ఢిల్లీలో కోటిన్నర దారి దోపిడీ... హత్య...

 

అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు ఉండే ఢిల్లీలో ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించి వుండరు. దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎంలలో డబ్బు పెట్టే మనీ క్యారీయింగ్‌ వ్యాన్‌ మీద దాడి చేసిన దోపిడీ దొంగలు ఒక సెక్యూరిటీ గార్డును చంపి, వా్యనులోని కోటిన్నర రూపాయలను దోచుకుని దర్జాగా వెళ్ళిపోయారు. ఢిల్లీలో బాగా రద్దీగా వుండే కమలానగర్‌ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. ఈ క్యాష్ క్యారీయింగ్ వ్యాన్ ఒక ప్రైవేటు బ్యాంకుకు చెందినదిగా తెలుస్తోంది. పట్టపగలు నడిరోడ్డు మీద దోపిడీ జరగడంతోపాటు ఒక సెక్యూరిటీ గార్డు కూడా హత్యకు గురి కావడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది.