రాహుల్ కి షాక్ ఇచ్చిన అస్సాం మహిళలు..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం అస్సాం పర్యటన చేసిన సంగతి తెలిసిందే.ఈసందర్భంగా రాహుల్ గాంధీకి ఊహించని పరిణామం చోటుచేసుకుంది.అస్సాం పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా  బార్ పేటలోని ఓ ఆలయంలోకి ప్రవేశించాలనుకున్నారంట.కానీ అక్కడ ఉన్న కొందరు మహిళలు మాత్రం రాహుల్ ని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారంట.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.ఆరెస్సెస్, బీజేపీ నేతల చర్యలు ప్రధాని నరేంద్ర మోడీ మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని ఆయన ఆరోపించారు.