కేసీఆర్ పై వర్మ కామెంట్లు... కేసీఆర్ అందం చూసి ఇవాంక షాక్..!

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ ఈనెల 28న హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే కదా. ఇంకేముంది ఆమె వస్తున్నందుకుగాను... హైదరాబాద్ రూపు రేఖలే మార్చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడిక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టి... బెగ్గర్స్ ఫ్రీ చేసి.. భద్రతను కట్టుదిట్టం చేసి.. అబ్బో హైదరాబాద్ ను అత్యంత సుందరంగా అలకరిస్తున్నారు. మరి ఇంత హంగామా చూస్తుంటే కామెంట్లు పడకుండా ఉంటాయా..? పడుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ చూసిన తరువాత రామ్ గోపాల్ వర్మ సైలెంట్ గా ఉంటాడా...? ఈ హడావుడిపై స్పందించనే స్పందించాడు.ఇవాంకా అందాన్ని బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ అందంతో పోల్చుతూ గతంలో వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఇందులోకి లాగారు. ''ఇవాంకాకు తాను అందంగా ఉంటానన్న అహంకారం ఎక్కువ. అయితే, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఆమె షాక్‌ అవ్వడం ఖాయం. కేసీఆర్, ఇవాంక పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని బెట్ కాస్తాను..'' అంటూ వర్మ వ్యాఖ్మానించారు.

 

అంతేకాదు, ''ఇవాంకాకు అంతర్జాతీయ అందగత్తెగా, మొత్తం కుటుంబం చూడతగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా.. మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు కూడా ఇవ్వాలి..'' అంటూ తన పోస్ట్ లో ఆయన వ్యాఖ్యానించారు. మరి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ స్పందిస్తుందా...?లేక వర్మకు ఇవన్నీ అలవాటేలే అని సైలెంట్ గా ఉంటుందా చూద్దాం...