అసెంబ్లీలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రేవంత్.. కేసీఆర్ ఆగ్రహం


రైతు ఆత్మహత్యల అంశంపై చర్చలో అసెంబ్లీలో వేడి రాజుకుంటుంది.  చాలా వాడీవేడీగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం తెలంగాణ టీడీపీ నేత.. కొడంగల్ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ఓటుకు నోటు కేసు తర్వాత కేవలం తన నియోజక వర్గానికే పరిమితమైన రేవంత్ రెడ్డి కోర్టు తనకు విధించిన షరతులను సడలింపజేయటం వల్ల కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. ఇప్పుడు ఆసెంబ్లీ సమావేశాలకు హాజరైన రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎప్పటిలాగానే తన దైన శైలిలో అధికార పార్టీపై.. ముఖ్యంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరి పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తేచాలు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండదని..అదేమి శాశ్వతం కాదని హెచ్చరించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో సాకు చెప్పి రేవంత్ రెడ్డిని సభలో మాట్లాడనివ్వకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మరి ఎలాంటి వ్యూహం వేస్తుందో.. లేక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ రెడ్డి ఈసారి వారి వ్యూహాలను తిప్పికొడతారో చూడాలి.

ఇదిలా ఉండగా అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ నేపథ్యంలో గందరగోళం నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబట్టడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించామని.. ఇప్పుడు ఆత్మహత్యల పైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటూ.. ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా? అంటూ ప్రశ్నించారు.