హెలికాప్టర్ కూలిపోయి 13 మంది సైనికులు మృతి..


టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ హెలికాప్టర్ కూలిపోయి 13 మంది సైనికులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. టర్కీలో సైనికులతో వెళ్తున్న మిలటరీ హెలికాప్టర్  టేకాఫ్ అయిన కాసేపటికే హై-ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తాకడంతో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది సైనికులు మృతిచెందినట్టు టర్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హులుసి అకర్ తెలిపారు.