రెండో విడత పోలింగ్ కూల్.. కూల్..

 

జార్ఖండ్, జమ్ము - కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ మంగళవారం నాడు ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించారు. ఈ దశలో జార్ఖండ్‌లో 20 నియోజకవర్గాలలో, జమ్ము కాశ్మీర్‌లోని 18 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో భారీగా భద్రతా దళాలు మోహరించాయి. మొత్తం 40 వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధులలో వున్నారు. మధు కోడా, అర్జున్ ముండా లాంటి మాజీ ముఖ్యమంత్రులతోపాటు 223 మంది అభ్యర్థులు ఈ దశలో ఎన్నికల బరిలో వున్నారు. జమ్ము కాశ్మీర్ ఎన్నికలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఉప సభాపతి, నలుగురు మంత్రులు, పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈ రెండో దశలో ఎన్నికల బరిలో వున్నారు. ఇక్కడ 275 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో వున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో  పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.