మరికాసేపట్లో ప్రారంభం కానున్న టీడీపీ మహానాడు..

 

తెలుగుదేశం పార్టీ  పండుగలా చేసుకునే మహానాడు కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. తిరుపతి వేదికగా జరిగే ఈ కార్యక్రమం ఈరోజు నుండి మూడు రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు ముఫ్పై వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా టీడీపీ జరుపునే ఈ సభలో పార్టీ సాధించిన విజయాలు.. భవిష్యత్ కార్యచరణాలు గురించి చర్చిస్తారు. ఇంకా ఈ కార్యక్రమం సందర్భంగా పలు తీర్మానాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.