraaw Sharma)కొన్ని నెలల క్రితం చేసిన ఆరోపణలు ఎంతగా సంచలనం సృష్టించాయో తెలిసిందే. తనని శారీరకంగా వాడుకున్నాడని,పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని  మిత్రా చెప్పుకొచ్చింది.ఈ విషయం కోర్టు దాకా వెళ్లడం,మిత్రా చెప్పేది అబద్దమని హర్ష చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అధికారి వి సి సజ్జనార్ ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేస్తు అమాయక ప్రజల జీవితాలని నాశనం చేస్తున్న యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.హర్ష సాయి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటాడు.ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో మిత్రా శర్మ ఇనిస్టా వేదికగా హర్ష సాయి ని ఉద్దేశిస్తు 'ఎందరో జీవితాలని నాశనం చేసిన నిన్ను ఇప్పుడు కర్మ వెంటాడుతుంది.మిస్టర్ చీటర్ మళ్ళీ బ్యాంకాక్ పారిపోయావంట కదా! ఈ రోజే బ్యాంకాక్ నుంచి స్టార్ట్ అవ్వు.ఇప్పటికైనా సొసైటీకి,ఫాలోవర్స్ కి క్షమాపణ చెప్పు.బెట్టింగ్ యాప్స్ చేయనని ఒక వీడియో కూడా రిలీజ్ చెయ్యి.ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకి వస్తాను.హర్ష సాయి బెట్టింగ్ బండారం మొత్తం బయటపెడ్తాను.సజ్జనార్(Vc Sajjanar)వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి. నా అన్వేషణ అనే యూట్యూబర్ అన్వేష్  మంచి వ్యక్తి.గ్రేట్ జాబ్, నెక్స్ట్ జెనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని ఇనిస్టా వేదికగా  ట్వీట్ చేసింది.    
లెజెండరీ సింగర్ అమరజీవి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం(Sp balasubramanyam)తనయుడు సింగర్ ఎస్ పి  చరణ్(Sp Charan)చాలా ఏళ్ళ తర్వాత 'లైఫ్' లవ్ యువర్ ఫాదర్(Life LOve Your Father)అనే సినిమాతో తెలుగు చిత్ర సీమలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఆయన ప్రధాన పాత్రలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆదిదేవుడి నివాసం,హిందువుల పుణ్యక్షేత్రం కాశీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా,మనీషా ఆర్ట్స్ అధినేతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీలు అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ అధినేత  రామస్వామి రెడ్డి తో కలిసి నిర్మిస్తున్నారు.మనీషా ఆర్ట్స్(Maneesha Arts)గతంలో ఎస్ వి కృష్ణారెడ్డి(Sv krishnareddy)తో పలు హిట్ చిత్రాలని నిర్మించిన విషయం తెలిసిందే. పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రాబోతుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పవన్ కేతరాజు(Pawan Ketharaju)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది.ఈ సందర్భంగా మూవీ టీం పలు విషయాలపై  మీడియాతో ముచ్చటించింది.  దర్శకుడు పవన్ మాట్లాడుతు కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం, తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం కథే ఈ సినిమా.కథ మొత్తం కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుండగా మూవీలో శివతత్వాన్ని కూడా చూపించాం.హీరో తండ్రి పాత్రలో ఎస్ పి చరణ్ గారు మా మూవీకి చాలా ప్లస్ అయ్యారు.విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మెలోడీ బ్రహ్మమణిశర్మ(Mani Sharma)గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. నిర్మాత అన్నపరెడ్డి రామస్వామిరెడ్డి మాట్లాడుతు మూవీ చాలా బాగా వచ్చింది.ఎక్కువ భాగం కాశీలోనే షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా చూపించబోతున్నాం.ఫస్ట్ కాపీ చూశాక ఆర్ ఆర్ చాలా అద్భుతంగా అనిపించింది.సినిమాపై మా నమ్మకం ఇంకా పెరిగింది.వెంటనే మణిశర్మ  గారిని సత్కరించడానికి వెళ్ళాం.ఆర్ ఆర్ బాగా కుదిరినందుకు ఆయన కూడా చాలా సంతోషించారు. ఏప్రిల్ 4న మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం.ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నామని తెలిపారు.నాగమాధురి డైలాగ్స్ అందించగా, డీవోపిగా శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ గా రామకృష్ణ,ఆర్ట్ డైరెక్టర్ గా చిడిపల్లి శంకర్, కొరియోగ్రాఫర్ గా మొయిన్, ఫైట్ మాస్టర్ గా కార్తీక్, పిఆర్ఓగా మధు వీఆర్ వ్యవహారించారు.