కలిసున్నా పెళ్లయినట్టే... సుప్రీం

 

పెళ్లి కాకుండా, సహజీవనం చేస్తే పెళ్లయినట్టే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండా కలిసి జీవించే వారిలో సహజీవన భాగస్వామి చనిపోతే అతని ఆస్తి ఆమెకు చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ తాత ఆస్తులపై మనవలు, మనవరాళ్లు వేసిన కేసులను విచారించిన తరువాత సుప్రీం కోర్టు ఈ రకమైన రూలింగ్ ఇచ్చింది. తమ బామ్మ చనిపోగా తాత వేరే మహిళతో కలిసి ఉంటున్నాడని, కానీ వారు పెళ్లి మాత్రం చేసుకోలేదని, ఇటీవల తాత మరణించాడని వాళ్లు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ ఆస్తి ఆమెకు చెందదని వాదించారు. సుప్రీంకోర్టు మాత్రం ఆమెకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తాజాగా ఈ రూలింగ్ ను పాస్ చేసింది.