రాజయ్య వ్యాఖ్యలు... అసెంబ్లీలో దుమారం..

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నాటితో ముగుస్తున్నాయి. శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో గందరగోళాన్ని సృష్టించాయి. రాజయ్య మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో ఆత్మహత్యలు జరగడానికి సోనియా గాంధీయే కారణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరిగిన జాప్యం కారణంగానే ఆత్మహత్యలు జరిగాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గొడవకు కారణమయ్యాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ మీద రాజయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. వెంటనే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే క్షమాపణ చెప్పడానికి రాజయ్య ఎంతమాత్రం అంగీకరించలేదు. అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడానికి స్పీకర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ సభ్యులు మాత్రం రాజయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు.