లుంగీడాన్స్ హనీసింగ్ కొత్త అవతారం

 

‘లుంగీడాన్స్’ పాట పాడిన యోయో హనీసింగ్ ఎన్నికల ప్రచారంలోకి దిగాడు. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నాడు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ తరఫున యోయో హనీసింగ్ ప్రచారం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సదరు పార్టీ నాయకుడు, చౌతాలా మనవడు కరణ్ చౌతాలా తెలిపారు. అవినీతి ఆరోపణల కేసులో జైల్లో వున్న ఓం ప్రకాశ్ చౌతాలా కూడా బెయిల్‌పై బయటకు వచ్చి పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి నాలుగుసార్లు ఓం ప్రకాశ్ చౌతాలా ముఖ్యమంత్రిగా పనిచేశారు.