రఘుబాబు,నవాబ్ షా,ప్రవీణ్, భద్రం,షకలక శంకర్, రియా వంటి  వారు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రతి సంబంధం నమ్మకం, ప్రేమ,  పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ కావచ్చు,  పెళ్లి కావచ్చు.. మొదటి రోజులలో, ప్రేమ దాని శిఖరాగ్రంలో ఉంటుంది, కానీ కాలక్రమేణా పని ఒత్తిడి, జీవితంలోని హడావిడి,  బాధ్యతల కారణంగా, ఆ సంబంధం మునుపటిలా ఉండదు. క్రమంగా ప్రేమ,  సాన్నిహిత్యం రెండూ తగ్గడం ప్రారంభమవుతాయి. చాలా సార్లు భాగస్వాములిద్దరూ ఒకరి నుండి ఒకరు దూరం అయిపోతున్నాం  అని ఫీల్ అవడం ప్రారంభిస్తారు, ఇది సంబంధంలో స్తబ్దతకు దారితీస్తుంది. సైకియాట్రిస్ట్ ల ప్రకారం ఇది ఏ సంబంధంలోనైనా ఒక సాధారణ సమస్య. కానీ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఈ సమస్యను కూడా పరిష్కరించవచ్చు.  సంబంధాన్ని మళ్ళీ ఉత్సాహంగా  రొమాంటిక్ గా  మార్చడానికి, భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రయత్నాలు చేయాలి. ప్రేమ అనేది కేవలం శారీరక ఆకర్షణకే పరిమితం కాదు, ఒకరి పట్ల ఒకరు అనుబంధం, ప్రేమ,  గౌరవాన్ని కొనసాగించడం ముఖ్యం. భార్యాభర్తలు సంబంధంలో ప్రేమను సజీవంగా ఉంచుకున్నప్పుడు, ఆ సంబంధం మరింత బలపడుతుంది. భావోద్వేగ,  మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.  సంబంధం మునుపటిలా లేదని మీరు భావిస్తే, నిరాశ చెందాల్సిన అవసరం లేదు,  కొన్ని చిన్న  మార్పులు చేయడం ద్వారా భాగస్వామితో మళ్ళీ సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చు. నేటి బిజీ జీవితంలో, భార్యాభర్తలు తమ బాధ్యతలలో చిక్కుకుపోతారు, ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోతున్నారు. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపనప్పుడు, సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది, కాబట్టి ప్రతిరోజూ మీరు ఒకరితో ఒకరు గడపడానికి కనీసం కొంత సమయాన్ని కేటాయించాలి. నాణ్యమైన సమయాన్ని గడపడానికి,  కలిసి భోజనం చేయవచ్చు.  ఆ రోజు గురించి విషయాలను కూడా పంచుకోవచ్చు.  కనీసం వారానికి ఒకసారి బయటకు వెళ్లడం ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు  కలిసి వాకింగ్ కు వెళ్లవచ్చు లేదా కొత్త ప్లాన్స్  ప్రయత్నించవచ్చు. వివాహం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత చాలా సార్లు, జంటల మధ్య ప్రేమ మాటలు,  శారీరక సాన్నిహిత్యం తగ్గుతుంది. ఇది సంబంధంలో విసుగుకు దారితీస్తుంది. మీ భాగస్వామి పట్ల ప్రేమ,  ఆకర్షణను కొనసాగించడానికి వారిని కౌగిలించుకోవడం, వారితో ప్రేమగా మాట్లాడటం  చేయవచ్చు. పడుకునే ముందు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం,  మీ భాగస్వామి మీకు ఎంత ప్రత్యేకమైనవారో చెప్పడం వల్ల సంబంధానికి కొత్తదనం వస్తుంది. శారీరక సాన్నిహిత్యం కేవలం శారీరక సంబంధానికే పరిమితం కాదు, ఒకరినొకరు అనుభూతి చెందడం,  ఆప్యాయతను వ్యక్తపరచడం కూడా ముఖ్యం. కొన్నిసార్లు భార్యాభర్తల బంధంలో ప్రేమ ముగింపుకు దారి తీస్తుంది. దీనికి కారణం ఒకరి పట్ల ఒకరు ఉత్సాహం కోల్పోవడం కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు,  చిన్న బహుమతులు ఇవ్వడం వల్ల సంబంధానికి కొత్త జీవితం వస్తుంది. దీనికోసం ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ భాగస్వామిని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారని చూపిస్తే సరిపోతుంది. ప్రత్యేక సందర్భం లేకుండా మీరు వారికి పువ్వులు లేదా చాక్లెట్లు ఇస్తే ఇష్టపడతారు. వారికి ఇష్టమైన భోజనం వండి లేదా ఆర్డర్ చేసి వారిని ఆశ్చర్యపరచవచ్చు. చిన్న చిన్న లవ్ కోట్స్ ఒకరికి ఒకరు పంపుకోవచ్చు.  ఇలాంటి చిన్న పనులు ఇద్దరి మధ్య ప్రేమను తిరిగి పుట్టేలా చేస్తాయి. వివాహం తర్వాత చాలాసార్లు, మన భాగస్వామి  చిన్న విషయాలను కూడా మనం విస్మరిస్తుంటాం. దాని కారణంగా వారు చెడుగా భావిస్తారు. అతను చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని మీరు అభినందించాలి. ఆమె మంచి లక్షణాలను ప్రశంసించడం,  ఆమె మీకు ఎంత ముఖ్యమైనదో చెప్పడం వల్ల ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది.  భాగస్వామికి గౌరవం,  ప్రేమ ఇచ్చినప్పుడు, వారు కూడా మీకు ప్రేమ,  గౌరవాన్ని తిరిగి ఇస్తారు. ఇది  సంబంధాన్ని బలపరుస్తుంది.                         *రూపశ్రీ. 
