లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుజిత్?

 

సుజిత్ అంటే ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా... అదేనండీ.. మొన్నీమధ్య విడుదలై మంచి విక్టరీ సొంతం చేసుకున్న ‘రన్ రాజా రన్’ సినిమా దర్శకుడు. గుర్తొచ్చాడు కదూ... ఇప్పుడు సుజీత్ మనకి ఇంకా గుర్తుండిపోయే సినిమా చేయబోతున్నట్టు ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. అదేంటంటే, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇంట్రస్ట్ చూపించాడట. ‘‘నీ దర్శకత్వంలో నటిస్తా’’ అని సుజీత్‌కి ప్రామిస్ కూడా చేసేశాడట. ప్రస్తుతం సుజీత్ ఈ ఆనందంలో వున్నాడు. మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుజీత్ చెప్పిన కథ విని ప్రభాస్ ఫ్లాట్ అయిపోయాడని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ గత రెండు మూడేళ్ళుగా ‘బాహుబలి’ సినిమాలో ఇరుక్కుపోయి వున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో వుంది. ‘బాహుబలి’ సినిమా పూర్తికాగానే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. మొత్తమ్మీద లక్కు అంటే సుజీత్‌దే... లో బడ్జెట్‌తో ఒక మంచి హిట్ కొట్టాడు.. ప్రభాస్‌‌ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు.. కంగ్రాట్సోయ్!