నినాదాలతో మోడీకి ఘన స్వాగతం
posted on Sep 27, 2014 9:48AM
భారత ప్రధాని శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత అమెరికాలో పాదం మోపిన మోడీకి న్యూయార్క్‌లో ఘన స్వాగతం లభించింది. మోడీ విమానంలోంచి దిగగానే స్థానిక భారతీయులు ‘మోడీ.. మోడీ’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. మోడీ బసచేసిన హోటల్ బయట ఆయనకు స్వాగతం పలికి, అభినందనలు తెలిపేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మోడీ కూడా భద్రతా నియమాలను పక్కన పెట్టి అక్కడకి వచ్చిన వారిలో కలసిపోయి పలకరించారు. సాధారణంగా అమెరికాలో రాజకీయ నాయకుల దగ్గరకి జనం వెళ్ళిపోవడం అరుదుగా జరుగుతూ వుంటుంది. అమెరికా పర్యటనకు వచ్చే నాయకుల భద్రత విషయంలో అమెరికాలో అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. ఏ దేశ ప్రధానికీ లభించనంత ఘన స్వాగతం మోడీకి లభించింది. దీనికోసం భద్రతా నిబంధనలను కూడా కొంచెం సడలించారు.