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
భారతీయుల సంప్రదాయంలో బోలెడు పండుగలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఋతువు మార్పుకు అనుగుణంగా జరిగేవి అయితే.. మరికొన్ని వివిధ కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలకు గుర్తుగా జరుపుకునేవి. కొన్ని ప్రాంతీయత ఆధారంగా జరుపుకునేవి అయితే మరికొన్ని యావత్ భారతదేశం అంతా జరుకునేవి. ఇలా భారతీయులు అందరూ  దేశం మొత్తం జరుపుకునే వేడుకల్లో హోళి ఒకటి. రంగుల పండగ అయిన ఈ హోళి వెనుక చాలా కథనాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడికి, హోళి పూర్ణిమకు అవినాభావ సంబంధం ఎంతో ఉంది. అలాగే హోళిని దేశవ్యాప్తంగా జరుపుకున్నా ఒక్కో ప్రాంతంలో ఒకో విధంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలనే తేడా లేకుండా హోళి పండుగ జరుపుకోవడం చాలా చోట్ల కనిపిస్తుంది.  హోళి వెనుక చాలా కథలున్నాయ్! హోళీ పూర్ణిమను పలుచోట్ల కామ పున్నమి అని కూడా పిలుస్తారు. అంతే కాదు పౌర్ణమికి ముందురోజు కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ కామ దహనం వెనుక ఓ కథ ఉంది. తపస్సు చేసుకుంటున్న శివుడి మీద మన్మధ బాణాలు ప్రయోగిస్తాడు మన్మథుడు. దీనికి కోపం చెందిన శివుడు మన్మధుడిని తన మూడవ కంటితో భస్మం చేస్తాడు. తరువాత మన్మధుడి భార్య వేడుకోగా అతనికి పూర్వ రూపం ప్రసాదిస్తాడు. దీన్ని పురస్కరించుకుని వసంత మాసంలో వచ్చే పూర్ణిమను కామ పూర్ణిమగా జరుపుకుంటారు. మన్మధుడిని కాముడు అని పిలవడం అందరికీ తెలిసిందే.. హోళీ.. హోళిక.. హోళిక ఒక రాక్షసి. ఈమె హిరణ్యకశిపుడి చెల్లెలు. తన అన్నయ్య హిరణ్యకశిపుడు నరసింహ అవతారం చేతిలో మరణించినందుకు ప్రహ్లాదుని మీద ఎనలేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా ప్రహ్లాదుని చంపాలని మంటల్లోకి తోసింది. కానీ నారాయణుడి అభయం ఉన్న ప్రహ్లాదునికి ఏమి కాలేదు. హోళిక ఆ మంటల్లో దహనమైపోతుంది. చెడు మీద మంచి సాధించిన విజయం ఇదని, హోళిక చనిపోయిన సందర్భంగా హోళికా దహనం చేస్తారని చెబుతారు.  బాల కృష్ణుడు..   హోళి పండుగ రోజే.. బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసినట్టు చెబుతారు. అందుకే డోలాయాత్ర పేరుతో కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. కన్నయ్యతో పాటు రాధను కూడా జతగా ఉంచుతారు.  ఇక హోళిని వివిధ ప్రాంతాల్లో విభిన్న రకాలుగా చేసుకుంటారు. హోళి అంటే ఉదయం నుండి రంగులు పట్టుకుని వీధులంతా  హంగామా చేయడమే మనకు తెలుసు. కానీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ శ్రీకృష్ణుడి నివాసమైన మధురలో చాలా ప్రత్యేకంగా హోళి జరుగుతుంది.  ఇక్కడ హోళి పండుగ వీధుల్లో జరుపుకోవడం ఎక్కడా కనిపించదు. పూర్తిగా దేవాలయాల్లో మాత్రమే హోళి జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ దేవాలయాలకు బారులు తీరుతారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు తమతో కలిసి రంగులు చల్లుకుంటూ, హోళి ఆడతాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. ముఖ్యంగా బృందావనంలో హోళి సంబరాలు అంబరాన్నంటుతాయి. అంతే కాదు ఇక్కడి సంప్రదాయంలో భాగంలో ఆడవారు మగవారికి కర్రలతో కొడతారు. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 16 రోజుల పాటు హోళి సంబరాలు జరుగుతాయి. ఆ ఇంద్రధనస్సు వచ్చి మధుర, బృందవనాలలో వాలిందా అన్నట్టు అక్కడ రంగుల మయం అందరినీ మాయ చేస్తుంది. ఫలితంగా హోళి పండుగ రోజు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు అదనపు పని పెడతారు, మరికొందరు తమలో ఉన్న ట్యాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇలా హోళి సందడి దేశమంతా వెల్లివిరుస్తుంది.                                       ◆నిశ్శబ్ద.
  అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు,  స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు: LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం,  అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి  కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలని  వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి? అధిక కొలెస్ట్రాల్‌కు అనేక కారణాలు ఉన్నాయి.. సంతృప్త,  ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన,  వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. శారీరక శ్రమ లేకపోవడం అధిక శరీర బరువు. ధూమపానం, మద్యం వినియోగం జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి) అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది.  శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ  సంకేతాలు ఉన్నాయి. చర్మంపై పసుపు రంగు మచ్చలు.. అధిక కొలెస్ట్రాల్  మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. చేతులు,  కాళ్ళలో జలదరింపు,  తిమ్మిరి.. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు,  కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన  అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు,  పిత్తాశయ రాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.  పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం  కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం,  అజీర్ణానికి దారితీస్తుంది. ఛాతీ నొప్పి,  శ్వాస ఆడకపోవడం.. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా),  శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. తిమ్మిరి,  మాట్లాడటంలో ఇబ్బంది.. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్‌కు దారితీస్తుంది.  ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది,  సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.                                       *రూపశ్రీ.
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
    హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి,  స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు.  రంగులు చల్లుకుంటూ  పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట.  ఇది మన మానసిక స్థితి,  శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి,  ఆశావాదం కలుగుతాయి.  హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా  శారీరక, మానసిక,  భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి.  హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి?   కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక,  శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు,  లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది.  మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి.   కలర్ థెరపీ  ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని,  ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం,  దూకుడును కూడా పెంచుతుంది.  కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి.   పసుపు రంగు పసుపు అనేది సానుకూలత,  తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం,  సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది,  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ,  ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.   ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి,  సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె,  ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం,  శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు,  అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.  టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.   కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు.  ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి.  దుస్తులు,  వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్,  అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి.                                                       *రూపశ్రీ.