ముగ్గురు స్టార్ల పుట్టినరోజు
posted on Apr 8, 2015 4:00PM
ఏప్రిల్ 8.. ఒకరు కాదు ఇద్దరు కాదు టాలీవుడ్ లో ఏకంగా ముగ్గురు తారలు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారా. అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, నిత్యామీనన్. తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించాడు. ఇక అఖిల్ పుట్టిన రోజుకు "హ్యాపీ 21 బర్త్డే మై డియర్ సన్. మే యువర్ గ్రాండ్ ఫాదర్ గైడ్ యూ అండ్ బ్లెస్ యూ. వియ్ లవ్ యూ" అంటూ నాగార్జున ట్విట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు అఖిల్ తొలి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను గిఫ్ట్ట్ గా ఇచ్చారు. ఈ టీజర్ ను అక్కినేని అభిమానులే కాదు అటు అఖిల్ సినిమాకి నితిన్ నిర్మాత కావడం వల్ల అతని అభిమానులు కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది. ఇక హిట్ సినిమాల హీరోయిన్గా పేరొందిన నిత్యామీనన్ కూడా తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. వీరితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ పుట్టినరోజు కూడా ఈ రోజే కావడం విశేషం. ఈ సందర్భంగా హీరో రాంచరణ్ అకిరాకు "జూనియర్ పవర్స్టార్కు అభినందనలు.. బోలెడన్ని ప్రేమాభిమానాలు" అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.