థాంక్యూ ఇండియా

 

శ్రీలంకలో వివిధ సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిన భారతదేశానికి శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు. మాతలే టౌన్‌లో మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధికి భారత ప్రభుత్వం చేయూత ఇవ్వడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత - శ్రీలంక డెవలప్‌మెంట్ కో-ఆపరేషన్‌ భాగస్వామ్యంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ సెంటర్ నిర్మాణానికి 88.6 మిలియన్ల శ్రీలంక రూపాయల నిధులను సమకూర్చింది.